
రాగ్ మయూర్ ఇంటర్నేషనల్ ఐకానిక్ బెస్ట్ యాక్టర్ ఓటీటీ తెలుగు అవార్డ్‌కు నామినేట్
ఆల్ ది బెస్ట్ అంటున్న ఫ్యాన్స్
సివరపల్లి వెబ్ సిరీస్‌తో దూసుకుపోతున్న హీరో రాగ్ మయూర్ మరో ఘనతను సాధించారు. సెన్సేషనల్ హీరో అయిపోదామని కాకుండా... పాత్రల ఎంపికలో జాగ్రత్తపడుతూ, నటనలో రాటుదేలుతూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న రాగ్ తాజాగా మరో అడుగు ముందుకేసారు. సివరపల్లి సిరీస్‌లో నటనకు గాను ఇంటర్నేషనల్ ఐకానిక్ బెస్ట్ యాక్టర్ ఓటీటీ తెలుగు అవార్డ్ కోసం నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దీంతో ఆయనకు ఫ్యాన్స్ అభినందనలు తెలియజేశారు.
ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్‌తో వాలెంటైన్స్ డే స్పెషల్
నటనపై ఆసక్తితో ఉన్నత చదువును పక్కన బెట్టి మరీ హీరో రాణిస్తున్నారు. అద్భుతమైన నటనతో సినీ లవర్స్‌కు దగ్గరవుతున్నారు. సినిమానే తన ప్రాణం, ప్రేక్షకులే నా దేవుళ్లు.. ప్రేక్షకులు లిచ్చిన ప్రేమ, వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అంటున్న వాలెంటైన్స్ డే సందర్బంగా హీరో రాగ్‌మయూర్‌తో స్పెషల్ చిట్ చాట్ రెండో భాగం. (చివరిది) మీకోసం!