
వాలెంటైన్స్ డే సందర్బంగా ప్రేమికులతో చాలా సందడిగా ఉంటుంది. ఎక్కడ చూసినా అందంగా ముస్తాబై సీతాకోక చిలుకల్లా విహరిస్తుంటారు. పార్క్‌ల్లో, సినిమాహాళ్లలో లవ్‌బర్డ్స్ హల్‌హల్ ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ వాతావరణం చాలావరకు తగ్గిపోయినట్టే కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలతో యవతలో ప్రేమలు-పెళ్లిళ్లు అంటేనే భయం పెరుగుతోంది. కరియర్‌కే యువత ప్రాధాన్యతనిస్తోంది. దీనికితోడు సరియైన ఉద్యోగాలు కూడా లభించక పోవడంతో, ముందు బతుకు ఎలా ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది.
వాలెటైన్స్ డే సందర్భంగా సాక్షి.కామ్ పబ్లిక్‌టాక్ వింటే ఈ అభిప్రాయమే కలుగుతుంది ఎవరికైనా.. వాలెంటైన్స్ డే అంటే ఒకరోజు జరుపుకునేది కాదనీ, స్త్రీపురుఫుల మధ్య అయినా, మనుషుల మధ్య అయినా ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలంటోంది యువత. అమ్మాయిలు కరియర్ ముఖ్యం, ఆర్థికంగా స్థిరపడాలి అంటోంటే... అబ్బాయిలేమో మనకీ లవ్వులు, గివ్వులు వద్దు బ్రో..జర జాగ్రత్త భయ్యా.. అంటున్నారు.
ప్రధానంగా అమ్మాయిల్లో ప్రేమిస్తే ఏమవుతుందో అనే ఆందోళన ఎక్కువ కనిపిస్తోంది. అందుకే బాగా చదువుకుని, ఆర్థికంగా నిలదొక్కు కోవాలంటున్నారు. అదే ఆడపిల్లలకు ఆత్మస్థైరాన్ని ఇస్తుందని ఒక యువతి పేర్కొంది. ఎంతో కష్టపడి పెంచి పోషించిన తల్లి దండ్రులనుజాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది కెమెరా ముందుకు రావడం ఇష్టంలేని ఒక యువతి తన సొంత పిన్ని ఇంట్లో జరిగిన సంఘటన తమ కుటుంబంలో పెద్ద అలజడి రేపిందనీ, అందుకే తానీ నిర్ణయానికి వచ్చానని తెలిపింది.
బాధ్యత ముఖ్యం
ప్రేమ అంటే బాధ్యత ఉండాలి. స్త్రీపురుషుల మధ్య అయినా, ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా బాధ్యత అనేది పునాది. అదే ప్రేమ. ఆ బాధ్యతతో కూడిన ప్రేమే కుటుంబాల్ని నిలుపుతుంది అన్నారు ఒక కార్పొరేట్ ఉద్యోగి. పిల్లలు బాధ్యతగా ఉన్నపుడు ఏ తల్లిదండ్రులైనా పిల్లల్నిఅంగీకరిస్తారు. యోగ్యుడైన అల్లుడు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు అందుకే చిత్తశుధ్దిగా ఉండండి. తల్లితండ్రులను ఒప్పించుకోండి.. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అంటూ యువతరానికి ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ఓటీటీ బెస్ట్ యాక్టర్‌గా రాగ్‌మయూర్ నామినేట్ : రాగ్ ఫ్యావరెట్ హీరోయిన్ ఎవరంటే..!
ప్రేమా, గీమా ఇవ్వన్నీ వద్దు మనకి.. బాగా చదువుకోవాలి.. మంచి ఉద్యోగం కొట్టాలి, అమ్మానాన్నల్ని ఖుషీగా ఉంచాలి.. అంతే.. ఇంతకుమించి తనకే ప్రయార్టీస్ లేవని చెప్పాడు మరో యువకుడు. అలాగే ఒకవేళ ప్రేమిస్తే చిత్తశుద్ధిగా ఉండండి భయ్యా..కడదాకా నిలుపుకోండి అంటూ సలహా ఇస్తున్నాడు. కానీ జాగ్రత్త భయ్యా.. సింగిల్‌గా ఉంటేనే బెటర్ కదా భయ్యా అంటూ ఓ పెద్ద సందేశాన్నిచ్చేశాడు ఫన్నీగా.
లేడీస్ హాస్టలా? ఎవడ్రా ఆ కూత కూసింది!
ఎంత ధైర్యం చెప్పుకున్నా, ఆడపిల్లలు సాధికారతసాధిస్తున్నా..సమాజంలోజరుగుతున్న పరిణామాలు చాలా బాధిస్తున్నాయని ఒక తల్లి వాపోయింది. ప్రేమించిన పాపానికి కన్న తల్లిదండ్రులే ఆమె జీవితంలో నిప్పులు పోస్తున్నారు. మరొక చోట ప్రేమించకోతే, పెళ్లికి ఒప్పుకోకపోతే నరికి చంపుతున్నారు.. యాసిడ్లు పోస్తున్నారు కదా తల్లీ.. ఎలా అయితే ఎలా బతికేది ఆడపిల్లలు అంటూ భావోద్వేగానికి లోనైంది. అసలు వాలెండైన్స్‌డే మనది కాదు. ప్రేమ శాశ్వతం. శాశ్వతమైన ప్రేమే మనది. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలను జాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బలహీనమైన క్షణాల్లో వారికి అండగా ఉండాలి. అంతే తప్ప, నటుడు చిరంజీవి లేడీస్‌హాస్టల్ అనుకోవడం మూర్ఖత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారో తల్లి. అంతేకాదు తన తల్లి, చెల్లి, భార్య, కుమార్తెలు, కోడలు, ఆఖరికి మనవరాలిని కూడా ఘోరంగా అవమానించిన చిరంజివి మొత్తం స్త్రీ జాతికి క్షమాణ చెప్పాలని డిమాండ్ చేశారు. (ఈమె కూడా కెమెరా ముందుకు రావడానికి ఇష్టపడలేదు.)
Comments
Please login to add a commentAdd a comment