న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద తాను భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు, ఆయన ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ ఇంటికి చేరుకొని తన నిర్ణయాన్ని వెల్లడించారు. గతంలో జితిన్ ప్రసాద యూపీఏ-2 హయాంలో కేంద్ర మంత్రిగా ఉక్కు మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 2019 కాంగ్రెస్ తిరుగుబాటు నేతల బృందం జీ-23లో జితిన్ కీలకంగా వ్యవహరించారు.
అయితే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద..‘ బ్రాహ్మిన్ చేత్న పరిషత్’ను గత సంవత్సరం ప్రారంభించారు. తాజాగా, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ వెస్ట్‌బెంగాల్ జనరల్ సెక్రెటరీగా నియమించింది. ఇలాంటి తరుణంలో జితిన్ ప్రసాద బీజేపీలోకి చేరుతుండటం రాజకీయంగా రసవత్తరంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ చేరిక కీలకంగా మారింది.
చదవండి: ఉచిత వ్యాక్సినేషన్, రేషన్.. కేంద్రంపై రూ.1.45 లక్షల కోట్ల భారం
Comments
Please login to add a commentAdd a comment