
ఆమె ఓ సాధారణ గృహిణి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరోవైపు తనకు ఇష్టమైన సబ్జెక్టులో ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే లక్ష్యాన్ని చేరుకోడానికి ఆమె రేయింబవళ్లు శ్రమించారు. అందుకు తగిన ఫలితాన్ని కూడా అందుకున్నారు. ఆమెనే జ్యోతి చాగంటి. మైసూర్‌లోని శ్రీగణపతి సచ్చిదానంద ఆధ్వర్యంలో అవధూత దత్తపీఠం ప్రతి యేటా నిర్వహించే భగవద్గీత పారాయణ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే జ్యోతి బంగారు పతకాన్ని సాధించారు.
భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 701 శ్లోకాలను నిర్విరామంగా పారాయణం చేశారు. రెండు రోజుల క్రితం దుండిగల్‌లోని దత్త ఆశ్రమంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామి నుంచి గోల్డ్‌మెడల్‌తో పాటు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆమె నిరూపించారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తనకు లభించిన గుర్తింపు గురించి మాట్లాడారు.
ఎనిమిది నెలలు శ్రమించా..
గత ఎనిమిది నెలలుగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో దీనిని అభ్యసించా. మొదటి ప్రయత్నంలోనే గీత పఠనంలో గోల్డ్ మెడల్ సాధించా. జ్యోతి గీత మకరందం గ్రూప్‌లో టి.నాగలక్ష్మి, ఇతరుల నేతృత్వంలో తాత్విక అంశాలను విస్తృతంగా అధ్యయనం చేశాం. ఈ గ్రూపులోని గురువులు విద్యార్థులకు సరైన ఉచ్ఛారణను నేరి్పంచారు. 8 నెలలుగా రోజుకు 7 గంటల పాటు సాధన చేశా. పరీక్షలో పాల్గొనడం అద్భుత అనుభవం. ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి తదుపరి విద్యార్థులకు గీతను బోధిస్తాను.
(చదవండి: మరణ భయాన్ని తొలగించే ధర్మరాజ దశమి!!)