ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు! | Manmohan singh's comments on today's disruption not fair: Pallam Raju | Sakshi
Sakshi News home page

ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు!

Published Wed, Feb 12 2014 1:48 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు! - Sakshi

ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు!

న్యూఢిల్లీ: సభా వ్యవహారాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పల్లం రాజు తప్పుపట్టారు. ప్రధాని వ్యాఖ్యలు సమంజసంగా లేవు అని పల్లం రాజు అన్నారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుతో ఖచ్చితంగా అన్యాయమే జరుగుతోంది. లోకసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందో అర్ధం కావడం లేదు అని పల్లం రాజు అన్నారు.
 
తెలంగాణ బిల్లుతో సీమాంధ్రకు తీవ్రమైన అన్యాయం జరిగిందే భావన అన్నివర్గాల్లోనూ నెలకొని ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుందనే కారణంతోనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తుది పోరాటం చేయాల్సి వచ్చింది అని పల్లం రాజు అన్నారు. 
 
సభ సజావుగా జరిగేలా చూడాలని పలుమార్లు విజ్క్షప్తి చేసినా సభ్యులు వినిపించుకోకపోవడం చాలా దారుణం అని ప్రధాని మన్మోహన్ లోకసభలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం చాలా దురదృష్ణకరం అని ప్రధాని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement