ఢిల్లీ: మీ బిడ్డగా రైతులందరికీ అండగా ఉంటానని, తాను రైతు కుటుంబంలో జన్మించినందుకు గర్వపడుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ తెలిపారు. శనివారం రైతుల నిరసనల్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ శివారులోని శంభు సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన నేటికి 200ల రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వినేశ్ రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొని తన సంఘీభావాన్ని తెలియజేశారు. రైతు ఉద్యమ మద్దతుదారులు ఆమెను పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆమె రైతులు చేపట్టిన నిరసనను ఉద్దేశించి మాట్లడారు.
‘‘ నేను ఓ రైతు కుటుంబంలో జన్మించినందుకు చాలా అదృష్టవంతురాలిని. మీ బిడ్డగా నేను రైతులకు చివరిదాకా అండగా ఉంటాను.మన హక్కులను పట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదు.అందుకే మన హక్కులు కోసం పోరాడుదాం. మీరంతా మీ హక్కల విషయంలో హామీ పొందిన తర్వాతే ఇళ్ల చేరాలని దేవుడుని కోరుకుంటాన్నా. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలి. రైతులు చాలా కాలంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఆందోళనకరం.200 రోజుల నుంచి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రైతులు కొనసాగిస్తున్న నిరసనలు హక్కలు సాధించుకోవాలనే వారికి చాలా స్ఫూర్తిదాయకం. నా ప్రధాన లక్ష్యం హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవటం’ అని అన్నారు.
పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతుల చేపట్టిన ఢిల్లీ మార్చ్‌ను పోలీసులు, అధికారులు శంభు సరిహద్దులో అడ్డుకోవటంతో ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి మద్దతు ధర కల్పిస్తామనే చట్టపరమైన గ్యారంటీని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ నిర్ణీత 50 కిలోలకుగాను 100 గ్రాములు అదనంగా బరువు ఉండటంతో పతకం చేజారిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment