ఖర్గే ప్రసంగంపై అమిత్‌ షా సెటైర్లు | Distasteful And Disgraceful Kharge Speech Says Amit Shah | Sakshi
Sakshi News home page

మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగంపై అమిత్‌ షా సెటైర్లు

Published Mon, Sep 30 2024 1:48 PM | Last Updated on Mon, Sep 30 2024 2:48 PM

Distasteful And Disgraceful Kharge Speech Says Amit Shah

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తప్పించేంత వరకు తాను బతికే ఉంటానని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే చేసిన ప్రసంగంపై కేంద్ర హోమంత్రి అమిత్‌షా స్పందించారు. ఖర్గే ప్రసంగం అసహ్యకరమైన, అవమానకరమైనది’గా అభివర్ణించారు.

ఖర్గే ప్రసంగం ఆద్యంతం ప్రధాని మోదీ పట్ల కాంగ్రెస్‌కు ఉన్న ద్వేషం,భయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన తన ప్రసంగంతో కాంగ్రెస్‌, ఆ పార్టీ నేతలను మించిపోయారు’ అని అన్నారు. మోదీని అధికారం నుండి తొలగించిన తర్వాత మాత్రమే చనిపోతానని చెప్పి అనవసరంగా తన వ్యక్తిగత ఆరోగ్య విషయాలలోకి ప్రధాని మోదీని లాగారు’అని వ్యాఖ్యానించారు.

 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు ప్రధాని మోదీ పట్ల ఎంత ద్వేషం,భయం ఉందో చూడండి. అందుకే కాంగ్రెస్‌ నేతలు మోదీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఖర్గే జీ మీరు ఆరోగ్యంగా ఉండాలని.. ప్రధాని మోదీ, నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం. 2047 నాటికి విక్షిత్‌ భారత్‌ను రూపొందించే వరకు ఆయన జీవించాలని కోరుకుంటున్నా అని హోంమంత్రి అమిత్‌షా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.
 

మోదీ గురించి ఖర్గే ఏమన్నారంటే
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జమ్మూ సమీపంలోని జస్‌రోటీ గ్రామంలో నిర్వహించిన సభలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ప్రసంగం మధ్యలో కాస్త అస్వస్థతకు గురయ్యారు. తూలిపడబోతుండగా సీనియర్‌ నేగలు పట్టుకున్నారు. వారి సాయంతోనే ఖర్గే ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా దక్కేదాకా పోరాటం కొనసాగిస్తా. దీన్ని వదలను. నాకు 83 ఏళ్లు. నేను ఇంత తొందరగా చనిపోను. (ప్రధాని) మోదీని అధికారం నుండి తొలగించే వరకు నేను బతికే ఉంటాను. కశ్మీరీల బాధలు వింటా. వవారి సమస్యల పరిష్కారానికి పోరాడుతా. ఇంకా మాట్లాడాలనుంది.కానీ కళ్లు తిరగడంతో నేను మట్లాడలేకపోతున్నా.నన్ను క్షమించాలి ’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement