కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన విడుదల చేసింది.
'శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్‍కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు' అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి మాల్దీవులకు పారిపోయినప్పుడు కూడా భారత్ సహకరించిందని శ్రీలంక మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు కూడా భారత హైకమిషన్ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది.
శ్రీలంక పార్లమెంటులో నూతన అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే విజయం సాధించారు. మొత్తం 225 మంది సభ్యులకు గానూ ఆయనకు అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి.
చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే
Comments
Please login to add a commentAdd a comment