Ranil Wickeremesinghe
-
ఇంతకంటే చెత్త ప్రదర్శన మరోటి ఉండదు.. స్పిన్ దిగ్గజం విమర్శలు
శ్రీలంక క్రికెట్ భవితవ్యంపై దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెటర్లుగా కెరీర్ ఎంచుకునే వాళ్లను భయపెట్టే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయని వాపోయాడు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఈ విషయంలో చొరవ తీసుకొని లంక క్రికెట్ బోర్డును ప్రక్షాళన చేయాలని విజ్ఞప్తి చేశాడు. భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్- 2023లో శ్రీలంక దారుణంగా వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. వరుస పరాజయాలతో డీలాపడ్డ లంక పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. 1975, 1983, 1987, 1992 ఎడిషన్ల తర్వాత మరోసారి ఇలాంటి ఘోర పరాభవం మూటగట్టుకుంది స్వర్ణ యుగం కాగా... 1996లో ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది 2003లో సెమి ఫైనల్ వరకు చేరింది. అలాంటి జట్టు ఈసారి పూర్తిగా విఫలం కావడం తనను బాధించిందని మురళీధరన్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో 1975 తర్వాత శ్రీలంకకు ఇదే అత్యంత చెత్త ఎడిషన్ అని విమర్శలు గుప్పించాడు. నిబద్ధత, అంకితభావం లోపించినందువల్లే ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ముత్తయ్య మురళీధరన్ పేర్కొన్నాడు. వ్యక్తిగత అజెండాలను ఆటలపై రుద్దాలనుకోవడం సరికాదని బోర్డు సభ్యులను విమర్శించాడు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం క్రికెట్‌ను తాకట్టు పెట్టొద్దని చురకలు అంటించాడు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి? ఇలాంటి పరిణామాల వల్ల యువ ఆటగాళ్ల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుందని పేర్కొన్నాడు. దేశం కోసం క్రికెట్ ఆడాలనుకునే వాళ్లను చిన్నబుచ్చుకునేలా చేయొద్దని ముత్తయ్య మురళీధరన్ విజ్ఞప్తి చేశాడు కాగా వనిందు హసరంగ వంటి స్టార్ ఆల్ రౌండర్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతడిని పక్కన పెట్టారని లంక సెలక్షన్ బోర్డుపై విమర్శలు వచ్చాయి. అదే విధంగా.. క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించే క్రమంలో తాను పాత కమిటీని రద్దు చేస్తున్నట్లు ఆదేశ క్రీడామంత్రి రోషన్ రణసింగి గతంలో ప్రకటించారు. లంక బోర్డుపై నిషేధం అయితే బోర్డు సభ్యులు కోర్టుకు వెళ్లగా అక్కడ వారికి సానుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం ఈ విషయాలపై తీవ్రంగా స్పందించింది. లంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ నిషేధం విధించింది ఈ పరిణామాల నేపథ్యంలో లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ న్యూస్ 18తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్‌పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్‌కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్‌కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై ప్రచారం.. భారత్ రియాక్షన్ ఇదే..
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు' అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి మాల్దీవులకు పారిపోయినప్పుడు కూడా భారత్ సహకరించిందని శ్రీలంక మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు కూడా భారత హైకమిషన్ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది. శ్రీలంక పార్లమెంటులో నూతన అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే విజయం సాధించారు. మొత్తం 225 మంది సభ్యులకు గానూ ఆయనకు అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
రెండు నెలల తర్వాత తొలిసారిగా..
న్యూఢిల్లీ: ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి, డిశ్చార్జయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండు నెలల తర్వాత తొలిసారిగా తిరిగి క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘేను సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాశి పర్యటన సందర్భంగా అస్వస్థతకు గురైన సోనియాను ఆగష్టు 2న తొలుత ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. డిశ్చార్జ్ సమయానికి సోనియా నీరసంగా ఉండటంతో మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల తర్వాత సోనియా గాంధీ ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి తమ పార్టీ వ్యవహారాల్లో పాల్గొన్నారు. రణిల్ విక్రమ్ సింఘేను కలిసిన సమయంలో చేతికి పట్టితో సోనియా కనింపించారు.