ఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇరవై నిమిషాల పాటు చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర మంత్రులు గురువారం సన్నద్ధమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా పళ్లంరాజు ముందుగా ఆమెతో సమావేశమైయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సోనియాకు విన్నవించినట్లు తెలుస్తోంది. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు.
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంతో ముందుకెళ్తున్న సంకేతాలే స్పష్టంగా వెలువడుతుండటంతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు డీలా పడ్డారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో భవిష్యత్ కార్యాచరణపై గురువారం ఢిల్లీలో సమావేశమై చర్చలు జరిపారు.