కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు | Pallam Raju skips crucial education meet | Sakshi
Sakshi News home page

కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు

Published Thu, Oct 10 2013 8:21 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు - Sakshi

కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం నాడు విద్యాశాఖకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలకమైన సమావేశానికి హాజరు కాలేదు.

మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం నాడు విద్యాశాఖకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలకమైన సమావేశానికి హాజరు కాలేదు. విద్యాహక్కు, మధ్యాహ్నభోజనం లాంటి కీలకాంశాల గురించి నిర్ణయం తీసుకోడానికి ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది.

ఇప్పటికే ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించిన పల్లంరాజు, సెంట్రల్ ఎడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. పల్లంరాజు హాజరు కాకపోవడంతో, ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద దీనికి అధ్యక్షత వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement