పార్లమెంట్ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి పార్లమెంట్ భవన్ రూమ్ నెంబర్ 50లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 12 ఫైరింజన్ల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై అధికారులను మీడియా సంప్రదించగా.. సాంకేతిక సమస్య కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చునని వారు అభిప్రాయపడుతున్నారు.