resign to congress party
-
శివసేన గూటికి చతుర్వేది
న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం ఆ పార్టీని వీడారు. ఆ వెంటనే ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. చతుర్వేది కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి పంపారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా, మీడియా విభాగం ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. పార్టీలో కొందరు నాయకులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది వారాలుగా తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆమె కొద్దిరోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అధిష్టానం సస్పెండ్ కూడా చేసింది. అయితే, ఆ పార్టీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి జ్యోతిరాదిత్య జోక్యంతో ఇటీవల వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో తన సేవలకు విలువలేదని, అందుకే పార్టీని వీడుతున్నానని రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రియాంక చతుర్వేదిని ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ శివసేన కార్యకర్తలకు మంచి సోదరి లభించిందని అన్నారు. తన స్వస్థలం ముంబై అని, అందుకే శివసేనలో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణలేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. -
కాంగ్రెస్‌ను వీడనున్న సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముంచుకొచ్చిన తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో జితిన్ ప్రసాద కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన ప్రసాద యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. కాగా, ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులకు రాజకీయ సలహాదారుగా పనిచేశారు. జితేంద్ర ప్రసాద 2000 సంవత్సరంలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాగా, జితిన్ ప్రసాద త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరతానని సాగుతున్న ప్రచారాన్ని జితిన్ ప్రసాద తోసిపుచ్చారు. తాను బీజేపీలో చేరతాననే వార్తలు ఊహాజనితమని, వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు జితిన్ ప్రసాద పార్టీని వీడతారనే ప్రచారం అవాస్తవమని, నిరాధారమైన వార్తలని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. -
అధికార వాహనం వదిలి ఆటోలో ఇంటికి...
హైదరాబాద్: విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాల బాట పట్టారు. కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం, ఎమ్మెల్యే పదవులతో సహా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బాటలో మిగతా సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పయనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ అధికారిక వాహనాన్ని వదిలి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వదిలి ఆటోలో వెళ్లిపోయారు. అయితే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం లేదు. కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు నిన్న రాజీనామా చేశారు.