khalistani extremists
-
క్రొయేషియాలో ఇండియా ఎంబసీపై దాడి
క్రొయేషియాలోని భారతీయ రాయభార కార్యాలయంపై అక్కడి ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేశారు. అక్కడి రాజధాని నగరం జాగ్రెబ్‌లోని భారత రాయభార కార్యాలయంలోకి చొరబడి దాడి చేసి అనంతరం కార్యాలయంపై ఉన్న జాతీయపతాకాన్ని తొలగించారు. దీనిపై భారత విదేశాంగశాఖ తీవ్రంగా స్పందించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రొయేషియాను ఆదేశించింది.భారత విదేశాంగ శాఖ ఈఘటనపై స్పందిస్తూ "జ్రాగ్రెల్లోని మా రాయభార కార్యాలయంపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వియన్నాం కన్వెన్షన్ ప్రకారం రాయభార కార్యాలయాల ఎదుట నిరసన చర్యలు సరైనవి కావు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. రాయభార కార్యాలయాలను రక్షించాలి.ఇటువంటి చర్యలతో నిందితులు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. చట్టం వీటన్నిటిని గమనిస్తూనే ఉంటుంది"అని విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. అయితే ఐరోపా ప్రతినిధులు త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.ఈ దాడికి సంబంధించిన వీడియోను సిక్స్ ఫర్ జస్టిస్ లీడర్ గురుపట్వానీ సింగ్ పన్నుమ్ ఆన్లైన్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఖలిస్థానీ వేర్పాటువాదులు భారత పతకాన్ని తీసి దానిపై ఖలీస్థాని జెండా పెట్టారు. అయితే గతేడాది క్రొయేషియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్‌కు మద్దతిస్తున్నందుకు ఆదేశానికి ధన్యవాదాలు తెలిపారు. ఆదేశంలో పర్యటించిన తొలి ప్రధాని మోదీ అవడం గమనార్హం.🚨🇮🇳🇭🇷 India strongly condemns the illegal trespass & vandalism at its Embassy in Croatia by anti-India elementsKhalistani extremists reportedly removed Tiranga from outside the embassy in Zagreb and replaced it with a "Khalistani flag". pic.twitter.com/kvAvuiG6RQ— Sputnik India (@Sputnik_India) January 22, 2026 -
జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నం.. ఖండించిన భారత్
ఢిల్లీ : లండన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కారుపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. అయితే, ఈ దాడిని భారత్ ఖండించింది. భద్రతా లోపంపై విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.మంత్రి జై శంకర్ బుధవారం రాత్రి లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశాలు ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు ఆయన కారుపై దూసుకువచ్చారు. పలువురు భారత జాతీయ జెండాలను చించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. కారువైపు దూసుకొచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వేర్పాటువాదులు, తీవ్రవాదుల రెచ్చగొట్టే చర్యలను, ప్రజాస్వామ్య స్వేచ్ఛ దుర్వినియోగం కావడాన్ని మేం త్రీవంగా ఖండిస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ఆతిథ్య దేశం వారి దౌత్యపరమైన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చాలి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటుందని మేం ఆశిస్తున్నాం’ అని ప్రకటనలో పేర్కొంది.🚨 Breaking: In London, a Khalistan protester tries to assault EAM S Jaishankar and shreds the Indian flag | Watch the video. pic.twitter.com/HRGcMAgDGt— Indian InSight (@IndianInsight_) March 6, 2025 -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్!
ఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లాను కెనడాలో అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత పోలీసు వర్గాలు వెల్లడించాయి.అయితే.. అతను విడుదలయ్యాడా లేదా ఇంకా జైలులో ఉన్నాడా? అనే దానిపై ఎటువంటి సమాచారం తెలియజేయలేదు. ప్రస్తుతం కెనడాతో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎటువంటి సమాచారం పంచుకోకపోవటం గమనార్హం. అతని నిర్బంధంపై అధికారిక ధృవీకరించలేదు. అక్టోబర్ 27-28 తేదీలలో కెనడాలో జరిగిన కాల్పుల తర్వాత డల్లాను అదుపులోకి తీసుకున్నారు. కెనడియన్ ఏజెన్సీల ప్రకారం.. మిల్టన్‌లో జరిగిన కాల్పులపై హాల్టన్ ప్రాంతీయ పోలీసు సర్వీస్ (HRPS) దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనపై హెచ్ఆర్పీఎస్.. గల్ఫ్ పోలీసులను సంప్రదించారు. ఆ రోజు కాల్పుల్లో ఇద్దరు గాయపడి ఆస్పత్రిలో చేరారని, అందులో ఒకరికి డాక్టర్లు చికిత్స అందించి అనంతరం పంపించి వేశారని తెలిపారు.మరోవైపు.. 28 ఏళ్ల డల్లా తన భార్యతో కలిసి కెనడాలోని సర్రేలో నివసిస్తున్నట్లు భారత భద్రతా సంస్థల వర్గాలు తెలిపాయి. అతనికి దోపిడీ, హత్య, తీవ్రవాద సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన అనేక కేసుల్లో ప్రమేయం ఉందని తెలిపారు. అదీకాక.. అతనిపై UAPA కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అతడిపై ఇప్పటికే పంజాబ్ పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. పంజాబ్‌లోని జాగ్రావ్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ పరమజీత్ సింగ్ హత్యకు డల్లా బాధ్యత వహించాడు. డేరా సచ్చా సౌదా అనుచరుడు మనోహర్ లాల్‌ను అతని సహచరులు నవంబర్ 2020లో కాల్చి హత్య చేశారు. మరో డేరా సచ్చా సౌదా అనుచరుడైన శక్తి సింగ్‌ను కిడ్నాప్ చేసి చంపడానికి కుట్ర పన్నడంలో డల్లా ప్రమేయం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో భారత్ డల్లాను మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది.#BreakingNews: Wanted Khalistani terrorist Arsh Dalla arrested in Canada@arvindojha joins us for more on this #ArshDalla #Canada #Khalistani (@ahuja_harshit94) pic.twitter.com/pWset1mtnh— IndiaToday (@IndiaToday) November 10, 2024 క్రెడిట్స్: IndiaTodayచదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని.. భారతీయులకు క్షమాపణలు చెబుతారా? -
బ్రాంప్టన్ ఆలయంపై దాడి: ఢిల్లీలో కెనడా ఎంబసీ వద్ద భారీ నిరసన
ఢిల్లీ: కెనడాలోని హిందూ టెంపుల్‌పై ఇటీవల జరిగిన దాడులకు నిరసనగా న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడానికి భారీగా చేరుకున్నారు. దీంతో తీన్ మూర్తి మార్గ్ వద్ద పోలీసులు భారీగా తరలివచ్చిన నిరసనకారులను బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఉద్రిక్తతంగా మారిన ఈ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కెనడాలో హిందువులపై ఖలిస్థానీ తీవ్రవాదులు హింసను పెంపొందించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు పెద్దఎత్తును నినాదాలు చేశారు. హిందూ, సిక్కు సంఘాల కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్.. దాడులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలనే డిమాండ్‌ను మార్చ్‌ను నిర్వహించింది.ఈ సందర్భంగా హిందూ సిక్కు గ్లోబల్ ఫోరమ్ అధ్యక్షుడు తర్విందర్ సింగ్ మార్వా మీడియాతో మాట్లాడారు. ‘‘ హిందూ, సిక్కు వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మిలిటెన్సీ సమయంలో మొత్తం మా తరం నాశనం అయింది. మావాళ్లు కొందరు హత్యకు గురికాగా.. కొందరు ఇతర దేశాలకు వలస వెళ్లారు. అప్పుడు మా యువతరం జీవితాన్ని వాళ్లు నాశనం చేసేందుకు డ్రగ్స్‌ను ప్రవేశపెట్టారు. బలవంతపు మత మార్పిడుల ప్రయత్నాలతో సహా.. ఐక్యతకు భంగం కలిగించడానికి కుట్రలు జరిగాయి. ఇప్పుడు ఆలయాలపై దాడులు చేయడం వాళ్లకు కొత్త కాదు. మేమంతా కలిసి ఉన్నామని చెప్పడానికే ఇక్కడకు వచ్చాం. నిజమైన సిక్కు ఖలిస్థానీ కాలేడు. మన త్రివర్ణ పతాకాన్ని, దేశాన్ని ఎల్లవేళలా గౌరవించాలని మేం కోరుకుంటున్నాం భారతదేశంలోని సిక్కులు భారతదేశానికి అండగా నిలుస్తారు. ఖలిస్తాన్‌కు మద్దతు ఇవ్వరు’’ అని అన్నారు.#WATCH | Delhi: People of the Hindu Sikh Global Forum on their way to the High Commission of Canada, Chanakyapuri, to protest against the attack on a Hindu Temple in Canada, were stopped at Teen Murti Marg by Police. pic.twitter.com/ONaXu46gJi— ANI (@ANI) November 10, 2024ఇక.. నవంబర్ 3న కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నేతలు తీవ్రంగా ఖండించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడోతో సహా ప్రతిపక్షనేత తీవ్రంగా ఖండించారు.చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. సీనియర్ నాయకుడు రాజీనామా -
వారి వల్ల కెనడా పేరు దెబ్బతింటోంది: భారత సంతతి ఎంపీ
అట్టావా: ఖలిస్తానీ వేర్పాటులపై కెనడాలో భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా కలుషితమవుతోందని అన్నారు. ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.కాగా, చంద్ర ఆర్య తాజాగా కెనడాలో మాట్లాడుతూ..‘భారతీయులమైన మేము కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగి వచ్చి ఇక్కడికి చేరుకున్నాం. కెనడా మా స్వస్థలం. కెనడా సామాజిక-ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. వారసత్వంతో కెనడా బహుళ సంస్కృతిక సంప్రదాయాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. ఈ క్రమంలో కెనడా ఇచ్చిన హక్కులను ఖలీస్తాని మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారి కారణంగా కెనడా నేల కలుషితమవుతోంది’ అంటూ మండిపడ్డారు. In response to my condemnation of the vandalism of the Hindu temple BAPS Swaminarayan Mandir in Edmonton and other acts of hate and violence by Khalistan supporters in Canada, Gurpatwant Singh Pannun of Sikhs for Justice has released a video demanding me and my Hindu-Canadian… pic.twitter.com/vMhnN45rc1— Chandra Arya (@AryaCanada) July 24, 2024 ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిపై చంద్ర ఆర్య స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవాలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు. మరోవైపు.. ఎడ్మంటన్ నగరంలోని బాప్స్ స్వామినారాయణ మందిరంపై దాడిని, విద్వేషపూరిత రాతలను ఎడ్మంటన్ పార్లమెంటు సభ్యులు తప్పుబట్టారు. ఈ దాడి ఘటనను వాంకోవర్‌లోని భారత కాన్సుల్ జనరల్ కూడా తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా.. గతేడాది కూడా కెనడాలోని మూడు దేవాలయాలపై ఇలాంటి దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెనడాలో దేవాలయాలపై దాడిని అక్కడి భారత సంతతి వ్యక్తులు ఖండించడంతో చంద్ర ఆర్య, మిగతా వారు కెనడాను విడిచిపెట్టి భారత్‌కు వెళ్లిపోవాలని గురుపత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. -
జీ7సమ్మిట్‌కు ముందు.. ఇటలీలో గాంధీ విగ్రహం ధ్వంసం
రోమ్: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటలీలో ఖలిస్తానీ తీవ్రవాదులు బుధవారం(జూన్12) ధ్వంసం చేశారు. అక్కడితో ఆగకుండా మరణించిన ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్‌కు సంబంధించిన నినాదాలను అక్కడ రాసి వెళ్లారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఇటలీ విదేశీవ్యవహారాల శాఖ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినట్లు భారత విదేశీ వ్యవహరాల శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వత్రా తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే విగ్రహ శిథిలాలను ఇటలీ ప్రభుత్వం అక్కడినుంచి తీసివేసి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయించింది.ప్రధాని మోదీ జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్న తరుణంలో ఈ దుశ్చర్యకు తీవ్రవాదులు ఒడిగట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇటలీలోని ఎపులియాలో జూన్ 13 నుంచి 15దాకా జీ7 సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. జీ7లో భారత్ సభ్య దేశం కానప్పటికీ మోదీ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవనున్నారు. -
ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌కి ‘మైక్’ గుర్తు కేటాయింపు
జైలులో ఉన్న ఖలీస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి అమృత్ పాల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్‌కు ‘మైక్’ గుర్తును కేటాయించింది. పోలింగ్ గుర్తులు కేటాయించిన మొత్తం 169 స్వతంత్ర అభ్యర్థుల్లో అమృత్ పాల్ సింగ్ ఒకరు. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చీఫ్ అయిన అమృత్ పాల్.. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై.. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. అదే విధంగా ఫరీద్కోట్( రిజర్వు) స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరబ్జిత్ సింగ్ ఖాస్లాకు ‘చెరుకు రైతు’ గుర్తును ఈసీ కేటాయించింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య చేసిన నిందితుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్జిత్ సింగ్. ఇక.. పంజాబ్‌లోని 13 స్థానాలకు చివరి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్
ఒట్టావా: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు. మరిన్ని అరెస్టులుంటాయని స్పష్టం చేశారు. ఎడ్మంటన్‌లో ఉంటున్న భారత పౌరులు కరణ్ బ్రార్(22), కమల్‌ప్రీత్ సింగ్(22), కరణ్‌ప్రీత్ సింగ్(28)లపై హత్య, హత్యకు కుట్ర కేసులు నమోదు చేశామన్నారు. కెనడా పౌరుడైన నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం కోణంలోనూ విచారణ సాగుతోందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్సీఎంపీ) విభాగం శుక్రవారం తెలిపింది. 2023 జూన్ 18వ తేదీన బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ సర్రేలోని గురుద్వారా వెలుపల ఉన్న నిజ్జర్‌ను గుర్తు తెలియని దండగులు కాల్చి చంపారు. భారత ప్రభుత్వం హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. -
లోక్‌సభ ఎన్నికల బరిలో ఖలిస్థానీ వేర్పాటువాది
ఖలిస్థానీ అనుకూల వేర్పాటువాది, వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆయన తల్లి బల్విందర్ కౌర్ శనివారం తెలిపారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ సెగ్మెంట్ నుంచి అమృత్‌పాల్ సింగ్ స్వాతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని తన కుమారుడు అమృత్‌పాల్ సింగ్‌పై ఒత్తిడి పెరుగుతోందని ఆమె తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఖదూర్ సాహిబ్ సీట్లు పోటీ చేసి రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని పేర్కొన్నారామె. ఏ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం లేదని.. స్వాతంత్రగా పోటీ చేస్తున్నారని ఆమె వివరించారు. పంజాబ్‌లోని పలు సమస్యలపై అమృత్ పాత్‌కు పూర్తి అవగాహన ఉందని, వాటిపై పోరాటం చేస్తారని తెలిపారు.ఒక రోజు క్రితం అమృత్‌పాల్ సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోట చేసేది ధృవికరించలేమని ఆయన తండ్రి తార్సెమ్ సింగ్ చెప్పారు. అయితే ప్రజులు కోరుకుంటే ఎన్నికల బరిలోకి దిగుతారని అన్నారు. అంతకంటే ముందు అమృత్ పాల్ లోక్‌సభ ఎన్నికల పోటీపై ఆయన లీగల్ కౌన్సిల్ రాజ్దేవ్ సింగ్ ఖాల్సా కూడా స్పందించారు. అమృత్ పాల్.. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ సెగ్మెంట్ పోటీ చేయనున్నారని తెలిపారు. ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ అసోంలోని డిబ్రూగఢ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుచరులను జైలుకు తరలించారు. ఇక.. గతేడాది ఫిబ్రవరిలో అమృత్‌పాల్ సన్నిహితుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అమృత్ పాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటంతో ఆయన మద్దతుదారులను పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగెలా చేశాడు. వారంతా ఫిబ్రవరి 23న పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.లవ్‌ప్రీత్ సింగ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈనేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడు పరారీలో ఉన్నాడు. సుమారు 35 రోజుల పాటు వెతికి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం పంజాబ్ పోలీసులు అమృత్ పాల్ సింగ్‌ను భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. -
ఖలిస్తానీ నేత హత్య వీడియో.. తొలిసారి టీవీలో ప్రసారం
ఒట్టావా: ఖలిస్తానీ అనుకూల నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వీడియో తొలిసారి కెనడాలోని ఓ టీవీ చానల్లో ప్రసారమైంది. గత ఏడాది జూన్ 18న కెనడా బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కెనడాలో తొలిసారిగా అధికారిక సీబీసీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్లేస్‌లో నిజ్జర్ ప్రయాణిస్తున్న వైట్ సెడాన్కారును ఒక పిక్అప్ ట్రక్కు తొలుత అడ్డగిస్తుంది. అనంతరం ట్రక్కులో నుంచి నిజ్జర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మాస్కులు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడే వేచి ఉన్న టయోటా క్యామ్రీ కారులో ఎక్కి పారిపోయిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయింది. నిజ్జర్ హత్య కేసును ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఐహెచ్ఐటీ)దర్యాప్తు చేస్తోంది. నిజ్జర్ హత్యతో భారత వేగులకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు -
రాహుల్ గాంధీకి ఖలిస్థానీ సిక్కుల నిరసన సెగ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు బ్రేక్ ఇచ్చి ఇటీవల లండన్ పర్యటించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సీటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వెళ్లారు. అయితే రాహుల్ గాంధీకి జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఖలీస్థానీ అనుకూల సిక్కుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. అయితే బిజినెస్ స్కూల్ అధికారుల జోక్యంతో నిరసన అదుపలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోలీసులు.. ఖలీస్థానీ అనుకూల సిక్కు నిరసనకారులను జడ్జ్ బిజినెస్ స్కూల్లోకి తాము అనుమతించలేదని పేర్కొనటం గమనార్హం. పరమజిత్ సింగ్ పమ్మా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరసన తెలిపినట్లు యూకే పోలీసులు తెలిపారు. పరమజిత్ సింగ్ పమ్మా.. యూరప్‌లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కో-ఆర్డినేటర్. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అమృత్సర్ హత్యలకు కారణం గాంధీ కుంటుంబమేనంటూ నిరసన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టే పలు విదేశి పర్యటనల్లో సైతం ఆయన తమ నిరసన తప్పించుకోలేరని నిరసనకారులు సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఖలీస్థానీ అనుకూల సిక్కుల నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం అనతంరం.. యూకే పోలీసులు కల్పించిన పటిష్టమైన భద్రత నడుమ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగినట్లు తెలిసింది. అయితే ఈ నిరసన ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. -
పన్నూ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తా అప్పగింతకు కోర్టు ఓకే
ప్రాగ్: ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన కేసులో భారత్‌కు చెందిన నిందితుడు నిఖిల్‌గుప్తాను అమెరికాకు అప్పగించేందుకు ప్రాగ్ హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తనను అమెరికాకు అప్పగించవచ్చని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని గుప్తా వేసిన అప్పీల్‌ను హై కోర్టు తోసిపుచ్చింది. పన్నూ హత్యకు కుట్ర పన్నాడని నిఖిల్ గుప్తాపై అమెరికన్ పోలీసులు అభియోగం మోపారు. గతేడాది జూన్‌లో గుప్తాను చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే హై కోర్టు ఓకే అన్నంత మాత్రాన గుప్తాను అమెరికాకు అప్పగించడం సులువు కాదని తెలుస్తోంది. పన్నూ కేసులో గుప్తాను అమెరికాకు అప్పగించవచ్చని ప్రాగ్ హై కోర్టు ఇచ్చిన తీర్పును చెక్ రిపబ్లిక్ న్యాయ శాఖ మంత్రి ఆమోదించాల్సి ఉంటుంది. మంత్రి ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై కాల పరిమితి ఏమీ లేదు. ఒకవేళ న్యాయ శాఖ మంత్రికి కోర్టు తీర్పుపై ఏమైనా సందేహాలుంటే ఆయన తిరిగి ఈ తీర్పును సమీక్షించాల్సిదిగా సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాతే గుప్తాను అమెరికాకు అప్పగిస్తారు. తీర్పును సుప్రీంకోర్టుకు రిఫర్ చేయాలని న్యాయ శాఖ మంత్రిని కోరతానని గుప్తా తరపు న్యాయవాది చెప్పడం గమనార్హం. ఖలిస్తానీ నేత పన్నూకు అమెరికాతో పాటు కెనడా పౌరసత్వం ఉంది. ఇదీచదవండి.. నిక్కీపై ట్రంప్ అనుచిత పోస్టులు -
మరోసారి హిందూ దేవాలయంపై ఖలిస్తానీ నినాదాలు
కాలీఫోర్నియా: స్వామినారాయణ గుడి ఘటన మరవకముందే అమెరికాలో మరో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ అనుకూల గ్రాఫైట్ రాతలు వెలుగు చూశాయి. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై శుక్రవారం ఖలిస్థానీ గ్రాఫైట్ నినాదాలు వెలుగులోకి వచ్చినట్లు హిందూ అమెరికా ఫౌండేషన్ (HAF)వెల్లడించింది. విజయ్ షెరావాలి దేవాలయానికి సంబంధించిన బోర్డుపై ‘మోదీ టెర్రరిస్టు.. ఖలిస్తానీ జిందాబాద్’ అని ఖలిస్తాన్ అనుకూల నినాదాలు రాశారు. #Breaking: Another Bay Area Hindu temple attacked with pro-#Khalistan graffiti. The Vijay’s Sherawali Temple in Hayward, CA sustained a copycat defacement just two weeks after the Swaminarayan Mandir attack and one week after a theft at the Shiv Durga temple in the same area.… pic.twitter.com/wPFMNcPKJJ — Hindu American Foundation (@HinduAmerican) January 5, 2024 అయితే ఈ ఘటనపై విజయ్ షెరావాలి దేవాలయం అధికారులు, అల్మెడా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసినట్టు హెచ్ఏఎఫ్ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అమ్మెడా పోలీసులు తెలిపారు. కాగా.. 2023 డిసెంబర్ 23న అమెరికాలోని స్వామినారాయణ గుడిపై గ్రాఫైట్‌తో ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాసిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: US: పాఠశాలలో కాల్పుల కలకలం -
భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు
న్యూయార్క్: గురుపూరబ్ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధుపై ఖలిస్తానీ వాదులు నోరుపారేసుకున్నారు. లాంగ్ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని ఖలిస్తానీ వాదులు ఆయన్ను దూషించారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై ఆయనపై పలు ప్రశ్నలు సంధిస్తూ పెద్దగా కేకలు వేశారు. స్థానిక సిక్కు సమాజ సభ్యులు సంధుకు రక్షణగా నిలిచి, ఖలిస్తానీ వాదులను బయటకు పంపించారు. -
యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్ అడ్డగింత
లండన్: ఖలిస్తాన్ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ (టీఎఫ్సీ) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. అడ్డుకోవడం అవమానకరం దొరైస్వామి కాన్వాయ్‌ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్రిటన్ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్‌లో భారత హైకమిషన్ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది. -
భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
లండన్: ఖలిస్థాన్ మద్దతుదారుల సెగ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను కూడా తాకింది. ఇంగ్లాండ్‌లోని భారత దౌత్యాధికారి దొరైస్వామి యూకేలోని గురుద్వారాకు రాగా ఆయన లోపలికి ప్రవేశించకుండా అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. శనివారం భారత హైకమిషనర్ దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో సిక్కు గురుద్వారాకు వచ్చారు. వెంటనే అక్కడి ఖలిస్థాన్ మద్దతుదారులు ఆయనను కారులో నుంచి దిగకుండానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. తిరిగి వెళ్ళిపోమంటూ కోపంగా వారించారు. దీంతో దొరైస్వామి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి 'సిక్కు యూత్ యూకే' ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఒకరు కెనడాలోనూ ఇతర దేశాల్లోనూ భారత దౌత్యాధికారులపైన కూడా మాలాగే తిరగబడాలని పిలుపునిచ్చారు. మరో మద్దతుదారుడు మాట్లాడుతూ.. భారత్ దౌత్యాధికారులైన ఇతర అధికారులైనా ఎక్కడ గురుద్వారాకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కెనడాలో ఏం జరుగుతుందో మాక్ తెలుసు. కెనడా ప్రధాని ఏవిధంగా అయితే భారత చర్యలను తప్పుబట్టి భారత దౌత్యాధికారిపై చర్యలు తీసుకున్నారు. భారత దౌత్యాధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇంగ్లాండ్‌లో ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యపై బీజీపీ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మతం వారైనా గురుద్వారాలోనికి ప్రవేశించవచ్చన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రెటరీ గ్రేవాల్ కూడా ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యను తప్పుబట్టారు. గురుద్వారాలోనికి ప్రవేశించే వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని అన్నారు. Heightened activity by Khalistanis outside of India. This is not Canada, this is Glasgow. Should the UK government not take serious note of this? How would’ve the UK responded if something like this would’ve happen with a British diplomat in India? An Indian diplomat is… pic.twitter.com/zIt6JM6hxg — Sneha Mordani (@snehamordani) September 30, 2023 ఇది కూడా చదవండి: పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్? -
పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను కెనడాలో అడుగుపెట్టకుండా నిషేధం విధించాలని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. హిందువులపై విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో కెనడా హిందూ ఫోరం ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్‌కు విజ్ఞప్తి చేసింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమెరికాకు చెందిన సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనేది ఈ సంస్థ ఆశయం. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై కూడా పన్నూ ఇప్పటికే పలు ప్రకటనలు కూడా చేశాడు. ఈ క్రమంలో హిందువుల పట్ల ఆయన విద్వేషాన్ని చిమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పన్నూపై కెనడాలో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో వివాదం చెలరేగింది. ఇరు దేశాలు ఆంక్షల దిశగా చర్యలు తీసుకున్నాయి. కెనడా, యూకే, అమెరికా సహా విదేశాల్లో ఉన్న 18 మంది ఖలిస్థానీ నాయకులను ఉగ్రవాదులుగా భారత్ ప్రకటించింది. ఇండియాలో వారి ఆస్తులను జప్తు చేసింది. ఈ జాబితాలో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకరు. కెనడాలో హిందువులు దేశం విడిచి వెళ్లాలని గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల వివాదాస్పద ప్రకటనలు జారీ చేశాడు. ఖలిస్థానీ మద్దతుదారులకే కెనడాలో స్థానం ఉందంటూ మాట్లాడారు. దీంతో అక్కడి హిందూ సంఘాలు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇదీ చదవండి: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక ఐఎస్ఐ హస్తం -
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదుల బెదిరింపులు
ఒట్టావా: ఇండియా-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అక్కడ ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారతీయ హిందువులు కెనడా విడిచి వెళ్లాలని నిషేదిత ఖలిస్థానీ గ్రూప్ సిక్స్ ఫర్ జస్టిస్(SFJ) నాయకుడు ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు జారీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా వైరల్‌గా మారింది. 'కెనడా హిందువులారా.. మీరు మా దేశ రాజ్యాంగం పట్ల విధేయతను తిరస్కరించారు. మీ గమ్యం భారతదేశం. కెనడాను వదిలి వెళ్లండి. ఖలిస్థానీ మద్దతుదారులు కెనడాకు విధేయులుగా ఉంటారు. కెనడా రాజ్యాంగం ప్రకారం వారు నడుచుకుంటారు.' అని పేర్కొంటూ పన్నూన్ ఓ వీడియోను విడుదల చేశాడు. అక్టోబర్ 29న వాంకోవర్‌లో కెనడా సిక్కులు సమావేశమవ్వాలని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వీడియోలో పేర్కొన్నాడు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత హై కమిషనర్ బాధ్యుడని రిఫరెండంపై ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చాడు. కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదంపై ఇండియా ఇప్పటికే అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. భారత దౌత్య వేత్తలను కూడా పలుమార్లు హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై కూడా పన్నూర్ వారం క్రితం హెచ్చరికలు జారీ చేశారు. కెనడా-భారత్ వివాదం.. ఖలిస్థానీ ఉగ్రవాది గుల్జారి సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారి ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ అధికారిని కెనడా నుంచి బహిష్కరించారు. కెనడా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తప్పుబట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది గల్జార్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో జస్టిన్ ట్రూడో ఆరోపణలు సరైనవి కావని భారత్ మండిపడింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారి కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇదీ చదవండి: Canada-India Dispute: ముంబయిలో ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు -
భారత్‌పై కెనడా ఆరోపణలు తీవ్రమైనవి: అమెరికా
కెనడా, భారత్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కెనడాలో భారత్ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. ఖలీస్థానీ సానుభూతిపరుడు హర్దిప్ సింగ్ నిజ్జార్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతవాతావరణం నెలకొంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. నిజ్జార్ హత్యతో రాజుకున్న చిచ్చు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్న టెన్షన్ మొదలైంది. తాజాగా కెనడా భారత్ వివాదంపై ప్రపంచ దేశాల నేతలు దృష్టి పెడుతున్నాయి. కెనడా ఆరోపణలను అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తీవ్రంగా పరిగణించాయి. ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య అంశంపై దర్యాప్తు చేసేందుకు ఒట్టావాకు తాము మద్దతిస్తున్నామని అదే విధంగా దీనికి సహకరించడానికి భారత్‌ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. చదవండి: కెనడా-భారత్ వివాదం: ప్రముఖ సింగర్ సంగీత కచేరి రద్దు భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు తీవ్రమైనవని యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ అన్నారు. దీనిపై కెనడా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా సమగ్రంగా దర్యాప్తు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని పూర్తిగా కెనడాకే వదిలేస్తున్నామని తాము ఈ విచారణలో భాగం కావాలనునుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ దర్యాప్తులో సహకరించాలని భారత్‌ను కోరుతున్నామని చెప్పారు. తాను దౌత్యపరమైన సంబంధాలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కిర్బీ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కెనడా ఆరోపణలను పరిశీలిస్తున్నారని, అవి చాలా తీవ్రమైనవని పేర్కొన్నారు. ట్రూడో ఆరోపణలపై పారదర్శకంగా వ్యవహరించాలని అమెరికా కోరుతోందన్నారు. తాము ఇరు భాగస్వామ్య దేశాలతో తాము టచ్‌లో ఉంటామని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కెనడా చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. పూర్తి పారదర్శకమైన సమగ్ర దర్యాప్తు సరైన పద్దతి అని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల వాస్తవంగా ఏం జరిగిందో అందరికీ తెలుస్తుందన్నారు. మరోవైపు కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. ఆందోళన జరిగే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. కెనడా వెళ్లాలనుకునే వారు కూడా వాయిదా వేసుకోవాలని సూచించింది.ఈ మేరకు ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఎవరీ నిజ్జర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(45) పంజాబ్‌లోని జలంధర్ సమీపంలోని భార్ సింగ్‌పుర గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు 1997లో కెనడాకు ప్లంబర్‌గా వలస వెళ్లాడు. నాటి నుంచి ఖలిస్థానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ ఏర్పాటు చేశాడు. ఈ సంస్థను భారత్ నిషేధించింది. 2020లో నిజ్జర్‌ను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2007లో లుథియానాలో జరిగిన బాంబుపేలుడు కేసులో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. అంతేగాక గతేడాది ఓ హత్యకేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌ను పట్టించిన వారికి రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. అయితే ఈ ఏడాది జూన్ 18న కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేవద్ద గురుద్వారా వద్ద ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కాల్చి చంపారు. -
భారత్‌పై కెనడా ప్రధాని సంచలన ఆరోపణలు.. రాయబారిపై వేటు
ఒట్టావా: కెనడాలో ఇటీవల జరిగిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది భారతీయ ఏజెంట్లకు ఈ హత్యతో సంబంధమున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారముందని అన్నారు. ఇదే ఏడాది జూన్‌లో సర్రేలోని గురుద్వారా ముఖద్వారం వద్ద ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జలంధర్‌లో హిందూ పూజారిని చంపిన కేసులో ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన నిజ్జర్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించింది. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. నిజ్జర్ హత్య కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో కెనడా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను బహిష్కరించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. అయితే ఆ అధికారి పేరుని మాత్రం వెల్లడించలేదు. #BREAKING: Canadian Foreign Minister @melaniejoly says Canada has expelled a top Indian diplomat accusing India of killing a Khalistani radical Canadian Citizen. Canada is escalating a diplomatic standoff with India. Expect more fireworks in coming days. pic.twitter.com/IldOaOwow8 — Aditya Raj Kaul (@AdityaRajKaul) September 18, 2023 ఈ నేపథ్యంలో ఒట్టావాలోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను చంపిన కేసులో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని దీనికి సంబంధించి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పారు. హత్యోదంతంపై భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తున్నాయని కెనడా పౌరుడి హత్యలో విదేశీ ప్రభుత్వ ప్రమేయం ఆమోదయోగ్యం కాని ఉల్లంఘన అని ప్రకటించారు. భారత ప్రభుత్వం ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరారు. ఇటీవల భారత్‌లో జరిగిన జీ20 సమావేశాల సమయంలోనే ఈ విషయాన్ని భారత ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు కేంద్ర ప్రధాని ట్రూడో తెలిపారు. India Canada ties on the brink. Canadian PM Justin Trudeau accuses Indian govt of killing Khalistani leader Hardeep Singh Nijjar in the Canadian Parliament. pic.twitter.com/gXpMrWWuTf — Sidhant Sibal (@sidhant) September 19, 2023 భారత రాయబారిపై వేటు.. ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత రాయబారిపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ తెలిపారు. ఈ మేరకు టొరంటో మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, దీనిపై ఒట్టావాలోని భారత ఎంబసీ స్పందించలేదు. తీవ్రంగా ఖండించిన భారత్.. ట్రూడో వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ‘‘కెనడాలో జరిగిన హత్యలో భారత్ జోక్యం ఉందంటూ ఆ దేశం అసంబద్ద, ప్రేరేపిత ఆరోపణలు చేస్తోంది. చట్టబద్దమైన పాలన పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాస్వామ్య విధానం మాది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలే చేశారు. సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరం. కెనడాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, హత్యలు వంటివి జరగడం కొత్తేం కాదు. అలాంటి వాటిల్లోకి భారత ప్రభుత్వాన్ని లాగే ప్రయత్నాలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలో నుంచి భారత వ్యతిరేక శక్తులను వెళ్లగొట్టేలా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని మేం మరోసారి కోరుతున్నాం’’ అని భారత విదేశాంగ శాఖ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. #WATCH | Canadian High Commissioner to India, Cameron MacKay leaves from the MEA headquarters at South Block, New Delhi. pic.twitter.com/zFAaTFfeAP — ANI (@ANI) September 19, 2023 ఇది కూడా చదవండి: చైనా దురాక్రమణ యత్నాలు తీవ్రతరం? -
G20 Summit: ఖలిస్థానీ తీవ్రవాదాన్ని సహించేది లేదు: రిషి సునాక్
ప్రపంచంలోని ప్రధాన దేశాల అధినేతలు దేశ రాజధానిలో అడుగుపెట్టడంతో హస్తీనాలో కోలాహలం పెరిగింది. 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మొదలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వరకు పలు దేశాల నాయకగణం ఢిల్లీ చేరుకుంది. శనివారం సైతం మరికొందరు నేతలు విచ్చేస్తున్నారు.మరోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2012లో అధికార పగ్గాలు చేపట్టాక తొలిసారిగా జీ20 సదస్సుకు హాజరుకావడం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం ఈ భేటీకి గైర్హాజరు అవుతున్నారు. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు వేదికగా నిలిచిన భారత్‌కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని విమానాశ్రయంలో దిగారు. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే వీరికి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనను రిషి సునాక్ దంపతులు కాసేపు వీక్షించారు. అనంతరం షాంగ్రీలా హోటల్‌కు చేరుకొని బస చేశారు. భారతీయ మూలాలున్న బ్రిటన్ ప్రధాని సునాక్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పలు అసక్తికర విషయాలు పంచుకున్నారు. హిందువుగా తాను గర్విస్తున్నానని అన్నారు. భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఇండియాకు రావడం వ్యక్తిగతం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. భారత్ అల్లునిగా.. జీ20 పర్యటన తనకు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తనను ప్రేమగా భారతదేశ అల్లునిగా పిలుస్తారని గుర్తు చేశారు. కాగా భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తిని సునాక్ వివాహామాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సునాక్ ఈ విధంగా చమత్కరించారు. చదవండి: జీ20 సదస్సు.. ప్రత్యేకంగా వాతావరణ కేంద్రం.. ఇంకా ఎన్నో! ఖలిస్థానీ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్) భారత్‌తో కలిసి పనిచేస్తోందని రిషి సునాక్పేర్కొన్నారు. హింస ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని అన్నారు. దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు సహకరిస్తున్నాయని చెప్పారు. ‘తీవ్రవాదం, హింస వంటివి ఏ రూపంలో ఉన్న బ్రిటన్‌లో వాటికి తావులేదు. అందుకే ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదాన్ని అధిగమించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇటీవల బ్రిటన్ భద్రతా మంత్రి టామ్ తుగేన్‌ధాట్ భారత్‌లో పర్యటించారు. లండన్‌లోని భారతీయ దౌత్య సిబ్బందికి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. భారత్ ఆందోళనలు బ్రిటీష్ ప్రభుత్వానికి తెలుసు. ఇది భారత్ సమస్య మాత్రమే కాదు బ్రిటన్‌ది కూడా. కాబట్టి కీలక సమాచారాన్ని పంచుకుంటూ.. ఈ తరహా హింసను నిర్మూలించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాం. హింసాత్మక చర్యలు సరైనవి కావు. బ్రిటన్‌లో దానిని నేను సహించను’ అని సునాక్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థానీ వాదులు గత మార్చిలో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడ ఖలిస్థానీ కార్యకలాపాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన యూకే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇటీవల భారత్‌కు వచ్చిన ఆదేశ భద్రతా మంత్రి కూడా దీనిపై ప్రధానంగా చర్చలు జరిపిన అనంతరం తీవ్రవాదంపై కలసికట్టు పోరుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ స్పష్టం చేసింది. అక్కడ ఖలిస్థానీ తీవ్రవాదం నిరోధానికి ప్రత్యేకంగా 95,000 పౌండ్లు(కోటి రూపాయలు) కూడా కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. -
ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని శివాజీ పార్కు నుండి పంజాబ్ బాగ్ మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ తీవ్రవాదుల నినాదాలు కలకలం సృష్టించాయి. ఈ మేరకు SFJ సంస్థలోకి వీడియోను కూడా విడుదల చేసింది. మెట్రో అధికారుల నుండి సమాచారాన్ని అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీని ఖలిస్థాన్ గా మారుస్తామని, పంజాబ్ భారత దేశానికి చెందినది కాదని, మోదీ భారతదేశం సిక్కుల నరమేధానికి పాల్పడిందని, ఖలిస్థాన్ రెఫరెండం జిందాబాద్ అని SFJ పేరుతో ఈ నినాదాలను రాశారు దుండగులు. భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన జీ20 సదస్సుకు కొద్దిరోజుల ముందు ఖలిస్తానీలు ఈ దారుణానికి ఒడిగట్టడంతో ఢిల్లీ పోలీసులు భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసి 450కి పైగా క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను పీసీఆర్ వ్యాన్లు, 50కి పైగా అంబులెన్స్‌లు, ఎయిర్‌పోర్టు, ప్రగతి మైదాన్, రాజ్‌ఘాట్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో అగ్నిమాపక యంత్రాలతో సహా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. In more than 5 metro stations somebody has written 'Delhi Banega Khalistan and Khalistan Zindabad'. Delhi Police is taking legal action against this: Delhi Police pic.twitter.com/T6U5myjZyv — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: మోదీ మన్‌కీ బాత్.. కీలక విషయాలు వెల్లడించిన ప్రధాని -
ఖలిస్తానీలకు దీటుగా భారతీయుల ర్యాలీ..
టొరంటో: ఖలిస్థాన్ మద్దతుదారుల ఫ్రీడం ర్యాలీకి దీటుగా వారి కంటే ఎక్కువ సంఖ్యలో హాజరై కెనడా భారతీయులు ఐక్యత చాటుతూ ర్యాలీ నిర్వహించారు. ఖలిస్థాన్ ఫ్రీడం ర్యాలీలో భాగంగా కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు భారత కాన్సులేట్ ఎదుట పోగయ్యారు. అయితే వారికంటే అధిక సంఖ్యలో వారికి దీటుగా భారత్ జెండాలతో ప్రదర్శన చేశారు అక్కడి భారతీయులు. అంతే మరి.. తాడిని తన్నే వాడొకడుంటే, వాడిని తలదన్నే వాడొకడుంటాడంటారు. మాజీ భారత ప్రధాని 1984లో తలపెట్టిన ఆపరేషన్ బ్లూ జరిగి 39 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు 5 కి.మీ ర్యాలీ నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని శకటాల ద్వారా ప్రదర్శించి సర్దార్ సాహిబ్ సింగ్ హత్యకు ప్రతీకారంగా అని రాశారు. అది జరిగిన సరిగ్గా నెలరోజులకు ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను అక్కడి గురుద్వారా ఎదుటే కాల్చి చంపబడ్డాడు. దీంతో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నిరసనగా జులై 8న ర్యాలీ నిర్వహించనున్నట్లు పోస్టర్లతో ఎంబసీ వద్ద హడావుడి చేశారు ఖలిస్తానీలు. ఒట్టావా భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, కాన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవలను నిజ్జర్ హంతకులుగా చిత్రీకరిస్తూ కొన్ని పోస్టర్లు వేయడం వివాదాస్పదమైంది. అమెరికా కాన్సులేట్ ముందు కూడా ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లతో అక్కడి ఖలిస్తానీలు రచ్చ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ర్యాలీకి సంబంధించి కెనడా, యూఎస్, యూకే ఎంబసీల ఎదుట పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. జులై 8 ఉదయాన్నే కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కెనడా కాన్సులేట్ వద్దకు చేరుకొని ఖలిస్థాన్ చిహ్నమున్న జెండాలు పట్టుకుని నిజ్జర్ కు జేజేలు పలుకుతూ భారత జెండాను చింపేసి కించపరిచారు. అందుకు దీటుగా కెనడాలోని భారతీయులు ఖలిస్తానీల కంటే రెట్టింపు సంఖ్యలో అక్కడికి చేరి ఖలిస్తానీలు భారతీయులు కాదని పోస్టర్లు రాసి "వందేమాతరం" "భారత్ మాతా కీ జై" అంటూ ఆకాశాన్ని తాకేలా నినదించారు. ఈ హఠాత్పరిణామాన్ని ఊహించని ఖలిస్తానీలు దెబ్బకు ఖంగుతిన్నారు. #WATCH | Members of the Indian diaspora held a counter protest against pro-Khalistan supporters in front of the Indian consulate in Canada's Toronto on July 8 pic.twitter.com/lZvRiSdVs1 — ANI (@ANI) July 9, 2023 ఇది కూడా చదవండి: యుద్ధంలో కీలక పరిణామం..ఉక్రెయిన్ కమాండర్లు విడుదల.. -
భావప్రకటన అంటే.. హింసకు పాల్పడటం కాదు..
వాషింగ్టన్: శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై ఖలిస్థాన్ వేర్పాటువాదుల దాడిని అక్కడి ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. గత నెల ఖలిస్థాన్ వేర్పాటువాది భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు ప్రతీకారంగా అతని అనుచరులు ఈ హింసాకాండకు తెరతీశారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పేరిట వేర్పాటువాద సంస్థకు నాయకుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ పై 10 లక్షల ప్రైజ్ మనీ కూడా ఉంది. కెనడాలో గురుద్వారా గుమ్మం వద్దే అతడిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. దీంతో అమెరికాలోని ఖలిస్థాన్ మద్దతుదారులు అక్కడి భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఖలిస్తానీలు హింసకు ప్రతిగా హింస అంటూ నినదించారు. గడిచిన ఐదు నెలల్లో శాన్ ఫ్రాన్సిస్కోలోని దౌత్య కార్యాలయంపై దాడులు జరగడం ఇది రెండో సారి. దీంతో అమెరికా ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న దౌత్యాధికారుల భద్రత మాకు చాలా ముఖ్యమని, శాంతికి భంగం కలిగిస్తే ఎవ్వరినీ సహించేది లేదని వైట్ హౌస్ జాతీయ భద్రతా విభాగానికి చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో ఇండియన్ అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి RO ఖన్నా మాట్లాడుతూ.. నాకు భారత దౌత్యాధికారి సంధు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఎప్పుడన్నా మానవ హక్కుల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆలోచనతోనూ, పరిపక్వతతోనూ నిజాయతీగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి వారికి హాని కలిగించే విధంగా ప్రవర్తించడం దారుణం, అప్రజాస్వామికం. అమెరికాలో ప్రతి ఒక్కరికీ భావప్రకటన స్వేఛ్చ ఉంటుంది. అలాగని దాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టి, హింసను ప్రేరేపించమని కాదు దానర్ధం. ప్రభుత్వం ఈ హింసాకాండపై విచారణ జరిపించి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’ Khalistan supporters’ try to set on fire Indian consulate in San Francisco; US 'strongly condemns’@siddhantvm and @live_pathikrit share their views@Sriya_Kundu | #Khalistan #SanFrancisco pic.twitter.com/wEtGKyfn35 — News18 (@CNNnews18) July 4, 2023 -
భారత్ ఆరోపణల్ని తప్పుబట్టిన కెనడా ప్రధాని.. ‘అది వాస్తవం కాదు’
కెనడా: ఒకపక్క ఖలిస్థాన్ మద్దతుదారుల ఆకృత్యాలు పెరిగిపోతుంటే కెనడా ప్రభుత్వం చూసి చూసినట్టు వ్యవహరిస్తోందని భారత విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తప్పుబట్టారు. వారు చెప్పేదాంట్లో వాస్తవం లేదని తాము ఉగ్రవాద చర్యలపై ఎప్పుడూ కఠినంగానే వ్యవహరించామని అన్నారు. కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆపరేషన్ బ్లూ 39వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని ర్యాలీలో ప్రదర్శించిన ఖలిస్తానీలు ఇటీవల భారత దౌత్య కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. జులై 8న ఖలిస్తానీల స్వేఛ్చ ర్యాలీ నిర్వహించనున్నట్లు దౌత్య కార్యాలయం ఎదుట పోస్టర్లను ప్రదర్శించారు. ఖలిస్తానీల చర్యలపై పలు అగ్రదేశాలు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కెనడా ప్రధాని వైఖరిని తప్పుబట్టింది. ఖలిస్తానీలపై మెతక వైఖరి మన రెండు దేశాల సంబంధాలకే ప్రమాదమని చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వారు ఖలిస్థాన్ మద్దతుదారులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది. కెనడా ప్రధాని ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వారు చెప్పేది వాస్తవం కాదు. కెనడా ఎప్పుడూ హింసను ప్రేరేపించే తీవ్రవాదం పైన కఠినంగానే వ్యవహరించింది. వ్యవహరిస్తుంది కూడా. దేశంలో అందరికీ భావ ప్రకటన స్వేఛ్చ ఉంటుందని అలాగే హింసను తీవ్రవాదంపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల ఖలిస్తానీలు భారత దౌత్య కార్యాలయంపై దాడికి కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి ప్రతి కదలికనూ గమనిస్తోందని మా పెరట్లో పాములు పడగ విప్పి బుసలు కొడుతున్నాయని ఎప్పుడు కాటేసి చంపుతాయన్నదే మమ్మల్ని వేధిస్తున్న ప్రశ్న.. అని అన్నారు. ఇది కూడా చదవండి: నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు -
పప్పాల్‌ప్రీత్ సింగ్ అరెస్ట్.. ఇక అమృత్‌పాల్ దొరికినట్టేనా?
ఛండీఘర్: ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు సహా భద్రతా బలగాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే అమృత్‌పాల్ సిక్కులతో సమావేశమవుతారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, అమృత్‌పాల్ సింగ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అమృత్‌పాల్ సింగ్ సన్నిహితుడు పప్పాల్‌ప్రీత్ సింగ్‌ను పంజాబ్ ఇంటెలిజెన్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కాగా, గత నెలలో వీరిద్దరూ పారిపోయిన విషయం తెలిసిందే. తాజాగా పంజాబ్ పోలీసులు పప్పాల్ సింగ్‌ను హోషియార్‌పూర్‌లో పట్టుకున్నారు. ఇక, అమృత్‌పాల్‌తో పాటు పప్పాల్‌సింగ్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అతను చిక్కినట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. అమృత్‌పాల్ సింగ్, పప్పాల్ సింగ్ కలిసి జలంధర్, హోషియార్పూర్, అమృత్సర్ జిల్లాల్లో ఆశ్రయం పొందారు. వీరిద్దరూ ఫగ్వారా పట్టణం, నాద్లోన్, బీబీ గ్రామంలోని మూడు వేర్వేరు డేరాలలో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం.. మార్చి 18వ తేదీ నుంచి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు. Source: Fugitive Amritpal's close aide Papalpreet Singh arrested from Hoshiarpur in a joint operation by Punjab Police and Punjab Counter Intelligence. pic.twitter.com/sBvQKqM8mI — Nikhil Choudhary (@NikhilCh_) April 10, 2023 -
Bhagwant Mann Daughter: ‘చంపేస్తాం’
ఢిల్లీ: పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, సందేశాలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్‌కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెప్పారు. సియాటెల్(సీటెల్)లో ఉంటున్న సీరత్ కౌర్‌కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్ కోరుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వొకేట్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా?.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్తాన్ సిద్ధిస్తుందా? అని ఖలీస్తానీ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్‌చేశారు. బెదిరింపులను సీరత్ కౌర్ తల్లి ఇందర్‌ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక.. స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఇందర్‌ప్రీత్, భగవంత్ మాన్కు మొదటి భార్య. వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్, కొడుకు దిల్షాన్ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్‌ప్రీత్ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది మాన్, గుర్ప్రీత్ కౌర్ అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. ఖలీస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్, ‘సిక్స్ ఫర్ జస్టిస్’.. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి కూడా. అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఖలీస్తానీ నేత(ఉగ్రవాది) జర్నైల్ సింగ్ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 గా అమృత్‌పాల్‌సింగ్‌ను పిలుచుకుంటున్నారు ఖలీస్తానీ మద్దతుదారులు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. -
అమృత్‌పాల్ కేసులో ఊహించని ట్విస్ట్..
పంజాబ్‌లో ఖలిస్తాన్ వేర్పాటువేది అమృత్‌పాల్ సింగ్ వేషాలు మార్చుకుంటూ పోలీసులకు చిక్కకుండా ఆరు రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడు. వాహనాలు మార్చుకుంటూ చివరకు పంజాబ్ దాటి హర్యానాలోకి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో అమృత్‌పాల్‌కు హర్యానాలో ఆశ్రయం ఇచ్చిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌కు అతడి సహచరుడు పపల్ ప్రీత్‌సింగ్‌కు హర్యానాలో బల్జీత్ కౌర్ అనే మహిళ ఆశ్రయం ఇచ్చింది. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలో తన ఇంట్లో వీరికి ఆశ్రయం కల్పించినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఆదివారం అక్కడే బసచేసి మరుసటి రోజు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను పంజాబ్ పోలీసులకు అప్పగించినట్లు హర్యానాలోని కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ సురీందర్ సింగ్ భోరియా తెలిపారు. ఇదిలా ఉండగా.. అమృత్‌పాల్ సింగ్ వేషాలు మార్చకుంటూ పారిపోతున్నాడు. ఇప్పటికే పోలీసులు.. అమృత్‌పాల్ మార్చిన వేషాలతో ఫొటోలను రిలీజ్ చేశారు. అంతేకాకుండా టోల్‌ప్లాజా దాటడం, కారు నుంచి బైక్ ఎక్కి పారిపోతున్న వీడియోలను కూడా బయటపెట్టారు. తాజాగా అమృత్‌పాల్ తన ఫేస్ కనిపించకుండా గొడుగు అడ్డం పెట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంతకుముందు.. మొదటి రోజు 50కి పైగా వాహనాల్లో అమృత్‌పాల్‌ను పోలీసులు వెంటాడినా చాకచక్యంగా తప్పించుకున్నాడు. మరోవైపు.. పంజాబ్ పోలీసులు గురువారం అమృత్‌పాల్ ప్రైవేట్ భద్రతా సిబ్బందిలో ఒకరైన తేజిందర్ సింగ్ గిల్‌ను అరెస్ట్ చేశారు. కాగా, తేజిందర్ సింగ్.. అజ్నాలా పోలీస్ స్టేషన్‌పై దాడిలో కీలక వ్యక్తిగా ఉన్నాడు. Video: Khalistani Leader Amritpal Singh In Haryana, Uses Umbrella To Hide Face From CCTV pic.twitter.com/8sUNIW9gTh — NDTV Videos (@ndtvvideos) March 23, 2023 -
Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్లో ముద్దులు..
చండీగఢ్: అమృత్‌పాల్ సింగ్.. కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది. ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్న అతివాది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటారు. అవును మరి సోషల్ మీడియాలో మనోడి వేషాలు మామూలుగా లేవు.. అమృత్‌పాల్ సింగ్‌కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇతడు అనేక మంది మహిళలతో చాట్ చేసినట్లు పేర్కొంది. ఈ చాట్లతో పాటు 12 వాయిస్ మెసేజ్‌లను సేకరించింది. అమృత్‌పాల్ సింగ్ అమ్మాయిల అసభ్య వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా పేర్కొంది. తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్షిప్ కోరుకోవడం లేదని అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్‌లో చెప్పాడు. మహిళలకు ముక్కు మీద కోపం అని అన్నాడు. అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చాడు. అమృత్‌పాల్ సింగ్ ఇన్స్టాగ్రాం ఖాతాలో అమ్మాయిల చాటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మందికి అతడు తరచు మెసేజ్‌లు పంపాడు. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో, దుబాయ్‌లో హనీమూన్ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేశాడు. వీటికి ఆ మహిళ లాఫింగ్ ఏమోజీస్‌తో రిప్లై ఇవ్వడం గమనార్హం. ముమ్మర గాలింపు.. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అతను మాత్రం సినిమా స్టైల్లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్నాడు. బైక్‌ను పక్కన పెట్టుకుని ఓ బండిపై అతను వెళ్తున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయినా ఇప్పటివరకు అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇతని కోసం అలర్ట్ అయ్యారు. చదవండి: నెల క్రితమే ఎన్నారై కిరణ్‌దీప్‌తో పెళ్లి.. అక్కడికి వీసా.. ప్లాన్ అదేనా? -
లండన్ ఘటనకు భారత్ కౌంటర్
ఢిల్లీ: లండన్‌లోని భారత హైకమిషన్ వద్ద ఖలీస్తానీ మద్దతుదారుల దుశ్చర్యకుగానూ.. భారత్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలోని యూకే హైకమిషన్ బయట ఉన్న బారికేడ్లను బుధవారం తొలగించింది. తద్వారా యూకే తీరుకు గట్టి బదులు ఇచ్చింది. ఖలీస్తానీ-పాక్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్‌కు మద్దతుగా.. ఖలీస్తానీ గ్రూప్‌నకు చెందిన కొందరు లండన్‌లోని భారత హై కమిషన్ వద్ద మువన్నెల జెండాను కిందకి దించేసి.. ఖలీస్తానీ జెండా ఎగరేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భారత హైకమిషన్ అధికారులు తక్షణం స్పందించడంతో ఆ ప్రయత్నం భగ్నమైంది. అయితే.. ఇంత జరుగుతున్నా అక్కడి పోలీసులు, అధికారులు స్పందించలేదు. సకాలంలో స్పందించకపోవడం మాట అటుంచి.. భారత హైకమిషన్‌కు తగినంత భద్రత కల్పించకపోవడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కార్యాలయం ఎదుట బారికేడ్లను తొలగించింది. ఇదిలా ఉంటే.. ఈ పరిణామంపై ఇప్పటికే ఆ దేశ రాయబారిని వివరణ కోరుతూ భారత విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది కూడా. ఇక అక్కడి అధికార యంత్రాంగం, మంత్రులు మాత్రం.. ఖలీస్తానీ మద్దతుదారుల చర్యలను హేయనీయమైన చర్యగా పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ఝండా ఊంచా రహే హమారా -
ఆస్ట్రేలియాలో వరుసగా హిందూ టెంపుల్స్ ధ్వంసం.. వారి పనేనా?
ఆస్ట్రేలియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బ్రిస్బేన్‌లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి జరిగింది. శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై దాడి సందర్భంగా ఆలయం గోడలు ధ్వంసమయ్యాయి. కాగా, తాజా ఘటనతో రెండు నెలల కాలంలో ఆస్ట్రేలియాలో నాలుగు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వివరాల ప్రకారం.. దక్షిణ బ్రిస్బేన్‌లోని బుర్‌బ్యాంక్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ నారాయణ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి సమయంలో దాడికి పాల్పడ్డారు. కాగా, భక్తులు శనివారం ఉదయం గుడి వెళ్లడంతో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో, ఈ విషయాన్ని ఆలయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఖలిస్థాన్ అనుకూల వాదులే ఈ దాడికి దిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు కూడా బ్రిస్బేన్‌లోని గాయత్రి మందిర్‌పై దాడి చేస్తామంటూ పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన ఖలిస్థాన్ తీవ్రవాదుల నుంచి వార్నింగ్ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సాతిందర్ శుక్లా ఈ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆలయ పూజారి, భక్తులు ఈ ఉదయం తనకు ఫోన్ చేసి ఆలయ ప్రహరీపై జరిగిన దాడి గురించి చెప్పారు. ఈ ఘటనపై పోలీసు అధికారులతో ఆలయ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో హిందూ ఆలయాలపై వరుస దాడుల నేపథ్యంలో హిందూ హ్యూమన్ రైట్స్ డైరెక్టర్ సారా ఎల్ గేట్స్ స్పందించారు. అక్కడ నివసించే హిందువులను భయపెట్టేందుకు సిక్స్ ఫర్ జస్టిస్ చేస్తున్న పద్దతిలోనే దాడులు జరుగుతున్నాయని అన్నారు. వీలైనంత తొందరగా ఈ దాడులకు కారణమైన వారిని పట్టుకోవాలన్నారు. -
పోలీసులకు షాక్.. అసెంబ్లీ గేటుకు ఖలిస్తాన్ జెండాలు.. సీఎం ఫైర్
సిమ్లా: వేర్పాటువాద ఖలిస్తాన్ జెండాలు హిమాచల్‌ప్రదేశ్‌లో కలకలం రేపాయి. ఏకంగా అసెంబ్లీ ప్రధాన గేటు, గోడపై ఖలిస్తాన్ జెండాలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ధర్మశాలలో ఆదివారం ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు, గోడలపై ఖలిస్తాన్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. శనివారం అర్ధరాత్రి గానీ లేక ఆదివారం ఉదయం గానీ ఈ జెండాలను పాతినట్టు తెలిపారు. ఆదివారం ఉదయం జెండా చూసిన వెంటనే తొలగించామన్నారు. అయితే, ఈ జెండాలను పంజాబ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులేనని పెట్టి ఉండవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ సీరియస్ అయ్యారు. జెండా పాతిన వారికి ధైర్యం ఉంటే రాత్రి కాదు.. పగలు వచ్చి జెండా పెట్టండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కారకాలను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. Flags of #Khalistan & #Khalistqn written on walls of #dharamshala #VidhanSabha #HimachalPradesh when @himachalpolice take action against these goons put UAPA then so called "s_kh" jathebqndi will say "sadde naal Dhaka hunda" #Shame pic.twitter.com/A4KY5DFhmb — Porus ਪੋਰਸ (@porusofpanjab) May 8, 2022 -
‘ఆ రెండు విమానాలను లండన్ వెళ్లనివ్వం’
న్యూఢిల్లీ: ఉగ్ర ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అలెర్ట్ విధించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ విషయం గురించి ఢిల్లీ పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే తీవ్రవాద గ్రూపునకు చెందిన గురుపత్వంత్ సింగ్ పన్ను నవంబరు 5న తీవ్రవాద దాడికి పాల్పడే అవకాశం ఉందని బెదిరింపు కాల్స్ చేశాడు. ఎయిర్ ఇండియా విమానాలను లండన్‌కు చేరకుండా అడ్డుకుంటామని చెప్పాడు’’అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు(నవంబరు 1-4) జరిగి 36 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఈ మేరకు ఖలిస్తాన్ తీవ్రవాదులు బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. (చదవండి: ప్రేయసి సోదరుడిని హతమార్చిన యూట్యూబర్) 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల ఘటన... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో దేశ రాజధానిలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ రెండేళ్ల క్రితం ఢిల్లీ కోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
మోదీకి నిరసన సెగ.. జాతీయ జెండాకు అవమానం
లండన్ : ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భారత జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థాన్ ఆందోళనకారులు భారత జాతీయ జెండాను అవనతం చేసి.. చించి ఆపై తగలబెట్టారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో కామన్వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్) జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు స్క్వేర్ వద్ద మొత్తం 53 కామన్వెల్త్ దేశాల జెండాలను అధికారులు ఎగుర వేశారు. అయితే మోదీ రాకను వ్యతిరేకిస్తూ పాక్ చెందిన మత గురువు అహ్మద్ నేతృత్వంలో యూకే సిక్కు ఫెడరేషన్‌కు చెందిన ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు, మోదీ వ్యతిరేక మైనారిటీల గ్రూప్‌కు చెందిన 500 మంది అక్కడికి ర్యాలీగా చేరుకున్నారు. తొలుత వీరంతా అక్కడి మహాత్మగాంధీ విగ్రహం వద్ద జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఆపై జెండా కర్ర నుంచి భారతీయ పతాకాన్ని అవనతం చేసి చించేశారు. ఆపై దాన్ని కాల్చేసి.. అక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్ జెండాలను ఎగురవేశారు. ఇదంతా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది. లండన్ పోలీసుల తీరుపై విమర్శలు... ఈ ఘటన జరుగుతున్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ భారతీయ సీనియర్ జర్నలిస్ట్ చిత్రీకరించగా.. అతనిపై కూడా దాడి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించిన లండన్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. భారతీయ జెండాను తొలగించిన దిమ్మె ఇదే భారత్ స్పందన... జాతీయ జెండాకు జరిగిన అవమానంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జెండాను అవనతం చేసి చించేయడంపై బ్రిటిష్ అధికారులకు మా నిరసన తెలియజేశాం. ఆ ఘటనకు వారు క్షమాపణలు చెప్పారు. ఇటువంటి శక్తులు సమస్యలు సృష్టించవచ్చని ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం. చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇది చోటు చేసుకోవటం దురదృష్టకరం. ఆ స్థానంలో జాతీయ జెండాను కొత్తది ఏర్పాటు చేశారు’’ అని ప్రధానితోపాటు పర్యటిస్తున్న బృందంలోని అధికారి ఒకరు తెలిపారు. -
కుప్పకూలిన హై సెక్యూరిటీ జైలు గోడ
పంజాబ్ లోని అత్యంత సురక్షితమైన జైలుగా భావించే నాభా హై సెక్యూరిటీ జైలు గోడ ఉన్నట్టుండి తనంతట తానే కుప్పకూలిపోయింది. 200 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోడ ఎలా కూలిపోయిందన్నది అధికారులకు అర్థం కావడం లేదు. ఈ గోడ మూడడుగుల మందం ఉన్న భారీ గోడ. ఈ జైలులో 50 మంది కరడుగట్టిన ఖలిస్తానీ తీవ్రవాదులున్నారు. దీంతో అధికారులు హుటాహుటిన 33 మందిని సంగ్రూర్ లోని వేరే జైలుకు తరలించారు. మరో 17 మందిని గురువారం తరలించనున్నారు. ఈ జైల్లో మొత్తం 498 మంది ఖైదీలున్నారు. ఇప్పుడు దశలవారీగా వారిని కూడా తరలించడం జరుగుతోంది. అయితే ఇందులో కుట్ర కోణం ఉండకపోవచ్చునని అధికారులు అంటున్నారు. ఈ గోడ 90 ఏళ్ల నాటిది కావడంతో పాతబడి, దానంతట అదే కూలి ఉండొచ్చని వారంటున్నారు. అలాగైతే ఈ పాటికి ఎర్రకోట, చార్మినార్, కుతుబ్ మీనార్లు కూడా కూలిపోయి ఉండాలి కదా అంటోంది విపక్షం.


