
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి2898 ఏడీ అంచనాలకు మించి ఆదరణను సంపాదించు కుంటోంది. నాగ్ కథను ఎంచుకున్న తీరు, స్క్రీన్ ప్లే, టెక్నికల్ విలువలు, విజువల్స్ అన్నీ అద్భుతంగా అమరి పోవడం ప్రేక్షకులు చాలా థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. అద్భుతమైన సినిమా అంటూ కితాబిస్తున్నారు. దీంతో వసూళ్లు , రికార్డులపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు సి. అశ్వినీదత్ కుమార్తె , నిర్మాత స్వప్నాదత్ చలసాని చేసిన ట్వీట్ ఇంట్రస్టింగ్‌గా మారింది.
#Kalki2898AD pic.twitter.com/85X4CYqNij
— Swapnadutt Chalasani (@SwapnaDuttCh) June 28, 2024
‘చాలామంది కాల్ చేసి మీరు రికార్డులను బ్రేక్ చేశారా అని అడగడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నవ్వొస్తోంది.. ఎందుకంటే ఆ రికార్డులను సాధించినవారు, లేదా రికార్డులు సృష్టించిన వారు .. రికార్డుల కోసం ఎపుడూ సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమాలు తీసారు. మేమూ అదే చేశాం’’ అంటూ ట్వీట్ చేశారు.
దీంతో చాలామంది నెటిజన్లు మంచిమాట అంటూ కమెంట్ చేశారు. ఎవరూ ఉచితంగా ఏమీ చేయరు అక్కా. మీరు నిజంగా సినిమాపై ఉన్న ప్రేమ కోసం దీన్ని రూపొందించినట్లయితే, తొలి వారంలోనే రెట్టింపు వసూళ్ల కోసంలా కాకుండా సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించండి. అందరూ చూడగలిగేలా సరసమైన ధరలో ఉండేలా చూడండి అని వ్యాఖ్యానించారు.