బ్రాంప్టన్ ఆలయంపై దాడి: ఢిల్లీలో కెనడా ఎంబసీ వద్ద భారీ నిరసన | Massive protests outside Canadian embassy Delhi over Brampton temple incident | Sakshi
Sakshi News home page

బ్రాంప్టన్ ఆలయంపై దాడి: ఢిల్లీలో కెనడా ఎంబసీ వద్ద భారీ నిరసన

Published Sun, Nov 10 2024 5:31 PM | Last Updated on Sun, Nov 10 2024 7:11 PM

Massive protests outside Canadian embassy Delhi over Brampton temple incident

ఢిల్లీ: కెనడాలోని హిందూ టెంపుల్‌పై ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడానికి భారీగా చేరుకున్నారు. దీంతో తీన్ మూర్తి మార్గ్ వద్ద పోలీసులు భారీగా తరలివచ్చిన నిరసనకారులను బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఉద్రిక్తతంగా మారిన ఈ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కెనడాలో హిందువులపై ఖలిస్థానీ తీవ్రవాదులు హింసను పెంపొందించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్దఎత్తును నినాదాలు చేశారు. హిందూ,  సిక్కు సంఘాల కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్.. దాడులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే డిమాండ్‌ను మార్చ్‌ను నిర్వహించింది.

ఈ సందర్భంగా హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడు తర్విందర్ సింగ్ మార్వా  మీడియాతో మాట్లాడారు. ‘‘ హిందూ, సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మిలిటెన్సీ సమయంలో మొత్తం మా తరం నాశనం అయింది. మావాళ్లు కొందరు హత్యకు గురికాగా.. కొందరు ఇతర దేశాలకు వలస వెళ్లారు. అప్పుడు మా యువతరం జీవితాన్ని వాళ్లు నాశనం చేసేందుకు డ్రగ్స్‌ను ప్రవేశపెట్టారు. బలవంతపు మత మార్పిడుల ప్రయత్నాలతో సహా.. ఐక్యతకు భంగం కలిగించడానికి కుట్రలు జరిగాయి. ఇప్పుడు ఆలయాలపై దాడులు చేయడం వాళ్లకు కొత్త కాదు. మేమంతా కలిసి ఉన్నామని చెప్పడానికే ఇక్కడకు వచ్చాం. నిజమైన సిక్కు ఖలిస్థానీ కాలేడు. మన త్రివర్ణ పతాకాన్ని, దేశాన్ని ఎల్లవేళలా గౌరవించాలని మేం కోరుకుంటున్నాం భారతదేశంలోని సిక్కులు భారతదేశానికి అండగా నిలుస్తారు.  ఖలిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు’’ అని అన్నారు.

ఇక.. నవంబర్ 3న కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కెనడా అధ్యక్షుడు జస్టిన్‌ ట్రూడోతో సహా ప్రతిపక్షనేత తీవ్రంగా ఖండించారు.

చదవండి:  కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. సీనియర్‌ నాయకుడు రాజీనామా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement