
ఢిల్లీ : బీఆర్‌ఎస్ దుష్టపాలన భయంకరమైన జ్ఞాపకాలు, ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిన ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.
ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. అనంతరం ఈ భేటీపై ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు.
‘‘తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతకు ముందు భేటీలో తెలంగాణ బీజేపీ నేతలకు మోదీ దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో విభేదాలు పక్కన పెట్టి, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నేతలకి ప్రధాని మోదీ హితవు పలికారు.
తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది.
రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్‌ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.… pic.twitter.com/hkutfaIeF8— Narendra Modi (@narendramodi) November 27, 2024
Comments
Please login to add a commentAdd a comment