సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో జితిన్ ప్రసాద కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన ప్రసాద యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు.
కాగా, ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. జితేంద్ర ప్రసాద 2000 సంవత్సరంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, జితిన్ ప్రసాద త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
మరోవైపు తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతానని సాగుతున్న ప్రచారాన్ని జితిన్ ప్రసాద తోసిపుచ్చారు. తాను బీజేపీలో చేరతాననే వార్తలు ఊహాజనితమని, వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జితిన్ ప్రసాద పార్టీని వీడతారనే ప్రచారం అవాస్తవమని, నిరాధారమైన వార్తలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment