High Commissioner
-
భారత హైకమిషనర్‌ను అడ్డుకున్న ఖలిస్థాన్ మద్దతుదారులు
లండన్: ఖలిస్థాన్ మద్దతుదారుల సెగ ఇప్పుడు ఇంగ్లాండ్‌ను కూడా తాకింది. ఇంగ్లాండ్‌లోని భారత దౌత్యాధికారి దొరైస్వామి యూకేలోని గురుద్వారాకు రాగా ఆయన లోపలికి ప్రవేశించకుండా అక్కడి ఖలిస్తానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. శనివారం భారత హైకమిషనర్ దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో సిక్కు గురుద్వారాకు వచ్చారు. వెంటనే అక్కడి ఖలిస్థాన్ మద్దతుదారులు ఆయనను కారులో నుంచి దిగకుండానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. తిరిగి వెళ్ళిపోమంటూ కోపంగా వారించారు. దీంతో దొరైస్వామి అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీసి 'సిక్కు యూత్ యూకే' ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఖలిస్థాన్ మద్దతుదారుల్లో ఒకరు కెనడాలోనూ ఇతర దేశాల్లోనూ భారత దౌత్యాధికారులపైన కూడా మాలాగే తిరగబడాలని పిలుపునిచ్చారు. మరో మద్దతుదారుడు మాట్లాడుతూ.. భారత్ దౌత్యాధికారులైన ఇతర అధికారులైనా ఎక్కడ గురుద్వారాకు వెళ్ళినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. కెనడాలో ఏం జరుగుతుందో మాక్ తెలుసు. కెనడా ప్రధాని ఏవిధంగా అయితే భారత చర్యలను తప్పుబట్టి భారత దౌత్యాధికారిపై చర్యలు తీసుకున్నారు. భారత దౌత్యాధికారులకు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఇంగ్లాండ్‌లో ఖలిస్థాన్ మద్దతుదారుల చర్యపై బీజీపీ ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ మతం వారైనా గురుద్వారాలోనికి ప్రవేశించవచ్చన్నారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ జనరల్ సెక్రెటరీ గ్రేవాల్ కూడా ఖలిస్తానీ వేర్పాటువాదుల చర్యను తప్పుబట్టారు. గురుద్వారాలోనికి ప్రవేశించే వారిని ఎవ్వరూ అడ్డుకోకూడదని అన్నారు. Heightened activity by Khalistanis outside of India. This is not Canada, this is Glasgow. Should the UK government not take serious note of this? How would’ve the UK responded if something like this would’ve happen with a British diplomat in India? An Indian diplomat is… pic.twitter.com/zIt6JM6hxg — Sneha Mordani (@snehamordani) September 30, 2023 ఇది కూడా చదవండి: పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్? -
మలేసియాలో ఘనంగా భారత గణతంత్ర వేడుకలు
కౌలాలంపూర్: భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా మలేసియాలోని భారత హైకమిషనర్ బిన్ రెడ్డి భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మలేసియా భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి మాట్లాడారు. అలాగే మలేసియాలో నివసిస్తున్న భారతీయుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చర్యల గురించి వివరించారు. వీసా సెంటర్, కాన్సులర్ సెంటర్లలో కంప్లైంట్ బాక్స్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తుమన్నారు. దీనికి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా నేరుగా హాజరుకావొచ్చని వెల్లడించారు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ‘ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్’గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. (క్లిక్ చేయండి: కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన) -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై ప్రచారం.. భారత్ రియాక్షన్ ఇదే..
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు' అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి మాల్దీవులకు పారిపోయినప్పుడు కూడా భారత్ సహకరించిందని శ్రీలంక మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు కూడా భారత హైకమిషన్ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది. శ్రీలంక పార్లమెంటులో నూతన అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే విజయం సాధించారు. మొత్తం 225 మంది సభ్యులకు గానూ ఆయనకు అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
స్మైల్ ఇంగ్లిష్ నాలెడ్జ్
ఫైళ్లు విసిరి కొడితే టేబుల్ క్లీన్ అవుతుంది. అదా చక్కబెట్టడం?! ఎక్కడివక్కడే ఓపిగ్గా సర్దుకుంటూ రావాలి. దౌత్య సంబంధాలు కూడా అంతే. పేపరు, స్టాప్లరు కలిసినట్లు ఉండాలి. మంచి స్మైల్.. మంచి ఇంగ్లిష్, మంచి నాలెజ్డ్ ఈ మూడూ ఉన్న గాయత్రి.. బ్రిటన్‌లో ఇప్పుడు మన కొత్త హై కమిషనర్. రెండు జెండాలపై ఫోకస్ అయ్యే టేబుల్ ల్యాంప్. (వెనక్కి తగ్గిన చైనా) బ్రిటన్‌కు కొత్తగా ఏ దేశపు హైకమిషనరైనా పదవీ బాధ్యతలు చేపట్టడానికి వస్తే వారిని లండన్ నుంచి రెండు గుర్రపు బగ్గీలు అక్కడికి ఐదు నిముషాల సమీపంలో ఉండే బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు తోడ్కొని వెళతాయి. మొదటి బగ్గీలో ఆ హై కమిషనర్ ఉంటారు. వెనుక బగ్గీలో అంగరక్షకులు ఉంటారు. క్వీన్ ఎలిజబెత్‌కు పరిచయ పత్రాన్ని సమర్పించగానే హై కమిషనర్ నియామకం అధికారికం అవుతుంది. అయితే రాణిగారు ఇలా సంతకం పెడితే అలా అయిపోయే కార్యక్రమం కాదది. చాలా ఘనంగా జరుగుతుంది. ఇంచుమించు ఒక పట్టాభిషేకంలా!! గాయత్రీ ఇస్సార్ కుమార్ గత నెల 23న భారత హై కమిషనర్‌గా లండన్‌లో దిగేనాటికి క్వీన్ ఎలిజబెత్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో లేరు. మార్చినెల మూడవ వారంలోనే ఆమె తమ విండ్సర్ క్యాజిల్‌లో క్వారెంటైన్‌కి వెళ్లిపోయారు. లండన్‌కు ముప్పై కి.మీ. దూరంలోని ఆ కోట ఎలిజబెత్ రాణిగారి పూర్వీకుల ప్రాచీన నివాస కట్టడం. తిరిగి ఆమె బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని తన పాలనా భవనంలోకి వచ్చాకే గాయత్రిని ఆమె కలవడం ఉంటుంది. అయితే ఈ అంతరాయమేమీ గాయత్రి విధులకు ఆటంకం అయ్యేది కాదు. ఆమెకు స్వాగత సత్కారాలు మాత్రమే కాస్త ఆలస్యం అవుతాయి. కరోనా తగ్గుముఖం పట్టడానికి ఎన్నాళ్లు పడితే అన్నాళ్ల ఆలస్యం! శనివారం నుంచి పూర్తిస్థాయిలో గాయత్రి దౌత్య కార్యాలు మొదలయ్యాయి. లండన్‌లోని ఇండియా హౌస్‌లో ఆమె ఆఫీసు. ఇక్కడికి రావడానికి ముందు బెల్జియంకు, ఐరోపా సమాఖ్య కు, లక్సెంబర్గ్‌కు భారత హై కమిషనర్‌గా పని చేశారు గాయత్రి. ఇక్కడున్న హై కమిషనర్ రుచీ ఘనశ్యామ్ ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ పొందారు. గాయత్రి ఇస్సార్ 1986 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీసు అధికారి. బ్రిటన్‌కు మూడవ మహిళా హై కమిషనర్. తొలి హై కమిషనర్ విజయలక్ష్మీ పండిట్ (1954–1961). రెండవ మహిళ రుచీ ఘనశ్యామ్ (2018–2020). లండన్ వచ్చిన ఈ రెండు వారాల్లోనే గాయత్రి బ్రిటన్‌లోని ముఖ్యులతో ‘వర్చువల్’గా సమావేశం అయ్యారు. ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ (ఎఫ్.సి.వో) మంత్రి తరీఖ్ అహ్మద్, ఎఫ్.సి.వో. పొలిటికల్ డైరెక్టర్ రిచర్డ్ మూర్, భారతీయ పారిశ్రామికవేత్తలు స్వరాజ్ పాల్, రాజ్ లూంబాలతో ఫలవంతమైన చర్చలు జరిపారు. హై కమిషనర్ పదవులలోకి వచ్చే ముందువరకు ఆమె న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల శాఖలో అనే విభాగాలలో పని చేశారు. విదేశాలతో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతి సంబంధాలకు చక్కటి అనుసంధానకర్తగా ఉన్నారు. గాయత్రి పంజాబీ సంతతి అమ్మాయి. పుట్టింది బెంగళూరులో. అక్కడే సోఫియా హైస్కూల్లో, బెంగళూరు యూనివర్సిటీలో చదివారు. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్ ఆమె సబ్జెక్టులు. ఇంగ్లిష్తో పాటు హిందీ, పంజాబీ భాషల్లో అనర్గ ళంగా మాట్లాడేయగలరు. జర్మన్, పోర్చుగీస్, నేపాలీ, ఫ్రెంచ్ భాషల్లో వర్కింగ్ నాలెడ్జి ఉంది. బ్రిటన్‌లో ప్రస్తుత బోరిస్ జాన్సన్ ప్రభుత్వం.. ఎప్పటికి పోతుందో తెలియని కరోనా మీద, డిసెంబర్ 31లోపు పూర్తి చేయవలసిన ‘బ్రెగ్జిట్’ విధానాల మీద దృష్టి ఉంచింది. ఈ రెండు అంశాలపై బ్రిటన్‌కు భారత్ చూపించవలసిన తోవలో గాయత్రి కచ్చితంగా ఒక ద్వైపాక్షిక దారి దీపమే. రాణిగారు విండ్సర్ క్యాజిల్ నుంచి వచ్చాక బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 170 మంది అంబాసిడర్లు, హై కమిషనర్ల సమక్షంలో ఈ దీపానికి అధికారిక ప్రజ్వలన జరుగుతుంది. -
రాయబారిని వెనక్కి పిలిచిన పాక్
-
రాయబారిని వెనక్కి పిలిచిన పాక్
సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తమ రాయబారి సొహైల్ మహ్మద్‌ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్‌ను పిలిపించినట్టు పాక్ పేర్కొంది. భారత్‌లో తమ హైకమిషనర్ సొహైల్ అహ్మద్‌ను చర్చల నిమిత్తం పాకిస్తాన్ పిలిపించామని, ఆయన సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి డాక్టర్ మహ్మద్ ఫైసల్ ట్వీట్ చేశారు. కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఉదంతంపై పాక్ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసిన భారత్ ఆత్మాహుతి దాడిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌పై పాకిస్తాన్ తక్షణమే చర్యలు చేపట్టాలని, తమ భూభాగం నుంచి ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులను కట్టడి చేయాలని కోరింది. దాడి జరిగిన మరుసటి రోజు పాక్‌లో భారత రాయబారిని సంప్రదింపుల కోసం ఢిల్లీకి పిలిపించారు. -
బంగారా డ్యాన్స్‌కు భారత్ వేదిక..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ వేదికగా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. దేశ వ్యాప్యంగా చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి ఇరవై నగరాల్లో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ హరీందర్ సిద్దు ఉత్సవాలకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. సుమారు ఆరు నెలల పాటు జరిగే ఈ వేడుకలు ఈ నెల 23న చెన్నైలో ఆస్ట్రేలియన్ వరల్డ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది మర్చి 30న ముగిసే ఉత్సవాలు.. సుమారు 75 రకాల ఈవెంట్స్‌తో భారతీయులను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది. హరీందర్ సిద్దు మాట్లాడుతూ.. భారత్, ఆస్ట్రేలియా సంబంధాలను బలపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఉత్సవాలు సాగే ఆరు నెలల్లో తమ సంస్కృతిని భారతీయులకు చాటి చెప్పే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఆమె తెలిపారు. ఈ పెస్ట్‌లో ఆస్ట్రేలియా ఖండంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బంగారా డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. అంతే కాకుండా ప్రఖ్యాత మాస్టర్ షఫ్ గారే మెహిగాన్‌చే నోరూరుంచే ఆస్ట్రేలియన్ వంటకాలు, ఇంటర్నేషనల్ కామెడీ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాలు కూడా దీనిలో భాగంగా నిర్వహించనున్నార. దీనికి సంబంధించి ముగ్గురు ప్రతినిధులను సిద్దు ప్రకటించారు. గారే మెహిగాన్, జాన్ జుబ్రిజికి, సంగీత కళాకారుడు రాఘవ్ సచార్‌లు ఆస్ట్రేలియా ఫెస్ట్ అంబాసిడర్స్‌గా వ్యవహరించనున్నారు. -
ఆ ఆరోపణలను తోసిపుచ్చిన పాక్
ఇస్లామాబాద్ : భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను ఇస్లామాబాద్ సమీపంలోని ప్రముఖ గురుద్వారలోకి వెళ్లేందుకు అనుమతించలేదన్న ఆరోపణలను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత్‌లో వివాదాస్పద సినిమాల విడుదలకు నిరసనగా సిక్కుల నిరసనల నేపథ్యంలో దౌత్యవేత్త తన పర్యటనను వాయిదా వేసుకున్నారని వివరణ ఇచ్చింది. ఇస్లామాబాద్‌లో తమ హైకమిషనర్, కాన్సుల్ అధికారులను గురుద్వారాలోకి అనుమతించకపోవడంపై ఢిల్లీలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్‌షాకు భారత్ నిరసన తెలిపిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ మేరకు స్పందించింది. భారత యాత్రికులను కలిసేందుకు, గురుద్వారను సందర్శించేందుకు తనకు అనుమతి ఇవ్వలేదని భారత హైకమిషనర్ అజయ్ బిసారియా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయం తాను పాకిస్తాన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని, ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తలను వారి కార్యకలాపాలకు అనుమతించకుండా అడ్డుకోవడం దౌత్యసంబంధాలపై వియన్నా సదస్సు నిబంధనల ఉల్లంఘనేనని పాకిస్తాన్‌పై భారత్ మండిపడింది. -
భారత రాయబారికి అవమానం
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లోని భారతీయ హైకమిషనర్‌కు అవమానం జరిగింది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరువలో ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం గురుద్వారా పంజా సాహిబ్‌ను దర్శించేందుకు శుక్రవారం భారత హైకమిషనర్ అజయ్ బిసారియా కుటుంబంతో కలసి వెళ్లారు. ఇందుకోసం పాకిస్తాన్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు. అయితే, బిసారియా గురుద్వారాలోకి వెళ్లకుండా పాకిస్తాన్ అధికారులు అడ్డగించారు. పుట్టిన రోజు సందర్భంగా బిసారియా కుటుంబంతో కలసి గురుద్వారాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా బిసారియాను గురుద్వారాలోకి ప్రవేశించకుండా పాకిస్తాన్ అధికారులు అడ్డుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా బిసారియాకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. -
ఈ గిల్లికజ్జాలు బాల్య చేష్టలు కావా..?
ఆదిత్య హృదయం భారత్, పాకిస్తాన్ దేశాలు పరస్పరం పోట్లాడుకుంటూ చిన్న పిల్లల్లాగా వ్యవహరించే సమయాలు ఉన్నాయి. మన రెండు దేశాల దౌత్యవేత్తల మధ్య కూడా ఎత్తుకు పైఎత్తు వేస్తూ ప్రయోజనం పొందే ఘటనలు తరచుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనను మరోసారి మనం చూస్తున్నాం. నిజాయితీగా చెప్పాలంటే, ఈ తగాదాలు ఎవరు ప్రారంభించారని ప్రశ్నించడం అసంబద్ధమైనది. అది ప్రస్తుతం విషయ విస్తరణగా మాత్రమే ఉంటుంది. వారికి అత్యుత్తమమైన దాన్ని ఇవ్వడానికి నిర్ణయించుకున్నప్పటికీ, తమను నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా, గాయపరుస్తున్నట్లు ఫీలవుతుం టారు. వాస్తవానికి ఆ సందర్భంలో అలాంటిది ఏమీ జరిగి ఉండదు. అలాంటి అభిప్రాయం కలిగిందే తడవుగా చాలా వేగంగా స్పందించి తిరిగి దెబ్బ కొడుతుంటారు. కానీ నిజంగా గమనించాల్సింది ఏమిటంటే ఇలాంటి గొడవల్లో కనిపించే అల్పత్వాన్నే. ప్రస్తుత ఘటనలో దాగివున్న మూర్ఖత్వానికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ. భారత్ నూతన హై కమిషనర్ అజయ్ బిసారియాకు ఇస్లామాబాద్ క్లబ్ సభ్యత్వం ఇవ్వడంలో పాకిస్తాన్ అలక్ష్యం వహిస్తున్నట్లు కనిపించింది. మన మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా తీవ్రమైన అంశమే. ఎందుకంటే ఒక గౌరవనీయమైన వ్యక్తికి క్లబ్ సభ్యత్వం ఎందుకు నిరాకరిస్తారు? అలాంటి ఆలోచనే పరమ హాస్యాస్పదమైనదిగా మధ్యతరగతి భావిస్తుంది. ఇక పాకిస్తానీయులు కూడా ఈ ఘటనపై తమ వంతు ఆరోపణలకు దిగారు. ఇస్లామాబాద్ క్లబ్లో కేవలం 1,500 డాలర్లు మాత్రమే చెల్లించి భారతీయ దౌత్యవేత్తలు అన్ని సౌకర్యాలను ఆస్వాదిస్తుండగా, ఢిల్లీలోని గోల్ఫ్ క్లబ్లో మూడేళ్ల సభ్యత్వం తీసుకోవాలంటే పాక్ దౌత్యవేత్తలు 15,000 డాలర్లు చెల్లించాల్సి వస్తోం దన్నది వీరి అభియోగం. గోల్ఫ్ కోర్స్, స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలకోసం అంత భారీ సొమ్ము చెల్లించాలని డిమాండ్ చేయ డం వింత గొలుపుతుందన్నది పాక్ వాదన. అదే ఇస్లామాబాద్ క్లబ్‌ని చూస్తే అక్కడ ఒక బార్ సౌకర్యం మాత్రమే ఉంటోంది. ఈ సమస్య మరింత ముందుకెళుతోంది. పాక్‌లోని భారతీయ దౌత్యవేత్తలకు తరచుగా విద్యుత్తు, నీటి సౌకర్యాలను నిలిపివేస్తూ వారు బట్టలు శుభ్రం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తూ, చీకట్లో మునిగేలా చేస్తుంటారు. మనం కూడా భారత్‌లో పాక్ దౌత్యవేత్తల పిల్లలను స్కూలుకు వెళ్లకుండా అడ్డగిస్తూ, వారి వాహనాల డ్రైవర్లను వేధిస్తూ ఉంటాం. పైగా, ఇరు దేశాల్లోనూ, తెల్లవారి 3 గంటల సమయంలో దౌత్యవేత్తల ఇంటి గంటలను పని లేకున్నా మోగిస్తూ నిద్రాభంగం కలిగిస్తుంటారు. మనం పరస్పరం ఆడుతున్న ఆటలు ఇలాగే ఉన్నాయి. ఇది రెండు దేశాలకూ తెలుసు. పైగా ఇతర దేశాలకు కూడా ఈ విషయం క్షుణ్ణంగా తెలిసేలా చేస్తుంటాం. రెండు దశాబ్దాల క్రితం, భారత్‌లో బెల్జియం మాజీ రాయబారి ఇలాంటి అవివేకపు చర్యల వెనుక ఏం దాగి ఉందన్నది బయటపెట్టారు. తన మాటల్లో చెప్పాలంటే, ‘భారత్, పాక్‌ల మధ్య అనూహ్య సంబంధాలు ఉంటున్నాయి. ఈ రెండు దేశాలు పరస్పరం చక్కగా అర్థం చేసుకుం టూనే అదే సమయంలో పరస్పరం ద్వేషించుకోవడాన్ని ప్రేమిస్తుంటాయి. ఒకరు మరొకరిని ఇబ్బంది పెట్టడంలో మహదానందపడుతుంటారు. ఇది మరీ అసంబద్ధంగా కనిపిస్తుంటుంది. ‘ఇస్లామాబాద్‌లో పనిచేసిన ఏ భారతీయ దౌత్యవేత్త అయినా, ఢిల్లీలో పనిచేసిన ఏ పాక్ దౌత్యవేత్త అయినా బెల్జియం మాజీ రాయబారి అభిప్రాయంతో విభేదిస్తారంటే నాకు సందేహమే. మీరు భారత్ లేక పాక్ దౌత్యవేత్తలను అడిగి చూడండి. ప్రత్యర్థి దేశపు ప్రవర్తనను పిల్లచేష్ట అని, అల్పమనస్తత్వం అని, అనుచితం అనీ వ్యాఖ్యానించే విషయంలో ఈ దౌత్యవేత్తలు ఏ ఒక్కరూ వెనక్కు తగ్గరు. కానీ మీ వ్యవహారం ఏమిటి అని అడిగి చూడండి. ఆ స్థాయిలో స్పందన రానే రాదు. తనను తాను కరెక్ట్ అని భావించుకునే వ్యక్తి తనను మాత్రమే పక్షపాతంతో చూస్తున్నారని నమ్మడమే కాకుండా దానికి ప్రతీకారం తీర్చుకోవడం సరైందేనని సమర్థించుకుంటూ ఉంటాడు. అంటే, విడిపోయిన దాయాదులు ప్రవర్తించాల్సింది ఇలాగేనా? ఒకప్పుడు మనది ఒకే దేశ మని, మనం ఒకే ప్రజ అన్న సత్యానికి అనివార్య ఫలితం ఇదేనా? కావచ్చు. కానీ ఇది సముచితమైన సంజాయిషీ కాదని, చీదరపుట్టించే మన ప్రవర్తనకు ఇది తగిన వివరణ కాదనుకుంటాను. మనవైపు మాత్రమే మనం చూసుకుంటున్నట్లయితే, మనకు ఎదురయ్యే పరిహాసానికి, ఎగతాళికి మనమే కారణం అని మనం ఎన్నడైనా గుర్తించగలమా? మనం కాస్త ఎదగాల్సిన సమయం ఇది. వాస్తవం ఏమిటంటే, మనం నిజంగా పరస్పరం ఆందోళన చెందాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా, ఇలాంటి మూర్ఖత్వపు చేష్టలు సమస్యను వైయక్తికంగా మారుస్తాయని, తద్వారా పరిష్కారం సాధ్యం కాదని మనకు తెలుసు. మన ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై మాట్లాడనప్పుడు దౌత్యవేత్తలు గిల్లికజ్జాలు పెట్టుకోవడం సమర్ధనీయం కాదు. వారు కనీసం తమ భావ వ్యక్తీకరణ మార్గాలను తెరిచి ఉంచుకోవాల్సి ఉంది. అప్పుడు మాత్రమే, మన ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమైనప్పుడు ఆ చర్చా ప్రక్రియ కాస్త సాధ్యపడుతుంది. - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
హైకమిషనర్‌ను రీకాల్ చేసిన పాక్
ఇస్లామాబాద్ : భారత్ తమ దౌత్యవేత్తలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్న పాకిస్తాన్ తాజాగా భారత్‌లో తమ హైకమిషనర్‌ను వెనక్కి పిలిపించింది. భారత్ తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలో పాక్ హైకమిషనర్ సొహైల్ మహ్మద్‌ను రీకాల్ చేసింది. విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మహ్మద్ ఫైసల్ గురువారం వెల్లడించారు. తమ దౌత్యవేత్తలను భారత్ వేధింపులకు గురిచేస్తుండటంపై హైకమిషనర్‌తో పాకిస్తాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. భారత్‌లో పాక్ దౌత్యవేత్తలు, వారి కుటుంబాలను కాపాడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై భారత డిప్యూటీ హైకమిషనర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. మరోవైపు న్యూఢిల్లీలో పాకిస్తాన్ దౌత్య సిబ్బంది..వారి కుటుంబాలపై వేధింపులు, దాడులు తీవ్రతరమయ్యాయని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. గత వారం న్యూఢిల్లీలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ కారును కొందరు వెంటాడి, డ్రైవర్‌ను వేధించారని తెలిపింది. పాక్ ఫిర్యాదులపై స్పందించిన భారత్ స్నేహపూర్వక వాతావరణంలో దౌత్యవేత్తలు పనిచేసుకునేలా అన్ని చర్యలూ చేపడతామని హామీ ఇచ్చింది. గత ఏడాది పాక్‌లో భారత అధికారులు సైతం వేధింపులకు గురయ్యారని దౌత్యపరమైన పద్ధతుల్లో వీటిని వారు పరిష్కరించుకున్నారని స్పష్టం చేసింది. -
ఖలిస్తాన్ ఉగ్రవాదికి ఆహ్వానం
న్యూఢిల్లీ: ఖలిస్తాన్ వేర్పాటువాదులకు మద్ద తు ఇవ్వబోమని హామీ ఇచ్చి ఒక్కరోజు గడవకముందే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. దేశరాజధానిలో గురువారం ట్రూడో గౌరవార్థం కెనడా హైకమిషనర్ నాదిర్ పటేల్ నిర్వహించనున్న విందుకు ఆ దేశ అధికారులు సాక్షాత్తూ ఓ ఉగ్రవాదికి ఆహ్వానం పంపారు. ప్రధాని మోదీని ట్రూడో కలుసుకోవడానికి కేవలం ఒక్కరోజు ముందే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రూడో.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1986లో కెనడా పర్యటనకు వెళ్లిన పంజాబ్ మంత్రి మల్కియాత్ సింగ్ సిద్ధూపై వాంకోవర్‌లో హత్యాయత్నం చేసిన ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ సభ్యుడు జస్పాల్ అత్వాల్‌కు కెనడా అధికారులు గురువారం విందుకు ఆహ్వానం పంపారు. మంత్రిపై దాడి చేసినందుకు అప్పట్లో జస్పాల్‌కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ట్రూడో గౌరవార్థం అంతకుముందు ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా హాజరైన జస్పాల్, ఏకంగా కెనడా ప్రధాని భార్య సోఫీ, మంత్రి అమర్జిత్ సోహీలతో ఫొటోలు కూడా దిగాడు. ఈ ఫొటోల్లో ఉన్న జస్పాల్‌ను కెనడియన్ మీడియా గుర్తించడంతో ఆ దేశ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన కెనడా హైకమిషన్.. జస్పాల్‌కు పంపిన ఆహ్వానాన్ని రద్దుచేసింది. తన సిఫార్సుతోనే కెనడా హైకమిషన్ సిబ్బంది జస్పాల్‌ను విందుకు ఆహ్వానించారని కెనడా ఎంపీ రణ్‌దీప్ సురాయ్ అంగీ కరించారు. జస్పాల్ భారత్‌కు వచ్చేందుకు వీసా ఎలా లభించిందన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ చెప్పింది. -
ముగ్గురు భారతీయ యువతులకు విముక్తి
న్యూఢిల్లీ: ముగ్గురు భారతీయ యువతులతో పాటు మరో ఏడుగురు నేపాలీ యువతులకు భారత ప్రభుత్వం విముక్తి కల్పించింది. ఉపాధి నిమిత్తం వెళ్లిన యువతులు కెన్యా దేశంలోని మొంబాసా నగరంలో మోసపోయారు. వారి పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నగరంలోని ఓ ఇంట్లో బంధించారు. భారత హైకమిషన్ అధికారులు స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక కెన్యా పోలీసుల సహకారంతో వారిని విడిపించారు. వారిని విడిపించేందుకు శతవిధాలా ప్రయత్నం చేసిన కెన్యాలో భారత హైకమిషనర్ అధికారిణి సుచిత్రా దురై, కరణ్ యాదవ్‌లను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అభినందించారు. అలాగే కెన్యా పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లపై కేసు నమోదు చేయాలని పంజాబ్ ప్రభుత్వానికి సుష్మాస్వరాజ్ వివరాలు పంపారు. ఈ విషయాలన్నీ ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. -
ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా భారత సంతతి మహిళ
మెల్బోర్న్: భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా హరీందర్ సిధూ నియమితులయ్యారు. ఐదేళ్ల వ్యవధిలో మన దేశంలో నియమితులైన భారత సంతతికి చెందిన రెండో ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఆమె. సిధూకుటుంబం పంజాబ్ నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడింది. ప్రస్తుత హైకమిషనర్ పాట్రిక్ సక్లింగ్ స్థానంలో సిధూ బాధ్యతలు చేపట్టనున్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌లో దౌత్య ప్రతినిధి పాత్ర పోషించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఆమె తెలిపారు.