
మాజీ అధ్యక్షుడి సోదరుడు అరెస్టు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూవివాదానికి సంబంధించి ఆయన సోదరుడు బాసి రాజపక్సను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకప్పుడు ఈయన ఆర్థిక వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీలంకలోని ఫైనాన్సియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(ఎఫ్సీఐడీ) అధికారులు మతారా పట్టణంలో అరెస్టు చేశారు. రేపు అతడిని కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గత ఏడాది కూడా ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణల కిందట ఒకసారి అరెస్టయ్యాడు.