sakshi special interview
-
చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్‌తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్‌ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం. -
ప్రాంతీయ శక్తులే..ప్రజాస్వామ్య పరిరక్షకులు
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) ‘లోక్‌సభ ఎన్నికల పోరు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నడుమ కాకుండా ప్రాంతీయ శక్తులతోనే జరుగుతోంది. ప్రాంతీయ శక్తులే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా అడ్డుకొనే శక్తి జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీకి అడ్డుకట్ట వేసేది ప్రాంతీయ శక్తులే’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు. దేశంలో పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే తప్ప 28 రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకున్న జాతీయ పార్టీలే లేవన్నారు. బీఆర్ఎస్, టీఎంసీ, ఆప్, వైఎస్సార్సీపీ, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేకుండా పోయిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పాలించిన కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ కుట్రలను ఆ పార్టీ అడ్డుకోలేక పోయిందని విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర ‘హైదరాబాద్‌పై పట్టు చేజిక్కించుకోవడంతోపాటు బీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్‌సభలో మూడింట రెండొంతుల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తోంది. వీటిని అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ వంటి సమాఖ్య స్ఫూర్తిగల ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. బీఆర్ఎస్కు ఎక్కువ సీట్లు వస్తేనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. కేసీఆర్, వైఎస్ జగన్, స్టాలిన్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ శక్తులు గట్టిగా గొంతు విప్పితే కేంద్రాన్ని శాసించడంతోపాటు దక్షిణాదిని రక్షించుకోవచ్చు. రూ. వేల కోట్ల స్కాంలు చేసినా బీజేపీలో చేరగానే క్లీన్చిట్ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ‘ఉంటే జేబులో ఉండు.. లేదంటే జైల్లో ఉండు’అనేలా వ్యవహరిస్తున్నాయి. జగన్‌పై కేసులు, జైల్లో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరారు. ప్రజల్లో బలంగా ఉండే నాయకుడిని ముట్టుకొనేందుకు ఏ ఏజెన్సీ అయినా భయపడాల్సిందే.వివిధ అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది నేతలు బీజేపీలో చేరగానే క్లీన్చిట్ వచ్చింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, అజిత్ పవార్ రూ. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినా మోదీతో చేతులు కలిపిన వెంటనే వారికి క్లీన్చిట్ లభించింది.3 వేల మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ బీజేపీ సహకారం లేకుండా దేశం దాటాడా? రూ. 100 కోట్ల కుంభకోణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను జైల్లో పెట్టారు. ఇదే ఆరోపణలపై అరెస్టు అయిన మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. బీజేపీలో చేరితే కడిగిన ముత్యాలు అవుతారా? ఈ అరాచకాలను ప్రజాశక్తితోనే ఎదుర్కొంటాం. షర్మిలను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే మోదీ 2014లో, రేవంత్‌రెడ్డి 2023లో ప్రజలకు రంగుల కల చూపి అధికారంలోకి వచ్చారు. ప్రజలను ఊహల పల్లకిలో కూర్చోబెట్టడంతోపాటు కేసీఆర్‌ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు అనేక శక్తులను వాడారు. వై.ఎస్. షర్మిలను తెలంగాణలో ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణలో కేసీఆర్‌ను బదనాం చేయడం, వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులను బీఆర్ఎస్కు దూరం చేసేందుకు షర్మిలను ఉపయోగించుకున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి తిట్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ పని కాగానే షర్మిలను ఆంధ్రాలో ప్రయోగిస్తున్నారు. షర్మిలతో అక్కడా అదే ప్రయోగం చేయడం కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగం. కాంగ్రెస్ నేతలే కూల్చుతారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అసవరం లేదు. రేవంత్ చుట్టూ కాంగ్రెస్‌కు చెందిన ఖమ్మం, నల్లగొండ బాంబులు ఉన్నాయి. ప్రజలు 10–12 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, భద్రాచలంలో ఉప ఎన్నిక ఖాయం. కాంగ్రెస్ ప్రతిష్ట క్షేత్రస్థాయిలో దిగజా రుతోంది. ‘ఆర్ ట్యాక్స్ కడితేనే భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ఢిల్లీకి డబ్బు సంచులు పంపేందుకు బిల్డర్లు, రైస్‌మిల్లర్లను బెదిరిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. సోషల్ మీడియాలో వికృత ధోరణి రేవంత్‌రెడ్డి సీఎం పదవికి తగని చిల్లరగాడు. ఆయనవి చిల్లర మాటలు, ఉద్దెర పనులు. రేవంత్ ప్రసంగాలను కుటుంబంతో కూర్చుని చూడలేని పరిస్థితి. ప్రజలను చిరకాలం ప్రజలను భ్రమల్లో పెట్టవచ్చని అనుకుంటున్నాడు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన మూడు పిల్లర్లను ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయట్లేదు. కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసేందుకే పంటల ను ఎండబెట్టారు. డిసెంబర్ 3న కేసీఆర్ తిరిగి సీఎం అయ్యుంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసి పంటలను కాపాడేవారు.కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసిందిఇతర పార్టీల నుంచి చేరిన కొందరిని పూర్తిగా చదవకుండానే పదవులు ఇచ్చాం. కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసింది. పార్టీని వీడిన కడియం, రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్ వంటి వారిపై బీఆర్ఎస్ కేడర్ కసితో ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ద్రోహులను దగ్గరకు తీయకుండా గుణపాఠం నేర్పుతాం. లోక్‌సభ ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటించి రిజర్వుడ్ స్థానాల్లోనూ ఉద్దండులను బరిలోకి దించాం. కనీసం 10–12 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఉంది.రెఫరెండం ప్రకటనకు కట్టుబడి ఉండాలి మాట ఇచ్చి తప్పడం రేవంత్‌కు అలవాటు. కొడంగల్‌లో రాజకీయ సన్యాసమని మల్కాజిగిరిలో పోటీ చేశాడు. లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం అంటున్న రేవంత్ కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు రాకుంటే పదవి నుంచి తప్పుకుంటారా? జిల్లాల సంఖ్య తగ్గిస్తామని రేవంత్ అనడం తుగ్లక్ పని. 33 జిల్లాల్లో ఒక్కటి టచ్ చేసినా తెలంగాణ తిరగబడుతుంది.జగన్ మళ్లీ గెలుస్తారు గుంటూరులో ఇంటర్ చదివా. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న దానిని బట్టి ఏపీలో వై.ఎస్. జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. జగన్ మళ్లీ గెలిచి వస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బీఆర్ఎస్, వైసీపీ, జేడీఎస్ వంటి 13 పార్టీలు కూటముల రూపురేఖలను మార్చేస్తాయి. కాంగ్రెస్‌ను వెంటాడతాంకేసీఆర్ సీఎంగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను వెంటాడుతాం. ఏడు పదుల వయసులో మేజర్ సర్జరీ జరిగినా.. కర్ర సాయంతో నడుస్తూ, కూతురు జైల్లో ఉన్నా, ఎర్రటి ఎండలున్నా, నమ్ముకున్న నాయకులు పార్టీని వీడుతున్నా, రేవంత్ పరుషంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు సాంత్వన చేకూరేలా కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. -
భయపెడుతున్న ఎండలు: వడదెబ్బతో ఎంత ప్రమాదమో తెలుసా?
ప్రతీచోట 44 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్తే వడదెబ్బ తగలడం ఖాయం. జాగ్రత్తలు పాటించకుండా ఎండలో తిరిగితే శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పుతాయి. దానిని నియంత్రించే వ్యవస్థ బలహీనపడి వడదెబ్బకు గురవుతారు. ఈ నేపథ్యంలో ఎండలో వెళ్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎండదెబ్బ తగలకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్ పలు అంశాలు వెల్లడించారు. ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.సాక్షి: ఎండలో వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ విఫలమవుతుంది. ఎండకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వెళ్తే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. టోపీ, తలపాగానైనా తప్పకుండా ధరించాలి.సాక్షి: వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి. కొబ్బరినీరు, గ్లూకోజ్, సల్ల, ఓఆర్ఎస్ నీటిని తాగించాలి. ఫ్యాన్ గాలి బాగా తగిలేలా చూడాలి. దుస్తులను వదులుగా చేసి తడిగుడ్డతో ఒళ్లంతా తుడవాలి. మనిషికి తగినంత గాలి ఆడేలా చేయాలి. చుట్టూరా మంది గుమిగూడకూడదు. ఉప్పు కలిపిన ద్రవాలు, ఓఆర్ఎస్ ద్రావణం తాగించాలి. కీరదోస ముక్కలు ఎక్కువగా తినిపించాలి.సాక్షి: వడదెబ్బకు ఎలా గురవుతారు.. లక్షణాలేంటి..?డీఎంహెచ్‌వో: తీవ్రమైన వడగాలులు వీచినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. వడదెబ్బకు గురైన వ్యక్తి నాడి వేగంగా కొట్టుకోవడం, నాలుక ఎండిపోవడం, శరీరంలో నీటిని కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పితో అపస్మారక స్థితిలోకి చేరుకుంటారు.సాక్షి: వడదెబ్బకు గురైన వ్యక్తిలో కలిగే మార్పులేంటి.. ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: వేడికి శరీరం ఎక్కువసేపు గురికావడం వల్ల సోడియంక్లోరైడ్, నీటి నిష్పత్తి తగ్గిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రదేశాల్లో పనిచేసినప్పుడు ప్రతి గంటకు 3 నుంచి 4 లీటర్ల నీటిని చెమట రూపంలో కోల్పోతుంటారు. ఇలాంటి సమయంలో నీరు బాగా తీసుకోవాలి.సాక్షి: వడదెబ్బ ప్రమాదకరమేనా? అత్యవసర సమయంలో వెళ్లాల్సి వస్తే ఎలా?డీఎంహెచ్‌వో: వడదెబ్బ చాలా ప్రమాదకరం. మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం హైపోతలామస్ దెబ్బతిని వడదెబ్బకు గురవుతారు. దీనినే సన్‌స్ట్రోక్, హీట్‌స్ట్రోక్ అంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఎండ పడకుండా చూసుకోవాలి. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదు.సాక్షి: ప్రథమ చికిత్స ఏంటి? ఎలా ఇవ్వాలి?డీఎంహెచ్‌వో: వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తాగించడంతో పాటు చల్లని ప్రాంతంలో పడుకోబెట్టాలి. ముఖ్యంగా 65ఏళ్లు పైబడిన వారు బయటకు వెళ్లరాదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు, ఏదైనా అనారోగ్య సమస్యలున్నవారు, ముఖ్యంగా గుండెజబ్బులు, బీపీ ఉన్న వారు వెళ్లవద్దు.సాక్షి: వైద్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?డీఎంహెచ్‌వో: ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కువ సమయం చల్లని ప్రదేశాల్లో ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఆరోగ్య కేంద్రంలో వడదెబ్బకు సంబంధించిన ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఆస్పత్రికి వెళ్తే చికిత్స అందిస్తారు. తీవ్రత ఎక్కువగా ఉంటే పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలి.సాక్షి: ఎండలో వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?డీఎంహెచ్‌వో: ముఖ్యంగా ఎండకాలంలో వేడి కలిగించే పదార్థాలు తినకూడదు. కూల్‌డ్రింక్స్ అసలే తాగొద్దు. కూల్‌డ్రింక్స్ ప్రమాదకరం. మజ్జిగ, కొబ్బరినీరు మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిగా చేసి అరస్పూన్ పొడిని గ్లాస్ నిమ్మరసంలో కలిపి ఉప్పు, చక్కెర వేసుకుని తాగితే ఎనర్జీగా ఉంటుంది.- పుప్పాల శ్రీధర్, జిల్లా వైద్యాధికారిఇవి చదవండి: Dovely Bike Taxi మహిళల కోసం మహిళలే... హైదరాబాదీ అక్కాచెల్లెళ్లు -
ఫరియా కామెడీ టైమింగ్ చూసి షాక్ అయ్యా.. మ్యారేజీ వల్ల ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అంటే.. ఫరియా రాప్ సాంగ్‌కి ఫిదా అయిన అల్లరి నరేష్
-
Busireddy Shankar Reddy: మాది సమష్టి సేవ
ప్రభుత్వం అన్నీ చేస్తుంది... కానీ! చేయాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి. సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెడుతుంది ప్రభుత్వం. చెప్పుల్లేకపోతే వచ్చే వ్యాధులను అరికట్టేదెవరు? స్కూలు భవనం కడుతుంది ప్రభుత్వం. ప్రహరీలు... టాయిలెట్లను మరచిపోతుంటుంది. హాస్పిటళ్లను కట్టిస్తుంది ప్రభుత్వం. వైద్యపరికరాల్లో వెనుకబడుతుంటుంది. ‘ప్రభుత్వం చేయలేని పనులు చేయడమే మా సేవ’ అంటున్నారు రోటరీ క్లబ్ గవర్నర్ డా.శంకర్‌రెడ్డి. ‘మనది పేద ప్రజలున్న దేశం. ప్రభుత్వాలు ఎంత చేసినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. ఆ ఖాళీలను భర్తీ చేయడానికి ముందుకు వచ్చే వాళ్లందరం సంఘటితమై చేస్తున్న సేవలే మా రోటరీ క్లబ్ సేవలు’ అన్నారు బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. ఒక రైతు తన పొలానికి నీటిని పెట్టుకున్న తర్వాత కాలువను పక్కపొలానికి మళ్లిస్తాడు. అంతే తప్ప నీటిని వృథాగా పోనివ్వడు. అలాగే జీవితంలో స్థిరపడిన తర్వాత సమాజానికి తిరిగి ఇవ్వాలి. అప్పుడే జీవితానికి సార్థకత అన్నారు. సమాజానికి తమ సంస్థ అందిస్తున్న సేవల గురించి సాక్షితో పంచుకున్నారాయన. ‘కష్టపడడమే విజయానికి దారి’... ఇందులో సందేహం లేదు. కష్టపడి పైకి వచ్చిన వారిలో సేవాగుణం కూడా ఉంటుంది. నేను 1994లో మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి మా సీనియర్ల సర్వీస్‌ను చూస్తూ మేము ఇంకా వినూత్నంగా ఏమి చేయవచ్చనే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సర్వీస్‌లో ఉండే సంతోషాన్ని ఆస్వాదిస్తున్నాను. చదువుకునే పిల్లవాడికి పెన్ను ఇవ్వడం కూడా చాలా సంతృప్తినిస్తుంది. ఆ పెన్ను అందుకునేటప్పుడు పిల్లల కళ్లలో చిన్న మెరుపు, ముఖంలో సంతోషం... ఇవి చాలు ఈ జీవితానికి అనిపిస్తుంది. నేను స్కూళ్ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కారణం కూడా అదే. మంచినీటి సౌకర్యం లేని స్కూళ్లలో ఆర్వో ప్లాంట్, కొన్ని స్కూళ్లకు టాయిలెట్లు, హ్యాండ్ వాష్ స్టేషన్లు, తరగతి గదుల నిర్మాణం, క్లాస్‌రూమ్‌లో బెంచీలతో మొదలైన మా సర్వీస్‌లో ఇప్పుడు పిల్లల ఆరోగ్యం ప్రధానంగా మారింది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు ప్రభుత్వం కొంతవరకు సౌకర్యాలు కల్పిస్తుంది. కానీ అప్పటికప్పుడు తీర్చాల్సిన అవసరాలకు నిధులుండవు. వాటిల్లో ప్రధానమైనది ఆరోగ్యం. వాతావరణం మారిన ప్రతిసారీ పిల్లల మీద దాడి చేయడానికి సీజనల్ అనారోగ్యాలు పొంచి ఉంటాయి. మీరు ఊహించగలరా పాదాలకు సరైన పాదరక్షలు లేకపోవడం వల్ల చలికాలంలో పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. నులిపురుగుల కారణంగా అనారోగ్యాల పాలవుతారు. హాస్టల్ ఆవరణలో కూడా చెప్పులతో తిరగాలని చెప్పడంతోపాటు మంచి బూట్లు ఇవ్వడం వరకు రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నాం. బూట్లు కూడా మంచి బ్రాండ్‌వే. లోటో కంపెనీ షూస్ మార్కెట్లో కొనాలంటే రెండు వేలవుతాయి. ఆ కంపెనీతో మాట్లాడి వారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) ప్రోగ్రామ్ కింద మూడు వందల లోపు ధరకే తీసుకున్నాం. మేము సర్వీస్ కోసం చేసే ప్రతి రూపాయి కూడా నేరుగా ఆపన్నులకే అందాలి. కమర్షియల్‌గా వ్యాపారాన్ని పెంపొందించే విధంగా ఉండదు. పిల్లలకు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించడం వల్ల చాలామంది పిల్లల్లో కంటిచూపు సమస్యలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కంటి సమస్యల కోసం పెద్ద ఎత్తున వైద్యశిబిరాలు నిర్వహించినప్పటికీ పిల్లల మీద దృష్టి పెట్టలేదు. రవి గాంచని చోటును కవి గాంచును అన్నట్లు... ప్రభుత్వం చూపు పడని సమస్యల మీద మేము దృష్టి పెడుతున్నాం. శంకర్ నేత్రాలయ, మ్యాక్సివిజన్, ఆస్టర్ గ్రూప్ వైద్యసంస్థలతో కలిసి పని చేస్తున్నాం. తక్షణ సాయం! ఆరోగ్యం, చదువుతోపాటు ప్రకృతి విలయాలు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయం కోసం స్థానిక కలెక్టర్ల నుంచి పిలుపు వస్తుంది. అలా ఇల్లు కాలిపోయిన వాళ్లకు పాత్రలు, నిత్యావసర దినుసులు, దుస్తులు, దుప్పట్లు... వంటివి ఇస్తుంటాం. మా సేవలకు స్థిరమైన నిధి అంటూ ఏదీ ఉండదు. సాధారణంగా ఇందులో సభ్యులుగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి సమాజానికి తమ వంతుగా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చే వాళ్లే ఉంటారు. తక్షణ సాయానికి ఆ స్థానిక క్లబ్ సభ్యులు సొంత డబ్బునే ఖర్చుచేస్తారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టే కార్యక్రమాలకు మాత్రం కచ్చితంగా ప్రాజెక్టు రిపోర్ట్, కొటేసన్ సిద్ధం చేసుకుని నిధుల సమీకరణ మొదలు పెడతాం. ఇందులో మూడింట ఒక వంతు క్లబ్, ఒక వంతు దాత, ఒక వంతు ఇంటర్నేషనల్ రోటరీ ఫౌండేషన్ సహకరిస్తుంది. ఇది సమష్టి సేవ! రోటరీ క్లబ్ ద్వారా అందించే సేవలన్నీ సమష్ఠి సేవలే. ఏ ఒక్కరమూ తమ వ్యక్తిగత ఖాతాలో వేసుకోకూడదు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కలిపి మా పరిధిలో 113 క్లబ్లున్నాయి. ఎక్కడి అవసరాన్ని బట్టి అక్కడి సభ్యులు స్పందిస్తారు. సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. ఇక నా వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే... మాది భద్రాచలం దగ్గర రెడ్డిపాలెం. పూర్వికులు ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావు పేట నుంచి భద్రాచలానికి వచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా ఐటీసీ భద్రాచలం పేపర్ బోర్డ్‌కు çసర్వీస్ ఇస్తున్నాను. మా ఊరికి నేను తిరిగి ఇస్తున్నది నీటి వసతి. పేపర్ మిల్లు నుంచి వెలువడే వాడిన నీటిని మా ఊరి పంట పొలాలకు అందించే ఏర్పాటు కొంత వరకు పూర్తయింది. పైప్‌లైన్ పని ఇంకా ఉంది. మేము గోదావరి తీరాన ఉన్నప్పటికీ నది నుంచి మాకు నీళ్లు రావు. గ్రామాల్లో విస్తృతంగా బోర్‌వెల్స్ వేయించాం. బూర్గుంపాడులో నేను చదువుకున్న స్కూల్‌కి ఆర్వో ప్లాంట్ నా డబ్బుతో పెట్టించాను. ‘ఇవ్వడం’లో ఉండే సంతృప్తి మాత్రమే మా చేత ఇన్ని పనులు చేయిస్తోంది. నాకు అరవైదాటాయి. కుటుంబ బాధ్యతలు పూర్తయ్యాయి. మా అమ్మాయి యూఎస్‌లో ఉంది, అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక నేను సర్వీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి నా భార్య అన్నపూర్ణ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కొన్ని కార్యక్రమాలకు నాతోపాటు తను కూడా వస్తుంది. కాబట్టి సమాజంలో ఉన్న అవసరతను అర్థం చేసుకుంది, నన్ను కూడా అర్థం చేసుకుంది. కాబట్టే చేయగలుగుతున్నాను’’ అని వివరించారు రొటేరియన్ డాక్టర్ బుసిరెడ్డి శంకర్‌రెడ్డి. శ్రీమంతులకు స్వాగతం! జీవితంలో సుసంపన్నత సాధించిన వారిలో చాలా మందికి సొంత ఊరికి ఏదైనా చేయాలని ఉంటుంది. తాము చదువుకున్న స్కూల్‌ను అభివృద్ధి చేయాలని ఉంటుంది. అలాంటి శ్రీమంతులకు నేనిచ్చే సలహా ఒక్కటే. మా సర్వీస్ విధానంలో ‘హ్యాపీ స్కూల్’ కాన్సెప్ట్ ఉంది. ఒక పాఠశాలను హ్యాపీ స్కూల్‌గా గుర్తించాలంటే... కాంపౌండ్ వాల్, పాఠశాల భవనం, డిజిటల్ క్లాస్ రూములు, నీటి వసతి, టాయిలెట్లు ఉండాలి. అలా తీర్చిదిద్దడానికి 90 లక్షలు ఖర్చవుతుందనుకుంటే ముప్ఫై లక్షలతో ఒక దాత వస్తే, మా రోటరీ క్లట్, అంతర్జాతీయ రోటరీ ఫౌండేషన్ నిధులతో పూర్తి చేయవచ్చు. గతంలో ఏపీలో కూడా మేము చాలా పాఠశాలలను దత్తత తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తోంది. అక్కడ మా అవసరం లేదు, మాకు సర్వీస్ చేసే అవకాశమూ లేదు. తెలంగాణలో గడచిన ప్రభుత్వం పాఠశాలల మీద దృష్టి పెట్టకపోవడంతో మేము చేయగలిగినంత చేస్తూ వస్తున్నాం. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇటీవల హైదరాబాద్ నగరం, మెట్రో రైల్వే స్టేషన్లలో 65 వాటర్ కూలర్లనిచ్చాం. నీలోఫర్, ఎమ్ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్‌కి వైద్యపరికరాలు, స్పర్శ్ పేరుతో క్యాన్సర్ బాధితులకు పాలియేటివ్ కేర్, కొన్ని హాస్పిటళ్లకు అంబులెన్స్‌లు ఇచ్చింది రోటరీ క్లబ్. ఇక ఆలయాల్లో పూజలకు అన్ని ఏర్పాట్లూ ఉంటాయి, కానీ భక్తులకు సౌకర్యాలు పెద్దగా ఉండవు. మా భద్రాచలం, పర్ణశాలలో టాయిలెట్లు, భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గదుల నిర్మాణం... ఇలా మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాం. – వాకా మంజులా రెడ్డి ఫొటో: గడిగె బాలస్వామి -
చంద్రబాబు కోసం సొంత చెల్లిలా పని చేశా కానీ నన్ను దారుణంగా... YSR గారు నన్ను మెచుకున్నారు
-
తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం! మీకు తెలుసా! \
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. అక్టోబరు 14 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. టీటీడీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డికి స్వామివారి సేవచేసే భాగ్యం మరోసారి దక్కింది. గతంలో చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చైర్మన్‌గా మరోసారి అవకాశం వచ్చిన వెంటనే తిరిగి నూతన సంస్కరణలతో హిందూ ధర్మ ప్రచారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు భక్తి మార్గంలో నడిచేందుకు గోవింద కోటిని ప్రారంభించారు. గోవింద కోటి రాసిన ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం లభించేలా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు. సాక్షి: టీటీడీ చైర్మన్‌గా మీకు రెండోసారి శ్రీవారి సేవచేసే అవకాశం లభించింది. గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు ఏమనుకుంటున్నారు? చైర్మన్: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఊహించని విధంగా నాకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా పనిచేసే మహద్భాగ్యం దక్కింది. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. • 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఒకవైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలుచేశాం. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము. • ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా మా ధర్మకర్తల మండలి, అధికారుల సహకారంతో పనిచేస్తాను. ఈ సందర్భంగా గతంలో నా నేతృత్వంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను. దళిత గోవిందం! తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు, శ్రీవారి ఆలయ అర్చకులు అంతా దళిత వాడలకు వెళ్ళి కల్యాణం అనంతరం అక్కడే నిద్రించాం. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు స్వామివారినే దళితుల చెంతకు తీసుకుని వెళ్ళాం. దీనికి కొనసాగింపుగా గిరిజన గ్రామాల్లో గిరిజన గోవిందం, మత్స్యకార గ్రామాల్లో మత్స్య గోవిందం కార్యక్రమాలు కూడా నిర్వహించాం. శ్రీనివాస కల్యాణాలు భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించాం. కల్యాణమస్తు! పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్లి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశాం. అందరికీ అన్నప్రసాదం 2006కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానంలో భోజనం చేసే అవకాశం ఉండేది. మా హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తునికీ రెండు పూటలా కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించాం. నాలుగుమాడ వీథుల్లో పాదరక్షలు నిషేధం.. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి నాలుగుమాడ వీ«థుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించాం. చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్కనుంచి ఆలయ ప్రవేశం చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూల్లో చాలా ఇబ్బందిపడే వారు. దీన్ని గమనించి చంటిబిడ్డలతో పాటు తల్లులు మహాద్వారం కుడివైపు నుంచి ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నాం. పుష్కరిణి హారతి.. ఎంతో పవిత్రమైన స్వామివారి పుష్కరిణికి ప్రతిరోజూ హారతి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం. పౌర్ణమి గరుడ సేవ.. బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీథుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్జిత సేవలో పాల్గొనే వారు పంచె కట్టుకునే నిర్ణయం! స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని వచ్చేలా నిర్ణయం అమలు చేశాం. ఇప్పుడు సేవలతో పాటు బ్రేక్ దర్శనంలో కూడా ఈ విధానం అమలవుతోంది. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు తిరునామం ధరించి వెళ్లే ఏర్పాటు చేశాం. మహిళా క్షురకుల నియామకం: కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే మహిళలకు మహిళలే తలనీలాలు తీసేందుకు మహిళా క్షురకులను నియమించాం. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రోజూ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించాం. నడకమార్గంలో దశావతార విగ్రహాలు అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కల్పించడానికి దశావతార మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయించాం. హిందువులకే ఉద్యోగాలు! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణయం చేశాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేత చట్టం చేయించి అమలు చేశాం. ఎస్వీబీసీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ను ఏర్పాటు చేశాం. అలాగే ఎఫ్ఎం రేడియోను కూడా ప్రారంభించాం. వేద విశ్వవిద్యాలయం వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాను. అప్పటి గవర్నర్ శ్రీరామేశ్వర్ ఠాకూర్‌తో అనేకసార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచిత భోజనం టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతూ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో ఏర్పాటు చేయించాం. గోమహాసమ్మేళనం! సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారే గో సంరక్షణకు ముందుకు వచ్చారు. అలాంటి గోవిందుడి ఆశీస్సులతో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున గో మహాసమ్మేళనం నిర్వహించాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటుతూ గో సంరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం పండిత, పామరుల మన్ననలు పొందింది. ధార్మిక సదస్సు సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై అనేక సూచనలు చేయడంతోపాటు ధర్మకర్తల మండలి చేస్తున్న హిందూ ధర్మ ప్రచారం పై ప్రశంసలు కురిపించారు. అమృతోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున అమృతోత్సవాలు నిర్వహించాం. ద్వాదశి శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖంగా నిర్వహించే కైశిక ద్వాదశి ఉత్సవాన్ని ప్రారంభించాం. మాలదాసర్లకు ప్రోత్సాహకాలు గ్రామీణ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారకులుగా పనిచేస్తున్న మాలదాసర్లు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ, ఎస్టీలకు అర్చక శిక్షణ ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారికి అర్చక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్థానికాలయాల్లో దిట్టం పెంపు తిరుపతికి బయట ఉన్న టీటీడీ ఆలయాల్లో ప్రసాదాల దిట్టం, తీర్థం పెంచడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ మూలవర్లకు పట్టువస్త్రాలను అలంకరించేలా నిర్ణయం తీసుకున్నాం.. వకుళమాత ఆలయం తిరుపతికి సమీపంలోని పేరూరు బండ మీద శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గుర్తించి, అది వకుళమాత ఆలయంగా నిర్ధారించాం. అర్చకులకు జీతాలు పెంపు అర్చకులకు జీతాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాం. సాక్షి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. సాక్షి: బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? చైర్మన్: తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి: భక్తులు అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. సాక్షి: తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ, ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? చైర్మన్: అక్టోబర్ 19న గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గరుడ వాహనాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చైర్మన్: లక్షలాదిగా వచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సాక్షి: లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చైర్మన్: ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాం. - లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: 'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే? -
జీవితంలో అదొక్కటే పర్మినెంట్: రమ్యకృష్ణ
‘నిన్ను రోడ్డు మీద చూసినది..’ అంటూ కుర్రాళ్లు ఫ్లాట్ అయ్యేంత గ్లామర్...మితి మీరిన ఆత్మవిశ్వాసానికి.. అహంభావానికి చిరునామా... ఓ నీలాంబరి. భక్తులను రక్షించే తల్లి... ఓ అమ్మోరు. నా మాటే శాసనం.. ఓ శివగామి... ఇలా ఏ పాత్ర చేస్తే అందులో ఒదిగిపోయారు రమ్యకృష్ణ. గ్లామరస్ రోల్స్ చేస్తున్నప్పుడే ‘నరసింహ’లో నెగటివ్ షేడ్ ఉన్న నీలాంబరి, ‘అమ్మోరు’లో అమ్మవారిగా మెప్పించారామె. ఇక ‘బాహుబలి’లో శివగామిగా కనబర్చిన నటన అద్భుతం. ఇటీవల రిలీజైన ‘జైలర్’లో రజనీకాంత్ భార్యగా నటించారు. అలాగే భర్త కృష్ణవంశీ డైరెక్షన్లో ‘రంగ మార్తాండ’ చేశారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► ‘పడయప్ప’ (‘నరసింహ’)లో నీలాంబరిగా నరసింహ (రజనీకాంత్ పాత్ర)ని ఎదిరించారు. చాలా ఏళ్ల తర్వాత ‘జైలర్’లో రజనీ కాంబినేషన్లో సాఫ్ట్ క్యారెక్టర్ చేయడం గురించి.. ఇన్నేళ్ల తర్వాత రజనీగారి కాంబినేషన్లో ‘జైలర్’ చేయడం, అది సూపర్ హిట్ కావడం నా జీవితంలో మరచిపోలేను. ‘జైలర్’లో ఎందుకంత సున్నితమైన పాత్ర చేశారని అందరూ అనుకోవచ్చు. అయితే మళ్లీ రజనీగారితో నీలాంబరిలాంటి పాత్ర వస్తేనే చేయాలనుకుని ‘జైలర్’లో విజయలాంటి మంచి పాత్రని వదులుకోలేను కదా. ► ఈ 24 ఏళ్లలో రజనీగారు, మీరు ఆర్టిస్టులుగా ఎదిగారు.. వ్యక్తులుగా మారారు. ఆయనలో మీరు గమనించిన మార్పు? ‘జైలర్’ షూటింగ్ మొదటి రోజే ‘పడయప్ప’ చేసి అప్పుడే 24 ఏళ్లు అయిపోయిందా అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. అవునన్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో అదే ఉత్సాహం, అదే నిరాడంబరత, అంతే నిశ్శబ్దం. ► ‘జైలర్’ తెలుగు–తమిళంలో చాలా పెద్ద హిట్ అయింది. ఈ హిట్ మీ కెరీర్‌కి ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది? యాక్టర్స్ కెరీర్‌కి హిట్ అనేది వంద శాతం అవసరం, తప్పనిసరి. అయితే హిట్ మాత్రమే కెరీర్ కాదు. మంచి పాత్రలు కూడా కావాలి. కొన్నిసార్లు మంచి పాత్రలుంటాయి. అభినందనలు వస్తాయి కానీ వసూళ్లు ఉండవు. అలాగే ఓ కాంబినేషన్ మన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ముఖ్యం. వంద శాతం నా కెరీర్‌కి రజనీకాంత్‌గారి కాంబినేషన్, ‘జైలర్’ హిట్ ఉపయోగపడతాయి. ► ‘రంగ మార్తాండ’, ‘జైలర్’ సినిమాల్లో పాత్ర పరంగా మీకు సంతృప్తి ఇచ్చిన మూవీ ఏది? ‘రంగ మార్తాండ’ లాంటి నటనకు ఆస్కారం ఉన్న సినిమా హిట్ అయినా, అవకపోయినా మనసుకు సంతృప్తి ఉంటుంది. అయితే ‘జైలర్’లాంటి హిట్స్ వస్తే ‘రంగ మార్తాండ’ లాంటి సినిమాలు చేసే అవకాశాలు మరిన్ని వస్తాయి.. నా కెరీర్ కూడా మరింత విస్తరిస్తుంది. అయితే ‘రంగమార్తాండ’ లాంటి సినిమాలు కూడా హిట్ కావాలి. కొన్నిసార్లు అలాంటి సినిమాలకు ఎక్కువ అభినందనలు వస్తాయి.. వసూళ్లు రాకపోవచ్చు. ఆర్టిస్ట్‌లకు అభినందనలూ కావాలి.. కలెక్షన్స్ కూడా కావాలి (నవ్వుతూ). ► ఓటీటీ ΄్లాట్‌ఫామ్‌లో ‘క్వీన్’ వెబ్ సిరీస్ తర్వాత కొత్త సిరీస్‌లు చేయడం లేదు. ఎందుకు? ‘క్వీన్’ తర్వాత ‘క్వీన్ 2’ షూటింగ్ 70 శాతం పూర్తి చేశాం. మిగిలిన 30 శాతం షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతోంది. ‘క్వీన్’ కంటే ‘క్వీన్ 2’ అద్భుతంగా వచ్చింది. ఇక సినిమాలతో బిజీగా ఉండటంవల్ల వేరేవి ఒప్పుకోలేకపోతున్నాను. ► అప్పట్లో మీ తరం వాళ్లకి సినిమాలు తప్ప వేరే ఏమీ లేవు. కానీ, ఈ తరం వాళ్లకి సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, టీవీ షోలు.. ఇలా చాలా ఉన్నాయి. ఈ మార్పు మీకు ఎలా అనిపిస్తోంది? సోషల్ మీడియాలోని చాలామంది ఇన్ఫ్లుయర్స్లో నటీనటులకంటే ఎక్కువ పాపులర్ అవుతున్నవాళ్లు ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచం ఎంతలా మారింది? అనిపిస్తోంది. మనం కూడా మారుతున్న ప్రపంచంతో ΄ోటీ పడుతూ ముందుకు సాగాలి. ► అయితే ఇప్పుడొస్తున్న కథానాయికలకు మీలా 20, 25 ఏళ్లు లాంగ్విటీ ఉండటంలేదు కూడా... మాకు తప్పులు చేయడానికి, దిద్దుకోవడానికి టైమ్ ఉండేది. ఇప్పుడు ఆ టైమ్ లేదు. వస్తున్నారు.. వెళుతున్నారు.. కానీ మేం అన్ని సంవత్సరాలకు సంపాదించుకున్నది ఇప్పుడు సక్సెస్ అయితే తక్కువ టైమ్‌కే సంపాదించుకుని వెళ్లిపోతున్నారు. టైమ్ ఎలా మారుతుందో దాన్నిబట్టి అన్నీ మారుతున్నాయి. దాంతో పాటు మనం మారాలి. జీవితంలో స్థిరమైనది ఏది అంటే.. అది మార్పు మాత్రమే. ఆ మార్పుకి మనం అడ్జస్ట్ అవ్వాలి. దాంతో పాటు కొనసాగాలి. మనం హ్యాపీగా ఉన్నామనుకోండి అది మారుతుంది. ఒకవేళ దుఃఖంలో ఉన్నాం అనుకోండి అది కూడా మారుతుంది. సో.. ఏదీ నిరంతరంగా ఉండదు.. మార్పు సహజం. ► మీ అబ్బాయి రుత్విక్ ఏం చేస్తున్నాడు... హీరో అవుతాడా? తన నాన్న (కృష్ణవంశీ)లా డైరెక్టర్ అవుతాడా? రుత్విక్‌కి ఇప్పుడు 18 ఏళ్లు. ప్రస్తుతానికి ఫోకస్ అంతా చదువు మీదే. వాడికేం అవ్వాలో వాడికే తెలియదు.. నాకేం తెలుస్తుంది (నవ్వుతూ). తనేం కావాలో రుత్విక్ తెలుసుకుని, మాతో చెబితే మేం స΄ోర్ట్ చేస్తాం. ► ఈ మధ్య రోజాగారు, మీరు కలుసుకున్నారు.. మీ ఇద్దరి అనుబంధం గురించి? రోజా నాకు ఎప్పట్నుంచో తెలుసు. అప్పట్లో ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలానే ఉన్నాం. చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతి వెళ్లాను. తనే నాకు దర్శనం ఏర్పాటు చేసింది. అద్భుతమైన దర్శనం దక్కింది. సో.. తనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్లాను. ► ఇద్దరూ సినిమాలు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నారా? రెండింటి గురించి మాట్లాడుకోలేదు. లైఫ్ గురించి మాట్లాడుకున్నాం. నా అబ్బాయి ఏం చేస్తున్నాడు.. తన పిల్లలు ఏం చేస్తున్నారు? అనే విషయాలు మాట్లాడుకున్నాం. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి ఇంత బిజీగా ఎలా ఉండ గలుగుతున్నావ్ అని అడిగాను. ఇలాంటివే... ► రోజాగారితో మాట్లాడాక మీక్కూడా పాలిటిక్స్ పై ఏమైనా ఆసక్తి కలిగిందా? మీరూ పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉందా? పాలిటిక్స్ పై ఇంట్రస్ట్ అనేది ఒకర్ని చూసి వచ్చేది కాదు. ఎవరికి వాళ్లకి ఉండాలి. కొందరికి ఇంట్రస్ట్ ఉంటుంది.. కొందరికి ఉండదు. బట్.. రోజా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. నేను కళ్లారా చూశాను. ► భవిష్యత్తులో ఏదైనా పార్టీ నుంచి మీకు ఆఫర్ వస్తే పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతారా? ఏమో.. నాకు తెలియదు. వచ్చినప్పుడు చూద్దాం. -
హీరో హీరోయిన్ కి మాత్రమే గొడుగులు ఎందుకు పడతారంటే..
-
నా గురించి రానా ఎందుకు అలా చెప్పాడో ఫోన్ చేసి కనుక్కోవాలి
-
చై నా ఫేవరెట్... కృతి శెట్టికి చైతన్య అంటే ఎంత ఇష్టమో చూడండి
-
నాగ చైతన్య, కృతి శెట్టి ర్యాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూ
-
విరూపాక్ష సక్సెస్ పై నాగచైతన్య ఊహించని కామెంట్స్
-
అల్లరి నరేష్ 3 రోజుల్లో 400 సిగరెట్లు తాగి..
-
ఈ సినిమాలో అల్లరి నరేష్ తో చేయడానికి కారణం ఏంటంటే...
-
ఇండస్ట్రీలో ఉండాలా.. వద్దా.. అని తేల్చుకొని సినిమా చేశాను
-
నాగచైతన్య, కృతి శెట్టి ఇంటర్వ్యూ
-
నా భార్య నా బీభత్సాన్ని ఇంట్లో చాలా సార్లు చూసింది
-
ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్
-
గోపీచంద్ తో ఇప్పటివరకు ఎవరూ ఇలా మాట్లాడి ఉండరు..!!
-
రామబాణంతో ఇన్నాళ్లకు కుష్బూ స్పెషల్ ఇంటర్వ్యూ
-
ఒక ఎపిసోడేని మాత్రమే ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాం అంటే..
-
ఉగ్రం సినిమా చూసి నా కూతురు అన్న మాటకి...
-
ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్స్
-
హీరో గోపీచంద్ తో సాక్షి స్పెషల్ చిట్ చాట్