కొలంబో: శ్రీలంక పార్లమెంటును గడువు కన్నా 20 నెలల ముందుగానే పూర్తిగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు సిరిసేన శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే. తర్వాత పార్లమెంటును ఈ నెల 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెలలో సిరిసేన ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో శ్రీలంకలో జనవరి 5న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని రూపుమాపేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టిన సిరిసేన.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment