Colombo
-
శ్రీలంకలో మోదీకి ఘన స్వాగతం
-
శ్రీలంకలో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన
-
శ్రీలంకలో నటి కీర్తి సురేష్ సందడి ఫోటోలు వైరల్
-
విస్తరణ బాటలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ .. గల్ఫ్, మధ్య ప్రాచ్యంలో స్థానాన్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఆగ్నేయాసియాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించనుంది. బ్యాంకాక్, సింగపూర్, కొలంబో తదితర కొత్త రూట్లను పరిశీలిస్తున్నట్లు సంస్థ ఎండీ అలోక్ సింగ్ తెలిపారు. 2025 మార్చి వేసవి షెడ్యూల్లో ఖాట్మండూ రూట్లో సరీ్వసులు మొదలుపెడతామని, వచ్చే ఆర్థిక సంవత్సరం లేదా ఆపై సంవత్సరం వియత్నాంకి ఫ్లయిట్స్‌ను ప్రారంభించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ప్రధానంగా 5.5–6 గంటల ప్రయాణ దూరం ఉండే రూట్లు, ద్వితీయ .. తృతీయ శ్రేణి నగరాలకు సరీ్వసులపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నుంచి ఢాకాకు డైరెక్ట్ ఫ్లయిట్స్ ప్రణాళికను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి నాటికి తమ విమానాల సంఖ్యను ప్రస్తుతమున్న 90 నుంచి 100కి పెంచుకోనున్నట్లు సింగ్ చెప్పారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం దేశీయంగా 36, అంతర్జాతీయంగా 15 గమ్యస్థానాలకు నిత్యం 400 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
శ్రీలంక అధ్యక్ష ఫలితాలు.. అనూర కుమార ముందంజ
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీతో వామపక్ష జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె భారీ విజయానికి చేరువలో ఉన్నారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అనూర కుమార 52 శాతం ఓట్లతో ముందంజలో దూసుకువెళ్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కేవలం 16 శాతం ( 2,35,00 ఓట్లు)తో మూడో స్థానంలోకి పడిపోయారు. ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస 22 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.Sri Lanka elections result 2024Left-leaning Anura Kumara Dissanayake is close to registering victory in the Sri Lanka Presidential elections after he amassed 52% of votes by 7 am on Sunday. The incumbent President, Ranil Wickremesinghe, is trailing way behind with 235,000 votes…— Brig V Mahalingam (@BrigMahalingam) September 22, 2024ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, విపక్ష నేత సజిత్ ప్రేమదాసతో, జనతా విముక్తి పెరమున (జేవీపీ) చీఫ్ అనూర కుమార దిస్సనాయకె మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే.. ఫలితాల్లో మాత్రం ఊహించని రీతిలో శ్రీలంక ప్రజలు అనూర కుమారకు భారీ ఓట్లు వేశారు. ఈ దెబ్బతో ప్రస్తుత అధ్యక్షుడు ఊసులో లేకుండా పోయారు.Sri Lanka’s presidential election has delivered a humiliating defeat to @RW_SRILANKA and his former ally @sajithpremadasa . Congratulations to Sri Lanka’s first Marxist President @anuradisanayake who will be the new head of state and commander-in-chief. pic.twitter.com/iCig0QmHFH— Ranga Sirilal (@rangaba) September 21, 2024 ఇక.. ఎన్నికలు ప్రారంభమైనప్పటినుంచి దిస్సనాయకె ముందున్నట్టు ముందస్తు సర్వేలన్నీ తేల్చాయి. సర్వే ఫలితాలను నిజం చేస్తూ.. అనూర కుమార భారీ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మొత్తం అర్హులైన 17 మిలియన్ల మంది ఓటర్లలో 75 శాతం మంది శనివారం జరిగిన ఎన్నికల్లో తమ ఓటు వియోగించుకున్నారు. 2022లో చోటుచేసుకున్న ఆర్థిక సంక్షోభం అనంతరం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలు విలక్షమైన తీర్పు ఇచ్చారని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. -
లంకతో తొలి వన్డే.. అందరి కళ్లు సిరాజ్‌పైనే..!
కొలొంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య ఇవాళ (ఆగస్ట్ 2) తొలి వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి స్టార్ ఆడనున్నప్పటికీ.. భారత క్రికెట్ అభిమానుల కళ్లు మాత్రం హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే సిరాజ్‌కు శ్రీలంకపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడి పిచ్‌లపై సిరాజ్ చెలరేగిపోతాడు. ముఖ్యంగా కొలంబోలో సిరాజ్‌కు పట్టపగ్గాలు ఉండవు. ఇక్కడ చివరిగా ఆడిన మ్యాచ్‌లో (ఆసియా కప్ 2023 ఫైనల్లో) మియా నిప్పులు చెరిగాడు. ఆ మ్యాచ్‌లో అతను కేవలం 21 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా శ్రీలంక 50 పరుగులకే కుప్పకూలి, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సిరాజ్ శ్రీలంకతో ఇప్పటిదాకా ఆడిన 6 వన్డేల్లో 7.7 సగటున, 3.5 ఎకానమీతో 19 వికెట్లు పడగొట్టాడు. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ భారత అభిమానులు సిరాజ్ నుంచి మెరుపు ప్రదర్శనను ఆశిస్తున్నారు. సిరాజ్ కొలొంబోలో మరోసారి చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు.ఇదిలా ఉంటే, లంకతో ఇవాల్టి మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. టీమిండియా.. తాజాగా ముగిసిన టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి మాంచి జోష్‌లో ఉండగా.. లంకేయులు.. భారత్‌కు ఎలాగైనా ఓటమి రుచి చూపించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రాకతో టీమిండియా మరింత పటిష్టంగా మారగా.. శ్రీలంకను గాయాల బెడద వేధిస్తుంది. ఆ జట్టు స్టార్ పేసర్లు పతిరణ, మధుషంక గాయాల కారణంగా సిరీస్ మొత్తానికే దూరమయ్యారు.తొలి వన్డేకు భారత తుది జట్టు (అంచనా)..రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా -
కొలొంబోకు చేరుకున్న భారత వన్డే ప్లేయర్లు
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు మాత్రమే ఎంపికైన భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా ఆదివారం రాత్రి కొలొంబోకు చేరుకున్నారు. వీరికి కొలొంబోలోని ఐటీసీ రత్నదీప హోటల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ఇవాళ (జులై 29) సాయంత్రం నుంచి భారత క్రికెటర్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారు. నెట్స్‌లో ప్రాక్టీస్ బాధ్యతలను భారత టీమ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌కు అప్పజెప్పింది. ఇవాళ ఉదయం నాయర్ కొలొంబోలో భారత వన్డే జట్టుతో కలిశాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు పల్లెకెలెలో ఉంది. లంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ నెల 30న జరిగే మూడో టీ20 అనంతరం టీ20 జట్టులో ఉన్న వన్డే జట్టు సభ్యులు రోహిత్ అండ్ కోను కలుస్తారు. ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో టీమిండియా.. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. కొలొంబో వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరం టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా -
కొలొంబో అంటే కోహ్లికి పిచ్చెక్కిపోద్ది..!
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రపంచంలోని కొన్ని మైదానాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. కోహ్లికి మూడ్ వచ్చే మైదానాల్లో కొలొంబోలోని ప్రేమదాస మైదానం ఒకటి. ఇక్కడ టీమిండియా మ్యాచ్ జరిగిందంటే కోహ్లి చెలరేగిపోవడం ఖాయం. కోహ్లి ప్రేమదాసలో ఆడిన 10 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 107.33 సగటున 98.47 స్ట్రయిక్‌రేట్‌తో 644 పరుగులు చేశాడు. కోహ్లి కొలొంబోలో చేసిన నాలుగు సెంచరీలు (128*, 131, 110*, 122*, 3) గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో చేసినవే కావడం విశేషం. కోహ్లికి కొలొంబో అంటే ఎంత పిచ్చో ఈ గణాంకాలు చూస్తే అర్దమవుతుంది.కాగా, కోహ్లి టీమిండియా తరఫున తన తదుపరి మూడు మ్యాచ్‌లు కొలొంబోని ప్రేమదాస మైదానంలోనే ఆడనున్నాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా ఇక్కడే మూడు వన్డేలు జరుగనున్నాయి. లంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం భారత జట్లను నిన్ననే ప్రకటించారు. వన్డేల్లో రోహిత్.. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు సారథ్యం వహించనున్నారు.శ్రీలంకలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లలో తొలుత టీ20లు, ఆతర్వాత వన్డేలు జరుగుతాయి. ఈ నెల 27, 28, 30 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్ కొలొంబోలో జరుగనుంది.భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రింకూ సింగ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా. -
Champions Trophy: పాక్ కాదు.. భారత్ మ్యాచ్‌లకు వేదిక ఇదే?!
వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మరో ఐసీసీ టోర్నీ క్రికెట్ ప్రేమికులకు వినోదం పంచనుంది. గతేడాది వన్డే వరల్డ్‌కప్, ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ జరిగిన విషయం తెలిసిందే.వన్డే ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా అవతరించగా.. టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. ఇక భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో టాప్ సెవన్‌లో నిలిచిన జట్లు చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు అర్హత సాధిస్తాయని ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది.ఇక ఈ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్నట్లు కూడా తెలిపింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు బీసీసీఐ నిరాకరిస్తున్నట్లు సమాచారం.ఆసియా వన్డే కప్-2023 మాదిరే హైబ్రిడ్ విధానంలో ఈ ఈవెంట్‌ను కూడా నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆడే మ్యాచ్‌ల వేదిక గురించి ఐసీసీ చర్చలు జరుతున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో దుబాయ్ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. భారత్ మినహా మిగతా జట్లు ఆడే మ్యాచ్‌లకు పాకిస్తాన్ వేదిక అయితే.. రోహిత్ సేన మాత్రం దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళిక రచించేందుకు ఐసీసీ సుముఖంగా ఉందని సంకేతాలు ఇచ్చింది.కాగా బీసీసీఐ నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఐసీసీ ఈ విషయం గురించి వార్షిక సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. జూలై 19- 22 వరకు కొలంబో వేదికగా జరుగనున్న మీటింగ్‌లో ఈ అంశం గురించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఇక గతేడాది ఆసియా వన్డే కప్ ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ మాత్రం భారత జట్టును అక్కడికి పంపేందుకు నిరాకరించింది.ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడు జై షా సారథ్యంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో ఈ టోర్నీ నిర్వహణకు పచ్చజెండా ఊపింది.భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించేందుకు అనుమతినిచ్చింది. ఇక ఈ టోర్నీలో శ్రీలంక- టీమిండియా ఫైనల్ చేరగా.. రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది.చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లుఆతిథ్య దేశం పాకిస్తాన్ నేరుగా ఈ టోర్నీలో చోటు దక్కించుకోగా.. టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ వన్డే వరల్డ్‌కప్ పాయింట్ల పట్టిక ఆధారంగా అర్హత సాధించాయి.చదవండి: రిటైర్మెంట్పై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
ఉత్తర అమెరికా సౌత్ కరోలినా రాష్ట్రంలోని కొలంబియా పట్టణంలో శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ నెల జూన్ 14,16 తేదీల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రెండు రోజులలోను అంకురార్పణ, సంకల్పం, జలాధివాసం, భూమిపూజ ,విష్ణు సహస్రనామ హోమం, శ్రీ దశావతార హోమం, పుష్పాధివాసం వంటివి పూర్తి అయ్యాయి. మూడవ రోజున సుమారు ఆరు అడుగుల స్వామివారి దివ్య మంగళ విగ్రహం ఆలయంలో కొలువయింది.అదేరోజు స్వామి వారి కళ్యాణం, రధోత్సవం వంటివి భక్తులకు కవివిందు గావించాయి. ఈ మొత్తం కార్యక్రమం విద్వాన్ శ్రీధర శ్రీనివాస భట్టాచార్య, మధుగిరి రాఘవ శ్రీనివాస నారాయణ భట్టార్‌ల నాయకత్వంలో మొత్తం పదకొండుమంది ఋత్విక్కుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, నిర్విఘ్నంగా జరిగింది. సుమారు 70 మంది వలంటీర్లు నెలరోజుల పాటు నిర్విరామంగా పనిచేసి దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ సమర్ధవంతంగా సమకూర్చారు. ప్రతిరోజూ అనేక వందలమంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు . బెంగళూరుకు చెందిన వి మురళి నాయకత్వంలో ముగ్గురు విద్వాంసులతో కూడిన నాదస్వర బృందం ఈ కార్యక్రమం పొడుగునా తమ చక్కని సంగీతంతో స్వామివారిని, భక్తులను అలరించారు. అట్లాంటా నుండి వచ్చిన రామకృష్ణ దంపతులు సాంప్రదాయక, రుచికర భోజనాలు భక్తులకు వండిపెట్టారు. చివరి రోజున ఋత్విక్కులను, వలంటీర్లను ఉచిత రీతిని సత్కరించారు. బాలబాలికల కోసం నిర్వహించిన దశావతార క్విజ్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా, ధర్మ కర్తల మండలి అధ్యక్షులు సత్య శ్రీనివాస దాస కడాలి మాట్లాడుతూ.. అమెరికాలో ఈ ఆలయం మొదటిది, ప్రపంచంలోనే రెండవది అయిన మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణ, కల్కి, శ్రీ వెంకటేశ్వర రూప అంశాలతో కూడిన శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఎంత వైవిధ్య భరితంగానో ఉంది. అలాగే అంతే వైవిధ్యంగా ఆలయం వారు దాదాపు రెండు వేలమందికి విగ్రహ ప్రతిష్ఠాపన ఆహ్వానం, స్వామి వారి అక్షింతలను వాలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించామన్నారు. శ్రీ దశావతార వెంకటేశ్వర దేవస్థానం ఇకనుంచి ఒక పుణ్య తీర్థంగా రూపొంది, దేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుందనే ఆశాభావం వ్యక్తపరిచారు. ఇతర ఆలయ ధర్మకర్తలు డాక్టర్ .లక్ష్మణ్ రావు ఒద్దిరాజు, డా. అమర్నాథ్, ఆనంద్ పాడిరెడ్డి, శరత్ గొర్రెపాటి తదితరులు ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన భక్తులకు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం బాలాలయంగా ఉన్న ఈ దేవస్థానం, ప్రపంచమంతటా ఉన్న స్వామివారి భక్తుల సహాయ సహకారాలతో త్వరలో పూర్తి స్థాయి ఆలయంగా మారటానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకుని, సరికొత్త ప్రాంగణంలో శోభాయమానంగా రూపొందాలని స్థానిక భారతీయులు కోరుకొంటున్నారు.(చదవండి: 'ఆఫ్ బీజేపీ న్యూజెర్సీలో బీజేపీ నేృతృత్వంలోని ఎన్డీఏ గెలుపు సంబరాలు) -
Power Outage: అంధకారంలో శ్రీలంక
కొలంబో: శ్రీలంకలో ఒక్కసారిగా అంధకారం అలుముకుంది. దేశంలో మొత్తం విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాంకేతిక సమస్యలతో పవర్ కట్ జరిగినట్లు ఆ దేశ విద్యుత్ సంస్థ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ (CEB) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే దేశంలో కరెంట్ అంతరాయం కలగటంతో పలు ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు తెలుస్తోంది. Countrywide Power Outage Reported in Sri Lanka 🇱🇰 A widespread power outage struck Sri Lanka, according to a spokesperson from the #Electricity Supply Council who spoke with local media. 1/3 | #SriLanka | #srilankan | pic.twitter.com/u5xBGO8z7E — Sputnik India (@Sputnik_India) December 9, 2023 దేశంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని సీఈబీ సంస్థ ప్రతినిధి నోయెల్ ప్రియాంత తెలిపారు. ఇక మరో వైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #Srilanka countrywide #power outrage is by possible tripping of the main transmission line caused by lightning . NOT possible sabotage as controversial restructuring electricity bill presented parliament yeasterday amidst union protest. pic.twitter.com/SKG4gPVtRe — Vajira Sumedha🐦 🇱🇰 (@vajirasumeda) December 9, 2023 -
వచ్చే ఏడాది అందుబాటులోకి కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్
న్యూఢిల్లీ: శ్రీలంకలో చేపట్టిన కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ (సీడబ్ల్యూఐటీ) తొలి దశ 2024 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రాగలదని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఏపీసెజ్) హోల్ టైమ్ డైరెక్టర్, సీఈవో కరణ్ అదానీ తెలిపారు. ఇందుకోసం ఏర్పాటైన కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని మిగతా భాగస్వాములు తమ వంతు ఈక్విటీని సమకూర్చనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కన్సార్షియంలో ఏపీసెజ్‌తో పాటు శ్రీలంకకు చెందిన జాన్ కీల్స్ హోల్డింగ్స్ (జేకేహెచ్) శ్రీలంక పోర్ట్స్ అథారిటీ (ఎస్ఎల్పీఏ) భాగస్వాములుగా ఉన్నాయి. ఏపీసెజ్‌కు 51 శాతం, మిగతా రెండు భాగస్వామ్య సంస్థలకు కన్సార్షియంలో 49 శాతం వాటాలు ఉన్నాయి. అమెరికాకు చెందిన ఇంటర్నెషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (డీఎఫ్సీ) 553 మిలియన్ డాలర్లు సమకూరుస్తోంది. హిందూ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే అతి పెద్ద నౌకాశ్రయాల్లో కొలంబో పోర్టు ఒకటి. 2021 నుంచి 90 శాతం పైగా సామర్ధ్యంతో పని చేస్తుండటంతో పోర్టును విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు, పశ్చిమ బెంగాల్‌లోని తాజ్పూర్ పోర్టుకు సంబంధించి ఇంకా తమకు కాంట్రాక్టు కేటాయింపు జరగాల్సి ఉందని అదానీ చెప్పారు. కేటాయించాక అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించడానికి 18–24 నెలలు పట్టొచ్చని వివరించారు. -
హైదరాబాద్ నుంచి నేరుగా సింగపూర్, కొలంబోలకు ఫ్లైట్స్: ఇండిగో
హైదరాబాద్ నుంచి ఇకపై నేరుగా సింగపూర్, కొలంబోకు వెళ్లేలా ఇండిగో సంస్థ విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రం నుంచి సింగపూర్, కొలంబోలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఇండిగో తెలిపింది. వీటిలో హైదరాబాద్-సింగపూర్ల మధ్య సర్వీసులు అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 2.50 గంటలకు బయలుదేరనున్న 6ఈ-1027 విమాన సర్వీసు సింగపూర్‌కు ఉదయం 10 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) చేరుకోనుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో రాత్రి 23.25 గంటలకు(సింగపూర్ కాలమాన ప్రకారం) బయలుదేరి హైదరాబాద్‌కు ఉదయం 1.30 గంటలకు చేరుకోనుంది. హైదరాబాద్-కొలంబోల మధ్య అలాగే నవంబర్ 3 నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. 6ఈ-1181 విమాన సర్వీస్ హైదరాబాద్ నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. అయితే ఈ సర్వీస్ వారానికి నాలుగు రోజులు సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ఉంటుందని ఇండిగో తెలిపింది. -
ఇదు శ్రీలంక: శ్రీగంగారామ మహా విహారాయ!
ఈ విహారం శ్రీలంక రాజధాని కొలంబో నగరంలో ఉంది. వ్యవహారంలో ‘గంగారామయ టెంపుల్’ అంటారు కానీ సింహళంలో ‘శ్రీగంగారామ మహా విహారాయ’ అంటారు. మనం ‘విహారం’ అనే పదాన్ని వాళ్లు ‘విహారాయ’ అంటారు. బోధిచెట్టు, విహార మందిరం, సీమ మలక (సన్యాసుల సమావేశ మందిరం)... మూడు నిర్మాణాల సమూహం. మూడింటితోపాటు రెలిక్ కాంప్లెక్స్‌కి కూడా కలిపి ఒకటే టికెట్. శ్రీలంక రూపాయల్లో నాలుగు వందలు. ‘శ్రీ జినరత్న భిక్కు అభ్యాస విద్యాలయ’ పేరుతో రసీదు ఇచ్చారు. ఇది వర్షిప్ అండ్ లెర్నింగ్ సెంటర్. ఈ విహారం ఉన్న ప్రదేశాన్ని ‘జినరత్న రోడ్’ అంటారు. అతిపెద్ద పర్యాటక ప్రదేశం కావడంతో మన ఉచ్చారణలో స్పష్టత లేకపోయినప్పటికీ స్థానిక టాక్సీల వాళ్లు సులువుగా గుర్తించి తీసుకువెళ్తారు. ఇది బెయిరా సరస్సు ఒడ్డున ఉంది. అశోకుడి ధర్మచక్రం గంగారాయ మహా విహారాయలో కూడా తొలి ప్రాధాన్యం బోధివృక్షానిదే. అనూరాధపురాలో ఉన్న శ్రీ మహాబోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ఇక్కడ నాటినట్లు చెబుతారు. ఈ బోధివృక్షం మొదట్లో చెట్టు వేళ్ల మధ్య అవుకాన బుద్ధ విగ్రహం ఉంది. ఆ పైన రెయిలింగ్‌తో కూడిన బేస్మెంట్ మీద అశోకుని ధర్మచక్రం. నోరు తెరిచి గర్జిస్తున్న నాలుగు సింహాల విగ్రహం ఉంది. లోపలికి వెళ్తే బుద్ధుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టలేం. బుద్ధుడికి మకరతోరణంలా అమర్చిన ఏనుగు దంతాలను గమనించడం మర్చిపోకూడదు. నిలువెత్తు దంతాలవి. మనం ఆ దంతాల పక్కన నిలబడితే దంతాలే మనకంటే ఎత్తు ఉంటాయి. ఇక మ్యూజియంలోకి అడుగుపెడితే అది మరో ప్రపంచం. కనువిందు చేసే ప్రదేశమంటే ఇదేననిపిస్తుంది. అల్మరాల్లో పాలరాతి బుద్ధుడి విగ్రహాలు వరుసగా పేర్చి ఉన్నాయి. వాలుగా కూర్చుని ఉన్న భంగిమలో అర అడుగు విగ్రహాలు షోరూమ్‌లో అమ్మకానికి పెట్టినట్లున్నాయి. కింది వరుసలో నిలబడిన బుద్ధుడి రాతి విగ్రహాలు, వాటి మధ్యలో నాలుగడుగుల ఒకింత పెద్ద విగ్రహాలు... ఒక థీమ్ ప్రకారం అమర్చి ఉన్నాయి. మరో ర్యాక్‌లో కూడా బుద్ధుడి విగ్రహాల అమరిక అలాగే ఉంది కానీ మధ్యలో పెద్ద నటరాజు విగ్రహం ఉంది. బహుశా శ్రీలంకలో శైవం ప్రాచుర్యంలో ఉండడంతో బుద్ధుడిలో ఈశ్వరుడిని కూడా చూస్తున్నట్లుంది. మరకత బుద్ధుడు ఒకటిన్నర అడుగుల ఎత్తు, అడుగు వెడల్పు ఉన్న జాతి పచ్చ రాయిలో చెక్కిన విగ్రహం అది. ఏకరాతిని బుద్ధుడి రూపంలో చెక్కి, సర్వాలంకార భూతుడిని చేశారు. ఒంటి నిండా ఆభరణాలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది. మరికొన్ని షెల్ఫుల్లో అరడుగు రూబీ (కెంపు) బుద్ధుడి విగ్రహాలు, గోమేధికం బుద్ధుడి విగ్రహాలున్నాయి. బుద్ధుడు ఆహారం తీసుకోనప్పుడు దేహం శుష్కించి పోయిన రూపాన్ని ప్రతిబింబించే విగ్రహం ఒక ఆశ్చర్యం. డొక్క ఎండిపోయిన లోహపు బుద్ధుడి విగ్రహం అన్నమాట. ముఖంలో సన్నని గీతలు కూడా డీటెయిల్డ్‌గా కనిపిస్తాయి. ఒక అల్మరాలో ఒక ఇత్తడి పాత్రలో ఇరవయ్యవ శతాబ్దం నాటి నాణేలున్నాయి. నాణేల్లో ఎక్కువ భాగం ఇత్తడివే. బ్రిటిష్ కాలంలోనూ స్వాతంత్య్రానంతరం మనదేశంలో చెలామణిలో ఉన్న నాణేలను పోలి ఉన్నాయవి. శయన బుద్ధుడు, చైనా బుద్ధుడు, సునిశితమైన చిత్రాలతో ఐదున్నర అడుగుల పింగాణి కూజాలు, అల్మెరాల్లో వెండి– బంగారు పాత్రలు, తొండం ఎత్తి ఘీంకరిస్తున్న ఏనుగులు, పడగెత్తిన వెండి నాగుపాములు కూడా లెక్కకు మించి ఉన్నాయి. లోహపు మారేడుదళం, పూలసజ్జలను చూస్తుంటే సాంస్కృతికంగా మన దక్షిణ భారత దేశానికి – శ్రీలంకకు మధ్య అవినాభావ బంధం ఉందనిపిస్తుంది. జినరతన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ విభాగంలో ఉన్న లైబ్రరీ విశాలమైనది. ప్రపంచంలోని బౌద్ధ సాహిత్యం అంతా ఇక్కడ ఉంది. బెయిరా సరస్సులో రెలిక్ ప్రధాన విహారానికి ఒకవైపు నిలువెత్తు బ్రాస్వాల్ మీద బుద్ధుడి జీవితంలో దశలు, జాతక కథల కుడ్యశిల్పాలున్నాయి. రోడ్డు దాటి సరస్సు వైపు వస్తే అందులో బుద్ధుడి రెలిక్ కాంప్లెక్స్ ఉంది. అది సాంస్కృతికతను ఒడిసి పట్టిన అత్యంత అధునాతన నిర్మాణం. ఇక్కడ ఉంచిన రెలిక్ ఏమిటన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోయారు. రెలిక్ అని మాత్రమే చెబుతున్నారు. ఆవరణలో బుద్ధుడి విగ్రహాల వరుస ఉంది. మరో విషయం... ప్రపంచంలో అత్యంత భారీ విగ్రహంగా రికార్డు సాధించిన బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహానికి ప్రతీకాత్మక రూపం ఇక్కడ ఉంది. బోరోబుదూర్ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, కాబట్టి ఇప్పుడు ఇక్కడి రూపాన్ని చూసి సంతృప్తి చెందవచ్చు. బౌద్ధం నడిపించిన సమాజం శ్రీలంక. మనుషులు అత్యంత స్నేహపూర్వకంగా, మితభాషులుగా కనిపించారు. మరో విషయం ఇక్కడ సావనీర్ షాప్‌లో బుద్ధుడి జ్ఞాపికలతోపాటు ముత్యాల ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే దుకాణదారులు వాటి నాణ్యత విషయంలో స్పష్టత ఇవ్వలేకపోయారు. జాగ్రత్తగా కొనుగోలు చేయడం మంచిది. – వాకా మంజులారెడ్డి సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి (చదవండి: ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!) -
ఇదు శ్రీలంక: కేలనియా మహా విహారాయ!
శ్రీలంకకు రాముడు ఒకసారి వెళ్తే బుద్ధుడు మూడుసార్లు వెళ్లాడు. మూడవసారి శ్రీలంక పర్యటనలో బుద్ధుడు అడుగుపెట్టిన ప్రదేశం కేలనియా ఆలయం. శ్రీలంకలో చరిత్రను చారిత్రక ఆధారాలతో డాక్యుమెంట్ చేయడం కంటే సాహిత్యం ఆధారంగా, అది కూడా ధార్మిక గ్రంథాల ఆధారంగా గతంలో ఆ నేల మీద ఏం జరిగిందో తెలుసుకోవడమే జరిగింది. నాటి సంస్కృతిని సంప్రదాయాల ఆధారంగా చరిత్రను అంచనా వేయాల్సి వచ్చింది. చిత్రాల్లో బుద్ధుడు శ్రీలంకలో కేలనియా గంగా నది తీరాన కొలంబో నగరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది కేలనియా మహా విహారాయ. విశాలమైన ఆలయ ప్రాంగణంలో పెద్ద బోధివక్షం, ఆ వృక్షం మొదట్లో భారీ ధవళ బుద్ధుడి విగ్రహం. కేలనియా మహా విహారాయ అద్భుతమైన శిల్పకళానైపుణ్యంతో కూడిన నిర్మాణం. అంతకంటే ఎక్కువగా ఈ ఆలయం అద్భుతమైన చిత్రాలకు నెలవు. గోడలు, పై కప్పు నిండా పెయింటింగ్సే. ఒక్కొక్కటి ఒక్కో సంఘటనను ప్రతిబింబిస్తుంది. బుద్ధుడు శ్రీలంకలో అడుగుపెట్టడం, త్రిపీటకాలను బోధించడం, అష్టాంగమార్గాలను విశదపరచి సమ్యక్ జీవనం దిశగా నడిపించడం, స్థానిక రాజులు బుద్ధుడికి అనుచరులుగా మారిపోవడం, సామాన్యులు బుద్ధుడిని చూడడానికి ఆతృత పడడం, బుద్ధుడి మాటలతో చైతన్యవంతమై వికసిత వదనాలతో సన్మార్గదారులవడం... వంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మరొక ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రాల్లో విభీషణుడి జీవితంలో ముఖ్యమైన విభీషణుడి పట్టాభిషేకం ఘట్టం కూడా ఉంది. విభీషణుడి రాజభవనం కేలనియా నది తీరాన ఉన్నట్లు వాల్మీకి రామాయణంలో ఉందని చెబుతారు. ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం కూడా ఉంది. విభీషణుడిని సింహళీయులు విభీషణ్ దేవయా అని పిలుచుకుంటూ ప్రాచీనకాలంలో తమను పరిరక్షించిన దేవుడిగా కొలుస్తారు. విభీషణుడిని రాజుగా ప్రకటిస్తూ పట్టాభిషేకం చేసిన ప్రదేశం కేలనియా ఆలయ ప్రాంగణమేనని కూడా చెబుతారు. వాతావరణానికి అనువుగా నిర్మాణాలు! బౌద్ధ ప్రార్థనామందిరాల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది. మన దుస్తులు భుజాలు, మోకాళ్లను కప్పేటట్లు ఉండాలి. అలా లేకపోతే ఆలయ ప్రాంగణంలో చున్నీ వంటి వస్త్రాన్ని ఇస్తారు. దాంతో భుజాలను కప్పుకోవాలి. మోకాళ్లు కనిపించే డ్రస్ అయితే ఆ వస్త్రాన్ని లుంగీలాగా చుట్టుకోవాలి. శ్రీలంక దీవి సతత హరితారణ్యాల నిలయం కావడంలో వర్షాలు అధికం. వర్షపు నీరు ఇంటి పై భాగాన నిలవ కుండా జారిపోవడానికి వీలుగా స్లాంట్ రూఫ్ ఉంటుంది. ఈ ఆలయం కూడా ఎర్ర పెంకుతో వాలు కప్పు నిర్మాణమే. దీనికి పక్కనే ఇదే ప్రాంగణంలో తెల్లగా మెరిసిపోతూ బౌద్ధ స్థూపం ఉంది. కేలనియా ఆలయంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ బుద్ధుడి విగ్రహానికి తల మీద బంగారు రంగులో లోహపు త్రిశూలం ఉంది. బుద్ధుడి వెనుక నీలాకాశం, తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ పర్వతాలను పోలిన నేపథ్యం ఉంది. స్థానికులు బుద్ధుడిని శివలింగం పూలతో పూజిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించే ప్రమిదల పెద్ద పెద్ద స్టాండులు నూనె ఓడుతూ ఉన్నాయి. కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు కూడా. కార్తీక మాసంలో మనదేశంలో శివాలయాల్లో కనిపించే దృశ్యం అన్నమాట. ధార్మికత సాధనలో ఎవరికి తోచిన మార్గం వారిది. 2,500 ఏళ్ల నాటి జ్ఞాపకాలకు ఆనవాలు కేలనియా మహావిహారాయ. భారతదేశం– శ్రీలంకల మధ్య వికసించిన మైత్రిబంధానికి ప్రతీక ఈ ఆలయం. వీటికి ప్రత్యక్ష సాక్షి ఆలయ ప్రాంగణంలో బోధివృక్షం. సింహళీయుల ఆత్మీయత తాజాగా తెలంగాణ రాష్ట్రం– శ్రీలంకలను కలుపుతున్న బౌద్ధం పరస్పర సహకారంతో పరిఢవిల్లనుంది. మనవాళ్లను చూడగానే సింహళీయులు ‘ఇండియన్స్’ అని చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూస్తారు. తెలుగు వాళ్ల మీద కూడా వారికి ప్రత్యేకమైన అభిమానం వ్యక్తమవుతుంది. శ్రీలంకతో ప్రాచీన తెలుగుబంధం బుద్ధఘోషుడి రూపంలో ఏర్పడింది. ఈ ఆలయంలోని చిత్రాల్లో బుద్ధఘోషుడు తాను రాసిన విశుద్ధమగ్గ గ్రంథాన్ని శిష్యుడికి అందిస్తున్న పెయింటింగ్‌ని కూడా చూడవచ్చు. సింహళులు ఇష్టంగా అనుసరించే ధార్మికత బౌద్ధం పుట్టింది భారతదేశంలోనే కాబట్టి వారు భారతీయుల పట్ల ఆత్మీయంగా ఉంటారు. సోదర ప్రేమను పంచుతారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు స్థానికులు తెలుగువారిని దక్షిణాది వారన్నట్లు తక్కువగా చూడడం ఎవరూ కాదనలేని సత్యం. శ్రీలంక సింహళీయులు మాత్రం బౌద్ధంతో మనతో బంధాన్ని కలుపుకుంటారు. సింహళీయుల ఆత్మీయత మనల్ని కట్టిపడేస్తుంది. – వాకా మంజులా రెడ్డి (చదవండి: రివర్ సఫారీ! శ్రీదీవిలో దీవుల మధ్య విహారం) -
నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్
ఆసియా కప్2023లో భారత ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ సిరాజ్ హీరోగా మారిపోయాడు. హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్ మొహమ్మద్ సిరాజ్ వీరవిహారంతో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత జట్టు సభ్యుడిగా టైటిల్ సాధించడంలో మియాన్ మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు తన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 5000డాలర్ల ప్రైజ్ మనీని కొలంబో గ్రౌండ్ స్టాఫ్‌కి విరాళంగా ప్రకటించి మరింత ఎత్తుకు ఎదిగాడు. దీంతో సిరాజ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వేత్త, ఎం అండ్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. నువ్వు క్లాస్ బాసూ అన్న రీతిలో స్పందించారు. ‘‘ఒకటే మాట.. క్లాస్.. అంతే .. ఈ క్లాస్ అనేది ఇది మీ సంపద లేదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు. మీ బ్యాక్ గ్రౌండ్ అనే దాన్నుంచి రాదు.. అది మీలోనే ఉంటుంది’’ అంటూ ట్విట్ చేశారు. 2021లో మహీంద్ర థార్ గిఫ్ట్ ఇదే మ్యాచ్‌లో సిరాజ్ వన్ మ్యాన్ షోపై కూడా ఆనంద్ మహీంద్ర స్పందించారు. అయితే ఈ రైజింగ్ స్టార్‌కు దయచేసి ఎస్యూవీ ఇచ్చేయండి సార్ అంటూ ఒక యూజర్ కోరగా, 2021లో మహీంద్రా థార్ ఇచ్చిన సంగతిని గుర్తుచేస్తూ బదులిచ్చారు. కాగా ఆసియా కప్ ఫైనల్లో టీమ్ ఇండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆసియా కప్ విజేతగా నిలిచాన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవర్లో 4 వికెట్లు, 10 బంతుల వ్యవధిలో 5 వికెట్లు సాధించడం అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. Just one word: CLASS. It doesn’t come from your wealth or your background. It comes from within…. https://t.co/hi8X9u4z1O — anand mahindra (@anandmahindra) September 17, 2023 -
Asia Cup: కొలంబోలో ఎడతెగని వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం! ఇక..
Asia Cup 2023: కొలంబోలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఆసియా క్రికెట్ మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొలంబోలో వర్షాల నేపథ్యంలో ఆసియా కప్-2023 ఫైనల్ వేదికను మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ వన్డే టోర్నీని నిర్వహించేందుకు పాకిస్తాన్ ఆతిథ్య హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ససేమిరా ఒప్పుకోలేదు. ఈ క్రమంలో అనేక చర్చల తర్వాత శ్రీలంకతో కలిసి పాకిస్తాన్ హైబ్రిడ్ విధానంలో ఆసియా కప్ నిర్వహణకు అంగీకరించింది. శ్రీలంకతో కలిసి సంయుక్తంగా పాక్ భారత జట్టు ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగేందుకు వీలుగా ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్ స్టేజీలో వివిధ వేదికల్లో నిర్వహించిన మ్యాచ్‌లలో గ్రూప్-ఏ నుంచి టీమిండియా, పాకిస్తాన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి. ఇప్పటికే చిరకాల ప్రత్యర్థుల పోరు వర్షార్పణం అయితే, కొలంబోలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పల్లెకెల్లెలో దాయాదుల మ్యాచ్ వర్షార్పణం కావడంతో.. ఆదివారం నాటి భారత్- పాక్ పోరుకు రిజర్వ్ డే కేటాయించారు. చిరకాల ప్రత్యర్థుల పోటీ నేపథ్యంలో ఏసీసీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ వరుణుడు కరుణించే అవకాశాలు కనిపించడం లేదు. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఆదివారం 24.1 ఓవర్ల టీమిండియా స్కోరు 147/2 వద్ద ఉండగా ఆటకు ఆటంకం కలిగించిన వర్షం.. సోమవారం కూడా అడ్డంకిగా మారింది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ గంట తర్వాత కూడా ఇంకా ఆరంభం కాలేదు. ఫైనల్ ఒక్కటే కాదు.. ఆ మ్యాచ్‌ల వేదికలోనూ మార్పులు? ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫైనల్ వేదిక మార్పుపై ఏసీసీ దృష్టి సారించినట్లు సమాచారం. వాస్తవానికి కొలంబోలో సెప్టెంబరు 17న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆరోజు కూడా వర్షం ముప్పు సూచనలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్యాండీలోని పల్లెకెల్లె స్టేడియంలో ఫైనల్ నిర్వహణకు ఏసీసీ మొగ్గుచూపుతున్నట్లు టైమ్స్‌నౌ తన కథనంలో పేర్కొంది. మిగిలిన మ్యాచ్‌ల(భారత్- శ్రీలంక, పాక్- శ్రీలంక, భారత్- బంగ్లాదేశ్) మ్యాచ్‌ల వేదికలు కూడా మార్చే యోచనలో ఉన్నట్లు మరో జాతీయ మీడియా పేర్కొంది. చదవండి: చిక్కుల్లో పాక్ క్రికెట్ జట్టు.. ఐసీసీ సీరియస్! ఏమైందంటే? -
కొలంబోలో చివరగా టీమిండియా ఎప్పుడు ఆడిందంటే? అప్పుడు సంజూ!
ఆసియాకప్-2023లో మరో రసవత్తర పోరుకు సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-4లో భాగంగా ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ మధ్యహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. కాగా దాయాదుల పోరుకు ఈ సారి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌డేను ఏసీసీ కేటాయించడం అభిమానులకు ఊరట కలిగించే విషయం. ఇక చిరకాల ప్రత్యర్థితో పోరుకు ముందు కొలంబో మైదానంలో భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లూక్కేద్దం. ఆఖరి మ్యాచ్‌లో ఘోర ఓటమి.. శ్రీలంకలోని అతిపెద్ద క్రికెట్ మైదానాలలో ఒకటి ప్రేమదాస స్టేడియం ఒకటి. భారత జట్టు ఇప్పటి వరకు ఈ మైదానంలో 46 వన్డేలు ఆడింది. అందులో 23 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 16 సందర్భాల్లో భారత్ ఓటమి పాలైంది. మరో నాలుగు వన్డేల్లో ఎటువంటి ఫలితం తేలలేదు. ఈ స్టేడియంలో టీమిండియా చివరగా వన్డే మ్యాచ్ 2021 జూలైలో ఆడింది. మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు లంక పర్యటనకు ఆ ఏడాది భారత జట్టు వెళ్లింది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. కానీ కొలంబో వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌తోనే టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 225 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో పృథ్వీ షా(49), సంజూ శాంసన్(46) పరుగులతో రాణించారు. అనంతరం 226 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి లంక ఛేదించింది. చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా! -
Asia Cup 2023: కొలొంబోలో భారీ వర్షాలు.. ఏసీసీ కీలక నిర్ణయం..!
ఆసియా కప్-2023 సూపర్-4 మ్యాచ్‌లకు వేదిక అయిన కొలొంబోలో భారీ వర్షాలు కురుస్తాయన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. వేదికను కొలొంబో నుంచి డంబుల్లా లేదా హంబన్‌తోటకు మార్చాలని ఏసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై రెండు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సూపర్-4 దశలో మొదటి మ్యాచ్ (సెప్టెంబర్ 6, లాహోర్) మినహాయించి, మిగతా మ్యాచ్‌లన్నిటికీ కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. సూపర్-4 మ్యాచ్‌లతో పాటు సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే వేదికగా జరగాల్సి ఉంది. కొలొంబో వాతావరణ శాఖ వారి తాజా హెచ్చరికల నేపథ్యంలో వేదిక మార్చే అంశాన్ని ఏసీసీ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, భారత్, పాక్‌ల మధ్య పల్లెకెలెలో నిన్న (సెప్టెంబర్ 2) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, సూపర్-4 దశలో భారత్-పాక్‌లు మరోసారి (సెప్టెంబర్ 10) తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకునే ఏసీసీ వేదిక మార్పు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్-నేపాల్‌ల మధ్య రేపు జరగాల్సిన మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా టీమిండియా సూపర్-4కు చేరుకుంటుంది. రేపటి మ్యాచ్‌లో ఏదైనా అద్భుతం జరిగి నేపాల్ గెలిస్తే పాక్‌తో పాటు ఆ జట్టే సూపర్-4కు చేరుకుంటుంది. ఇది ఎలాగూ సాధ్యపడే విషయం కాదు కాబట్టి, సూపర్-4లో మరోసారి భారత్-పాక్ మ్యాచ్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. -
తుస్సుమన్న బాబర్ ఆజమ్.. తిప్పేసిన అనామక బౌలర్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ నిన్న (జులై 30) ప్రారంభమైంది. కొలొంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. తౌహిద్ హ్రిదోయ్ (39 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. A few moments from the opening ceremony earlier this evening.#LPL2023 #LiveTheAction pic.twitter.com/QlczC1FX4Y — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 నిషాన్ మధుష్క (12), గుర్భాజ్ (21), అసలంక (12), ప్రియమల్ పెరీర (22) రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో దునిత్ వెల్లలగే (25 నాటౌట్), కెప్టెన్ తిసార పెరీరా (14 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో జాఫ్నా కింగ్స్ ఓ మోస్తరు స్కోర్‌ను ప్రత్యర్ధి ముందు ఉంచగలిగింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. As promised, a spectacular opening ceremony and one to remember for a long time! Here are a few clicks. #LPL2023 #LiveTheAction pic.twitter.com/sY3FsYdQ6k — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 The young star from Bangladesh took on a powerful bowling attack like a boss, and constructed a spirited half century! #LPL2023 #LiveTheAction pic.twitter.com/kHiAwvwTWF — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తిప్పేసిన అనామక బౌలర్.. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొలొంబో.. జాఫ్నా బౌలర్, అనామక కుర్రాడు విజయకాంత్ వియాస్కాంత్ (4-0-17-2) మాయాజాలం ధాటికి 19.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. విజయకాంత్‌తో పాటు హర్దుస్ విల్జోయెన్ (3/31), దిల్షన్ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించడంతో కొలొంబో టీమ్ ఓ మోస్తరు స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. Jaffna Kings stars shine bright with the ball! #LPL2023 #LiveTheAction pic.twitter.com/mxfUmeGa0T — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తుస్సుమన్న బాబర్ ఆజమ్.. జాఫ్నాతో పోలిస్తే చాలా రెట్టు పటిష్టమైన కొలొంబో స్ట్రయికర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్ నిరోషన్ డిక్వెల్లా (34 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) ఒక్కడు అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తుస్సుమన్నాడు. తిసార పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన అనంతరం బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన నిస్సంక (1), ఫెర్నాండో (17), మహ్మద్ నవాజ్ (3), యశోధ లంక (11), నసీం షా (0), పతిరణ (8) నిరాశపరచగా.. తమిక కరుణరత్నే (23) పర్వాలేదనిపించాడు. Dickwella came back with a bang this season and showcased his batting prowess! He was a one-man army!#LPL2023 #LiveTheAction pic.twitter.com/rcfL5IeJir — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 -
లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి ఓపెనర్‌గా..
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీతో మెరిశాడు. 322 బంతులెదుర్కొన్న షఫీక్ 19 ఫోర్లు, 4 సిక్సర్లతో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా టెస్టు క్రికెట్లో అబ్దుల్లా షఫీక్‌కు ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం. కాగా 23 ఏళ్ల వయసున్న అబ్దుల్లా షఫీక్ పాక్ తరపున డబుల్ సెంచరీ బాదిన మూడో యంగెస్ట్ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకముందు జావెద్ మియాందాద్, హనీఫ్ మొహమ్మద్‌లు ఈ ఘనత సాధించారు. ఇక లంక గడ్డపై డబుల్ సెంచరీ బాదిన తొలి పాక్ ఓపెనర్‌గానూ అబ్దుల్లా షఫీక్ చరిత్రకెక్కాడు. A true champion knock 🔥❤️ 200 hundred from @imabd28 #SLvPAK #SLvsPAK #AbdullahShafique pic.twitter.com/c2m4ldK3m8 — Mir kashi👑 (@oya_kojuu) July 26, 2023 ఇక రెండో టెస్టులో పాకిస్తాన్ పట్టు బిగిస్తోంది. ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన పాక్ సిరీస్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి 458 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్‌కు(200 నాటౌట్) అగా సల్మాన్(80 బంతుల్లో 70 బ్యాటింగ్) చక్కగా సహకరిస్తున్నాడు. ఆశితో ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూరియా ఒక వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ 292 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజులు సమయం ఉండడం.. వరుణుడు అడ్డుపడకపోతే మాత్రం పాకిస్తాన్ విజయాన్ని ఆపడం లంకకు కష్టసాధ్యమనే చెప్పొచ్చు. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 166 పరుగులకే కుప్పకూలింది.ధనుంజయ డిసిల్వా 57, దినేశ్ చండిమల్ 34 మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు, షాహిన్ అఫ్రిది ఒక వికెట్ తీశాడు. 🌟 First visiting opener to score a double 💯 at SSC, Colombo 🌟 Third-youngest double-centurion for 🇵🇰 after Javed Miandad and Hanif Mohammad@imabd28 scores a magnificent maiden double ton 🙌#SLvPAK pic.twitter.com/3zGaD0pnKl — Pakistan Cricket (@TheRealPCB) July 26, 2023 Maiden Double Hundred - Take a bow, Abdullah Shafique! 🌟 He is now the third youngest Pakistan batter to score a Test double ton after Javed Miandad and Hanif Mohammad 💯👌#CricketTwitter #SLvPAK #WTC25 #PakBall #abdullahshafique pic.twitter.com/QvRxprwC7J — CricWick (@CricWick) July 26, 2023 చదవండి: Saud Shakeel: అజేయ డబుల్ సెంచరీతో అదరగొట్టి.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు! Abdullah Shafique: సెంచరీతో మెరిసిన పాక్ ఓపెనర్.. భారీ ఆధిక్యం దిశగా -
శ్రీలంకలో మళ్లీ ఆందోళనలు.. విక్రమ సింఘేకూ ‘గొటబయ’ పరిస్థితే!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలాకనిపించటం లేదు. ఇటీవలే ఏర్పడిన కొత్త ప్రభుత్వంపైనా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ రాజధాని కొలంబోలో బుధవారం వందల మంది ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షుడు రణీల్ విక్రమ సింఘేకు వ్యతిరేకంగా ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స పరిస్థితి ప్రస్తుత ప్రెసిడెంట్‌కూ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనలను విపక్ష పార్టీలు, వాణిజ్య సంఘాలు, పౌర హక్కుల గ్రూప్‌లు సంయుక్తంగా నిర్వహించాయి. నగరంలోని అధ్యక్ష నివాసం, ఇతర మంత్రుల నివాసలు ఉన్న ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ‘ప్రజలు మూడుపూటల కడుపునిండా తినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సాయం చేయకపోగా.. భారీగా పన్నులు విధిస్తోంది. దీనికి పరిష్కారం కావాలి. అందుకోసం పోరాడుతూనే ఉంటాం.’అని టీచర్స్ యూనియన్ సెక్రెటరీ జోసేఫ్ స్టాలిన్ తెలిపారు. ఈ ఏడాది శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి చమురు, ఆహార పదార్థాలు, కుకింగ్ గ్యాస్, ఔషధాల వంటి నిత్యావసరాల దిగుమతులకు సైతం డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరుకుంది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుని గత జూలైలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత రణీల్ విక్రమ సింఘే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆయన నవంబర్ 14న తొలి బడ్జెన్‌ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పన్నుల పెంపు సహా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు మళ్లీ ఆందోళనబాట పడుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం వందల మంది కొలంబోలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా పట్టుకుని ‘రణీల్ గో హోమ్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అణచివేసేందుకు తీవ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. ఇదీ చదవండి: GOA New Rules: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
‘శాఫ్’ ఫుట్‌బాల్ చాంప్ భారత్
న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 సాకర్ చాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిలు టైటిల్ నిలబెట్టుకున్నారు. కొలంబోలో గురువారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 4–0తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. బాబి సింగ్ (18వ ని.), కొరవ్ సింగ్ (30వ ని.), కెప్టెన్ వాన్లల్‌పెక గీటే (63వ ని.), అమన్ (90+4వ ని.) తలా ఒక గోల్ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. లీగ్ దశలో నేపాల్ చేతిలో 1–3తో ఎదురైన పరాజయానికి ఫైనల్లో అసాధారణ ప్రదర్శనతో ప్రతీకారం తీర్చుకున్నారు. -
శ్రీలంక కొత్త ప్రధానికి మోదీ లేఖ.. భారత్ మద్దతుకు భరోసా!
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ప్రధానిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు దినేశ్ గుణవర్దెన. ఈ క్రమంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. ఆ దేశం ఆర్థికంగా పుంజుకుంటుందని, ప్రజల జీవనం సాధారణ స్థితికి వస్తుందని ఆకాంక్షించారు. ఈ మేరకు కొలంబోలోని భారత్ హైకమిషన్ ట్వీట్ చేసింది. ‘ప్రధాని గుణవర్ధెనకు భారత ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. తమ పొరుగు దేశమైనందున శ్రీలంక ప్రజలకు భారత్ నుంచి మద్దతు కొనసాగుతుందని భరోసా కల్పించారు. అలాగే.. ఆర్థికంగా త్వరగా పుంజుకుంటుందని, సుసపన్నత, ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందని ఆకాంక్షించారు.’ అని పేర్కొంది హైకమిషన్. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్రీలంకకు సాయం చేయటంలో భారత్ ఎప్పుడూ ముందుంటుంది. అవసరమైన సమయంలో సాయం చేసే దేశాల జాబితాలో కచ్చితంగా ఉంటుంది. 2022 ప్రారంభం నుంచి శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రజలకు నిత్యావసరాలు సైతం దొరకనంత దుర్భర పరిస్థితి నెలకొంది. ప్రజాగ్రహంతో గొటబయ రాజపక్స రాజీనామా చేయగా.. రణీల్ విక్రమ సింఘే ఆ పదవిని చేపట్టారు. ప్రధానిగా దినేశ్ గుణవర్ధెనను నియమించారు. ఇదీ చదవండి: Gotabaya Rajapaksa: సింగపూర్‌లో ‘గొటబయ’కు ఊహించని షాక్.. క్రిమినల్ కేసు నమోదు! -
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో జోక్యంపై ప్రచారం.. భారత్ రియాక్షన్ ఇదే..
కొలంబో: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అక్కడి నాయకులను ప్రభావితం చేసేందుకు భారత్ ప్రయత్నించిందని విదేశీ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలను కొలంబోలోని భారత హైకమిషన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార, కల్పిత ఆరోపణలని తేల్చి చెప్పింది. ఈమేరకు ట్విట్టర్లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. 'శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు ఎలాంటి ప్రమేయం లేదు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవం, కల్పితం. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ ఎప్పుడూ అండగానే ఉంటుంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలు, రాజ్యాంగ ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకోదు' అని కొలంబోలోని భారత హైకమిషన్ ట్వీట్ చేసింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం వీడి మాల్దీవులకు పారిపోయినప్పుడు కూడా భారత్ సహకరించిందని శ్రీలంక మీడియాలో వార్తలొచ్చాయి. అప్పుడు కూడా భారత హైకమిషన్ స్పందించింది. అదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేసింది. శ్రీలంక పార్లమెంటులో నూతన అధ్యక్ష ఎన్నికలు బుధవారం జరిగాయి. తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేనే విజయం సాధించారు. మొత్తం 225 మంది సభ్యులకు గానూ ఆయనకు అనుకూలంగా 134 ఓట్లు వచ్చాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
శ్రీలంక మహిళల దుస్థితి.. బుక్కెడు బువ్వ, మందుల కోసం సెక్స్ వర్కర్లుగా..
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని అల్లాడిపోతోంది శ్రీలంక. ప్రజలు తినడానికి తిండిలేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది . ఇప్పుడు అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నాయి. కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి 'ఆయుర్వేద స్పా'ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొస్తున్నాయి. ఇటీవల వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెక్స్ వర్కర్లుగా చేరుతున్న మహిళల సంఖ్య 30 శాతం వృద్ధి చెందింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు వీరంతా వస్త్రపరిశ్రమ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ఈ ఊబిలోకి దిగుతున్నట్లు ఓ మహిళ చెప్పింది. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.28,000 నుంచి 35,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని ఆమె పేర్కొంది. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులకు అండగా ఉండేందుకు మహిళలు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని శ్రీలంక సెక్స్ వర్కర్ల న్యాయవాద సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అషిల దండేనియా తెలిపారు. దేశంలో ఇతర వృత్తులతో పోల్చితే వ్యభిచారంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించవచ్చనే వాళ్లు ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిత్యావసరాల కోసం.. నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆహారం, ఔషధాల కోసం కొంతమంది మహిళలు దుకాణ యజమానులతో శృంగారంలో పాల్గొంటున్నారనే విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కొలంబో పారిశ్రామిక ప్రాంతాలు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి చోట్ల పోలీసుల సహకారంతో వ్యభిచారం జరుగుతున్నట్లు నివేదికలు బహిర్గతం చేశాయి. వ్యభిచారం సాఫీగా చేసుకునేందుకు కొంతమంది బ్రోకర్లు మహిళలను పోలీసులతో బలవంతంగా శృంగారంలో పాల్గొనేలా చేస్తున్నట్లు వెల్లడించాయి. చదవండి: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే -
'శ్రీలంక కోలుకునే వరకు భారత్ సాయం చేస్తూనే ఉంటుంది'
కొలంబో: తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది శ్రీలంక. ఈ నేపథ్యంలో కొలంబోలోని భారత హైకమిషనర్.. పార్లమెంటు స్పీకర్‌ను శనివారం ఉదయం కలిశారు. కష్టాల్లో ఉన్న లంకకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సంక్షోభ సమయంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిన పార్లమెంటు పాత్రను కొనియాడారు. చదవండి: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘే ప్రమాణం శ్రీలంక ఆర్థికంగా కోలుకునేందుకు, దేశంలో స్థిరత్వం నెలకొనేవరకు భారత్ సాయం కొనసాగిస్తుందని హైకమిషనర్ పేర్కొన్నారు. ఈమేరకు కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం ట్వీట్ చేసింది. శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబయ రాజీనామ చేసి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టిన మరునాడే ఈ సమావేశం జరిగింది. High Commissioner called on Hon’ble Speaker today morning. Appreciated Parliament's role in upholding democracy and Constitutional framework, especially at this crucial juncture. Conveyed that 🇮🇳 will continue to be supportive of democracy, stability and economic recovery in 🇱🇰. pic.twitter.com/apXeVWCnMA — India in Sri Lanka (@IndiainSL) July 16, 2022 -
శ్రీలంక: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్
కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. #WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf — ANI (@ANI) July 15, 2022 ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror (File photos) pic.twitter.com/xg290lfmLX — ANI (@ANI) July 15, 2022 కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా, మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు. -
శ్రీలంక నుంచి గొటబాయ జంప్, భారత్‌పై ఆరోపణలు.. హైకమిషన్ రియాక్షన్ ఏంటంటే?
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కుటుంబంతో సహా బుధవారం వేకువజూమునే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. అయితే ఆ తర్వాత కాసేపటికే ఆయన పారిపోయేందుకు భారత్ సహకరించిందని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం స్పందించింది. ఈ వార్తలు నిరాధారం, కల్పితమైనవని కొట్టి పారేసేంది. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్ సాయం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈమేరకు ట్వీట్ చేసింది. High Commission categorically denies baseless and speculative media reports that India facilitated the recent reported travel of @gotabayar @Realbrajapaksa out of Sri Lanka. It is reiterated that India will continue to support the people of Sri Lanka (1/2) — India in Sri Lanka (@IndiainSL) July 13, 2022 మరోవైపు శ్రీలంక రక్షణ శాఖ నుంచి అవసరమైన అన్ని అనుమతులు లభించిన తర్వాతే గొటబాయ, ఆయన భార్య సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లారని సైన్యం వెల్లడించింది. మొదట మాలెలో దిగేందుకు అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ అనుమతి ఇవ్వలేదని, అయితే మాల్దీవుల పార్లమెంటు స్పీకర్ మజ్లిస్, మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ జోక్యం చేసుకుని గొటబాయ విమానం ల్యాండ్ అయ్యేందుకు మార్గం సుగమం చేశారని తెలిపారు. ఆంటొనొవ్ సైనిక విమానంలోనే గొటబాయ దేశం విడిచినట్లు ధ్రువీకరించారు. మంగళవారమే దేశం విడిచి పారిపోవాలనుకున్న గొటబాయకు ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది సహకరించలేదు. దీంతో ప్రత్యేక సైనిక విమానం ఏర్పాటు చేసుకుని బుధవారం వేకువజామునే మాల్దీవులకు వెళ్లారు. చదవండి: గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి.. చివరికి సైనిక విమానంలో.. -
గొటబాయకు ఎయిర్‌పోర్టులో అవమానం.. అరెస్టుకు భయపడి చివరికి...
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పారిపోయారు. ఆంటోనోవ్ 32 అనే సైనిక విమానంలో బుధవారం వేకువ జామున ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తోంది. గొటబాయతో పాటు ఆయన సతీమణి, బాడీగార్డులు కలిపి మొత్తం నలుగురు ఈ విమానంలో దేశం దాటారు. గొటబాయ కుటుంబం మాల్దీవులకు వెళ్లిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. వారి పాసుపోర్టులపై స్టాంపులు వేసినట్లు పేర్కొన్నారు. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జులై 13న రాజీనామా చేస్తానని ప్రకటించారు గొటబాయ. సరిగ్గా అదే రోజు దేశం విడిచి పారిపోయారు. అధ్యక్ష హోదాలో ఉన్నప్పుడు గొటబాయను అరెస్టు చేయడానికి వీల్లేదు. రాజీనామా చేసిన తర్వాత తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే అంతకంటే ముందే ఆయన దేశం వీడి పారిపోయినట్లు తెలుస్తోంది. తన కుటుంబాన్ని వెళ్లినిస్తేనే రాజీనామా చేస్తానని గొటబాయ అధికారులకు చెప్పినట్లు సమాచారం. 24 గంటలు గొడవ గొటబాయ సోమవారమే వాణిజ్య విమానంలో దుబాయ్ పారిపోవాలని ప్రయత్నించారు. అయితే ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సిబ్బంది అతన్ని వీఐపీ టర్మినల్ ద్వారా వెళ్లనిచ్చేందుకు నిరాకరించారు. సాధారణ ప్రజల్లా పబ్లిక్ కౌంటర్ నుంచే రావాలని సూచించారు. జనం తమను చూస్తే ఎక్కడ దాడి చేస్తారో అనే భయంతో ఆయన పబ్లిక్ కౌంటర్ వైపు వెళ్లలేదు. 24 గంటలు వేచి చూసినా ఫలితం లేకపోవడంతో అవమానంతోనే వెనుదిరిగారు. చివరకు సైనిక విమానంలో బుధవారం వేకువజామున దేశం వీడారు. చదవండి: కళ్లుగప్పి పారిపోవాలనుకున్న శ్రీలంక మాజీ మంత్రి.. ఎయిర్‌పోర్టు సిబ్బంది గుర్తుపట్టడంతో.. -
అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ
Stop Adani BY Citizens held a protest in Sri Lankas: శ్రీలంక విద్యుత్ బోర్డు చీఫ్ చేసిన సంచలన వ్యాఖ్యలతో రాజుకున్న గొడవ కాస్త ముదిరి పెనువివాదంగా మారింది. ఆయన.. మన్నార్ జిల్లాలోని ఎనర్జీ ప్రాజెక్టుని అదానీ గ్రూప్‌కి ఇచ్చేలా భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని, ఆ విషయాన్ని స్వయంగా రాజపక్స చెప్పారంటూ.. అనుచితన వ్యాఖ్యలు చేశాడు. ఐతే ఆ తర్వాత ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం, పదవికి రాజీనామ చేయడం అయిపోయనప్పటికీ ఆ వివాదం కార్చిచ్చులా రాజుకుంటోంది. ఈ మేరకు శ్రీలంకలోని కొలంబోలో నిరసనకారులు అదాని గ్రూప్‌కి మన్నార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ని ఇవ్వొద్దంటూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స చీకటి ఒప్పందంతో అదానీ గ్రూప్‌కి ఇచ్చేయాలనకుంటున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకనే ఎటువంటి పోటీ బిడ్డింగ్ ప్రక్రియ జరపకుండా అదానీ గ్రూప్‌కి ఈ ప్రాజెక్ట్‌ని కట్టబెట్టేందుకే ఈ అసంబంధమైన ఒప్పందం చేసుకున్నారంటూ నిరసనకారుల విరుచుకుపడ్డారు. ఈ మేరకు శ్రీలంకలోని కొంతమంది నినరసకారులు స్టాప్ అదానీ అంటూ... సోషల్ మీడియా వేదికగా కూడా అదానీ గ్రూప్‌కి వ్యతిరేకంగా నిరసన పిలుపునిచ్చారు. ఈ మేరకు నిరసకారలు మాట్లాడుతూ..."మేము పునరుత్పాధకతను వ్యతిరేకించడం లేదని స్థిరమైన పర్యావరణం కోసం పాటుపడుతున్నాం . ఇంధన ప్రాజెక్టుల పోటీ బిడ్డింగ్ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఉన్న చట్టవిరుద్ధ కార్యకలాపాలు, ప్రాజెక్టుల కారణంగా మా దేశ సహజ నిల్వలు క్షీణిస్తున్నాయి. పైగా పర్యావరణానికి ముప్పు కలిగించే చీకటి ఒప్పందాలను మేము అనుమతించలేం. ప్రస్తుతం శ్రీలంక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, దానికి కచ్చితమైన పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాం. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అవినీతికి మాత్రం తావివ్వం అని నిరసనకారులు నొక్కి చెప్పారు". ఈ క్రమంలో అదానీ గ్రూప్ ప్రతినిధి మాట్లాడుతూ..."శ్రీలంకలో పెట్టుబడుల పెట్టడంతో మా ఉద్దేశం పొరుగు దేశ అవసరాలను తీర్చడమే కాకుండా బాధ్యతాయుతమైన కార్పొరేటర్‌గా ఇరు దేశాల మధ్య భాగస్వామ్య సంబంధాలు పెంపొందింప చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశాం. అయినా ఈ సమస్య శ్రీలంక పార్లమెంట్‌లోనే పరిష్కరింపబడినప్పటికీ... ఇది ఒక పెను వివాదంగా మారడం మమల్ని చాలా నిరాశకు గురిచేసింది." అని చెప్పారు. ఐతే ఈ ఆరోపణలపై భారత్ స్పందించకపోవడం గమనార్హం. (చదవండి: సారీ.. ఏదో భావోద్వేగంలో భారత ప్రధాని పేరు చెప్పా!. ఆరోపణల్లో నిజం లేదు) -
గొటబయకు ఊరట.. అవిశ్వాసంపై తక్షణ చర్చకు పార్లమెంట్ నో
కొలంబో: లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు మంగళవారం పార్లమెంట్లో ఊరట లభించింది. ఆయనపై అవిశ్వాసాన్ని వెంటనే చర్చించాలన్న ప్రతిపక్షాల వాదనను పార్లమెంట్ తిరస్కరించింది. రాజపక్సేను అభిశంసిచేందుకు తక్షణం చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్ష తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సుమంత్రిన్ ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా 119 మంది, అనుకూలంగా 68 మంది ఎంపీలు ఓటువేశారు. మరోవైపు డిప్యుటీ స్పీకర్ ఎన్నికలో ప్రభుత్వ మద్దతున్న శ్రీలంక పొడుజన పెరుమున అభ్యర్థి అజిత్ రాజపక్సే గెలుపొందారు. ఆయనకు అనుకూలంగా 109 ఓట్లు, ప్రత్యర్థికి 78 ఓట్లు వచ్చాయి. ఎన్నిక సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. మహింద రాజపక్సే రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. విక్రమసింఘేపై విమర్శలు అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా పధ్రాని రణిల్ విక్రమసింఘే ఓటు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘‘అధ్యక్షుడిని ఎవరు కాపాడుతున్నారో, మిమ్మల్ని ఎవరు కాపాడుతున్నారో దేశమంతా చూస్తోంది.’’ అని సుమింత్రన్ దుయ్యబట్టారు. పదవి కోసం రణిల్ తన నైతికతను అమ్ముకున్నారన్నారు. ఆయన ఒక తోలుబొమ్మ అని ప్రధాన ప్రతిపక్ష నేత కవిరత్న విమర్శించారు. రణిల్ చర్యను ఆయన పార్టీ సమర్ధించింది. అధ్యక్షుడిని కాపాడుతున్న ఎంపీల నిజస్వరూపాన్ని ఓటింగ్ బయటపెట్టిందని మానవహక్కుల కార్యకర్త భవానీ ఫొన్సెకా విమర్శించారు. దేశంలో స్కూళ్లను మంగళవారం నుంచి పునఃప్రారంభిస్తున్నారు. కర్ఫ్యూను తొలగిస్తామని, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!) -
జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు: మంత్రి గుడివాడ
సాక్షి, విశాఖపట్నం: దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందన్నారు. 18 లక్షలు మంది ప్రయాణికులు పోకలు సాగిస్తున్నారన్నారు. మలేసియా, బ్యాంకాక్, సింగపూర్‌లకు విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందన్నారు. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. చదవండి: ఏది నిజం: ఐదేళ్ల లూటీ ఆగిందనా మంట.. రామోజీ? దావోస్‌లో 18 అంశాలపై సదస్సు జరుగుతుందని, వీటిలో 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు. వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్య, ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బీచ్ ఐటీ అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామని.. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటికి బీజం పడిందని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మరింత ప్రగతి సాధిస్తోందని, బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందని పేర్కొన్నారు. -
శ్రీలంక: మహింద రాజపక్సకు భారీ షాక్
కొలంబో: శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారంటూ స్థానిక మీడియాలు కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన తనయుడు నమల్, రాజపక్స మిత్రపక్షాలకు చెందిన సభ్యులను దేశం విడిచి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రధాని భవనం టెంపుల్ ట్రీస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు.. ఆ తర్వాత చెలరేగిన హింస మీద దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఇదిలా ఉంటే.. సోమవారం మహింద రాజీనామా ప్రకటన నేపథ్యంలో హైడ్రామా జరిగింది. ఆయన మద్ధతుదారులు.. నిరసనకారుల మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత హింస చెలరేగింది. ఈ హింసలో ఇప్పటిదాకా తొమ్మిది మంది మరణించగా(అనధికారికంగా ఇంకా ఎక్కువే!).. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ లంక రక్షణ శాఖ. మరోవైపు రాజీనామా హైడ్రామా నడిపిన మహింద రాజపక్స, ఆపై చెలరేగిన హింసతో నిజంగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆపై కుటుంబం, అనుచర గణంతో నేవీ బేస్‌లో తలదాచుకున్నారాయన. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు.. రాజపక్స కుటుంబం, బంధువులు, అనుచరణ గణానికి చెందిన ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. మరోవైపు మహీంద, ఆయన మద్దతుదారులు దేశం విడిచిపారిపోకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నిరసనకారులు.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తరుణంలో దేశం దాటిపోకుండా కోర్టు నిషేధం విధించడం విశేషం.\ చదవండి: గొటబయా రాజపక్స కీలక ప్రకటన -
లంక దహనం
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై సోమవారం ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. మహింద ఇంటితో పాటు రాజపక్సల పూర్వీకుల ఇంటిని కూడా తగలబెట్టారు. మంత్రులు, మాజీ మంత్రుల ఇళ్లపైనా దాడులకు దిగారు. వాటికి నిప్పు పెట్టారు. నిరసనకారులు చుట్టుముట్టడంతో అధికార పార్టీ ఎంపీ ఒకరు తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స (76) పదవి నుంచి తప్పుకున్నారు. దేశమంతటా కర్ఫ్యూ విధించారు. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా కట్టుతప్పింది. దేశ ఆర్థిక పతనానికి ప్రభుత్వమే కారణమంటూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు నిరసన చేస్తున్న వారిపై ప్రధాని మహింద నివాస సమీపంలో ఆయన అనుచరులు దాడికి దిగారు. నిరసనకారుల టెంట్లు, ప్లకార్డులను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించినా లాభం లేకపోయింది. ఈ ఘర్షణల్లో 170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారు. దాంతో జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. కొలంబో నుంచి తిరిగి వెళ్తున్న రాజపక్సల మద్దతుదారులపై విరుచుకుపడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దొరికిని వారిని దొరికినట్టు చితకబాదారు. అంతేగాక దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులపై, రాజపక్స మద్దతుదారులపై నిరసనకారులు దాడులకు దిగారు. కురునెగలలోని ప్రధాని మహింద నివాసంతో పాటు హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల నివాసానికి కూడా నిప్పు పెట్టారు. హంబన్‌టోటలో మహింద, గొటబయల డీఏ రాజపక్స జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకాన్ని కూడా ధ్వంసం చేశారు. వాయవ్య శ్రీలంకలోని నిట్టంబువాలో అధికార శ్రీలంక పొడుజన పెరమున (ఎల్ఎల్పీపీ) ఎంపీ అమరకీర్తి (57) కారును అడ్డగించారు. ఆయన తన రివాల్వర్‌తో కాల్పులకు దిగడంతో ఒక నిరసనకారుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆగ్రహించిన నిరనసకారులు వెంబడించడంతో ఎంపీ దగ్గర్లోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా భవనాన్ని చుట్టుముట్టి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. భయాందోళనలకు లోనైన ఎంపీ తుపాకీతో కాల్చుకుని చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆయన భద్రతాధికారి కూడా మరణించాడు. కురునెగలలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండోపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆయన నివాసాలకు, హోటల్‌కు నిప్పుపెట్టారు. నెగొంబోలోని మరో మాజీ మంత్రి నిమల్ లాంజా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మొరటువా మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో ఇంటికి కూడా నిప్పుపెట్టారు. కొలంబోలోనూ ఘర్షణలు తారస్థాయికి చేరాయి. అధ్యక్ష భ వనం ముందు నిరసనకారులపై దాడికి నేతృ త్వం వహించిన అధికార పార్టీ కార్మిక విభాగం నేత మహింద కహందగమగె ఇంటిపై దాడి జరిగింది. ఘర్షణలు దేశవ్యాప్తంగా పలు పలుచోట్ల కాల్పులకు దారితీశాయి. వాటిలో కనీసం ఇద్దరు మరణించగా 9 మంది గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. కొలంబోలో రంగంలోకి సైన్యం ఘర్షణలు చెలరేగిన కొద్ది గంటలకే ప్రధాని మహింద అధ్యక్షునికి రాజీనామా లేఖ పంపారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో మంత్రివర్గమూ రద్దయింది. అల్లర్లపై గొటబయ, మహింద విచారం వెలిబుచ్చారు. ‘‘హింసకు హింస పరిష్కారం కాదు. ప్రజలు సంయమనం పాటించాలి’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే మహిందే తనవారిని ఆందోళనకారులపై దాడులకు దిగేలా రెచ్చగొట్టారని విపక్షాలు దుయ్యబట్టాయి. మాజీ అధ్యక్షుడు ప్రేమదాసపైనా వారు దాడులకు దిగారని ఆరోపించాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా పోలీసులకు సెలవులను రద్దు చేశారు. రాజపక్స సోదరుల అస్తవ్యస్త విధానాలతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తెలిసిందే. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటడమే గాక నిత్యావసరాల ధరలు చుక్కలను కూడా దాటేశాయి. దాంతో జనం కన్నెర్రజేశారు. రాజపక్స సోదరులు అధికారం నుంచి తప్పుకోవాలంటూ ఏప్రిల్ 9న దేశవ్యాప్తంగా వీధులకెక్కారు. అప్పటి నుంచి నెల రోజులుగా ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. Footage of Government supporters assaulting protester at "GotaGoGama" pic.twitter.com/nAxkbQi1nX — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 9, 2022 ఇది కూడా చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్ మస్క్ సంచలన ట్వీట్ -
శ్రీలంక: ఐదు వారాల్లో రెండోసారి ఎమర్జెన్సీ విధింపు
కొలంబో: శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయా రాజపక్స అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇది అమలులోకి వచ్చింది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంక గడ్డపై ఐదువారాల్లో రెండోసారి ఇది ఎమర్జెన్సీ ప్రకటించడం. ఎమర్జెన్సీ ద్వారా పోలీసులకు, భద్రతా సిబ్బందికి ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయి. ఎవరినైనా నిర్బంధించేందుకు, అరెస్టు చేసేందుకు వీలుంటుంది. అధ్యక్షుడు గొటబయా Gotabaya Rajapaksa తక్షణం రాజీనామా చేయలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం గమనార్హం. మరోవైపు గోటబయా రాజీనామాను డిమాండ్ చేస్తూ వేల మంది విద్యార్థులు పార్లమెంట్ ముట్టడికి ఉపక్రమించారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా సిబ్బంది టియర్‌గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. ఇంకోపక్క.. దేశంలోని ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిర్వహించిన సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. దాదాపుగా రైలు సర్వీసులన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రైవేట్ యాజమాన్యంలోని బస్సులు రోడ్లపైకి రాలేదు, పారిశ్రామిక కార్మికులు తమ ఫ్యాక్టరీల వెలుపల ప్రదర్శనలు చేశారు. అప్పుల ఊబిలోకి నెట్టేసిన చేతకానీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నల్లజెండాలు ఎగరేశారు. చదవండి: అప్పుల కుప్ప .. అంతా రాజపక్సల మాయ! -
కొలంబో స్టాక్ మార్కెట్ క్లోజ్!
దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఐదు రోజుల పాటు కొలంబో స్టాక్ ఎక్సేంజ్‌ని మూసివేయాలని సెక్యూరిటీస్ ఎక్సేంజ్ కమిషనర్ (ఎస్ఈసీ) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2022 ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 22 వరకు కొలంబో స్టాక్ ఎక్సేంజీలో ఎటువంటి లావాదేవీలు జరగవు. దేశంలో నెలకొన్ని ఆర్థిక గడ్డు పరిస్థితులపై ఇన్వెస్టర్లకు ఒక అవగాహన ఏర్పడుతుందని ఎస్ఈసీ అభిప్రాయ పడింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడితప్పింది. వివిద దేశాలు, అంతర్థాతీయ ఆర్థిక సంస్థల నుంచి తెచ్చిన సుమారు 8 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించలేమంటూ అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు ఆర్థికంగా తమ దేశాలను ఆదుకోవాలనే విజ్ఞప్తులు సైతం చేస్తోంది. మరోవైపు ఈ సంక్షోభానికి కారణమైన ప్రభుత్వం దిగిపోవాలంటూ ప్రతిపక్షాలు, పౌరులు నిర్విరామంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చదవండి: శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. భారీగా వడ్డీరేట్ల పెంపు -
శ్రీలంకలో ఇంధన రేషనింగ్
కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఇంధనం విక్రయాలపై పరిమితులు విధించారు. తాజా రేషన్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచి్చందని శ్రీలంక ప్రభుత్వం అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. దీని ప్రకారం టూ వీలర్లకు రూ.వెయ్యి, త్రీ వీలర్లకు రూ.1,500, కార్లు, వ్యాన్లు, జీప్‌లకు రూ.5,000 మేరకే పెట్రోల్, డీజిల్ పోస్తారు. వాణిజ్య వాహనాలను రేషన్ నుంచి మినహాయించారు. విద్యుత్ కోతలు కూడా రోజుకు 12 గంటలపాటు అమలవుతున్నాయి. తీవ్ర వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు భారత్‌ను శ్రీలంక సాయం కోరింది. రుణ రూపేణా వంటగ్యాస్‌ను సరఫరా చేయాలని భారత్‌ను అభ్యర్థించినట్లు ప్రభుత్వ రంగ లిట్రో గ్యాస్ కంపెనీ చైర్మన్ తెషార జయసింఘే తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ భారత హైకమిషన్ ద్వారా మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి తనకు సహకారం అందడంలేదని, తనపై గ్యాస్ మాఫియా ఒత్తిడి పెరుగుతున్నందున బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన అధ్యక్షుడు గొటబయకు రాజీనామా లేఖ పంపించారు. శ్రీలంక రూపాయి విలువ పతనం కావడంతో అత్యవసరాలకు సైతం తీవ్ర కొరత ఏర్పడింది. 2019 ఏప్రిల్ 21న ఈస్టర్ నాటి బాంబు పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ క్రికెటర్ ధమ్మిక ప్రసాద్ శుక్రవారం 24 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో మూడు చర్చిల్లో జరిగిన ఆరు బాంబు పేలుళ్లలో 269 మంది చనిపోయారు. -
మా వల్ల కాదు.. కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ లంక ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రధాని గద్దెదిగిపోవాలంటూ ప్రధాని కార్యాలయం ఎదుట నిరసనల నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చేతగానీ పాలనతో దేశాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిన ప్రధాని మహీందా రాజపక్సే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, తన సోదరుడు అధ్యక్షుడైన గోటబయ రాజపక్సతో సహా పదవుల నుంచి దిగిపోవాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ప్రధాని నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని భరించడం తమ వల్ల కాదంటూ నినాదాలు చేశారు. అవినీతి ద్వారా కూడబెట్టిన డబ్బును తక్షణమే బయటకు తేవాలని, సంక్షోభం నుంచి లంకను బయటపడేయాలంటూ రాజపక్స కుటుంబాన్ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులను అడ్డగించిన భద్రతా సిబ్బంది.. ప్రధాని నివాసం చుట్టూ భారీ వలయంగా ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా.. దేశం కోసం నినాదంతో మహీంద రాజపక్స తీసుకొచ్చిన కొన్ని నిర్ణయాలు లంక పాలిట శాపంగా పరిణమించాయి. కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రధాన ఆదాయంవచ్చే టూరిజం ఘోరంగా దెబ్బతినగా.. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి పెరిగిన ధరలు, నిత్యావసరాలు, మందుల కొరతతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. చదవండి: చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు.. కష్టాల నుంచి లంక గట్టేక్కేనా? -
Sri Lanka: లంక పెను సంక్షోభం.. హింసాత్మకం!
శ్రీ లంక పెను ఆర్థిక సంక్షోభం హింసాత్మకంగా మారుతోంది. అధ్యక్ష భవనం ప్రజా ముట్టడిలో రణరంగాన్ని తలపించింది. గురువారం అర్ధరాత్రి చెలరేగిన హింసలో ఓ పోలీస్ వాహానానికి నిప్పు అంటించడంతో పాటు పలు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రతిగా పోలీసులు జరిపిన దాడిలో పలువురు పౌరులు గాయపడినట్లు తెలుస్తోంది. శ్రీ లంకను ప్రస్తుతం పెను ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. కరోనా నుంచి మొదలైన ఈ పరిస్థితి.. ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంది. టూరిజానికి భారీ దెబ్బ పడడం, అప్పుల ఊబిలో చిక్కుకుపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీటికి తోడు మార్చి 2020లో దిగుమతుల్ని నిషేధిస్తూ.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లంక పాలిట శాపంగా మారింది. ఫారిన్‌కరెన్సీని పొదుపు చేసి.. 51 బిలియన్ డాలర్ల అప్పుల్ని తీర్చాలన్న ప్రభుత్వ ఆలోచన బెడిసి కొట్టింది. నిత్యావసరాల కొరత, నిజంగానే ఆకాశాన్ని అంటిన ధరలు.. ఆఖరికి మంచి నీళ్లు కూడా బ్లాక్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. పేపర్లు లేక పిల్లల పరీక్షలను సైతం వాయిదా వేశారంటే.. లంక సంక్షోభాన్ని అంచనా వేసుకోవచ్చు. మరోవైపు సరుకుల కోసం దొపిడీలకు పాల్పడుతున్నారు పలువురు పౌరులు. పరిస్థితులు తట్టుకోలేక దేశం దాటి పోతున్నారు మరికొందరు. అయితే ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడినా కూడా అధ్యక్షుడు గోటబయ రాజపక్స Gotabaya Rajapaksa పట్టన్నట్లు ఉండడంపై ప్రజాగ్రహాం పెల్లుబిక్కింది. గురువారం అర్ధరాత్రి ర్యాలీగా వెళ్లిన వేల మంది.. కొలంబోలోని అధ్యక్ష భవనం ముందు చేరి నిరసనలు చేపట్టారు. రాజీనామా డిమాండ్ నినాదాలతో హోరెత్తించారు. ఒకానొక తరుణంలో ఐదు వేలమందికి పైగా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు నిరసనకారుల్ని నిలువరించే ప్రయత్నం చేయగా.. హింస చెలరేగింది. పోలీసుల మీదకు రాళ్లు, బాటిళ్లు రువ్వారు నిరసనకారులు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. పోలీసులను ప్రతిఘటిస్తూ.. రాత్రంతా అధ్యక్ష భవనం ముందే నిరసన వ్యక్తం చేస్తూ ఉండిపోయారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. పోలీసుల ప్రతిదాడిలో పలువురు పౌరులు గాయాలపాలయ్యారు. అయితే నిరసన సమయంలో అధ్యక్షుడు ఇంట్లో లేడని తెలుస్తోంది. ఆయన రహస్య ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘర్షణకు సంబంధించి 45 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరిస్థితిని అడ్డుకుని ఉండకపోతే అధ్యక్ష భవనంపై దాడి చేసేవాళ్లని తెలిపారు. కుటుంబ పాలనతో సర్వనాశనం చేస్తున్నాడంటూ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడు కాగా, అతని సోదరుడు మహీంద రాజపక్సా ప్రధానిగా ఉన్నాడు. మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను నిర్వహిస్తున్నాడు. పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా ఉన్నాడు. డీజిల్ కొరతతో 22 మిలియన్ల మంది 13 గంటలపాటు చీకట్లో ఉండిపోయారు. వేల కొద్దీ వాహనాలు రోడ్ల మీదే నిలిచిపోయాయి. మందులు లేక ఆపరేషన్లను సైతం ఆపేశారు. గత కొన్ని రోజులుగా లంక దుర్భేద్యమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. అయితే బయటి దేశాల నుంచి అప్పులు తెచ్చి అయినా సరే పరిస్థితిని అదుపులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటనలు విడుదల చేస్తోంది. -
చహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్
-
IND Vs SL: చహల్, గౌతమ్‌లకు కరోనా పాజిటివ్
కొలంబో: టీ20 సిరీస్ ఓటమితో బాధలో ఉన్న భారత జట్టుకు మరోషాక్ తగిలింది. తాజాగా భారత స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, కె. గౌతమ్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్, గౌతమ్‌లు క్వారంటైన్లో ఉన్నారు. కాగా రెండో టీ20 మ్యాచ్‌కు ముందు కృనాల్ పాండ్యా కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. కృనాల్‌తో క్లోజ్‌గా ఉన్న 8 మందిని క్వారంటైన్‌కు తరలించగా.. అందులో చహల్, గౌతమ్‌లు కూడా ఉన్నారు. తాజాగా వీరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను దక్కించుకున్న భారత్ టీ20 సిరీస్‌లో మాత్రం అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయింది. మొదటి టీ20 మ్యాచ్ నెగ్గిన టీమిండియా తర్వాత వరుసగా రెండు, మూడు టీ20 మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయింది. అయితే ఐపీఎల్‌కు ఇంకా సమయం ఉండడంతో ఆటగాళ్లంతా ప్రస్తుతం కొద్దిరోజులు లంకలోనే ఉండనున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల అనంతరం నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లను స్వదేశానికి పంపించి.. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను లంకలోనే ఉంచనున్నారు. ఇక ఐపీఎల్ 14వ సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. ఆ తర్వాత అదే గడ్డపై టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియా సీనియర్ జట్టు ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. -
నోరు జారిన రాహుల్ చహర్; కూల్‌గా డీల్ చేసిన లంక బ్యాట్స్‌మన్
కొలంబో: టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ వికెట్ తీసిన ఆనందంలో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై నోరు జారాడు. అయితే బ్యాట్స్‌మన్ మాత్రం చహర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయకుండా బ్యాట్‌పై తన చేతిని కొడుతూ అతని బౌలింగ్‌ను ప్రశంసించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. లంక ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌ను రాహుల్ చహర్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హసరంగ ఫోర్ బాదాడు. అయితే ఆ తర్వాతి బంతిని కూడా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. అక్కడే ఉన్న భువనేశ్వర్ దానిని క్యాచ్‌గా అందుకున్నాడు. దీంతో వికెట్ తీశానన్న ఆనందంలో రాహుల్ చహర్ హసరంగ వైపు కోపంగా చూస్తూ ''వెళ్లు'' అన్నట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కానీ హసరంగా చహర్‌ను లైట్ తీసుకొని తన బ్యాట్‌ను కొడుతూ ''మంచి డెలివరీ'' అంటూ నవ్వుతూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చహర్ చర్యపై సీరియస్ కానీ హసరంగను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. '' చహర్ సహనం కోల్పోయినా.. నువ్వు కోల్పోలేదు.. క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన హసరంగకు కంగ్రాట్స్'' అంటూ కామెంట్ చేశారు. ఈ మ్యాచ్‌లో చహర్ 4 ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 40 పరుగలుతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇరు జట్లకు కీలకంగా మారిన చివరి టీ20 నేడు జరగనుంది. Wanindu Hasaranga upholds the Spirit of the Game! 👏🏽 Tune into Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV (https://t.co/QYC4z57UgI) now! 📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #WaninduHasaranga pic.twitter.com/0CwCaTkkAS — Sony Sports (@SonySportsIndia) July 28, 2021 -
ద్రవిడ్ సూచన; గ్రౌండ్లోకి చిట్టీతో వెళ్లిన సందీప్ వారియర్
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. లోస్కోరింగ్ నమోదైన ఈ మ్యాచ్‌లో చివర్లో కాస్త ఉత్కంఠ రేపినా విజయం లంకనే వరించింది. అయితే లంక ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ 12వ ఆటగాడైన సందీప్ వారియర్‌కు చిట్టీని ఇచ్చి గ్రౌండ్‌కు పంపించడం ఆసక్తికరంగా మారింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. అప్పటికి లంక 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈలోగా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు బెయిల్స్ తీసి మ్యాచ్‌ను కాసేపు నిలిపివేశారు. గ్రౌండ్‌మెన్లు కూడా పిచ్‌పై కవర్ కప్పేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ద్రవిడ్ సూచనలు చేసిన ఒక చిట్టీని సందీప్ వారియర్ చేతిలో పెట్టాడు. అతను దాన్ని తీసుకొని గ్రౌండ్లోకి వెళ్లి శిఖర్ ధావన్‌కు అందించాడు. ఆ చిట్టీలో ద్రవిడ్ ఏం పంపాడనేది ఆసక్తి కలిగించింది. వాస్తవానికి ఆ చిట్టీలో డక్‌వర్త్ లూయిస్ గురించి రాసినట్లు సమాచారం. వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ జరిగే అవకాశముందని భావించిన ద్రవిడ్ దానికి తగ్గ ప్రణాళికలు చిట్టీలో రాసి పంపించినట్లు తెలిసింది. అయితే కాసేపటికే వర్షం ఆగిపోవడంతో మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించగా.. లంక లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 40; 5 ఫోర్లు), తొలి మ్యాచ్ ఆడిన దేవ్‌దత్ పడిక్కల్ (23 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్), రుతురాజ్ గైక్వాడ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించారు. అకిల ధనంజయ రెం డు వికెట్లు తీశాడు. అనంతరం ఛేజింగ్‌లో శ్రీలంక 19.4 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసి గెలుపొందింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధనంజయ డిసిల్వా (34 బంతుల్లో 40 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), చమిక కరుణరత్నే (6 బంతుల్లో 12 నాటౌట్; 1 సిక్స్) కడదాక క్రీజులో నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో సమమైంది. నేడే సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టి20 జరగనుంది. -
Ind Vs Sl 3rd ODI: 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే!
కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా బ్యాటింగ్ కొనసాగుతోంది. కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులకే అవుట్ కాగా.. మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్ పృథ్వీ షా(49), సంజూ శాంసన్(46) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉండగా వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారింది. ఇదిలా ఉండగా.. సంజూ శాంసన్, గౌతం, రాహుల్ చహర్, నితీశ్ రాణా, చేతన్ సకారియా తదితర భారత క్రికెటర్లు ఈ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇలా ఒకేసారి ఐదుగురు టీమిండియా ప్లేయర్లు వన్డే క్యాపులు అందుకోవడం 1980 తర్వాత ఇదే తొలిసారి. గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా... అప్పటి ఆటగాళ్లు దిలీప్ దోషి, కీర్తి ఆజాద్, రోజర్ బిన్నీ, సందీప్ పాటిల్, తిరుమలై శ్రీనివాసన్ అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ... ‘‘సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత టీమిండియా ఇలాంటి సాహసానికి పూనుకుంది. ఒకే మ్యాచ్‌లో ఐదుగురు కొత్త ఆటగాళ్లకు స్వాగతం పలికింది. నామమాత్రపు మ్యాచ్ అయినా సరే, యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కల్పించింది. ఆల్ ది బెస్ట్ అందరికీ’’ అంటూ అభిమానులు అరంగేట్ర ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక మహిళల క్రికెట్ విషయానికొస్తే... గత నెలలో ఇంగ్లండ్ టూర్లో భాగంగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, షఫాలీ వర్మ, తాన్యా భాటియా, స్నేహా రానా భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశారు. కాగా శిఖర్ ధావన్ సారథ్యంలో భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చివరిదైన మూడో వన్డేలో భారీ మార్పులతో బరిలోకి దిగింది. టీమిండియా ప్రస్తుత స్కోరు- 147/3 (23) Five players are making their ODI debut for India today – Sanju Samson, Nitish Rana, Rahul Chahar, Chetan Sakariya and K Gowtham 👏#SLvINDpic.twitter.com/q6NYWV4W9N — ICC (@ICC) July 23, 2021 -
వరుస ఓటములు.. శ్రీలంకకు మరో భారీ షాక్!
కొలంబో: టీమిండియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పొంది.. సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంకకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రంజన్.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. అయితే శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఒక్కో పాయింట్ కోత విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ఒక్క ఓవర్ తక్కువగా వేసిన శ్రీలంక ఓ పాయింట్‌ను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ (69) దెబ్బకి అనూహ్యరీతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం మూడో వన్డే జరగనుంది. -
మ్యాచ్ విజయం; ద్రవిడ్ ఎమోషనల్ స్పీచ్ వైరల్
కొలంబో: శ్రీలంకపై రెండో వన్డే విజయం అనంతరం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూంలోఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ విజయం చాలా గొప్పదని.. మ్యాచ్‌లో అందరు మంచి ప్రదర్శన కనబరిచారని తెలిపాడు. ద్రవిడ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ వైరల్‌గా మారింది. ద్రవిడ్ వ్యాఖ్యలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసుకుంది. ద్రవిడ్ మాట్లాడుతూ.. ''వాళ్లు ఈ మ్యాచ్‌లో బాగా ఆడారు.. కానీ సరైన సమయంలో మనం ఒక చాంపియన్ టీమ్‌లా ఆడాం. ఓటమి కోరల్లో నుంచి బయటపడేందుకు దృడ సంకల్పంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుంజుకున్నాం. ఇది గొప్ప విజయం.. వెల్డన్ బాయ్స్. ఒక దశలో ఒత్తిడి లోనైన నేను మ్యాచ్ ఎటు పోతుందో అర్థం చేసుకోలేకపోయా. కానీ ఈ విజయం మనకు ఇంకో పది మ్యాచ్‌ల వరకు మంచి బూస్టప్ ఇస్తుంది. ఇక ఒత్తిడిని తట్టుకుంటూ చహర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి భువనేశ్వర్ సహకరించిన తీరు కూడా బాగుంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేద్దాం'' అంటూ చెప్పుకొచ్చాడు. దీపక్ చహర్‌ను అభినందిస్తున్న కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. From raw emotions to Rahul Dravid's stirring dressing room speech 🗣️🗣️@28anand & @ameyatilak go behind the scenes to get you reactions from #TeamIndia's 🇮🇳 thrilling win over Sri Lanka in Colombo 🔥 👌 #SLvIND DO NOT MISS THIS! Full video 🎥 👇https://t.co/j2NjZwZLkk pic.twitter.com/iQMPOudAmw — BCCI (@BCCI) July 21, 2021 -
ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలనేది కల.. ఈరోజుతో నెరవేరింది
కొలంబో: ''ఈ ప్రదర్శనే నేను కలగన్నది.. ఈరోజుతో నెరవేరింది.. అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మంచి ఇన్నింగ్స్ ఆడాను.. దేశానికి విజయం అందించడం గర్విస్తున్నా'' అంటూ దీపక్ చహర్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అందుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్‌తో అభిమానులకు హీరోగా మారిపోయాడు. దీపక్ చహర్ ఈ ఇన్నింగ్స్‌ను టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు ఆడాడే కాబట్టే అంత క్రేజ్ వచ్చింది. అయినా టీమిండియా ఆడుతోంది.. శ్రీలంకతోనే కదా అని చిన్నచూపు మాత్రం చూడొద్దు. వాస్తవానికి లంక జట్టు ప్రదర్శన బాగుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియాతో సమానంగా నిలిచింది. దానికి ఉదాహరణే రెండో వన్డే.. మొదట బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించి 193 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత దీపక్ చహర్, భువనేశ్వర్‌తో కలిసి చిరస్మరణీయ భాగస్వామ్యం నమోదు చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న చహర్ స్పందించాడు. 'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్ ద్రవిడ్ సర్ చెప్పారు. ఆయన కోచింగ్‌లో నేను భారత్-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను. ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకుముందు మాత్రం ఒక్కో బంతిని ఆడుతూ పరుగులు చేశా. నా ఇన్నింగ్స్ సమయంలో కోచ్ ద్రవిడ్ డ్రింక్స్ బాయ్‌గా ఉన్న నా సోదరుడు రాహుల్ చహర్‌కు బ్యాటింగ్ పరంగా కొన్ని కీలక సూచనలు ఇచ్చి పంపించాడు. డ్రింక్స్ విరామం సమయంలో రాహుల్ నా దగ్గరకు వచ్చి ద్రవిడ్ సూచనలు అందించాడు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా.ఈరోజుతో అది నెరవేరింది.' అని పేర్కొన్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Will never forget this moment #teamindia #dream . Thank you so much for your wishes means a lot ☺️🙏 #keepsupporting pic.twitter.com/y0iGLAaaKY — Deepak chahar 🇮🇳 (@deepak_chahar9) July 21, 2021 -
IND Vs SL: ఓటమి జీర్ణించుకోలేక కెప్టెన్‌తో కోచ్ గొడవ; వీడియో వైరల్
కొలంబో: శ్రీలంక జట్టు ప్రధాన కోచ్ మికీ ఆర్థర్, లంక కెప్టెన్ దాసున్ షనకల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. క్రమంగా చహర్ నిలుద్కొకుకోవడం.. ఆ తర్వాత భువీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించడం ఆర్థర్‌కు సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు. ఇక మ్యాచ్ చివర్లో లంక ఓటమి దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యలోనే మికీ ఆర్థర్ మ్యాచ్ మధ్యలో మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో ఏదో చర్చించాడు. ఆర్థర్ ఏవో సైగలు చేస్తుంటే షనక కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇరువరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో వెలుగు చూసింది. ఈ వీడియోపై అభిమానులు ఎవరికి తోచింది వారు కామెంట్ చేశారు. '' మ్యాచ్ జరుగుతుంటే కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్‌కు విరుద్ధం.. టీమిండియా ఆటతీరును డిస్టర్బ్ చేయాలనే ఆర్థర్ ఇలా ప్లాన్‌తోనే షనకతో గొడవపడినట్లు నటించాడంటూ'' పేర్కొన్నారు. pic.twitter.com/sUBY43Sk1x — cric fun (@cric12222) July 20, 2021 -
సరిగ్గా నాలుగేళ్ల క్రితం; ఇదే శ్రీలంక.. అప్పుడు భువీనే
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సూపర్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) విజయంలో కీలకపాత్రపోషించగా.. చివర్లో భువనేశ్వర్ కుమార్ 19 నాటౌట్‌తో అతనికి సహకరించాడు. ఇద్దరి మధ్య ఎనిమిదో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం నమోదు అయింది. ఈ విజయంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా అచ్చం ఇదే తరహాలో 2017లో ఇదే శ్రీలంకపై భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో కూడా భువీనే ఉండడం విశేషం. ధోనితో కలిసి 8వ వికెట్‌కు 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడమే గాక అర్థసెంచరీతో రాణించాడు. ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. 47 ఓవర్లలో 231 పరుగుల లక్ష్యాన్ని చేధించాల్సి ఉండగా.. లంక బౌలర్ అఖిల ధనుంజయ(6 వికెట్లు) దెబ్బకు భారత జట్టు 22 ఓవర్లలో 131 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. ఈ దశలోనే కెప్టెన్ ధోని అద్భుతం చేశాడు. భువనేశ్వర్‌తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన ధోని 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడమేగాక జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ సిరీస్‌ను భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఇక టీమిండియా ఆడిన వన్డేల్లో ఎనిమిదో వికెట్‌కు ధోని-భువీల సెంచరీ భాగస్వామ్యం తొలి స్థానంలో ఉండగా.. తాజాగా దీపక్ చహర్, భువీల మధ్య నమోదైన 84 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది. ఇక 2009లో ఆసీస్‌తో జరిగిన వన్డేలో ప్రవీణ్ కుమార్, హర్భజన్ జంట ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఇక మ్యాచ్ అనంతరం వైస్ కెప్టెన్ హోదాలో భువీ మాట్లాడుతూ.. '' ఈరోజు మ్యాచ్ అచ్చం నాలుగేళ్ల క్రితం జరిగిన మ్యాచ్‌ను తలపించింది. 276 పరుగులు చేధనలో 193 పరుగుల వద్ద నేను క్రీజులోకి అడుగుపెట్టాను. ఏం జరిగినా సరే దీపక్ చహర్‌కు అండగా చివరి వరకు నిలబడాలని గట్టిగా అనుకున్నా.. అంతా మ్యాజిక్‌లా జరిగిపోయింది. నేను చేసింది 19 పరుగులే కావొచ్చు.. కానీ నా కెరీర్‌కు ఇది చాలా బూస్టప్‌ను ఇస్తుంది. 2017లో జరిగిన మ్యాచ్‌లోనూ అంతే.. 131 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ధోని భయ్యాకు సహకరిస్తూ అర్థ సెంచరీ నమోదు చేశాను.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా నామమాత్రమైన చివరి వన్డే జూలై 22న జరగనుంది. Highest 8th wicket partnerships for India in ODIs - 1. MS Dhoni, Bhuvneshwar Kumar - 100* vs Srilanka, 2017 2. Deepak Chahar, Bhuvneshwar Kumar - 84* vs Srilanka, 2021#INDvSL #deepakchahar #bhuvaneshwarkumar #RahulDravid #MSDhoni pic.twitter.com/TAXgaar3Hq — Athul Sreevatsan (@AthulSreevatsan) July 20, 2021 DEEPAK CHAHAR HAS DONE THE IMPOSSIBLE. TAKE A BOW! India win the match & the series! 🤩 Final ODI, Friday on Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #SLvIND pic.twitter.com/fiujunPQQs — Sony Sports (@SonySportsIndia) July 20, 2021 -
ద్రవిడ్ టెన్షన్‌ను చూడలేకపోయాం.. ఓడిపోయుంటే
కొలంబో: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చహర్ అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఓడిపోతున్నామన్న దశలో చహర్.. భువనేశ్వర్‌తో కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించి మ్యాచ్‌ను గెలిపించడమేగాక .. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ విజయం అనంతరం పోస్ట్ ప్రెజంటేషన్లో స్పందించాడు. ''ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ చూశా. దీపక్ చహర్ సూపర్ ఇన్నింగ్స్ మమ్మల్ని నిలబెట్టింది. నా వరకు కీలక సమయంలో మరో వికెట్ పడకుండా అతనికి సహకరించడం సంతోషంగా ఉంది. ఇక మా కోచ్ రాహుల్ ద్రవిడ్ విజయం తర్వాత సంతోషంగా ఉంటారనుకుంటున్నా. ఎందుకంటే మ్యాచ్ సమయంలో ద్రవిడ్ కొన్ని సార్లు టెన్షన్‌కు లోనైనట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా దీపక్ చహర్ ఆడుతున్నప్పుడు అతని సోదరుడు రాహుల్ చహర్‌తో ద్రవిడ్ మాట్లాడడం కనిపించింది. అంతేగాక మ్యాచ్ సమయంలోనూ పదేపదే అటు ఇటు తిరగసాగాడు. ఒకవేళ మ్యాచ్ ఓడిపోయుంటే పరిస్థితి ఎలా ఉండేదో.. ఈ సిరీస్‌కు ఆయన కోచ్‌గా ఉండడం మాకు సవాల్. ఇక మ్యాచ్ విజయం తర్వాత ద్రవిడ్‌లో మళ్లీ ఆ కూల్ కనిపించింది.ఇక క్లీన్ స్వీప్‌పై దృష్టి పెట్టాం'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు.భారత బౌలర్లలో చహల్ (3/50), భువనేశ్వర్ (3/54), దీపక్ చహర్ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది. Some advice from Rahul Dravid to Rahul Chahar for passing to Deepak Chahar. #SLvIND pic.twitter.com/zItAYkkTzE — Johns. (@CricCrazyJohns) July 20, 2021 DEEPAK CHAHAR HAS DONE THE IMPOSSIBLE. TAKE A BOW! India win the match & the series! 🤩 Final ODI, Friday on Sony Six (ENG), Sony Ten 1 (ENG), Sony Ten 3 (HIN), Sony Ten 4 (TAM, TEL) & SonyLIV📺#SLvINDOnlyOnSonyTen #HungerToWin #SLvIND pic.twitter.com/fiujunPQQs — Sony Sports (@SonySportsIndia) July 20, 2021 -
టీమిండియా స్పిన్నర్లను ఊరిస్తున్న రికార్డులు
కొలంబో: పెద్దగా అనుభవంలేని ప్లేయర్లతో కూడిన శ్రీలంక జట్టుపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. ఒకరోజు విరామం తర్వాత శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ మరో పోరుకు సిద్ధమైంది. నేడు శ్రీలంక జట్టుతో జరిగే రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్ సేన పట్టుదలగా ఉంది. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మొదట యజ్వేంద్ర చహల్ విషయానికి వస్తే.. చహల్ ఈ మ్యాచ్‌లో మరో ఆరు వికెట్లు తీస్తే గనుక వన్డే క్రికెట్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్ల ఫీట్ అందుకున్న ఆటగాడిగా చహల్ నిలువనున్నాడు. షమీ 56 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకోగా.. చహల్ కూడా ప్రస్తుతం 56వ మ్యాచ్ ఆడనున్నాడు.ఇదే మ్యాచ్‌లో హర్బజన్ రికార్డును కూడా చహల్ అందుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చహల్ ఐదు వికెట్ల ఫీట్ అందుకుంటే హర్భజన్‌తో సమానంగా వన్డేల్లో మూడు సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న ఆటగాడిగా నిలవనున్నాడు. మరో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు వన్డేల్లో 107 వికెట్లు తీసిన కుల్దీప్.. మరొక వికెట్ తీస్తే బుమ్రా.. మూడు వికెట్లు తీస్తే యువరాజ్‌లతో సమానం కానున్నాడు. ఇక తొలి వన్డేలో ఈ ఇద్దరు తమ బౌలింగ్‌లో దారాళంగా పరుగులు ఇచ్చుకున్నా కీలక సమయంలో వికెట్లు తీశారు. చహల్ , కుల్దీప్లు చెరో రెండు వికెట్లు తీశారు. ఇక తొలి వన్డేలో (86 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లు( వన్డే, టీ20, టెస్టు) కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా వచ్చి 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సచిన టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గావస్కర్, రోహిత్ శర్మలు ఈ ఫీట్‌ను సాధించారు. అంతేగాక వన్డే క్రికెట్లో ఓపెనర్‌గా 6వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడిగా ధావన్ నిలిచాడు. -
ధావన్ సేన ప్రాక్టీస్ షురూ
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంక చేరిన ధావన్ సేన శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొంది. మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో ఆటగాళ్లందరూ ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్, నవంబర్లలో యూఏఈలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇది. ఈ స్వల్పకాలిక పర్యటనలో ధావన్ నేతృత్వంలోని భారత్ 3 వన్డేలతో పాటు 3 టి20లు కూడా ఆడుతుంది. ప్రపంచకప్ ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, సంజూ సామ్సన్‌లకు ఈ టూర్ కీలకంగా మారింది. కొలంబోలో ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలివన్డే జరుగనుం ది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి సారథ్యంలోని టీమిం డియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. -
శ్రీలంకలో ఆకస్మిక వరదలు.. నలుగురు మృతి
కొలంబో: శ్రీలంకలో ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో ఐదు వేల మంది నిరాశ్రయులవడమేగాక ఇప్పటివరకు నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శ్రీలంకలో ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి అనేక ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు నీటిలో మునిగిపోయాయి. వరదల ధాటికి ఇద్దరు చనిపోగా.. కేగల్లే జిల్లాలో ఒక ఇంటిమీద మట్టిపెళ్లలు విరిగిపడడంతో మరో ఇద్దరు చనిపోయారు. కాగా సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ గ్రామానికి చేరుకొని మట్టిపెళ్లలు తొలగించి మృతదేహాలను బయటకి తీశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5వేల మంది నిరాశ్రయులు కావడంతో వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. చదవండి: వరదలో చిక్కిన మహిళ.. సహాయక సిబ్బంది తెగువతో.. -
Sri Lanka: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. 24 గంటల్లో 1,047 మంది అరెస్ట్
కొలంబో(శ్రీలంక): చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రీలంకలో క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమవారం 1,047 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ అజిత్ రోహనా వెల్లడించారు. మాతలేలో 160 మందిని, నికవేరటియాలో 119 మందిని, కాండీలో 98 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఇప్పటి వరకు క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు19,102 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సంబంధించి పర్యవేక్షణ కోసం 23,000 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు శ్రీలంకలో 1,83,452 కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. 1,441 మంది కరోనా బాధితులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
కొలంబో తీరంలో కాలిపోతున్న నౌక.. ఐసీజీ చేయూత
కొలంబో: గుజరాత్ నుంచి శ్రీలంకలోని కొలంబో పోర్టుకు వెళ్తున్న సరుకు రవాణా నౌక ఎంవీ ఎక్స్‌ప్రెస్ పెర్ల్‌లో ఆరు రోజుల కిందట అగ్ని ప్రమాదం సంభవించింది. కొలంబో పోర్టుకు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మంగళవారం ఒక కంటైనర్ అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కాగా ప్రమాద సమయంలో నౌకలో ఉన్న వివిధ దేశాలకు 25 మంది సిబ్బందిని ఇప్పటికే సురక్షితంగా కాపాడారు. కాలిపోతున్న నౌకలోని సరుకును సురక్షితంగా తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రెండు ఐసీజీ ఓడలు 'వైభవ్', 'వజ్రా'లను సహాయం కోసం పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీలంక అధికారులతో జరిపిన చర్చల అనంతరం ఎలాంటి ప్రమాదాలనైనా తట్టుకునే వైభవ్, వజ్రల పంపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు పేర్కొన్నారు. వీటికి అదనంగా, కొచ్చి, చెన్నై, టుటికోరిన్ వద్ద ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలను తక్షణ సహాయం కోసం రెడీగా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం శ్రీలంక అధికారులతో ఐసీజీ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. చదవండి: ఘోర రైలు ప్రమాదం.. 213 మందికి గాయాలు -
రామాలయానికి లంక నుంచి శిల
అయోధ్య: లంకాధీశుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి బంధించిన చోటుగా రామాయణం పేర్కొంటున్న ప్రాంతం నుంచి ఒక రాయిని సేకరించి అయోధ్య రామాలయ నిర్మాణానికి అందజేస్తామని కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. రెండు దేశాల మధ్య మైత్రీబంధానికి ఒక తార్కాణంగా ఇది నిలువనుందని పేర్కొంది. సీతాఎలియాగా పేర్కొంటున్న ప్రాంతం నుంచి సేకరించిన ఈ శిలను త్వరలోనే శ్రీలంక హై కమిషనర్ మిళింద మొరగొడ భారత్‌కు తీసుకువస్తారని తెలిపింది. మరో 1.15 లక్షల చ.అడుగుల భూమి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ జన్మభూమి పరిసరాలకు 2, 3 కిలోమీటర్ల దూరంలో 1.15లక్షల చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది. ట్రస్ట్ కార్యకలాపాలు, భద్రతా సిబ్బంది, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు దీనిని వినియోగిస్తామని ట్రస్ట్ అధికారి ఒకరు తెలిపారు. రామ్‌కోట్, తెహ్రి బజార్ ప్రాంతంలోని భూమిని చదరపు అడుగు రూ.690 చొప్పున, రూ.8 కోట్లకు గత వారమే కొన్నట్లు తెలిపారు. -
లోయలో పడ్డ బస్సు.. 14 మంది దుర్మరణం
కొలంబో: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడింది. దీంతో 13 మంది దుర్మరణం పాలవగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించడానికి ప్రయత్నించగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ విషాద సంఘటన శ్రీలంకలో జరిగింది. శ్రీలంకలోని పసరా పట్టణానికి సమీపంలో ఉన్న ప్రిసిపైస్ గ్రామంలో విషాదం అలుముకుంది. 70 మంది ప్రయాణికులతో శనివారం బస్సు బయల్దేరింది. అయితే కొండ ప్రాంతమైన మొనెరగులా-బదుల్లా రోడ్డు మార్గం చాలా ప్రమాదకరం. ఈ ఇరుకు మార్గంలో ఒకేసారి బస్సు, ట్రక్కు వచ్చాయి. ఈ సమయంలో ట్రక్కును తప్పించబోయి మలుపు ప్రాంతంలో బస్సు కొంచెం పక్కకు జరగడంతో పక్కనే లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 13మంది దుర్మరణం పాలయ్యారు. 30 మంది గాయాలపాలయ్యారు. సమాచారం అందించిన వెంటనే అధికారులు, పోలీసులు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీస్ అధికారి అజిత్ రోహన తెలిపారు. ఈ రోడ్డు వెంట తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెప్పారు. 16 ఏళ్లల్లో ఇదే అతి పెద్ద ప్రమాదమని అధికారులు గుర్తించారు. CCT கேமராவில் பதிவான லுணுகலை பஸ் விபத்து#badulla #passara #SriLanka #Lunugala pic.twitter.com/hYhJ8D4won — Abinesh (@aBINE00sh71) March 20, 2021 -
అప్పుడు పాక్ నో.. ఇప్పుడు భారత్ ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు భారత ఎయిర్‌లైన్స్ కీలక అనుమతులను మంజూరు చేసింది. ఇండియా మీదుగా శ్రీలంక వెళ్లేందుకు పాక్ ప్రధాని విమానానికి భారత పౌర విమానయాన శాఖ అనుమతినిచ్చింది. భారత విమానాలకు పాక్ పలుమార్లు ఆంక్షలు విధించినప్పటికీ పాక్‌కు అడ్డు చెప్పకుండా కేంద్రం సానుకూలంగా స్పందించడం విశేషం. కోవిడ్ సంక్షోభం తర్వాత శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తున్న తొలి దేశాధినేత ఇమ్రాన్ ఖాన్. ఈ అధికారిక పర్యటనలో లంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే, ప్రధాని మహీంద్ర రాజపక్సేతో ఇమ్రాన్ చర్చలు జరపనున్నారు. అయితే శ్రీలంక తమ పార్లమెంట్లో ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగాన్ని రద్దు చేసినట్లు ఇప్పటికే ప్రకటించింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశంతోనే శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. అలాగే పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నట్లు శ్రీలంక అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2019 అక్టోబర్‌లో భారత ప్రధాని మోదీ సౌది అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా తమ దేశం మీదుగా వెళ్లేందుకు మోదీ విమానానికి అనుమతి నిరాకరించి పాక్ కుటిలబుద్ధిని చాటుకుంది. కానీ తాజాగా భారత్ మాత్రం తన ఉదార స్వభావాన్నే చాటుకుంది. చదవండి: ఇమ్రాన్ ఖాన్ కంటే భారత్ ముఖ్యం: శ్రీలంక -
ఇమ్రాన్ ఖాన్‌కు షాక్ ఇచ్చిన శ్రీలంక!
కొలంబో : పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు శ్రీలంక ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. శ్రీలంక పర్యటనలో భాగంగా అక్కడి పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ ఇవ్వాల్సిన ప్రసంగాన్ని ఆ దేశం రద్దు చేసింది. భారత్‌తో ఎలాంటి వివాదం తలెత్తవద్దన్న ఉద్ధేశ్యంతోనే శ్రీలంక ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొలంబో గెజిట్ పత్రిక తన కథనంలో ప్రచురించింది. కాగా భారత్ శ్రీలంకకు కోవిడ్ 19 వ్యాక్సిన్లను అందిస్తోంది. ఇప్పటికే 5 లక్షల కోవిషిల్డ్ డోసులను ఆ దేశానికి పంపించింది. ఇలాంటి సమయంలో భారత్‌తో తమకున్న దౌత్య సంబంధాన్ని పణంగా పెట్టేందుకు శ్రీలంక సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అంతేగాక శ్రీలంకలో ముస్లింలకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. మసీదులలో జంతువులను బలిస్తున్నారని అక్కడి బౌద్దులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఒకవేళ శ్రీలంక పార్లమెంట్లో మాట్లాడితే అప్పుడు భారత్‌తో పాటు స్థానిక బౌద్దులకు కూడా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు భావించి ప్రధాని ప్రసంగాన్ని రద్దు చేసింది. కాగా ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై జమ్మూకశ్మీర్‌పై అవాస్తవాలు ప్రచారం చేయడం అలవాటుగా మారిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంకలో కూడా ఇమ్రాన్ ఖాన్ జమ్మూకశ్మీర్ అంశం లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రసంగం రద్దు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొలంబో పోర్టులోని ఈస్ట్ కంటైనర్ టర్మినల్ నిర్మాణం కోసం భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని శ్రీలంక ఇటీవలే రద్దు చేసింది. దీని వెనుక చైనా హస్తం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలంక పార్లమెంట్లో పాక్ ప్రధాని నోట కశ్మీర్ ప్రస్తావన వస్తే.. ఇరు దేశాల దౌత్యసంబంధంపై మరింత ప్రభావం పడుతుందని శ్రీలంక ప్రభుత్వ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 22 నుంచి రెండ్రోజులపాటు ఇమ్రాన్ శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. పార్లమెంటులో ప్రసంగం మినహా అన్ని కార్యక్రమాలు యథావిధంగా కొనసాగనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. చదవండి: టూల్‌కిట్ వివాదం: పాక్ కీలక వ్యాఖ్యలు టిక్‌టాక్‌లో.. కాస్ట్లీ మిస్టేక్! -
లీగ్ ఆరంభమే కాలేదు.. అప్పుడే ఫిక్సింగ్ కలకలం
కొలంబో: ఎన్నో వాయిదాల తర్వాత ఈరోజు(నవంబర్ 26వ తేదీ) ఆరంభం కానున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఆరంభం సీజన్‌కు అప్పుడే ఫిక్సింగ్ తాకిడి తగిలింది. మ్యాచ్‌లను తమకు అనుకూలంగా ఫిక్స్ చేయాలని జాతీయ జట్టుకుకు చెందిన మాజీ క్రికెటర్ ఎల్పీఎల్ ఆడే ఒక ప్లేయర్‌ను కలిసిన విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఐసీసీ, శ్రీలంక క్రికెట్ బోర్డులు దీనిపై సీరియస్ దృష్టి సారించాయి. భారీ ఫిక్సింగ్‌కు తెరలేపడానికి చూస్తున్నట్లు స్థానిక పత్రిక లంకా దీప తన కథనంలో పేర్కొంది. దాంతో ఐసీసీతో పాటు ఎస్ఎల్సీలు అలెర్ట్ అయ్యాయి. దీనిపై అప్పుడే ఐసీసీ విచారణకు రంగం సిద్ధం చేయగా, ఈ అంశంపై మాట్లాడటానికి మాత్రం నిరాకరించింది. ఎల్పీఎల్లో ఆడే విదేశీ ఆటగాడినే లక్ష్యంగా చేసుకుని ఫిక్సింగ్‌కు తెరలేపడానికి యత్నించినట్లు తెలుస్తోంది. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్ రికార్డు) కరోనా వైరస్ కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఎట్టకేలకు ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కాగా, తొలుతనవంబర్ 14కు వాయిదా పడింది. మళ్లీ నవంబర్ 26వ తేదీకి వాయిదా వేస్తూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది. లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి కండీ టస్కర్స్‌తో ఇర్ఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇది ఎల్పీఎల్ ఆరంభపు సీజన్ కావడం గమనార్హం. డిసెంబర్ 16వ తేదీ వరకూ జరుగనుంది. అభిమానులు స్టేడియాల్లోకి అనుమతి లేకుండా క్లోజ్డ్ డోర్స్‌లో ఈ లీగ్‌ను నిర్వహిస్తున్నారు. క్యాండీ టస్కర్స్- కొలంబో కింగ్స్ మధ్య రాత్రి గం.7.30ని.లకు ఆరంభపు మ్యాచ్ జరుగనుంది. (షమీ భార్య జహాన్‌కు వేధింపులు) -
శ్రీలంక ప్రధాని ఇంట నవరాత్రి సంబరాలు
-
ప్రముఖ శ్రీలంక క్రికెటర్ అరెస్ట్
కొలంబో : శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను ఆదివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో శివారులోని పనాదుర వద్ద కుశాల్ మెండిస్ కారు అదుపుతప్పి 74 ఏళ్ల వృద్ధుడ్ని ఢీకొనగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్సిడెంట్ సమయంలో కుశాల్ కారుని మితిమీరిన వేగంతో నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మెండిస్‌పై కేసు నమోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా శ్రీలంక క్రికెట్ జుట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న కుశాల్ ఇప్పటివరకు 76 వన్డేల్లో 2,167 పరుగులు, 44 టెస్టుల్లో 2,995 పరుగులు, 26 టీ20ల్లో 484 పరుగులు సాధించాడు.(బెయిర్‌స్టోకు దక్కని చోటు) -
‘ప్లాన్-బితోనే క్రికెట్లోకి వచ్చా’
కొలంబో: ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 800 వికెట్లను ఖాతాలో వేసుకున్న మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన ఆఫ్ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో మురళీధరన్‌తో ప్రత్యేకమైన శైలి. అయితే తన యాక్షన్‌పై అనేకసార్లు వార్తల్లో నిలిచిన మురళీధరన్..ఎప్పటికప్పుటూ ఐసీసీ గ్రీన్ సిగ్నల్ పొందుతూనే అరుదైన రికార్డును సాధించడం ఇక్కడ విశేషం. 1998-99 సీజన్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మురళీధరన్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్ రాస్ ఎమెర్సన్ వరుసగా నో బాల్స్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. మురళీ బంతిని సంధించడం అంపైర్ నోబాల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అయినప్పటికీ తన యాక్షన్‌లో ఎటువంటి లోపం లేదని నిరూపించుకున్న ఈ స్పిన్ మాంత్రికుడు టెస్టు ఫార్మాట్ అత్యధిక వికెట్ల టేకర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. (వారిద్దరూ ఇంగ్లండ్ టూర్‌కు డుమ్మా) అయితే తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సమయంలో ఆఫ్ బ్రేక్ బౌలింగ్ సెట్ కాకపోయి ఉంటే లెగ్ స్పిన్ బౌలర్‌గా అవతరించేవాడినన్నాడు. తాను మణికట్టు స్పిన్‌ను కూడా ప్రాక్టీస్ చేసి ప్లాన్-బిని సిద్ధంగా ఉంచుకున్న విషయాన్ని తెలిపాడు. ‘ నేను యువకుడిగా ఉన్నప్పడు లెగ్ స్పిన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా టెస్టుల్లో సెట్ కాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని కోసం లెగ్ స్పిన్‌ను ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకవేళ టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్‌గా కొనసాగిన నేను అది వర్క్ కాకపోయి ఉంటే కచ్చితంగా లెగ్ స్పిన్నర్‌ను అయ్యేవాడిని’ అని తెలిపాడు. ఎవరైనా ఎప్పుడైతే క్రికెట్లోకి రావాలనుకుంటారో ప్లాన్-ఏ, ప్లాన్-బిలు సిద్ధంగా ఉండాలన్నాడు. ఏదొక దానికే మాత్రమే కట్టుబడి ఉంటే అది వర్కౌట్ కాకపోతే సమస్యలు వస్తాయన్నాడు. ప్రొఫెషనల్ స్థాయిలో ఒక గేమ్‌ను ఆడాలంటే మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. ఇది కేవలం క్రికెట్ మాత్రమే పరిమితం కాదని, అన్ని క్రీడలకు వర్తిస్తుందన్నాడు. మానసిక బలమే ఆటలో కీలక పాత్ర పోషిస్తుందని మురళీ చెప్పుకొచ్చాడు.(‘మాపై ప్రయోగం చేయడం లేదు’ ) -
రాజీనామా చేయనున్న శ్రీలంక ప్రధాని
కొలంబో : శ్రీలంకలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి, మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి సాజిత్ ప్రేమదాస ఓడిపోవడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి సుదర్శన గుణవర్ధనే బుధవారం వెల్లడించారు. గురువారం తన రాజీనామా లేఖను అధ్యక్ష కార్యాలయానికి పంపుతారని గుణవర్ధనే తెలిపారు. శ్రీలంక తదుపరి ప్రధానిగా ప్రస్తుత అధ్యక్షుని సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు మహీంద్ర రాజపక్స నియమితులయ్యే అవకాశాలున్నాయి. కాగా శనివారం వెలువడిన అధ్యక్ష ఫలితాల్లో గొటబయ దాదాపు 13 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
శ్రీలంక అధ్యక్షుడిగా 'టర్మినేటర్'
కొలంబో : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద్ర రాజపక్స సోదరుడు 'టర్మినేటర్' అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే గోటబయ రాజపక్స విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్స తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు. అధికారికంగా రాజపక్సే గెలుపును సాయంత్రానికల్లా ప్రకటించనున్నారు. అయితే రాజపక్స గెలిచినట్టు ఇటు ఎస్ఎల్పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి. ఆదివారం ఉదయం 12 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87శాతం ఓట్లు గెలుచుకోగా, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అధికార పార్టీకి చెందిన గృహ మంత్రి సజిత్ ప్రేమదాసకు 44.4 శాతం వరకూ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం నాడు ఎన్నికలు జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, 80 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ మహీంద్ర దేశప్రియ వెల్లడించారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. 1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం.. -
శ్రీలంక ఎన్నికల్లో విజేత ఎవరు?
శ్రీలంక అధ్యక్ష పదవికి 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో పోటీ ఆసక్తిగా మారింది. గత కొన్నాళ్లుగా కల్లోల, సంక్షోభ పరిస్థితులు నెలకొన్న శ్రీలంకలో ఈ ఎన్నికల ద్వారా శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ పరిశీలకులు, ప్రజలు భావించారు. కానీ శనివారం ఉదయం మైనారిటీ వర్గానికి చెందిన ముస్లింలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న వంద బస్సులపై కొలంబోకు 240 కిలోమీటర్ల దూరంలోని తంతిరిమలే వద్ద ఓ గుర్తు తెలియని సాయుధుడు కాల్పులు జరపగా, మరో చోట ఓ గుంపు రాళ్లు రువ్వింది. ఈ సంఘటనల్లో ఎవరు గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గతేడాది దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, దేశ ప్రధానిని తొలగించి మహింద రాజపక్సను ప్రధానిగా నియమించడంతో మూడు నెలల పాటు దేశంలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏప్రిల్ నెలలో లంకలోని చర్చ్‌లు లక్ష్యంగా జరిగిన బాంబు దాడుల్లో ఇద్దరు ఆస్ట్రేలియన్లు సహా 250 మంది మరణించారు. ఈ ఘోరాన్ని ఆపలేకపోయినందుకు దేశాధ్యక్షుడు సిరిసేనను పార్లమెంట్ నివేదిగా నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత ముస్లింలను విచక్షణారహితంగా అరెస్ట్‌లు చేసి నిర్బంధించడాన్ని కూడా నిందించింది. పైగా ఆయన గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేక పోయారు. అందుకని ఆయనగానీ, మహింద రాజపక్సగానీ పోటీ చేయడం లేదు. మహింద రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స ప్రతిపక్ష పార్టీ ‘శ్రీలంక పోడుజన పెరమున’ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. అయితే ఆయనకు తమిళులు, ముస్లింలలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఆయనకు ప్రధాన ప్రత్యర్థి మాజీ దేశాధ్యక్షుడు రణసింగే ప్రేమదాస కుమారుడు రజిత్ ప్రేమదాస. ఆయన పాలకపక్ష ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ రాజపక్స గెలిచే అవకాశాలే కొంచెం ఎక్కువ ఉన్నాయని ఎన్నికల పరిశీలకు అంచనా వేశారు. 1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం. వారిలో నలుగురు ముస్లిం అభ్యర్థులు, ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉండగా, ఒక్క మహిళ పోటీలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్న 50 శాతానికి మించి ఓట్లు రావాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిశాక ఈ రోజే ఓట్ల లెక్కంపు మొదలవుతుంది. అర్ధరాత్రికి మొదటి ఫలితం, సోమవారం మధ్యహ్నానికి తుది ఫలితాలు వెలువడుతాయి. -
ఈ ‘రాజా’ మామూలోడు కాదు మరి!
కొలంబో : శ్రీలంకలో జరిగే పెరిహెరా ఉత్సవాల్లో నదుంగామువా రాజా(65) చేసే సందడి మామూలుగా ఉండదు. బుద్ధుడికి సంబంధించిన వస్తువులను తీసుకువెళ్లే రాజా అంటే భక్తులకు ఎంతో అభిమానం. పదిన్నర అడుగుల ఎత్తు ఉండే ఈ గజరాజును చూడటానికే ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం ‘టెంపుల్ ఆఫ్ ది టూత్’కు వచ్చేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే అత్యంత పొడవైన దంతాలు కలిగిన రాజాను శ్రీలంక ప్రభుత్వం కూడా తమ అనధికార జాతీయ సంపదగా భావిస్తుంది. అలాంటి రాజాకు చిన్న ప్రమాదం జరిగినా అభిమానులు తట్టుకుంటారా. అందుకే ప్రభుత్వం అతడికి బాడీగార్డులను నియమించింది. రాజా బయటికి వస్తే చాలు అతడి వెంట కనీసం ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉండాల్సిందే. వారు కూడా రాజాతో పాటుగా పరగులు పెట్టాల్సిందే. ఈ విషయం గురించి రాజా యజమాని హర్ష ధర్మవిజయ మాట్లాడుతూ...‘ రాజా ప్రతి ఏటా ఉత్సవాల్లో పాల్గొంటాడు. 2015 సెప్టెంబరులో రాజాను ఓ బైకర్ ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అప్పుడు ప్రభుత్వ అధికారులే నా దగ్గరికి వచ్చి రాజాకు రక్షణ కల్పిస్తామని... బాడీగార్డులను నియమిస్తామని చెప్పారు. ఇసాలా ఉత్సవం కోసం రాజా దాదాపు 90 కిలో మీటర్లు నడిచి కొండ మీదకు చేరుకుంటాడు. రోజుకు కనీసం 25 నుంచి 30 కిలోమీటర్లు నడుస్తాడు. ఎల్లప్పుడు బాడీగార్డులు తన వెంటే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీలంకలోని ధనవంతుల్లో చాలా మంది ఏనుగులను పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే వాటిని ప్రేమగా ఆదరిస్తుండగా.. మరికొంత మంది మాత్రం అమానుషంగా ప్రవర్తిస్తూ... ఏనుగులను ఇబ్బంది పెడుతున్నారని జంతుప్రేమికులు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన పెరిహెర ఉత్సవాల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న 70 ఏళ్ల టికిరీ అనే ఏనుగును కవాతులో నిలపగా.. అక్కడే అది కుప్పకూలిపోయింది. పూర్తిగా చిక్కిశల్యమైన టికిరీ మంగళవారం రాత్రి మరణించడం పలువురిని కలచివేసింది. (చదవండి : కవాతులో కుప్పకూలిన ఆ గజరాజు మృతి) -
అజంతా మెండిస్ వీడ్కోలు
కొలంబో: పదకొండేళ్ల క్రితం శ్రీలంక గడ్డపై తన తొలి సిరీస్‌లోనే భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ను వణికించిన మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండిస్. అతని దెబ్బకు టీమిండియా సిరీస్ కోల్పో యింది. మెండిస్ ‘క్యారమ్’ బంతులు మన బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాయి. ఆరు ఇన్నింగ్స్‌లలో సచిన్, గంగూలీ కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయలేకపోగా, ద్రవిడ్ మాత్రం ఒకే ఒక అర్ధసెంచరీ సాధించాడు! మూడు టెస్టులలో ఏకంగా 26 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. అయితే తర్వాతి రోజుల్లో ఆ మిస్టరీని బ్యాట్స్‌మెన్ ఛేదించిన తర్వాత అతను తేలిపోయాడు. ఒక సాధారణ స్పిన్నర్‌గా మారిపోవడంతో పాటు గాయాల కారణంగా కెరీర్లో వెనుకబడి ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. శ్రీలంక తరఫున 2015లో ఆఖరి మ్యాచ్ ఆడిన అజంతా ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 19 టెస్టుల్లో 34.77 సగటుతో మెండిస్ 70 వికెట్లు పడగొట్టాడు. 87 వన్డేల్లో 21.86 సగటుతో 152 వికెట్లు తీసిన అతను, 39 టి20 మ్యాచ్‌లలో 66 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మెండిస్ పేరిటే అంతర్జాతీయ టి20ల్లో టాప్–2 బౌలింగ్ ప్రదర్శనలున్నాయి. 2012లో జింబాబ్వేపై 8 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన అతను... అంతకుముందు ఏడాది ఆసీస్‌పై 16 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. -
శ్రీలంక క్లీన్‌స్వీప్
కొలంబో: ఈ మధ్యే జరిగిన ప్రపంచకప్ గుర్తుందిగా! బంగ్లాదేశ్ అద్భుతంగా ఆడింది. దక్షిణాఫ్రికాను కంగుతినిపించింది. వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. కివీస్ చేతిలో ఓడినా... ఆఖరిదాకా వణికించింది. ఇలా పటిష్ట జట్లపై ప్రతాపం చూపిన బంగ్లాదేశ్... నెలతిరిగే లోపే చేవలేని శ్రీలంక చేతిలో ‘జీరో’ అయ్యింది. మూడో వన్డేలోనూ ఓడింది. దీంతో శ్రీలంక 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో లంక 122 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 294 పరుగులు చేసింది. మాథ్యూస్ (90 బంతుల్లో 87; 8 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ (58 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. కెప్టెన్ కరుణరత్నే (46), కుశాల్ పెరీరా (42) రాణించారు. బంగ్లా బౌలర్లలో షఫీయుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. సౌమ్య సర్కార్ (86 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. టెయిలెండర్ తైజుల్ ఇస్లామ్ (39 నాటౌట్) మెరుగనిపించాడు. లంక బౌలర్లలో షనక 3, రజిత, లహిరు చెరో 2 వికెట్లు తీశారు. -
లంకదే సిరీస్
కొలంబో : రెండో వన్డేలో బంగ్లాను శ్రీలంక ఆల్‌రౌండ్ దెబ్బకొట్టింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (98 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశాడు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాను మెహదీ హసన్ (43; 6 ఫోర్లు) కలిసి ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. తర్వాత లంక 44.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (75 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూస్ (57 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. కుశాల్ మెండిస్ (41 నాటౌట్; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం ఇక్కడే జరుగుతుంది. -
శ్రీలంక చర్చిలో మోదీ నివాళి
కొలంబో: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీలంక రాజధాని కొలంబోలో పర్యటించారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ అక్కడి నుంచి బయల్దేరి కొలంబోకు చేరుకున్నారు. శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమసింఘే ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇటీవల బాంబు పేలుళ్ల సంభవించిన కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిను సందర్శించారు. ఈ సందర్భంగా ఘటనలో మృతి చెందిన లంక పౌరులకు ప్రధాని మోదీ నివాళి అర్పించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ కానున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సతో సమావేశం కానున్నారు. కాగీ లంక పర్యటన అనంతరం మోదీ అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. సాయంత్రం 3 గంటలకు శ్రీలంకలోని కొలంబో విమానాశ్రయం నుంచి బయలుదేరుతారు. Started the Sri Lanka visit by paying my respect at one of the sites of the horrific Easter Sunday Attack, St. Anthony's Shrine, Kochchikade. My heart goes out to the families of the victims and the injured. pic.twitter.com/RTdmNGcDyg — Narendra Modi (@narendramodi) 9 June 2019 -
‘ఆ పేలుళ్ల సూత్రధారే నాకు స్ఫూర్తి’
సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో ఆత్మాహుతి దాడికి కుట్రపన్ని సోమవారం ఎన్ఐఏ చేతికి చిక్కిన 29 ఏళ్ల ఐఎస్ ఉగ్రవాది రియాజ్ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను ఏడాదిగా శ్రీలంకకు చెందిన జహ్రన్ హషీం, జకీర్ నాయక్‌ల ప్రసంగాలు, వీడియోలను ఫాలో అవుతున్నానని, కేరళలో ఆత్మాహుతి దాడిని చేపట్టాలని భావించానని విచారణలో రియాజ్ వెల్లడించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. శ్రీలంక బాంబు పేలుళ్ల సూత్రధారి హషీం ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానని రియాజ్ చెప్పాడు. మరోవైపు ఐఎస్ ఆపరేటివ్ అబ్దుల్ రషీద్ అబ్దుల్లాతో కూడా తాను సంప్రదింపులు జరిపానని కేరళలోని పలక్కాడ్ జిల్లాకు చెందిన రియాజ్ వెల్లడించాడు. సిరియాకు చెందిన మరో ఐఎస్ అనుమానిత ఉగ్రవాది అబు ఖలీద్‌తో తాను ఆన్లైన్ చాట్ చేసినట్టు నిందితుడు తెలిపాడు. కాగా రియాజ్‌ను మంగళవారం కొచిన్‌లోని ఎన్ఐఏ కోర్టు ఎదట హాజరుపరచనున్నారు. -
కోలుకోని లంక
ఈస్టర్ పర్వదినం రోజున నెత్తురోడిన శ్రీలంక వారం రోజులు గడిచినా ఇంకా తెరిపిన పడలేదని తాజా ఉదంతాలు తెలియజేస్తున్నాయి. శనివారం ఒక పట్టణంలో సోదాలు జరుపుతుండగా భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతోపాటు ఆత్మాహుతి దాడికి పాల్పడటం, మరో 15మంది మరణించడం చూస్తే ఆ దేశంలో ఉగ్రవాదం ఎంత లోతుగా వేళ్లూనుకున్నదో అర్ధమవుతుంది. సుదీర్ఘకాలం విధ్వంసాలు, ఊచకోతలు చవిచూసిన దేశంలో భద్రతా బలగాల, నిఘా సంస్థల కన్నుగప్పి ఉగ్రవాద సంస్థలు భారీయెత్తున బాంబులు, మారణాయుధాలు పోగేసు కోవడం... స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ఊహకందనిది. వరసగా 26 ఏళ్లపాటు అవిచ్ఛిన్నంగా లంకలో సాయుధ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తమిళ టైగర్లు సాగించిన ఆత్మాహుతి దాడులు, కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని సాగించిన మారణకాండ ఆ దేశాన్ని ఊపిరాడనీయకుండా చేశాయి. అదంతా పదేళ్లక్రితం మాట. ఆ దాడులకు కారణమైన తమిళ టైగర్ల సంస్థ ఎల్టీటీఈ అక్కడే పుట్టి పెరిగి విస్తరించింది. సింహళ జాతీయతను రెచ్చగొట్టి, మైనారిటీలుగా ఉన్న తమిళ సంతతి ప్రజలపై వివక్ష అమలు చేయడంతో రేగిన అసంతృప్తి క్రమేపీ ఉద్యమ రూపం ధరించి స్వయంపాలన అడిగేవరకూ వెళ్లింది. తమిళ ఉద్యమ సంస్థలు లేవనెత్తిన అంశాలను చక్కదిద్దేం దుకు శ్రీలంకలోని ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ పెట్టని కారణంగా అది సాయుధ పోరాటాన్ని విశ్వసించే ఎల్టీటీఈ తదితర సంస్థల ఆవిర్భావానికి దోహదపడింది. కానీ ఇప్పుడు ఉగ్రవాద ఉదంతాల మూలాలు వేరు. మతపరమైన విశ్వాసాలు కాస్తా విద్వేషంగా రూపుదిద్దుకోవడం, ఆ విద్వేషం అంతిమంగా ఉన్మత్త స్థితికి చేరడం తాజా దాడుల్లో కనబడుతుంది. లంక దాడులకు పాల్పడిన ముఠాలకు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని కొందరు తోడ్పాటును అందించారని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. పేలుళ్ల సూత్రధారి కోయంబత్తూర్ వచ్చివెళ్లారని ఆ కథనాలు అంటున్నాయి. ఈ విషయంలో సమగ్రమైన దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దాడులు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి నగరంలో ఒక మసీదుపై దాడిచేసి 50మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతానికి ప్రతీకారమనడం ఒక సాకు మాత్రమే. కొన్నేళ్లుగా విధ్వంసానికి పథక రచన చేయకుండా ఇదంతా సాధ్యమయ్యేది కాదు. న్యూజిలాండ్ దాడికి, శ్రీలంక దాడులకు మధ్య నిండా నెలరోజుల వ్యత్యాసం కూడా లేదు. ఇంత తక్కువ వ్యవధిలో అవసరమైన మను షుల్ని పోగేసుకొని వారికి ఉన్మాదాన్ని నూరిపోయడం, బాంబులు, ఇతర మారణాయుధాలు అవ సరమైనచోట్లకు తరలించడం వీలుకాదు. శ్రీలంకకు భారీయెత్తున పర్యాటకులు వస్తుండటం, అందులో పాశ్చాత్య దేశాలకు చెందినవారు గణనీయంగా ఉండటం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, నిఘా సంస్థలు ఏమరుపాటుగా ఉండటం వంటివన్నీ క్షుణ్ణంగా గమనించిన తర్వాతే ఉగ్రవాదులు ఆ దేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారని, దాడులకు అదును కోసం ఎదురుచూశారని మొత్తం ఘటనల క్రమం చూస్తే అర్ధమవుతుంది. చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు రద్దు చేయడం, భద్రతా బలగాల కదలికలు తగ్గడం వగైరాలను ఉగ్రవాదులు కొన్నేళ్లుగా గమనించబట్టే ఈ స్థాయిలో హింసకు పాల్పడ్డారు. ఇది శ్రీలంకకు మాత్రమే కాదు... అన్ని దేశాలకూ గుణపాఠమే. వేరే ఎక్కడో దాడులు జరిగాయి గానీ అటువంటివి ఇక్కడ సాధ్యం కాదని అనుకోవడానికి వీల్లేదని లంకకు ఎదు రైన చేదు అనుభవాలు చెబుతున్నాయి. లంకలో ఎంత ఘర్షణాత్మక వాతావరణమున్నా ముస్లింలు, క్రైస్తవుల మధ్య ఎప్పుడూ పొరపొచ్చాలు రాలేదు. వాస్తవానికి దాడులకు సూత్రధారిగా భావిస్తున్న ఎన్టీజే చీఫ్ జహ్రన్ హషీమ్ విద్వేష ప్రసంగాలతో అందరినీ రెచ్చగొడుతున్నాడని నాలుగేళ్లక్రితం ఒకసారి, ఏడాదిక్రితం మరోసారి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ చెబుతున్న మాటలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. నిర్లిప్తత ఈ స్థాయిలో పెరిగాక ఉగ్రవాదులు దాడులకు దిగడంలో వింతేముంది? ఉగ్రవాదులు తక్షణ లక్ష్యాలు ఆశించి పనిచేయరు. వారిది దీర్ఘకాలిక ప్రణాళిక. తమ దాడుల పర్యవసానాలు మరణాలతో, విధ్వంసంతో ఆగిపోవడం కాదు వారికి కావలసింది. అవి సమా జంలో శాశ్వతంగా విద్వేషాగ్నులు రగల్చాలి. ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలి. మను షులు పరస్పరం కలిసిమెలిసి ఉండే వాతావరణాన్ని ధ్వంసం చేయాలి. ఒకరిపై ఒకరికి అనుమా నాలు కలిగించాలి. ఈ పన్నాగాలను సరిగా అర్ధం చేసుకోలేకపోతే ఉగ్రవాదాన్ని అంతం చేయడం అంత సులభం కాదు. లంక దాడుల తర్వాత కొలంబో ఆర్చిబిషప్ మాల్కమ్ రంజిత్ ఈ విషయం లోనే అప్రమత్తంగా ఉండాలని అందరినీ హెచ్చరించారు. ఈ చర్యల ద్వారా తాము నమ్ముతున్నా మని చెప్పే మతాన్ని ఉగ్రవాదులు ఎలా చిత్రీకరించదల్చుకున్నారో, దానిపై ఎలాంటి అభిప్రా యాన్ని కలగజేయాలనుకున్నారో అందరూ గ్రహించాలని ఆయన కోరారు. సమాజంలో అందరూ వృధా ఘర్షణలకు దిగాలన్నదే వారి ఆంతర్యమని హెచ్చరించారు. అందరం సమష్టిగా వ్యవహ రించి ఉగ్రవాదుల ఆటల్ని సాగనీయకుండా చూద్దామని పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తూ లంకలో కొన్నిచోట్ల ముస్లింలపై కొందరు అకారణంగా దాడులకు దిగారు. శరణార్థులను తరిమి కొట్టారు. ఇటువంటివి పరోక్షంగా ఉగ్రవాదులకే తోడ్పడతాయి. క్రైస్ట్ చర్చి దాడి అనంతరం ‘మనం ఉన్మాదానికి బలైనవారి పేర్లు తల్చుకుందాం. వారిని బలితీసుకున్న ఉన్మాది పేరు ఉచ్చరించొద్దు. ఆ ఉన్మాదికి పేరుతో సహా ఏమీ మిగలకుండా చేద్దామ’ని న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ అన్న మాటలు గమనించదగ్గవి. ఉగ్రవాదం ఒక మతానికో, ప్రాంతానికో చెందినది కాదు. దానికి నిర్దిష్టమైన రూపం ఉండదు. సమాజం మొత్తం ఏకమై అవిశ్రాంతంగా పోరాడితే తప్ప అది సుల భంగా అంతరించదు. లంక దాడుల నుంచి గ్రహించాల్సింది ఇదే. -
శ్రీలంకలో మరో పేలుడు
కొలంబో: శ్రీలంక వరుస పేలుళ్లతో అతలాకుతలమవుతోంది. గురువారం ఉదయం మరో బాంబు పేలుడు సంభవించింది. శ్రీలంక రాజధాని కొలంబోకి 40కిలోమీటర్ల దూరంలో పుగోడా జిల్లాలో జరిగిన ఈ పేలుడు మెజిస్ట్రేట్ కోర్టుకు చెందిన ఖాళీ ప్రదేశంలో సంభవించిన ఈ పేలుడుతో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఉదయం 9.30కు బాంబు పేలిందని, ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని శ్రీలంక పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గత ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 359కి పెరిగింది. -
‘విదేశాల్లో చదివొచ్చి.. ఇక్కడ రక్తం పారిస్తున్నారు’
కొలంబో : క్రైస్తవ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా శ్రీలంకలో ఐసిస్ ఉద్రవాదులు వరుస బాంబు పేలుళ్లకు తెగబడటంతో 359 మంది అసువులుబాసారు. వేలమంది క్షతగాత్రులయ్యారు. స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ ఈ మారణహోమానికి పాల్పడినట్టు తొలుత భావించారు. అయితే, గత నెల 15న న్యూజిలాండ్‌లో జరిగన మసీదు దుర్ఘటనకు ప్రతీకారంగానే ఈస్టర్ పండుగ వేళ తమ ప్రతీకారాన్ని తీర్చుకున్నామని ఐసిస్ ఉగ్రసంస్థ వెల్లడించింది. బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉండటం.. అంతా లంకేయులే కావడం గమనార్హం. ఇక విదేశాల్లో ఉన్నత చదువుసాగించిన విద్యావంతులు ఉగ్రవాదంవైపు మళ్లడం ద్వీపదేశాన్ని మరింత కలవరపెడుతోంది. బాగా చదువుకొని అటు కుంటుంబాన్ని ఇటు దేశాన్ని ఉద్ధరిస్తారనుకున్న ‘మేధావులు’ పుట్టిన గడ్డపై రక్తం పారిస్తున్నారని రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే ఆవేదన వ్యక్తం చేశారు. పదిమందికి తిండి పెడతారనుకున్న ఐశ్వర్యవంతులు ప్రజల ఉసురు తీస్తున్నారని వాపోయారు. ఆత్మాహుతి దాడులకు తెగబడ్డవారిలో యూకే, ఆస్ట్రేలియాలో పీజీ పూర్తి చేసిన ఓ వ్యక్తి కూడా ఉన్నాడని తెలిపారు. చదువుల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు అతను ఉగ్రవాదం ఆకర్షితుడయ్యాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇక బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు కూడా సూసైడ్ బాంబర్లుగా మారారు. 33 ఏళ్ల ఇమ్సాత్ కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్ హోటల్లో, 31ఏళ్ల ఇల్హామ్.. షాంగ్రిల్లా హోటల్లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. దాడులకు సంబంధించి ఇప్పటివరకు 90 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈస్టర్ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. -
శ్రీలంక పేలుళ్లు : ఇద్దరు ఉన్నతాధికారులపై వేటు
కొలంబో : వరుస పేలుళ్లతో 300 మందికి పైగా మరణించడం, వందలాది మంది గాయపడటంతో నిలువెల్లా వణికిన శ్రీలంక ఉగ్ర ఘటన నేపథ్యంలో బాధ్యులపై చర్యలు చేపడుతోంది. విదేశీ నిఘా వర్గాల నుంచి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పోలీస్ చీఫ్, రక్షణ కార్యదర్శులను రాజీనామా చేయాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తేల్చిచెప్పారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో భద్రతా దళాల నాయకత్వంలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారాన్ని భద్రతాధికారులు తన దృష్టికి తీసుకురాకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతాయనే సమాచారాన్ని బయటకు పొక్కనీయలేదని శ్రీలంక పార్లమెంట్లో సీనియర్ నేత లక్ష్మణ్ కిరిల్లా తెలిపారు. చర్చిలు, హోటళ్లు, రాజకీయ నేతల లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందని ఏప్రిల్ 4న భారత నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, ఏప్రిల్ 7న అధ్యక్షుడు సిరిసేన అధ్యక్షతన జరిగిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై భద్రతాధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల నుంచి దాడులపై సమాచారం ఉన్నప్పటికీ సరైన చర్యలు చేపట్టడంలో టాప్ ఇంటెలిజెన్స్ అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. -
కొలంబోలో మళ్లీ బ్లాస్ట్.. సూసైడ్ బాంబర్లలో మహిళ!
కొలంబో: శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతుండగా.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కొలంబోలో మరో పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ.. ఎవరూ గుర్తించకపోవడం భద్రతా లోపాన్ని స్పష్టంచేస్తోంది. ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే.. ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపినట్టు ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు. మరో ఇద్దరిని బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులుగా గుర్తించారు. 33 ఏళ్ల ఇమ్సాత్ కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్ హోటల్లో, 31ఏళ్ల ఇల్హామ్.. షాంగ్రిల్లా హోటల్లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. ఈస్టర్ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 359కి చేరిన మృతుల సంఖ్య శ్రీలంకలో ఈస్టర్ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం జరుపుతున్న గాలింపు చర్యలు ముమ్మరంగా సాగినట్లు పోలీసు అధికార ప్రతినిధి గుణశేఖర తెలిపారు. మంగళవారం రాత్రి మరో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పవరకు పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య 60కి చేరింది. అలాగే మరిన్ని దాడులు జరిపేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందడంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు. దాడులకు సంబంధించి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు శ్రీలంకను ముందే హెచ్చరించింది. మూడు సార్లు ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా ధ్రువీకరించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. హైదరాబాద్‌కు భౌతికకాయం శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన ఒకరు మృతిచెందారు. మణికొండకు చెందిన బిల్డర్ మాకినేని శ్రీనివాస్, ఆయన బంధువు వేమూరి తులసీరామ్ స్నేహితులతో కలిసి ఐదురోజుల క్రితం శ్రీలంక సమ్మర్ ట్రిప్‌కు వెళ్లారు. శ్రీలంక హోటల్లో ఉన్న సమయంలో జరిగిన బాంబు దాడిలో తులసీరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తులసీరాం భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. -
గాయాల్ని రేపుతున్న దాడులు
ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో జరిగిన దాడులు.. సుదీర్ఘ కాలంపాటు సాగి, పదేళ్ల క్రితం మేలో ముగిసిన అంతర్యుద్ధం జ్ఞాపకాలను మేల్కొలిపాయి. ఈ దాడుల ప్రభావం అంతర్జాతీ యంగా కంటే స్థానిక మతపరమైన అంశాలపై ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు తోడు, తాజాగా మరింత హింస చెలరేగే అవకాశం ఉంది. 1948 తర్వాత కొత్తగా ఏర్పడిన స్వతంత్ర శ్రీలంక.. సింహళ బౌద్ధ జాతీయ దేశంగా అవతరిం చింది. దీంతో మొత్తం ద్వీప మంతా సింహళ తేర వాద బౌద్ధంకు కీలక స్థానంగా మారింది. సింహళ ప్రాబల్యాన్ని అంగీకరించిన మైనారిటీలకు మాత్రమే అక్కడ జీవించే హక్కు ఉంది. దాన్ని వ్యతిరేకించే వారిపై దాడులు తప్పవు. రాజ్యాంగంలో కూడా ఇదే వివక్ష కొనసా గింది. సింహళేతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే గుర్తించారు. రాజ్యం పెంచిపోషిస్తున్న ఈ సింహళ బౌద్ధ స్వభావం దాని వ్యవస్థల్లోకి కూడా పాకింది. భద్రతకు సంబంధించిన విభాగాల్లో ముఖ్యంగా సైన్యంలో పైర్యాంకుల్లో ఉండేవారంతా వారే. అలాగే తమిళ చొరబాటుదార్లను ఏరివేయ డానికి ఏర్పాటు చేసిన విభాగానికి ప్రఖ్యాత సింహళ రాజు పేరిట విజయబహు ఇన్ ఫాంట్రీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. స్వతంత్రత, సమాన హక్కులు కావాలంటూ 1950 నుంచి 1970 వరకు సాగిన తమిళుల శాంతి యుత డిమాండ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోప డంతో ద్వీపంలోని ఈశాన్యంలో తమకు స్వతంత్ర మాతృభూమి కావాలని తమిళులు, హిందూ తమి ళులు, క్రైస్తవులు, ముస్లింలు డిమాండ్ చేసేవరకు వెళ్లింది. దిగువ స్థాయిలో సాగుతున్న యుద్ధం 1983 నాటికి మరింత రాజుకుంది. బ్లాక్ జులై కార్య క్రమాల్లో భాగంగా సింహళ వర్గీయులు తమకు ప్రాబల్యం ఉన్న దక్షిణాదిలో వేలాదిమంది తమి ళులను హతమార్చారు. శ్రీలంక సైన్యం సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని వేలాదిమందిని హతమార్చింది. ఈ నేప థ్యంలో ఏర్పడిన ఎల్టీటీఈకి విస్తృతమైన మద్దతు లభించింది. ఆ సంస్థ ఆత్మాహుతి దళాలను ఏర్పా టుచేసి దక్షిణాదిలో తన ప్రాభవాన్ని చాటుకుంది. ఇదే సందర్భంలో తమిళులు, తమిళం మాట్లాడే ముస్లింల మధ్య ఎవరు అసలైన తమిళులనే విష యమై వైషమ్యాలు చెలరేగి అటు ఎల్టీటీఈ, ఇటు సైన్యం చేతిలో ఇరువర్గాలు ఊచకోతకు గుర య్యాయి. 1990లో ఉత్తర ప్రావిన్స్ నుంచి సుమారు లక్షమంది ముస్లింలను బహిష్కరించ డంతో వీరి మధ్య విభజన రేఖ మరింత పెరిగింది. యుద్ధ సందర్భంలో తమిళ పౌరులకు ఆశ్రయ మిచ్చాయనే నెపంతో శ్రీలంక సైన్యం అనేక చర్చిలు, దేవాలయాలపై తరచూ బాంబు దాడులకు పాల్ప డింది. ఆ దాడులన్నీ మతపరమైనవిగా గాక ప్రభుత్వ అంగీకారం ఉన్నట్టే భావించాలి. మూడు దశాబ్దాల తర్వాత ఎల్టీటీఈ ప్రత్యా మ్నాయ ప్రభుత్వం నడుపుతున్న తరుణంలో శ్రీలంక సైన్యం దాన్ని నెత్తుటి ఏరుల్లో ముంచెత్తి అణచివేసింది. ఈక్రమంలో సుమారు 40వేల మంది చనిపోయినట్టు ఐక్యరాజ్యసమితి ప్రకటించగా, అంతకు ఇంకో లక్ష మంది చనిపోయారని కొందరు సామాజిక కార్య కర్తలు చెబుతారు. యుద్ధం జరుగుతున్నప్పుడు, తర్వాత తమి ళులు అదృశ్యం కావడంపై సైన్యం సమాధానం చెప్పాలని వందలాదిమంది తమిళుల కుటుంబ సభ్యులు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించకపోతే శ్రీలంకలో హింస మరింత పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అధికా రులు కూడా హెచ్చరించారు. 2009 నుంచి సింహళ బౌద్ధ జాతీయులంతా మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవులపై దృష్టిసారిం చారు. తమిళులందరినీ భద్రతా దళాలు తమ ఉక్కు పిడి కిలిలో బంధించగా, సింహళ బౌద్ధ మూకలన్నీ ముస్లింలు, క్రైస్తవులపై తరచూ దాడులకు పాల్ప డ్డాయి. 2018లో ముస్లిం వ్యతిరేక దాడులతోపాటు క్రైస్తవులపై డజన్ల కొద్దీ దాడులు జరి గాయి. గతంలో తమిళులపై జరిగిన హింసాత్మక అణచివేతను చూసిన ముస్లింలు, క్రైస్తవులు సింహళ జాతీయుల దాడులకు చాలా సంయమనం వహించారు. ఏది ఏమైనప్పటికీ, ఈస్టర్ పండుగ రోజు జరిగిన దాడులు గతంలో సింహళీలు జరిపిన హింసా కాండకు ప్రతీకారంగా జరిగినవి కావు. దాడులకు పాల్పడినవారు సింహళ బౌద్ధులను లక్ష్యంగా చేసు కోలేదు. కేవలం క్రైస్తవ సంస్థలు, పర్యాటక సంస్థ లపైనే దాడి చేశారు. తమిళుల సాయుధ పోరాటానికి క్రైస్తవులంతా మద్దతు ప్రకటించారు. ఇప్పటికే హింసను ఎదు ర్కొంటున్న క్రైస్తవులపై మళ్లీ దాడి చేయడం సరి కాదు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో మసీదుపై ఒక క్రిస్టియన్ దాడిచేసి ముస్లింలను హతమార్చినందుకే తాము ఇప్పుడు క్రైస్తవులపై దాడి చేశామని ఐసిస్ ప్రకటించిన నేపథ్యంలో తాజా పరిస్థితులు ఎటు వంటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో, ఏ కొత్త హింస చెలరేగడానికి కారణమవుతాయో చెప్పలేం. మారియో అరుళ్తాస్ (ఆల్జజీరా సౌజన్యంతో...) -
‘శ్రీలంక పేలుళ్లు మా పనే’
కొలంబో : శ్రీలంకను వణికించిన వరుస పేలుళ్లకు తామే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లలో 321 మంది మరణించగా, దాదాపు 500 మంది గాయపడ్డారు. పేలుళ్ల ఘటన ఐఎస్ మిలిటెంట్ గ్రూపు చర్యేనని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. అయితే ఘటన జరిగిన వెంటనే స్పందించే ఐఎస్ ఘటనకు తామే పాల్పడ్డామని ప్రకటించడంలో జాప్యం చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ మసీదులో ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లకు పాల్పడ్డారని శ్రీలంక అధికారులు పేర్కొన్నారు. పేలుళ్ల ఘటనకు లంకకు చెందిన రెండు ఇస్లామిస్ట్ గ్రూపులే బాధ్యులని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌లో మసీదుపై జరిగిన దాడికి ప్రతీకారంగానే వరుస పేలుళ్లు జరిగాయని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువన్ విజేవర్ధనే వెల్లడించారు. కాగా పేలుళ్ల ఘటనకు సంబంధించి అనుమానితుడిగా భావించి ఓ సిరియన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సైనిక వర్గాలు తెలిపాయి. -
బాంబుపేలడానికి ముందు వీడియో.. బ్యాగుతో ఉగ్రవాది!
కొలంబో: శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి భారీ బ్యాగుతోలోపలికి రావడాన్ని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి చర్చిలోకి వచ్చిన తర్వాత, బాంబుపేలడానికి ముందు నుంచి సీసీటీవీ కెమెరా పనిచేయడం ఆగిపోయింది. ఆ వ్యక్తే ఆత్మహుతిదాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 310కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. సెయింట్ సెబాస్టియన్ చర్చితోపాటూ కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరీ ఫైవ్‌స్టార్ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన 40 మందిని అరెస్ట్ చేశారు. -
‘ఫన్ మొదలైంది.. త్వరలోనే కలుస్తాను శ్రీలంక’
కొలంబో : అమెరికాకు చెందిన ఓ టెకీ శ్రీలంక బాంబు పేలుళ్లలో చనిపోవడానికి ముందు తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన చివరి మెసేజ్ ప్రస్తుతం తెగ వైరలవుతోంది. డైటర్ కోవల్స్కి(40) అనే వ్యక్తి బ్రిటన్‌కు చెందిన విద్యా, ప్రచురణ సంస్థ పియర్సన్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శుక్రవారం ఆఫీస్ పని నిమిత్తం శ్రీలంక బయలుదేరాడు. ప్రయాణం ప్రారంభం కావడానికి ముందు డైటర్ తన ఫేస్బుక్లో ‘ఫన్ మొదలైంది. వర్క్ ట్రిప్స్‌ని నేను చాలా ఇష్ట పడతాను. 24 గంటల ప్రయాణం. శ్రీలంక.. త్వరలోనే నిన్ను చూస్తాను’ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీలంకలో దిగిన తరువాత కంపెనీ తన కోసం రూమ్ బుక్ చేసిన హోటల్‌కు చేరుకున్నాడు. ఫోన్ చేసి ఈ విషయాన్ని సీఈవోకు తెలియజేశాడు. ఓ వారం రోజుల్లో పని ముగించుకుని తిరుగు ప్రయాణం అవుతానని తెలిపాడు డైటర్. కానీ ఆదివారం జరిగిన బాంబు పేలుళ్లలో అతను మృతి చెందాడు. ఈ విషయం గురించి ఆ కంపెనీ సీఈవో మాట్లాడుతూ.. ‘డైటర్ ఎప్పుడూ తాను నవ్వుతూ ఉండటమే కాక.. తన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచుతాడు. అతని మంచితనం వల్ల ఎక్కడి వెళ్తే అక్కడ కొత్త స్నేహితులను తయారవుతుంటారు. ఎలాంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరిస్తాడు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడానికి డైటర్ కొలంబో వెళ్లాడు. అక్కడ ఓ వారం రోజుల పాటు ఉండి.. తన స్థానిక స్నేహితులతో కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలనుకున్నాడు. కానీ దుష్టులు చేసిన దాడిలో చాలా మంది అమాయకుల్లానే డైటర్ కూడా కన్ను మూశాడు. డైటర్ లాంటి వారు కొత్తవి సృష్టించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఉగ్రదాడికి పాల్పడిని వారికి కేవలం నాశనం చేయడం మాత్రమే తెలుసు’ అంటూ సదరు సీఈవో విషాదం వ్యక్తం చేశారు. -
చివరికి మిగిలింది సెల్ఫీ
వాళ్లకి తెలీదు మృత్యువు పక్కనే పొంచి ఉందని. వాళ్లకి తెలీదు రక్త పిశాచాలు మరో క్షణంలో దారుణమైన ఘాతుకానికి ఒడిగడతారని. తమిళవేర్పాటు ఉద్యమం సద్దుమణిగాక శాంతి పవనాలు వీస్తున్న శ్రీలంకలో ఉగ్రమూకలు పంజా విసురుతాయని ఎవరు ఊహించగలరు?. బ్రిటన్ నుంచి శ్రీలంక చూడడానికి టూరిస్టులుగా వచ్చిన ఒక కుటుంబం కొలంబోలో ఒక హోటల్లో దిగింది. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ని ఎంజాయ్ చేయడానికి డైనింగ్ రూమ్‌కి కుటుంబ సభ్యులు వచ్చారు. తినడానికి ముందు నవ్వుతూ తుళ్లుతూ జోకులు వేసుకుంటూ సెల్ఫీ దిగారు. వారిలో ఒకమ్మాయి వెంటనే తన ఫేస్బుక్ అకౌంట్లో ఆ సెల్ఫీ షేర్ చేసింది. ఆ ఫొటో షేరయిన క్షణంలోనే హోటల్లో బాంబుల మోత మోగింది. ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు ఆగిపోయాయి. అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. కుటుంబంలో మిగిలిన సభ్యులందరూ కూడా బాంబు దాడిలో చనిపోయారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చర్చిలు, హోటల్స్ టార్గెట్‌గా శ్రీలంక మారణహోమంతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ బ్రిటిష్ టూరిస్టు ఫ్యామిలీ ఆఖరి సెల్ఫీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చివరికి సెల్ఫీయే మిగిలిందా అంటూ నెటిజన్లు బాధగా నిట్టూరుస్తున్నారు. -
ఆగని కన్నీళ్లు
కొలంబో: శ్రీలంకలోని ఉగ్రమూకల రాక్షసక్రీడలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య అమాంతం పెరిగింది. మూడు చర్చిలు, మూడు ఐదు నక్షత్రాల హోటళ్లపై ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 215 మంది చనిపోగా, తాజాగా చికిత్స పొందుతూ మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 290కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 500 మందికిపైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చితో పాటు షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరీ ఫైవ్‌స్టార్ హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. వరుస బాంబుపేలుళ్ల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఓ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురికి కొలంబో మేజిస్ట్రేట్ మే 6 వరకూ రిమాండ్ విధించారు. విచారణ కమిటీ ఏర్పాటు... ఈ విషయమై శ్రీలంక ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడుల వెనుక నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) ఉన్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ‘ఈ ఉగ్రదాడిలో ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారు. వీరంతా శ్రీలంక వాసులేనని అనుమానిస్తున్నాం. ఎన్టీజేకు విదేశీ సాయం అందిందా? ఈ సంస్థకు విదేశీ ఉగ్రమూకలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ సాగుతోంది. ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ)కి అప్పగించాం. ఉగ్రదాడి జరిగే అవకాశముందని నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏప్రిల్ 11కు ముందుగానే పోలీస్ ఐజీ పుజిత్ జయసుందరకు సమాచారం అందించారు. నిఘా సంస్థల హెచ్చరికలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐజీ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఈ ఉగ్ర దుశ్చర్య నేపథ్యంలో ఈ నెల 23న జాతీయ సంతాప దినంగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఈ దాడి ఘటనపై అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. రెండు వారాల్లోగా విచారణను పూర్తిచేసి నివేదికను అందించాలని ఆదేశించారు. జాతీయ భద్రతా మండలి భేటీ.. ఉగ్రదాడి నేపథ్యంలో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో సమావేశమైన జాతీయ భద్రతా మండలి(ఎన్ఎస్సీ).. సోమవారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించాలని నిర్ణయం తీసుకుంది. కేవలం ఉగ్రమూకలను ఏరివేసేందుకే ఈ అత్యవసర పరిస్థితిని విధించా మనీ, ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బంది లేదని అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు కోర్టు వారంట్ లేకుండానే ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారించేందుకు వీలవుతుంది. ఈ ఉగ్రదాడి వెనుక విదేశీ ఉగ్రసంస్థల హస్తం ఉండొచ్చన్న నిఘావర్గాల సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదంపై పోరుకు శ్రీలంక విదేశాల సాయం కోరే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు పరిహారం.. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో నష్టపోయిన కుటుంబాలకు శ్రీలంక ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఈ విషయమై శ్రీలంక ఆరోగ్య మంత్రి రజిత సేనరత్నే మాట్లాడుతూ.. ‘ ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు 10 లక్షల శ్రీలంక రూపాయలను అందజేస్తాం. అలాగే అంత్యక్రియల నిర్వహణకు మరో రూ.లక్ష ఇస్తాం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మధ్యలో నష్టపరిహారం అందజేస్తాం. ఉగ్రదాడిలో దెబ్బతిన్న చర్చిలను ప్రభుత్వమే పునర్నిర్మిస్తుంది. ఇప్పటివరకూ ఓ అతివాద సంస్థకు చెందిన 24 మందిని అరెస్ట్‌చేశాం. అనవసర ప్రచారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే వీరి వివరాలను బయటపెట్టడం లేదు’ అని స్పష్టం చేశారు. 10 లక్షల శ్రీలంక రూపాయలు తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష నుంచి రూ.3 లక్షలు. దాడి వెనుక ఐసిస్ హస్తం? శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 290 మంది చనిపోవడం వెనుక ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) హస్తం ఉండే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రదాడి విషయంలో భారత ప్రభుత్వం శ్రీలంకతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించాయి. ఈ విషయమై శ్రీలంకకు చెందిన భద్రతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ దాడి తీవ్రత, జరిగిన తీరును చూస్తే దీన్ని ఐసిస్ ఉగ్రవాదులే చేసినట్లు అనిపిస్తోంది. ఆత్మాహుతిదాడిలో వాడిన పేలుడు పదార్థాలు, డిటోనేటర్లను జాగ్రత్తగా మరింత క్షుణ్ణంగా విశ్లేషించాల్సిన అవసరముంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికే శ్రీలంకలోని చర్చిలను ఈస్టర్ రోజున ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రసంస్థ లష్కరే తోయిబా శ్రీలంకలో అడుగుపెట్టేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాల వద్ద సమాచారం ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌లో రెండు మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న 50 మంది ముస్లింలను బ్రెంటన్ అనే క్రైస్తవ శ్వేతజాతీయుడు కాల్చిచంపినందుకు ప్రతీకారంగా శ్రీలంక ఐసిస్ మాడ్యూల్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉండొచ్చు’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు శ్రీలంకలోని బౌద్ధులు క్రైస్తవ మతం స్వీకరించడంపై ఇరువర్గాల మధ్య స్వల్పఘర్షణలు చోటుచేసుకున్నాయనీ, దాని కారణంగానే ఈ బాంబు పేలుళ్లు జరిగి ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘేను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షాలే ఈ దాడులకు తెగబడ్డాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. మృతుల్లో 8 మంది భారతీయులు దొడ్డబళ్లాపుర / తుమకూరు: శ్రీలంక ఉగ్రదాడుల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య సోమవారం నాటికి ఎనిమిదికి చేరుకుంది. బాంబు పేలుళ్లలో లక్ష్మీ, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ గౌడ చనిపోయినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అంతకుముందు ప్రకటించగా, ఇదే దాడుల్లో కె.జి.హనుమంతరాయప్ప, ఎం.రంగప్ప, హెచ్.శివకుమార్, వేమురై తులసీరాం, ఎస్.ఆర్.నాగరాజ్ చనిపోయినట్లు కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. చనిపోయివారిలో ఐదుగురు జేడీఎస్ నేతలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే కేరళకు చెందిన పీఎస్ రసైనా(58) ఈ ఉగ్రదాడిలో దుర్మరణం చెందినట్లు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. అయితే రసైనా మృతిని శ్రీలంక అధికారులు ధ్రువీకరించలేదు. వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను విధిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కొలంబోలోని పెట్టాహ్ ప్రాంతంలో ఉన్న బస్‌స్టేషన్‌లో పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను కనుగొన్నారు. అలాగే ఈ ఘాతుకానికి తెగబడేముందు ఉగ్రమూకలు దక్షిణ కొలంబోలోని పనదుర ప్రాంతంలో 3 నెలలపాటు తలదాచుకున్న ఇంటిని గుర్తించారు. కాగా, కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేదారిలో 6 అడుగుల పైపులో అమర్చిన శక్తిమంతమైన ఐఈడీ బాంబును అధికారులు గుర్తించారు. కొలంబోలో మరో బాంబు పేలుడు.. కొలంబోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో సోమవారం మరో బాంబు పేలుడు సంభవించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. దీంతో అధికారులు స్పందిస్తూ.. ఉగ్రవాదులు ఓ వాహనంలో బాంబును అమర్చారని తెలిపారు. దీన్ని నిర్వీర్యం చేస్తుండగా బాంబు ఒక్కసారిగా పేలిందన్నారు. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. -
నిర్లక్ష్యానికి మూల్యం
ఉగ్రవాద దాడులు, విధ్వంసం ఉదంతాలను దాదాపు మరిచిపోయిన శ్రీలంక ఈస్టర్ పర్వదినాన నెత్తురోడిన తీరు ఉగ్రవాదంపై ఉపేక్ష ఎంతటి ముప్పు తెచ్చిపెడుతుందో తేటతెల్లం చేసింది. ఆది వారంనాడు శ్రీలంక రాజధాని నగరం కొలంబోలో చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు.. అటు ఉత్తరప్రాంత నగరమైన బట్టికలోవలోని చర్చిలో కూడా ఉగ్రవాదులు కేవలం నిమిషాల వ్యవధిలో దారుణ మారణహోమాన్ని సృష్టించడం.. వాటికి 300మంది అమాయకులు బలికావడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. అంతవరకూ ఎంతో సందడిగా కనబడిన ప్రాంతాలన్నీ వల్లకాళ్లుగా మారడం, ఎటుచూసిన మాంసపు ముద్దలే దర్శనమీయడం, తమను కాపాడమంటూ గాయపడినవారు ఆర్తనాదాలు చేయడం ఎంతటివారినైనా కలచివేస్తుంది. దాడులకు ఎంచుకున్న సందర్భాన్ని, ప్రాంతాలను గమనిస్తే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా అర్ధమ వుతుంది. విదేశీ పర్యాటకులు, వ్యాపారవేత్తలు, స్థానిక సంపన్నులు సందర్శించే విలాసవంతమైన హోటళ్లపై ఉగ్రవాదులు గురిపెట్టారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే పర్యాటకం దెబ్బతింటుందని వారు భావించినట్టు కనబడుతుంది. ఘటనలు జరిగిన 24 గంటల తర్వాత కూడా ఏ సంస్థా తామే ఈ పని చేశామని ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ ఆత్మాహుతి దాడులేనా కాదా అన్నది కూడా ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఈ దాడులు సరిగ్గా పదకొండేళ్లక్రితం మన ముంబై నగరంపై ఉగ్రవాదులు సాగించిన యుద్ధాన్ని గుర్తుకు తెచ్చాయి. అప్పట్లో ఉగ్రవాదులు రెండు విలాసవంతమైన హోటళ్లు, ఎప్పుడూ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్, యూదుల సామాజిక కేంద్రం వంటివి ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా మరణాల సంఖ్య అధికంగా ఉండేలా క్రైస్తవ పర్వదినాన్ని ఎంచుకుని, చర్చిలను లక్ష్యంగా చేసుకు న్నారు. విలాసవంతమైన హోటళ్లలో బాంబులు పేల్చారు. కొలంబోలోని కొచికడేలో ఉన్న సెయింట్ ఆంథోనీ కాథలిక్ చర్చి పర్యాటకపరంగా ఎంతో సుప్రసిద్ధమైనది. విదేశీ యాత్రికులు తప్పనిసరిగా సందర్శించే స్థలం. ఆత్మాహుతి దాడులు, విధ్వంస ఘటనలు శ్రీలంక గతంలోనూ చవిచూసింది. దాదాపు మూడు దశాబ్దాలపాటు తమిళ టైగర్ల కార్యకలాపాలతో అట్టుడికిన దేశ మది. ఆ సంస్థను నామరూపాల్లేకుండా చేసి పదేళ్లవుతోంది. సుదీర్ఘకాలం ఇటువంటి ఘటనలతో తలపడి, ఎంతో అనుభవాన్ని సంపాదించిన దేశం ఇంత ఏమరుపాటుగా, ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంది? చూడటానికి అన్నిచోట్లా భద్రత కట్టుదిట్టంగానే ఉన్నట్టు కనబడుతుంది. పైగా ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని పక్షంరోజులక్రితమే ప్రభుత్వానికి ఉప్పందింది. కానీ ప్రజలను అప్రమత్తం చేయడంలో, ముష్కరులను నిలువరించడంలో అది ఘోరంగా విఫలమైంది. ఈ ఉన్మాదం వెనక స్థానికంగా పనిచేసే నేషనల్ తోహబుత్ జమాత్ (ఎన్టీజే) అనే ఉగ్రవాద సంస్థ ఉన్నదని ప్రభుత్వం చెబుతోంది. కానీ అది పుట్టి అయిదేళ్లు కాలేదు. ఆ సంస్థ నిరుడు సాగించిన బుద్ధ విగ్రహాల విధ్వంసంతో తొలిసారి వార్తల్లోకెక్కింది. అలాంటి సంస్థ ఇంత పకడ్బందీగా, ఇంత భారీయెత్తున దాడులు చేయగలిగిందంటే నమ్మశక్యంగా అనిపించదు. ఈ స్థాయి దాడులు చేయా లంటే పటిష్టమైన పథకం రచించుకోవాలి. దాన్ని అమలు చేయడానికి భారీయెత్తున నిధులు సమ కూర్చుకోవాల్సి ఉంటుంది. బాంబులను అవసరమైన ప్రాంతాలకు చేరేయడానికి కావలసిన మను షులు అందుబాటులో ఉండాలి. ఇదంతా స్థానికంగా, అదికూడా పరిమితమైన ప్రాంతంలో కార్య కలాపాలు సాగించే సంస్థకు సాధ్యం కాదు. ఆ దేశంలో అధిక సంఖ్యాకులైన బౌద్ధ మతానికి చెందిన సింహళ జాతీయులతో గతంలో తమిళులకు తరచు ఘర్షణలు తలెత్తేవి. నిరుడు బౌద్ధు లకూ, ముస్లింలకూ మధ్య ఘర్షణలు జరిగాయి. కానీ దేశంలో ఎప్పుడూ క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న ఉదంతాలు లేవు. తమిళ టైగర్ల ఆధిపత్యం ఉన్న ఉత్తర తూర్పు ప్రాంతంలో సైతం క్రైస్తవులపై ఎప్పుడూ దాడులు జరగలేదు. దేశ జనాభాలో వారు మైనారిటీలు. వేరే జాతులతో వైరం లేదు. కనుకనే దాడులు జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా జరిగాక ఆదరా బాదరాగా చర్యలు తీసుకోవడం రివాజే. లంక ప్రభుత్వం కూడా ఆ పనే చేసింది. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను ఆపేసింది. ఇటీవల న్యూజి లాండ్‌లోని క్రైస్ట్ చర్చిలో ఉగ్రవాది తాను సాగించిన మారణకాండను ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు ఫేస్బుక్ దాన్ని సకాలంలో గమనించి అరికట్టలేకపోయింది గనుక ఈ చర్య తీసుకోవడాన్ని అర్ధం చేసుకోవచ్చు. వెనువెంటనే కర్ఫ్యూ విధించి నిందితుల గాలింపు ప్రారంభించి దాదాపు 30మందిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ముందస్తు సమాచారాన్ని భద్రతా వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదో అంతుబట్టదు. నిర్దిష్టంగా చర్చిలపై దాడులు జర గొచ్చునని కూడా ఆ సమాచారం తెలిపింది. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. జాతుల ఘర్షణలు సర్వసాధారణమైన దేశంలో తాజా దాడులు ఎలాంటి పరిణామాలను తీసు కొస్తాయో ఊహించడం అసాధ్యం కాదు. నాలుగేళ్లక్రితం వరకూ రహదారులు దిగ్బంధించి ముమ్మరంగా తనిఖీలు చేసే విధానం అమల్లో ఉండేది. అంతా సవ్యంగా ఉన్నదని భావించి ఆ సంప్రదాయానికి దేశంలో పూర్తిగా స్వస్తి పలికారు. తమిళ టైగర్లు అంతరించాక దేశం ప్రశాంతంగా ఉన్నదని భావించి విదేశీ పర్యాటకులు వెల్లువలా వస్తున్నారు. కానీ ప్రభుత్వానికి కూడా అవే భ్రమలున్నట్టున్నాయి. అందుకే నిఘాను అటకెక్కించింది. దాడులపై వచ్చిన ముందస్తు సమా చారాన్ని సైతం నిర్లక్ష్యం చేసే స్థితికి చేరుకుంది. ఈ తప్పిదానికి దాదాపు 300 మంది తమ ప్రాణా లను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తరచు పంజా విసు రుతున్న వర్తమానంలో ప్రతి దేశమూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసు కోవాలని లంక పేలుళ్లు హెచ్చరిస్తున్నాయి. -
శ్రీలంకలో ఎమర్జెన్సీ : కొలంబోలో 87 బాంబులు లభ్యం
కొలంబో : వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుందనే సంకేతాలు పంపారు. ఎమర్జెన్సీపై అధ్యక్ష కార్యాలయం అధికారికంగా ప్రకటన చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా భయం గుప్పిట్లోనే ఉంది. కొలంబో మెయిన్ బస్టాండ్ వద్ద సోమవారం పోలీసులు 87 బాంబు డిటోనేటర్లను గుర్తించారు. భారీ పేలుళ్లకు కుట్ర జరిగిందని అధికారులు వెల్లడించారు. 24 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. కొలంబో వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు దాడి వెనుక నేషనల్ తౌహీత్ జమాద్ హస్తముందని భావిస్తున్నారు. ఈ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సహకరించాయని చెబుతున్నారు. ఇక శ్రీలంక వరుస పేలుళ్లలో మృతుల సంఖ్య 300కు చేరువైంది. మరో బాంబు పేలుడు శ్రీలంకను వరస బాంబు పేలుళ్లు వణికిస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం కొచ్చికేడ్‌లోని సెయింట్ ఆంథోనియా చర్చి వద్ద మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. తాజా పేలుడుతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొలంబోలోని హోటళ్లన్నింటినీ విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. శ్రీలంక వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. -
శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్ నేతల మృతి
కొలంబో : శ్రీలంకలో బాంబు పేలుళ్ల ఘటన తర్వాత కర్ణాటకలోని జేడీఎస్ పార్టీకి చెందిన ఏడుగురు నేతలు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందినట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. వారిని కేజీ హనుమంతరాయప్ప, ఎం. రంగప్పగా గుర్తించారు. వీరంతా ఎన్నికల ప్రచారం అనంతరం ఈ నెల 20న శ్రీలంకకు వెళ్లారు. కొలొంబోలోని ‘ద షాంగ్రిలా హోటల్’లో రెండు గదుల్లో బస చేసినట్లు సమాచారం. అదే చోట బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. అదృశ్యమైన వారిలో శివన్న, పుట్టరాజు, మునియప్ప, లక్ష్మీనారాయణ, మారేగౌడ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చదవండి : దివ్య సందేశంపై రాక్షస కృత్యం! కాగా జేడీఎస్ నేతల మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ నేతల గల్లంతు తనను షాక్ గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. గల్లంతైన నేతల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో ఇప్పటి వరకు మృతిచెందిన సంఖ్య 290కి చేరింది. 500మందికి పైగా గాయపడ్డారు. External affairs Min. @SushmaSwaraj has confirmed the death of two Kannadigas,KG Hanumantharayappa and M Rangappa, in the bomb blasts in #Colombo. I am deeply shocked at the loss of our JDS party workers, whom I know personally. We stand with their families in this hour of grief — H D Kumaraswamy (@hd_kumaraswamy) 22 April 2019 -
శ్రీలంకలో 13.8 కోట్ల మంది చనిపోయారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో చోటుచేసుకున్న మారణకాండలో ఏకంగా 138 మిలియన్ల మంది(13.80 కోట్లు) చనిపోయారని, 600కుపైగా జనం గాయపడ్డారని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజల తరపున శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నానన్నారు. మృతులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో లంక పౌరులకు అండగా నిలిచేందుకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీలంకలో 13.80 కోట్ల మంది మృతి చెందారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. అన్నింటినీ మిలియన్లలో లెక్కించలేమని, సానుభూతి సందేశంపై కూడా శ్రద్ధ చూపకపోతే అది నిజమైన సానుభూతి ఎలా అవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘‘మా దేశ జనాభా 2.17 కోట్లే, అలాంటప్పుడు 13.80 కోట్ల మంది మరణించడం అసాధ్యం, మీ సానుభూతి మాకేం అక్కర్లేదు’’అని శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. ట్రంప్ లెక్క ప్రకారం ఇప్పుడు మా దేశం ప్రజలెవరూ లేకుండా ఖాళీగా మారింది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ పలుమార్లు తప్పుడు ట్వీట్లు చేసి నవ్వుల పాలయ్యారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
మేమున్నాం.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీలంక రాష్ట్రపతి మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ‘అత్యంత క్రూరమైన, అనాగరిక చర్య’గా అభివర్ణించారు. ఈ షాక్‌నుంచి కోలుకోవడంతోపాటు, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శ్రీలంకకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందనడానికి శ్రీలంకలో వరుసపేలుళ్లు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ‘సీమాంతర ఉగ్రవాదంతోపాటు, ఇలాంటి ఉన్మాదపు దాడులకు పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజమంతా ఏకమవ్వాలి. దీన్ని సమర్థించుకునే ఏ చర్యనూ సహించకూడదు’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదివారం శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస ఆత్మాహుతిదాడుల్లో 200 మందికి పైగా చనిపోగా.. 500 మందికి పైగా గాయలయ్యాయి. ‘మృతుల కుటుంబాలకు, శ్రీలంక ప్రభుత్వానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి దారుణమైన దాడులకు పాల్పడిన వారెంతవారైనా కఠినంగా శిక్షించాల్సిందే’అని విదేశాంగశాఖ ప్రకటన పేర్కొంది. ‘కొలంబోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఖండించిన దేశాధినేతలు లండన్/కొలంబో/ముంబై: శ్రీలంకలో ఉగ్రదాడులను ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఖండించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ తదితర దేశాధినేతలతోపాటు పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైందిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతి శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రదినం రోజున అనాగరిక, క్రూరచర్యతో విలువైన ప్రాణాలను తీశారని అన్నారు. బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదివారం ట్విటర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. మానవత్వానికే మచ్చ సాక్షి, అమరావతి: శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చని, ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కిరాతక చర్య: జగన్ సాక్షి, అమరావతి: శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మారణహోమాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కిరాతక చర్యలకు బలైన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి విచక్షణారహితమైన హింసకు తావే లేదని జగన్ అభిప్రాయపడ్డారు. అమాయకులను బలిగొన్న ఈ దుశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండింస్తూ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
లంకలో వెల్లువెత్తిన రక్తదాతలు
కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్య వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. బాంబు దాడుల్లో గాయపడిన వారిలో చాలామందిని కొలంబో నేషనల్ హాస్పిటల్, బట్టికలోవా ఆసుపత్రులకు తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో రక్తం నిల్వలు సరిపడా లేకపోవడంతో, బాధితులను రక్షించేందుకు వెంటనే రక్తదానం చేయాలంటూ శ్రీలంక నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. రక్తదాన కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తమ రక్తం ఇచ్చేందుకు పోటీ పడ్డారు. అంతేకాకుండా బాధితులకు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ తమ మిత్రులకు కూడా సమాచారం చేరవేశారు. ఫలానా గ్రూప్ రక్తం అత్యవసరంగా కావాలని పేర్కొంటూ చాలామంది ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. రక్తంఇచ్చేందుకు వచ్చిన వారి ఫొటోలను షేర్ చేశారు. రాజధాని కొలంబోలోని నేషనల్ బ్లడ్ బ్యాంకు రక్తదాతలతో కిక్కిరిసిపోయింది. సమీపంలోని ఆసుపత్రులు, రక్తదాన కేంద్రాల్లో రక్తదానం చేయాలంటూ ముస్లింలకు ముస్లిం కౌన్సిల్ ఆఫ్ శ్రీలంక పిలుపునిచ్చింది. ఉగ్రదాడులను కొలంబో ఆర్చిబిషప్ మాల్కోమ్ కార్డినల్ రంజిత్ తీవ్రంగా ఖండించారు. రక్తదానం చేసి, క్షతగాత్రులకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు. క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడుల నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబో నుంచి భారత్‌కు ఈ నెల 24వ తేదీ వరకూ రాకపోకలు సాగించే తమ విమానాల్లో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలను ఎయిర్ ఇండియా యాజమాన్యం రద్దు చేసింది. అలాగే రీషెడ్యూలింగ్ చార్జీలను సైతం వసూలు చేయబోమని ట్విట్టర్లో ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిత్యం ఢిల్లీ నుంచి రెండు, చెన్నై నుంచి ఒక విమానాన్ని కొలంబోకు నడుపుతోంది. -
అల్పాహారం క్యూలో నిలుచునే!
కొలంబో: శ్రీలంకలో భారీ పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో కొలంబోలోని లగ్జరీ హోటల్ ‘సినమన్ గ్రాండ్ హోటల్’ఒకటి. ఈస్టర్ సండే అల్పాహారం కోసం అందరూ క్యూలో నిలబడ్డారు. వీరితోపాటే ఈ ఉన్మాద ఘటనకు కారణమైన ఉగ్రవాది కూడా మానవబాంబు రూపంలో అదే క్యూలో నిలుచున్నాడు. క్యూలో వచ్చిన ఆజం ప్లేట్లో అల్పాహారం వడ్డిస్తుండగానే.. ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే.. ఆ లాంజ్ అంతా రక్తపుమరకలు.. ‘ప్లీజ్ కాపాడండం’టూ ఆర్తనాదాలతో నిండిపోయింది. ‘ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈస్టర్ బ్రేక్‌ఫాస్ట్ కోసం లాంజ్ బిజీగా ఉంది. ఇందులో కుటుంబాలతో వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. అందరూ క్యూలో వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కళ్లముందు శవాలు పడి ఉన్నాయి. మిగిలినవారు ఓవైపు గాయాలై రక్తం కారుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. క్షణాల్లోనే మనుషులంతా రక్తపు ముద్దలుగా మారిపోయిన భయానక వాతావరణంలోనూ.. మా సిబ్బంది తక్షణమే స్పందించి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాం. దాదాపు 20 మంది పరిస్థితి చాలా విషమంగా అనిపించింది. వీరిని నేషనల్ హాస్పిటల్ పంపించాం’అని ఆ హోటల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు అతిథులను ఆహ్వానిస్తున్న తమతోటి మేనేజర్ ఒకరు కూడా ఈ దుర్ఘటనలో మృతుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కుదరకపోవడంతోనే! ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉన్మాది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిని పోలీసులు సేకరించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం శ్రీలంక జాతీయుడే అయిన ఉన్మాది ఆజం.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి బిజినెస్ పనిమీద వచ్చానంటూ మరో రెండు హోటల్స్‌లో గదులకోసం ప్రయత్నించాడు. ఆయా హోటళ్ల మేనేజర్లు తిరస్కరించడంతో చివరకు శనివారం రాత్రి సినమన్ గ్రాండ్ హోటల్లో చేరి ఇంతమంది ప్రాణాలు తీశాడని వెల్లడైంది. సినమన్ గ్రాండ్తోపాటు షాంగ్రి–లా, కింగ్స్బరీ హోటళ్లతోపాటు ఈస్టర్ ప్రార్థనలకోసం వచ్చిన మరో మూడు చర్చిల్లోనూ ఉన్మాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. చారిత్రక సెయింట్ ఆంథోనీస్ కేథలిక్ చర్చ్‌లో అత్యంత తీవ్రతరమైన పేలుడు జరిగింది. చర్చ్ పైకప్పు ఊడి కిందపడడంతోపాటు.. అలంకరించిన లైట్లు, అద్దాలు విరిగిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దాడులకు కారణం ఎవరనేదానిపై ఇంతవరకు అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ దుర్ఘటనలో 35 మంది విదేశీయులు మృతిచెందారు. వీరంతా ఆయా హోటళ్లలో జరిగిన పేలుళ్లలోనే చనిపోయారు. ప్రధాని నివాసానికి సమీపంలోనే.. హోటల్ సినమోన్ గ్రాండ్‌కు సమీపంలోనే శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం ఉండడంతో.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో సహాయక కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. షాంగ్రి–లా హోటల్లోని టేబుల్ వన్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు వినిపించాయి. అయితే.. ఈ ఘటనలో ఎందరు మరణించారో ఇంకా స్పష్టత రావడం లేదు. ఆ హోటల్ రెండో అంతస్తులోని రెస్టారెంట్లో పేలుడు ధాటికి కిటికీలు ఎగిరిపోయాయి. పైకప్పులో ఉన్న విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ‘హోటల్లో ఉన్న మిగిలిన వారి భద్రతే మా ప్రాధాన్యత. వారిని కాపాడేందుకు మా విపత్తు నిర్వహణ బృందం పనిచేస్తోంది’అని షాంగ్రి–లా హోటల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మృతుల దిబ్బగా కింగ్స్బరీ కొలంబో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలోని కింగ్స్బరీ హోటల్.. నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ జరిగిన పేలుడులోనూ మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎందరు చనిపోయారు.. వారి వివరాలేంటనేది మాత్రం తెలియరాలేదు. ‘ఈ ఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఈ వరుస బాంబుపేలుళ్లపై యావత్ శ్రీలంక మౌనంగా రోదిస్తోంది. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాం. వారికి అవసరమైన వైద్యసేవలను అందించడంలో మా వంతు సాయంచేస్తున్నాం. హోటల్ మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించాం’అని కింగ్స్బరీ హోటల్ యాజమాన్యం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. చర్చిలో మాంసం ముద్దలు కొలంబో: ముష్కర మూకల రక్తదాహానికి అమాయక భక్తులు బలయ్యారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం బాంబు దాడులు జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చి, సెయింట్ ఆంథోనీస్ చర్చిలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. చర్చిల గోడలకు మనుషుల మాంసపు ముద్దలు అతుక్కుపోయాయంటే పేలుళ్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా రక్తపు మడుగులే దర్శనమిచ్చాయి. పేలుళ్ల తీవ్రతకు అద్దాలు పగిలి చెల్లాచెదురుగా పడిపోయాయి. కుర్చీలు సైతం విరిగిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. సెబాస్టియన్ చర్చి బయట కూడా మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. చర్చిల్లో ఈ దారుణ దృశ్యాలను చూసి పోలీసులు, సహాయక సిబ్బంది చలించిపోయారు. సెబాస్టియన్ చర్చి ప్రాంగణంలో 30 మృతదేహాలు లభించాయని ఆర్చిడయాసిస్ ఆఫ్ కొలంబో ప్రతినిధి ఫాదర్ ఎడ్మండ్ తిలకరత్నే చెప్పారు. ఈ చర్చిలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మతబోధకులు గాయపడ్డారని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ చర్చికి సమీప గ్రామాల నుంచి 1,000 మందికిపైగా భక్తులు వచ్చారని వెల్లడించారు. శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన సెబాస్టియన్ చర్చిని నెగొంబో పట్టణంలో 1946లో నిర్మించారు. క్యాథలిక్ చర్చి చరిత్రలో అమరవీరుడిగా పేరుగాంచిన సెయింట్ సెబాస్టియన్‌కు దీన్ని అంకితం చేశారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పేలుళ్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కొలంబో ఆర్చిబిషప్ కార్డినల్ మాల్కోమ్ రంజిత్ డిమాండ్ చేశారు. ద్వీప దేశానికి నెత్తుటి గాయాలు శ్రీమహాబోధి దాడి (1985): అనురాధాపురాలో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో క్రైస్తవ సన్యాసులు (నన్స్), బౌద్ధ భిక్షవులతో సహా 146 మంది పౌరులు మరణించారు. ► అలూత్ ఒయా నరమేధం (1987): సింహళీ జాతీయులపై ఎల్టీటీఈ చేసిన దాడిలో 127 మంది మరణించారు. ► శ్రీలంక పార్లమెంట్‌పై గ్రెనేడ్ దాడి (1987): శ్రీలంక పార్లమెంట్‌పై ఎల్టీటీఈ తీవ్ర వాద సంస్థ జరిపిన గ్రెనేడ్ బాంబు దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ► కొలంబో బస్‌స్టేషన్‌లో బాంబుదాడి (1987): కొలంబో బస్‌స్టేషన్‌లో జరిగిన కారు బాంబు దాడిలో 113 మంది పౌరులు మరణించారు. ► కట్టంకూడి మసీదులో నరమేధం (1990): కట్టంకూడి మసీదులో ఎల్టీటీఈ చేసిన దాడిలో 147 మంది ముస్లింలు చనిపోయారు. ► పల్లుయగొదెల్లా నరమేధం (1992): సింహళ జాతీయులే లక్ష్యంగా పల్లుయగొదెల్లాలో ఎల్టీటీఈ తీవ్రవాదులు చేసిన దాడిలో 285 మంది దుర్మరణం పాలయ్యారు. ► కొలంబో సెంట్రల్ బ్యాంకుపై బాంబుదాడి (1996): కొలంబో సెంట్రల్ బ్యాంకు మెయిన్ గేటువద్ద ఎల్టీటీఈ అమర్చిన ట్రక్కు బాంబు దాడిలో 91 మంది మరణించారు. ► దిగంపతన బాంబుదాడి (2006): దిగంపతనలో 15 మిలిటరీ కాన్వాయ్ బస్సులపై ఎల్టీటీఈ ట్రక్కు బాంబు దాడిలో 120 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ధ్వంసమైన సినమన్ హోటల్ సెబాస్టియన్స్ చర్చిలో చెల్లాచెదురుగా మృతదేహాలు ఆదివారం కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చి వద్ద రోదిస్తున్న బాధితులు సెబాస్టియన్స్ చర్చి వద్ద గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం ఉగ్రవాదుల కోసం ఓ హోటల్ వద్ద హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు -
దివ్య సందేశంపై రాక్షస కృత్యం!
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక నెత్తురోడింది. క్రైస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు నరహంతకులు మారణహోమం సృష్టించారు. రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఆదివారం జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. పేలుళ్ల అనంతరం ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీ యులు మరణించారు. చనిపోయిన వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు. లక్ష్మి, నారాయణ్ చంద్రశేఖర్, రమేశ్ అనే ముగ్గురు భారతీయులు మరణించారనీ, వీరి గురించిన అధిక వివరాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సుష్మ తెలిపారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నా మని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడులను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. వాటికన్ సిటీలో ఇచ్చిన సందేశంలో ఈ ఘటనను దారుణ హింసగా అభివర్ణించారు. ఆదివారం ఉత్తర కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చిలో ప్రార్ధనల సమయంలో చోటుచేసుకున్న భారీ పేలుడుతో బీతావాహ దృశ్యం.. దశాబ్దం తర్వాత మళ్లీ విధ్వంసం ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్)తో అంతర్యుద్ధం ముగిశాక గత దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉన్న శ్రీలంకలో తాజా పేలుళ్లు మళ్లీ రక్తపాతాన్ని సృష్టించాయి. చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారితోపాటు, శ్రీలంకకు వచ్చి విలాసవంతమైన హోటళ్లలో ఉంటున్న విదేశీయులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. కొలంబోలోని సెయింట్ ఆంథోని చర్చి, నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికలోవాలోని జియోన్ చర్చిలో ముందుగా ఉదయం 8.45 గంటలకు పేలుళ్లు సంభవించాయి. ప్రజలు ప్రశాంతంగాప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఈ పేలుళ్లు జరిగాయని పోలీస్ శాఖ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. పేలుళ్లలో విదేశీయులైన ఇద్దరు చైనీయులు, పోలండ్, డెన్మా ర్క్, జపాన్, పాకిస్తాన్, అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు కూడా మృతి చెందినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కొలంబో లోని ఐదు నక్షత్రాల హోటళ్లైన షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరిల్లోనూ ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఈ దాడికిపాల్పడింది తామేనని ఇంతవరకు ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. శ్రీలంకలో గతంలో ఎల్టీటీఈ భయానక దాడులకు పాల్పడేది. శ్రీలంక నుంచి విడదీసి తమిళుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఎల్టీటీఈ దాదాపు మూడు దశాబ్దాలు పోరాడింది. చివరకు 2009తో ఎల్టీటీఈ అధ్యక్షుడు వేళుపిళ్లై ప్రభాకరన్‌ను శ్రీలంక ఆర్మీ మట్టుబెట్టడంతో ఇక ఆ సంస్థ అంతరించిపోయింది. ఆత్మాహుతి దాడులేనని చెప్పలేం.. ఆదివారం జరిగిన ఎనిమిది బాంబు దాడులూ ఆత్మాహుతి దాడులేనని చెప్పడానికి పోలీసుల వద్ద ప్రస్తుతం ఎలాంటి ఆధారాలూ లేవనీ, అయితే నెగొంబో చర్చిలో పేలుడు తీరును పరిశీలిస్తే అది ఆత్మాహుతి దాడిలా అనిపిస్తోందని గుణశేఖర చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ సినమన్ గ్రాండ్ హోటల్ లోని రెస్టారెంట్ వద్ద ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నట్లు వెల్లడించారు. కొలంబోలోని జాతీయ ఆసుపత్రిలో 66 మృతదేహాలను ఉంచామనీ, గాయపడిన 260 మందికి అక్కడే చికిత్స అందిస్తున్నామని గుణశేఖర తెలిపారు. అలాగే నెగొంబో లోని మరో వైద్యశాలలో 104 మృతదేహాలు ఉండగా, 100 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని చెప్పారు. అనుమానంపై ఏడుగురిని అరెస్టు చేశా మని శ్రీలంక రక్షణ మంత్రి రువాన్ విజెవర్ధనే తెలిపారు. ఈ ఎనిమిది దాడులనూ ఒకే సంస్థ చేసిందని తాము భావిస్తున్నామన్నారు. దాడుల్లో మొత్తం 27 మంది విదేశీయులు చనిపోయారని శ్రీలంక విదేశాంగ కార్యదర్శి రవీంద్ర అరియసింఘె వెల్లడించారు. గాయపడిన విదేశీయుల్లో భారత్‌తోపాటు అమెరికా, మొరాకో, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నారని మీడియా తెలిపింది. రాజధాని కొలంబోలోని జూ వద్ద జరిగిన మరో పేలుడులో ఇద్దరు మరణించారు. కొలంబో శివార్లలోని ఓ ఇంట్లో సోదాలు జరిపేందుకు పోలీసులు వెళ్లినప్పుడు మరో వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్న ఘటనలో ముగ్గురు పోలీసు సిబ్బంది చనిపోయారు. ముందే హెచ్చరించినా.. శ్రీలంకలో త్వరలో ప్రధాన చర్చిలు లక్ష్యంగా బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని ఆ దేశ పోలీస్ చీఫ్ 10 రోజుల ముందుగానే హెచ్చరించారు. ఏప్రిల్ 11నే ఆయన నిఘా హెచ్చరికలను ఉన్నతాధికారులకు పంపారు. ‘నేషనల్ తోహీత్ జమాత్ (ఎన్టీజే) అనే సంస్థ చర్చిలు, కొలంబోని భారత దౌత్యకార్యాలయం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు ఓ విదేశీ నిఘా సంస్థ నుంచి సమాచారం అం దింది’అని పోలీస్ చీఫ్ పుజుత్ జయసుందర ఆ హెచ్చరికలో పేర్కొన్నారు. అయినా శ్రీలంక పోలీసులు దాడులను ఆపలేకపోయారు. ముస్లిం సంస్థ అయిన ఎన్టీజే గతేడాది బౌద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడంతో దాని పేరు వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ప్రధాని విక్రమసింఘే నిరవధిక కర్ఫ్యూ విధింపు ఎనిమిదో పేలుడు సంభవించిన వెంటనే శ్రీలంక ప్రభుత్వం నిరవధిక కర్ఫ్యూ విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇది అమల్లో ఉంటుందంది. ప్రజలు శాంతిని పాటించాలని శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కోరారు. ‘ఈ అనూహ్య పరిణామాల వల్ల నేను విస్మయానికి గురయ్యాను. అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా భద్రతా దళాలను కోరాం’అని ఆయన చెప్పారు. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘె మాట్లాడుతూ ఇవి పిరికిపందలు చేసిన దాడులనీ, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ప్రజలు ఐక్యంగా, ధైర్యంగా ఉండాలని కోరారు. సెలవులో ఉన్న పోలీసులు, వైద్యులు, నర్సులు, వైద్యాధికారుల అందరి సెలవులను రద్దు చేసి తక్షణం విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. రాజధానిలోని మతపరమైన ప్రదేశాలతోపాటు బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను మరింత పెంచారు. తాత్కాలికంగా అన్ని సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారు. పాఠశాలలను సోమ, మంగళవారాల్లో, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు నిరవధికంగా మూసివేశారు. కొలంబో జిల్లాలో ఈస్టర్ ప్రార్థనలను రద్దు చేస్తున్నట్లు కార్డినల్ (క్రైస్తవ మతంలో ఓ పదవి) మాల్కొమ్ రంజిత్ చెప్పారు. ఎల్టీటీఈని అణచివేసిన నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స మాట్లాడుతూ ఇది ఆటవిక దాడి అని పేర్కొన్నారు. ఇలాంటి హింసాత్మక, ఉగ్రవాద, పిరికిపందల చర్యలను తాము సహించబోమనీ, దేశమంతా ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకిస్తామని ఆయన చెప్పారు. ఎన్టీజే..హింసామార్గం శ్రీలంకలో చర్చిలపై నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) దాడులు చేసే అవకాశముందని ఓ విదేశీ నిఘా సంస్థ శ్రీలంక ప్రభుత్వాన్ని 10రోజుల క్రితమే హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాలు తెలి పాయి. అయితే ఈ హెచ్చరికల్ని శ్రీలంక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోకపోవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ముస్లిం అతివాదులు సభ్యులుగా ఉన్న ఎన్టీజే తొలి సారి 2013లో వెలుగులోకి వచ్చింది. 2013, జూన్‌లో ఎన్టీజే కార్యదర్శి అబ్దుల్ రెహ్మానీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గౌతమబుద్ధుడు నరమాంస భక్షకుడనీ, బౌద్ధమతం నరమాంస భక్షణను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. బౌద్ధుల ఆరాధనా విధానంపై విమర్శలు చేశారు. దీంతో 2014 మార్చిలో శ్రీలంకలో బౌద్ధులు–ముస్లింల మధ్య హింస చెలరేగడంతో ప్రభుత్వం 10 రోజుల పాటు ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. అక్కడితో ఆగకుండా ప్రజలను రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేయడంతో ఆయన్ను 2016లో శ్రీలంక ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. 2018లో ఈ సంస్థకు చెందిన కొందరు సభ్యులు గౌతమబుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియాలో వార్తలు కూడా వచ్చా యి.వీరి వ్యవహారశైలి హద్దుదాటడంతో ఎన్టీజేపై నిషేధం విధించాలని పీస్ లివింగ్ ముస్లిమ్స్ ఇన్ శ్రీలంక(పీఎల్ఎంఎంఎస్ఎల్) డిమాండ్ చేసింది. కేవలం హిం సను ప్రోత్సహించడమే కాకుండా ఇస్లాంలో అతివాద వహాబీ భావజాలాన్ని ఎన్టీజే వ్యాప్తిచేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం శ్రీలంకలో 22 లక్షల మంది ప్రజలు ఉండగా వీరిలో బౌద్ధులు 70%, హిందువులు 12.5%, ముస్లింలు 10%, క్రైస్తవులు 7.5%ఉన్నారు. శ్రీలంకను వరుస బాంబు పేలుళ్లు అతలాకుతలం చేసిన నేపథ్యంలో కొలంబో బిషప్ దిలొరాజ్ కనగసబే భావోద్వేగంతో స్పందించారు. ‘30 ఏళ్ల పాటు అంతర్యుద్ధంతో సతమతమైన అనంతరం మన ప్రజలంతా కలసిమెలసి, ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. తమ–తమ జీవితాలను పునర్నిర్మించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంగా చోటుచేసుకున్న ఈ దారుణ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. జీసస్ పునరుత్థానమైన రోజున తమ ప్రియమైనవారిని కోల్పోయి మనోవేదనను అనుభవిస్తున్న ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా. శ్రీలంక లాంటి దేశంలో ఇలాంటి దుర్ఘటన జరగడం నిజంగా దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రజలంతా శాంతియుతంగా ఉండాలనీ, భగవంతుడిని ప్రార్థించాలని బిషప్ కనగసబే పిలుపునిచ్చారు. ‘ఈ దుర్ఘటనతో అల్లాడిపోతున్న ప్రతీఒక్కరి బాధను తగ్గించాలనీ, వారిపై దయ చూపాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. అలాగే విధ్వంసానికి వ్యతిరేకంగా, ప్రాణాలకు విలువ ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని పేర్కొన్నారు. - కొలంబో బిషప్ భావోద్వేగ సందేశం హెల్ప్లైన్లు ప్రకటించిన భారత హైకమిషన్ శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని కొలంబోలోని భారత హైకమిషన్ తెలిపింది. బాంబు పేలుళ్లు, దాడులకు సంబంధించి ఎలాంటి సహాయం, సమాచారం, స్పష్టత కావాలన్నా భారతీయులు సంప్రదించవచ్చంటూ 5 హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. +94777902082, +94777903082, +94112422788, +94112422789, +94772234176 నంబర్లకు ఫోన్ చేసి భారతీయులు వివరాలు అడగొచ్చని హైకమిషన్ ట్విట్టర్లో తెలిపింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌పై శ్రీలంక ఆంక్షలు కొలంబో: వరుస బాంబు పేలుళ్లపై సోషల్ మీడియా లో విస్తృతమవుతున్న వదంతులను నిరోధించేందుకు శ్రీలంక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఆదివారం బ్లాక్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వదంతులు చెలరేగుతుండటంతో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని శ్రీలంక అధ్యక్ష కార్యాలయం తెలిపింది. బాంబు పేలుళ్లపై భద్రతాదళాల విచారణ సాగుతోందని, విచారణ కొలిక్కి వచ్చేదాగా సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు కొనసాగుతా యని ప్రకటించారు. ప్రజలు సహనంతో వ్యవహరిం చాలని, వదంతులను నమ్మవద్దని, వాటిని ప్రచారం చేయవద్దని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కూడా ట్వీట్ చేశారు. ఫేస్బుక్ కూడా బాంబు పేలుళ్లపై స్పందించేందుకు వీలుగా ఒక మాధ్యమాన్ని ప్రవేశ పెట్టిందని సీఎన్ఎన్ వర్గాలు వెల్లడించాయి. ప్రజలు ఘటనకు సంబంధించి వాస్తవాలు తెలుసుకునేం దుకు, తమ వారిని గుర్తించేందుకు, పేలుళ్ల ప్రభావానికి గురైన సన్నిహితులను చేరుకునేందుకు వీలుగా ఈ టూల్ ఉపయోగపడుతుం దని ఫేస్బుక్ వెల్లడించింది. ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, బాంబు పేలుళ్లకు అవకాశమున్న ప్రాంతాలలో గుంపులుగా ఉండవద్దని, ఆసుపత్రుల పరిసరాలకూ ప్రజలు రావొద్దని శ్రీలంక హోంశాఖ వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈస్టర్ రోజున జరిగిన ఉగ్ర దాడులు.. 2017 ఈజిప్టు 2017 ఏప్రిల్ 9న ఈజిప్ట్‌లోని టాంట, అలెగ్జాండ్రియా నగరాల్లో ఈస్టర్ పండగ రోజు జరిపిన బాంబు దాడిలో 45 మంది మరణించారు. ఈ దాడి నుంచి కాప్టిక్ పోప్ తవడ్రోస్ ఐఐ క్షేమంగా బయటపడ్డారు. దాడికి పాల్పడింది తామే అని డాయిష్ ప్రకటించింది. 2016 పాకిస్తాన్ లాహోర్‌లోని ఓ పార్క్‌లో ఈస్టర్ వేడుకలను జరుపుకుంటున్న వారిపై బాంబు దాడి జరిగింది. చిన్న పిల్లలు సహా మొత్తం 75 మంది ప్రాణాలు విడిచారు. వందల మంది గాయపడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టింది తామే అని పాకిస్తానీ తాలిబన్ శాఖ జమత్–ఉల్–అహ్రార్ ప్రకటించుకుంది. 2012 నైజీరియా ఉత్తర నైజీరియాలో సాం స్కృతిక, ఆర్థిక నగరమైన ఖడునాలో 2012 ఏప్రిల్ 8న చర్చి వద్ద కారు బాంబుతో దాడి చేశారు. ఈ ఘటనలో 41 మంది మరణించారు. ఇస్లామిక్ సంస్థ బొకొ హరమ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. క్రిస్టియన్స్‌పై దాడులు.. 2019 ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్‌లో ముస్లిం ప్రాబల్యం ఉన్న జోలో ప్రాంతంలోని ద్వీపకల్పంలో 2019 జనవరి 27న క్యాథలిక్‌లపై జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 21 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడికి డాయిష్ బాధ్యత వహించింది. కానీ దాడికి పాల్పడింది అజంగ్–అజంగ్ సంస్థగా అధికారులు పేర్కొనారు. 2017 ఈజిప్ట్ 2017 మే 26న సెంట్రల్ మిన్య వద్ద సెయింట్ సామ్యూల్ ఆశ్రమానికి బస్సులో వెళ్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడింది తామే అని డాయిష్ ప్రకటించుకుంది. 2016 కైరో చర్చిలో పార్థనలు చేస్తున్న కాప్టిక్ క్రిస్టియన్స్ లక్ష్యంగా 2016 డిసెంబర్ 11న జరిగిన ఆత్మాహుతి దాడిలో 29 మంది ప్రాణాలు వదిలారు. ఈ దాడికి సైతం డాయిష్ బాధ్యత వహించింది. 2016 యెమెన్ ఉగ్రవాదులు యెమెన్‌లోని అడెన్‌లో క్యాథలిక్ వృద్ధాశ్రమంపై జరిపిన దాడిలో 16 మంది చనిపోయారు. మరణించిన వారిలో కోల్‌కతాలోని మిషనరీ ఆఫ్ చారిటీకి చెందిన నలుగురు నన్‌లు కూడా ఉన్నారు. డాయిష్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. 2015 పాకిస్తాన్ 2015 మార్చి 15న ఆదివారం రోజు లాహోర్‌లోని చర్చిల్లో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనతో 17 మంది మృత్యువాత పడగా, 70 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామే అని తెహ్రీక్–ఇ–తాలిబన్ ప్రకటించింది. -
శ్రీలంక పేలుళ్లపై బిషప్ ఎమోషనల్ వీడియో
కొలంబో: శ్రీలంకలో వరుస పేలుళ్లపై యావత్తు ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లు లక్ష్యం చేసుకుని జరిగిన బాంబు పేలుళ్లను కొలంబో బిషప్ డిలోరాజ్ ఖండించారు. ఈస్టర్ పర్వదినాన ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భావోద్వేగంతో కూడిన ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. బాంబు పేలుళ్లలో తమ ఆత్మీయులను కోల్పోయినవారికి, గాయపడినవారికి తాను అండగా ఉంటానని తెలిపారు. తమలాంటి దేశంలో ఈ ఘటన జరగడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం జరిగిన సివిల్ వార్ అనంతరం శ్రీలంక ప్రజల శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి విధ్వంసక ఘటనలకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. -
శ్రీలంక పేలుళ్లపై ట్రంప్ ట్వీట్ వైరల్
న్యూయార్క్ : శ్రీలంక పేలుళ్లలో 13.8 కోట్ల (138 మిలియన్లు) మంది మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌తో అవాక్కవడం నెటిజన్ల వంతైంది. శ్రీలంక పేలుళ్లలో 138 మిలియన్ల మంది మరణించడం, 600 మందికి పైగా గాయపడటం పట్ల అమెరికా ప్రగాఢ సానుభూతి తెలుపుతోందని ట్రంప్ ట్వీట్ చేశారు. శ్రీలంక పేలుళ్లలో మరణాలు 200 లోపు ఉండటం, అక్కడి జనాభా 2.1 కోట్లు కావడం గమనార్హం. కాగా, ట్వీట్లో తన పొరపాటు తెలుసుకున్న ట్రంప్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసేటప్పటికే అది వైరల్‌గా మారింది. అటు తర్వాత మరో ట్వీట్లో మరణాల ముందు మిలియన్ పదాన్ని ఆయన వాడకపోవడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. కొలంబో సహా మరో రెండు శ్రీలంక నగరాల్లోని ఫైవ్‌స్టార్ హోటళ్లు, చర్చిలో జరిగిన బాంబు పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 300 మందికి పైగా గాయాలైన సంగతి తెలిసిందే. శ్రీలంకలో పేలుళ్లను భారత్, అమెరికా సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆపద సమయంలోశ్రీలంకకు బాసటగా ఉంటామని సంఘీభావం ప్రకటించాయి. -
కొలంబో పేలుళ్లు: టీడీపీ నేతకు స్వల్ప గాయాలు
సాక్షి, అనంతపురం : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల నుంచి పలువురు తెలుగువాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. అనంతపురంకు చెందిన టీడీపీ నేత, ఎస్ఆర్ కనస్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్ర బాబు బృందం కొలంబోకు విహార యాత్రకు వెళ్లింది. ఆదివారం ఉదయం సురేంద్ర బాబు మిగతా నలుగురు స్నేహితులు షాంగ్రీలా హోటల్లో టిఫిన్ చేస్తుండగా బాంబు పేలింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా అమిలినేని సురేంద్ర బాబు స్వల్పంగా గాయపడ్డారు. కొంచెం తేరుకుని ప్రాణభయంతో హోటల్ ఎమర్జెన్సీ గేటు నుంచి బయటకు వచ్చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం అమిలినేని సురేంద్ర బాబు తాను క్షేమంగానే ఉన్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే వీరికి సంబంధించిన పాస్‌పార్ట్‌లు, లగేజీ హోటల్ గదిలోనే ఉండిపోవడంతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు శ్రీలంకలో బాంబు పేలుళ్ల నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అప్రమత్తం అయ్యింది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకుంటున్నట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్‌చేశారు. ఘటనలో భారతీయులెవరైనా చనిపోయారా లేక గాయపడ్డారా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నట్టు ప్రకటించారు. బాధితుల సహాయార్థం కొలంబోలోని ఇండియన్ హై కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటుచేసింది. అత్యవసర సేవల కోసం సంప్రదించడానికి ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అలాగే శ్రీలంకలోని భారతీయ సంఘాలు కూడా సహాయం చేసేందుకు ముందుకొచ్చాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శ్రీలంక ప్రధానితో ఫోన్లో మాట్లాడారు. ఎలాంటి సాయం చేసేందుకైనా భారత్ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా శ్రీలంక ప్రధానికి తెలిపారు. కాగా బాంబు దాడుల నుంచి సినీనటి రాధిక తృటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మారణహోమానికి పాల్పడింది జహ్రాన్ హహీమ్, అబు మహ్మద్‌గా నిర్థారణకు వచ్చారు. -
దాడులపై 10రోజుల ముందే ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
కొలంబో: వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక దద్దరిల్లుతోంది. ఆదివారం ఆరు గంటల వ్యవధిలో ఎనిమిది చోట్ల జరిగిన పేలుళ్లలో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. అయితే శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు సంబంధించి పది రోజుల ముందుగానే ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారులుకు సమాచారం అందినట్టుగా తెలుస్తోంది. ‘నేషనల్ తోహీత్ జమాత్(ఎన్టీజే)’ సంస్థ శ్రీలంకలో ఆత్మహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఓ విదేశీ నిఘా సంస్థ హెచ్చరించిననట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు శ్రీలంక పోలీసు చీఫ్ పుజత్ జయసుందర ఏప్రిల్ 11వ తేదీన ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. ప్రముఖ చర్చిలు, కొలంబోలోని భారత హై కమిషనర్ కార్యాలయం లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టుగా అందులో పేర్కొన్నారు. కాగా, గతేడాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనతో ఎన్టీజే రాడికల్ ముస్లిం వర్గానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో ఈస్టర్ పర్వదినాన చర్చిలకు వచ్చే విదేశీ యాత్రికులే లక్ష్యంగా దాడులు జరిగనట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో మరణించినవారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. శ్రీలంక వ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన అధికారులు.. కొలంబోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
-
చిగురుటాకులా వణుకుతున్న శ్రీలంక
కొలంబో : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లు, చర్చిల్లో విదేశీ యాత్రికులే టార్గెట్‌గా ఆత్మహుతి దాడులు జరిగాయి. కొలంబో సహా నెగొంబో, బట్టికలోవా నగరాల్లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. వరుస బాంబు పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తముందని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది. చదవండి...(బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) అయితే ఈ దాడుల్లో 185మంది చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినప్పటికీ మృతుల సంఖ్య మరింతగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సుమారు 500మంది గాయపడినట్లు సమాచారం. కాగా ఆరు గంటల వ్యవధిలో ఎనిమిదిచోట్ల పేలుళ్లు జరిగాయి. తాజాగా దెహివాలా జులాజికల్ గార్డెన్‌లోని రిసెప్షన్ హాల్ వద్ద ఎనిమిదో పేలుడు జరగ్గా ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. చదవండి... (శ్రీలంకలో హైఅలర్ట్ : వదంతులు నమ్మరాదన్న విక్రమసింఘే) మరోవైపు శ్రీలంక భద్రతా సిబ్బంది అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఇవాళ నుంచి సోమవారం సాయంత్రం వరకూ కర్ఫ్యూ విధించింది. అలాగే సోషల్ మీడియాపై కూడా లంక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇక పాఠశాలలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. పేలుడు జరిగిన ప్రాంతాల్లో భద్రతా దళాలను మోహరించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ జులాజికల్ గార్డెన్‌ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల్లో భారతీయులు ఎవరూ ఉన్నట్టు వార్తలు రాకున్నా కొలంబోలోని భారత హైకమిషన్ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తోంది. చదవండి...(కొలంబో పేలుళ్లు : తృటిలో బయటపడ్డ సినీ నటి) -
తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక
సాక్షి, చెన్నై : శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్లో స్పందిస్తూ... ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు నేను అక్కడే బస చేశా. అక్కడ బాంబు పేలుళ్లు జరిగియాంటే ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. దేవుడు అందరితో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్ చేశారు. OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking. — Radikaa Sarathkumar (@realradikaa) 21 April 2019 శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 165 మంది మృతి చెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి : బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో -
హై అలర్ట్ : వదంతులు నమ్మొద్దు
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో వరుస పేలుళ్లతో దద్దరిల్లిన క్రమంలో శ్రీలంక అంతటా హైఅలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఉదయం మూడు చర్చిలు, ఐదు ఫైవ్‌స్టార్ హోటళ్లలో పేలుళ్లతో 160 మందికి పైగా మరణించగా, 400 మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. పేలుళ్ల ఘటన అనంతరం శ్రీలంకలో ఎమర్జెన్సీ సర్వీసులు రంగంలోకి దిగాయి. పేలడు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు స్ధానిక భద్రతాధికారుల ప్రయత్నాలకు తోడు ఎమర్జెన్సీ సర్వీసులు తోడ్పాటు అందిస్తున్నాయి. చదవండి... (బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో) సహాయ, పునరావాస చర్యలు ముమ్మరంగా చేపట్టేందుకు పలు చోట్ల సైన్యాన్ని రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేసి తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. కొలంబోలోని బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు కొలంబోలో వరుస పేలుళ్ల ఘటనను శ్రీలంక ప్రధాని విక్రమసింఘే తీవ్రంగా ఖండించారు. వదంతులను నమ్మరాదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ భద్రతా మండలి సమావేశంలో బాంబు పేలుళ్ల ఘటన అనంతర పరిస్ధితులపై ఆయన తన నివాసంలో సమీక్షించనున్నారు. కాగా బాంబు పేలుళ్ల ఘటనపై ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినా అధికారులు అందుకు అనుగుణంగా అప్రమత్తం కాలేదనే వార్తలు దుమారం రేపాయి. -
కొలంబో పేలుళ్లు.. స్పందించిన సినీతారలు
శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఇప్పటికీ వరకు అందించిన సమాచారం మేరకు ఈ దాడిలో 165 మంది మృతిచెందగా, 280మందికి పైగా గాయాలయ్యాయి. అయితే తమిళ, తెలుగు తారలు సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించారు. తమిళ హీరో శరత్ కుమార్ ట్వీట్ చేస్తూ.. ‘కొలంబోలో జరిగిన ఉగ్రదాడి ఖండించదగినది. ఆ దాడిలో చనిపోయిన అమాయకులను చూస్తే.. హృదయం చలించిపోతోంది’ అని పేర్కొన్నారు. విశాల్ కూడా ఈ ఘటనను ఖండించారు. సాయి ధరమ్ తేజ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. శ్రీలంక బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాధికా శరత్‌కుమార్ తృటిలో ప్రమాదం తప్పించుకున్నానని తెలిపారు. ప్రధాని మోదీ సహా ప్రముఖ రాజకీయ నాయకులు ఈ ఘటనను ఖండించారు. A dastardly act of terror unleashed in Colombo is condemnable, our heart goes out to innocent lives lost in the attack @TamilTheHindu @ThanthiTV @bbctamil — R Sarath Kumar (@realsarathkumar) April 21, 2019 My prayers,strength and deepest condolences to the people of #Srilanka #PrayforSriLanka 🙏🏼 pic.twitter.com/E3WBbuLTTy — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 21, 2019 Devastated to hear about the Bomb blasts in Sri Lanka.... My Thoughts & Prayers are with the People of Sri Lanka....#SriLanka #SriLankaBlasts — Vishal (@VishalKOfficial) April 21, 2019 -
ఆ దాడులు అనాగరికం : మోదీ
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 166 మందికి పైగా మరణించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొలంబో చర్చి, మూడు ఫైవ్‌స్టార్ హోటళ్లలో జరిగిన బాంబు పేలుళ్లను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. శ్రీలంక ప్రజలకు భారత్ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని హింసకు తెగబడటం అనాగరిక చర్యని రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ బాంబు పేలుళ్ల ఘటనను ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని అన్నారు. -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ రోజు ఉదయం నుంచి మూడు చర్చిలతో పాటు, మూడు హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. -
సనత్ ఇదేం పని..
కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య, మరో ఇద్దరు క్రికెటర్లు భారత్‌కు కుళ్లిన వక్కలను స్మగ్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయని దైనిక్ భాస్కర్ వెల్లడించింది. నాగపూర్‌లో రూ కోట్లు విలువైన ముడి వక్కలను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అక్రమ దందాలో జయసూర్య పేరు వెలుగులోకి వచ్చిందని ఆ కథనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారించేందుకు జయసూర్యను రెవిన్యూ ఇంటెలిజెన్స్ బృందం ముంబైకి పిలిపించినట్టు సమాచారం. అధికారుల కళ్లుగప్పి సాగిన ఈ అక్రమ దందాలో మరో ఇద్దరు క్రికెటర్ల ప్రమేయం ఉన్నా వారి పేర్లు ఇంకా వెల్లడికాలేదని తెలిసింది. డిసెంబర్ 2న జరిగే విచారణకు వారు హాజరయ్యే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ కథనం తెలిపింది. ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తరలించిన వక్కలను తర్వాత వారు భారత్‌కు చేరవేస్తున్నారని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. దక్షిణాసియా స్వేచ్ఛా వర్తక ప్రాంత చట్టాన్ని ఆసరాగా చేసుకుని మాజీ క్రికెటర్లు డమ్మీ కంపెనీలతో అక్రమ లావాదేవీలు సాగించినట్టు సమాచారం. ఈ చట్టం ప్రకారం భారత్, శ్రీలంకల మధ్య దేశీయంగా రూపొందే ఉత్పత్తుల పన్ను రహిత రవాణాకు అనుమతిస్తారు. మాజీ క్రికెటర్లు తమకున్న పలుకుబడితో డమ్మీ కంపెనీల ద్వారా శ్రీలంక అధికారుల నుంచి ట్రేడ్, ఎగుమతి లైసెన్సులు పొంది, వక్కలను శ్రీలంకలోనే తయారైనట్టు నకిలీ పత్రాలు రూపొందించి సరుకును భారత్‌కు తరలిస్తున్నట్టు ఈ కథనం పేర్కొంది. -
కొలంబోలో విక్రమసింఘే భారీ ర్యాలీ
కొలంబో: శ్రీలంకలో రాజకీయ అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉద్వాసనకు గురైన ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే మద్దతుదారులు మంగళవారం రాజధాని కొలంబోలో భారీ ర్యాలీ నిర్వహించారు. తనను తొలగించి, పార్లమెంట్‌ను సుప్తావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుట్ర పూరిత నిర్ణయం తీసుకున్నారని విక్రమసింఘేను ఆరోపించారు. నవంబర్ 16వ తేదీన జరిగే పార్లమెంట్ సమావేశంలో బలం నిరూపించుకునేందుకు విక్రమ సింఘేతోపాటు ప్రస్తుత ప్రధాని మహింద రాజపక్స ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విక్రమసింఘేకు మద్దతుగా యూఎన్‌పీ నిర్వహించిన ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. విక్రమసింఘే ఈనెల 26వ తేదీ నుంచి ఉంటున్న ప్రధాని అధికార నివాసం వరకు ప్రదర్శనకారులు తరలివెళ్లారు. అక్కడ నిర్వహించిన సభలో విక్రమసింఘే మాట్లాడుతూ.. అధ్యక్షుడు సిరిసేన ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని భావిస్తున్నారని ఆరోపించారు. అందుకే కుట్రపూరితంగా తనను తొలగించారని విమర్శించారు. యూఎన్‌పీతోపాటు యునైటెడ్ నేషనల్ ఫ్రంట్‌లోని భాగస్వామ్య పక్షాలు పార్లమెంట్‌ను తక్షణమే సమావేశపరచాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. పార్లమెంట్ వేదికగా బలం నిరూపించుకునేందుకు విక్రమసింఘేకు అవకాశం ఇవ్వాలని సభలో పాల్గొన్న స్పీకర్ జయసూర్య అధ్యక్షుడిని కోరారు. ఇవే పరిస్థితులు కొనసాగితే దేశంలో రక్తపాతం తప్పదని అన్నారు. రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరచాలన్న డిమాండ్‌కు 126 మంది ఎంపీలు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. తమ ర్యాలీకి లక్ష మందికి పైగా జనం హాజరయ్యారని యూఎన్‌పీ అంటుండగా 25వేల మంది మాత్రమే వచ్చారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బలం కూడగట్టుకునే పనిలో నూతన ప్రధాని మరోవైపు, పార్లమెంట్లో మెజారిటీ నిరూపించుకునేందుకు నూతన ప్రధాని రాజపక్స ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్లో 16 మంది సభ్యుల బలమున్న తమిళ నేషనల్ అలయెన్స్(టీఎన్ఏ) ప్రస్తుతం కీలకంగా మారిన తరుణంలో ఆ పార్టీ నేత సంపంతన్ మంగళవారం రాజపక్సతో భేటీ కావడం గమనార్హం. అయితే, బలనిరూపణ సమయంలో పార్లమెంట్లో తటస్థంగా ఉండాలని రాజపక్స తమను కోరినట్లు టీఎన్ఏ తెలిపింది. పార్లమెంట్‌లోని 225 మంది సభ్యులకుగాను విక్రమసింఘేకు 106 మంది సభ్యులుండగా, రాజపక్సకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడం అలయెన్స్‌కు 95 మంది ఉన్నారు. సాధారణ మెజారిటీకి అవసరమైన 18 మంది మద్దతును రాజపక్స కూడగట్టాల్సి ఉంది. కొందరు యూఎన్‌పీ సభ్యులు తమకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నందున బల నిరూపణలో నెగ్గుతామనీ, విక్రమసింఘేకు ఓటమి ఖాయమని రాజపక్స ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే పార్లమెంట్‌ను సమావేశపరిచి, రాజ్యాంగ సంక్షోభం తొలగించాలంటూ అధ్యక్షుడు సిరిసేనపై రాజకీయ, దౌత్యపరమైన ఒత్తిడి పెరిగింది. -
అక్టోబర్ నుంచి విస్తార విదేశీ సర్వీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ విస్తార అక్టోబర్ నుంచి విదేశీ రూట్లలో విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ముందుగా న్యూఢిల్లీ నుంచి కొలంబో (శ్రీలంక), ఫుకెట్ (థాయ్‌లాండ్) ప్రాంతాలకు సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు అవసరమైన అనుమతులు పొందడం, అంతర్జాతీయ కార్యకలాపాల ప్రణాళికలు ఖరారుకి సంబంధించిన ప్రక్రియ మొదలుపెట్టినట్లు వివరించాయి. -
క్రికెటర్ తండ్రి దారుణ హత్య
కొలంబో: శ్రీలంక క్రికెటర్ ధనంజయ డిసిల్వ(26) తండ్రి రంజన్ డిసిల్వ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రంజన్ అక్కడిక్కడే మృతి చెందారు. తండ్రి మరణం నేపథ్యంలో వెస్టిండీస్ టూర్ నుంచి డిసిల్వ తప్పుకున్నాడు. 62 ఏళ్ల రంజన్ అలియాస్ మహథున్, దేహివాలా-మౌంట్ లావినియా మున్సిపల్ కౌన్సిలర్. జ్ఞానేంద్ర రోడు వద్ద రాత్రి 8గం.30ని. సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆయన్ని కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, ఇప్పటిదాకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారంటున్నారు. తండ్రి దుర్మరణంతో శుక్రవారం వెస్టిండీస్ టూర్‌కు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనంజయ డిసిల్వ తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎవరినీ తీసుకోబోతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్టు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే గాయం కారణంగా ఓపెనర్ దిముత్ కరుణరత్నే విండీస్ టూర్‌కు దూరం అయ్యాడు. కాగా, జూన్ 6 నుంచి వెస్టిండీస్‌తో శ్రీలంక జట్టు మూడు టెస్టులు ఆడనుంది. -
11 స్వర్ణాలు, 10 రజతాలు
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా నిర్వహిస్తున్న దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. మొత్తం 11 స్వర్ణాలు, 10 రజతాలు, మూడు కాంస్యాలు నెగ్గారు. దీంతో భారత్ పతకాల పట్టికలో శనివారం అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల జావెలిన్ త్రోలో 71.47 మీటర్లు విసిరిన అర్షదీప్ సింగ్ భారత్‌కు తొలి బంగారు పతకం అందించాడు. మహిళల షాట్‌పుట్‌లో కిరణ్ బలియన్ 14.77 మీటర్లు విసిరి స్వర్ణం నెగ్గింది. వీరిద్దరూ ఈ క్రీడల్లో కొత్త రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదే విభాగంలో అనామికా దాస్ రజతం (14.54 మీ.) సాధించింది. పురుషుల లాంగ్ జంప్‌లో లోకేశ్ సత్యనాథన్ (7.74 మీ.), మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సప్నా కుమారి 14.19 సెకన్ల టైమింగ్‌తో, 1500 మీటర్ల ఈవెంట్లో దుర్గా డోరె 4.31.38 టైమింగ్‌తో కొత్త రికార్డులు సృష్టించి స్వర్ణాలు అందుకున్నారు. 4గీ100 మీ. రిలే రేసులో పురుషుల బృందం బంగారు పతకం, మహిళల జట్టు రజతం దక్కించుకున్నాయి. -
డ్రెస్సింగ్ రూమ్ విధ్వంసం.. కారకుడు అతనే!
సాక్షి, స్పోర్ట్స్ : నిదహస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ అనంతరం చోటు చేసుకున్న విధ్వంస ఘటనపై నివేదిక వెలువడింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ ఘటనకు కారణమని తేలింది. డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు పగిలిపోయిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన మ్యాచ్ రిఫెరీ క్రిస్ బ్రాడ్.. మైదాన సిబ్బందిని విచారణ చేపట్టారు. అందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన ఆయన ఎటువంటి దాడి జరగలేదని నిర్ధారించారు. అందులో షకీబ్ తలుపును బలవంతంగా నెట్టడంతో గదికి ఉన్న అద్దాలు పగిలిపోయినట్లు స్పష్టంగా ఉంది. ఈ మేరకు క్రిస్ బ్రాడ్ నివేదికను సిద్ధం చేసినట్లు శ్రీలంక న్యూస్ పేపర్ ది ఐలాండ్ కథనం వెలువరించింది. అయితే బంగ్లా ఆటగాళ్లు విజయోత్సాహం వేడుకలు నిర్వహించుకున్న క్రమంలోనే ఈ ఘటన జరిగిందని.. దీని వెనుక శ్రీలంక అభిమానులు ఉన్నారన్న రీతిలో వెలువడ్డ అభూత కల్పన కథనాలను క్రిస్ బ్రాడ్ ఖండించినట్లు ఆ కథనం ఉటంకించింది. ఘటనలో షకీబ్‌పై చర్యలు తీసుకునే అంశంపై మాత్రం ఆయన స్పందించలేదు. ఇక శ్రీలంక మ్యాచ్‌లో గందరగోళంపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షకీబ్‌తో పాటు మరో ఆటగాడు నురుల్ మ్యాచ్ ఫీజులో కోత విధించిన సంగతి తెలిసిందే. -
క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం
-
నేనేం చెప్పానో మీకు తెలుసా?: షకీబ్
కొలంబో : శ్రీలకతో జరిగిన మ్యాచ్‌లో నోబాల్ వివాదం, ఆటగాళ్ల మధ్య ఆగ్రహావేశాలు, అంపైర్లతో వాగ్వాదం ఘటనలపై బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భిన్నంగా స్పందించారు. మైదానం నుంచి తమ బ్యాట్స్మన్లను వచ్చేయమనలేదని, అంపైర్లు పొరపాటు చేశారు కాబట్టే మాట్లాడానని వివరణ ఇచ్చుకున్నారు. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘(ఉదాన వేసిన) 20వ ఓవర్లో తొలి బంతి.. ముస్తాఫిజుర్ భుజం కంటే ఎత్తులో వెళ్లడంతో స్క్వేర్ లెగ్ అంపైర్ ‘నో బాల్’ ప్రకటించారు. కానీ మరుక్షణంలోనే మెయిన్ అంపైర్‌తో మాట్లాడి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండో బంతి కూడా అంతే ఎత్తులో బౌన్సైంది. కానీ అంపైర్లు నోబాల్ ఇవ్వలేదు. ఆటలో పొరపాట్లు సహజం. ఆ పొరపాటు గురించే అంపైర్లతో మాట్లాడానుగానీ మరో ఉద్దేశమేదీ లేదు. ఇకపోతే, మా బ్యాట్స్మన్లను బయటికి వచ్చేయమని నేను అననేలేదు. నా సైగలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నేనేం చెప్పానో మీకు(మీడియాకు) ఎలా తెలుస్తుంది? జరిగిందేదో జరిగిపోయింది, ప్రస్తుతం మా గురి భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌పైనే..’’ అని షకీబ్ అన్నారు. అవును.. కొంచెం అతి చేశాం : లంకతో జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ల భావోద్వేగాలు శృతిమించాయన్నది వాస్తవమేనని బంగ్లా సారధి అంగీకరించారు. ‘‘గీత దాటి ప్రవర్తించానా? అని నాక్కూడా అనిపించింది. నన్ను నేను తమాయించుకోవడం అవసరమనిపించింది. సరే, ఏదేమైనా ఆటలో ఇలాంటి ఉద్వేగాలు సహజమే’ అని ముగించాడు షకీబ్. డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం : ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. -
క్రికెటర్ల రచ్చ; డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం
కొలంబో : నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా ఆతిథ్య శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తీవ్ర పరిణామాలు జరిగాయి. మ్యాచ్ తర్వాత.. ఏకంగా విధ్వంసకాండ చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమైన దృశ్యాలు వైరల్ అయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ ధ్వంసం : మ్యాచ్ చివరి ఓవర్లో బంగ్లా-లంక ప్లేయర్లు పరస్పరం వాదులాడుకున్నారు. ఉత్కంఠపోరులో గెలిచిన తర్వాత బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేస్తూ లంకను గేలిచేయత్నం చేశారు. ప్రజెంటేషన్ కార్యక్రమం పూర్తైన కొద్దిసేటికే బంగ్లా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై ప్రేమదాస స్టేడియం సిబ్బంది.. లంక బోర్డుకు ఫిర్యాదుచేశారు. దీంతో బోర్డు అధికారులు విచారణకు ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోన్న దర్యాప్తు బృందం శనివారం మధ్యాహ్నంలోగా తుది రిపోర్టు ఇవ్వనుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఐసీసీ చర్యలకు ఉపక్రమించనుంది. ఒకవేళ అద్దాలు ధ్వంసం చేసింది బంగ్లా క్రికెటర్లే అని తేలితే తీవ్ర చర్యలు ఎదుర్కోక తప్పదనే వాదన వినిపిస్తోంది. అసలేం జరిగింది? ఫైనల్స్‌లో బెర్త్ కోసం బంగ్లాతో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మరో బంతి మిగిలుండగానే బంగ్లా 160 పరుగులు సాధించి విక్టరీ కొట్టింది. అయితే ఇన్నింగ్స్ చివరి(20వ) ఓవర్లో హైడ్రామా చోటుచేసుకుంది. రెండు బంతులు భుజం కంటే ఎత్తులో వెళ్లినా అంపైర్లు నోబాల్ ఇవ్వకపోవడంతో బంగ్లా బ్యాట్స్‌మన్ అసహనానికి గురయ్యారు. ముస్తఫిజుర్ రనౌటైన గ్యాప్‌లో గ్రౌండ్లోకి వచ్చిన బంగ్లా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు.. శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగారు. అంపైర్లు కలగజేసుకుని సర్దిచెప్పేలోపే కెప్టెన్ షకీబ్ బౌండరీ దగ్గరకొచ్చి ‘బయటికి వచ్చేయండి..’ అంటూ గట్టిగట్టిగా కేకలు వేశాడు. చివరికి బంగ్లా జట్టు మేనేజర్ ఖాలెద్ మెహమూద్ చొరవతో ఆటగాళ్లు బ్యాటింగ్ కొనసాగించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లంకను రెచ్చగొట్టేరీతిలో బంగ్లా ప్లేయర్లు నాగిని డ్యాన్సులు చేశారు. మ్యాచ్ పూర్తైన తర్వాత బంగ్లా డ్రెస్సింగ్ రూమ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. -
శంషాబాద్ నుంచి నేరుగా కొలంబోకు విమాన సర్వీసులు
శంషాబాద్: నగరవాసులకు శుభవార్త. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ నుంచి శ్రీలంకకు నేటి (బుధవారం) నుంచి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏ-320 ఎయిర్‌క్రాఫ్ట్ విమాన సర్వీసులు వారానికి నాలుగు రోజుల పాటు సేవలందజేయనున్నాయి. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి కొలంబోకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. దీంతో కేవలం రెండు గంటల్లో నగరం నుంచి శ్రీలంకకు చేరుకోవచ్చు. ప్రపంచంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన శ్రీలంకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల జీఎమ్మార్ సీఈవో ఎస్జీకే కిషోర్ ఒక ప్రకటనలో సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటక దేశమైన శ్రీలంకను భారతీయులు ఎక్కువగా సందర్శిస్తారని పేర్కొన్నారు. అందమైన బీచ్‌లు, 1600 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం, కొబ్బరితోటలు, తదితర అద్భుతమైన ప్రకృతిసౌందర్యంతో కనువిందు చేసే శ్రీలంకను సందర్శించేందుకు నగరవాసులకు ఇది చక్కటి అవకాశమని ఆయన పేర్కొన్నారు. -
హైదరాబాద్–కొలంబో మధ్య శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ సర్వీసు
వైజాగ్, కోయంబత్తూరుకు సైతం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగంలో ఉన్న శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ కొలంబో నుంచి మరో మూడు భారతీయ నగరాలకు సర్వీసులను విస్తరిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, కోయంబత్తూరు వీటిలో ఉన్నాయి. జూలై 8 నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రతిరోజు ఉదయం 9.50కి బయల్దేరి 11.45కు విమానం కొలంబో చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి సోమ, గురు, శని, ఆదివారాల్లో ఉదయం 10.10కి మొదలైన విమానం మధ్యాహ్నం 12.15కు కొలంబోలో అడుగుపెడుతుంది. కొత్త రూట్లకు ఎయిర్‌బస్ 320/321 రకం విమానాలను కంపెనీ కేటాయించింది. -
వారణాసి నుంచి కొలంబోకు నేరుగా ఫ్లయిట్
కొలంబో: వారణాసి నుంచి కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. శ్రీలంక పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం కొలంబోలో జరుగుతున్న 14వ అంతర్జాతీయ వేకాస్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఈ ఏడాది ఆగస్ట్ నుంచి వారణాసి నుంచి కొలంబోకు నేరుగా విమాన సేవలు మొదలు అవుతాయని తెలిపారు. కొలంబోలో ఉన్న తమిళులు...వారణాసితో పాటు గయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తరువాత బుద్ధుడు తొలి ప్రవచనం చేసిన పుణ్యస్థలం సార్నాథ్ను సందర్శించుకోవాలని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బుద్ధుడిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. బుద్ధుడి నడయాడిన గడ్డపై పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని మోదీ తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, సిద్ధాంతాలు ప్రముఖుల నుంచి వచ్చినవే అని ఆయన అన్నారు. బుద్ధుని బోధనలను శ్రీలంక ముందుకు తీసుకు వెళుతోందని అన్నారు. భారత్-శ్రీలంకల మధ్య హద్దులు లేని స్నేహం ఉందని ఇరు దేశాల మధ్య వాణిజ్య పెట్టుబడులు, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సహకరిస్తామని మోదీ వెల్లడించారు. -
కొలంబో తీరంలో నౌకలో మంటలు
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబో తీరం సమీపంలో వ్యాపార నౌక డానియాలాపై అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా నౌకలో మంటలు చెలరేగాయి. శ్రీలంక ప్రభుత్వం నుంచి సమాచారమందుకున్న భారత్ సాయం నిమిత్తం రెండు నేవీ ఓడలను బుధవారం తెల్లవారుజామున అక్కడికి పంపించింది. ఐఎన్ఎస్ ఘరియల్, ఐఎన్ఎస్ దర్శక్ ఓడలు తీరానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు భారత నేవీ తెలిపింది. దీంతోపాటు ఓ తీరప్రాంత ఓడ శూర్ను కూడా కొలంబోకు పంపినట్లు అధికారులు తెలిపారు. తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో కార్గో ఓడ డానియలా అగ్నిప్రమాదానికి గురైనట్లు సమాచారం వచ్చిందని భారత నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ ట్వీట్ చేశారు. అత్యవసర సహాయక చర్యలు అవసరపడటంతో రెండు ఓడలను పంపినట్లు డీకే శర్మ పేర్కొన్నారు. -
ఆరుగురు భారతీయుల అరెస్ట్
డ్రగ్స్ అమ్ముతూ ఆరుగురు భారతీయులు పట్టుబడ్డారు. కొలంబో(శ్రీలంక): డ్రగ్స్ అమ్ముతున్న ఆరుగురు భారతీయుల్ని శ్రీలంక నావీ అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ వద్ద బోటులో అనుమానంగా తిరుగుతుండటంతో పెట్రోలు సిబ్బంది పట్టుకున్నట్లు నావీ అధికారులు తెలిపారు. పట్టుబడిన ఆరుగురిని కంకేసతురాయ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
శ్రీలంకలో వర్ష బీభత్సం
63 మంది మృతి.. కొలంబో: శ్రీలంకలో రోను తుపాను వల్ల కురుస్తున్న భారీ వర్షాలకు 63 మంది మరణించగా, 134 మంది గల్లంతయ్యారు. కొలంబో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 2 లక్షల మంది ప్రజలను సుర క్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. కిలినోచ్చి జిల్లా లో 373 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
మాజీ అధ్యక్షుడి సోదరుడు అరెస్టు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూవివాదానికి సంబంధించి ఆయన సోదరుడు బాసి రాజపక్సను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు ఈయన ఆర్థిక వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీలంకలోని ఫైనాన్సియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(ఎఫ్సీఐడీ) అధికారులు మతారా పట్టణంలో అరెస్టు చేశారు. రేపు అతడిని కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గత ఏడాది కూడా ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణల కిందట ఒకసారి అరెస్టయ్యాడు. -
యూనిసెఫ్ కార్యక్రమంలో టెండుల్కర్
-
అదరగొట్టిన అన్వర్ అలీ
కొలంబో: పాక్ లక్ష్యం 20 ఓవర్లలో 173 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 107/7... గెలవాలంటే 6 ఓవర్లలో 66 పరుగులు చేయాలి. ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో బౌలర్లు అన్వర్ అలీ (17 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇమద్ వసీమ్ (14 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) చిచ్చరపిడుగుల్లా చెలరేగారు. అయితే ఇక 12 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన దశలో మలింగ వీరికి ధీటుగా స్పందించాడు. అన్వర్ అలీని అవుట్ చేయడంతో పాటు సోహైల్ తన్వీర్ (1)నూ రనౌట్ చేసి ఉత్కంఠను పెంచాడు. ఇక పాక్ గెలుపునకు 6 బంతుల్లో 6 పరుగులు అవసరమైతే.. లంక విజయానికి ఒక్క వికెట్ చాలు. ఈ దశలో ఫెర్నాండో వేసిన రెండో బంతిని వసీమ్ అమాంతం గాల్లోకి లేపి సిక్సర్‌గా మలిచాడు. అంతే ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో ఆఫ్రిది సేన వికెట్ తేడాతో శ్రీలంకపై అద్భుత విజయాన్ని సాధించింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. కపుగెడెరా (25 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), జయసూరియా (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. సిరివందన (23), కుశాల్ పెరీరా (19) మోస్తరుగా ఆడారు. షోయబ్ మాలిక్ 2 వికెట్లు తీశాడు. తర్వాత పాక్ 19.2 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఆఫ్రిది (22 బంతుల్లో 45; 1 ఫోర్, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్. లంక బౌలర్ల ధాటికి ఓ దశలో పాక్ 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే ఆఫ్రిది, రిజ్వాన్ (17)లు ఆరో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆదుకున్నారు. చివర్లో అన్వర్ అలీ, వసీమ్‌లు ఎనిమిదో వికెట్‌కు 27 బంతుల్లోనే 58 పరుగులు సమకూర్చారు. -
అత్యవసరంగా విమానం దింపివేత
కొలంబో: సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన పైలెట్ తగిన అనుమతులు తీసుకొని వెంటనే శ్రీలంకలోని కొలంబో అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశాడు. ఈ విమానంలో మొత్తం 500 మంది ప్రయాణీకులు ఉన్నారు. 'సిడ్నీ నుంచి దుబాయ్ వెళుతున్న ఎమిరేట్స్ విమానం-ఏ 380- ఈకే 413ని సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా కొలంబోలో దించివేశాం' అని ఎయిర్ పోర్ట్ అధికార ప్రతినిధులు తెలియజేశారు. పైలెట్ సమయానికి స్పందించి సురక్షితంగా దించేయడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ఎలాంటి సాంకేతిక లోపం అనే విషయంపై మాత్రం వివరణ ఇవ్వలేదు. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని ముందస్తుగా అన్ని రక్షణ చర్యలకు ఏర్పాట్లు కూడా చేశారు. -
ఆఖరి వన్డే కూడా శ్రీలంకదే
కొలంబో: భారత్ చేతిలో పరాభవం అనంతరం సొంతగడ్డపై శ్రీలంక సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు వన్డేల సిరీస్‌ను 5-2తో ముగించింది. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న లంక... మంగళవారం జరిగిన చివరిదైన ఏడో వన్డేలో 87 పరుగుల తేడాతో నెగ్గింది. కెరీర్లో 300వ వన్డే ఆడిన దిల్షాన్ (124 బంతుల్లో 101; 9 ఫోర్లు, 1 సిక్స్) 18వ సెంచరీ సాధించాడు. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్లకు 302 పరుగులు చేసింది. చండీమల్ (55), తిసార పెరీరా (54) కూడా రాణించారు. లంక తరఫున 9వేల పరుగులు పూర్తిచేసుకున్న ఐదో ఆటగాడిగా దిల్షాన్ నిలిచాడు. అనంతరం ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది. జో రూట్ (99 బంతుల్లో 80; 5 ఫోర్లు) మినహా ఇతర ఆటగాళ్లంతా విఫలమయ్యారు. లంక దిగ్గజాలు జయవర్ధనే, సంగక్కరలకు సొంతగడ్డపై ఇదే ఆఖరి వన్డే. వచ్చే ప్రపంచ కప్ తర్వాత వీరు రిటైర్ కానున్నారు. -
తమిళ జాలర్ల ఉరిశిక్షపై చెన్నైలో ఆందోళనలు
-
200 మంది సజీవ సమాధి
కొలంబో: భారీ వర్షాలతో శ్రీలంక చిగురుటాకుల వణికుతోంది. వర్షాల కారణంగా శ్రీలంక సెంట్రల్ బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టెట్ ప్రాంతంలో భారీగా కొండ చిరియలు విరిగిపడ్డాయి. దాదాపు 200 మంది కొండ చరియలు కింద పడి సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహాణ శాఖ ఉన్నతాధికారి ప్రదీప్ కొడిపల్లి గురువారం కొండపల్లిలో వెల్లడించారు. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అర్మీ,పోలీసులు, ఎయిర్‌ఫోర్స్‌తోపాటు కేంద్రం నుంచి బృందాలు సహాయక చర్యలో పాలుపంచుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం 500 మంది ఆచూకీ తెలియకుండా పోయిందని... గల్లంతైన వారిలో భారతీయ సంతతికి చెందిన వారే అధికంగా ఉన్నారని వెల్లడించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు మెర్రిబెడా టీ ఎస్టేట్‌లో కార్మికులు పని చేస్తున్నారు. మరో 817 మందిని పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. -
చివరి టెస్టులో జయవర్ధనే విఫలం
కొలంబో: పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 85.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న శ్రీలంక సీనియర్ క్రికెటర్ మహేళ జయవర్ధనే 4 పరుగులు మాత్రమే చేశాడు. తరంగ(92) ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. జేకే సిల్వా 41, మాథ్యూస్ 39, డిక్వెల్లా24, సంగక్కర 22, తిరిమానే 20 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో జునైద్ ఖాన్ 4, వహబ్ రియాజ్ 3 వికెట్లు పడగొట్టారు. సయీద్ అజ్మల్ ఒక వికెట్ తీశాడు. -
లంకలో రామాయణ దర్శనం
పాఠక ప్రయాణం శాంకరీదేవి శక్తి పీఠ సందర్శనం.. బుద్ధుని బోధనల ఆధ్యాత్మిక సౌరభం... రామాయణంలోని చివరి అంకానికి సాక్షీభూతమైన ప్రదేశాల ప్రాభవం... సుందర జలపాతాల సౌందర్యం... అడుగడుగునా చారిత్రక వైభవం... కళ్లకు కట్టే శ్రీలంక పర్యటన ఆజన్మాంతం ఓ మధురజ్ఞాపకమని వర్ణిస్తున్నారు ఒంగోలు వాసి అయిన విశ్రాంత ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎస్వీఎస్ భగవానులు. ద్వాదశ జ్యోతిర్లింగాలను గతంలోనే సందర్శించిన నేను ప్రథమ శక్తి పీఠమైన శ్రీ శాంకరీదేవిని దర్శించాలనుకున్నాను. అందులో భాగంగానే శ్రీలంక ప్రయాణానికి మా బంధువులతో కలిసి బయల్దేరాను. శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీతో ముందుగానే ఒప్పందం చేసుకున్నాం. ఒంగోలు నుంచి చెన్నైకి రైలులో అటు నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ వారి విమానంలో బయల్దేరి, గంటన్నర వ్యవధిలో శ్రీలంక రాజధాని కొలంబో విమానాశ్రయంలో దిగాం. అక్కడ శ్రీలంక ట్రావెల్ ఏజెన్సీ వారు తమ వాహనంలో మమ్మల్ని తీసుకెళ్లారు. కొలంబో నుంచి ట్రిన్కోమలీకి... ముందుగా మున్నేశ్వరం చేరుకొని అక్కడ మున్నేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించాం. రావణవధ అనంత రం రాముడు ప్రతిష్ఠించిన శివ దేవాలయాన్ని, తిరుకోనేశ్వర దేవస్థానం పక్కన సముద్రపు ఒడ్డున గల రావణబ్రహ్మ ఏకైక విగ్రహాన్ని చూసి.. అక్కణ్ణుంచి బయల్దేరి 268 కి.మీ దూరంలోని ట్రిన్కోమలీ పట్టణం చేరాం. ట్రిన్‌కోమలీలో శక్తి పీఠం ట్రిన్కోమలీ పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్టున్న కొండపై శాంకరీదేవి ఆలయం ఉంది. ఇక్కడ శాంకరీదేవి దర్శనం మాటల్లో వర్ణించలేం. ఇక్కడే శివుడి గుడి ఉన్న ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. ఎటు చూసినా హిందూ, బౌద్ధమతాల సమ్మేళనం కళ్లకు కడుతుంది. డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుడు మరుసటి రోజు ట్రిన్కోమలీ నుంచి కాండీ పట్టణానికి బయల్దేరి, మధ్యలో డంబుల్లా గుహలలో బంగారు బుద్ధుని ఆలయం, శ్రీ రాములవారు పాశుపతాస్త్రం సంధించిన ధన్వేలి, రామబాణం పడిన లగ్గాల గ్రామాలను సందర్శించాం. రామ-రావణ సంగ్రామం జరిగిన ప్రదేశాన్ని పరికిస్తూ, టీ తోటల సోయగాలను వీక్షిస్తూ, ఆయుర్వేద మూలికల మందుల తయారీ కేంద్రాలను చూస్తూ, రాత్రి కాండీ పట్టణంలోనే బస చేశాం. మరుసటి రోజు బుద్ధుని అవశేషాలను భద్రపరిచి, దాని పైన నిర్మించిన సుందరమైన బుద్ధ దేవాలయాన్ని సందర్శించాం. లంకలో రామాయణం చివరి అంకం కాండీ నుంచి బయల్దేరి రాంబోడా పర్వతాలపై చిన్మయ మిషన్ వారు నిర్మించిన 18 అడుగుల నిలువెత్తు ఆంజనేయ విగ్రహాన్ని దర్శించి, సముద్రమట్టానికి 6135 అడుగుల ఎత్తు గల నువారా ఎలియా అనే పట్టణం చేరాం. అక్కడ నుండి రావణాసురుడి గుహ కలిగిన ఇస్తిపురం బండారువేల చూశాం. ఈ గుహలు ఆసియా ఖండ ప్రాచీనతకు ప్రత్యక్ష నిదర్శనాలు. హనుమ పాదముద్రలు హనుమంతుడు సంజీవని పర్వతం తెచ్చిన గుర్తుగా ఆయన పాదముద్రలు రుమస్సాలలో చూశాం. మటారాలో నిలువెత్తు బౌద్ధ విగ్రహాన్ని సందర్శించి, హిక్కాదువ అనే సముద్ర ప్రాంతానికి చేరుకున్నాం. ఇక్కడ సుమద్రం గంభీరంగా, రామాయణంలోని సంగ్రామ ఘట్టానికి గుర్తుగా నేటికీ కళ్లెదుట నిలిచింది. రామాయణం జరిగింది అనడానికి పూర్తి ఆధారాలు ఆనవాళ్లతో సహా ఇక్కడ కనిపించాయి. కొలంబోలో సుప్రసిద్ధ రథ పంచముఖ హనుమాన్ మందిరం దర్శించుకొని కొలంబో నుంచి చెన్నై మీదుగా ఒంగోలు చేరాం. మన దేశంలో అయోధ్యలో మొదలైన రామాయణం చివరి అంకాన్ని శ్రీలంకలో వీక్షించి, జన్మ ధన్యైమైందని అందరం భావించాం. సింహళానికి చలో చలో... ఒంగోలు నుంచి చెన్నై మీదుగా కొలొంబో కొలంబో నుంచి ట్రిన్‌కోమలి 268 కి.మీ. ట్రిన్‌కోమలిలో అష్టాదశ శక్తిపీఠాలలో తొలిదైన శ్రీశాంకరీదేవి శక్తి పీఠం ఉంది. ట్రిన్‌కోమలి నుంచి కాండీ పట్టణం 181 కి.మీ -
మౌనిక్ మాయాజాలం
కొలంబోలోనే దినేష్ శవాన్ని మాయం చేసేందుకు కుట్ర వెంకటేశంను బంధువుగా చూపించి శవాన్ని స్వాధీనం చేసుకునే యత్నం మార్చురీ వర్గాలు పాస్‌పోర్టు జిరాక్స్ అడగడంతో పారని పాచిక సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ కిడ్నీ ముఠా ఎంతకైనా తెగిస్తుందని మరోసారి స్పష్టమైంది. కిడ్నీ అమ్మేందుకు శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన కొత్తగూడెం వాసి దినేష్‌కుమార్ (26) మృతదేహం మాయం చేయడానికి కిడ్నీ ముఠా ప్రయత్నం చేసింది. అయితే, మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆసుపత్రి వర్గా లు పాస్ట్‌పోర్టు జిరాక్స్‌లు ఆడగడంతో ఈ కుట్న భగ్నమైంది. ఆరోజు ఏం జరిగింది... గతనెల 28న సాయంత్రం 4 గంటలకు దినేష్ కొలంబో బీచ్‌లో మద్యం, సిగరేట్లు విపరీతంగా తాగాడు. దీంతో గుండెపోటుకు గురై అక్కడికక్కడే చనిపోయాడు. 15 నిముషాలలో మృతదేహం కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి చేరింది. కిడ్నీ రాకెట్లో సూత్రధారి అయిన అక్కడి డాక్టర్ మౌనిక్ వెంటనే ఈ విషయాన్ని నల్లగొండ చిట్యాలలో ఉన్న కిడ్నీ రాకెట్ ఏజెంట్ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశం సెల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే కొలంబోకు వచ్చి దినేష్ మృతదేహం స్వాధీనం చేసుకోవాలని కోరాడు. ఈ విషయాన్ని వెంకటేశం దినేష్ కుటుంబ సభ్యులకుగానీ, ఇతరులకుగానీ తెలియకుండా గోప్యంగా ఉంచాడు. హుటాహుటిన నల్లగొండ నుంచి బయలుదేరి మరుసటి రోజు (29వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు కొలంబోలోని ఆసుపత్రికి చేరుకొనిమౌనిక్కు ఫోన్ చేశాడు. తాను దూర ప్రాంతంలో ఉన్నానని... రేపు వచ్చి కలుస్తానని మౌనిక్ చెప్పడంతో వెంకటేశం లాడ్జిలో మకాం వేశాడు. మరుసటి రోజు (30న) ఉదయం ఇద్దరూ కలుసుకున్నారు. మృతుడు దినేష్ బంధువునని మార్చురీలోని డాక్టర్లను నమ్మించి మృతదేహం స్వాధీనం చేసుకోవాలని, తర్వాత ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి చేతులు దులుపుకోవాలని పన్నాగం పన్నారు. ఇద్దరూ కలిసి మార్చురీకి వెళ్లారు. తాను దినేష్ బంధువునని వెంకటేశం అక్కడి డాక్టర్లకు పరిచయం చేసుకున్నాడు. అతనికి మృతదేహం అప్పగించేందుకు అంగీకరించిన డాక్టర్లు... వెంకటేశం పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని షరతు పెట్టారు. దీంతో కంగారుపడ్డ వెంకటేశం, మౌనిక్లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. విషయం గమనించిన మార్చురీ సిబ్బంది పోలీసుల సహాయం తీసుకుని దినేష్ పాస్‌పోర్టులో ఉన్న అతని సోదరుడు గణేష్ సెల్‌కు అదే రోజు మధ్యాహ్నం సమాచారం అందించడంతో ఏప్రిల్ 3న దినేష్ మృతదేహం కుటుంబ సభ్యులకు అందింది. శవం మాయం చేయాలనే కుట్ర దాగి ఉన్నందునే వె ంకటేశం తన పాస్‌పోర్టు జిరాక్స్ కాపీని అక్కడి మార్చురీ వర్గాలకు ఇవ్వలేదు, అలాగే ఇక్కడి కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా చేరవేయలేదు. విదేశాల్లో చనిపోతే... ఏదైనా దేశంలో విదేశీయుడు చనిపోతే...అతను ఏ దేశస్తుడో తెలుసుకుని ఆ దేశ రాయభార కార్యాలయానికి అధికారులు సమాచారం చేరవేస్తారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకుగాని, వారుంటున్న ప్రాంత పోలీసులకు గాని సమాచారం చేరుతుంది. ఇదంతా కేవలం నాలుగైదు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే దినేష్ మృతి విషయంలో ఇవేమీ జరగలేదు. -
ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి...
-
వారిది సరైన నిర్ణయం
సంగక్కర, జయవర్ధనేల రిటైర్మెంట్పై రణతుంగ కొలంబో: శ్రీలంక క్రికెటర్లు సంగక్కర, మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించడం సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్నారు. ఇటీవల శ్రీలంక విజేతగా నిలిచిన టి20 ప్రపంచకప్ సందర్భంగా టోర్నీ మధ్యలోనే వీరిద్దరూ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వారు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా రిటైర్మెంట్ ప్రకటించారంటూ సంగ, జయవర్ధనేలపై లంక క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచకప్‌తో స్వదేశానికి చేరుకున్న అనంతరం ఈ ఇద్దరు ఆటగాళ్లు మీడియా తో మాట్లాడుతూ.. బోర్డు పెద్దలు తమ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే రణతుంగ మాత్రం బోర్డు అభిప్రాయంతో విభేదించారు. -
జాలర్ల చర్చలు షురూ
కొలంబో వేదికగా 13న ఖరారు శుభ పరిణామం అన్న స్వామి సాక్షి, చెన్నై: శ్రీలంక-తమిళ జాలర్ల మధ్య మళ్లీ భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 13న మలివిడత చర్చలకు నిర్ణయించారు. శ్రీలం క రాజధాని కొలంబో వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. సముద్రంలో చేపల వేటకు వెళుతున్న రాష్ట్ర జాలర్లకు భద్రత కరువు అవుతోంది. జాలర్లపై శ్రీలంక నావికాదళం ప్రదర్శిస్తున్న పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాడి చేసి పట్టుకెళ్లి కారాగారాల్లో నెలల తరబడి ఉంచుతున్నారు. పడవలను స్వాధీనం చేసుకుని, తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని జాలర్లలో ఆందోళన, ఆగ్రహావేశాలను రగుల్చుతోంది. రెండు దేశాల అధికారులు, జాలర్ల ప్రతినిధుల మధ్య చర్చలకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కేంద్రంపై విజయవంతం అయ్యాయి. అయితే, చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు మాత్రం గోప్యంగా ఉంచారు. రెండు దేశాల జాలర్ల ప్రతినిధులు చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసినా, శ్రీలంక నావికాదళం మాత్రం వెనక్కు తగడం లేదు. రాష్ట్ర జాలర్లపై తన ప్రతాపాన్ని చూపుతూనే వస్తోంది. ఇప్పటి వరకు 121 మంది ఆ దేశ చెరలో బందీలుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మలి విడత చర్చల ద్వారా త్వరితగతిన రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావారణం సృష్టించాలన్న డిమాండ్‌తో రాజకీయ పక్షాలు గళం విప్పాయి. మళ్లీ చర్చలు: కేంద్రం మీద ఒత్తిడి పెరగడంతో చర్చలకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు చేపట్టింది. గత నెల చివర్లో చర్చలకు ఏర్పాట్లు జరిగినా, అనివార్య కారణాలతో తేదీని నిర్ణయించలేదు. ఎట్టకేలకు చర్చలకు ముహూర్తం కుదిరింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, తీర్మానాలకు శ్రీలంక ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. తమిళుల డిమాండ్లకు తలొగ్గిన ఆ దేశ ప్రభుత్వం, కొన్ని మెలికలతో కూడిన కొత్త అంశాలను తెరపైకి తెచ్చినట్టు తెలిసింది. వీటన్నింటిపై చర్చించి, రెండు దేశాల మధ్య సఖ్యత లక్ష్యంగా తుది నిర్ణయానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13న మలి విడతగా రెండు దేశాల జాలర్ల మధ్య చర్చలకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం తెలియజేసింది. దీంతో చర్చలకు రాష్ట్ర జాలర్ల ప్రతినిధులు సిద్ధం అవుతున్నారు. అదే కమిటీ: ఇది వరకు చెన్నై వేదికగా జరిగిన చర్చల్లో పాల్గొన్న కమిటీని కొలంబోకు పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం, కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో జాలర్ల ప్రతినిధులు మరికొద్ది రోజుల్లో కొలంబోకు పయనం కానున్నారు. కొలంబోకు బయలు దేరుతున్న వారిలో నాగపట్నంకు చెందిన శివజ్ఞానం, వీర ముత్తు, చిత్రా వేలు, జగన్నాథన్, తంజావూరుకు చెందిన వి రాజమాణిక్యం, పుదుకోట్టైకు చెందిన కుట్టి యాండి, జి రామకృష్ణన్, రామనాధపురానికి చెందిన పీ జేసు రాజ్, అరులానందం, ఎంఎస్ అరుల్, ఎన్ దేవదాసులు, రాయప్పన్ ఉన్నారు. అలాగే, పుదుచ్చేరికి చెందిన ఇళంగోవన్ నేతృత్వంలో అక్కడి జాలర్ల సంఘాల ప్రతినిధులు శ్రీలంక జాలర్లతో చర్చలకు బయలు దేరనున్నారు. ఈ చర్చలు సత్ఫలితాల్ని ఇవ్వడం ఖాయం అని, తద్వారా అన్ని సమస్యలు సర్దుకుంటాయని కేంద్ర సహాయ మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. ఉదయం మీనంబాక్కం విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొలంబో వేదికగా తుది విడత చర్చ జరగబోతోందన్నారు. రెండు దేశాల మధ్య సామరస్య పూర్వక వాతావరణం సృష్టించే రీతిలో జాలర్ల చర్చలు సాగబోతున్నాయని, అనేక ఒప్పందాలు కుదరబోతున్నాయని వివరించారు. ఈ చర్చలు రెండు దేశాల జాలర్లకు శుభ పరిణామం అని, ఇక దాడులకు అడ్డుకట్ట వేసినట్టేనని ఆశాభావం వ్యక్తం చేశారు. -
19 మంది మత్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక
కొలంబో : భారత్‌కు చెందిన 19 మంది మత్స్యకారులను శనివారం రాత్రి పొద్దుపోయాక శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. తమ సముద్ర జలాల్లో చేపలు పడుతున్నారనే అభియోగంతో వీరిని అరెస్ట్ చేసి ఐదు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండుదేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందానికి విరుద్ధంగా భారత మత్స్యకారులు తమ సరిహద్దుల్లోకి ప్రవేశించారని శ్రీలంక నేవీ కమాండర్ కోసల వర్ణకుల సూరియ తెలిపారు. ఇటీవలి చర్చల తర్వాత శ్రీలంక అరెస్ట్ చేసిన భారత మత్స్యకారుల సంఖ్య 57కు చేరింది. రామేశ్వరం,జగతపట్నం, కొత్తయిపట్నంల నుంచి బయలుదేరిన నాలుగువేల మంది మత్స్యకారుల్లో ఈ 19 మంది కూడా ఉన్నారని తమిళనాడు అధికారులు తెలిపారు. శ్రీలంక అధికారులు 20 బోట్ల నుంచి వలలను కోసివేశారని వారు చెప్పారు. -
బంగ్లాదేశ్‌లోనే ఆసియా కప్
కొలంబో: బంగ్లాదేశ్‌లో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్నా వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వేదికలో మార్పు లేదని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) ప్రకటించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్‌లోనే ఈ టోర్నీ జరుగుతుందని ఏసీసీ సీఈఓ అష్రాఫుల్ హఖ్ స్పష్టం చేశారు. ఆసియా కప్‌కు ప్రత్యామ్నాయ వేదికను నిర్ణయించేందుకు ఏసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ శనివారం ఇక్కడ సమావేశమైంది. వేదికలో ఎలాంటి మార్పూ చేయని కమిటీ ఆసియా కప్‌లో తొలి సారి అఫ్ఘానిస్థాన్ జట్టుకు కూడా టోర్నీలో పాల్గొనే అవకాశం కల్పించింది. వన్డే క్రికెట్లో ఆ జట్టు భారత్, పాక్, శ్రీలంకలాంటి పటిష్ట జట్లతో పోటీ పడనుండటం ఇదే తొలిసారి. 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు కూడా అఫ్ఘాన్ అర్హత సాధిం చింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 7 వరకు జరిగే ఆసియా కప్‌లో మొత్తం 11 మ్యాచ్‌లను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోనే నిర్వహిస్తారు. మరో వైపు భద్రతపై భరోసా ఉండటంతో బంగ్లాలో శ్రీలంక పర్యటన కూడా కొనసాగుతుందని... గతంలో ఇలాంటి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న తమ దేశం బంగ్లాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని లంక బోర్డు కార్యదర్శి నిషాంత రణతుంగ వెల్లడించారు. -
మేం ఆతిథ్యమిస్తాం
కొలంబో: ఈ ఏడాది బంగ్లాదేశ్‌లో జరగాల్సిన ఆసియాకప్ టి20 ప్రపంచకప్‌పై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ రెండు మెగా టోర్నీలకు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక బోర్డు ప్రకటించింది. ఢాకాలో జరుగుతున్న హింస కారణంగా బంగ్లాదేశ్ వెళ్లేందుకు చాలా క్రికెట్ జట్లు ఆసక్తి చూపడం లేదు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 7 వరకు ఆసియాకప్, మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు టి20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‌లో జరగాల్సి ఉన్నాయి. శనివారం కొలంబోలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలంక బోర్డు ఈ ప్రకటన చేసింది. ఒకవేళ ఆసియాకప్ వేదిక మారిస్తే... టి20 ప్రపంచకప్ వేదిక కూడా మారే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. -
‘చోగమ్’కు మన్మోహన్ గైర్హాజరు
న్యూఢిల్లీ/కొలంబో: కొలంబోలో ఏర్పాటైన కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల (చోగమ్) సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు లేఖ రాశారు. కొలంబోలోని భారత దౌత్య కార్యాలయం ఈ లేఖను రాజపక్సకు అందజేసింది. ఈ సమావేశాలకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నా, తన తరఫున విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధాని మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘చోగమ్’ విషయమై దౌత్యపరమైన ప్రక్రియ పూర్తయిందని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. రాజపక్సకు ప్రధాని మన్మోహన్ రాసిన లేఖలోని అంశాలను అధికారికంగా వెల్లడించకపోయినా, గైర్హాజరుపై ప్రధాని ఇందులో కారణాలను వివరించలేదని తెలుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ శ్రీలంకలో ఏర్పాటవుతున్న ‘చోగమ్’ సమావేశాలకు ప్రధాని వెళ్లరాదంటూ తమిళనాడు రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నుంచి డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో, చివరకు ఈ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో తలెత్తుతున్న నిరసనల నేపథ్యంలోనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఖుర్షీద్ చెప్పారు. కొలంబోలో ఈనెల 15-16 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరు కానున్నారు. ప్రధాని మన్మోహన్ ఈ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకోవడంపై తమిళనాడు ప్రజలు సంతృప్తి చెందగలరని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. ఇదిలా ఉండగా, 54 దేశాల ‘చోగమ్’ దేశాధినేతల సమావేశాల కోసం శ్రీలంక ఆదివారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంలో యువజన వేదికను ప్రారంభించారు. కామన్వెల్త్ సభ్యదేశాలు కాని చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్ ప్రతినిధులు కూడా కామన్వెల్త్ బిజినెస్ ఫోరంలో పాల్గొననున్నారు. -
శ్రీలంక కోచ్‌గా చాపెల్?
కొలంబో: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ శ్రీలంక జట్టు చీఫ్ కోచ్‌గా నియమితులయ్యే అవకాశముంది. చాపెల్ కోసం లంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) కోచ్ నియామక ప్రక్రియ గడువును ఈ నెలాఖరు వరకు పెంచింది. 1970 దశకంలో మేటి బ్యాట్స్‌మన్‌గా కితాబందుకున్న ఈ ఆసీస్ క్రికెటర్ గతంలో టీమిండియాకు కోచ్‌గా వ్యవహరించారు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ వైఫల్యం, గంగూలీ తదితర సీనియర్లతో పొసగకపోవడంతో ఆయన అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ప్రస్తుతం లంక చీఫ్ కోచ్ పదవి కోసం భారత మాజీ కోచ్‌లు వెంకటేశ్ ప్రసాద్, లాల్‌చంద్ రాజ్‌పుత్, మోహిత్ సోనిలతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన చాపెల్, షేన్ డఫ్, మైకేల్ ఓ సలైవాన్ పోటీపడుతున్నారు. ఈ ఆరుగురితో కూడిన తుది జాబితాను ఎస్ఎల్సీ పరిశీలిస్తున్నప్పటికీ చాపెల్వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.