Pallam Raju
-
చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. వారిలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు 129 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన 18 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండు కోసం జైలుకు తరలించినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ పాత్ర బట్టబయలు గంధం పల్లంరాజు అరెస్టుతో ఈ కుట్ర కేసులో టీడీపీ పాత్ర మరోసారి బట్టబయలైంది. అతను టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అతనిపై అమలాపురం, పరిసర ప్రాంతాల్లో పలు కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉండేది. గంధం పల్లంరాజుపై అమలాపురం స్టేషన్లో ఉన్న రౌడీ షీట్‌ను చినరాజప్ప హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఎత్తివేయడం గమనార్హం. గతంలో ఇసుక మాఫియా నడిపిన అతను అనంతరం రియల్టర్‌గా రూపాంతరం చెందాడు. అమలాపురంలో గత నెల 24న చలో కలెక్టరేట్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు పన్నాగం వెనుక అతను క్రియాశీలకంగా వ్యవహరించాడు. రౌడీషీటర్లను అమలాపురం వీధుల్లో మాటువేసేలా చేయడంతోపాటు వారంతా ఒకేసారి ర్యాలీలోకి ప్రవేశించేలా స్కెచ్‌ను అమలు చేశాడు. అతనికి అమలాపురానికే చెందిన గంప అనిల్, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన యాళ్ల నాగులు సహకరించారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా కుట్ర నడిపించారు.. వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టడం, వాట్సాప్ గ్రూపుల ద్వారానే పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, ఏ సమయంలో దాడులకు పాల్పడాలో ఇలా మొత్తం కుట్రను పక్కాగా నడిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు వాట్సాప్ సందేశాలు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పూర్తి ఆధారాలను సేకరించారు. కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అమలాపురంతోపాటు కోనసీమ అంతటా 144 సెక్షన్, పోలీసు సెక్షన్ 30లను పోలీసులు కొనసాగిస్తున్నారు. -
వ్యక్తిగత ప్రయోజనాల కోసం అమరావతిని రాజధాని చేశారు
-
ఎగ్జిక్యూటివ్ రాజధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
-
‘ఆర్మీ తెగువను మోదీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు’
సాక్షి, ఏలూరు: పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేయడం గర్వకారణమని కేంద్ర మాజీ రక్షణశాఖ మంత్రి పల్లం రాజు అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఒక విధానంగా పాకిస్థాన్ మలుచుకుందని, పాక్‌లోనే కాదు.. మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలపై కూడా భారత్ దాడులు చేయాలని ఆయన సూచించారు. భారత ప్రతీకార చర్యకు ప్రస్తుతం అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోందని, అయితే, ఇది వెంటనే సంతోషించాల్సిన విషయం కాదన్నారు. పాకిస్థాన్‌కు యుద్ధం చేసి గెలిచే అవకాశం లేనందున ఆ దేశం ఉగ్రవాద దాడులు చేసేందుకు తెగబడే ప్రమాదం ఉందని, అందుకు భారత్ సిద్ధంగా ఉండడంతోపాటు అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని సూచించారు. సర్జికల్ స్ట్రైక్ లు మోదీ చేసినవి కావు... ‘ఈ సర్జికల్ స్ట్రైక్ లు మోదీ చేసినవి కావు. అంతకుముందు జరిగాయి. ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. భారత్ ఆర్మీ తెగువను ప్రచారం కోసం మోదీ వాడుకుంటున్నారు. కశ్మీర్ ప్రజల మద్దతు పోగొట్టుకోవడమే మోదీ ప్రభుత్వం వైఫల్యం. అందుకే పుల్వామా, ఇతర ఉగ్ర దాడులు మితిమీరాయి’ అని పల్లంరాజు వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక భారత ప్రభుత్వానికి కశ్మీర్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఈ ప్రధాన అంశాన్ని భారత ప్రభుత్వం గుర్తించి, కశ్మీరీల మద్దతు సంపాదించాలని పేర్కొన్నారు. మోదీ అనేక అంశాల్లో విఫలమయ్యారని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను ప్రధానంగా మోదీ సర్కారు ఎదుర్కోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం, దేశ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఏపీని అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. -
‘మోదీ సర్కార్ వైఫల్యం వల్లే ఉగ్రదాడి’
సాక్షి, న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యం వల్లే కశ్మీర్లో ఉగ్రదాడి జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు ఆరోపించారు. జమ్మూ కశ్మీర్లో స్థానిక ప్రజల మద్దతును మోదీ సర్కార్ కోల్పోయిందని, అందుకే ఇంత పెద్ద దాడిని ఉగ్రవాదులు చేయగలిగారని వివరించారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి దురదృష్టకరమన్నారు. పాకిస్తాన్ అండతోనే భారత్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయన్నారు. సర్జికల్ దాడులు కేవలం ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగినట్లు ఎక్కువగా ప్రచారం చేసుకుందని.. కానీ యూపీఏ హయాంలో కూడా సర్జికల్ దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందని ఆశిస్తున్నానన్నారు. ఏపీసీసీ భరోసా యాత్ర ఏపీకి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని పల్లం రాజు పేర్కొన్నారు. విభజన హామీలన్నీ అమలయ్యేవరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి ఏపీకి ప్రత్యేక హోదా కోసం భరోసా యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఏపీసీసీ భరోసా యాత్ర అనంతపురం మడకశిరలో ప్రారంభమై.. మార్చి 3 న ఇచ్చాపురంలో ముగుస్తుందన్నారు. అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో భరోసా యాత్ర సాగుతుందని పల్లం రాజు అన్నారు. -
హామీలు అమలు చేయకపోవడం అన్యాయం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు అన్నారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ ఎస్కే జోషిని ఆయన మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోషి పాత మిత్రుడు కావడంతోనే కలిసానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గత యూపీఏ ప్రభుత్వం, అప్పటి ప్రధాన మంత్రి అన్ని పార్టీలను ఒప్పించి ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, అప్పటి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్ల నుంచి పోరాటం చేస్తుందని, రాహుల్ గాంధీ కూడా ఇదే అంశంపై పార్టీ ప్లీనరీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. తొలి నుంచే అందరూ కలిసి హోదా కోసం పోరాడాల్సిందన్నారు, ఇప్పటికైనా నిజాయితీగా కలిసికట్టుగా పోరాడి హోదా సాధించుకోవాలని ఆయన సూచించారు. -
‘అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజన నిర్ణయం’
విజయవాడ : నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని మాజీ కేంద్రమంత్రి పల్లం రాజు వ్యాఖ్యానించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో పల్లం రాజు విలేకరులతో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వ వాగ్ధానాన్ని నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై కొన్ని నెలల క్రితం నుంచే చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారని అన్నారు. కేంద్ర ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. సోనియాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేకంగా లేఖలో ఆంధ్ర్ర ప్రదేశ్‌కు కేటాయించవలసిన నిధులు, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరారని చెప్పారు. మార్చ్ 2న ఏపీలో రాస్తారోకో నిర్వహిస్తామని, అనంతరం ఢిల్లీలో మార్చి 7, 8వ తేదీల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే విధముగా ప్రభుత్వాలు కనీస ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరారు. -
‘అమాయకులపై కేసులను ఉపసంహరించుకోవాలి’
గుంటూరు: తుని ఘటనలో అమాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మంజునాథ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని ఆయన సూచించారు. కాపు రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ఈ విషయంలో తాము ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నట్లు పల్లంరాజు చెప్పారు. -
కాపులపై విషం చిమ్ముతున్న ముఖ్యమంత్రి
♦ దాసరి, చిరంజీవి, పల్లంరాజు, బొత్స తదితరుల మండిపాటు ♦ కాపు మంత్రులతో పూటకో మాట మాట్లాడిస్తున్నారని ధ్వజం ♦ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కాపు వర్గీయుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షను కూడా తప్పుదారి పట్టించే రీతిలో మంత్రుల చేత తప్పుడు విమర్శలు, ఆరోపణలు, విభిన్న ప్రకటనలు చేయిస్తున్నారని కాపు సామాజికవర్గ ప్రముఖులు దాసరి నారాయణరావు, కొణిదల చిరంజీవి, ఎం.పల్లంరాజు, బొత్స సత్యనారాయణ, సి.రామచంద్రయ్య, తోట చంద్రశేఖర్, అంబటి రాంబాబు, కె.కన్నబాబు, ఎం.వి.కృష్ణారావు, గంగయ్యనాయుడులు గురువారం విడుదల చేసిన ఓ ప్రకటన లో ఖండించారు. ముద్రగడకు ఇచ్చిన హామీ ల విషయంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన వివరణకు భిన్నంగా ముగ్గురు కాపు మంత్రులు చేసిన ప్రకటనల పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ముగ్గురు మంత్రులు మాట్లాడక ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారని, ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్, డీఐజీల వివరణకు భిన్నంగా ప్రకటనలు చేశారన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విషపూరిత చర్యగా అనుమానం వ్యక్తం చేశారు. ఇంతగా అవమానిస్తారా..: ముద్రగడ కుటుంబీకులను ముఖ్యంగా కుమారుడిని పైశాచికంగా తరిమి కొట్టిన విధానాన్ని, ముద్రగడ కోడలిపై ఉచ్చరించడానికి వీలుగాని పరుష పదజాలం ఉపయోగించి ఆ కుటుంబాన్ని అవమానించిన తీరును తప్పుపట్టారు. ఈ అవమానం ఆయన కుటుంబానికి జరిగినది కాదని, మొత్తం కాపు జాతికి జరిగిందిగా భావిస్తున్నామన్నారు. గతంలో దీక్ష విరమింప చేయడానికి కిర్లంపూడిలో మధ్యవర్తులైన మంత్రులు ఇచ్చిన హామీలను, అమలు పరచకుండా మోసం చేసినట్టుగానే ఇప్పుడూ మోసం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ముద్రగడ సమక్షంలో కలెక్టర్, డీఐజీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. కాగా, ముద్రగడ దీక్షను సమర్థిస్తూ ఈ నెల 13న కాపు ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించి, దీక్షను విరమించే ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి ముద్రగడ ప్రాణాలు కాపాడాలని చేసిన డిమాండ్‌కు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ప్రభుత్వం స్పందించిందన్నారు. తామంతా ముద్రగడ దీక్షపై చర్చించేందుకు గురువారం విజయవాడ వెళ్లాల్సి ఉండిందని, అయితే బుధవారం రాత్రి దీక్షపై కలెక్టర్, డీఐజీల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పర్యటనను విరమించుకున్నామన్నారు. -
వ్యవసాయానికి 7 గంటలపాటు విద్యుత్
-
ఆస్పత్రిలో పళ్లంరాజు ప్రచారం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లాలో కేంద్రమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి పళ్లంరాజు యధేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఎన్నికల ప్రచారం ముగిసినా ఆయన మాత్రం ఓటు వేయాలంటూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన పళ్లంరాజు తనకు ఓటు వేయాలని రోగులను, ఆస్పత్రి సిబ్బందిని అభ్యర్థించారు. ఆయనతో పాటు వచ్చిన అనుచరులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పళ్లంరాజును గెలిపించాలని కోరారు. కాగా నిన్నటితోనే ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఓ వైపు ఎన్నికల కమిషన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే పళ్లంరాజు ప్రయివేటు వాహనంలో ఆస్పత్రికి వచ్చి ప్రచారం చేశారు. అయితే ఈ ఘటనపై ఈసీ ఇంకా స్పందించలేదు. -
తుస్సుమన్న బస్సు యాత్ర
సాక్షి, తిరుపతి: సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మంగళవారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభ ఆపార్టీ శ్రేణులను నిరాశపరిచింది. ఈ సభ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపలేదనే చెప్పాలి. నిర్ణీత సమయానికి రెండున్నర గంటలు ఆలస్యంగా సభ ప్రారంభమైంది. నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి, ఎన్నికల ప్రచారకమిటీ సారధి చిరంజీవి, కేంద్రమంత్రులు పల్లంరాజు, పనబాక లక్ష్మి, జేడీ. శీలం, ఎంపీలు చింతామోహన్, కనుమూరి బాపిరాజు, రాష్ట్ర మాజీ మంత్రులు కొండ్రు మురళి, బాలరాజు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు బస్సు యాత్రలో తిరుపతికి వచ్చారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే.వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. సాయంత్రం 4 గంటలకు సభ జరగాల్సి ఉన్నప్పటికీ జనం లేకపోవడంతో ఆరున్నర గంటలకు ప్రారంభించారు. సభకు సుమారు రెండువేల మంది హాజరయ్యారని అంచనా వే స్తున్నారు. ఆలస్యం కావడంతో సభ ప్రారంభంలోనే మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. ప్రధాన వక్తల్లో చిరంజీవి ప్రసంగం జనాన్ని ఆకట్టుకోలేక పోయింది. అంతో ఇంతో రఘువీరారెడ్డి మెప్పించగలిగారు. ఇద్దరి ప్రసంగాల్లోనూ రాష్ట్ర విభజనకు దారితీసిన పరిస్థితులు, భవిష్యత్‌లో సీమాంధ్రలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారు. వీటితోపాటు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిల సొంతజిల్లా కావడంతో వారిపై విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేగాకుండా జిల్లాలో ఎంతోకాలంగా పదవులను అనుభవించి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించారు. నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీని తిట్టినవారే ఇప్పుడు ఆ పార్టీ పంచన చేరడం పదవీ కాంక్షేనని విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి వారందరినీ ఓడించాలని, కసితో పనిచేయాలని రఘువీరారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభా ప్రాంగణంలో జనం పలుచగా ఉండడంతో రఘువీరారెడ్డి ఇది బహిరంగ సభ కాదని, కార్యకర్తల సమావేశమని చెప్పుకోవాల్సి వచ్చిం ది. చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 65 జెడ్పీటీసీ స్థానాలకు 29 మంది, 901 ఎంపీటీసీ స్థానాలకు 60 మంది, 219 వార్డు సభ్యుల పదవులకు 39 మంది కాంగ్రెస్ తరఫున నామినేషన్లు వేశారని పరోక్షంగా పార్టీ దుస్థితిని వివరించారు. ప్రముఖులు లేక నిండుదనం కోల్పోయిన వేదిక కాంగ్రెస్‌పార్టీ నిర్వహించిన సభలో జిల్లాకు చెందిన ప్రముఖులు లేకపోవడంతో వేదిక నిండుదనం కోల్పోయినట్టు కనిపించింది. ఒకప్పుడు కాంగ్రెస్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ హోదాల్లోని పదవులు పొందిన వారితో కళకళలాడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయింది. జిల్లాకు సంబంధించినంత వరకు తిరుపతి ఎంపీ చింతామోహన్ మినహా ప్రముఖులెవరూ లేరు. డీసీసీ అధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి కూడా మొన్నటి వరకు జిల్లా అంతటా తెలిసిన నేత కాదు. వేదిక నిండుగా బస్సుయాత్రలో వచ్చిన నేతలే కనిపించారు. -
‘తుస్సు’మన్న బస్సుయాత్ర
కాకినాడ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ‘మామిడి పండు తిన్న నోటితోనే మేడిపండును చవి చూడాల్సి వచ్చినట్టు’ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచేందుకు పీసీసీ కొత్త సారథి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి తలపెట్టిన బస్సుయాత్ర శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పేలవంగా సాగింది. తునిలో ప్రారంభమై అన్నవరం, కత్తిపూడి, గొల్లప్రోలు, పిఠాపురంల మీదుగా జిల్లా కేంద్రం కాకినాడకు చేరుకున్న యాత్రకు ఆశించిన స్పందన కానరాక పోగా పిఠాపురంలో చిరంజీవికి చేదు అనుభవం ఎదురైంది. తునిలో పార్టీ శ్రేణులు స్వాగత సన్నాహాలు చేసినా అక్కడి నుంచి జరిగిన పర్యటనలో ప్రజా స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. ముఖ్యంగా పిఠాపురం వద్ద కె.బాబ్జి అనే ఓ కార్యకర్త ‘ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి నట్టేట ముంచేశావు’ అంటూ బస్సుయాత్ర వద్ద ఒకప్పటి పీఆర్పీ కరపత్రాలను నేలకేసి కొట్టి నిరసన తెలియజేశాడు. చిరు అభిమానుల సందడే.. కాకినాడ సూర్యకళామందిరంలో జరిగిన డీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో చిరంజీవి అభిమానులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారే తప్ప నిజమైన పారీశ్రేణులు లేక సభ వెలవెలపోయింది. రఘువీరా, చిరంజీవిలతో పాటు కేంద్రమంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పంతం గాంధీమోహన్, వంగా గీత మాత్రమే హాజరయ్యారు. రఘువీరా తొలిసారిగా హాజరైన డీసీసీ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాపాక వరప్రసాద్, పొన్నాడ సతీష్, ఎన్.శేషారెడ్డి, రాజా అశోక్‌బాబు, పాముల రాజేశ్వరీదేవి రాలేదు. రంపచోడవరం ఎమ్మెల్యే కోసూరి కాశీ విశ్వనాథ్ మాత్రం హాజరయ్యారు. విభజనకు కారణమైన పార్టీలు కాంగ్రెస్‌ను నిందిస్తున్న తీరుపై ప్రతి కార్యకర్తా మరో ముగ్గురికి, ఆ ముగ్గురు మరో ముగ్గురికి.. అలా ప్రచారం చేయాలంటూ చిరంజీవి తాను నటించిన ఁస్టాలిన్* సినిమాలోని చైన్‌లింక్ విధానాన్ని ఊదరగొట్టారు. కిరణ్ సమైక్య చాంపియన్ కావాలని చేసిన రాజకీయంలో ఆయన హీరోగా, తాము జీరోలుగా ప్రజల్లో చులకన కావాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర విభజన జరిగాక కూడా చివరి బంతి మిగిలే ఉందంటున్న కిరణ్‌కుమార్‌రెడ్డి మానసిక పరిస్థితిపై సందేహం కలుగుతోందన్నారు. కిరణ్ నిర్వాకమే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబుది అధికార దాహం.. ఒక ఓటు, రెండు రాష్ట్రాల నినాదంతో 18 ఏళ్ల క్రితం కాకినాడ సమావేశంలో రాష్ట్ర విభజనకు బీజం వేసిన మతతత్వ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అధికార దాహం తేటతెల్లమవుతోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ సారథి, కేంద్రమంత్రి చిరంజీవి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన స్థానిక సూర్యకళామందిరంలో డీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ అనేక పార్టీలు విభజనను కోరుకున్నాక కాంగ్రెస్ చివరిపార్టీగా నిర్ణయం తీసుకుందన్నారు. పార్టీ శ్రేణులు స్తబ్దతను వీడి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయాలని కోరారు. కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ ప్రజారంజక పాలన కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. కేంద్రమంత్రి కృపారాణి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాలకు కృషి చేసింది కాంగ్రెసేనన్నారు. కేంద్రమంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, వంగా గీత, పంతం గాంధీమోహన్, ఎమ్మెల్సీలు రత్నాబాయి, లక్ష్మీశివకుమారి, మండలిలో విప్ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి కొండ్రు మురళి, నాయకులు బుచ్చి మహేశ్వరరావు, కొప్పన మోహనరావు, పి.వి.రాఘవులు, పంతం నానాజీ, మాజీ కార్పొరేటర్ బసవా చంద్రమౌళి, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు ఫణీశ్వరరావు పాల్గొన్నారు. -
కేంద్రీయ విద్యాలయానికి గ్రీన్ సిగ్నల్
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్ : ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసే కేంద్రీయ విద్యాలయం సిద్దిపేటకు మంజూరైంది. కొంత కాలంగా సిద్దిపేట కేంద్రంగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రయత్నం సఫలీకృతమైంది. గతేడాది క్రితం సిద్దిపేట పట్టణంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఎమ్మెల్యే హరీష్‌రావు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. అంతేగాక నాలుగు రోజుల క్రితం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి పల్లంరాజును వ్యక్తిగతంగా కలిసి విద్యాలయం ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు సిద్దిపేటలోని ఎన్సాన్పల్లి శివారు విద్యాలయ ఏర్పాటుకు ప్రభుత్వ స్థల పరిశీలన జరిగింది. ఈ కేంద్రీయ విద్యాలయంలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన సీబీఎస్ఈ సిలబస్ ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం బీహెచ్ఈఎల్ ప్రాంతంలో ఓ కేంద్రం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో విద్యాలయంగా సిద్దిపేటలో ఏర్పాటు కానుంది. ప్రస్తుతానికి వచ్చే విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రారంభించి వెను వెంటనే దానిని 12వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఎమ్మెల్యే హరీష్‌రావు న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ సిద్దిపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం హర్షించ దగ్గ విషయమన్నారు. సిద్దిపేటలో ప్రస్తుతానికి బీసీ వసతి గృహంలో తాత్కాలికంగా విద్యాలయాన్ని కొనసాగిస్తామని, కలెక్టర్ సహకారంతో సొంత భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. తన మరో ప్రయత్నం సఫలీకృతం అయితే కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. -
చివరి సీఎం ఎవరో ?
-
'కిరణ్ రాజీనామా దురదృష్టకరం'
-
మొత్తం వ్యవస్థకే ఇది విచారకరం:పల్లంరాజు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన ఘటన మొత్తం వ్యవస్థకే మచ్చతెచ్చేదిగా ఉందని కేంద్రమంత్రి పల్లంరాజు అభిప్రాయపడ్డారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, కాకపోతే బాధ్యాతాయుతమైన పార్టీగా ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. లోక్ సభలో బిల్లు ఆమోదించిన తీరు ఏమాత్రం సరిగా లేదన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటనగా పల్లంరాజు అభివర్ణించారు. తెలంగాణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురు సీమాంధ్ర నేతలు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ కోవలో కేంద్ర మంత్రి పురందేశ్వరి కూడా చేరారు. తెలంగాణ బిల్లుపై ఏకపక్ష నిర్ణయంతో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర నేతలు మండిపడుతున్నారు. కాగా, కాంగ్రెస్ వైఖరిని ఎప్పుడూ సమర్థిస్తూ వచ్చిన పల్లంరాజు పార్టీని వీడేందుకే విమర్శలు చేస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. -
ఈవిధంగా బిల్లు ఆమోదం దురదృష్టకరం: పల్లంరాజు
-
హైదరాబాద్‌ను యూటీ చేయాల్సిందే: పల్లంరాజు
-
'హైదరాబాద్‌లో భయంగా సీమాంధ్రులు'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం భయాందోళనతో ఉన్నారని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం ద్వారానే వారికి సరైన రక్షణ కల్పించగలమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని తాము గట్టిగా కోరుతున్నామని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణం కాగానే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా తొలగించవచ్చని పల్లంరాజు పేర్కొన్నారు. -
ప్రధాని వ్యాఖ్యలను తప్పుపట్టిన పల్లం రాజు!
న్యూఢిల్లీ: సభా వ్యవహారాలపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని కేంద్ర మంత్రి పల్లం రాజు తప్పుపట్టారు. ప్రధాని వ్యాఖ్యలు సమంజసంగా లేవు అని పల్లం రాజు అన్నారు. ప్రస్తుత స్థితిలో ఉన్న బిల్లుతో ఖచ్చితంగా అన్యాయమే జరుగుతోంది. లోకసభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందో అర్ధం కావడం లేదు అని పల్లం రాజు అన్నారు. తెలంగాణ బిల్లుతో సీమాంధ్రకు తీవ్రమైన అన్యాయం జరిగిందే భావన అన్నివర్గాల్లోనూ నెలకొని ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్యాయం జరుగుతుందనే కారణంతోనే రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా తుది పోరాటం చేయాల్సి వచ్చింది అని పల్లం రాజు అన్నారు. సభ సజావుగా జరిగేలా చూడాలని పలుమార్లు విజ్క్షప్తి చేసినా సభ్యులు వినిపించుకోకపోవడం చాలా దారుణం అని ప్రధాని మన్మోహన్ లోకసభలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం చాలా దురదృష్ణకరం అని ప్రధాని అన్నారు. -
'మేము సూచించిన సవరణలను జీఓఎం పట్టించుకోలేదు'
-
గో బ్యాక్.. పళ్లంరాజు
సాక్షి నెట్వర్క్: కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్య సెగ తగిలింది. జెడ్పీ సెంటర్లో 152 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న న్యాయవాదులకు శుక్రవారం సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఆయనను చూసిన న్యాయవాదులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ‘గోబ్యాక్ పళ్లంరాజు’ అంటూ నినాదాలు చేస్తూ ఘెరావ్ చేశారు. ‘మీ చేతకాని తనంవల్లే ఈ పరిస్థితి వచ్చింది. మీరంతా రాజీనామా చేసి ఉంటే విభజన బిల్లువచ్చి ఉండేది కాదు’ అంటూ న్యాయవాదులు మండిపడ్డారు. సీమాంధ్రులకు అన్యాయం జరగకుండా చూస్తానంటూ మంత్రి నచ్చజెప్పబోయినా శాంతించలేదు. రాజీనామా చేసే వరకు ఇక్కడకు రావొద్దంటూ నినదించడంతో పళ్లంరాజు వెనుదిరిగారు. కాకినాడ బాలాజీచెరువు సెంటర్లో బంద్‌ను పర్యవేక్షిస్తున్న టీడీపీ శ్రేణులూ తమకు ఎదురుపడిన పళ్లంరాజు కాన్వాయ్‌ను అడ్డుకున్నాయి. -
ఆరు లక్షల మంది టీచర్ల కొరత: పల్లంరాజు
దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది టీచర్ల కొరత ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పల్లంరాజు చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించడానికి ఖాలీలను భర్తీచేయడంతో తగిన ప్రోత్సాహాలను అందిస్తామన్నారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పల్లంరాజు తెలిపారు. అలాగే విద్యార్థినులు, మైనార్టీ బాలుర హాజరు శాతం పెంచాల్సిన అవసరముందని చెప్పారు. బీహార్‌లో చాప్రాలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది పిల్లలు చనిపోయిన సంఘటన గురించి ఓ పశ్నకు సమాధానంగా.. మధ్యాహ్న భోజన పథకం అమలులో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆన్ని రాష్ట్రాలకు సూచించామని బదులిచ్చారు. జాతీయ పర్యవేక్షణ కమిటీ ఈ పథకాన్ని సమీక్షిస్తున్నట్టు పల్లంరాజు చెప్పారు. -
విభజనను అడ్డుకోవడం నా శక్తికి మించింది: పల్లం రాజు
ప్రధాని మన్మోహన్ సింగ్ ఒత్తిడి మేరకే తాను మంత్రివర్గంలో కొనసాగుతున్నాను అని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పల్లం రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్ననిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పల్లం రాజు తన పదవికి రాజీనామా చేశారు. రెండు వేర్వేరు సంఘటనల్లో రాజీనామాను ఉపసంహరించుకోవాలని ప్రధాని తనను కోరారన్నారు. 'మానవ వనరుల శాఖ కీలకమైంది. ఆ శాఖ పనితీరు ఆగిపోతే ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది' అని ప్రధాని తనతో అన్నారని పల్లం రాజు తెలిపారు. దాంతో తాను మంత్రివర్గంలో కొనసాగాలని నిశ్చయించుకున్నాను. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అనుకున్నాను అని పల్లం రాజు వ్యాఖ్యానించారు. అంతేకాక తెలంగాణ ఏర్పడటం ఖాయమని.. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో విఫలమయ్యాం అని అన్నారు. విభజనను అడ్డుకోవడం తన శక్తికి మించింది అని అన్నారు. అన్నిప్రాంతాలకు న్యాయం చేయడానికి కేంద్ర మంత్రుల బృందం కసరత్తు చేస్తోంది అని అన్నారు. రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్ష అభియాన్ (రుసా) సమావేశంలో ఉన్నత విద్యాశాఖ మంత్రుల భేటిలో పల్లం రాజు పాల్గోన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా విషయంపై వివరణ ఇచ్చారు. -
విడిపోయినా ప్రజలు కలిసుండాలి: పళ్లంరాజు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలు కలిసుండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పళ్లంరాజు అన్నారు. ఆ దిశగా కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ‘నవోదయ పాఠశాలల జాతీయ సమగ్రతా సమావేశం’లో శుక్రవారం పాల్గొన్న మంత్రి అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు కేంద్రప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని, ఈ వేగం తమకూ ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోతున్న తరుణంలో కేంద్రం ముందు ఎలాంటి వాదనలు వినిపించలేదన్న భావన రాకూడదన్న ఉద్దేశంతోనే మంత్రుల బృందానికి(జీవోఎం) 11 అంశాలపై నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. తాము సమైక్యంగా ఉండాలని లిఖితపూర్వకంగా రాసిచ్చామని, అయితే విభజన అనివార్యమైన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాల్సిన అంశాలపై నివేదించామని, ఇంతకుమించి వివరాలు చెప్పలేనని పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్కు సంబంధించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, స్పీకర్ నాదెండ్ల మనోహర్ మధ్య నడుస్తున్న వివాదంపై తాను వ్యాఖ్యానించబోనని చెప్పారు. విభజన విషయంలో సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు చేతులెత్తేయలేదన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము కోరామని, విభజన వద్దని స్పష్టం చేశామని అన్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు వస్తుందా? లేదా? అన్నది తాను చెప్పలేనన్నారు. నవోదయ పాఠశాలలు పనితీరు అద్భుతం.. దేశంలో నవోదయ విద్యాసంస్థల పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. ‘నవోదయ పాఠశాలల జాతీయ సమగ్రతా సమావేశం’లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడానికి 1986లో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. తొమ్మిది, పదో తరగతి చదివే సమయంలో ఒక ప్రాంతంవారు మరో ప్రాంతంలో ఏడాదిపాటు విద్యనభ్యసించడం వల్ల ఆ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు అర్థం చేసుకోవడానికి వీలుంటుందన్నారు. 2022 నాటికి ఐదు కోట్ల మంది యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం తేవడం వల్ల ప్రస్తుతం 23 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారని, వీరిలో 12 కోట్ల మంది పిల్లలకు మధ్యాహ్నభోజన కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెచ్‌సీయూ వైస్‌చాన్సలర్ రామకృష్ణ రామస్వామి, నవోదయ విద్యాలయాల కమిషనర్ జీఎస్ భత్యాల్లు కూడా ప్రసంగించారు. -
తెలంగాణ, సీమాంధ్ర నేతల సమావేశాలు
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన కసరత్తు చివరి దశకు చేరుకోవటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి దేశ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. జీవోఎంతో భేటీ నేపథ్యంలో ఓ వైపు తెలంగాణ ప్రాంత నేతలు, మరోవైపు సీమాంధ్ర ప్రాంత నేతలు విడివిడిగా సమావేశం అయ్యారు. ఈరోజు ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జీవోఎం ఎదుట హాజరుకావాల్సిన నేపథ్యంలో.. దానికి ముందుగా కేంద్రమంత్రి పళ్లంరాజు నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులతో పాటు అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా హైదరాబాద్, సాగునీటి వనరుల పంపకం, నూతన రాజధాని అభివృద్ధికి తగిన ఆర్థిక ప్యాకేజీ, ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు వంటి అంశాలను.. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ముందు ఉంచాలని భావిస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు జీవోఎంతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. మరోవైపు తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రులు, నేతలు కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం మరోసారి సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రాంత నేతలు ఉదయం 10.30 గంటలకు జీవోఎంతో భేటీ కానున్నారు. ఇక ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 12.30 గంటలకు జీవోఎం సభ్యులను కలుస్తారు. -
ఐదేళ్ల తరువాత..
సాక్షి, కాకినాడ :ఏలేరు ఆధునికీకరణ కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.138 కోట్లు మంజూరు చేశారు. పనులకు పరిపాలనామోదం కూడా ఇచ్చారు. ఆయన హఠాన్మరణం తరువాత ఆ పనులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఫలితంగా వరుస తుపానులు, వరదలతో ఏలేరు రైతులు నాలుగేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలేరు ఆధునికీకరణ పనులపై ప్రభుత్వం కంటితుడుపు ప్రకటనలు చేసిందే తప్ప చిత్తశుద్ధితో ఎటువంటి కృషీ చేయలేదు. మెట్ట ప్రాంతం నుంచి తోట నరసింహం మంత్రిగా రాష్ర్ట క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇదే దుస్థితి. ఇటువంటి తరుణంలో మరోసారి ఏలేరు రైతాంగాన్ని మోసగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరో ఆర్నెల్లలో ప్రస్తుత ప్రభుత్వ కాలం ముగియనుంది. ఈ తరుణంలో మహానేత మంజూరు చేసిన రూ.138 కోట్ల నిధుల్లో రూ.127.60 కోట్ల విడుదలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏలేరు ఆధునికీకరణ పనులపై మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో కాకినాడ ఎంపీ, కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ఎంఎం పళ్లంరాజు, రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ఏలేరు రిజర్వాయర్ కాలువలు, డ్రైన్ల ఆధునికీకరణ పనుల నిమిత్తం రూ.127.60 కోట్లకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి పనులు కూడా జరగనప్పటికీ రూ.10 కోట్ల పనులు పూర్తయినట్టు ఈ సమావేశంలో ఇంజనీర్లు ప్రకటించడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పూర్తయితే 64 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఈ పనులు పూర్తయ్యేలోపు భవిష్యత్తులో చేపట్టబోయే పనుల నిమిత్తం అవసరమయ్యే మరో రూ.155 కోట్ల విలువైన పనులకు అంచనాలు తయారు చేయాల్సిందిగా మంత్రులు ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం చూస్తుంటే ఈ పనులపై రాష్ర్ట ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ఈ సమావేశ విషయాలను కేంద్ర మంత్రి పళ్లంరాజు కాకినాడలో విలేకర్లకు విడుదల చేశారు. -
ఆస్తులు వెల్లడించని పల్లంరాజు, పురందేశ్వరి
న్యూఢిల్లీ: గడువు ముగిసి నెలరోజులు దాటిపోయినా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు ఎం.ఎం.పల్లంరాజు, డి.పురందేశ్వరి తమ ఆస్తుల వివరాలను ప్రకటించలేదు. మంత్రులకు సంబంధించిన నియమావళి మేరకు కేంద్ర మంత్రులైతే ప్రధానమంత్రికి, రాష్ట్ర మంత్రులైతే ముఖ్యమంత్రికి ఏటా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన గడువు గత ఆగస్టు 31తో ముగిసిపోయింది. అయినా మంగళవారం వరకు మొత్తం 77 మంది కేంద్ర మంత్రుల్లో 35 మంది తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వార్షిక వివరాలను ప్రధానికి అందజేయడంలో విఫలమయ్యారు. 32 మంది కేబినెట్ మంత్రుల్లో పల్లంరాజు సహా 18 మంది, 12 మంది స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రుల్లో ఏడుగురు, 33 మంది సహాయ మంత్రుల్లో పురందేశ్వరి సహా 17 మంది తమ ఆస్తుల వివరాలను దాఖలు చేయలేదు. కేబినెట్ మంత్రులు గులాం నబీ ఆజాద్, అజిత్ సింగ్, క పిల్ సిబల్, శ్రీప్రకాశ్ జైశ్వాల్, సహాయ మంత్రులు శశిథరూర్, ఆర్పీఎన్ సింగ్ తదితరులులు తమ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు. అయితే ఎ.కె.ఆంటోని, పి.చిదంబరం, శరద్‌పవార్, సుశీల్‌కుమార్ షిండే, వీరప్పమొయిలీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు ఆస్తులను వెల్లడించిన వారిలో ఉన్నారు. -
పల్లంరాజును అడ్డుకున్న సమైక్యవాదులు
-
కేంద్రమంత్రి పల్లంరాజుకు సమైక్య సెగ
-
మంత్రుల కమిటీపై నమ్మకం లేదు: పల్లంరాజు
అన్నవరం : రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీవోఎం (కేంద్ర మంత్రుల బృందం) మీద నమ్మకం లేదని కేంద్ర మంత్రి పల్లం రాజు అన్నారు. ఆయన సోమవారం అన్నవరంలో సత్యనారాయణ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ అంటోనీ కమిటీ నివేదిక రాకుండానే ....తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు రావటం బాధాకరమన్నారు. తాను ఎప్పటికీ సమైక్యవాదినేనని పల్లంరాజు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండా ఢిల్లీలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవటం తగదని అన్నారు. మరోవైపు మూడున్నర నెలలుగా జిల్లాకు దూరంగా ఉన్న పల్లంరాజు ఎట్టకేలకు సోమవారం జిల్లాలో అడుగు పెట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో జిల్లాలో అడుగు పెట్టేందుకు ధైర్యం చాలక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అలుపెరగకుండా జీతాలను వదులుకుని, కుటుంబ కష్టాలను సైతం ఖాతరు చేయని వేలాది మంది ఉద్యోగులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు 75 రోజులుగా జిల్లాలో సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం కంటికి కనబడలేదా అని విమర్శిస్తున్నారు. ఆయన పర్యటనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పల్లంరాజు నివాసం వద్ద కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. -
ఇన్నాళ్లూ ముఖం చాటేసి నేడు జిల్లాకు పళ్లంరాజు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మూడున్నర నెలలుగా జిల్లాకు దూరంగా ఉన్న కేంద్రమంత్రి పళ్లంరాజు ఎట్టకేలకు సోమవారం జిల్లాకు వస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ సమయంలో జిల్లాలో అడుగుపెట్టేందుకు ధైర్యం చాలక ముఖం చాటేసిన ఆయన ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. అలుపెరగకుండా జీతాలను వదులుకుని, కుటుంబ కష్టాలను సైతం ఖాతరు చేయని వేలాది మంది ఉద్యోగులతో పాటు సమాజంలోని వివిధ వర్గాలు 75 రోజులుగా జిల్లాలో సాగిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం కంటికి కనబడలేదా అని విమర్శిస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో ఇన్నాళ్లుగా అడుగుపెట్టకున్నా పళ్లంరాజుకు సమైక్యవాదుల నుంచి ఎదురైన అవమానాలు జిల్లాలో మరే ప్రజాప్రతినిధికీ ఎదురుకాలేదు. కాకినాడలో ఉద్యమకారులు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టడం, శవయాత్రలు చేయడం మొదలుకుని జేఎన్టీయూకే వద్ద స్త్రీ వస్త్రధారణలో ఆయన బొమ్మలను రూపొందించి నిలువెత్తు హోర్డింగ్‌లు పెట్టే వరకు చేసి నిరసనను చాటారు. ఆది నుంచి పార్టీ గాలి ఉంటే నెగ్గుకొస్తామనే సిద్ధాంతాన్ని నమ్ముకోబట్టే ఆయన సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతున్నా ప్రజల ఆకాంక్షలను ఏ కోశానా పట్టించుకోకుండా ఢిల్లీలో రాజీడ్రామాలాడుతూ కాలక్షేపం చేశారని ఉద్యమనేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధంతో పళ్లంరాజు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేయగల అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ ప్రజల ఆకాంక్షకంటే పదవిని కాపాడుకోవడమే ముఖ్యమన్నట్టు వ్యవహరించి చరిత్రహీనుడిగా మిగిలిపోయారని ఇంటా, బయటా విమర్శలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలో ఉండి ఏం చేసినట్టో.. జిల్లావైపు కన్నెత్తి చూడని పళ్లంరాజు ఢిల్లీలో సమైక్యాంధ్ర కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ప్రజలను నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన అనంతరం పళ్లంరాజు పార్టీ అధిష్టానం విభజనకు వెనకడుగు వేస్తున్నట్టు చెప్పారని మీడియాలో ప్రచారం జరిగింది. తీరా తెల్లారేసరికి తెలంగాణ ప్రాంత నేతల ఫిర్యాదుతో సోనియాగాంధీ నుంచి అక్షింతలు పడటంతో ఆ తరువాత పళ్లంరాజుకు మూగనోము తప్పలేదని సమైక్యాంధ్ర ఉద్యమనేతలు ఆక్షేపిస్తున్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఏపీఎన్జీఓలు ఇచ్చిన పిలుపునకు కూడా పళ్లంరాజు స్పందించిన దాఖలాలు లేవు. పదవికి రాజీనామా చేయకపోతే మానె.. తెలంగాణ నోట్‌ను కేబినెట్ మంత్రిగా ఉండి ఎందుకు వ్యతిరేకించలేదని ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విభజన నిర్ణయం ప్రకటించిన దగ్గర నుంచి టి నోట్ కేబినెట్‌కు వచ్చే వరకు పళ్లంరాజు ఈ ప్రాంతవాసిగా ఏమి చేశారని మండిపడుతున్నారు. మొదట్లో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన పళ్లంరాజు ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాలు తొందరపడొద్దనడంతో ఆలోచిస్తున్నానని చెప్పుకొచ్చారు. టి నోట్ కేబినెట్ ఆమోదం పొందాక కూడా రాజీనామాపై డ్రామాలాడుతున్న తీరుపై సర్వత్రా నిరసనలు పెల్లుబకటంతో చివరకు అయిష్టంగానే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పింది కాదు. జూన్ 30న కాకినాడలో జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నప్పటి నుంచి ఢిల్లీకే పరిమితమైన ఆయన ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఆయనను అడ్డుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. -
కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం నాడు విద్యాశాఖకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలకమైన సమావేశానికి హాజరు కాలేదు. విద్యాహక్కు, మధ్యాహ్నభోజనం లాంటి కీలకాంశాల గురించి నిర్ణయం తీసుకోడానికి ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇప్పటికే ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించిన పల్లంరాజు, సెంట్రల్ ఎడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. పల్లంరాజు హాజరు కాకపోవడంతో, ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద దీనికి అధ్యక్షత వహించారు. -
కీలక సమావేశానికి పల్లం రాజు హాజరవుతారా?
మధ్యాహ్న భోజనం, ఇతర అంశాలపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ) గురువారం నిర్వహించే కీలక సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఎంఎం పల్లం రాజు హాజరవుతారా అంశంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. రేపు జరుగనున్న సీఏబీఈ సమావేశంలో మధ్యాహ్న బోజన పథకంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో పల్లం రాజు హాజరుపై ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. బోధన, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పలు అంశాలపై జాతీయ సంస్థకు నివేదికను పల్లం రాజు అందించాల్సి ఉంది. పల్లం రాజు రాజీనామా సమర్పించిన తర్వాత పలు సమావేశాలకు అధికారులే హాజరవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా పల్లం రాజు లేనికారణంగా పలు సమావేశాలు రద్దయ్యాయి. పల్లం రాజు హాజరుకాకుంటే ఈ సమావేశానిక జతిన్ ప్రసాద్, లేదా శశి థరూర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర కేబినెట్ నోట్ కు ఆమోదం తెలిపిన తర్వాత నుంచి విధులకు పల్లం రాజు హాజరుకావడం లేదని తెలుస్తోంది. నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశానికి కూడా పల్లం రాజు కూడా హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నలుగురు కేంద్ర మంత్రులు ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిసి రాజీనామాలను అంగీకరించాల్సిందిగా కోరినప్పటికి ఎలాంటి హామీ లభించలేదు. -
మంత్రుల బృందంలో మార్పులు
సభ్యుల సంఖ్య ఏడుకు కుదింపు ఎం.ఎం.పల్లంరాజు తొలగింపు ఆంటోనీ, ఆజాద్, మొయిలీ, జైరాంలకు చోటు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)ను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. రెండు రోజుల క్రితమే తొమ్మిది మంది కేంద్ర మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఏర్పాటైన జీవోఎం సభ్యుల సంఖ్యను ఏడుకు కుదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జీవోఎంలో విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి పల్లంరాజుతో పాటు అయిదుగురు మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిని తప్పించి కొత్తగా రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ సహా నలుగురికి స్థానం కల్పించారు. సోమవారం ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసిన పల్లంరాజు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. తొలుత జీవోఎంలో సభ్యులుగా నియమితులైన కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, జలవనరుల శాఖ మంత్రి హరీశ్ రావత్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్, విద్యుచ్ఛక్తి శాఖను స్వతంత్రంగా నిర్వహిస్తున్న సహాయ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియాలను తప్పించారు. కొత్త జీవోఎంలో స్థానం కల్పించిన మంత్రులలో కేంద్ర రక్షణ మంత్రి ఆంటోనీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్చార్జి, ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్, పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ ఉన్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కొనసాగుతున్నారు. సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే సహాయ మంత్రి నారాయణసామి జీవోఎం ప్రత్యేక ఆహ్వానితునిగా వ్యవహరిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి హోం శాఖ నోట్‌ను కేబినెట్ సమావేశానికి సమర్పించిన రోజే పది మంది సభ్యులతో విభజన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్ర మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా తీర్మానించిన విషయం తెలిసిందే. విభజన అనంతరం హైద్రాబాద్ నగరం పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు న్యాయపరమైన, పాలనాపరమైన ఏర్పాట్లను సూచించడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ, ఆదాయ వనరులు, సిబ్బంది పంపిణీ వంటి అంశాలపై విధివిధానాలను సూచిస్తూ జీవోఎం ఆరు వారాలలో కేంద్ర మంత్రివర్గానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇన్: 1. ఆజాద్ 2. మొయిలీ 3. జైరాం రమేశ్ 4. ఆంటోనీ ఔట్: 1. కపిల్ సిబల్ 2. హరీశ్ రావత్ 3. కమల్‌నాథ్ 4. ఆస్కార్ ఫెర్నాండెజ్ 5. జ్యోతిరాదిత్య సింధియా 6. మాంటెక్ సింగ్ అహ్లూవాలియా 7. పల్లంరాజు -
కేబినెట్ భేటీకి పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశానికి కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు అయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావు, జైపాల్ రెడ్డి హాజరు అయ్యారు. సీమాంధ్ర విద్యుత్ సంక్షోభంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే భేటీ అనంతరం కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా పల్లంరాజు తన రాజీనామాను ప్రధానమంత్రికి ఇచ్చిన విషయం తెలిసిందే. -
పళ్లంరాజు ఇల్లు ముట్టడికి యత్నం
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజు ఇంటి ముట్టడి యత్నం శనివారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఒక దశలో పోలీసులు లాఠీచార్జిలో పదిమంది జేఏసీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. జేఏసీ నేతలలో 153 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జర్నలిస్టుల జేఏసీ సభ్యులు పళ్లంరాజు ఇంటి వద్ద ధర్నా చేసి ఇంట్లోకి చొచ్చు కెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదికఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు శనివారం ఎన్జీఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ నుంచి పళ్లంరాజు ఇంటివైపు ర్యాలీగా బయల్దేరారు. ఇంటికి వంద అడుగుల దూరంలో బారికేడ్లు, ముళ్ల కంచెలు వేసిన పోలీసులు జేఏసీ నేతలను ఇంటివైపు రాకుండా అడ్డుకున్నారు. 65 రోజులుగా ఎన్నోసార్లు పళ్లంరాజు ఇంటిని ముట్టడించినప్పుడు చిన్నపాటి సంఘటన కూడా చోటుచేసుకోలేదని, అలాంటప్పుడు ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారంటూ జేఏసీ నేతలు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఈ దశలో ఇంటివైపు చొచ్చుకెళ్లేందుకు యత్నించిన ఉద్యోగులు-పోలీసుల మధ్య తీవ్రతోపులాట జరిగింది. ఈ సమయంలో పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఫార్మసిస్ట్ అసోసియేషన్ పసుపులేటి శ్రీనివాస్, సర్వేయర్ ఉద్యోగ సంఘ నాయకులు ఆచారి, ఉపాధ్యాయ జేఏసీ కన్వీనర్ కవి శేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఉద్యోగులు ఆగ్రహం చెంది ముట్టడికి తీవ్రంగా యత్నించగా పోలీసులు వారిని ప్రతిఘటించారు. జేఏసీ నేతలు బూరిగ ఆశీర్వాదం, కవిశేఖర్, అనీల్ జాన్సన్ డీఎస్పీ విజయభాస్కరరెడ్డిని నిలదీశారు. తాము ఆది నుంచి ఉద్యమాన్ని ప్రశాంత వాతావరణంలోనే నిర్వహిస్తుంటే రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. వారికి మద్దతుగా జర్నలిస్టుల జేఏసీ మిత్రులు కూడా పళ్లంరాజు ఇంటి గేటు వద్ద ధర్నా చేశారు. మరొక వైపు పళ్లంరాజు ఇంటివైపు మళ్లీ దూసుకొస్తున్న జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, కన్వీనర్ పితాని త్రినాథ్, ఏపీఎన్జీఓ కాకినాడ నగర అధ్యక్షుడు అనిల్ జాన్సన్, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ నాయకులు ఎంఏ ఖాన్, ఇందేష్, పీఎన్ మూర్తిలతో పాటు 153 మందిని అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. కాగా లాఠీచార్జిలో గాయపడిన జేఏసీ నేతలను కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పరామర్శించారు. -
పళ్లంరాజు రాజీనామా చేయనట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను చేసిన రాజీనామాలపై తొందరవద్దని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ సూచించినట్లు కేంద్ర మంత్రి పళ్లంరాజు తెలిపారు. అయితే రాజీనామాలపై వెనక్కితగ్గారా, దాన్ని ఉపసంహరించుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన జవాబివ్వలేదు. సీమాంధ్ర ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించే అంశాన్ని కేంద్రం ఏర్పాటు చేసే మంత్రుల బృందం పరిశీలిస్తుందని సోనియా హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో పళ్లంరాజు సోనియాతో భేటీ అయ్యారు. శుక్రవారమే సోనియాతో భేటీ అయిన పళ్లంరాజు తన రాజీనామాపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా శనివారం ఆమెతో మరోమారు సమావేశమై రాజీనామాలు, సీమాంధ్రలోని పరిస్థితులపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కేబినెట్ నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేశానని మేడమ్‌కు తెలిపా. అయితే రాజీనామాలపై తొందరవద్దని మేడమ్ చెప్పారు. సీమాంధ్ర ప్రజల సమస్యలన్నింటినీ పరిశీలించి, పరిష్కరించేందుకు మంత్రుల బృందం కృషి చేస్తుందని చెప్పారు. మంత్రుల బృందంలో సభ్యునిగా, వారితో కలిసి పనిచేయాలని సూచించారు’’ అని పళ్లంరాజు పేర్కొన్నారు. -
రాజీనామాపై వెనక్కు తగ్గిన కేంద్ర మంత్రి పల్లంరాజు
న్యూఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తరువాత కేంద్ర మంత్రి పల్లంరాజు రాజీనామా విషయంలో వెనక్కు తగ్గినట్లు స్పష్టమవుతోంది. సోనియాతో సమావేశం ముగిసిన తరువాత రాజీనామా విషయమై ఆయన నోరుమెదపలేదు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన విధంగా సోనియా చెప్పారని తెలిపారు. తొందరపాటు వద్దని సోనియా చెప్పారన్నారు. మంత్రుల బృందంతో కలిసి పనిచేయమని సోనియా చెప్పినట్లు తెలిపారు. మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారా? ఎంపి పదవికి రాజీనామా చేస్తున్నారా? అన్న విషయమై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. -
కేంద్ర మంత్రి పళ్ళంరాజు ఫ్లెక్సీ ధ్వంసం
-
'విషాదకర ప్రకటనకు వారే సాక్షులు'
సీమాంద్ర చరిత్రలో ఓ విషాదకర ప్రకటనకు వారు సాక్షులుగా మిగిలిపోయారు. తెలంగాణ నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపే సందర్భంగా జరిగిన చర్చలోనూ పాల్గొన్నారు. కానీ తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం చెప్పకుండా ఆపలేకపోయారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇద్దరు మంత్రులు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారు. వారే కావూరి సాంబశివరావు, పల్లంరాజు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరి సాక్షిగానే తెలంగాణపై కేబినెట్ నోట్ కు ఆమోద ముద్ర పడిపోయింది. సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా... సమైక్యవాదులు రాజీనామాలు చేయండంటూ ఎంత డిమాండ్ చేసినా రాజీనామాలతో ఏం లాభం. పదవుల్లోనే ఉండి ఢిల్లీలో తెలంగాణను అడ్డుకుంటామంటూ ఎన్నో ప్రకటనలు చేశారు. రాష్ట్రాన్ని విడగొట్టనివ్వమన్నారు. ఎంతమంది రాజీనామాలు చేయమన్నా పదవులను పట్టుకుని వేలాడారు. కానీ చివరికి జరిగిందేంటీ..? కేంద్ర కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్‌పై సాగిన చర్చలో కావూరి, పల్లంరాజులు పాల్గొన్నారు. నోట్‌ను వ్యతిరేకించలేక, సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను కేంద్రమంత్రి మండలి ముందు ఉంచడంలో ఘోరాతిఘోరంగా విఫలమయ్యారు. అధిష్టానం ఆదేశాలతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. విభజన పాపాన్ని మూటగట్టుకున్నారు. తెలంగాణ నోట్‌పై కేబినెట్ నిర్ణయం తీసుకోవటంతో .....ఇక ప్రజలు తమమీద తిరగబడతారనుకున్నారో ఏమో మంత్రి పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధం అయ్యారు. భేటీ తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగలేమని చెప్పారు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని ప్రధాని నచ్చజెప్పారు. దీంతో రాజీనామాలపై వారెలాంటి నిర్ణయం తీసుకోలేదు. వారు ఈరోజు తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. -
ప్రధాని వారించినా.. రాజీనామాకే పళ్లం రాజు మొగ్గు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో పలువురు సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, మంత్రులు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ నిర్ణయానికి నిరసనగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి పళ్లం రాజు తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయవద్దని.. పదవిలో కొనసాగాలని పళ్లం రాజును కోరినట్టు సమాచారం. అయితే సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పళ్లం రాజు రాజీనామాకే మొగ్దు చూపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావులు రాజీనామా చేయగా, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాజంపేట ఎంపీ సాయి ప్రతాప్ లు తమ రాజీనామాలను ప్రకటించారు. రాష్ట్ర విభజనకు కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదు అని అమలాపురం ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యానించారు. -
కాకినాడలో కేంద్ర మంత్రి పళ్లంరాజు ఇంటి ముట్టడి
-
ఆ ఇద్దరికీ మరింత సెగ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో గట్టి షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పినిపే విశ్వరూప్ గురువారం సమైక్యాంధ్ర కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసినా ఎమ్మెల్యేగా కొనసాగుతానని హైదరాబాద్‌లో ప్రకటించారు. కాంగ్రెస్ పునరాలోచన చేసి, విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే పార్టీలో కొనసాగుతానని, అందుకు నవంబర్ ఒకటోతేదీ డెడ్‌లైన్ అని చెప్పారు. అప్పటికీ విభజనపై కాంగ్రెస్ వెనక్కు తగ్గకపోతే పార్టీకి కూడా గుడ్‌బై చెపుతానన్నారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు అందచేసి తక్షణం ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. విశ్వరూప్ రాజీనామా చేయడంతో జిల్లాలో మరో రాష్ట్ర మంత్రి తోట నరసింహం, కేంద్రమంత్రి ఎంఎం పళ్లంరాజుల మాటేమిటని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మంత్రి పదవులను పట్టుకు వేలాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు తోట, పినిపే ఆగస్టు నెల మొదట్లో వారం రోజుల తేడాలో రాజీనామా చేశారు. అయితే రాజీనామాలను ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్‌కు అందచేశారు. కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు రాజీనామా మాట అటుంచి సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమైన తరువాత కనీసం జిల్లావైపు కన్నెత్తి చూడనేలేదు. రాష్ట్ర మంత్రుల రాజీనామాలను సమైక్యవాదులు రాజీడ్రామాలుగా అభివర్ణిస్తూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వారి చిత్తశుద్ధిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే జిల్లాలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో సమైక్యవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అమలాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి విశ్వరూప్ రాజీనామాతో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని గవర్నర్‌ను కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని కూడా విశ్వరూప్ తెలిపారు. కాగా, విశ్వరూప్ రాజీనామా చేయడంతో తోట నరసింహం రాజీనామా కోసం సమైక్యవాదులు ఎదురు చూస్తున్నారు. తాను ప్రారంభంలోనే రాజీనామా చేశానని మంత్రి తోట చెపుతున్న మాటలకు విశ్వసనీయత లేదని వారు విమర్శిస్తున్నారు. 15 రోజులుగా మంత్రి తోట ఎక్కడకు వెళితే అక్కడ సమైక్యవాదుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. తాను రాజీనామా చేశానని చెపితే సరిపోదని, విశ్వరూప్ మాదిరిగా రాజీనామాను గవర్నర్‌కు అందచేసి ఆమోదింపజేసుకోవాలని ఇప్పుడు సమైక్యవాదులు తోటను డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ తోట రాజీనామా డ్రామాగానే మిగులుతుందంటున్నారు. పళ్లంరాజు ఏం చేస్తారో? మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 58 రోజుల్లో ఏ ఒక్క రోజూ కేంద్ర మంత్రి పళ్లంరాజు జిల్లాలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయారు. పైకి మాత్రం సమైక్యాంధ్ర ముందు తన మంత్రి పదవి పెద్ద విషయం కాదని చెప్పుకొన్నారు. కానీ మంత్రి పదవిని వదల్లేక, సమైక్యాంధ్ర ఉద్యమానికి భయపడి ఢిల్లీకే పరిమితమయ్యారు. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు చేస్తేనే విభజన నిర్ణయం వెనక్కు తీసుకుంటుందని సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్, ఏపీఎన్జీఓల అధ్యక్షుడు అశోక్‌బాబు పదేపదే చెపుతున్నా పళ్లంరాజు స్పందించకపోవడం సమైక్యాంధ్రపై ఆయన చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందని జిల్లా జేఏసీ ప్రతినిధులంటున్నారు. ప్రజాప్రతిఘటన ఎదురైనా మిగిలిన కేంద్ర మంత్రులు తమ జిల్లాల్లో ఏదో సందర్భంలో పర్యటించినా పళ్లంరాజు ఆ సాహసం చేయలేదు. ఆయన జిల్లాలో అడుగుపెడితే తరిమికొట్టాలని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సహా పలువురు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో గురువారం పళ్లంరాజు సోనియాగాంధీతో 20 నిమిషాల సేపు జరిపిన భేటీలో ఏ విషయాలు చర్చించారు, సమైక్యాంధ్ర కోసం అసలు ఏమైనా మాట్లాడారా అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆయన పదవిని వదులుకుంటారా లేక, పదవిని అంటిపెట్టుకుని ఢిల్లీకే పరిమితమవుతారో వేచి చూడాల్సిందే. -
సోనియాతో పళ్లంరాజు 20 నిమిషాల పాటు చర్చ
ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర మంత్రులు గురువారం సన్నద్ధమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా పళ్లంరాజు ముందుగా ఆమెతో సమావేశమైయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సోనియాకు విన్నవించినట్లు తెలుస్తోంది. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో ముందుకెళ్తున్న సంకేతాలే స్పష్టంగా వెలువడుతుండటంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు డీలా పడ్డారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో భవిష్యత్ కార్యాచరణపై గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు. -
అన్యాయం జరిగిన రోజు నుంచి పదవుల్లో ఉండం:పల్లంరాజు
ఢిల్లీ: ఏ రోజైతే తమ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఆ రోజు నుంచి తాము తమ పదవుల్లో ఉండం అని కేంద్ర మంత్రి పల్లంరాజు చెప్పారు. ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌లో పర్యటించాలని కోరినట్లు తెలిపారు. మూడు ప్రాంతాల వారికి నష్టం జరగకూడదని చెప్పామన్నారు. తాము పదవుల్లో ఉన్నందున తమపై వ్యతిరేకత వస్తుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు సీమాంధ్ర మంత్రులను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్ నేతల ఇళ్లముట్టడి
సాక్షి నెట్వర్క్: వేర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఎదిరించలేని ఆ పార్టీ నేతల నిర్వాకంపై సమైక్యవాదులు మండిపడ్డారు. బుధవారం సీమాంధ్ర జిల్లాల్లోని పలువురి కాంగ్రెస్ నేతల, మంత్రుల, ఎంపీల ఇళ్లను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఆయన ఇంటివద్ద లేకపోవడంతో ఇంటిగోడకు డిమాండ్ లేఖను, గులాబీ పువ్వును అంటించారు. అక్కడి నుంచి ర్యాలీగా అమలాపురం ఎంపీ జి.వి.హర్షకుమార్, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల ఇళ్లకు వెళ్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు కూడా ఆ సమయంలో ఇళ్ల వద్ద లేకపోవడంతో, రాజీనామా చేయండి అంటూ రాసిన లేఖను గులాబీలతో ఇంటి ముందు ఉంచి వెనుదిరిగారు. కాకినాడలో ప్రభుత్వవాహన డ్రైవర్ల సంఘం సభ్యులు కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని ముట్టడించి గంటపాటు డప్పులు వాయిస్తూ నినాదాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని ఇంటివద్ద సమైక్యవాదులు ధర్నా నిర్వహించారు. నరసాపురంలో ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడి నివాసాన్ని ముట్టడించారు. విజయనగరంలో బొత్స ఇంటి ముట్టడిలో స్వల్పఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకోగా, న్యాయవాదులు రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. -
'సీమాంధ్ర ప్రజల డిమాండ్ ను ఆంటోని కమిటీకి వివరించాం'
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అనంతరం చోటుచేసుకున్న పరిస్థితులను వివరించడానికి ఆంటోని కమిటీతో సీమాంధ్ర నేతలు భేటి అయ్యారు. ఈ భేటిలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి పళ్లంరాజు మాట్లాడుతూ.. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను ఆంటోని కమిటీకి వివరించామని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని.. అదే విషయాన్ని వివరించామన్నారు. మా ప్రాంతంలో నెలకొన్న భావాలు, నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకోవాలని కోరామని వెల్లడించారు. సీమాంధ్ర ప్రజల భావాల్ని అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నామన్నారు. ఆంటోని కమిటీపై నమ్మకం ఉంది అని అన్నారు. ఆంటోని కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీమాంధ్ర ప్రజలు అనుకుంటున్నారని తెలిపామన్నారు. రాష్ట్రం విడిపోతే కాంగ్రెస్ కు నష్టం వాటిల్లుతుందని ఆంటోని కమిటీకి తెలిపామని పళ్లం రాజు మీడియాతో అన్నారు. అంతకుముందు ఆంటోని కమిటితో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. -
‘కేంద్ర మంత్రి పళ్లంరాజు రాజీనామా చేయాలి’
కాకినాడ: కేంద్ర మంత్రి పదవికి పళ్లంరాజు రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పళ్లంరాజు తన పదవికి రాజీనామా చేయాలని..లేకుంటే ఆమరణ దీక్ష చేస్తానని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీపై కూడా ఆయన మండిపడ్డారు. ఆంటోనీ కమిటీ వాదనలు చెప్పడం అంటే చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని అభిప్రాయపడ్డారు. -
'సీమాంధ్ర నేతలు సమర్థంగా వాదనలు విన్పించారు'
న్యూఢిల్లీ: ఆంటోని కమిటితో సీమాంధ్రుల సమావేశం ముగిసింది. ఆంటోని కమిటీతో మంత్రులు కాంగ్రెస్ వార్ రూమ్‌లో సమావేశమైయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్ సింగ్.. విభజన తర్వాత ఉత్పన్నమైయ్యే సమస్యలను మంత్రులు వినిపించారన్నారు. మంత్రి తోట నరసింహం భార్య వాణి దీక్షను విరమించాల్సిందిగా దిగ్విజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 19, 20 తేదీల్లో ఆంటోని కమిటీ తిరిగి సమావేశమవుతుందని ఆయన తెలిపారు. విభజన తర్వాతే వచ్చే పరిస్థితులపై సీమాంధ్ర ఎంపీలు తమ వాదనను బలంగా వినిపించారన్నారు. వారు చెప్పిన విషయాలను కమిటీ నమోదు చేసుకుందని దిగ్విజయ్ తెలిపారు. విభజన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను వివరించామని మంత్రి పల్లంరాజు తెలిపారు. ఈ సమావేశంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై చర్చించామన్నారు. సీమాంధ్రలో వాస్తవ పరిస్థితులను ఆంటోనికి కమిటీకి వివరించామని, దిగ్విజయ్ సింగ్ త్వరలో హైదరాబాద్‌కు వస్తానని చెప్పారని పల్లంరాజు తెలిపారు. అందరికీ సమన్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరినట్లు చిరంజీవి తెలిపారు -
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
న్యూస్‌లైన్ నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమ కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రదర్శనలు పదునెక్కుతున్నాయి. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, వినూత్న రీతిలో వేషధారణలు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక నినాదంతో తొమ్మిదో రోజున కూడా పోరు కొనసాగించారు. ఈ ఆందోళనలు అన్ని వర్గాలనూ కదిలిస్తున్నాయి. జేఏసీలుగా ఏర్పాటయ్యేందుకు ఒకొక్కరుగా ముందుకు వస్తూ ఉద్యమంలో క్రియాశీలురవుతున్నారు. సమైక్య పోరులో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో గురువారం నాటి ఉద్యమ ఘట్టాలివి.. విశాఖలో మహిళా ఉద్యోగులకు పసుపు, కుంకుమ, జాకెట్ అందించి, వాటిని మంత్రులకు పంపించాలని సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన నిర్వహించింది. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుంటే వాళ్ల ఇళ్లలోనే వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. అగనంపూడిలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన 48గంటల దీక్ష రెండోరోజూ కొనసాగింది. గురువారం వైఎస్సార్సీపీ నేతలు కొణ తాల రామకృష్ణ, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. సుప్రీంలో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 12న జరగాల్సిన సింహగర్జన 14కు వాయిదా పడింది. కేంద్రమంత్రి పళ్లంరాజు ఇల్లు ముట్టడి తూర్పుగోదావరి జిల్లాలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 జిల్లాల ఉపాధధి హామీ అసిస్టెంట్ల సంఘాలు రాజమండ్రిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. చెవిటి, మూగ పాఠశాల విద్యార్థులు పొట్టి శ్రీరాములు చిత్రంతోపాటు, తెలుగుతల్లి కన్నీరు పెడుతున్నట్టు, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దనే అర్థం వచ్చే చిత్రాలతో ర్యాలీ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని కాకినాడలో ముట్టడించారు. అమలాపురంలో 400 మీటర్ల జాతీయ జెండాను సమైక్యవాదులు ఊరేగించారు. ఎంపీ కనుమూరి, మంత్రి పితాని ఇళ్ల ముట్టడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటిని, పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని ఇంటిని ఉద్యమకారులు ముట్టడించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ జోరు వానలో రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కూరగాయల వర్తకులూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఉద్యమంలో ముందుండి నడవాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో డిమాండ్ చేశారు. పాలకొల్లులో డ్వాక్రా మహిళల ర్యాలీలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగి ఒకరు శిరోముండనం చేయించుకున్నారు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కనిపించడంలేదని.. ఆచూకీ తెలపాలని కోరుతూ పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ నేత కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశారు. విజయనగరంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా హిజ్రాలుభజనలు చేస్తూ శవయాత్ర నిర్వహించారు. భోగాపురం, రామభద్రాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంట వార్పు చేశారు. చీపురుపల్లిలో కుక్కలకు కేసీఆర్ మాస్క్‌లు అమర్చారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూమ్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన వంటా వార్పు కార్యక్రమంలో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సోనియాగాంధీపై గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల కన్వీనర్ మల్లు విజయకుమార్‌రెడ్డి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కావాలని బాపట్లలో జరిగిన సభలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. సింహాసనంపై కుక్కతో నిరసన అనర్హులను అందలం ఎక్కిస్తే.. అంటూ సింహాసనంపై కుక్కను కూర్చొపెట్టి పశుసంవర్ధక శాఖ అధికారులు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకూ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. మేం కూడా వ్యతిరేకం అంటూ గంగిరెద్దులుతో తలలూపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడలో, పార్టీ జిల్లా కన్వీనర్ జగ్గయ్యపేటలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పొదుపు సంఘాల మహిళలు, పాల వ్యాన్లతో డెయిరీ మిల్క్ కార్మికులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు ఉద్యమంలో పాల్గొన్నారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పుత్తూరులో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు రోజా ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో అన్ని వర్గాల వారూ భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. రోడ్లపైనైనా చదువుకుంటాం.. రాష్ట్ర విభజనకు ఒప్పుకోం.. అని విద్యార్థులు రోడ్లపైనే కూర్చుని చదువుకుంటూ తెలిపిన నిరసన ఆకట్టుకుంది. కర్నూలులో అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం జరిపారు. వైఎస్సార్ జిల్లా కడపలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టగా రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నిర్మానుష్యంగా మారింది. న్యాయవాదులు మృదంగం వాయిస్తూ, కర్రసాము చేస్తూ నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు తొమ్మిదో రోజూ రోడ్డెక్కలేదు. రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బద్వేలులో గురువారం బంద్ జరిగింది. సమైక్య పావురం కొరుక్కుపేట(చెన్నై), న్యూస్‌లైన్: అందరూ సమైక్యంగా ఉండాలని కోరుతూ గురువారం చెన్నైకి చెందిన ఎవర్గ్రీన్ విద్యాశ్రమం విద్యార్థులు వినూత్న రీతిలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 3 నుంచి 8వ తరగతికి చెందిన 12 వేల మంది విద్యార్థులు 15 వేల చదరపు అడుగుల వైశాల్యంలో శాంతి పావురం ఆకృతిలో కూర్చుని సమైక్య సందేశాన్ని చాటారు. ‘కలిసి జీవిస్తే కోటి లాభాలు’, ‘దేశం ముక్కలైతే ముప్పు’ అంటూ నినాదాలు చేశారు. హిరోషిమా, నాగసాకి దాడులకు గుర్తుగాను, దేశంలో వినిపిస్తున్న విభజన నినాదాలకు వ్యతిరేకంగా శాంతి కపోతం సందేశాన్ని ఇచ్చినట్లు విద్యాశ్రమం ప్రిన్సిపాల్ కలైఅరసి పేర్కొన్నారు. ఆగని మరణాలు.. సాక్షి, ఏలూరు/ఉయ్యూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రంలో మృత్యుఘోష ఆగడం లేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తొమ్మిది మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ(55) బుధవారం రాత్రి టీవీలో ఢిల్లీ పెద్దల ప్రకటనలను చూస్తూ భావోద్వేగంతో గుండెపోటుకు గురయ్యూడు. హైదరాబాద్‌లో వడ్రంగి పని చేసుకుని జీవిస్తున్న మొగల్తూరులో సవర నాగరాజు(29) విభజన ప్రకటన నేపథ్యంలో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రాష్ట్రం విడిపోతే బతుకుదెరువు కష్టమవుతుందన్న ఆందోళనతో గుండెపోటుకుగురై తనువు చాలించాడు. చింతలపూడిలో గుంజి చుక్కమ్మ (45), ఉండి గ్రామానికి చెందిన కిలారి విష్ణు (32), కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన పండ్రాజు వెంకటేశ్వరరావు(58)లు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కల్లూరుకు చెందిన బడిగ హనుమంతప్ప (52), రొద్దం మండలం పెద్దపల్లికి చెందిన ఈడిగ లక్ష్మినారాయణ (40), కంబదూరుకు చెందిన సురేంద్ర శర్మ (50), కూడేరు మండలం పీ.నారాయణపురానికి చెందిన కురుబ ఎర్రిస్వామి(55) విభజన వార్తలు టీవీలో చూస్త్తూ గుండెపోటుతో మృతి చెందారు. -
అధిష్టానానికి.. ఫిర్యాదుల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కేంద్రమంత్రి పల్లంరాజుపై టీ-ఎంపీలు, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిపై పల్లంరాజు, జేడీ శీలం, రేణుకా చౌదరిలపై గోవర్ధన్‌రెడ్డి సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. బుధవారం లోక్‌సభ మొదటిసారి వాయిదా పడిన తర్వాత సభలో సోనియా గాంధీతో కేంద్రమంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి మాట్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్‌లు అక్కడకు చేరుకున్నారు. ఆంటోనీ కమిటీ పని పూర్తయ్యేంతవరకూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోతుందని పల్లంరాజు వెల్లడించినట్లు ప్రచురించిన ఒక ఆంగ్ల దినపత్రిక కథనాన్ని అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. విభజనతో సీమాంధ్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలను పరిశీలించి పరిష్కారాలు కనుగొనేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్న కమిటీ నివేదిక వచ్చాకే ప్రభుత్వంలో అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మాత్రమే తాను విలేకరులకు చెప్పినట్లు సోనియాకు పల్లంరాజు వివరించినట్లు తెలిసింది. మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రులతో సహా సీమాంధ్రవాసులంతా తెలంగాణ నుండి వెళ్లిపోవాల్సిందేనని సీనియర్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలు కూడా సోనియా వద్ద ప్రస్తావనకు వచ్చినట్లు కూడా తెలిసింది. పాల్వాయి అలా మాట్లాడడం తప్పేనని అభిప్రాయపడిన కాంగ్రెస్ అధ్యక్షురాలు తాను ఆయనతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్రియ ఆపొద్దు.. వేగం పెంచండి: టీ-ఎంపీలు సీమాంధ్ర ప్రజల అభ్యర్థనల పరిశీలన పూర్తయ్యేవరకు రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తామని కాంగ్రెస్ అధిష్టానం నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని సీమాంధ్ర నేతలు ప్రచారం చేస్తున్న దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత ఎంపీలంతా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేదీతో 20 నిమిషాలపాటు సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని కోరారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలకు మద్దతుగా వ్యవహరించిన జేడీ శీలం, రేణుకాచౌదరిలపై అధినేత్రి సోనియాగాంధీకి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. -
సోనియాతో ముగిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ