Mahinda rajapaksa
-
లంకలో ఎన్నికల సందడి
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 21న జరగబోతున్న ఎన్నికల్లో 39 మంది అభ్యర్థులు ఖరారయ్యారు. శ్రీలంక దివాలా తీసి ఎంతటి విపత్కర పరిస్థితులో చిక్కుకున్నదో అందరికీ తెలుసు. 2022లో అధ్యక్ష భవనంపై, పార్లమెంటుపై ప్రజానీకం దాడి చేయటంతో అప్పటి అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ఆయన కుటుంబ పరివారం దేశం విడిచి పరారయ్యారు. అంతకు మూడేళ్ల ముందు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గొటబయ, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానిగా ఆయన సోదరుడు మహిందా రాజపక్స తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈమధ్య బంగ్లాదేశ్‌లో అచ్చం ఇలాంటి ఘటనలే జరిగి ప్రధాని షేక్ హసీనాకు పదవీభ్రష్టత్వం తప్పలేదు. రెండేళ్లనాటి శ్రీలంక పరిణామాలు చూశాకైనా ఆమె జాగ్రత్తగా అడుగులు వేసివుంటే ఇలా జరిగేది కాదు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉన్నవారు తమ గతాన్ని మాత్రమే కాదు... బంగ్లాదేశ్ వర్తమానాన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. ఏవో సాకులు చెప్పి ఎన్నికలు వాయిదా వేసే సంస్కృతి శ్రీలంకలో ఏనాటి నుంచో కొనసాగు తోంది. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రధానిగా ఉన్నప్పుడు 2017లో ప్రొవిన్షియల్ కౌన్సిళ్ల ఎన్నికలను వాయిదా వేశారు. అప్పటికి ఏడేళ్ల నుంచి ఇదే వరస. చిత్రమేమంటే 2022లో అంతగా జనాగ్రహం చవిచూశాక కూడా దేశంలో ఎన్నాళ్ల నుంచో మూలనపడివున్న స్థానిక సంస్థల ఎన్నికలను నిధులు లేవన్న కారణంతో విక్రమసింఘే వాయిదా వేశారు. నిజానికి అధ్యక్ష ఎన్నికలు సైతం ఈ మాదిరే ‘వాయిదా’ తోవన పోతాయని చాలామంది అనుకున్నారు. వెంటనే ఎన్నికలు జరపాలంటూ వివిధ వర్గాలనుంచి నిరుడు డిమాండ్ వచ్చింది. కానీ దేశం ఇంకా ఆర్థికంగా కోలుకోలేదన్న కారణాన్ని చూపి వాయిదా వేశారు. మొత్తానికి ఎన్నికల కోలాహలం మొదలైంది.రెండున్నర దశాబ్దాల తర్వాత మొదటిసారిగా రాజపక్స కుటుంబం హవా లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయి. తన కుటుంబం కోల్పోయిన పరువు ప్రతిష్ఠలను పునరుద్ధరించటమే ధ్యేయంగా మాజీ ప్రధాని మహిందా రాజపక్స తనయుడు 38యేళ్ల నామల్ రాజపక్స శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రనిల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అయిదు దశాబ్దాలు యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) నాయకుడిగావున్నా స్వతంత్రుడిగా నిలబడ్డారు. గతంలో యూఎన్‌పీని చీల్చి సమగి జన బల వేగయ (ఎస్‌జేబీ) పార్టీని స్థాపించి ప్రస్తుతం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్నారు. అయితే ఇతరుల కన్నా వామపక్ష అనుకూల నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ (ఎన్పీపీ) అధినేత అనూర కుమార దిస్సానాయకే విజయావకాశాలు ఎక్కువని లంకలో ప్రధాన సర్వే సంస్థ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ పాలసీ (ఐహెచ్పీ) చెబుతోంది. అదే నిజమైతే దేశ రాజకీయాలు కొత్త మలుపు తిరగటం ఖాయం. మొదటి నుంచీ ఎస్ఎల్పీపీ, యూఎన్ పీలే ప్రధాన పక్షాలుగా పోటీపడుతున్నాయి. కానీ 2020 పార్లమెంటు ఎన్నికలకు ముందు సజిత్ ప్రేమదాస నిష్క్రమించాక ఆ పార్టీ దయనీయ స్థితిలో పడిపోయింది. ఆ ఎన్నికల్లో యూఎన్పీకి దక్కింది కేవలం ఒక్క స్థానం మాత్రమే. దశాబ్దాలుగా అనుసరించిన విధానాల వల్ల దేశం ఆర్థికంగా చాలా గడ్డు స్థితిలో పడిందన్నది వాస్తవం. ముఖ్యంగా రాజపక్స సోదరుల హయాంలో తమిళ టైగర్లను అణిచేయటానికి సాయం చేసిన దగ్గర్నుంచి చైనా పలుకుబడి విస్తరించింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించే నెపంతో అది భారీయెత్తున అప్పులిచ్చింది. క్రికెట్ స్టేడియం, విమానాశ్రయం, హంబన్‌తోటా నౌకాశ్రయం వంటివన్నీ చైనా నిర్మాణరంగ నిపుణుల నేతృత్వంలో కళ్లు చెదిరే రీతిలో నిర్మించారు. కానీ వీటి బకాయిలు తీర్చడానికొచ్చేసరికి అంతా తారుమారైంది. చివరకు హంబన్‌తోటాలో అనుకున్న రీతిలో కార్యకలాపాలు పుంజుకోకపోవటంతో దాన్ని చైనాకే 99 యేళ్ల లీజుకు ఇవ్వాల్సివచ్చింది. దేశాన్ని చైనాకు తాకట్టు పెడుతున్నారని విపక్షాలు చేసిన ఆరోపణలన్నీ రాజపక్స సోదరులు తీసుకొచ్చిన మెజారిటీవాదం, దేశభద్రత వగైరా అంశాలతో కొట్టుకు పోయాయి. కానీ మూడేళ్లకే ప్రజలకు తత్వం బోధపడి తిరుగుబాటు చేశారు. 2022లో దేశం దివాలా తీశాక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) దాదాపు 300 కోట్ల డాలర్ల రుణం ఇచ్చింది. అయితే ఆర్థిక రంగంలో పెనుమార్పులు తీసుకురావాలన్న షరతు విధించింది. వ్యవస్థాగత సర్దు బాట్ల పేరుతో ఆ ప్రక్రియ ప్రస్తుతం అమలవుతోంది కూడా. కనుక ఎన్నికల అనంతరం విజేత ఎవ రైనా ఈ ప్రక్రియను కొనసాగించాల్సిందే. ప్రస్తుత అభ్యర్థుల్లో ఎన్పీపీ అధినేత అనూర కుమార దిస్సానాయకే ఒక్కరే అవినీతి మరక అంటని నేత. కావడానికి వామపక్ష అనుకూల సంస్థే అయినా సింహళ జాతీయవాదాన్ని ప్రవచించే జనతా విముక్తి పెరుమున రాజకీయ విభాగమే ఎన్పీపీ. ఒకపక్క తన పూర్వపు ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూసే చైనా... మొదటి నుంచీ లంకకు అన్ని విధాలా తోడ్పడుతున్న భారత్ ఈ ఎన్నికల సరళిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పటికే బంగ్లాలో భారత్ అనుకూల నేత హసీనా పదవి కోల్పోయారు. ఇదే అదనుగా లంకలో మళ్లీ తన హవా కొనసాగించాలని చైనా చూస్తోంది. అయితే చైనా వల్లే అప్పుల ఊబిలో కూరుకుని నిండా మునిగిన లంకలో అదంత సులభం కాదు. ఏదేమైనా జనామోదంతో ఏర్పడే ప్రభుత్వం వల్లే శ్రీలంక ప్రస్తుత కష్టాలు తీరతాయి. -
శ్రీలంక: రాజపక్స కుటుంబానికి బిగ్ షాక్
కోలంబో: ఆర్థికంగా లంకను దిగజార్చి తీవ్ర సంక్షోభంతో.. ఆపై రాజకీయ సంక్షోభంతో ప్రజానిరసనలతో అట్టుడికిపోయేలా చేసిన రాజపక్స కుటుంబానికి భారీ షాక్ తగిలింది. మాజీ ప్రధాని మహీంద రాజపక్స, సోదరుడు బాసిల్ రాజపక్సలను, వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులను దేశం విడచి వెళ్లరాదని దేశ అత్యున్నత న్యాయస్థానం నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పటికే రాజపక్స సోదరుడు, మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స ‘రాజీనామా’ భయంతో దేశం విడిచిపారిపోయాడు. ఆపై సింగపూర్ చేరుకున్నాక అక్కడి నుంచి స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపారు. దీంతో ఇవాళ లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. తాత్కాలిక అధ్యక్షుడిగా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. చీఫ్ జస్టిస్ జయనాథ జయసూర్య దగ్గరుండి మరీ ప్రమాణం చేయించారు. అక్కడి రాజ్యాంగం ప్రకారం.. అధ్యక్షుడు గనుక రాజీనామా చేస్తే ప్రధాని పదవిలో ఉన్నవాళ్లు అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. #WATCH | Ranil Wickremesinghe sworn in as Acting-President a short while ago by Sri Lankan Chief Justice Jayantha Jayasuriya#SriLanka pic.twitter.com/odjNmfd4cf — ANI (@ANI) July 15, 2022 ఇప్పటికే గోటబయ దేశం విడిచి వెళ్లారని, కాబట్టి మహీంద బాసిల్లు జులై 28 వరకు దేశం విడిచి వెళ్లరాదని, ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే కోర్టు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. సరిగ్గా తీవ్ర నిరసనల నడుమే ప్రధాని హోదాలో కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించిన మహీంద రాజపక్స.. చివరకు రాజీనామా చేసి అక్కడే అజ్ఞాతంలో ఉండిపోయారు. కొత్త కేబినెట్ గనుక కొలువుదీరితే మాత్రం.. అవినీతి, ఇతరత్ర ఆరోపణలపై రాజపక్స కుటుంబం విచారణ.. రుజువైతే కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. Sri Lanka's Supreme Court today issued an interim order preventing former Prime Minister Mahinda Rajapaksa and former Minister Basil Rajapaksa from leaving the country without the court's permission until July 28th: Sri Lanka's DailyMirror (File photos) pic.twitter.com/xg290lfmLX — ANI (@ANI) July 15, 2022 కుటుంబ పాలనతో ద్వీప దేశాన్ని సర్వనాశనం చేశారని రాజపక్స కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు లంక ప్రజలు. గోటబయ రాజపక్స(72) శ్రీలంకకు అధ్యక్షుడిగా, అతని అన్న మహీంద రాజపక్సా ప్రధానిగా, మరో సోదరుడు బసిల్ రాజపక్సా ఆర్థిక శాఖను, పెద్దన్న చామల్ రాజపక్సా వ్యవసాయ శాఖ మంత్రిగా, మరో బంధువు నమల్ రాజపక్సా క్రీడాశాఖ మంత్రిగా కీలక పదవులను నిర్వహించారు. -
రోజులు మారాలి!
కొన్ని అధివాస్తవిక దృశ్యాలు స్మృతిపథం నుంచి తొలగిపోవడం కష్టం. మూడు రోజులుగా శ్రీలంక అధ్యక్షభవనం – ప్రధాన మంత్రి నివాసాల ప్రజా దిగ్బంధం, బయటపడ్డ బంకర్లు – నోట్లకట్టలు, ప్రధాని ఆఫీసులో కసి తీరని సామాన్యుల వినోద సంచారం – ఇవన్నీ టీవీల్లో చూసిన ప్రపంచ ప్రజలు వాటిని ఇప్పుడప్పుడే మర్చిపోలేరు. జూలై 9 నుంచి శ్రీలంక వీధుల్లో నిరసనకు దిగిన ప్రజా సమూహ సన్నివేశాలు కొన్నేళ్ళ క్రితం అరబ్ దేశాల్లో వీధికెక్కిన ప్రజాగ్రహ ‘అరబ్ స్ప్రింగ్’ ఉద్యమ దృశ్యాలను తలపించాయి. ఒకరకంగా ద్వీపదేశం ఎదుర్కొంటున్న బాధాకరమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకు ఇది పరాకాష్ఠ. జనం నిరసన మధ్య ఆచూకీ లేకుండా పరారైన దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స, వ్యక్తిగత నివాసం జనాగ్రహంలో దగ్ధమైన ప్రధాని రణిల్ విక్రమసింఘే గద్దె దిగుతామంటున్నారు. సమష్టి మధ్యంతర ప్రభుత్వ ప్రయత్నాలు సాగుతున్నాయి. సరిగ్గా రెండు నెలల క్రితం మే 9న ఇలాగే ప్రజాగ్రహం పెల్లుబికి, హింసాకాండ చెలరేగి, ప్రధానమంత్రి మహిందా రాజపక్స గద్దె దిగి, ప్రాణాలు దక్కించుకున్నారు. ముళ్ళకిరీటం లాంటి ప్రధాని పదవిని రణిల్ చేపట్టారు. తనకున్న పేరుతో సంప్రతింపులు సుగమం అవుతాయనీ, సులభంగా దేశానికి అప్పు పుడుతుందనీ భావించారు. ఇంతలో కరెంట్, పెట్రోల్, ఆహారం సహా అన్నిటికీ కొరతతో సామాన్య జనజీవితం ఇడుముల పాలవడంతో జనంలో అసహనం, కోపం కట్టలు తెంచుకొని, రెండే నెలల్లో మరోసారి వీధికెక్కి అవినీతి గొటబయతో పాటు ఆపద్ధర్మంగా వచ్చిన విక్రమ సింఘేకూ ఇంటిదారి చూపెట్టారు. లంకలో అంతర్యుద్ధం ముగిశాక, గత మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను రాజపక్సీయులే శాసించారు. ఒక దశలో ప్రభుత్వంలో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏకంగా 40 మంది రాజపక్స కుటుంబ సభ్యులు, బంధువులే. అలా ఆర్థిక వ్యవస్థను గుప్పెట పెట్టుకొని, యథేచ్ఛగా చరించి దేశానికి ఈ గతి పట్టించారు. అన్ని అధికారాలూ అధ్యక్షుడికే కట్టబెట్టే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెన్సీ పద్ధతి తెచ్చి, రాజపక్స నిరంకుశత్వానికి బాటలు వేశారు. రాజపక్సీయుల అసమర్థ ఆర్థిక నిర్వహణతో విదేశీ రుణభారం మోయలేనిదైంది. అందులోనూ ఖరీదైన వాణిజ్య రుణం వాటా 2006లో 7 శాతమే ఉండేది. 2019కి అది ఏకంగా 55 శాతమైంది. చైనాపై అతిగా ఆధారపడడం, 2019 నవంబర్‌లో పన్నులు తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యం బయటకు పోకూడదనే లక్ష్యంతో 2021 ఏప్రిల్‌లో ప్రత్యామ్నాయం ఆలోచించకుండా రసాయన ఎరువుల వినియోగంపై నిషేధం లాంటివన్నీ ఆత్మహత్యా సదృశమయ్యాయి. కరోనాతో ఆ దేశ ప్రధాన ఆదాయ వనరైన పర్యాటకం దెబ్బతింటే, తాజా ఉక్రెయిన్ యుద్ధం సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. శ్రీలంకలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందంటే, ద్రవ్యోల్బణం 50 శాతానికి చేరింది. రూపాయి విలువ డాలర్‌కు 350 స్థాయికి పడిపోయింది. స్కూళ్ళు, ఆఫీసులు మూతబడ్డాయి. ఆసుపత్రుల్లో మందులు అడుగంటాయి. రెండు నెలల క్రితం సోదరుడు మహిందా వైదొలగాల్సి వచ్చినప్పుడే అధ్యక్షుడు గొటబయ కూడా తప్పుకొని, దేశంలో మార్పుకు దోహదపడాల్సింది. ప్రజాగ్రహం చల్లార్చాల్సింది. అలా కాక కుర్చీ పట్టుకు వేలాడి, పెద్ద తప్పు చేశారు. దీన్ని సరిదిద్దడానికి అందరికీ ఆమోదయోగ్యుడైన, విశ్వసనీయమైన పాలకుడు శ్రీలంకకు అవసరం. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థ పాలన, తాజా ఆర్థిక సంక్షోభంతో సింహళీయుల్లో తలెత్తిన ఆగ్రహం అర్థం చేసుకోదగినదే! కానీ, హింసాకాండ, చట్టసభల ప్రతినిధులను కొట్టి, ఇళ్ళు తగల బెట్టడంతో ప్రయోజనం శూన్యం. శ్రీలంకలో ప్రభుత్వం లేక అరాచకం నెలకొన్నదనే భావన కలిగితే అది ఆ దేశవాసులకే నష్టం. ఆ దేశం పుంజుకొనేందుకు చేయూతనివ్వడానికి సిద్ధపడే పొరుగు దేశాలు, ప్రపంచ సంస్థలు వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. ఆ సంగతి సింహళీయులు గుర్తించాలి. ఇప్పటికిప్పుడు శ్రీలంకకు కావాల్సిందల్లా – ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించే నిఖార్సయిన ప్రభుత్వం. దేశప్రయోజనాలే లక్ష్యంగా... ఇతర దేశాలతో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) లాంటి వాటితో సంప్రతింపులు జరిపే పాలకులు. సింహళాన్ని మళ్ళీ పట్టాలెక్కించే అంకితభావమున్న అనుభవజ్ఞులు. ఇప్పటికే ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర బ్యాంకు అధిపతి రోజువారీ పని నడిపించే ప్రభుత్వం తక్షణ అవసరమని గుర్తు చేశారు. తమిళనాడుకు 10 కి.మీల పడవ ప్రయాణం దూరంలోని ఈ 2.2 కోట్ల లంకేయుల ద్వీపదేశంలో స్థిరమైన సర్కారు ఏర్పడడం భౌగోళిక రాజకీయాల దృష్ట్యా భారత్‌కూ కీలకం. జపాన్‌తో కలసి మనం శ్రీలంక పునర్నిర్మాణానికి ‘జీ–20’ వేదికగా క్రియాశీలక పాత్ర పోషించాలి. మరోపక్క సింహళం మళ్ళీ పర్యాటకులను ఆకర్షించాలన్నా, విదేశాల నుంచి ఆర్థిక సాయం, పెట్టుబడులు రావాలన్నా... ముందుగా అక్కడ విశ్వసనీయ ప్రభుత్వం రావాలి. పొదుపు చర్యలు చేపట్టాలి. ప్రజాకర్షక పథకాలకు బ్రేకులు వేసైనా దేశాన్ని గాడిలో పెట్టాలి. అలా పని చేసే ప్రభుత్వం వస్తేనే, దాన్ని ప్రజలూ పని చేయనిస్తేనే... క్రమంగా ఫలితం కనిపిస్తుంది. లేదంటే మళ్ళీ ఆగ్రహావేశాలు అదుపు తప్పుతాయి. గమ్మత్తేమిటంటే, రోజులు మారాలని కోరుకుంటున్నా, లంక ప్రజలెవరికీ ప్రస్తుత రాజకీయనేతలపై నమ్మకం ఉన్నట్టు లేదు. ఈ విషాదకర పరిణామం రాజకీయ నేతల స్వయంకృతా పరాధం. అవినీతి, నిరంకుశత్వం హెచ్చి, పాలకులు, పాలితుల మధ్య అంతరాలు అగాధమైతే, ఏ వ్యవస్థలోనైనా ఇలాంటివే ఎదురవుతాయి. ఇది ప్రపంచానికి శ్రీలంక చెబుతున్న పాఠం. -
శ్రీలంక: మహింద రాజపక్సకు భారీ షాక్
కొలంబో: శ్రీ లంక మాజీ ప్రధాని మహింద రాజపక్సకు భారీ షాక్ తగిలింది. ఆందోళనకారులకు భయపడి.. ఆయన తన కుటుంబం, అనుచరగణంతో భద్రంగా తలదాచుకున్న విషయం తెలిసిందే. కాస్త అవకాశం దొరికినా దేశం విడిచిపోవాలని చూస్తున్నారంటూ స్థానిక మీడియాలు కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొలంబో కోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన తనయుడు నమల్, రాజపక్స మిత్రపక్షాలకు చెందిన సభ్యులను దేశం విడిచి వెళ్లడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ప్రధాని భవనం టెంపుల్ ట్రీస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేపట్టిన నిరసనకారుల మీద జరిగిన దాడులు.. ఆ తర్వాత చెలరేగిన హింస మీద దర్యాప్తు చేపట్టాలని పోలీస్ శాఖను మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఇదిలా ఉంటే.. సోమవారం మహింద రాజీనామా ప్రకటన నేపథ్యంలో హైడ్రామా జరిగింది. ఆయన మద్ధతుదారులు.. నిరసనకారుల మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత హింస చెలరేగింది. ఈ హింసలో ఇప్పటిదాకా తొమ్మిది మంది మరణించగా(అనధికారికంగా ఇంకా ఎక్కువే!).. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది శ్రీ లంక రక్షణ శాఖ. మరోవైపు రాజీనామా హైడ్రామా నడిపిన మహింద రాజపక్స, ఆపై చెలరేగిన హింసతో నిజంగానే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆపై కుటుంబం, అనుచర గణంతో నేవీ బేస్‌లో తలదాచుకున్నారాయన. మరోవైపు ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు.. రాజపక్స కుటుంబం, బంధువులు, అనుచరణ గణానికి చెందిన ఇళ్లను తగలబెట్టేస్తున్నారు. మరోవైపు మహీంద, ఆయన మద్దతుదారులు దేశం విడిచిపారిపోకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన నిరసనకారులు.. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తరుణంలో దేశం దాటిపోకుండా కోర్టు నిషేధం విధించడం విశేషం.\ చదవండి: గొటబయా రాజపక్స కీలక ప్రకటన -
లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్!
కొలంబో: శ్రీ లంక సంక్షోభం.. ఒక్కసారిగా ఇలా హింసాత్మకంగా మారుతుందని రాజపక్స కుటుంబం సహా బహుశా ఎవరూ ఊహించి ఉండరు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రదర్శనలు నెలల తరబడి నిరసనల రూపంలో కొనసాగుతున్నప్పటికీ.. సోమవారం నాటి పరిణామాలే దారుణమైన మలుపు తిప్పాయి. ఇప్పటిదాకా పది మందికి పైగా మృతి చెందగా.. వందల మంది గాయపడ్డారు. మరోవైపు నిరసన, ఆందోళనకారులపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ కావడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో అసలు ఆ రోజు(సోమవారం) ఏం జరగింది? అనేదానిపై ఆరాలు మొదలయ్యాయి. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహీంద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాల నడుమ.. వందలాది మంది రాజపక్స మద్ధతుదారులు ప్రధాని భవనం టెంపుల్ ట్రీస్ వైపు ర్యాలీగా చేరుకున్నారు. రాజీనామా చేయొద్దంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. అదే సమయంలో.. మహీంద రాజపక్స సోదరుడు, లంక అధ్యక్షుడైన గోటబయా రాజపక్స.. సంక్షోభ గండం నడుమే ఆపద్ధర్మ ప్రభుత్వ ఏర్పాటునకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ తరుణంలో.. ఆ ప్రయత్నాన్ని సైతం ఆపేయాలంటూ వాళ్లు నినాదాలు చేశారు. అయితే.. గంట లోపే అక్కడి పరిస్థితి రణరంగంగా మారింది. ఉదయం 11 గంటల సమయంలో మద్ధతుదారులంతా టెంపుల్ ట్రీస్ దగ్గరికి చేరుకున్నారు. వారిని ఉద్దేశించి.. ‘రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా?’ అని ఆయన(మహీంద రాజపక్స) ప్రశ్నించాడు. వాళ్లంతా ముక్తకంఠంతో ‘అక్కర్లేద’ని సమాధానం ఇచ్చారు. దీంతో తాను రాజీనామా చేయబోనని, దేశం కోసం ఏం చేయాలో తనకు తెలుసని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మద్ధతుదారుల్లో కొంతమంది ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే.. లంకా కల్లోలానికి కారణమైంది. దాడి చేసింది వాళ్లే! రాజపక్స మద్ధతుదారులు కొందరు ఆగ్రహంతో ఊగిపోతూ.. ప్రధాని నివాసానికి సమీపంలో ఉన్న నిరసనకారుల మీద ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అలా మొదలైన ఘర్షణలు.. హింసాత్మకంగా మలుపు తిరిగాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ఆ ఘర్షణల్లో నిరసనకారులు, మహీంద మద్దతుదారులు పరస్సరం దాడులు చేసుకున్నారు. అయితే నిరసనకారుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మద్ధతుదారులే దారుణంగా దెబ్బతిన్నారు. ఆ పరిణామంతో నిరసనకారుల్లో ఆగ్రహావేశాలు రాజుకుని.. రాజపక్స కుటుంబం, ఆయన మద్ధతుదారుల ఇళ్లపై దాడులతో విరుచుకుపడ్డారు. ఇదంతా కేవలం గంట వ్యవధిలోనే జరిగిపోయింది. అలా శ్రీ లంక పొదుజన పెరామునా(SLPP) పార్టీ.. మహీందను ప్రధాని గద్దె నుంచి దిగకుండా చేయాలనుకున్నా ప్రయత్నం మొత్తానికి బెడిసి కొట్టింది. తన మద్ధతుదారులతో నిర్వహించిన సమావేశం బెడిసి కొట్టడం.. ఆపై హింస ప్రజ్వరిల్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మహీంద రాజీనామా చేయడంతో పాటు నేవీ బేస్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే నిరసకారుల వల్లే హింస చెలరేగిందంటూ.. కనిపిస్తే కాల్చివేతల ఉత్తర్వులు జారీ చేసింది లంక రక్షణ శాఖ. ఒకవేళ రాజమహీంద ఆ సమావేశం నిర్వహించకుండా ఉంటే.. పరిస్థితి సాధారణ నిరసనలతో గడిచిపోయేది ఏమో! అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సంబంధిత వార్త: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది! -
ఇది రావణ కాష్ఠం
లంక తగలబడుతోంది. ఆంజనేయుడి తోకకు అంటించిన నిప్పు ఆనాటి లంకాదహనానికి దారి తీస్తే, ఇప్పుడు కట్టలు తెగిన ప్రజాగ్రహం ఆ పని చేస్తోంది. అప్పుడైనా, ఇప్పుడైనా పాలకుల పాపమే శాపమై ఆ దేశాన్ని దహిస్తోంది. అనేక వారాల ఆందోళనలు హింసారూపం దాల్చడంతో ప్రధానమంత్రి పదవి నుంచి అన్నయ్య మహింద సోమవారం పక్కకు తప్పుకున్నారు. తమ్ముడు గొటబయ రాజపక్స దేశాధ్యక్ష పీఠాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. నెలరోజుల్లో రెండోసారి దేశంలో ఎమర్జెన్సీ. అన్నిటికీ కొరత. కర్ఫ్యూ ఉన్నా వీధుల్లో నిరసనకారులు. సోమవారం నాటి ఘర్షణల్లో ఒక పార్లమెంట్ సభ్యుడితో సహా కనీసం ఎనిమిది మంది మరణం. 225 మందికి పైగా గాయాలు. మంగళవారం రాజపక్సీయులు హెలికాప్టర్లో పారిపోవడం. ఇవన్నీ చూస్తుంటే – శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి పూర్తిగా రాజకీయ సంక్షోభంలోకి జారిపోయిందని అర్థమవుతోంది. హింసాకాండ, రక్తపాతం శ్రీలంకకు కొత్త కావు. కానీ, పౌర సమాజంలో ఇప్పుడు చూస్తున్నంత ఆగ్రహం, హింస మునుపెన్నడూ చూడనివి. గత నెలన్నర పరిణామాలు, సమాజంలోని అనిశ్చితి, ప్రస్తుతం పాలనే లేని పరిస్థితులు చూస్తుంటే– హిందూ మహాసముద్రంలోని ఈ బుద్ధభూమి అంత ర్యుద్ధం దిశగా సాగుతోందా అని ఆందోళన కలుగుతుంది. మహిందా ఇల్లు, వారి పూర్వీకుల గృహం సహా మాజీ మంత్రుల నివాసాలు జనాగ్రహంలో దగ్ధమైన తీరు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. దేశవ్యాప్త కర్ఫ్యూను ఉల్లంఘించి మరీ, లగ్జరీ, స్పోర్ట్స్ కార్లతో సహా వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. ప్రతిపక్ష నేతలు సైతం వారి ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయారు. విధ్వంసానికి పాల్పడుతున్న ప్రదర్శనకారుల్ని కట్టడి చేయలేక చివరకు మంగళవారం నాడు రక్షణ శాఖ కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసిందంటే ద్వీపదేశంలోని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇటు శాంతిభద్రతల సమస్య, అటు ప్రభుత్వమే లేని పాలనతో రాజకీయ సంక్షోభం – వెరసి శ్రీలంకది చిత్రమైన పరిస్థితి. కనీసం మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుతో తాత్కాలికంగా పరిస్థితుల్ని చక్కదిద్దే ప్రయత్నమొక్కటే ఇప్పటికిప్పుడు కనిపిస్తున్న దారి. ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)తో దీర్ఘకాలిక ఆర్థిక వెసులుబాటు కోసం ఈ ద్వీపదేశం ప్రయత్నిస్తున్న వేళ అది మరీ ముఖ్యం. రాబోయే కొద్ది రోజుల్లో శ్రీలంక పార్లమెంట్ సభ్యులు సమావేశ మవుతారా, దేశానికి గండం గట్టెక్కడానికి అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, సైన్యాన్నీ – పోలీసులనూ నమ్ముకున్న అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆ ప్రక్రియకు సహకరిస్తారా అన్నది వేచిచూడాలి. దేశ ప్రధాని నివాసం దగ్గరý‡ అత్యున్నత స్థాయికి చెందిన సీనియర్ మోస్ట్ పోలీసు అధికారిపై ఆగ్రహోదగ్ర జనం భౌతిక దాడికి దిగిన తీరు చూస్తే – వెంటనే ఆపద్ధర్మ ప్రభుత్వం పగ్గాలు చేతబట్టి, పరిస్థితులను చక్కదిద్దకపోతే ఈ పౌర సంక్షోభం పూర్తిగా చేయి దాటిపోయే ప్రమాదమైతే ఉంది. వీటన్నిటికీ మూలమైన ఆర్థిక సంక్షోభం అతి పెద్ద సమస్య. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులు, శూన్యమైన పర్యాటక ఆదాయంతో శ్రీలంక పీకలలోతు కష్టాల్లో ఉంది. రాజకీయ సంక్షోభం మాటెలా ఉన్నా, ఈ ఆర్థిక సంక్షోభం ఇప్పుడప్పుడే పరిష్కార మయ్యేది కాదు. పేరుకుపోయిన వందల కోట్ల డాలర్ల అప్పు తీరేదీ కాదు. ఈ చిన్ని ద్వీపదేశం రాగల కొన్నేళ్ళలో ఏకంగా 5 వేల కోట్ల డాలర్లకు పైగా అప్పులు తీర్చాల్సిన తరుణంలో ఇప్పుడు కావాల్సింది దూరదృష్టి, దీర్ఘకాలిక పరిష్కారం. దేశంలో కరవు, ఆహార కొరత రాకుండా అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక విధానాలను సమూలంగా ప్రక్షాళన చేయడమే మార్గమంటున్నారు ఆర్థికవేత్తలు. ఉప్పూ నిప్పూగా ఉండే సింహళీయులు, తమిళులు ఇప్పుడు రాజపక్సీయుల పాలనను వ్యతిరేకించడంలో అనూహ్యంగా ఒక్కటైనట్టే, చట్టసభలోనూ కలసి ముందుకు సాగడం ఈ గడ్డుకాలంలో ముఖ్యం. చిత్రమేమిటంటే– చాలాకాలంగా శ్రీలంక, దాని పాలకులు చైనాతో చేతులు కలుపుకొని తిరిగినా, కరెన్సీ కష్టాల వేళ ఆ దేశం లంకేయుల వైపు కన్నెత్తి చూడకపోవడం! భారతదేశమే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంతా కలిపి 300 కోట్ల డాలర్ల మేర సింహళీయులకు సాయం చేసింది. మన ఆర్థిక మంత్రి అమెరికాలో సైతం శ్రీలంకకు నిధులు అందించాలంటూ ఐఎంఎఫ్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను అభ్యర్థించారు. సిలోన్‌ను కేవలం పొరుగుదేశంగానే కాక హిందూ మహాసముద్రంలో శాంతి, సుస్థిరతలకు కీలక భాగస్వామిగా భారత్ చూస్తోంది. గతంలో శ్రీలంక త్రాసు చైనా వైపు మొగ్గడంతో నష్టపడ్డ భారత్ పోయిన పట్టు మళ్ళీ సాధించుకుంటోంది. రాజపక్సీయుల సంగతికొస్తే, గతంలో ఒకటికి రెండుసార్లు ఎన్నికల్లో మట్టికరిచినా, మళ్ళీ పైకి లేచిన సత్తా ఆ కుటుంబానిది. కానీ ఈసారి కుటుంబ పాలనతో కూడబెట్టిన అవినీతి, సంపాదించిన అపకీర్తి చూస్తే వారు ఇక అధికారాన్ని మర్చిపోవాల్సిందే. దేశాధ్యక్షుడు గొటబయ మాత్రం పెల్లుబు కుతున్న ప్రజాగ్రహాన్ని సైనికబలంతో అణిచివేయాలని దింపుడుకళ్ళెం ఆశతో ఉన్నారు. ఎల్టీటీఈ అణచివేతలో పాత్రధారిగా, నిరంకుశ ‘టెర్మినేటర్’ పేరుపడ్డ ఆయన ఆ పట్టుతో కిరీటం కాపాడు కోవాలని శతవిధాల యత్నిస్తున్నారు. అయితే, సంక్షుభిత సింహళాన్ని సొంతకాళ్ళపై నిలబెట్టడం, ఆయన తన పీఠాన్ని నిలబెట్టుకోవడం – రెండూ ఇప్పుడు కష్టమే! 1930ల తర్వాత ఎన్నడూ లేని ఆర్థిక సంక్షోభం, 1953 నాటి మహా హర్తాళ్ తర్వాత మళ్ళీ అంతటి నిరసనల్లో చిక్కుబడ్డ శ్రీలంకలో కొన్నేళ్ళపాటు ఈ రావణకాష్ఠం కాలుతూనే ఉంటుందనేది నిపుణులు చెబుతున్న నిష్ఠురసత్యం. -
నేవీ స్థావరంలో తలదాచుకుంటున్న రాజపక్స కుటుంబం
Protests erupted at the Trincomalee Naval Base in Sri Lanka: అత్యంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిరసనకారుల దాడులు రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత వహిస్తూ శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సా రాజీనామా చేసినప్పటికీ అల్లర్లు ఆగడం లేదు. అంతేకాదు హంబన్‌టోటాలోని రాజపక్స కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. ఈ భారీ ఉద్రిక్తతల కారణంగా మహింద రాజపక్స, ఆయన కుటుంబ సభ్యులు ట్రింకోమలీ నావికా స్థావరంలో తలదాచుకుంటున్నారు. అయితే మహింద్రా కుటుంబం నేవీలో ఆశ్రయం పొందుతున్నట్లు ఆందోళనకారులు తెలుసుకోవడంతో అక్కడ కూడా నిరసనలు చెలరేగాయి. ఇప్పట్లో ఈ నిరసన సెగ మహీంద్రా కుటుంబాన్ని అంత తేలిగ్గా వదిలేట్లు లేదు. ఆర్థిక, రాజకీయం సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంక ఇప్పుడూ హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుపోతుంది. ప్రస్తుతం ఆ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. A protest underway in front of the Trincomalee Naval Base claiming former PM Mahinda Rajapaksa and his family members are inside pic.twitter.com/fJ6hOh6b3Y — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 10, 2022 Ancestral home of the Rajapaksa family in Medamulana, Hambantota set on fire by protesters. pic.twitter.com/QIEnREphjq — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 9, 2022 (చదవండి: శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు) -
శ్రీలంకలో ఆగని అల్లర్లు.. ప్రధాని ఇంటికి నిప్పు
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో మొదలైన ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేసినప్పటికీ ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు హంబన్‌టోట నగరంలోని మెదములానాలో ప్రధాని మహింద రాజపక్సే, అతని తమ్ముడు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇంటికి నిప్పు పెట్టారు. అంతేకాక కొందరు మహీంద తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన డీఏ రాజపక్స విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో పాటు అధికార కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యుల పలు ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో శ్రీలంక అధ్యక్షుడి నివాసాన్ని ఆర్మీ ఆధీనంలో తెచ్చుకుంది. రాజపక్స నివాసం వద్ద భారీ సంఖ్యలో ఆందోళనకారులు రావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాజపక్స అధికారిక నివాసం వద్ద వేల సంఖ్యలో బలగాలను మోహరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. -
Sri Lanka: లంక ప్రధాని రాజపక్స రాజీనామా
కొలంబో: ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలు, లంకేయులు.. అధ్యక్షుడితో సహా ప్రధాని రాజీనామా చేయాలని ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. Sri Lanka Prime Minister Mahinda Rajapaksa has resigned - @news_cutter https://t.co/LXw10q0Vd9 #LKA #SriLanka #SriLankaCrisis — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) May 9, 2022 -
మహింద ఔట్!
కొలంబో: ప్రతిపాదిత మధ్యంతర ప్రభుత్వంలో సోదరుడు మహిందా రాజపక్సను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స శుక్రవారం అంగీకరించారు. కొత్త ప్రధానిని, అన్ని పార్టీలతో కూడిన నూతన మంత్రివర్గాన్ని ఎంపిక చేయడానికి జాతీయ కౌన్సిల్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన చెప్పారు. కానీ మహిందాను తప్పించాలన్న ఉద్దేశాన్ని గొటబయ వ్యక్తం చేయలేదని ఆయన అధికార ప్రతినిధి అన్నారు. 90 శాతం వద్దంటున్నారు మహింద రాజీనామా చేయాలని శ్రీలంకలో 89.7 శాతం మంది కోరుకుంటున్నారని తాజా సర్వేలో తేలింది. రాజపక్సల కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని 89.9 శాతం మంది డిమాండ్ చేస్తున్నారు. గొటబయా కూడా దిగిపోవాలని 87.3 శాతం, ఎంపీలంతా తప్పుకోవాలని 55 శాతం జనం అంటున్నారు. -
‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్
కొలంబో: కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభం, దేశవ్యాప్త నిరసనలతో సతమతమవుతున్న శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సోదరుడు మహింద (72) మినహా కేబినెట్లో తమ కుటుంబీకులెవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. గత మంత్రివర్గంలో సభ్యులైన మరో సోదరుడు చమల్, మహింద కుమారుడు నమల్, అల్లుడు శశీంద్ర తదితరులను పక్కన పెట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాని విడివిడిగా జాతినుద్దేశించి మాట్లాడారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకుని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొస్తామని గొటబయ ధీమా వెలిబుచ్చారు. స్వచ్ఛమైన, సమర్థమైన పాలన అందించేందుకు సహకరించాల్సిందిగా మహింద కోరారు. మరోవైపు అధ్యక్షుడు రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. సోమవారం నుంచి వారంపాటు నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ కార్యకలాపాలను కూడా సస్పెండ్ చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం నుంచి మరింత పెరిగాయి. సంక్షోభం నేపథ్యంలో మార్చి నుంచి శ్రీలంక రూపాయి విలువ 60 శాతానికి పైగా పడిపోయింది. -
నన్ను క్షమించండి: శ్రీ లంక ప్రధాని
ఆర్థిక సంక్షోభంతో పరిస్థితులు చేజారిపోయిన వేళ.. శ్రీలంకలో నిరసనలు మిన్నంటాయి. ఆహార.. మందలు కొరత, నిత్యావసరాల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం అవినీతి విధానాల వల్లే ఇదంతా అంటూ ఆరోపిస్తూ.. దిగిపోవాలంటూ ప్రజా నిరసన పెల్లుబిక్కుతోంది. ఈ తరుణంలో ప్రధాని మహీంద రాజపక్స ఒక వీడియో విడుదల చేశాడు. ఆర్థిక సంక్షోభంతో పాటు తాజా పరిస్థితులపైనా దేశ పౌరులకు వివరణ ఇచ్చుకున్నాడు. శ్రీ లంక ప్రధాని మహీంద రాజపక్స.. సోమవారం జాతిని ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశాడు. రాజీనామా డిమాండ్ బలంగా వినిపిస్తున్న వేళ.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లార్చే దిశగా ఆయన ప్రసంగం సాగింది. లంక తీవ్ర సంక్షోభానికి కారణాలేంటో చెప్పిన మహీంద రాజపక్స.. ప్రదర్శలను తక్షణమే విరమించాలని నిరసనకారుల్ని విజ్ఞప్తి చేశాడు. ‘‘కొవిడ్‌తో లంక ఆర్థిక స్థితి కుప్పకూలింది. క్షీణించిన విదేశీ నిల్వలు కారణంగానే.. ఆర్థిక సంక్షోభంలోకి దేశం కూరుకుపోయింది. మహమ్మారిని ఎదుర్కొన్న వెంటనే మన దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడం మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్నదని తెలిసినప్పటికీ.. లాక్డౌన్ విధించాల్సి వచ్చింది. అందుకే మన విదేశీ నిల్వలు క్షీణించాయి. అంతేగానీ.. ప్రభుత్వ విధానాలు, మా పాలన అందుకు కారణాలు కావు. మా పాలనలో అసలు అవినీతికి చోటే లేదు కూడా. గత ప్రభుత్వాలు కూడా దేశాన్ని అప్పుల్లోకి నెట్టాయి. కరోనా పరిస్థితులు ఆ అప్పుల్ని మరింత ఊబిలోకి లంకను నెట్టేశాయని చెప్పుకొచ్చారు మహీందా. ప్రజల కష్టాలు చూసి చాలా బాధపడుతున్నా. శ్రీ లంక ప్రజల్ని క్షమాపణ కోరుతున్నా అంటూ వీడియో సందేశంలో పేర్కొన్నాడు మహీంద. ‘‘ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం 24 గంటలూ మా ప్రభుత్వం పని చేస్తోంది. మీరు(నిరనసకారుల్ని ఉద్దేశిస్తూ..) వీధుల్లో గడిపే ప్రతి నిమిషమూ దేశానికి డాలర్ ప్రవాహాన్ని దూరం చేస్తుంది. ఈ సమయంలో రాజకీయాలు వద్దన్నా.. ఎవరూ వినడం లేదు. దేశం పతనం కాకుండా రక్షించుకునేందుకు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలన్నా ఎవరూ స్పందించలేదు. మీరైనా సహనంతో మాకు సహకరించండి. అతికొద్దిరోజుల్లోనే సమస్యను పరిష్కరిస్తాం’’ అని పేర్కొన్నాడు. స్నేహపూర్వక దేశాల నుండి సహాయం తీసుకునేటప్పుడు తాను దేశ సార్వభౌమత్వాన్ని త్యాగం చేయనని పేర్కొన్న రాజపక్సే.. ద్వీపం దేశం చాలా నిర్ణయాత్మక దశలో ఉందని అన్నారు. పనిలో పనిగా.. రైతులకు ఎరువుల సబ్సిడీని పునరుద్ధరిస్తానని శ్రీలంక ప్రధాని కీలక ప్రకటన చేశారు. చదవండి: మా వల్ల కాదు బాబోయ్.. లంకలో తీవ్ర ఉద్రిక్తతలు -
మా వల్ల కాదు.. కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు
కొలంబో: శ్రీలంక రాజధాని కొలంబోలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీ లంక ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రధాని గద్దెదిగిపోవాలంటూ ప్రధాని కార్యాలయం ఎదుట నిరసనల నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చేతగానీ పాలనతో దేశాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిన ప్రధాని మహీందా రాజపక్సే వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని, తన సోదరుడు అధ్యక్షుడైన గోటబయ రాజపక్సతో సహా పదవుల నుంచి దిగిపోవాలంటూ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ప్రధాని నివాసాన్ని ముట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని భరించడం తమ వల్ల కాదంటూ నినాదాలు చేశారు. అవినీతి ద్వారా కూడబెట్టిన డబ్బును తక్షణమే బయటకు తేవాలని, సంక్షోభం నుంచి లంకను బయటపడేయాలంటూ రాజపక్స కుటుంబాన్ని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులను అడ్డగించిన భద్రతా సిబ్బంది.. ప్రధాని నివాసం చుట్టూ భారీ వలయంగా ఏర్పడ్డారు. ఇదిలా ఉండగా.. దేశం కోసం నినాదంతో మహీంద రాజపక్స తీసుకొచ్చిన కొన్ని నిర్ణయాలు లంక పాలిట శాపంగా పరిణమించాయి. కరోనా ఎఫెక్ట్‌తో దేశ ప్రధాన ఆదాయంవచ్చే టూరిజం ఘోరంగా దెబ్బతినగా.. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి పెరిగిన ధరలు, నిత్యావసరాలు, మందుల కొరతతో అక్కడి ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. చదవండి: చర్యలకు ఉపక్రమించిన అధ్యక్షుడు.. కష్టాల నుంచి లంక గట్టేక్కేనా? -
శ్రీలంక ప్రధాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ఏ క్షణం ఏం జరుగుతుందో?
కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు ఆందోళనలు మరింత ఉధృతం చేశారు. ఏకంగా ప్రధాని మహింద్ర రాజపక్సే ఇంటిని ముట్టడించారు. పోలీసులు వారిని నిలువరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బారికేడ్లు విరగొట్టి ప్రధాని ఇంటి వైపునకు ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈక్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రధాని ఇంటివద్దకు భారీ ఎత్తున పోలీసులు, ఆర్మీ బలగాలు చేరుకున్నాయి. ఇక ఆందోళనకారులు ప్రవేశించిన చోట విద్యుత్ నిలిపేసిన పోలీసులు వారికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని లేదంటే పరిస్థితులు చేయిదాటిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రధాని ఇంటి వద్ద లెవల్-2 సెక్యురిటీ లైన్ దాటితే టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మూడో లెవల్ సెక్యురిటీ లైన్ దాటితే కాల్పులు జరిపే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీడియా సిబ్బందిని పోలీసులు అక్కడ నుంచి దూరంగా పంపించివేశారు. (చదవండి: భారత్, మోదీపై లంక క్రికెటర్ సనత్ జయసూర్య ఆసక్తికర కామెంట్స్) -
మే చివరి నాటికి మునిగిపోవడమే..!
కొలంబో: దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్సే ఎలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదని శ్రీలంక ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమ ప్రభుత్వం ప్రస్తుత సంక్షోభాలను ఎదుర్కొంటుందని తెలిపింది. దేశంలో ఎమర్జెన్సీ విధించాలన్న గొటుబయ నిర్ణయాన్ని సమర్థించింది. ఆందోళనలను అణచివేసేందుకు గొటుబయ దేశంలో ఎమర్జెన్సీ విధించి అనంతరం ప్రజాగ్రహానికి తలవంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే! అధ్యక్ష పదవికి ఎన్నికైన గొటబయ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని పార్లమెంట్లో ప్రభుత్వం చీఫ్ విప్, మంత్రి జాన్స్టన్ ఫెర్నాండో చెప్పారు. గతవారం దేశంలో విధించిన అత్యవసర పరిస్థితిని మంగళవారం రాత్రి గొటబయ రద్దు చేశారు. సభలో వాదనలు.. మంగళవారం పార్లమెంట్లో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో సభను స్పీకర్ రెండుమార్లు వాయిదా వేశారు. లంకలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస మానవహక్కుల కార్యాలయం పేర్కొంది. శాంతియుత పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో పరిస్థితులు కొన్ని వారాలుగా క్షీణించాయని ఐరాస ప్రతినిధి లిజ్ చెప్పారు. మే నాటికి మునిగిపోవడమే! లంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు మే చివరికి మరింత ముదిరిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. ఈ రెండు సంక్షోభాలకు తక్షణ పరిష్కారం చూడకపోతే భవిష్యత్‌లో భారీ మూల్యం తప్పదని ఆర్థికవేత్త జనక్ సింఘే చెప్పారు. కేబినెట్ నియామకాలపై అధ్యక్షుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వంలో చేరాలన్న ఆయన పిలుపునకు రాజకీయపార్టీలేవీ స్పందించలేదు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజపక్సే కుటుంబం కీలక పదవులన్నీ తమ గుప్పిట్లో పెట్టుకుంది. సంక్షోభం ముదిరిపోవడంతో ఇప్పుడు పదవులు పంచుతామని పిలిచినా ఏ పార్టీ స్పందించడం లేదు. దీంతో అటు రాజకీయ, ఇటు ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉంది. -
శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం.. మైనార్టీలో గొటబాయ సర్కార్
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరనసలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ అమల్లో ఉన్నప్పటికీ నిరసనలు మాత్రం తగ్గడం లేదు. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో కీలక అధికారులు, మంత్రులు రాజీనామా బాట పడుతున్నారు. ఆహార, ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న శ్రీలంకలో.. రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. 41 మంది ఎంపీలు అధికార కూటమికి మద్ధతు ఉపసంహరించుకోవడంతో అధ్యక్షుడు గొటబయా రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. శ్రీలంక ప్రజా ఫ్రంట్ నుంచి బయటకు వచ్చేశామని, తాము స్వతంత్ర సభ్యులుగా ఉంటామని ఫ్రీడమ్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వెల్లడించారు. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు. దీంతో గొటబాయ సర్కార్ మెజార్టీ కోల్పోయింది. చదవండి: శ్రీలంకలో ముదరుతున్న సంక్షోభం.. నూతన ఆర్థిక మంత్రి రాజీనామా ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కాగా.. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియంబలపితియా తన పదవికి రాజీనామా చేశారు. అలాగే, బసిల్ రాజపక్స స్థానంలో ఆర్థికమంత్రిగా నియమితులైన అలి సబ్రి 24 గంటల్లోనే రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదే విధంగా ఆర్థిక అవకతవకల ఆరోపణలతో సెంట్రల్ బ్యాంక్ ఉన్నతాధికారి సోమవారం రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రధాని రాజపక్స సారథ్యంలోని కేంద్ర కేబినెట్లోని మొత్తం 26 మంది మంత్రులు ఆదివారం అర్థరాత్రి సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ సంక్షోభం నుంచి గట్టేందుకు కేబినెట్లో చేరి పదవులు చేపట్టాలని అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. కానీ ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే తిరస్కరించాయి. అయితే కేబినెట్ మొత్తం రాజీనామా చేసినా.. గొటబాయ, మహింద రాజపక్సలు మాత్రం తమ పదవుల్లో కొనసాగుతున్నారు. చదవండి: శ్రీలంక సంక్షోభంపై జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్పందన.. ఎమోషనల్ పోస్ట్ -
రండి.. మంత్రివర్గంలో చేరండి
తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక బెయిలౌట్ కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతోంది. అదే సమయంలో ప్రజా వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చిన రాజకీయ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రతిపక్షాలకు ప్రభుత్వ ఏర్పాటునకు పిలుపు ఇచ్చాడు. అంతా కలిసి కేబినెట్ ఏర్పాటు చేద్దామంటూ పిలుపు ఇచ్చాడు. అఖిలపక్ష ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంపై నెలకొన్న ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు ఈ మేరకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఏర్పాటునకు ముందుకు రావాలంటూ ఆయన అన్ని పార్టీలకు సందేశం పంపారు. ఈ మేరకు రాజపక్స ఆఫీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. నిరసనలు తారాస్థాయికి చేరుతున్న క్రమంలో.. కొత్త కేబినెట్‌పై ఇవాళే ఓ కొలిక్కి రావాలని అధ్యక్ష భవనం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. లంక కేంద్ర కేబినెట్లోని 26 మంత్రులంతా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అజిత్ నివార్డ్ కబ్రాల్ సైతం సోమవారం తన పోస్టుకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని పదవిని వీడని మహీంద రాజపక్స.. సోమవారం ఉదయం అధ్యక్ష భవనానికి చేరుకుని రాజకీయం మొదలుపెట్టాడు. మొత్తం ఐదుగురు రాజపక్స కుటుంబ సభ్యులు మంత్రివర్గంలో ఇదివరకు ఉన్నారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స(రక్షణ మంత్రిగా), ప్రధాని మహీంద రాజపక్స, ఇరిగేషన్ మినిస్టర్ చామల్ రాజపక్స, బసిల్ రాజపక్స, ప్రధాని మహీంద తనయుడు నమల్ రాజపక్స క్రీడాశాఖ మంత్రిగా ఉన్నారు ఇంతకాలం. అంతేకాదు.. ఇతర ప్రధాన పోస్టింగ్‌లోనూ కుటుంబ పాలనే నడుస్తోంది అక్కడ. దీంతో దోచుకున్న సొమ్మును ఈ కష్టకాలంలో ప్రజల కోసం ఖర్చు చేయాలంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు అధ్యక్షుడి కేబినెట్ ఆఫర్ పట్ల ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయనేది తెలియాల్సి ఉంది. ప్రతిపక్ష నేత సాజిత్ మాత్రం మంత్రుల రాజీనామాను ఓ మెలోడ్రామాగా అభివర్ణించడం విశేషం. -
కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని రాజపక్సే
-
తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధాని
తిరుమల/రేణిగుంట: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్సే కుటుంబసమేతంగా గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్ద ఆయనకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఏఈవో ఏవీ ధర్మారెడ్డి, తదితరులు స్వాగతం పలికారు. రాజపక్సే తన కుటుంబంతో కలిసి నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో మహింద రాజపక్సేకు సాదర స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వారికి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు. -
ఊపిరిపీల్చుకున్న లంక
శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో తీర్మానం వచ్చినప్పుడల్లా ఆ దేశంకంటే మనకే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తటం రివాజుగా మారింది. ఈసారి కూడా అదే అయింది. శ్రీలంక తీరును నిరసిస్తూ బ్రిటన్ ఆధ్వర్యంలో ప్రతిపాదించిన తీర్మానానికి 47మంది సభ్య దేశాలుండే మండలిలో మంగళవారం రాత్రి ఓటింగ్ జరిగింది. తీర్మానాన్ని 22 దేశాలు సమర్థించగా, 11 దేశాలు వ్యతిరేకించాయి. 25 ఓట్లతో తీర్మానం గెలిచివుంటే లంకకు సమస్యలెదురయ్యేవి. కానీ భారత్‌తోపాటు 14 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. తీర్మానం గెలిచితీరాలని బ్రిటన్, దాని మిత్ర దేశాలు శతవిధాల ప్రయత్నించగా, ఇది వీగిపోవాలని శ్రీలంక బలంగా కోరుకుంది. ఏ స్థాయిలో అంటే... లంక ప్రధాని మహిందా రాజపక్స కరోనా భయాన్ని కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్ సందర్శించి ఆ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని ఆ దేశ ప్రధాని హసీనాను కోరారు. ఇస్లామిక్ దేశాల సంస్థ(ఓఐసీ)ను లంక అధ్యక్షుడు గోతబయ రాజపక్స సంప్రదించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా గోతబయ మాట్లాడారు. తమిళ టైగర్లను అణిచే పేరిట మహిందా రాజపక్స ప్రభుత్వం 2009–10 మధ్య నరమేథం సాగించింది. ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్, ఆయన కుటుంబంతోపాటు ఆ సంస్థలోని వారందరినీ మట్టుబెట్టింది. ఆ నరమేథంలో 40,000మంది మరణించారని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ తేల్చినా...వాస్తవానికి లక్షకు మించి ప్రాణనష్టం జరిగిందని అనధికార గణాంకాలు చెబుతున్నాయి. ఎల్టీటీఈ మహిళా విభాగం కార్యకర్తలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు జరిగాయని, సజీవంగా దహనం చేసిన ఘటనలు కూడా వున్నాయని ఆరోపణలొచ్చాయి. లక్షలాది తమిళ కుటుంబాలు ప్రాణభయంతో వలస బాటపట్టాయి. ఇందుకు బాధ్యులెవరో గుర్తించి శిక్షించాలని కోరినా శ్రీలంక పెడచెవిన పెట్టడంతో మానవ హక్కుల మండలి పదే పదే ఆ దేశాన్ని అభిశంసిస్తోంది. 2009 మొదలుకొని ఇప్పటివరకూ 8 దఫాలు తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలపై ఓటింగ్ జరిగిన ప్రతిసారీ ఒకే మాదిరి ఫలితం వుంటుంది. చైనా, పాకిస్తాన్, రష్యాలు వాటిని వ్యతిరేకిస్తాయి. లంక సార్వభౌమత్వాన్ని ఈ తీర్మానాలు దెబ్బతీస్తాయని, వీటి వెనక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆ దేశాలు ఆరోపిస్తాయి. సాధారణంగా మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించే విదేశాంగ విధానంపై రాజకీయ పక్షాలు స్పందిస్తాయి. విమర్శించటమో, సమర్థించటమో చేస్తాయి. రాష్ట్రాలు దాని జోలికిపోవు. కానీ శ్రీలంక విషయంలో తమిళనాడు స్పందిస్తుంది. అక్కడున్న తమిళులకు ఏం జరిగినా తల్లడిల్లుతుంది. కేంద్రం జోక్యం చేసుకుని, ఆ ప్రభుత్వంతో మాట్లాడాలని కోరుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అది మరింత చర్చనీయాంశమవుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఎవరో కాదు...బీజేపీ మిత్ర పక్షమైన అన్నాడీఎంకే ఆ తీర్మానాన్ని సమర్థించాలని కోరింది. డీఎంకే, ఇతర తమిళ పక్షాలు సైతం ఈ రకమైన డిమాండే చేశాయి. లంక తమిళుల ప్రయోజనాలు కాపాడతామన్న హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ జీరో అవర్‌లో కూడా అన్నా డీఎంకే విజ్ఞప్తి చేసింది. కానీ అందుకు భిన్నంగా మన దేశం ఓటింగ్‌కు గైర్హాజరు కావటంతో తాజా ఎన్నికల్లో అది చర్చనీయాంశమవుతుంది. ఆ సంగతెలావున్నా శ్రీలంక విషయంలో దూకుడుగా పోరాదని మొదటినుంచీ మన దేశం భావిస్తోంది. 2009–13 మధ్య మూడు సందర్భాల్లో ఓటింగ్ జరగ్గా, ఆ మూడుసార్లూ మన దేశం లంక వ్యతిరేక తీర్మానాన్ని సమర్థించిన మాట వాస్తవమే. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో యూపీఏలో భాగస్వామిగా వున్న డీఎంకే పట్టుబట్టేది. అది తప్పుకుంటే ప్రభుత్వానికి సమస్యలెదురవుతాయన్న భయంతో చివరివరకూ ఊగిసలాడి, చివరకు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. 2014లో ఎన్డీఏ సర్కారు వచ్చాక మండలిలో ఓటింగ్ జరిగినప్పుడు మన దేశం గైర్హాజరైంది. అటుపై మూడుసార్లు మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరుణంలో కేంద్రం ఏం చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. సమానత్వం, న్యాయం, గౌరవం, శాంతి కావాలన్న శ్రీలంక తమిళులను సమర్థిస్తున్నామని... అదే సమయంలో లంక సమైక్యత, సుస్థిరత, దాని ప్రాదేశిక సమగ్రత కోరుకుంటున్నామని మన దేశం తెలిపింది. ఈ రెండింటినీ పరిగణించే ఓటింగ్‌కు దూరంగా వున్నట్టు వివరించింది. అయితే మన పొరుగు దేశంగా వున్న లంకతో లౌక్యంగా వ్యవహరించకతప్పదన్న ఆలోచనే తాజా నిర్ణయానికి కారణమని చెప్పాలి. ఇప్పటికే రాజపక్స సోదరుల ఏలుబడిలో లంక చైనాకు దగ్గరైంది. మన దేశం ఆధ్వర్యంలో సాగుతున్న ప్రాజెక్టులకు అవరోధాలు ఎదురవుతున్నాయి. అక్కడ చైనా పలుకుబడి మరింత పెరగటం భద్రత కోణంలో కూడా మంచిది కాదన్న అభిప్రాయం మన ప్రభుత్వానికుంది. తమిళుల ప్రయోజనాలను కాపాడే రాజ్యాంగ సవరణలను అమలు చేయాలని, లంక ప్రాంతీయ మండళ్లకు ఎన్నికలు జరిపి అధికారాలు వికేంద్రీకరించాలని మన దేశం కోరుతోంది. ఆ విషయంలో లంక సర్కారు అనుకూలంగానే వున్న సూచనలు వచ్చాయి. హక్కుల మండలి వంటి సంస్థల పాక్షిక ధోరణులపై విమర్శలున్నా నరమేథంపై ఇన్నేళ్లయినా నిమ్మకు నీరెత్తినట్టున్న లంక తీరు కూడా సమంజసం కాదు. అంతిమంగా అక్కడి తమిళులకు న్యాయం జరిగేలా, వారు ప్రశాంతంగా జీవనం సాగించేలా రాజపక్స ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. -
శ్రీలంక ప్రధాని ఇంట నవరాత్రి సంబరాలు
-
ప్రధానిగా మహింద ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శతాబ్దాల చరిత్ర ఉన్న బౌద్ధాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయ రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ ప్రముఖులు, దౌత్యాధికారులు, సీనియర్ అధికారులు పొల్గొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్ఎల్పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటు రాజపక్స కుటుంబం హవా సాగనుంది. కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయం రాజమహ విహారయలో ఆదివారం ఉదయం 9.28 గంటలకు జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధికార ఎస్ఎల్పీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, పండుగ చేసుకున్నారు. ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం ఖాయమన్న సంకేతాలు వెలువడగానే భారత ప్రధాని మోదీ రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 225కు గాను.. 150 సీట్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్ఎల్పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది. 24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి.. మహింద రాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి. -
శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణస్వీకారం
-
శ్రీలంక ప్రధానిగా నాలుగోసారి రాజపక్స
కొలంబో: శ్రీలంక సార్వత్రిక ఎన్నికల్లో మహింద రాజపక్స పార్టీ ఘనవిజయం సాధించింది. రాజపక్స నాయకత్వంలోని శ్రీలంక పీపుల్స్ పార్టీ మూడింట రెండొంతుల స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మహింద 4వసారి ప్రధాన మంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్రీలంక పీపుల్స్ పార్టీ పార్లమెంటులోని 225 సీట్లకుగాను 150 సీట్లలో విజయబావుటా ఎగురవేసింది. మాజీ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. 1977 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నాలుగుసార్లు ప్రధానిగా చేసిన విక్రమ్‌సింఘే ఘోరపరాజయం పాలయ్యారు. -
విజయం దిశగా మహింద రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మహింద రాజపక్స మరోసారి కీలకంగా మారనున్నారు. ఆయన నేతృత్వం వహిస్తున్న శ్రీలంక పొదుజన పెరుమణ(ఎస్ఎల్పీపీ) పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఫలితాలు వెలువడిన 16 సీట్లకుగాను 13 చోట్ల 60 శాతం పైగా ఓట్లు సాధించింది. తమిళులు మెజారిటీ సంఖ్యలో ఉన్న ఉత్తర ప్రాంతంలో కూడా ఎస్ఎల్పీపీ అభ్యర్థులే విజయం దిశగా సాగిపోతున్నారు. మొత్తం 22 జిల్లాలకుగాను 17 జిల్లాల్లో ఎస్ఎల్పీపీ తిరుగులేని ఆధిక్యం సంపాదించినట్లు అనధికార ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 225 సీట్లున్న అసెంబ్లీలో ఎస్ఎల్పీపీ అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీ సాధించిన అద్భుత విజయమని మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పేర్కొన్నారు. ఈ గెలుపుపై మహింద రాజపక్సకు భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్–19 భయం పొంచి ఉన్నప్పటికీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారనీ, ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని అభినందించారు. ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకునేందుకు, ప్రత్యేకమైన అనుబంధాన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఈ ఫలితాలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. భారత ప్రధానికి మహింద రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంక, భారత్‌లు స్నేహితులు, బంధువులు కూడా అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
శ్రీలంక ప్రధాని రాజపక్సేకు ఘనస్వాగతం
-
తమిళుల సమస్యలను పరిష్కరించండి
న్యూఢిల్లీ: శ్రీలంకలోని తమిళుల సమస్యలను పరిష్కరించాలని, వారి హక్కుల కోసం అక్కడి రాజ్యాంగంలో ఉద్దేశించిన నిబంధనలను అమలు చేయాలని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సను ప్రధాని మోదీ కోరారు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, తమిళుల సయోధ్య ప్రక్రియను అమలు చేయాలని కోరారు. ఇందుకోసం శ్రీలంక రాజ్యాంగంలోని 13వ సవరణను అమలుచేయాలని తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు చేరుకున్న రాజపక్స శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. శ్రీలంకలో తమిళుల జీవన ప్రమాణాల పెంపు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపరచుకోవడం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు విస్తృ్తత స్థాయి చర్చలు జరిపారు. శ్రీలంకలో తమిళుల సమస్యల పరిష్కారానికి కొలంబో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై మానవతా కోణంలో స్పందించాలని ఇరుదేశాలు నిర్ణయించాయని వెల్లడించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహకారం అందించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి రాజపక్స కృతజ్ఞతలు తెలిపారు. -
'ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుదాం'
-
'ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడుదాం'
న్యూఢిల్లీ : శ్రీలంకలో ఉన్న తమిళ మైనారిటీల పట్ల ఆ దేశ ప్రభుత్వం సమానత్వం, న్యాయం, గౌరవం చూపిస్తుందన్న విశ్వాసం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సతో మోదీ శనివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, ఆర్థిక వ్యవహారాలు, పర్యాటకం తదితర అంశాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...'భారత్, శ్రీలంకలు రెండు కేవలం పక్కపక్కన ఉండే దేశాలు మాత్రమే కాదని, ఎప్పటికి మంచి స్నేహితులుగా కలిసి ఉంటాయి. శ్రీలంక అభివృద్ధికి భారత ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడే ఉంటుంది. మన ప్రాంతంలో ఉగ్రవాదం సమస్య ఎక్కువగా ఉంది. రెండు దేశాలు కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సహకారాన్ని పెంచుకోవాలి. గతేడాది ఏప్రిల్‌లో ఈస్టర్ రోజున శ్రీలంకలో చర్చిలపై ఉగ్రవాదులు బాంబు దాడి చేయడం బాధాకరం. ఈ దాడులు ఒక్క శ్రీలంకకే కాదు.. మొత్తం మానవాళికి బాధ కలిగించే విషయం' అని మోదీ పేర్కొన్నారు. కాగా భారత పర్యటనలో భాగంగా రాజపక్స ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న కాశీ శైవక్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఫిబ్రవరి 10వ తేదిన బీహార్‌లోని గయాలోని బౌద్దుని సందర్శించనున్నారు. -
లంకతో కరచాలనం
ఈమధ్యే శ్రీలంక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గోతబయ రాజపక్స తన తొలి విదేశీ పర్యటనకు మన దేశాన్ని ఎంచుకుని గురువారం ఇక్కడికొచ్చారు. పదిరోజులనాడు జరిగిన ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని శ్రీలంక పొదుజన పెరమున(ఎస్ఎల్పీపీ) అధిక శాతం ఓట్లు సాధించింది మొదలు కొని ఇరు దేశాల సంబంధాలపైనా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. గోతబయ సోదరుడు మహిందా రాజపక్స అయిదేళ్ల క్రితం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన భారత్ విషయంలో వ్యవహ రించిన తీరు నేపథ్యంలో ఈ ఊహాగానాలు తలెత్తాయి. అయితే భారత్ భద్రతకు ఇబ్బందిగా పరిణ మించే విధాన నిర్ణయాలేవీ తీసుకోబోమని గోతబయ ఇప్పటికే చెప్పారు. చైనాతో తమ సంబంధాలు పూర్తిగా వాణిజ్యపరమైనవేనని వివరించారు. బహుశా మన ప్రభుత్వానికి కూడా ఇందుకు సంబం ధించిన సంశయాలున్నట్టున్నాయి. కనుకనే గోతబయ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విదేశాంగ మంత్రి జైశంకర్ కొలంబో వెళ్లి ఆయన్ను కలిశారు. భారత్ పర్యటనకు రావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని ఆయనకు అందించారు. శ్రీలంకతో మన సంబంధాలు శతాబ్దాలనాటివి. అయితే ఈ సంబంధాల్లో గత కొన్నేళ్లుగా ఆటుపోట్లు తప్పడం లేదు. ముఖ్యంగా మహిందా ఏలుబడిలో ఆ దేశం చైనాకు సన్నిహితమై మనల్ని దూరం పెట్టింది. హిందూ మహాసముద్ర ప్రాంతం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనది. ఈ ప్రాంతం మీదుగానే తూర్పు, పడమర దేశాల మధ్య నిరంతరం సరుకు రవాణా సాగుతుంటుంది. కనుకనే అది తమ అదుపాజ్ఞల్లో ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆటాడించవచ్చునని అగ్రరాజ్యాలు ఆశిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న లంక మన ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తే అది మన భద్రతకు ముప్పు కలిగిస్తుంది. వాస్తవానికి చైనా ఒక వ్యూహం ప్రకారం హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని మనకు సవాలు విసురుతోంది. ఈ విషయంలో మన సమస్యలు మనకున్నాయి. మామూలుగా అయితే విదేశాంగ విధానం విషయంలో ఏ రాష్ట్ర ప్రభు త్వమూ జోక్యం చేసుకోదు. ఫలానా విధంగా ఉండాలని కేంద్రాన్ని కోరదు. కానీ లంకతో సంబంధా లకు ఇది వర్తించదు. శ్రీలంక తమిళులపై అక్కడి ప్రభుత్వం లేదా సింహళ తీవ్రవాద సంస్థలూ విరుచుకుపడినప్పుడల్లా తమిళనాట ఆగ్రహావేశాలు పెల్లుబికేవి. ప్రభాకరన్ నేతృత్వంలోని లిబరేషన్ టైగర్ల సంస్థ శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతంలో ఆధిపత్యం చలాయించినప్పుడు, ఉగ్రవాద దాడు లకు పాల్పడినప్పుడు లంక సర్కారు ఆ వంకన అక్కడి తమిళులపై దమనకాండ ప్రయోగించేది. అలాంటి పరిణామాలు తలెత్తినప్పుడల్లా ఆ దేశాన్ని గట్టిగా హెచ్చరించాలని, అక్కడున్న తమిళుల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్లు బయల్దేరేవి. ఈ పరిస్థితుల్లో సహజంగానే మన దేశం లిబరేషన్ టైగర్ల అణచివేతకు సహకరించలేకపోయింది. దాంతో రాజపక్స చైనాకు దగ్గరయ్యారు. అది ఉదారంగా ఇచ్చిన యుద్ధ విమానాలు, మారణాయుధాలు, రాడార్ల సాయంతో 2009లో ప్రభా కరన్తోసహా లిబరేషన్ టైగర్లందరినీ మట్టుబెట్టాక ఆయన పూర్తిగా చైనాపై ఆధారపడటం మొదలుపెట్టారు. ఇదే అదునుగా అక్కడి మౌలిక సదుపాయాల రంగంపై చైనా దృష్టి కేంద్రీకరించి భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. శ్రీలంకలో నౌకాశ్రయాలు, రహదారులు నిర్మించడానికి సిద్ధ పడింది. చూస్తుండగానే చైనా పెట్టుబడులు అమాంతం పెరిగిపోగా, మన వాటా క్షీణించింది. వాణిజ్య సంబంధాలూ అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే చైనాతో సంబంధాలకు ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో లంకకు ఆలస్యంగా అర్థమైంది. పెట్టుబడులన్నిటిపై అది వసూలు చేసిన వడ్డీలు కాబూలీవాలాను తలపించాయి. ప్రాజెక్టులన్నీ లంకకు గుదిబండలుగా మారాయి. రుణాలను చెల్లించడం మాట అటుంచి వడ్డీలు కట్టడానికే దిక్కుతోచని స్థితి ఏర్పడింది. దేశ సార్వ భౌమత్వానికి పాతరేస్తున్న ఈ ప్రాజెక్టులపై స్థానికుల్లో నిరసనలు పెల్లుబికాయి. ఉద్యమాలు ఉధృత మయ్యాయి. పర్యవసానంగా కొలంబో పోర్టు సిటీ వంటివి చాన్నాళ్లు నిలిచిపోయాయి. ఈ ప్రాజె క్టుల్ని రద్దు చేసుకుంటే చైనాకు భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి రావడంతో లంక సంకటంలో పడింది. గత్యంతరం లేక కొలంబో పోర్టు సిటీ ప్రాజెక్టును చైనాకే 99 ఏళ్ల లీజుకివ్వాల్సి వచ్చింది. ఇది తమ సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తుందని లంక ప్రజానీకం భావిస్తుంటే, భారత్ భద్రతకు సమ స్యగా మారుతుందని మన ప్రభుత్వం అనుకుంటోంది. గత ఎన్నికల్లో ఓడిపోయాక మహిందా రాజపక్స మన దేశంపై ఆక్రోశం వెళ్లగక్కారు. భారత్ హైకమిషన్ కార్యాలయం తన ఓటమికి పావులు కదిపిందని ఆరోపించారు. ఆ తర్వాత ఆయన స్వరం తగ్గించినా, గోతబయ మాత్రం నిరుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మన దేశాన్ని నిందిం చారు. అయితే మన దేశం కూడా మొన్నటిదాకా పాలించిన సిరిసేనపై అసంతృప్తిగా ఉంది. చైనాతో ఆయన దృఢంగా వ్యవహరించలేదన్న అభిప్రాయంతో ఉంది. కనుకనే ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండి పోవడమే కాదు... గోతబయ ఎన్నికయ్యాక వెనువెంటనే ఆయన్ను అభినందించింది. ఇరు దేశాలూ చర్చించుకుని పరిష్కరించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. కొలంబో పోర్టులో జపాన్ సహ కారంతో మన దేశం ఒక టెర్మినల్ నిర్మించడానికి సుముఖత వ్యక్తం చేసి చాన్నాళ్లయింది. అలాగే ట్రింకోమలీ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు, మరొకచోట 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణం ప్రతిపాదనలు సిరిసేన కాదనడంతో ఆగిపోయాయి. వీటిని ఖరారు చేసుకోవడంతోపాటు గోత బయతో లంకలో పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం, దానివల్ల మన దేశానికి ఏర్పడగల ముప్పు వగైరా అంశాలు చర్చించాల్సి ఉంది. దౌత్యసంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అప్పుడప్పుడు అల కలు, అపోహలు తప్పవు. నరేంద్రమోదీ, రాజపక్స శుక్రవారం జరిపే చర్చలు ఇరు దేశాల సంబం ధాల మెరుగుదలకు దోహదపడతాయని ఆశించాలి. -
భారత్- శ్రీలంక: రాజపక్స కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ప్రత్యేక చొరవ చూపిస్తారని శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్స తనయుడు, ఎంపీ నమల్ రాజపక్స అన్నారు. సరిహద్దు దేశాలతో సఖ్యతగా మెలిగేందుకు ఏమాత్రం వెనుకాడబోరన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. శ్రీలంక తాజా అధ్యక్ష ఎన్నికల్లో గోటబయ రాజపక్స గెలుపొందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన సోదరుడు మహిందా రాజపక్సను ప్రధానిగా ఆయన ఎంపిక చేశారు. 2005 నుంచి 2015 వరకు ప్రధానిగా ఉన్న మహిందాకు చైనాతో సత్సంబంధాలే ఉన్నాయి. ఆయన హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు గోటబయ... ఎల్టీటీఈ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం, భారత్‌కు కనీసం సమాచారం ఇవ్వకుండానే చైనాకు చెందిన జలాంతర్గాముల్ని హిందూ సముద్ర జలాల్లోకి అనుమతినివ్వడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గోటబయ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక ఇటీవలి ఎన్నికల్లో శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న తమిళులు, ముస్లింలు అధికంగా ఉండే శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో గోటబయకు పెద్దగా ఓట్లు రాకపోవడంతో భారత్- లంక బంధంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీటీవీతో మాట్లాడిన రాజపక్స వంశీయుడు నమల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ భారత్- శ్రీలంక- చైనా దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి కొంతమంది తప్పుగా అన్వయిస్తున్నారు. నాయకుల్లో కూడా దీనిపై కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దు దేశాలతో బంధం మెరుగుపరచుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. ఆయన పొరుగు దేశాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు’ అని పేర్కొన్నారు. అదే విధంగా శ్రీలంక రాజకీయ పరిణామాలపై తమిళనాడు నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను నమల్ ఖండించారు. శ్రీలంక తమిళుల కోసం, వారి జీవనోపాధికై వారే ఏం చేశారని ప్రశ్నించారు. ‘ శ్రీలంక ఇప్పుడు సంక్షోభంలో ఉంది. 30 ఏళ్లుగా ఇక్కడ పాశవిక యుద్ధాలు జరిగాయి. ఎల్టీటీఈ ఈ యుద్ధాలను సింహళీయులు, తమిళుల మధ్య శత్రుత్వంగా చిత్రీకరించింది. ఇది దారుణమైన విషయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గోటబయ రాజపక్సను భారత్ పర్యటనకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన గోటబయ .. ‘ శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వం భారత్‌కు కూడా ఎంతో ముఖ్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి ఆయన తీసుకునే నిర్ణయాలు రక్షణ పరంగా భారత్‌కు ఎలాంటి సవాళ్లు విసురుతాయనేది చర్చనీయాంశంగా మారింది. చైనా వ్యవహారశైలి.. అంతర్జాతీయ సమాజంలో అలజడి! మహేంద్ర రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, రేవులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం 700 కోట్ల డాలర్లకు పైగా రుణాలను తీసుకోవడంతో ఇప్పుడు చైనాతో సత్సంబంధాలు కొనసాగించక తప్పని పరిస్థితి. మౌలిక సదుపాయాల కల్పన పేరుతో రుణాలు ఇచ్చి, వాటిని చెల్లించకపోతే విమానాశ్రయాలు, ఓడరేవుల్ని చైనా లీజుకి తీసుకోవడం అంతర్జాతీయ సమాజంలో ఆందోళన పుట్టిస్తోంది. యూరప్, ఆసియా మధ్య వాణిజ్య బంధాలకు ప్రతీకగా నిలిచిన దక్షిణ శ్రీలంకలో హమ్‌బటన్‌టోటా పోర్ట్ నిర్మాణానికి రుణాలు చెల్లించలేక 2017లో లంక ప్రభుత్వం 99 ఏళ్ల పాటు చైనాకు లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా శ్రీలంకకి ఉన్న అరుదైన పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చైనా చేస్తోంది. -
శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే గురువారం బాధ్యతల నుంచి తప్పుకోగానే, మహిందా రాజపక్స ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోతబయ రాజపక్స చేతిలో విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) తరఫున పోటీ చేసిన సాజిత్ ప్రేమదాస ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. పార్లమెంట్లో తన ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే తెలిపారు. మహిందా రాజపక్స 2005 నుంచి 2015 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వివాదాస్పద రీతిలో ప్రధానిగా విక్రమసింఘేని తొలగించి మహిందా రాజపక్సను ఆ పదవిలో కూర్చోబెట్టి రాజ్యాంగ సంక్షోభానికి తెరతీశారు. ఆ తరువాత డిసెంబర్లో ప్రధాని పదవికి రాజపక్స రాజీనామా చేశారు. 1970లో తన 24 ఏళ్ల వయసులోనే తొలిసారి శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికై మహిందా రాజపక్స రికార్డు సృష్టించారు. విక్రమసింఘే 1994 నుంచి యూఎన్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయనపై సొంత పార్టీలో అసమ్మతి ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవిని ప్రేమదాసకు అప్పగించాలని పార్టీలోని యువతరం డిమాండ్ చేస్తోంది. -
శ్రీలంక ఎన్నికల్లో విజేత ఎవరు?
శ్రీలంక అధ్యక్ష పదవికి 35 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో పోటీ ఆసక్తిగా మారింది. గత కొన్నాళ్లుగా కల్లోల, సంక్షోభ పరిస్థితులు నెలకొన్న శ్రీలంకలో ఈ ఎన్నికల ద్వారా శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ పరిశీలకులు, ప్రజలు భావించారు. కానీ శనివారం ఉదయం మైనారిటీ వర్గానికి చెందిన ముస్లింలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న వంద బస్సులపై కొలంబోకు 240 కిలోమీటర్ల దూరంలోని తంతిరిమలే వద్ద ఓ గుర్తు తెలియని సాయుధుడు కాల్పులు జరపగా, మరో చోట ఓ గుంపు రాళ్లు రువ్వింది. ఈ సంఘటనల్లో ఎవరు గాయపడలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. గతేడాది దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, దేశ ప్రధానిని తొలగించి మహింద రాజపక్సను ప్రధానిగా నియమించడంతో మూడు నెలల పాటు దేశంలో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏప్రిల్ నెలలో లంకలోని చర్చ్‌లు లక్ష్యంగా జరిగిన బాంబు దాడుల్లో ఇద్దరు ఆస్ట్రేలియన్లు సహా 250 మంది మరణించారు. ఈ ఘోరాన్ని ఆపలేకపోయినందుకు దేశాధ్యక్షుడు సిరిసేనను పార్లమెంట్ నివేదిగా నిందితుడిగా పేర్కొంది. ఆ తర్వాత ముస్లింలను విచక్షణారహితంగా అరెస్ట్‌లు చేసి నిర్బంధించడాన్ని కూడా నిందించింది. పైగా ఆయన గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేక పోయారు. అందుకని ఆయనగానీ, మహింద రాజపక్సగానీ పోటీ చేయడం లేదు. మహింద రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స ప్రతిపక్ష పార్టీ ‘శ్రీలంక పోడుజన పెరమున’ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. అయితే ఆయనకు తమిళులు, ముస్లింలలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఆయనకు ప్రధాన ప్రత్యర్థి మాజీ దేశాధ్యక్షుడు రణసింగే ప్రేమదాస కుమారుడు రజిత్ ప్రేమదాస. ఆయన పాలకపక్ష ‘యునైటెడ్ నేషనల్ పార్టీ’ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరి మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ రాజపక్స గెలిచే అవకాశాలే కొంచెం ఎక్కువ ఉన్నాయని ఎన్నికల పరిశీలకు అంచనా వేశారు. 1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం. వారిలో నలుగురు ముస్లిం అభ్యర్థులు, ఇద్దరు బౌద్ధ సన్యాసులు ఉండగా, ఒక్క మహిళ పోటీలో ఉన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించాలన్న 50 శాతానికి మించి ఓట్లు రావాల్సి ఉంటుంది. పోలింగ్ ముగిశాక ఈ రోజే ఓట్ల లెక్కంపు మొదలవుతుంది. అర్ధరాత్రికి మొదటి ఫలితం, సోమవారం మధ్యహ్నానికి తుది ఫలితాలు వెలువడుతాయి. -
అధ్యక్షుని చర్య రాజ్యాంగ విరుద్ధం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తూ అధ్యక్షుడు సిరిసేన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం నాలుగున్నరేళ్లయినా పూర్తి చేయకుండా అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయజాలడని పేర్కొంది. ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘేను అక్టోబర్ 26వ తేదీన తొలగించిన అధ్యక్షుడు , ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సను నియమించారు. దీంతోపాటు 20 నెలల ముందుగానే పార్లమెంట్‌ను రద్దు చేసి, జనవరిలో ఎన్నికలు జరిపేందుకు అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో తీవ్ర సంక్షోభం తలెత్తింది. అధ్యక్షుడి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం అధ్యక్షుడు జారీ చేసిన తక్షణ ఎన్నికల ఉత్తర్వులను నిలిపివేస్తూ నవంబర్ 13వ తేదీన మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అప్పటి ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏడుకు పెంచింది. గురువారం తీర్పు సందర్భంగా అధికారులు సుప్రీంకోర్టు పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. -
రాజపక్స అధికారం చెల్లదు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రధానిగా నియమించిన మహిందా రాజపక్స అధికారం చెలాయించడం కుదరదని శ్రీలంక కోర్టు సోమవారం తేల్చిచెప్పింది. రాజపక్స కేబినెట్ మంత్రులూ విధులు నిర్వర్తించరాదంది. మైత్రిపాల వివాదాస్పద నిర్ణయాన్ని సవాలు చేస్తూ 122 మంది పార్లమెంట్ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఈ తీర్పునిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 12, 13న చేపడతామని తెలిపింది. అనర్హులు ప్రధాని, మంత్రులుగా ఉంటే భర్తీ చేయలేనంత నష్టం వాటిల్లుతుందని ఈ సందర్భంగా కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాజపక్స ప్రధాని పదవి చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ, జనతా విముక్తి పేరమునా(జేవీపీ), తమిళ్ నేషనల్ అలియన్జ్ పార్టీలు గత నెలలో కోర్టును ఆశ్రయించాయి. రాజ్యాంగానికి లోబడి చట్టబద్ధంగా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని విక్రమసింఘె చెప్పారు. అక్టోబర్ 26న రణిల్ విక్రమ్‌సింఘేను తొలగించిన సిరిసేన ఆ పదవిని మహిందా రాజపక్సకు కట్టబెట్టడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. కోర్టు ఉత్తర్వుల్ని మంగళవారం సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని రాజపక్స ప్రకటించారు. కేబినెట్‌ను సస్పెండ్ చేయడం సరికాదని, రాజ్యాంగపర విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం సుప్రీంకోర్టుకే ఉందని పేర్కొన్నారు. ముగింపు దిశగా సంక్షోభం సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడాలని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ను రద్దుచేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ఈ కేసు తుది విచారణకు రానుంది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని భావిస్తున్న సిరిసేన అంతకు ముందే పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యోచిస్తున్నారని ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. -
శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిష్ప్రయోజనంగా ముగిసింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స హాజరయ్యారు. కాగా, ఈ భేటీని పార్లమెంటు స్పీకర్ జయసూర్యతో పాటు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ బహిష్కరించాయి. ఈ సమస్యను సృష్టించిన సిరిసేనే దీన్ని పరిష్కరించాలనీ, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని జేవీపీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి పార్లమెంటును సమావేశపర్చాలని కోరగా అధ్యక్షుడు స్పందించలేదు. -
కారం పొడి చల్లుకున్న ఎంపీలు!
కొలంబో: శ్రీలంక పార్లమెంట్ శుక్రవారం తీవ్ర గందరగోళం మధ్య సాగింది. గురువారం రాత్రి అధ్యక్షుడు సిరిసేన అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేసి, మరోసారి విశ్వాస పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ సమావేశం ప్రారంభం కాగా రాజపక్స మద్దతుదారులైన యూపీఎఫ్ఏ ఎంపీలు కొందరు స్పీకర్ కుర్చీని ఆక్రమించారు. స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఫర్నిచర్ విరగ్గొట్టారు. పుస్తకాలను విసిరేశారు. వెంట తెచ్చుకున్న కారం పొడి చల్లారు. దీంతో స్పీకర్ పోలీసులను పిలిపించారు. సభ్యులను సముదాయించేందుకు యత్నించిన పోలీసులపైకి కూడా వారు కారం చల్లారు. ఈ దాడిలో ప్రత్యర్థి పార్టీల సభ్యులు కొందరు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో స్పీకర్..సభను సోమవారానికి వాయిదా వేస్తూ పోలీసు రక్షణ నడుమ బయటకు వెళ్లిపోయారు. -
‘అవిశ్వాసం’లో ఓడిన రాజపక్స
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ పార్లమెంటులో బుధవారం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇటు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే ప్రతిపక్ష యునైటెడ్ నేషనల్ పార్టీ, ఇతర చిన్నాచితకా పార్టీలతో పాటు రాజపక్స కేబినెట్లోని మంత్రులు తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో తాజా ప్రధాని మహింద రాజపక్స సభ విశ్వాసాన్ని కోల్పోయినట్లు స్పీకర్ జయసూర్య ప్రకటించారు. రాజ్యాంగానికి లోబడి తదుపరి చర్యలు తీసుకోవాలని అధ్యక్షుడు సిరిసేనకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తేవీలుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు రాజపక్స ప్రభుత్వం జారీచేసే ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సైన్యం, ప్రభుత్వ అధికారులకు మాజీ ప్రధాని విక్రమసింఘే పిలుపునిచ్చారు. త్వరలోనే శ్రీలంకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. -
మహింద రాజపక్సేకు భారీ షాక్
కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మహింద రాజపక్సేకు బుధవారం గట్టి షాక్ తగిలింది. నేడు అత్యవసరంగా సమావేశమైన ఆ దేశ పార్లమెంట్ రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న అనుహ్య నిర్ణయాలతో శ్రీలంక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. గత నెలలో దేశ ప్రధానిగా విక్రమసింఘేను తొలగించి.. ఆ స్థానంలో రాజపక్సేను నియమిస్తూ సిరిసేన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన విక్రమసింఘే తను ప్రధాని బంగ్లాను ఖాళీ చేసేందుకు నిరాకరించారు. పార్లమెంట్ స్పీకర్ జయసూరియ కూడా సిరిసేన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. కానీ సిరిసేన మరో అడుగు ముందుకేసి దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరిలో దేశంలో మధ్యంతర ఎన్నికలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, సిరిసేన నిర్ణయాలపై పలువురు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం పార్లమెంట్ రద్దు చేస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం చెల్లదని మంగళవారం పేర్కొంది. ఎన్నికల ఏర్పాట్లకు చేస్తున్న ఏర్పాట్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. పార్లమెంట్ రద్దు చెల్లదని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో స్పీకర్ బుధవారం అత్యవసరంగా పార్లమెంట్‌ను సమావేశపరిచారు. ఈ సందర్భంగా రాజపక్సపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని మెజారిటీ సభ్యులు మద్దతు తెలిపినట్టు స్పీకర్ ప్రకటించారు. -
సిరిసేన పార్టీతో రాజపక్స తెగదెంపులు
కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహింద రాజపక్స(72) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు హ్యాండిచ్చారు. సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో తన 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని కొత్తగా ఏర్పాటైన శ్రీలంక పీపుల్స్ పార్టీలో చేరారు. గత ఏడాది ఏర్పాటైన ఈ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనూహ్యంగా మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాజపక్స ఎస్ఎల్పీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో జనవరి 5న జరిగే ఎన్నికల్లో రాజపక్స ఎస్ఎల్పీపీ నుంచి బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. సిరిసేన ఉత్తర్వులను అమలు చేయొద్దు చట్ట సభ్యుల అధికారాలను హస్తగతం చేసుకున్న అధ్యక్షుడు సిరిసేన జారీ చేసే ఎలాంటి ఉత్తర్వులను కూడా అమలు చేయవద్దని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్య అధికార యంత్రాంగాన్ని కోరారు. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక పార్లమెంటును గడువు కన్నా 20 నెలల ముందుగానే పూర్తిగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు సిరిసేన శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే. తర్వాత పార్లమెంటును ఈ నెల 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెలలో సిరిసేన ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో శ్రీలంకలో జనవరి 5న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని రూపుమాపేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టిన సిరిసేన.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
బాధ్యతలు స్వీకరించిన రాజపక్స
కొలంబో: శ్రీలంకలో వెంటవెంటనే చోటుచేసుకుంటున్న పరిణామాల మధ్య మాజీ అధ్యక్షు డు మహింద రాజపక్స సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని సెక్ర టేరియట్‌లో జరిగిన కార్యక్రమంలో రాజపక్స ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సిరిసేన కేబినెట్లో మొత్తం 12 మంది మంత్రులతోపాటు సహాయ, డిప్యూటీ మంత్రు లు ప్రమాణం చేశారు. పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ ఆఫీసు వద్ద ఆదివా రం కాల్పుల్లో గాయపడిన మరొకరు సోమ వారం మరణించడంతో మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. దీనికి సంబంధించి మంత్రి రణతుంగను పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ సంక్షోభంలో లంక
పట్టుమని మూడేళ్లు కాకుండానే శ్రీలంక మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. ఈసారి సంక్షోభం పూర్తిగా అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సృష్టి. మరో ఏడాదిలోగా దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉండగా... దేశ రాజకీయ రంగంలో తాను ఏకాకిగా మారుతున్నానని గ్రహించిన సిరిసేన, ఉన్న ట్టుండి ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగించి ఆయన స్థానంలో మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సను ఆ పీఠం ఎక్కించారు. అంతేకాదు... ఆ దేశ పార్లమెంటును మూడు వారాలపాటు సస్పెండ్ చేశారు. తన మతిమాలిన చర్యకు పార్లమెంటులో ప్రతిఘటన రావొచ్చునన్న భయమే ఇందుకు కారణం. 225మంది సభ్యులున్న పార్లమెంటులో విక్రమసింఘే పార్టీకే అత్యధికంగా 106 మంది సభ్యుల మద్దతుంది. అటు సిరిసేన పార్టీ, ఇటు రాజపక్స పార్టీకి కలిసి 95కి మించి స్థానాలు లేవు. సిరిసేన ఒకప్పుడు రాజపక్సకు అత్యంత సన్నిహితుడు. 2015 జనవరిలో అధ్యక్ష ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు వరకూ రాజపక్స కేబినెట్లో ఆయన నంబర్ టూ. అప్పటికి దాదాపు పదేళ్లుగా ఆయనతో కలిసి అధికార భోగాలు అనుభవించారు. కానీ అధ్యక్ష ఎన్నికలు ప్రకటించాక విపక్ష శిబిరంలోకి లంఘించి అధ్యక్ష పదవికి పోటీచేసి విజయం సాధించారు. తమిళ టైగర్ల బూచిని చూపి దేశంలో నిరంకుశ పాలన చలాయించిన రాజపక్సపై ఎన్నో ఆరో పణలున్నాయి. ఆయన అవినీతి, బంధుప్రీతి సంగతలా ఉంచి తమిళ టైగర్లను అణిచే పేరిట ఆయన ప్రభుత్వం సాగించిన అకృత్యాలు అన్నీ ఇన్నీ కాదు. ఆయన సాగించినదంతా నరమేథమని, అందులో 40,000మంది అమాయక పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి కమిటీ అంచనా వేసింది. ఎందరో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరిగాయి. పసివాళ్లను సైతం నిర్దాక్షి ణ్యంగా హతమార్చారు. దాదాపు 65,000మంది తమిళులు ఆచూకీ లేకుండాపోయారు. తన విధా నాలను విమర్శించినవారిని జాతి వ్యతిరేకులుగా ముద్రేయడం, రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టి వారిని భయభ్రాంతులకు గురిచేయడం రాజపక్స ఒక కళగా అభివృద్ధి చేసుకున్నారు. ప్రభుత్వం లోని అన్ని వ్యవస్థల్లోనూ తన అనుచరులను చొప్పించి వాటిని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. వీటన్నిటి విషయంలో రాజపక్సపై వెల్లువెత్తుతున్న అసంతృప్తిని గమనించే అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు సిరిసేన విపక్ష శిబిరానికి ఫిరాయించారు. అధ్యక్ష పదవికి పోటీచేసి నెగ్గారు. కానీ ఆ సందర్భంగా ఆయన చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. రాజపక్స సాగించిన నియంతృత్వానికి అధ్యక్షుడికుండే అపరిమిత అధికారాలే మూల కారణమని, వాటిని రద్దు చేసి అధ్యక్ష తరహా పాల నకు స్వస్తి పలుకుతానని ఆయన హామీ ఇచ్చారు. ఇందుకు తగినట్టు రాజ్యాంగానికి 19వ సవర ణను తీసుకొచ్చారు. దాని ప్రకారం పార్లమెంటు అనుమతి లేకుండా ప్రధానిని తొలగించకూడదు. అలాగే ప్రధానితో సంప్రదించాకే కేబినెట్ మంత్రులుగా ఎవరినైనా నియమించాలి. పార్లమెంటును రద్దు చేయడానికుండే అధికారాలను కత్తిరించడం, రాజ్యాంగమండలి అనుమతి లేకుండా ఉన్నతా ధికారుల నియామకం చేయకూడదనటం వంటివి అందులో ఉన్నాయి. అధ్యక్షుడి పదవీకాలాన్ని ఆరేళ్ల నుంచి అయిదేళ్లకు మార్చారు. పర్యవసానంగా ఆయనకు కొన్ని అంశాల్లో భంగపాటు తప్ప లేదు. ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి పంపిన సిఫార్సులను రాజ్యాంగమండలి తోసిపుచ్చడం ఆయనకు ఆగ్రహం కలిగించింది. దానికితోడు జనతా విముక్తి పెరుమున(జేవీపీ) పార్లమెంటులో ప్రవేశపెట్టిన 20వ సవరణ ముసాయిదా అధ్యక్ష అధికారాలకు మరింత కోత పెడుతోంది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల ద్వారా కాక, రహస్య బ్యాలెట్ విధానంలో పార్లమెంటు సభ్యులు దేశాధ్యక్షుణ్ణి ఎన్నుకోవాలన్న నియమం ఉంది. అలాగే అధ్యక్షుడిని అభిశంసించే విశేషాధికారాన్ని ఈ సవరణ బిల్లు పార్లమెంటుకు ఇస్తోంది. నిజానికి ఈ ముసాయిదా సవరణలోని నిబంధనలేవీ సిరిసేన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధం కాదు. ఇప్పటికే కొన్ని అధికారాలను వదులుకోవాల్సి వచ్చిందని చింతిస్తున్న సిరిసేకు ఈ పరిణామం నచ్చలేదు. ఒకపక్క విక్రమసింఘేతో ఉన్న విభేదాలు రోజురోజుకూ ముదరడం, మరోపక్క తన అను చరులైన ఎంపీల్లో చాలామంది రాజపక్సకు అనుకూలురుగా ఉండటం ఆయన్ను కలచివేస్తోంది. అధికారంలో ఉండగా అధ్యక్ష స్థానాన్ని అపరిమిత అధికారాలతో పటిష్టం చేసుకోవడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అధికారాలకు కోత వేయాలనడం శ్రీలంకలో దశాబ్దాలుగా సాగుతున్న నాటకమే. సిరిసేన కూడా దాన్నే కొనసాగించారు. వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల సమయానికి బలపడకపోతే రాజకీయంగా కనుమరుగవుతానని ఆయన ఆందోళన పడుతున్నారు. అటు రాజపక్స సైతం ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకుని 2020లో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. అందుకే 2015లో తనపై తిరగబడి ప్రత్యర్థులతో చేతులు కలిపిన సిరిసేన ఊహించని రీతిలో అందించిన స్నేహహస్తాన్ని ఆయన అందుకున్నారు. రాజపక్స చైనాకు సన్నిహితుడు. ఆయన హయాంలోనే మన దేశంతో శ్రీలంక సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అక్కడ చైనా ప్రాబల్యం పెరిగింది. ఆయన మళ్లీ అధికారంలోకి రావడం సహజంగానే చైనాకు మేలు చేస్తుంది. నిర్మాణంలో ఉన్న మన ప్రాజెక్టులకు ఇబ్బందులేర్పడతాయి. పదవీ చ్యుతుడైన విక్రమసింఘే భారత్‌కు సన్నిహితుడన్న పేరుంది. ఇప్పటికే మన పొరుగునున్న మాల్దీ వుల్లో అనిశ్చితి అలుముకుని ఉంది. అక్కడి ఎన్నికల్లో విజయం సాధించిన విపక్ష కూటమి అభ్యర్థి మహ్మద్ సోలిహ్‌కు ప్రస్తుత అధ్యక్షుడు యామీన్ అధికార పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్న సందేహాలున్నాయి. కనుక శ్రీలంక పరిణామాలపై మన దేశం ఆచితూచి అడుగేయాలి. పెద్దన్న పాత్ర పోషిస్తున్నదన్న నింద పడకుండా మన ప్రయోజనాల పరిరక్షణ విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. -
చచ్చామనుకున్నాం : శ్రీలంక మాజీ క్రికెటర్
కొలంబో: ‘ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది దైర్యసాహసాలే కారణం. రాజపక్స అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు’అని ఆదివారం కొలంబోలో చోటుచేసుకున్న కాల్పుల ఘటననంతరం శ్రీలంకకు ప్రపంచకప్ అందించిన అర్జున రణతుంగ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రధాని పదవి నుంచి రణిల్ విక్రమసింఘేను తొలగించి మహింద రాజపక్సను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నేలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పెట్రోలియం శాఖ మంత్రి అయిన అర్జున రణతుంగ హుటాహుటిన లండన్ నుంచి లంకకు చేరుకున్నారు. ఆదివారం కొలంబోలోని తన కార్యాలయానికి వెళ్లడానికి ప్రయత్నించగా.. రణతుంగను అడ్డుకోవడంతో పాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాలు కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, హెల్మెట్‌తో అర్జున రణతుంగను రక్షించారు. రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటననంతరం రణతుంగ రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు భవిష్యత్తు కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు. గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: విక్రమ సింఘేనే ప్రధాని శ్రీలంక పార్లమెంటు రద్దు -
విక్రమ సింఘేనే ప్రధాని
కొలంబో: శ్రీలంక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రణిల్ విక్రమ సింఘేనే దేశ ప్రధానిగా గుర్తిస్తున్నట్లు పార్లమెంట్ స్పీకర్ జయసూర్య ప్రకటించారు. విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించడంతోపాటు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం తీవ్ర అనూహ్య విపరిణామాలకు దారి తీస్తుందన్నారు. రాజపక్స నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. రాజపక్స అధికార పగ్గాలు చేబడితే పౌరులు, హక్కుల సంస్థలపై తిరిగి వేధింపులు మొదలవుతాయని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని విక్రమసింఘేను తొలగించి రాజపక్సను నియమించడంతోపాటు, పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ జయసూర్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిరిసేనకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంట్ సస్పెన్షన్ దేశంలో తీవ్ర, అనూహ్య విపరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. స్పీకర్‌తో చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఆదేశాలిచ్చే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఆయన అహంకారి..అందుకే..: సిరిసేన రణిల్ విక్రమసింఘే అహంకార పూరిత మనస్తత్వమే ఆయన్ను అధికారం నుంచి తొలగించేందుకు కారణమైందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. రాజ్యాంగ బద్ధంగానే రాజపక్స కొత్త ప్రధానిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. విక్రమసింఘేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదివారం ఆయన మొదటిసారిగా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దేశ భవిష్యత్తును, సామాన్యుడిని గురించి పట్టించుకోని తన అనుచరులకు ఆయన అధికారాన్ని అప్పగించారు. ఆయన అహంభావి. ఉమ్మడి బాధ్యతలను పరిహాసం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. నాపై హత్యాయత్నం చేయించారు. మా మధ్య ఉన్న సాంస్కృతిక, విధానపరమైన విభేదాలే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి కారణం’ అని పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికలు జరపాలి: రాజపక్స దేశ ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు తక్షణం పార్లమెంట్ ఎన్నికలు జరపాలని నూతన ప్రధాని రాజపక్స డిమాండ్ చేశారు. రాజపక్సకు జిన్‌పింగ్ అభినందనలు శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే కొత్త ప్రధాని రాజపక్సేకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. చైనా రాయబారి చెంగ్ ఆదివారం తనను కలిసి జిన్‌పింగ్ తరఫున అభినందనలు తెలిపారని రాజపక్స ట్విట్టర్లో పేర్కొన్నారు. సంప్రదాయంగా శ్రీలంక విదేశాంగ విధానం భారత్, జపాన్‌లకు అనుకూలంగా చైనాకు దూరంగా ఉంటుంది. అయితే, రాజపక్స ప్రభుత్వం చైనాకు దగ్గరైంది. ఫలితంగా శ్రీలంకలో చైనా వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. రాజధానిలో కాల్పులు అధికార సంక్షోభం నేపథ్యంలో ఆదివారం కొలంబోలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్, పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగను అడ్డుకోవడంతోపాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ముదురుతోంది. రణిల్ విక్రమసింఘేను శుక్రవారం ప్రధాని పదవి నుంచి దించేసిన ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, శనివారం శ్రీలంక పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేశారు. బలనిరూపణ కోసం అత్యవసరంగా పార్లమెంటును ఆదివారం సమావేశపరచాలని రణిల్ విక్రమసింఘే పార్లమెంటు స్పీకర్‌ను శనివారం కోరగా, అందుకు అవకాశం లేకుండా సిరిసేన నవంబరు 16 వరకు పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటులో జరిగే బలపరీక్షలో విక్రమసింఘేను ఓడించాలనే లక్ష్యంతోనే అధ్యక్షుడు ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారం నవంబరు 5న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. పార్లమెంటును సమావేశపరచాలని విక్రమసింఘే కోరడంతోనే సిరిసేన సమావేశాల ప్రారంభ తేదీని మరో 10 రోజులు వెనక్కు జరిపి, అప్పటివరకు సభను రద్దు చేశారు. శ్రీలంక పార్లమెంటులోని మొత్తం స్థానాల సంఖ్య 225 కాగా, బలనిరూపణలో నెగ్గేందుకు కనీసం 113 మంది సభ్యుల మద్దతు అవసరం. సిరిసేన, కొత్త ప్రధాని మహిందా రాజపక్స పార్టీలు రెండూ కలిసినా వారి బలం 95 మాత్రమే. అటు విక్రమసింఘేకు చెందిన యూఎన్‌పీ (యునైటెడ్ నేషనల్ పార్టీ)కి సొంతంగానే 106 మంది సభ్యులున్నారు. మరికొన్ని చిన్నపార్టీల మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలో నవంబరు 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభిస్తే విక్రమసింఘే సులభంగా బలపరీక్షలో నెగ్గి మళ్లీ అధికారంలోకి వస్తారని సిరిసేన భావించినందునే సమావేశాలను మరో 10 రోజులపాటు వాయిదా వేశారని సమాచారం. ఆలోపు సిరిసేన, రాజపక్సలు మరికొంత మంది సభ్యులను తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనీ, అందుకే సమావేశాల ప్రారంభ తేదీని నవంబరు 16కు మార్చారని తెలుస్తోంది. అయితే కొత్తగా ప్రధాని మారినందున రాజపక్స వార్షిక బడ్జెట్‌ను కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారనీ, ఆ బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది కాబట్టే పార్లమెంటు సమావేశాలు పదిరోజులు ఆలస్యంగా ప్రారంభమవుతాయనేది రాజపక్స పార్టీ నేతల వాదన. సిరిసేన, విక్రమసింఘేల పార్టీలు సంయుక్తంగా మూడేళ్ల క్రితం అధికారం చేపట్టగా, విభేదాల నేపథ్యంలో తాజాగా సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. విక్రమసింఘేను పదవి నుంచి తప్పించిన సిరిసేన, మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్స చేత కొత్త ప్రధానిగా ప్రమాణంచేయించడం తెలిసిందే. కావాలనే సిరిసేన దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభం సృష్టిస్తున్నారనీ, పార్లమెంటును సమావేశపరిస్తే ఆ వెంటనే ఈ సంక్షోభం సమసిపోతుందని విక్రమసింఘే అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రాజపక్స, సిరిసేనల పార్టీలు కలిసి విక్రమసింఘేపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, అప్పటి బలనిరూపణలోనూ విక్రమసింఘే గెలిచారు. రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి.. శ్రీలంకలోని పార్టీలు ఆ దేశ రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలనీ, అనవసరంగా హింస, అనిశ్చితిని రేకెత్తించవద్దని పలు దేశాలు కోరాయి. ‘హింసకు దిగకుండా రాజ్యాంగం ప్రకారం నడచుకోవాలని శ్రీలంకలోని పార్టీలను మేం కోరుతున్నాం’ అని అమెరికా విదేశాంగ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యూరోపియన్ కూటమి రాయబారితోపాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, రొమేనియా, యూకేల రాయబారులు కూడా శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. అన్ని పార్టీలూ రాజ్యాంగాన్ని అనుసరించాలి తప్ప హింసను ప్రేరేపించవద్దు’ అని యూరోపియన్ కూటమి ఓ ప్రకటనలో పేర్కొంది. శ్రీలంకలోని బ్రిటిష్ హై కమిషన్ శుక్రవారం ఇలాంటి ఓ ప్రకటన చేసింది. భారత్‌కు ఆందోళనకరమే రాజపక్స శ్రీలంక నూతన ప్రధానమంత్రి గా బాధ్యతలు స్వీకరించడం పొరుగున ఉన్న భారతదేశానికి ఆందోళనకరమేనని చెప్పాలి. చైనా అనుకూలుడిగా పేరు సంపాదించిన ∙రాజపక్స గతంలో అధ్యక్షుడిగా ఉండగా చైనాతో రాసుకుపూసుకు తిరగడం, శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టును చైనాకు దీర్ఘకాలం లీజుకివ్వడం, చైనా ప్రాజెక్టులను అనుమతించడం, చైనా జలాంతర్గాములను తమ సముద్ర జలాల్లో నిలపడానికి అనుమతించడం వంటివి భారత్‌కు కలవరం కలిగించాయి. రాజపక్స తిరిగి అధికారంలోకి వస్తారని భారత్ ఊహిస్తూనే ఉంది. రాజపక్స పునరాగమనంతో శ్రీలంకపై చైనా తన పట్టును మరింత బిగిస్తుందనీ, అది తన భద్రతకు ముప్పుగా మారడమేకాక దక్షిణాసియాలో తన పలుకుబడిని దెబ్బ తీస్తుందని భారత్ ఆందోళన చెందుతోంది. ఆకస్మిక నిర్ణయానికి 3 కారణాలు రాజ్యాంగ విరుద్ధమంటున్న రాజకీయ నిపుణులు శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమసింఘేను తొలగించి, మహిందా రాజపక్సను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విక్రమసింఘే ఢిల్లీలో చేసిన ప్రకటన. గతనెల 20న విక్రమసింఘే ఢిల్లీ వచ్చి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఓ ప్రకటన విడుదల చేస్తూ సిరిసేనపై ఆరోపణలు గుప్పించారు. శ్రీలంకలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి సిరిసేననే కారణమని ఆ ప్రకటనలో చెప్పారు. ఇక రెండవ కారణం కోర్టుల్లో నియామకాల కోసం సిరిసేన పంపిన సిఫారసులను విక్రమసింఘే తిరస్కరించడం. శ్రీలంక సుప్రీంకోర్టు, అప్పీల్ కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం ఇద్దరి పేర్లను సిరిసేన సూచించగా, దేశ రాజ్యాంగ మండలి తిరస్కరించింది. దీంతో సిరిసేన ఆగ్రహానికి గురయ్యారు. ఇక మూడో కారణం అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నాన్ని పోలీసులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించకపోవడం. సిరిసేన దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక గతంలో ఓ సారి ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని శుక్రవారమే పోలీసులు ప్రకటించారు. దీంతో తనపై హత్యాయత్నం కేసును పోలీసులు తేలిగ్గా తీసుకున్నారనీ, దీని వెనుక విక్రమసింఘే ఉన్నారని సిరిసేన భావించారు. ప్రధానంగా ఈ మూడు కారణాలతోనే సిరిసేన పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి, రాజపక్సతో చేతులు కలిపి ఆయనను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది. 2015లో సిరిసేన నాయకత్వంలోని శ్రీలంక ఫ్రీడం పార్టీ, విక్రమసింఘే అధ్యక్షుడిగా ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీలు కలిసి శ్రీలంకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, కొంతకాలంగా వివిధ అంశాల్లో వీరిరువురి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతోపాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల్లో రాజపక్స నేతృత్వంలోని పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలను మూడేళ్ల ప్రభుత్వ పాలనపై ప్రజా తీర్పులా చూశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు, నాయకుల మధ్య విభేదాలు మరింత ఎక్కువై చివరకు ప్రధానిని మార్చే పరిస్థితికి దారితీసింది. అయితే ప్రధానిని మారుస్తూ సిరిసేన తీసుకున్న నిర్ణయం మాత్రం కచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమేనని నిపుణులు పేర్కొంటున్నారు. -
లంక ప్రధానిగా రాజపక్స
కొలంబో: శ్రీలంక రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా విభేదాలతో నెట్టుకొస్తున్న సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీలు విడిపోయాయి. ప్రధాని రణిల్ విక్రమసింఘేను తొలగించిన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన.. మాజీ అధ్యక్షుడు మహిందా రాజపక్సకు ఆ పదవి కట్టబెట్టారు. రాజపక్స చేత సిరిసేన ప్రమాణం చేయిస్తున్న దృశ్యాలు శుక్రవారం మీడియాలో ప్రసారమయ్యాయి. విక్రమసింఘేకు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు సిరిసేన పార్టీ యునైటెడ్ పీపుల్స్ ఫ్రీడమ్ అలియన్జ్(యూపీఎఫ్ఏ) ప్రకటించిన వెంటనే తాజా రాజకీయ డ్రామా మొదలైంది. విక్రమసింఘే పార్టీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సిరిసేన పార్టీ పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చింది. తాజా పరిణామంపై పదవీచ్యుత ప్రధాని విక్రమసింఘే స్పందిస్తూ.. రాజపక్సను ప్రధానిగా నియమించడం చట్టవిరుద్ధమని, తానే ప్రధానిగా కొనసాగుతానని అన్నారు. పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మూడేళ్ల ‘మైత్రి’కి తెర: అవినీతి, ఆర్థిక అవకతవకలపై ఐకమత్యంతో పోరాడుతామంటూ మూడేళ్ల క్రితం మైత్రిపాల సిరిసేన, విక్రమ సింఘే పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. అనంతరం అధికార కూటమికి రెఫరెండంగా భావించిన ఫిబ్రవరిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజపక్స స్థాపించిన కొత్త పార్టీ సంచలన విజయం సాధించడంతో ఈ రెండు పార్టీల మధ్య లుకలుకలు మొదలయ్యాయి. రక్షణ శాఖ మాజీ కార్యదర్శితో పాటు తనని హత్య చేయడానికి పన్నిన కుట్రను విక్రమసింఘే పార్టీ సీరియస్‌గా తీసుకోకపోవడంపై సిరిసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రతరమయ్యాయి. ప్రస్తుతం రాజపక్స–సిరిసేన పార్టీలకు పార్లమెంట్లో ఉమ్మడిగా కేవలం 95 సీట్లే ఉన్నాయి. సాధారణ మెజారిటీ సాధించాలంటే ఈ కూటమికి మరో 18 స్థానాలు అవసరం. -
మాజీ అధ్యక్షుడి సోదరుడు అరెస్టు
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ భూవివాదానికి సంబంధించి ఆయన సోదరుడు బాసి రాజపక్సను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు ఈయన ఆర్థిక వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేశారు. శ్రీలంకలోని ఫైనాన్సియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(ఎఫ్సీఐడీ) అధికారులు మతారా పట్టణంలో అరెస్టు చేశారు. రేపు అతడిని కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. గత ఏడాది కూడా ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడన్న ఆరోపణల కిందట ఒకసారి అరెస్టయ్యాడు. -
రాజపక్సకు తొలగిన అడ్డంకులు..
కొలంబో: శ్రీలంకలో రాజకీయాలలో ఆశ్చర్యకర పరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి. దేశ ప్రధాని పదవికి పోటీ పడేందుకు మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో మైత్రిపాల సిరిసేన చేతిలో రాజపక్స ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత సిరిసేన పార్టీ సంకీర్ణకూటమిలోనే రాజపక్స పార్టీ కొనసాగుతోంది. ఇప్పటివరకు రాజపక్స అభ్యర్థిత్వాన్ని ఖండిస్తూ వచ్చిన అధ్యక్షుడు సిరిసేన గత రాత్రి మనసు మార్చుకున్నారు. ఆగస్టు 17 న శ్రీలంకలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. యూపీఎఫ్ఏ కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా రాజపక్స బరిలో ఉండనున్నారు. -
మీ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చా!
జాఫ్నాలో తమిళులను ఉద్దేశించి మోదీ వ్యాఖ్య పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని స్పష్టీకరణ తమిళ నిరాశ్రయులకు 27 వేల కొత్త ఇళ్ల అందజేత జాఫ్నా/కొలంబో: దశాబ్దాల అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడి, తమిళుల హక్కుల కోసం నినదించిన జాఫ్నా గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. శ్రీలంకలో చివరిరోజు పర్యటనలో భాగంగా శనివారం ఆయన తమిళుల ప్రాబల్య ప్రాంతమైన జాఫ్నాను సందర్శించారు. పౌరులందరికీ సమాన హక్కులు దక్కాలని, అందరూ ఆత్మగౌరవంతో జీవించాలంటూ పరోక్షంగా తమిళుల ఆకాంక్షను చాటారు. సంక్షుభిత ప్రాంతంలో ఇన్నేళ్లూ కష్టనష్టాల పాలైన వారి కన్నీళ్లు తుడిచేందుకు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీనే. 2013లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ జాఫ్నాలో పర్యటించారు. ఆ తర్వాత ఓ అంతర్జాతీయ నేత ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఇలావలైలో తమిళులకు 27 వేల కొత్త ఇళ్లను అందజేశారు. మంగళ హారతులు, మేళతాళాల మధ్య సంప్రదాయ రీతిలో మహిళలు ఆయనకు స్వాగతం పలికారు. గృహ ప్రవేశంలో భాగంగా పాలు పొంగించే కార్యక్రమంలో మోదీ స్వయంగా పాల్గొన్నారు. రెండో దశలో మరో 47 వేల గృహాలు నిర్మిస్తామన్నారు. జాఫ్నాలో రూ.60 కోట్లతో భారత్ నిర్మిస్తున్న సాంస్కృతిక కేంద్రానికీ మోదీ శంకుస్థాపన చేశారు. ‘పర్యటన షెడ్యూల్లో లేకపోయినా ఈ నేలకు వందనం చేసేందుకే ఇక్కడకు వచ్చాను. ప్రజలు అనేక కష్టాలు పడ్డారు. ప్రజలందరూ సమానత్వం, న్యాయం, శాంతి, గౌరవంతో జీవించాలి. అందుకు దోహదపడేలా శ్రీలంక రాజ్యాంగానికి 13వ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. నేను సహకార సమాఖ్య వ్యవస్థను నమ్ముతాను’ అని అన్నారు. మోదీ వెంట జాఫ్నా సీఎం, తమిళ నేత సీవీ విఘ్నేశ్వరన్ ఉన్నారు. భారత్‌కు సమీప ప్రాంతమైన జాఫ్నాలోని తలైమన్నార్‌లో రైలు సర్వీసును మోదీ ప్రారంభించారు. మహాబోధి వృక్షానికి పూజలు.. జాఫ్నాకు బయల్దేరే ముందు మోదీ.. ప్రాచీనకాలంలో లంక రాజధాని అయిన అనురాధాపుర పట్టణానికి వెళ్లి మహాబోధి వృక్షం వద్ద పూజలు చేశారు. లంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన కలిసి ఈ మహాబోధి వృక్షాన్ని సందర్శించిన మోదీ.. అక్కడ అరంగటపాటు గడిపారు. అనంతరం నాగులేశ్వరం ఆలయాన్ని కూడా మోదీ సందర్శించారు. రాజపక్సతో భేటీ.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్సతో.. మోదీ కొలంబోలోని భారత హైకమిషన్ ఆఫీసులో భేటీ అయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమి వెనుక భారత్, అమెరికా, యూరప్ దేశాల హస్తం ఉందని ఇటీవల రాజపక్స ఆరోపించడం తెలిసిందే. ప్రధాని గౌరవార్థం భారత హైకమిషన్ ఇచ్చిన విందులోనూ మోదీ పాల్గొని అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. రెండ్రోజుల లంక పర్యటన ముగించుకొన్న మోదీ శనివారం రాత్రి భారత్ బయల్దేరారు. లంక ప్రధాని విక్రమసింఘే కొలంబో విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. 5 రోజుల పర్యటనలో ప్రధాని సీషెల్స్, మారిషస్, లంకలో పర్యటించారు. -
ఎలాంటి కుట్ర చేయలేదు: రాజపక్స
కొలంబో: తన అధికారాన్ని కొనసాగించడం కోసం ఇటీవలి ఎన్నికల్లో ఓటమి అనంతరం కుట్రకు పాల్పడ్డాననేది అవాస్తవమని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స పేర్కొన్నారు. ఈ విషయంలో ఆ దేశ కొత్త ప్రభుత్వం చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఎన్నికల్లో ఓడిపోయిన రాజపక్స తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం కుట్ర చేశారని శ్రీలంక కొత్త ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం రాజపక్స మాట్లాడుతూ ‘‘గత వారం వెల్లడైన ఎన్నికల ఫలితాలను నేను స్వాగతించాను. అయినా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు’’ అని చెప్పారు. -
ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు..
కొలంబో: రైతు నేస్తం.. గ్రామీణ శ్రీలంకకు ప్రతీక.. ఇంగ్లీష్‌లో మాట్లాడని సామాన్యుడు. ఎప్పుడూ సంప్రదాయ దుస్తులనే ధరించే జాతీయ వాది. దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్కరణలకు గట్టి మద్దతుదారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మైత్రిపాల సిరిసేన వ్యక్తిత్వాన్ని వివరించేందుకు ఈ పదాలు చాలు. శ్రీలంక ఉత్తర మధ్య రాష్ట్రానికి చెందిన మధ్యతరగతి కుటుంబంలో 1951లో మైత్రిపాల సిరిసేన జన్మించారు. 20 ఏళ్ల వయసులోనే అంటే 1971లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలపై రెండేళ్లు జైలుశిక్ష అనుభవించారు. 1989లో శ్రీలంక ఫ్రీడం పార్టీలో చేరి క్రియాశీల రాజకీయాల్లో అడుగు పెట్టిన సిరిసేన అదే ఏడాది ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి వరుసగా 1994, 2000, 2001 ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. పలు ప్రభుత్వాల్లో ఆరోగ్యశాఖ, రక్షణశాఖలకు మంత్రిగా పనిచేశారు. ఆయనను హతమార్చేందుకు ఎల్టీటీఈ ఐదుసార్లు విఫలయత్నం చేసింది. 2008లో ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పటివరకు రెండుసార్లు వరుసగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన మహీంద రాజపక్సకు సిరిసేన మంత్రివర్గ సహచరుడు. అయితే ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో రాజపక్స నుంచి విడిపోయిన సిరిసేన ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. మొదట్లో సిరిసేనను రాజపక్సకు బలమైన ప్రత్యర్థిగా ఎవరూ భావించలేదు. రైతు నేపథ్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సిరిసేనకు లభించిన భారీ మద్దతు, పట్టణాల్లో ప్రధాన ప్రతిపక్షం యునెటైడ్ నేషనల్ పార్టీకున్న పట్టు, రాజపక్సపై అవినీతి ఆరోపణలు, ఆయన కుటుంబ పాలనపై వ్యతిరేకత ఇవన్నీ కలసివచ్చి ఎన్నికల్లో సిరిసేనను విజయ పథంలో నిలిపాయి. మరోవైపు, సిరిసేనకే మద్దతివ్వాలంటూ మాజీ అధ్యక్షురాలు చంద్రిక కుమారతుంగ కూడా తన మద్దతుదారులకు పిలుపునివ్వడం, అలాగే బౌద్ధుల్లో ప్రజాదరణ ఉన్న బుద్ధిస్ట్ నేషనలిస్ట్ హెరిటేజ్ పార్టీ కూడా మద్దతివ్వడం ఆయనకు కలిసొచ్చింది. -
ఒకవైపు సైన్యం...మరోవైపు పులులు
-
శ్రీలంక అధ్యక్షుడిగా సిరిసేన
►51.2% ఓట్లతో గెలిచిన ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి ► మూడోసారి పగ్గాలు చేపట్టాలనుకున్న రాజపక్సకు షాక్ ► అధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన, ప్రధానిగా విక్రమసింఘే ప్రమాణం ► శుక్రవారం ఉదయమే అధ్యక్షభవనం వీడిన రాజపక్స కొలంబో: వరుసగా మూడోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించాలనుకున్న మహీంద రాజపక్సకు శ్రీలంక ఓటర్లు షాకిచ్చారు. రాజపక్స స్థానంలో ఒకప్పటి ఆయన మంత్రివర్గ సహచరుడు, ఐక్య ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మైత్రిపాల సిరిసేన(63)కు అధ్యక్ష పట్టం కట్టబెట్టి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. 19 మంది పోటీ పడిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. రాజపక్స 47.6 శాతంతో 57,68,090 ఓట్లు సాధించగా, సిరిసేన 51.2శాతంతో 62,17,162 ఓట్లు గెలుచుకుని శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 1.54 కోట్ల ఓటర్లలో దాదాపు 75% మందికి పైగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళులు, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సిరిసేనకు అత్యధిక ఓట్లు లభించాయి. శ్రీలంక ఆరవ దేశాధ్యక్షుడిగా మైత్రిపాల సిరిసేన ఎన్నికయ్యారని ఎన్నికల కమిషనర్ మహీంద దేశప్రియ ప్రకటించారు. అయితే, అంతకుముందే ఓటమిని అంగీకరించిన రాజపక్స అధ్యక్ష భవనం ‘టెంపుల్ ట్రీస్’ను వదలివెళ్లారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా జరిపించినందుకు విజయానంతరం సిరిసేన రాజపక్సకు కృతజ్ఞతలు తెలిపారు.ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే సిరిసేన దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా రణిల్ విక్రమసింఘే కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విక్రమసింఘే అధ్యక్ష ఎన్నికల్లో సిరిసేనకు మద్దతిచ్చిన ప్రతిపక్ష యునెడైట్ నేషనల్ పార్టీ నేత. కొలంబోలోని ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద వీరిద్దరితో సుప్రీంకోర్టు న్యాయమూర్తి కే శ్రీపవన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సిరిసేన, విక్రమసింఘేలు.. తమకు మద్దతిస్తున్న పార్టీలతో కలిసి గురువారం విశాల సంకీర్ణ కూటమి ‘న్యూ డెమొక్రటిక్ ఫ్రంట్’ను ఏర్పాటు చేశారు. అధికార మార్పిడి నిరాటంకంగా జరిగేందుకు సహకరిస్తానని శుక్రవారం ఉదయం తాను కలిసినప్పుడు రాజపక్స హామీ ఇచ్చారని విక్రమసింఘే వెల్లడించారు. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలకు కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, అప్పుడు తాను చెప్పిన మార్పును తీసుకువస్తానన్నారు. మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడబోనని స్పష్టం చేశారు. కాగా, తమిళ అతివాదులతో మెత్తగా వ్యవహరించడం కానీ, ఉత్తర శ్రీలంక నుంచి ఆర్మీని తొలగించడం కానీ చేయబోనని ఎన్నికల ప్రచారం సమయంలోనే సిరిసేన స్పష్టం చేశారు. దీన్నిబట్టి సిరిసేన పాలన రాజపక్స పాలన కన్నా భిన్నంగా ఉండబోదని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళులకు విలన్ రాజపక్స.. కొద్ది వారాల క్రితం వరకు రాజపక్స ఓటమి అసాధ్యమన్న భావన ఉండేది. తమిళ వేర్పాటువాద సంస్థ ఎల్టీటీఈని శ్రీలంకలో తుదముట్టించడం వల్ల దేశంలోని మెజారిటీ సింహళీయుల్లో ఆయనపై అభిమానం భారీగా పెరిగి, ‘కింగ్’ అనే బిరుదు లభించినా.. మైనారిటీ తమిళుల్లో మాత్రం ఆయన భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. 2009లో ఎల్టీటీఈతో పోరు సందర్భంగా పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడడం, తమిళులకు మరిన్ని అధికారాలిచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేస్తానన్న హామీని అమలు చేయకపోవడం.. రాజపక్స పట్ల తమిళుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అలాగే, రాజపక్స పాలనలో అవినీతి, కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ ధోరణి ముప్పిరిగొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కూడా ఈ ఫలితాల్లో ప్రతిఫలించింది. తన సోదరులు గొతాభయను రక్షణ మంత్రిగా, బాసిల్‌ను ఆర్థిక మంత్రిగా, మరికొందరు సన్నిహిత బంధువులను ప్రభుత్వంలోని కీలక పదవుల్లో నియమించడంపై కూడా రాజపక్సపై విమర్శలు వచ్చాయి. మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవాలన్న లక్ష్యంతో రాజపక్స రాజ్యాంగాన్ని సవరించి మరీ ఎన్నికలను రెండేళ్లు ముందుకు జరిపారు. ఎన్నికల ప్రకటన వెలువడినరోజే సిరిసేన 26 మంది అధికార సంకీర్ణ ఎంపీలతో కలసి రాజపక్స పాలనపై తిరుగుబాటు చేశారు. అధికార శ్రీలంక ఫ్రీడం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం ప్రతిపక్ష కూటమి మద్దతుతో అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. తిరుగుబాటుకు ముందురోజే రాజపక్సతో కలసి ఆయన డిన్నర్ చేయడం విశేషం. -
లంకలో ఎన్నికల సందడి
ప్రజాస్వామ్యంలో నిర్ణీత కాలవ్యవధిలో జరిగే ఎన్నికలు పాలకులకు పెద్ద శిరోభారం. వెనకా ముందూ చూడకుండా చేసిన వాగ్దానాలు, సృష్టించిన భయాలు పాలించడానికొచ్చేసరికి శాపాలై వెంటాడతాయి. ‘మా సంగతేమిట’ని నిలదీస్తాయి. పాలకులకు అప్పుడిక దిక్కుతోచదు. ఏం చేయాలో అంతుబట్టదు. ఆశలు, ఆకర్షణలు అడుగంటుతున్న అలాంటి సందిగ్ధ సమయంలో అర్థాంతరంగానైనా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే సబబని తోస్తుంది. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స అలాంటి పరిస్థితుల్లోనే దాదాపు రెండేళ్ల ముందుగా ఎన్నికలకు వెళ్తున్నారు. వచ్చేవారం జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు. 2005లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టిన రాజపక్స లంక తమిళుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న లిబరేషన్ టైగర్లపై యుద్ధం ప్రకటించి దాన్ని తుదముట్టించేందుకు ఉత్తర, తూర్పు ప్రాంతంలో సైన్యాన్ని మోహరించారు. ఉగ్రవాదంపై పోరాటమంటూ సాగిన ఆ యుద్ధంలో వేలాదిమంది సామాన్య పౌరులు మరణించారు. లక్షలమంది ప్రాణభయంతో వలసలుపోయారు. చివరకు టైగర్ల నాయకుడు ప్రభాకరన్, మరికొందరు కీలక నేతలు హతం కావడంతో ఆ యుద్ధం ముగిసింది. యుద్ధం పేరిట సాగించిందంతా నరమేథమని, అందులో 40,000మంది అమాయక పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ అంచనా వేసింది. ఇవిగాక తమిళ టైగర్లకు చెందిన మహిళా కార్యకర్తలపై లైంగిక నేరాలు, పసివాళ్లను సైతం నిర్దాక్షిణ్యంగా హతమార్చడం వంటి ఉదంతాలు ఎన్నో చోటుచేసుకున్నాయని చెప్పింది. ఆ ఘటనలపై అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలన్న వినతిని రాజపక్స బేఖాతరుచేశారు. సైనిక చర్య సింహళుల్లో, బౌద్ధుల్లో తీసుకొచ్చిన అనుకూల వాతావరణాన్ని ఆసరాగా చేసుకుని గడువుకన్నా ఏడాదికి ముందే 2010లో రాజపక్స ఎన్నికలకు వెళ్లారు. సహజంగానే అందులో ఘనవిజయం సాధించారు. ఆ తర్వాతే తన అసలు రూపాన్ని ప్రదర్శించారు. తన విధానాలను విమర్శించేవారిని జాతి వ్యతిరేకులుగా చిత్రించడం, ప్రత్యర్థులపై నిఘా పెట్టి వారిని భయోత్పాతానికి గురిచేయడం, ప్రభుత్వానికి చెందిన వ్యవస్థలన్నిటా తనకు నమ్మిన బంట్లుగా ఉన్నవారిని నియమించి నియంత్రణలోనికి తెచ్చుకోవడం రాజపక్స అనుసరించిన విధానం. ప్రజాస్వామ్య విరుద్ధమైన ఇలాంటి పోకడలు దేశ ప్రజల్లో ఆయనంటే వ్యతిరేకతను పెంచాయి. కీలక పదవుల్లో రాజపక్స తన బంధుగణాన్ని నియమించుకున్నారు. ఈ ఏడాది దేశ బడ్జెట్ వ్యయంలో ఆ బంధుగణం చూసే శాఖల వాటా 47 శాతం. వాస్తవానికి ఇది చాలా తక్కువ. రెండేళ్లక్రితమైతే ఇది 70 శాతం! సహజంగానే ఈ పోకడ అవినీతికి దారితీసింది. కాంట్రాక్టులు అనర్హులకు దక్కుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆర్థిక పరిస్థితి చూడబోతే దివ్యంగా ఉంది. ఈ ఏడాది ఆ దేశం నమోదుచేసిన స్థూల దేశీయ ఉత్పాదకత(జీడీపీ) 8 శాతం. 2010-14 మధ్య చైనా మినహాయిస్తే ఏ ఆసియా దేశంలోనూ జీడీపీ దీని దరిదాపుల్లో లేదు. స్టాక్ మార్కెట్లు సరేసరి...కళ కళలాడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా గణనీయంగానే పెరిగాయి. ఇవన్నీ సాధారణ పౌరుల జీవితాల్లో ప్రతిఫలించి ఉంటే రాజపక్స కథ వేరుగా ఉండేది. ఆయనకు జనం హారతులు పట్టేవారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అంత బాగాలేవు. చైనా సాయంతో దేశంలో భారీయెత్తున ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులవల్ల సాధారణ పౌరులకు వచ్చిన ఉద్యోగాలు అంతంతమాత్రం. అటు పాఠశాలల మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకూ అన్నిటికీ నిధుల కొరత. ఆరోగ్యరంగం సంగతి చెప్పనవసరమే లేదు. అది క్షీణ దశకు చేరుకుంది. ఆహార ధరలు ఆకాశాన్నంటాయి. పదకొండు నెలల్లో ఒక్క బియ్యం ధరే 36 శాతం పెరిగింది. ప్రభుత్వ రుణ భారం జీడీపీలో 78 శాతంగా ఉంది. దీన్ని 50 శాతానికి కుదించకపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) హెచ్చరించింది. ఉపాధి లేక, ధరలు భారమై అగచాట్లు పడుతున్న జనంలో క్రమేపీ అసంతృప్తి గూడుకట్టుకుంటున్నది. దృష్టి మళ్లించడానికి, సింహళ జాతీయతను రెచ్చగొట్టడానికి ఇదివరకున్నట్టు తమిళ టైగర్ల బెడద లేదు. మరోపక్క ముస్లింలకూ, బౌద్ధులకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఇదంతా చేయి దాటిపోయేలా ఉన్నదని రాజపక్సకు తెలుసు. 2010 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన 58 శాతానికిపైగా ఓట్లు కైవసం చేసుకున్నారు. నిరుడు జరిగిన ప్రాంతీయ మండళ్ల ఎన్నికల్లో రాజపక్స పలుకుబడి గణనీయంగా తగ్గిందని వెల్లడైంది. షెడ్యూల్ ప్రకారం 2017లోనే ఎన్నికలు నిర్వహిస్తే తనకు పరాజయం తప్పదని తెలుసుకునే ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధపడ్డారు. అయితే, రెండు నెలలక్రితం ఎన్నికలు ప్రకటించిననాటికీ, ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఒక్కొ క్కరే ఆయనను విడిచి వెళ్తున్నారు. రాజపక్స కేబినెట్లో మొన్నటి వరకూ నంబర్ 2 గా ఉన్న మైత్రిపాల సిరిసేన తన పదవికి రాజీనామా చేసి అధ్యక్ష పదవికి విప క్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే సిరి సేన విజయం ఖాయమని సర్వేలంటున్నాయి. సిరిసేన ఫిరాయింపుతో ఖంగుతిన్న రాజపక్సకు తాజాగా మరో మంత్రి, శ్రీలంక ముస్లిం కాంగ్రెస్ నాయకుడు రవూఫ్ హకీం రాజీనామా ఇచ్చి షాకిచ్చారు. దేశ మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమార తుంగ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి సిరిసేనకు మద్దతుగా నిలుస్తానన్నారు. వరస విజయాలతో గర్వం తలకెక్కిన రాజపక్స రాజ్యాంగ, ప్రజాస్వామిక విలువలన్నిటినీ కాలరాశారు. నియంతగా మారారు. అదేమని ప్రశ్నించినవారిని జాతిద్రోహులుగా చిత్రించారు. వచ్చే నెల 8న జరగబోయే అధ్యక్ష ఎన్నికలు రాజపక్సకు ఎలాంటి గుణపాఠాన్నివ్వబోతున్నాయో వేచిచూడాలి. పింఛన్ బాధలు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకు న్న అర్హులైన వితంతువులు లబోది బోమంటున్నారు. కొత్త లబ్దిదారు ల జాబితాలో తమ పేర్లు లేవని గుండెలు బాదుకుంటున్నారు. కొ త్త పింఛన్ జాబితాలో అతికొద్ది మంది పేర్లను ప్రభుత్వం పోస్టాఫీ స్‌లకు పంపింది. మిగతావారి గతేంటని వితంతువులు, వృద్ధులు బావురుమంటున్నారు. కొత్త పింఛ న్లు ప్రకటించామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం తగిన ధ్రువీ కరణ పత్రాలున్నా అర్హులను ఇం కా జాబితాలో ఎందుకు చేర్చలే దు. వెంటనే మరో కొత్త జాబితా ప్రకటించి అక్టోబర్ 2 నుంచే కొత్త వారికి పింఛన్ వచ్చేటట్లు ప్రకటిం చాలి. లేకుంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మరు. - సి.అంకాలమ్మ గుత్తి -
రాజపక్సెను అడ్డగించిన 50మంది తమిళ భక్తుల అరెస్ట్
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సె బుధవారం వేకువజామున 2.30 గంటల ప్రాంతంలో సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రాజపక్సె కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పలువురు తమిళ భక్తులు యత్నించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన లేపాక్షి సర్కిల్ వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రాజపక్సెను అడ్డుకునేందుకు యత్నించిన 50మంది తమిళ భక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయన తన కుమారుల్లో ఇద్దరు హోహితా రాజపక్స, రోహితా రాజపక్సతో కలసి సాయంత్రం 5.35 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. ఈ సమయంలో భద్రతా కారణాల రీత్యా టీటీడీ అంగ ప్రదక్షిణం రద్దు చేసింది. తిరుమలలోని విజయబ్యాంకులో కరెంట్ బుకింగ్‌లో ఇచ్చే సుప్రభాత సేవా టికెట్లను కూడా రద్దు చేశారు. రాజపక్స పర్యటన తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమిళనాడు నుంచి 500 మంది ఎండీఎంకే, వీసీకే పార్టీల కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందోబస్తుతో రెండ్రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
తిరుమలలో రాజపక్స
అడుగడుగునా గట్టి బందోబస్తు తమిళ పార్టీల కార్యకర్తల నిరసన ఎక్కడికక్కడ నిలువరించిన పోలీసులు సుప్రభాత సేవలో శ్రీలంక అధ్యక్షుడు సుప్రభాతం బుకింగ్, అంగ ప్రదక్షిణం రద్దు సాక్షి, తిరుమల: శ్రీ లంక అధ్యక్షుడు మహీంద రాజపక్స మంగళవారం తిరుమలకు వచ్చారు. తన కుమారుల్లో ఇద్దరు హోహితా రాజపక్స, రోహితా రాజపక్సతో కలసి సాయంత్రం 5.35 గంటలకు ఆయన తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ స్వాగతం పలికారు. అనంతరం రాజపక్స పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తిరుమల పద్మావతి అతిథిగృహంలో రాజపక్స కుటుంబ సభ్యులు బస చేశారు. బుధవారం వేకువజామున 2.30 గంటలకు సుప్రభాత సేవలో ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ సమయంలో భద్రతా కారణాల రీత్యా టీటీడీ అంగ ప్రదక్షిణం రద్దు చేసింది. తిరుమలలోని విజయబ్యాంకులో కరెంట్ బుకింగ్‌లో ఇచ్చే సుప్రభాత సేవా టికెట్లను కూడా రద్దు చేశారు. ఈ టికెట్లను రాజ్యాంగ పరిధిలోకి వచ్చేవారికి మాత్రమే కేటాయించారు. త్వరలో శ్రీ లంకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకునేందుకు రాజపక్స వచ్చారని అధికారులు తెలిపారు. మిన్నంటిన నిరసనలు: రాజపక్స పర్యటన తిరుపతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తమిళనాడు నుంచి 500 మంది ఎండీఎంకే, వీసీకే పార్టీల కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాజపక్సకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బందోబస్తుతో రెండ్రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
నేడు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు
శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే మంగళవారం తిరుమల వస్తున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి, బుధవారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. గతంలో కూడా ఆయన తిరుమల వచ్చి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కాగా, శ్రీలంక అధ్యక్షుడు వస్తుండటంతో తిరుమలలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సిమి ఉగ్రవాదులు పలుచోట్ల దాడులకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఈసారి భద్రతా ఏర్పాట్లు గతం కంటే కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. -
రేపు తిరుమలకు శ్రీలంక అధ్యక్షుడు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/సాక్షి తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరుని దర్శనం కోసం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స కుటుంబ సభ్యులతో మంగళవారం తిరుపతికి వస్తున్నారు. అధికారుల అనధికార సమాచారం మేరకు... ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయనికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడిని దర్శించుకుని రాత్రికి కొలంబోకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆదివారం శ్రీలంక నుంచి వచ్చిన భద్రతాధికారుల బృందం తిరుమలలోని పలు ప్రదేశాల్లో పర్యటించింది. తిరుమల విజిలెన్స్ ఏవీఎస్వో, ఇతర అధికారులను కలసి శ్రీలంక అధ్యక్షుడి పర్యటనపై చర్చించారు. -
లంకలో భారత జాలర్ల విడుదల
క్షమాభిక్ష ప్రసాదించిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స నేడు తమిళనాడుకు రాక చెన్నై, సాక్షి ప్రతినిధి/కొలంబో: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఉరిశిక్ష పడిన ఐదుగురు తమిళనాడు జాలర్లను శ్రీలంక ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స వారికి క్షమాభిక్ష ప్రసాదించడంతో జైలు నుంచి విడుదల చేశారు. వారిని తదుపరి చర్యల కోసం జైలు అధికారులు శ్రీలంకలోని భారత హైకమిషన్ అధికారులకు అప్పగించారు. రామనాథపురం జిల్లా రామేశ్వరానికి చెందిన జాలర్లు ఎమర్సన్, పి.అగస్టస్, ఆర్.విల్సన్, కె.ప్రసాద్, జె.లంగ్లెట్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డారనే అభియోగంపై 2011లో శ్రీలంక అరెస్ట్ చేసింది. నిందితులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు అక్టోబర్ 30న కొలంబో హైకోర్టు తీర్పు చెప్పింది. ఇందుకు తమిళనాడులో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉరి శిక్షను రద్దు చేయాలని శ్రీలంకపై ఒత్తిడి పెంచింది. ఈ నెల 11న శ్రీలంక సుప్రీంకోర్టులో ఉరిశిక్షపై అప్పీలు కూడా చేసింది. అలాగే శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సతో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశంపై చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు రాజపక్స అంగీకరించారు. అయితే, వారికి ఉరిశిక్ష రద్దు చేశామేగానీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు యథాతథంగా ఉందని శ్రీలంక మంత్రి సెంథిల్ తొండమాన్ పేర్కొన్నారు. భారత్‌కు వారందరినీ ఖైదీలుగానే అప్పగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. శ్రీలంక నుంచి ఐదుగురు జాలర్లను సముద్రతీర గస్తీ దళాల ద్వారా లేదా విమానంలో గురువారం సాయంత్రంలోగా తమిళనాడుకు చేరుస్తామని మంత్రి తెలిపారు. మరోవైపు ఐదుగురు జాలర్లను విడుదల చేసి, తమకు అప్పగించారని భారత హైకమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే వారు భారత్‌లో శిక్షను అనుభవించే అవకాశం లేదని తెలిపాయి. వారిని త్వరలోనే భారత్ పంపిస్తామని హైకమిషన్ అధికార ప్రతినిధి తెలిపారు. -
రాజపక్సకు భారతరత్న ఇవ్వాలి: స్వామి
న్యూఢిల్లీ: ఎల్టీటీఈ ఉగ్రవాదులను నిర్మూలించటంలో విజయం సాధించిన శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు భారతరత్న ఇవ్వాలని బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి కోరారు. ఈమేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఆయన ఓ లేఖ రాశారు. టైగర్లను తుదముట్టించటాన్ని భారత్‌లో జాతీయ భద్రతకు శుభ పరిణామంగా భావించాలన్నారు. -
నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పర్యటనకు నిరసనగా దేశరాజధానిలో ఆందోళన చేపట్టిన ఎండీఎంకే చీఫ్ వైగోను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ లో నల్ల జెండాలతో కార్యక్రమంలో వైగో నిరసన కార్యక్రమాలను నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సను ఆహ్వానించడాన్ని వైగో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజపక్సను ఆహ్వనించిన నిర్ణయంపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను పునఃసమీక్షించుకోవాలని వైగో కోరారు. ఏబీ వాజ్ పేయి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదనే విషయాన్ని వైగో గుర్తు చేశారు. రాజపక్స ను ఆహ్వనించడంపై విచారం వ్యక్తం చేస్తూ మోడీకి వైగో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజపక్స రావడాన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జే. జయలలిత లు కూడా వ్యతిరేకిస్తున్నారు. -
అలిగిన జయలలిత
మోడీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సను ఆహ్వానించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఆమె ఈ విషయమై ఆదివారం రాత్రి పొద్దుపోయే సమయానికి కూడా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీజేపీ మిత్రపక్షాలైన తమిళ పార్టీలు డీఎండీకే, ఎండీఎంకే కూడా రాజపక్సను ఆహ్వానించడాన్ని వ్యతిరేకించాయి. రాజపక్స రాకకు నిరసనగా సోమవారం ఢిల్లీలో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎండీఎంకే అధినేత వైగో ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, కేరళల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, ఊమెన్ చాందీలు మోడీ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరు కానున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. -
కసాయికి ఆహ్వానమా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళ రాజకీయ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే డీఎంకే, అన్నాడీఎంకే దీనిపై తమ నిరసన తెలిపాయి. తాజాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎండీఎంకే కూడా ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూచించింది. ఎండీఎంకే నాయకుడు వైగో ఈ మేరకు శుక్రవారం నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ లను కలిసి విజ్ఞప్తి చేశారు. అమిత్ షా, అరుణ్ జైట్లీ సమక్షంలో మోడీని వైగో కలిశారు. తమిళులను ఊచకోత కోసిన కసాయి రాజపక్సను ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానించవద్దని మోడీని కోరినట్టు వైగో తెలిపారు. మోడీ నుంచి ఎటువంటి స్పందన వచ్చిందన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. -
ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం
-
ఆయనను ఆహ్వానించడం దురదృష్టకరం
చెన్నై: నరేంద్ర మోడీ తన ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెను ఆహ్వానించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తమిళుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందన్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ హామీయిచ్చిన నేపథ్యంలో రాజపక్సెను ఆహ్వానించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం దురదృష్టకరమన్నారు. శ్రీలంక అధ్యక్షుడికి ఆహ్వానంపై కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కూడా అభ్యతంరం తెలిపింది. తమిళుల మనోభావాలను మోడీ అర్థం చేసుకోవాలని సూచించింది. శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనపై తమిళులు ఆగ్రహంగా ఉన్నారని తెలిపింది. -
శిక్షించే కూటమిగా మార్చొద్దు: మహీంద రాజపక్స
కామన్వెల్త్ కూటమికి రాజపక్స సూచన నాలుగేళ్లుగా లంకలో ఒక్క ఉగ్రవాద చర్యా లేదు కొలంబో: కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల కూటమి (చోగమ్)ని.. దండించే కూటమిగానో, తీర్పు చెప్పే కూటమిగానో మార్చవద్దని శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స సూచించారు. మూడు రోజుల చోగమ్ శిఖరాగ్ర సదస్సు శ్రీలంక రాజధాని కొలంబోలో శుక్రవారం ప్రారంభమైంది. ఎల్టీటీఈపై పోరులో భాగంగా శ్రీలంకలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్న ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో శ్రీలంకలో జరుగుతున్న సదస్సును పలు సభ్యదేశాలు బహిష్కరించిన విషయం తెలిసిందే. తమిళనాడు పార్టీలు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో భారత ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్ కూడా చోగమ్ సదస్సుకు దూరంగా ఉండగా.. భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాజపక్స ప్రారంభోపన్యాసం చేస్తూ.. లంక తమిళులపై మానవ హక్కుల ఉల్లంఘన వివాదాలను, దానిపై పలు దేశాల వైఖరిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘కామన్వెల్త్ అనేదానికి సమకాలీనత ఉండాలంటే.. ఈ కూటమి సభ్యులు ప్రజల అవసరాలకు స్పందించాలి కానీ.. కూటమిని శిక్షించేది గానో, తీర్పు చెప్పేది గానో మార్చకూడదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మానవ హక్కుల పట్ల మాకు ఎంతో గౌరవం ఉంది. జీవించే హక్కును మేం పునరుద్ధరించాం. గత నాలుగేళ్లలో శ్రీలంకలో ఎక్కడా ఒక్క ఉగ్రవాద ఘటన కూడా చోటుచేసుకోలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. సహకారం మరింత పెరగాలి: ప్రిన్స్ చార్లెస్ కామన్వెల్త్ అధినేత 87 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్-2 తరఫున హాజరైన ఆమె కుమారుడు ప్రిన్స్ చార్లెస్, రాజపక్సతో కలిసి చోగమ్ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ఆర్థిక, సామాజిక, పర్యావరణ సవాళ్లను పరిష్కరించేందుకు కామన్వెల్త్ దేశాలు పరస్పర సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘సమకాలీన ప్రపంచ సమస్యలను ‘నయంచేయగల స్పర్శ’ను తీసుకువచ్చే సామర్థ్యం కామన్వెల్త్కు ఉంద’ని నాటి భారత ప్రధాని నెహ్రూ (కాకతాళీయంగా ఆయన జన్మదినం, నా జన్మదినం ఒకటే కావటం నాకు ఎంతో గర్వకారణం) ప్రకటించారు. 60 ఏళ్లకు పైగా గడిచిపోయిన తర్వాత.. మన ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను మనం మళ్లీ గుర్తుచేసుకోవాల్సిన అవసరం రాకూడదు’’ అని పేర్కొన్నారు. మొత్తం 53 సభ్యదేశాల చోగమ్ ప్రారంభ కార్యక్రమంలో కామన్వెల్త్ చైర్మన్, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్, బ్రిటిష్ ప్రధాని కామెరాన్ సహా 23 దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జాఫ్నాలో కామెరాన్ జాఫ్నా: శ్రీలంకలో ‘ఎల్టీటీఈపై యుద్ధం’తో అతలాకుతలమైన ఉత్తర ప్రాంతంలో బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ శుక్రవారం పర్యటించారు. 1948లో శ్రీలంకకు ఇంగ్లండ్ నుంచి స్వాతంత్య్రం లభించిన నాటి నుంచీ ఈ ప్రాంతంలో కాలు పెట్టిన తొలి విదేశాధినేత ఆయనే కావడం విశేషం! శ్రీలంక ప్రభుత్వం యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కామెరాన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
వెంటాడుతున్న హక్కుల ఉల్లంఘనలు!
శ్రీలంకలో నేటి నుంచి ‘చోగమ్’ కొలంబొ: తమిళుల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో పాటు కెనడా, మారిషస్‌ల ప్రధానుల గైర్హాజరు నేపథ్యంలో కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు (చోగమ్) శుక్రవారం నాడిక్కడ ప్రారంభం కానుంది. ఎల్టీటీఈపై యుద్ధం సందర్భంగా స్థానిక తమిళులపై కొనసాగిన అకృత్యాలపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం, యుద్ధ నేరాలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలనే డిమాండ్ల నేపథ్యంలో.. 53 సభ్య దేశాలతో కూడిన చోగమ్ నిర్వహణకు లభించిన అవకాశాన్ని శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్స చేజార్చుకోలేదు. ఎల్టీటీఈని తుడిచిపెట్టిన తర్వాత గత నాలుగేళ్లలో నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని ప్రపంచానికి చాటేందుకు మూడురోజుల పాటు సాగే చోగమ్ సదస్సు మంచి అవకాశంగా ఆయన భావించారు. అందుకనే భారత ప్రధాని గైరుహాజరును సైతం పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా చెప్పేందుకు యత్నించారు. భారత్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాకతో తాను సంతృప్తి చెందుతున్నట్టు రాజపక్స చెప్పారు. తమిళనాడు నుంచి వచ్చిన బలమైన ఒత్తిళ్ల నేపథ్యంలో చోగమ్‌కు హాజరుకారాదని మన్మోహన్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. -
‘చోగమ్’కు మన్మోహన్ గైర్హాజరు
న్యూఢిల్లీ/కొలంబో: కొలంబోలో ఏర్పాటైన కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల (చోగమ్) సమావేశాలకు వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు లేఖ రాశారు. కొలంబోలోని భారత దౌత్య కార్యాలయం ఈ లేఖను రాజపక్సకు అందజేసింది. ఈ సమావేశాలకు తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నా, తన తరఫున విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రాతినిధ్యం వహిస్తారని ప్రధాని మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘చోగమ్’ విషయమై దౌత్యపరమైన ప్రక్రియ పూర్తయిందని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ చెప్పారు. రాజపక్సకు ప్రధాని మన్మోహన్ రాసిన లేఖలోని అంశాలను అధికారికంగా వెల్లడించకపోయినా, గైర్హాజరుపై ప్రధాని ఇందులో కారణాలను వివరించలేదని తెలుస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డ శ్రీలంకలో ఏర్పాటవుతున్న ‘చోగమ్’ సమావేశాలకు ప్రధాని వెళ్లరాదంటూ తమిళనాడు రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్‌లోని ఒక వర్గం నుంచి డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో, చివరకు ఈ సమావేశాలకు హాజరు కారాదని ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో తలెత్తుతున్న నిరసనల నేపథ్యంలోనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఖుర్షీద్ చెప్పారు. కొలంబోలో ఈనెల 15-16 తేదీల్లో జరగనున్న ఈ సమావేశాలకు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ హాజరు కానున్నారు. ప్రధాని మన్మోహన్ ఈ సమావేశాలకు హాజరు కారాదని నిర్ణయించుకోవడంపై తమిళనాడు ప్రజలు సంతృప్తి చెందగలరని కేంద్ర మంత్రి నారాయణస్వామి అన్నారు. ఇదిలా ఉండగా, 54 దేశాల ‘చోగమ్’ దేశాధినేతల సమావేశాల కోసం శ్రీలంక ఆదివారం నుంచి ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంలో యువజన వేదికను ప్రారంభించారు. కామన్వెల్త్ సభ్యదేశాలు కాని చైనా, అమెరికా, జపాన్, బ్రెజిల్ ప్రతినిధులు కూడా కామన్వెల్త్ బిజినెస్ ఫోరంలో పాల్గొననున్నారు. -
దగాపడ్డ లంక తమిళులు
అర్థరహితమైన చర్చలను రేకెత్తించి అనర్థదాయకమైన విధానాలను కప్పిపుచ్చుకోవచ్చు. శ్రీలంకలో ఈ నెల 15-17 తేదీలలో జరగనున్న కామన్వెల్త్ దేశాధినేతల (చోమ్) సమావేశానికి ప్రధాని మన్మోహన్సింగ్ హాజరు కావాలా? వద్దా? అంటూ సాగుతున్న అర్థరహితమైన చర్చే అందుకు నిదర్శనం. లంక అధ్యక్షుడు మహీందా రాజపక్స చైనా బుట్టలో పడకుండా చూడాలంటే మన్మోహన్ చోమ్ సమావేశాలకు హాజరు కాకతప్పదని కొందరి వాదన. 2014 ఎన్నికల వైతరణిని దాటాలంటే తమిళనాడు ప్రజల సెంటిమెంట్‌ను నిర్లక్ష్యం చేయరాదనేది మరో వాదన. ఇది ఎన్నికల సీజన్ వాదన కాగా, మొదటిది ‘చైనా ఫోబియా’ (భయం జబ్బు) నుంచి పుట్టుకొచ్చిన వాదన. యూపీఏ ప్రభుత్వానికిగానీ, తమిళ ఛాంపియన్లైన డీఎంకే, అన్నా డీఎంకేలకుగానీ లంక తమిళుల సంక్షేమంపై కంటే అధికార సోపానాలను ఎక్కడంపైనే శ్రద్ధ. రెండు వందల ఏళ్ల బ్రిటన్ వలసవాద ఊడిగానికి సంకేతమైన చోమ్ ఒక నిరర్థక సంస్థ. రెండేళ్లకోసారి పెట్టే ఆ తద్దినానికి వెడితే ఒరిగేదీ లేదు. వెళ్లకపోతే పోయేదీ లేదు. రాజపక్సే కాదు దాదాపు లంక అధ్యక్షులందరూ భారత్‌ను బుట్టలో పెట్టగలవారే తప్ప మరెవరి బుట్టలోనూ పడే బాపతు కాదు. నేటి మన లంక విధానం రాజపక్స బుట్టలోనే ఉంది. కాబట్టే ఉగ్రవాదంపై యుద్ధం పేరిట ఒకప్పుడు మనం పెంచి పోషించిన వేర్పాటువాద తమిళ టైగర్లపై నిర్మూలనా యుద్ధాన్ని పరోక్షంగా సమర్థించాల్సి వచ్చింది. నేడు లంక తమిళులపై సాగుతున్న అమానుష జాతి అణచివేతను, హక్కుల ఉల్లంఘనను చూసీ చూడనట్టు నటించాల్సి వస్తోంది. మన్మోహన్నాటకం తమిళ టైగర్లపై యుద్ధంలో (2009) లంక సైన్యం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మార్చిలో అభిశంసన తీర్మానం ఆమోదించింది. ఆ సమావేశాలకు ముందు కూడా నేటిలాగే రచ్చ జరిగింది. అది కూడా ఎన్నికల కాలమే... మొసలి కన్నీళ్లు కార్చిన కాలమే. అయినా ఆనాడు మన్మోహన్ ‘ద్రవిడ పార్టీలకు,’ ‘తమిళ దురహంకారానికి’ లొంగిపోడానికి సిద్ధంగా లేనని పదేపదే ప్రకటనలు గుప్పించారు. చివరికి అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు. నేడు ఆయన ఎలాంటి ప్రకటనలు చేయకుండా గుంభనంగా ఉన్నారు. ‘ద్రవిడ పార్టీలకు లొంగిపోతారో లేదో’ వేచి చూడాలి. ప్రధాని చోమ్ సమావేశాలకు వెళ్లడంపై ఇక్కడ చర్చ సాగుతుండగా లంక సైన్యం తమిళ టైగర్ల సమాధులను నేలమట్టం చేసే పనిలో మునిగి ఉంది. నవంబర్ 27 తమిళ టైగర్ల ‘గ్రేట్ హీరోస్ డే.’ మరణించిన తమిళ పోరాటకారుల సంస్మరణ దినం ఒకప్పుడు ఘనంగా వారం రోజుల పాటూ జరిగేది. నేడు పులులూ లేరు, పెద్ద పులి ప్రభాకరనూ లేడు. ఈలం కల యుద్ధ జ్వాలల్లో, యుద్ధానంతర నరమేధ ంలో కరిగిపోయింది. టైగర్లు రాజపక్సను పీడ కలలై వేధిస్తున్నట్టున్నారు. టైగర్ల స్మశాన వాటికలపై పడ్డారు. అక్టోబర్ 19 నుంచి ఇంకా మిగిలి ఉన్న స్మశానాలను నేలమట్టం చేసి, టైగర్ల సమాధులపై సైనిక కట్టడాలను నిర్మించే పని చేయిస్తున్నారు. బిడ్డల సమాధులపై పడి విలపిస్తూ జీవచ్ఛవాల్లా బతికే తమిళ తల్లులకు ఇక ఆపాటి భాగ్యం కూడా ఉండదు. ఒకప్పుడు టైగర్లు మన ప్రభుత్వానికి తమిళుల విముక్తి ప్రదాతలు. 1991లో రాజీవ్‌గాంధీ హత్యకు గురైనప్పటి నుంచి వారు ఉగ్రవాదులు. లంక తమిళులకు మాత్రం వారు ముద్దు బిడ్డలే. బిడ్డలు ఎన్నుకున్న దారి తప్పయినా, ఒప్పయినా నెత్తురు ధారపోసింది తమ కన్నీరు తుడవడానికేగా? ఇది గుర్తించగలిగితే రాజపక్స ప్రభుత్వంలాగే యూపీఏ సర్కారు కూడా తమిళులను అందరినీ ఉగ్రవాదులుగా పరిగణించి వారిపై జరుగుతున్న జాతి అణచివేతకు, అత్యాచారాలకు, హక్కుల హరణకు అడ్డు చెప్పకుండా ఉండదు. ‘ప్రజాస్వామ్య విజయం’ సెప్టెంబర్ 21న జరిగిన ప్రొవిన్షియల్ కౌన్సిల్ ఎన్నికలు ప్రజాస్వామ్య విజయమని ప్రపంచ మీడియా కోడై కూసింది. ఈ ఎన్నికలతో లంక తమిళుల ‘చిరకాల స్వప్నం’ సాకారం కానున్నదని జోస్యాలు చెప్పారు. ఊహించినట్టే గెలిచిన తమిళ్ నేషనల్ ఎలయన్స్ (టీఎన్ఏ) ముఖ్యమంత్రి సీవీ విఘ్నేశ్వరన్ ఆ ఎన్నికల్లో వాగ్దానం చేసినట్టు కౌన్సిల్ ‘లంకలో భాగంగా ఫెడరల్ స్వభావం గలిగిన స్వయం నిర్ణయాధికార హక్కుకు హామీ’ని కల్పించేది కాదు. ఆయన ప్రభుత్వానికి ఉన్న అధికారాలన్నీ లాంఛనప్రాయమైనవే. అధ్యక్షుడు నియమించే గవర్నర్ చేతిలోనే సకల అధికారాలు ఉంటాయి. ప్రాంతీయ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నయినా తోసిరాజనే అధికారమే కాదు, నిర్ణయాలను తీసుకునే అధికారాలు సైతం గవర్నర్‌కే ఉంటాయి. ‘ఈ అధికారంతో తమిళులకు ఏమీ చేయలేమని మాత్రమే విఘ్నేశ్వరన్ రుజువు చేయగలరు’ అని టీఎన్ఏ ప్రముఖ నేత ఒకరు అన్నారు. లంక అంతర్యుద్ధం చివర్లో లొంగిపోవడానికి వ స్తున్న టైగర్లను పాశవికంగా కాల్చిచంపిన సైన్యపు ైపైశాచికత్వాన్ని, పదిహేనేళ్ల మైనర్ ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్‌ను కాల్చి చంపిన తీరును ప్రపంచమంతా తప్పు పట్టినా మన ప్రభుత్వం నీళ్లు నములుతూ కూచుంది. ఆ యుద్ధంలో లంక ప్రభుత్వానికి సహాయం అందించామన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. ఐరాస అభిశంసన తీర్మానం రాజపక్స యుద్ధ నేరాలను దాటవేసి హక్కుల కాలరాచివేతపై చేసిన తీర్మానమే. అయినా దానికి అయిష్టంగానే మన్మోహన్ అంగీరించారు. పిల్లిమొగ్గల విదేశాంగ నీతి 1960లలో మన లంక విధానాన్ని చైనాతో వైరమే శాసిం చింది. తమిళ యునెటైడ్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలను, అమృతలింగం వంటి ఉదారవాద తమిళ నేతలను లంక జాత్యహంకార, తమిళ అణచివేత విధానాలను ప్రతిఘటించకుండా నిరోధిస్తూవచ్చింది. నేపాల్‌లో నేపా లీ కాంగ్రెస్, కొయిరాలాల ప్రతిష్టను దిగజార్చినట్టే... లంకలో తుల్ఫ్ వంటి పార్లమెంటరీ పార్టీల ప్రతిష్ట దిగజారిపోవడానికి కారణమైంది. తమిళ పార్లమెంటరీ పార్టీలపై విశ్వాసం కోల్పోయిన తమిళులు మిలిటైన్సీ వైపు మొగ్గా రు. వివిధ ఈలం సంస్థలు పుట్టుకొచ్చాయి. ఆ సంస్థలన్నిటికీ ఇందిరాగాంధీ ప్రభుత్వం అనుమతితో తమిళనాడులో ఆశ్రయం లభించింది. ఎల్టీటీఈ అప్రజాస్వామిక, ఆధిపత్యవాద సంస్థగా వృద్ధి చెందుతున్నా విచక్షణారహితంగా దాన్ని సమర్థించారు. 1987లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆనాటి లంక అధ్యక్షుడు జేఆర్ జయవర్థనేతో కలిసి లంక తమిళులకు, ఎల్టీటీఈకి ప్రాతినిధ్యంలేని చర్చల్లో... టైగర్లుసహా మిలిటెంటు సంస్థలన్నీ ఆయుధాలు అప్పగించి స్వయం ప్రతిపత్తిగల ప్రాంతీయ అధికారానికి అంగీకరించేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే ప్రాంతీయ కౌన్సిళ్ల కోసం లంక 13వ రాజ్యాంగ సవరణకు అంగీకరించింది. టైగర్లపై బలవంతంగా రుద్దిన ఆ ఒప్పందాన్ని అమలుచేయడానికి లక్ష మంది సైన్యంతో మనం యుద్ధంలో కూరుకుపోవాల్సి వచ్చింది. 1200 మంది భారత సైనికులను కోల్పోయిన ఆ సైనిక దుస్సాహసం గురించి ఎవరూ పెదవి మెదపరు. నాటి ఒప్పందం ప్రకారం కౌన్సిళ్లకు అధికారాల బదలాయింపు జరగనే లేదు. పైగా ఉన్న అధికారాలను కూడా ఊడబెరికారు. రాజీవ్‌గాంధీ హత్యపట్ల ఆగ్రహాన్ని కనబరచడం సబబే అయినా, టైగర్లను నిర్మూలించచడం తప్ప శాంతికి ప్రత్యామ్నాయాలను అన్వేషించకపోవడం మన్మోహన్ దౌత్య నీతి వైఫల్యమే. ఆ వైఫల్యం కారణంగానే నేటికీ వందలాది మంది తమిళ మహిళలపై సైన్యం అత్యాచారాలు సాగిస్తున్నా, వందలాదిగా యువతీ యువకులను మాయం చేస్తున్నా మనకు పట్టడం లేదు. ప్రభాకరన్ పదిహేనేళ్ల చిన్న కుమారుడు బాలచంద్రన్‌ను దుర్మార్గంగా హతమార్చిన దృశ్యాలను కళ్లకు కట్టిన బ్రిటన్‌కు చెందిన ఛానల్ 4 నేడు తిరిగి లంక సైన్యపు మరో ఘాతుకాన్ని ప్రపంచానికి చూపింది. శోభ (ఇసాయ్ప్రియ) అనే ఎల్టీటీఈ పాత్రికేయురాలిని లంక సైన్యం నిర్బంధించి, చిత్ర హింసల పాలు చేసి చంపేసిన ఘాతుకాన్ని, ఆమె నగ్న మృత దే హం వీడియోను అది బయటపెట్టింది. ఆమెపై లంక సైనికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు. ప్రభాకరన్ కుమార్తె ద్వారక (23) శోభేనని అనుమానాలు బలంగా ఉన్నాయి. ఆ విషయాన్ని తమిళ వర్గాలు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మనకు అప్రియమైనవైనా వాస్తవాలు ఎప్పటికీ దాగిపోవు. విశ్లేషణ : పిళ్లా వెంకటేశ్వరరావు