భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు   | Khalistan Supporters Stopped Indian Diplomat Not Entering UK Gurudwara | Sakshi
Sakshi News home page

భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు  

Published Sat, Sep 30 2023 2:18 PM | Last Updated on Sat, Sep 30 2023 2:28 PM

Khalistan Supporters Stops Indian Diplomat Not Entering Gurudwara - Sakshi

లండన్: ఖలిస్థాన్ మద్దతుదారుల సెగ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను కూడా తాకింది. ఇంగ్లాండ్‌లోని భారత దౌత్యాధికారి దొరైస్వామి యూకేలోని గురుద్వారాకు రాగా ఆయన లోపలికి ప్రవేశించకుండా అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. 

శనివారం భారత హైకమిషనర్ దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్‌గో సిక్కు గురుద్వారాకు వచ్చారు. వెంటనే అక్కడి ఖలిస్థాన్ మద్దతుదారులు ఆయనను కారులో నుంచి దిగకుండానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. తిరిగి వెళ్ళిపోమంటూ కోపంగా వారించారు. దీంతో దొరైస్వామి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి 'సిక్కు యూత్ యూకే' ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 

ఈ వీడియోలో ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఒకరు కెనడాలోనూ ఇతర దేశాల్లోనూ భారత దౌత్యాధికారులపైన కూడా మాలాగే తిరగబడాలని పిలుపునిచ్చారు. మరో మద్దతుదారుడు మాట్లాడుతూ.. భారత్ దౌత్యాధికారులైన ఇతర అధికారులైనా ఎక్కడ గురుద్వారాకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కెనడాలో ఏం జరుగుతుందో మాక్ తెలుసు. కెనడా ప్రధాని ఏవిధంగా అయితే భారత చర్యలను తప్పుబట్టి   భారత దౌత్యాధికారిపై చర్యలు తీసుకున్నారు. భారత దౌత్యాధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. 

ఇంగ్లాండ్లో ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యపై బీజీపీ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మతం వారైనా గురుద్వారాలోనికి ప్రవేశించవచ్చన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రెటరీ గ్రేవాల్ కూడా ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యను తప్పుబట్టారు. గురుద్వారాలోనికి ప్రవేశించే వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని అన్నారు. 

ఇది కూడా చదవండి: పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement