Parliament disruption
-
శ్రీలంక పార్లమెంటు రద్దు
కొలంబో: శ్రీలంక పార్లమెంటును గడువు కన్నా 20 నెలల ముందుగానే పూర్తిగా రద్దు చేస్తూ ఆ దేశాధ్యక్షుడు సిరిసేన శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తడం తెల్సిందే. తర్వాత పార్లమెంటును ఈ నెల 16 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెలలో సిరిసేన ఆదేశాలిచ్చారు. అధ్యక్షుడి తాజా నిర్ణయంతో శ్రీలంకలో జనవరి 5న ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని రూపుమాపేందుకు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలన్న ప్రతిపాదనను పక్కనబెట్టిన సిరిసేన.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడువుంది. దాదాపు 20 నెలల ముందుగానే సభ రద్దు కావడంతో జనవరి 5న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి!
న్యూఢిల్లీ: ఏ ఒక్కరి ఇష్టానుసారం ప్రజాస్వామ్యం పనిచేయబోదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరోక్షంగా చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. 'ఆయన ఏం చెప్తారో చెప్పనివ్వండి' అంటూ మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుండటంతో ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొందరు తమకు ఇష్టం వచ్చింది, తోచింది చేయాలనుకుంటున్నారని, ఇలాగైతే దేశం నడుస్తుందా? అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన వ్యక్తమైంది. ప్రతిపక్షాల నుంచి ప్రధాని ఏం కోరుకుంటున్నారో చెప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. మరాఠా రాజకీయ యోధుడు శరద్‌పవార్ 75వ పుట్టినరోజు వేడుకలో సోనియా, మోదీ ఒకే వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో మోదీ కరచాలనం చేశారు. సోనియాతో కూడా మర్యాదపూర్వకంగా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సోనియా ప్రతిస్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బిల్లును రాజ్యసభలో ఆమోదించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతును మోదీ ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. -
ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు!
న్యూఢిల్లీ: సభా వ్యవహారాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పల్లం రాజు తప్పుపట్టారు. ప్రధాని వ్యాఖ్యలు సమంజసంగా లేవు అని పల్లం రాజు అన్నారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుతో ఖచ్చితంగా అన్యాయమే జరుగుతోంది. లోకసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందో అర్ధం కావడం లేదు అని పల్లం రాజు అన్నారు. తెలంగాణ బిల్లుతో సీమాంధ్రకు తీవ్రమైన అన్యాయం జరిగిందే భావన అన్నివర్గాల్లోనూ నెలకొని ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుందనే కారణంతోనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తుది పోరాటం చేయాల్సి వచ్చింది అని పల్లం రాజు అన్నారు. సభ సజావుగా జరిగేలా చూడాలని పలుమార్లు విజ్క్షప్తి చేసినా సభ్యులు వినిపించుకోకపోవడం చాలా దారుణం అని ప్రధాని మన్మోహన్ లోకసభలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం చాలా దురదృష్ణకరం అని ప్రధాని అన్నారు.