
సాక్షి, న్యూఢిల్లీ: మహిళా కమిషన్ మాదిరిగానే.. పురుషులకూ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ హస్తినలో మార్మోగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శనివారం ‘పురుష సత్యాగ్రహం’ చేపట్టారు. సేవ్ ఇండియా ఫ్యామిలీ సంస్థ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. పురుషులు, భర్తల హక్కుల కోసం పోరాడుతున్న దేశంలోని సుమారు 40 ఎన్జీవోల ప్రతినిధులు 1,000 మందికి పైగా హాజరయ్యారు.
వారిలో.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద మంది సహా.. ఇటీవల భార్యల చేతుల్లో హత్యకు గురైన, భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న భర్తల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. పురుషులకు ప్రత్యేక కమిషన్‌తోపాటు.. చట్టాల్లో లింగ వివక్షను రూపుమా పాలని, గృహహింస, లైంగిక వేధింపుల కేసులతో పెరుగుతున్న పురు షుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
∙