రెండు నెలల తర్వాత తొలిసారిగా..
న్యూఢిల్లీ:
ఆనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి, డిశ్చార్జయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రెండు నెలల తర్వాత తొలిసారిగా తిరిగి క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘేను సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉత్తర్ ప్రదేశ్లోని వారణాశి పర్యటన సందర్భంగా అస్వస్థతకు గురైన సోనియాను ఆగష్టు 2న తొలుత ఆర్మీ ఆస్పత్రిలో చేరారు.
ఆ తర్వాత గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. డిశ్చార్జ్ సమయానికి సోనియా నీరసంగా ఉండటంతో మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించిన విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల తర్వాత సోనియా గాంధీ ఆరోగ్యం కుదుట పడటంతో తిరిగి తమ పార్టీ వ్యవహారాల్లో పాల్గొన్నారు. రణిల్ విక్రమ్ సింఘేను కలిసిన సమయంలో చేతికి పట్టితో సోనియా కనింపించారు.