Bhagavad Gita: గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు | Bhagavad Gita, Natyashastra get Unesco honour | Sakshi
Sakshi News home page

గర్వించ దగ్గ క్షణం.. భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

Published Fri, Apr 18 2025 11:55 AM | Last Updated on Fri, Apr 18 2025 2:45 PM

Bhagavad Gita, Natyashastra get Unesco honour

సాక్షి,న్యూఢిల్లీ: భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో భగవద్గీతకు చోటు దక్కింది. భగవద్గీత,భరతముని రాసిన నాట్య శాస్త్రానికి గుర్తింపు లభించింది.

ఈ ఘనతపై ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ‘భారత నాగరిక వారసత్వానికి ఒక చారిత్రాత్మక క్షణం ఇది. భగవద్గీత, భరతముని నాట్యశాస్త్రం ఇప్పుడు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో లిఖించబడ్డాయని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఎక్స్‌వేదికగా ట్వీట్‌ చేశారు.  ప్రధాని మోదీ స్పందిస్తూ రీట్వీట్ చేశారు.

‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం ఇది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గీత, నాట్యశాస్త్రం చేర్చబడటం మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్త గుర్తింపు. భగవత్ గీత,నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. అవి ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి’ అని మోదీ పేర్కొన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement