parliament bhavan
-
తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారు : ప్రధాని మోదీ
ఢిల్లీ : బీఆర్ఎస్ దుష్టపాలన భయంకరమైన జ్ఞాపకాలు, ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిన ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు.ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోదీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు ఇతర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. అనంతరం ఈ భేటీపై ఎక్స్ వేదికగా మోదీ స్పందించారు. ‘‘తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది. రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా తన స్వరాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.అంతకు ముందు భేటీలో తెలంగాణ బీజేపీ నేతలకు మోదీ దిశానిర్ధేశం చేశారు. ఈ భేటీలో విభేదాలు పక్కన పెట్టి, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని నేతలకి ప్రధాని మోదీ హితవు పలికారు.తెలంగాణ బీజేపీ శాసనసభ్యులతో, ఎంపీలతో చాలా మంచి సమావేశం జరిగింది.రాష్ట్రంలో మా పార్టీ ఉనికి వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌తో విసిగిపోయారు అంతేకాక బీఆర్ఎస్ దుష్టపాలన వల్ల కలిగిన భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారు. ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు.… pic.twitter.com/hkutfaIeF8— Narendra Modi (@narendramodi) November 27, 2024 -
New Parliament Dress Code: పార్లమెంట్ ఉద్యోగులకు కొత్త యూనిఫామ్..
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సమయం సమీపిస్తోంది. ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదురోజులపాటు ఈ సమావేశాలు పార్లమెంట్లో నూతన భవనంలో జరుగుతాయి. మొదటి రోజు పాత భవనంలోనే సమావేశం నిర్వహించి, రెండో రోజు (ఈ నెల 19న) వినాయక చవితి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, కొత్త భవనంలోకి లాంఛనంగా అడుగుపెడతారు. కొత్త భవనానికి తరలివెళ్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఉద్యోగులు, సిబ్బంది ధరించే యూనిఫామ్‌ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలు సిసలైన భారతీయత ఉట్టిపడేలా ఈ దుస్తులు ఉంటాయని సమాచారం. నెహ్రూ జాకెట్లు, ఖాకీ రంగు ప్యాంట్లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) నిపుణులు ఈ యూనిఫామ్‌లను డిజైన్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ధరించే నెహ్రూ జాకెట్ ముదురు గులాబీ రంగులో కమలం పువ్వు డిజైన్‌తో ఉంటుందని సమాచారం. ఉభయ సభల మార్షల్స్ డ్రెస్‌ను కూ డా మారుస్తున్నారు. వారు మణిపురి తలపాగాలు ధరిస్తారు. సెక్యూరిటీ సిబ్బంది ధరించే సఫారీ సూట్లలోనూ మార్పులుంటాయి. సైని కులు ధరించే డ్రెస్ లాంటిది వారికి ఇవ్వబోతున్నారు. NIFT designed New dress code for Parliament staff includes 1. Modi Jacket 2. Cream shirt with Lotus emblem 3. Khaki trousers 😂😂 pic.twitter.com/RWlP93mNha — Mac (@pattaazhy) September 12, 2023 ఎన్నికల గుర్తు ముద్రించడం ఏమిటి?: కాంగ్రెస్ పార్లమెంట్ సిబ్బంది యూనిఫామ్‌పై ‘కమలం’ను ముద్రించబోతున్నారంటూ వచ్చిన వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి బొమ్మ కాకుండా కమలం గుర్తు ముద్రించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బీజేపీ ఎన్నికల గుర్తు కాబట్టే కమలాన్ని ముద్రిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ‘ట్విట్టర్’లో పోస్టు చేశారు. ఇది కూడా చదవండి: జీ20 నిర్వహణకు రూ.4,100 కోట్లా -
పార్లమెంటు ప్రాంగణంలో ధర్నాలు, దీక్షలు బంద్! విపక్షాలు ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో సభ్యులు నిషేధిత పదాలు వాడరాదంటూ గురువారం జారీ చేసిన సర్క్యులర్‌పై వివాదం సమసిపోక మునుపే..శుక్రవారం జారీ చేసిన మరో బులెటిన్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ‘పార్లమెంటు ప్రాంగణాన్ని సభ్యులు ‘ధర్నా, సమ్మె, నిరాహార దీక్ష, ప్రదర్శన, ఏదైనా మతపరమైన కార్యక్రమాల నిమిత్తం వినియోగించుకోరాదు’ అంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. సమావేశాలు సవ్యంగా సాగేందుకు సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పనికిమాలిన, పిరికిపంద ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని సీపీఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ‘విశ్వ గురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇక ధర్నాలపైనా నిషేధం’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ స్పందించారు. చదవండి: Presidential election 2022: ముర్ముకు 61% ఓట్లు -
న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ
-
నూతన పార్లమెంట్‌కు ప్రధాని మోదీ భూమి పూజ
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేశ్ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణసింగ్ తదితరులు హాజరయ్యారు. మొత్తం 200 మంది అతిథులు హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం తెలిపింది. చదవండి: నాలుగు అంతస్తుల్లో కొత్త పార్లమెంట్ శంకుస్థాపన చేసిన ఈ కొత్త భవనం నిర్మాణాన్ని 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగనున్న 2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నాలుగు అంతస్తుల కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.971 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. త్రిభుజకారంలో ఉండే ఈ భవనాన్ని పర్యావరణ హిత విధానాలను పెద్దపీట వేస్తూ, భూకంపాలను కూడా తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారు. ఈ భవనంలో 888 మంది లోక్‌సభ సభ్యులు, 384 మంది రాజ్యసభ సభ్యులకు చోటు ఉండేలా నిర్మాణం చేయనున్నారు. -
పార్లమెంటులో కీలక బాధ్యతలు స్వీకరించిన ఎంపీ బాలశౌరి
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంటు సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంటు లోని అనెక్సీ భవన్లో గురువారం ఎంపీ బాలశౌరి ఆధ్వర్యంలో అధికారులు ఆర్సీ తివారి, రంగారాజన్ భేటీ అయ్యారు. లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన బాలశౌరికి సాదర స్వాగతం పలికిన అధికారులు సమావేశ వివరాలను తెలిపారు. చదవండి: మరోసారి సత్తాచాటిన ఏపీ పోలీస్ శాఖ -
మోదీ భద్రత కోసం ప్రత్యేక సొరంగ మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంకు మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) యూనివర్శిటీలో సమావేశం జరిగింది. ప్రధాని నివాసం నుంచి ఆయన కార్యాలయానికి, పార్లమెంటు భవనంకు ప్రత్యేక రహదారిని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ ఒక ప్రత్యేక టన్నెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని పార్లమెంటు భవనంకు లేదా అతని కార్యాలయానికి వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పార్లమెంటు భవనంకు కొన్ని ప్రత్యేక రహదారులు నిర్మించాలని పటేల్ చెప్పారు. తద్వారా సాధారణ ట్రాఫిక్ నుంచి ప్రధాని వంటి వీవీఐపీలను వేరు చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రధాని వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు వెళ్లే సమయంలో సామాన్యులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం నిత్యం మనం చూస్తునే ఉన్నాం. సెంట్రల్ విస్టాలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక టన్నెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ తెలిపారు. పైగా వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా వీలవుతుందని వెల్లడించారు. -
పార్లమెంట్లో గళమెత్తిన రాష్ట్ర ఎంపీలు
సాక్షి, కడప కార్పొరేషన్: రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు చేపట్టాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఐదేళ్లుగా ఏపీలో పారిశ్రామికాభివృద్ధి లోపించి నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇదే పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, ట్యాక్స్ మినహాయింపులు, సబ్సిడీలు ఇవ్వడం ద్వారా తమ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి తమ రాష్ట్రం నుంచి 23 ప్రతిపాదనలు వచ్చాయని, ఎప్పటిలోగా వాటిని మంజూరు చేస్తారో చెప్పాలన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగ సమస్యను అరికట్టవచ్చన్నారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 2 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారని, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునే కంపెనీలకు కూడా ఈ స్కీంను వర్తింపజేస్తే అధిక ప్రయోజనం కలుగుతుందని, అనేకమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తద్వారా పారిశ్రామిక అభివృద్ది కూడా జరుగుతుందని వివరించారు. దీనిపై సంబంధిత మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే రాయితీలు, సబ్సిడీలు, ట్యాక్స్ మినహాయింపులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఏపి సర్కార్ ప్రతిపాదనలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఏపి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న కంపెనీలకు వడ్డీ రాయితీ ఇచ్చే అంశాన్ని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతులను ఆదుకోండి 2012–13 రబీ శనగపంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో ఆయన వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ డా. ఆశిష్ కుమార్ భుటానిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఏడేళ్లయినా ఇన్సూరెన్స్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాటాను ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని, వెంటనే ఇన్సూరెన్స్‌ను మంజూరు చేయాలని కోరారు. దీనిపై జాయింట్ సెక్రటరీ స్పందిస్తూ క్లెయిమ్స్‌లో కొన్ని మినహాయింపులు ఉన్నాయని, అవన్నీ పూర్తి చేసి మూడు రోజుల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఫైలు పంపిస్తానని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌లో జైలుశిక్ష అభ్యంతరకరం – ఎంపీ మిథున్‌రెడ్డి రాజంపేట: ట్రిపుల్ తలాక్ చట్టం అభ్యంతకరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. చట్టం అనేది అందరికి సమానంగా ఉండాలని చెప్పారు. వివాహమనేది సివిల్ కాంట్రాక్ట్ అయినప్పుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. విడాకులు ఇచ్చిన కారణంగా జైలుశిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతకరమని పేర్కొన్నారు. ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళాసాధికారతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఎంపీ మరోసారి స్పష్టంచేశారు. ముస్లీం మైనార్టీ మహిళల భద్రతకు వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని తెలిపారు. -
పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం
-
పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం
ఢిల్లీ: పార్లమెంట్ భవన్లో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి పార్లమెంట్ భవన్ రూమ్ నెంబర్ 50లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 12 ఫైరింజన్ల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై అధికారులను మీడియా సంప్రదించగా.. సాంకేతిక సమస్య కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు. అగ్ని మాపక సిబ్బంది త్వరగా రావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మరుసటిరోజు కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టునున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.