ఫెసిలిటేటర్ల నియామకానికి ఇంటర్వ్యూలు | interviews of facilitators recruitment | Sakshi
Sakshi News home page

ఫెసిలిటేటర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

Published Wed, Jul 19 2017 10:33 PM | Last Updated on Thu, Jul 11 2019 8:52 PM

ఎస్సీ కార్పోరేషన్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫెసిలిటేటర్ల నియామకం కోసం బుధవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఎస్సీ కార్పోరేషన్‌ పరిధిలోని వివిధ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఫెసిలిటేటర్ల నియామకం కోసం బుధవారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. స్థానిక పెన్నార్‌ భవన్‌లోని ఎస్సీ కార్పోరేషన్‌ కార్యాలయంలో మొదటిరోజు అనంతపురం, ధర్మవరం రెవిన్యూ డివిజన్ల పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్య్వూలను నిర్వహించారు. ఎస్సీ కార్పోరేషన్‌ ఈడీ రామూనాయక్‌ పర్యవేక్షణలో ఎస్కేయూకు చెందిన ప్రోఫెసర్లు ఆనందరాయుడు, శ్రీధర్, సుధాకర్‌లు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. రెండు డివిజన్లకు చెందిన 72 మంది అభ్యర్థులు ఈ ఎంపికకు హాజరయ్యారు. గురువారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం రెవిన్యూ డివిజన్లకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఈడీ రామూనాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement