Jitin prasada
-
యూపీ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. ఏకంగా కేబినెట్ మంత్రి దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పంపించారు. కాగా ఖతిక్ యూపీ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నారు. ఇటీవల సీఎం తనను అవమానిస్తున్నారని, గత 100 రోజుల నుంచి తనకు పనులు అప్పజెప్పడం లేదని దినేష్ ఖతిక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేగాక తన శాఖపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఎంతో బాధను అనుభవించే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ‘నేను దళితుడు అవ్వడం వల్ల పక్కకు పెట్టారు. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మంత్రిగా నాకు అధికారాలు లేవు. రాష్ట్ర మంత్రిగా పనిచేయడం వల్ల దళిత వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదు. నన్ను ఏ సమావేశానికి పిలవరు. నా మంత్రిత్వశాఖ గురించి ఏం చెప్పరు. ఇది దళిత సమాజాన్ని అవమానించడమే’నని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే పార్టీ నేతలు ఖతిక్తో మాట్లాడి, బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చదవండి: తెలంగాణలో ధాన్యం కొనుగోలు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి ఫైర్ దీనికి తోడు మరోమంత్రి జితిన్ ప్రసాద సైతం సీఎం యోగిపై ఆగ్రహంతో ఉన్నట్లు, అతను కూడా రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీలోని బీజేపీ అధిష్టానంతో భేటీ అయ్యారు. కాగా ప్రసాద పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. పలువురు అధికారులు బదిలీల కోసం లంచం తీసుకున్నట్లు తేలడంతో ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించింది. డిపార్ట్మెంటల్ బదిలీల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన ఐదుగురు సీనియర్ పీడబ్ల్యూడీ అధికారులను మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో యూపీ ప్రభుత్వంపై ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యూపీ ఎన్నికలకు నెలరోజుల ముందే ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వాల్లో అసంతృప్తి బయటపడటం చాలా అరుదు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రే రాజీనామా చేయడంతో కాషాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి సెగ రాజుకోవడంతో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగికి పెద్ద ఎద్దురుదెబ్బ తగిలినట్లైంది. చదవండి: గో ఫస్ట్ విమానానికి తప్పిన పెనుముప్పు.. రెండు రోజుల్లో మూడోసారి -
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యూపీ మంత్రివర్గ విస్తరణ
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురిని కేబినెట్లో చేర్చుకున్నారు. వీరిలో ఒకరు బ్రాహ్మణ నాయకుడు కాగా, ముగ్గురు ఓబీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ నాయకుడు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు ఊహించినట్లుగానే కేబినెట్లో స్థానం దక్కింది. ఓబీసీ వర్గానికి చెందిన ఛత్రపాల్ గంగ్వార్ (ఎమ్మెల్యే), ధరంవీర్ ప్రజాపతి(ఎమ్మెల్సీ), డాక్టర్ సంగీతా బల్వంత్ బిండ్(ఎమ్మెల్యే), ఎస్సీ సామాజిక వర్గం నుంచి దినేష్ ఖతీక్(ఎమ్మెల్యే), పల్తూరామ్(ఎమ్మెల్యే), ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంజీవ్ కుమార్(ఎమ్మెల్యే) మంత్రులయ్యారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) బ్రాహ్మణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికేనా! ఉత్తరప్రదేశ్ ఓటర్లలో బ్రాహ్మణులు 13 శాతం ఉన్నారు. రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారులైన బ్రాహ్మణులు క్రమంగా బీజేపీ వైపు చేరిపోయారు. ఠాకూర్ సామాజికవర్గం నాయకుడైన సీఎం యోగి పట్ల వారిలో అసంతృప్తి రగులుతోంది. యోగి ప్రభుత్వంలో తమను అణచివేస్తున్నారన్న భావన బ్రాహ్మణుల్లో పెరిగిపోతోంది. పరిస్థితిని గమనించిన బీజేపీ అధిష్టానం బ్రాహ్మణ వర్గాన్ని మంచి చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాదపై వల విసిరింది. తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని హమీ ఇచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది జూన్‌లో బీజేపీలో చేరారు. అనుకున్నట్లుగానే మంత్రి పదవిని కట్టబెట్టింది. తద్వారా బ్రాహ్మణుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించే బాధ్యతను ఆయనపై మోపింది. చదవండి: (Punjab: 15 మందితో నూతన మంత్రి వర్గం) -
ఫిరాయింపులే మహా‘ప్రసాదం’
ఇంకో ఏడాదిలోగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ వారి వలలో ఒక చేప పడింది. ఆనవాయితీ ప్రకారం ఆ చేపను మీడియా ముందు ప్రదర్శించారు. ప్రదర్శన ఢిల్లీలో నిర్వ హించారు. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షులు హాజరై సదరు చేపను స్వీకరించారు. ఈ హడావుడి ప్రకారం చూస్తే దొరికింది వాటమైన సొరచేపేనన్న విశ్వాసం కలగడం సహజం. నిజమే.. ఆ చేప పేరు జితిన్ ప్రసాద. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు. ఆ పార్టీకి అదే అత్యున్నత స్థాయి కమిటీ. కేంద్రమంత్రిగా కూడా మన్మోహన్ కేబినెట్లో పనిచేశారు. వాళ్ల నాన్నగారు జితేంద్ర ప్రసాద కూడా కాంగ్రెస్‌లో అత్యున్నత పదవులు అలంకరించారు. పదేళ్లపాటు ఇద్దరు ప్రధానమంత్రులకు రాజకీయ సలహాదారుగా వ్యవహరించారు. ఇన్ని అర్హతలున్న జితిన్‌ను సొరచేప కేటగిరిలోనే వేసుకోవాలి కదా! కానీ ఎన్నికల ట్రాక్ రికార్డు చూస్తే భిన్నాభిప్రాయం కలుగుతుంది. 2014 లోక్‌సభ, 2017 యూపీ అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఘోరంగా ఓడిపోయారు. మూడోసారి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ లెక్కన చూస్తే సొరచేప మాదిరి హడావుడి చేసేటంత దృశ్యం జితిన్‌కు లేదు. పిత్త పరకకు ఎక్కువ, బొచ్చెకు తక్కువ అనుకోవలసి వస్తుంది. సీనియర్, జూనియర్ ప్రసాదలకు కాంగ్రెస్ పార్టీ బోలెడన్ని అవకాశాలను కల్పించింది. కిరీటాలు, భుజ కీర్తులను మార్చి మార్చి అలంకరించింది. వీరు ఉత్తరప్రదేశ్‌కి చెందిన బ్రాహ్మణ వర్గం వారు కావ డమే అందుకు కారణం. జాతీయ రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ కీలకం. అక్కడి సామాజిక సమీకర ణల ప్రకారం బ్రాహ్మణ వర్గం ముఖ్యమైనది. తండ్రీ కొడుకులిద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఎంత సాధి కారతను ప్రసాదించినా యూపీ బ్రాహ్మణ వర్గం మాత్రం ఈ ప్రసాదాలను కళ్లకద్దుకోలేదు. కాంగ్రెస్‌పార్టీ లక్నో పీఠానికి దూరమై ముప్పయ్ మూడేండ్లు గడిచిపోయాయి. యూపీ కాంగ్రెస్ అధి కార వైరాగ్యానికి గల ముఖ్య కారణాల్లో ఆ పార్టీకి బ్రాహ్మణ వర్గం దూరం కావడం మొదటిది. దూరమైన తన సామాజిక వర్గాన్ని మళ్లీ కాంగ్రెస్ దరి చేర్చడానికి ప్రసాదలు చేసిందేమీలేదు. ఈ నేపథ్యంలో జితిన్‌ప్రసాద కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ పార్టీకి ఒరగబెట్టేదేమీలేదు. పోయి నంత మాత్రాన నష్టం జరగడానికి ఆ పార్టీలో మిగిలింది కూడా ఏమీలేదు. ఇదీ స్థూలంగా జితిన్ ప్రసాద రాజకీయ జన్మ వృత్తాంతము. ఏ ప్రయోజనాన్ని ఆశించి ఎన్నికల ముందు ‘ఏక్ ఝలక్’ మాదిరిగా జితిన్ షోను బీజేపీ నిర్వహించింది? నరేంద్రమోదీ, అమిత్‌షా టీమ్ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని చేపట్టినప్పటి నుంచి పొలిటికల్ ఈవెంట్ మేనేజ్మెంట్ను ఒక వ్యూహంగా రూపొం దించారు. గతంలో రాష్ట్ర స్థాయిలో ఈ వ్యూహాన్ని టీడీపీ నాయకుడు చంద్రబాబు అనుసరించేవారు. దాని వలన ఆయనకు కొన్ని తాత్కాలిక ప్రయోజనాలు దక్కిన మాట వాస్తవం. ఈ ఫిరాయింపులనే ప్రధానాస్త్రంగా ప్రయోగించి మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ పోరాడింది. తృణమూల్ కాంగ్రెస్‌లో దాదాపు నెంబర్ టూగా చెలామణైన ముకుల్ రాయ్‌తో సహా అనేకమంది ప్రముఖులకు బీజేపీ కాషాయ తీర్థం పోసి కమలం పువ్వులతో అలంకరించింది. 34 మంది అధికార పార్టీ ఎమ్మె ల్యేలు తమవైపు ఫిరాయించేలా గ్రంథం నడిపింది. విపరీత ప్రచార పటాటోపంతో అధికార తృణ మూల్ కాంగ్రెస్ ‘ఖేల్ ఖతం’ (ఆటముగిసింది) అనే భ్రాంతిని కల్పించింది. ఖేలాహోబే (ఆటా డుదాం) అంటూ ఎదురుతిరిగిన తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలిగింది. ఎంత ప్రచార హోరు సృష్టించినా బెంగాల్లో బీజేపీ గెలవలేకపోయింది. మరి యూపీలోనూ అదే గేమ్‌ను ఎందుకు ఎంచుకున్నట్టు? బీజేపీ నాయకుల అంతరంగం మరో విధంగా ఉండవచ్చు. బెంగాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 2016లో జరిగిన ఎన్నికల్లో, ఆ పార్టీకి పట్టుమని పదిశాతం ఓట్లు పడలేదు. ముగ్గురు మాత్రమే గెలవగలిగారు. మరి ఐదేళ్లు తిరిగేసరికి 79 సీట్లను, 36 శాతం ఓట్లను ఎలా సాధించగలిగింది. తమ వ్యూహం వల్లనే అధికారపు అంచులదాకా చేరుకోగలిగామని బీజేపీ విశ్వసిస్తున్నట్టు ఆ పార్టీ యూపీ సన్నాహాల తీరును బట్టి అర్థమవుతుంది. బెంగాల్లో ఐదారేళ్లకు పూర్వం బీజేపీకి పెద్దగా బలం లేదు. అధికార తృణమూల్ కాంగ్రెస్ వారి దాడుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున కిందిస్థాయి సీపీఎం కార్యకర్తలు, సానుభూతిపరులు బీజేపీలో చేరారు. అందువల్ల 2016లో బీజేపీ బలం 10 శాతం ఓట్లకు పెరిగింది. ఆ తరువాత ఫిరాయింపులపై ఫోకస్ పెట్టడం, మమతా బెనర్జీకి తామే ప్రత్యామ్నాయంగా ఫోకస్ చేసుకోవడం కలసి వచ్చింది. మరి ఉత్తరప్రదేశ్‌లో బలంగా ఉన్న బీజేపీకి ఫిరాయింపుల అవసరం దేనికి? యోగీజీ సర్కారుపై ప్రజల్లో విముఖత ఏర్పడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజమేనా? మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖిలేశ్ పార్టీ మెరుగైన ఫలితాలు రాబట్టడం కలవరం కలిగిస్తున్నదా? ఈ కారణంగానే బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు తెర తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ ఎత్తుగడలకోసం, వ్యూహాలకోసం ఎడాపెడా ఫిరాయింపులకు పాల్ప డితే మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్లు భావించగలమా? కొన్ని విలువల కోసమో సిద్ధాంతాల కోసమో, ఉమ్మడి ఆశయాల సాధన కోసమో, రాజకీయ విధేయతలను మార్చుకోవ డాన్ని అర్థం చేసుకోవచ్చు. అది కూడా కొన్ని పద్ధతులకూ, ప్రమాణాలకూ, సంప్రదాయాలకూ అను గుణంగా ఉండాలి. కేవలం అధికారమే పరమావధిగా జరిగే ఫిరాయింపుల వల్ల ఎల్లవేళలా ఫలితాలు సాధించలేరు సరికదా, మన ప్రజాస్వామ్య వ్యవస్థనే ప్రమాదంలోకి తోసినవారవుతారు. -
కాంగ్రెస్ సంక్షోభం.. పొమ్మంటే పోతాం: కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడైన జితిన్ ప్రసాద, బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల నడుమ.. మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇంకోవైపు పార్టీలో సమూలమైన మార్పులు చేయాల్సిందేనని సోనియా గాంధీకి జీ-23 అసమ్మతి నేతలు గతంలోనే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతోనే తాము ఉంటామని, ఒకవేళ అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో మాత్రం చేరబోనని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ‘‘బీజేపీలో చేరడమంటే నేను చచ్చిపోయినట్లే లెక్క’ అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. ఇక బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపైనా సిబాల్ స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందని ఆయన బాధపడ్డారు. ఇక పార్టీని వీడడంలో జితిన్ కారణాలు.. జితిన్ ఉండొచ్చని, అయితే పార్టీని వీడినందుకు కాకుండా.. వీడేందుకు జతిన్ చెప్పిన కారణాలనే విమర్శించాలని కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌కూ అల్టిమేటం పార్టీ తమ వాదన వినడంలో విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని సిబాల్ వ్యాఖ్యానించారు. పార్టీలో సంస్కరణలకు సమయం ఆసన్నమైందని, సీనియర్ల మాటల్ని నాయకత్వం ఇకనైనా వినాలని కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అది నిజం. అవి పరిష్కారం అయ్యే వరకు వేలేత్తి చూపుతూనే ఉంటాం. నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్లే అని కపిల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని లేకుంటే పార్టీ తీవ్ర సంక్షోభానికి గురవుతుందని కపిల్ తేల్చి చెప్పారు. చదవండి: కాంగ్రెస్ తీరు మారినట్లేనా? -
‘మీ లవర్ వేరొకరితో వెళ్తే.. ఓసారి అద్దంలో చూస్కోండి’
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్) వేరొకరితో వెళ్తే ఆమెను నిందించొద్దు.. ఒకసారి మీ ముఖం అద్దంలో చూస్కోండి’ అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ట్వీట్ చేశాడు. పార్టీని నాయకులంతా వీడుతుండడంపై సొంత పార్టీపైనే ఓ నాయకుడు చేసిన ట్వీట్ ఇది. వెళ్లేవారిని తప్పు పట్టకూడదని.. పార్టీ మారాలని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. కేంద్ర మాజీ మంత్రి, రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి బుధవారం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అతడి రాజీనామా ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం చేకూరనుంది. అయితే అతడు పార్టీని వీడడంపై కాంగ్రెస్ పార్టీ భిన్నంగా స్పందించింది. పార్టీని వీడినందుకు జితిన్ ప్రసాదకు ధన్యవాదాలు అని తెలిపింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ షా భిన్నంగా స్పందించాడు. సాధారణ ప్రపంచంలో వేటగాడిగా ఉన్న కాంగ్రెస్‌లోనే ఏదో సమస్య ఉందని ట్వీట్ చేశాడు. ఇక మరో విధంగా స్పందిస్తూ ‘ఒకవేళ మీ ప్రేయసి ఇతరులతో వెళ్తిఏ ఆమెను నిందించకుండా మీ ముఖాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలి’ అని హితవు పలికారు. ఈ విధంగా సొంత పార్టీ తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఎందుకంటే వరుసగా పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వారిని ఆపడంలో పార్టీ విఫలమవుతోందని పరోక్షంగా చెబుతున్నాడు. ఇక పార్టీని వీడిన జితిన్ ప్రసాదపై ప్రశంసల వర్షం కురిపించాడు. జితిన్ మంచి నాయకుడు అని, అతడితో ఇటీవల మాట్లాడినట్లు తెలిపాడు. జితిన్ ప్రసాదతో బీజేపీకి లాభం.. కాంగ్రెస్‌కు నష్టం అని పేర్కొన్నాడు. అతడిని పార్టీలో చేర్చుకున్నందుకు బీజేపీని నిందించనవసరం లేదు. నేనయినా అదే చేసేవాడిని. అది రాజకీయం అంటూ ట్వీట్ చేశాడు. చదవండి: భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత.. If your girlfriend walks out on you with your best rival, look in the mirror. Don't blame her. 😀 — Sanjay Jha (@JhaSanjay) June 9, 2021 Jitin Prasad is BJP's gain, Congress's loss. Period. I just spoke to him recently; Jitin is a gentleman, genial and generous-hearted. You can't blame the BJP for picking up disgruntled leaders from the Congress. If I was Amit Shah I would do the same. That's politics. — Sanjay Jha (@JhaSanjay) June 9, 2021 -
భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద తాను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు, ఆయన ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఇంటికి చేరుకొని తన నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో జితిన్ ప్రసాద యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉక్కు మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2019 కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ కీలకంగా వ్యవహరించారు. అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద..‘ బ్రాహ్మిన్ చేత్న పరిషత్’ను గత సంవత్సరం ప్రారంభించారు. తాజాగా, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వెస్ట్‌బెంగాల్ జనరల్ సెక్రెటరీగా నియమించింది. ఇలాంటి తరుణంలో జితిన్ ప్రసాద బీజేపీలోకి చేరుతుండటం రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక కీలకంగా మారింది. చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం -
లేఖ: యూపీ కాంగ్రెస్ నేతపై చర్యలు!?
న్యూఢిల్లీ: పార్టీలో సంస్కరణలు, నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల తీరుపై అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే లేఖ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక బీజేపీ హస్తం ఉందంటూ సందేహాలు లేవనెత్తారు. ఇక తాజాగా.. లేఖపై సంతకం చేసిన ఉత్తరప్రదేశ్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నాయకులు తీర్మానం చేయడం కలకలం రేపింది. గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జితిన్ తీరును ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: ‘తల్లిలాంటి వారు.. మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి’) ‘‘ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం జతిన్ ప్రసాద ఒక్కరే ఆ లేఖపై సంతకం చేశారు. ఆయన కుటుంబ చరిత్రను గమనిస్తే.. వాళ్లు గాంధీ ఫ్యామిలీకి ఎంత వ్యతిరేకులో అర్థమవుతుంది. సోనియా గాంధీకి పోటీగా నిలబడిన ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ సోనియాజీ మాత్రం జితిన్ ప్రసాదకు లోక్‌సభ టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. ఇందుకు ప్రతిగా ఆయన ఏం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. జితిన్ ప్రసాద తీరును తీవ్రంగా ఖండిస్తోంది’’ అని ప్రహ్లాద్ పటేల్ పేరిట ఉన్న ఓ లేఖ మీడియాలో చక్కర్లు కొడుతోంది.(చదవండి: అప్పుడే కాంగ్రెస్ కొత్త సారథి ఎన్నిక!?) ఇక ఈ విషయంపై మరో సీనియర్ నేత, లేఖపై సంతకం చేసిన వారిలో ఒకరైన కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘‘యూపీ కాంగ్రెస్ జితిన్ ప్రసాదను టార్గెట్ చేయడం దురదృష్టకరం. ఇలా సమయం వృథా చేయడం కంటే బీజేపీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మంచిది’’అని ట్వీట్ చేశారు. ఇందుకు మరో నేత మనీశ్ తివారి మద్దతూ పలుకుతూ జితిన్‌కు అండగా నిలిచారు. కాగా గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, మనీశ్ తివారి, జితిన్ ప్రసాద తదితర 23 మంది నాయకులు పార్టీ అధినాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగాలని తీర్మానించింది. వాడివేడి చర్చల అనంతరం అసంతృప్త నేతలపై ఎలాంటి చర్యలు ఉండవని సోనియా స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్‌ను వీడనున్న సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో జితిన్ ప్రసాద కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన ప్రసాద యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. కాగా, ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. జితేంద్ర ప్రసాద 2000 సంవత్సరంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, జితిన్ ప్రసాద త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతానని సాగుతున్న ప్రచారాన్ని జితిన్ ప్రసాద తోసిపుచ్చారు. తాను బీజేపీలో చేరతాననే వార్తలు ఊహాజనితమని, వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జితిన్ ప్రసాద పార్టీని వీడతారనే ప్రచారం అవాస్తవమని, నిరాధారమైన వార్తలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. -
కీలకమైన విద్యాశాఖ భేటీకి పల్లంరాజు గైర్హాజరు
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పల్లంరాజు గురువారం నాడు విద్యాశాఖకు సంబంధించి ఢిల్లీలో జరిగిన కీలకమైన సమావేశానికి హాజరు కాలేదు. విద్యాహక్కు, మధ్యాహ్నభోజనం లాంటి కీలకాంశాల గురించి నిర్ణయం తీసుకోడానికి ఈ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇప్పటికే ప్రధానమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించిన పల్లంరాజు, సెంట్రల్ ఎడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) సమావేశానికి హాజరుకాలేదు. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. పల్లంరాజు హాజరు కాకపోవడంతో, ఆ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద దీనికి అధ్యక్షత వహించారు.