ఆరు లక్షల మంది టీచర్ల కొరత: పల్లంరాజు
దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది టీచర్ల కొరత ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పల్లంరాజు చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించడానికి ఖాలీలను భర్తీచేయడంతో తగిన ప్రోత్సాహాలను అందిస్తామన్నారు.
నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పల్లంరాజు తెలిపారు. అలాగే విద్యార్థినులు, మైనార్టీ బాలుర హాజరు శాతం పెంచాల్సిన అవసరముందని చెప్పారు. బీహార్లో చాప్రాలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది పిల్లలు చనిపోయిన సంఘటన గురించి ఓ పశ్నకు సమాధానంగా.. మధ్యాహ్న భోజన పథకం అమలులో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆన్ని రాష్ట్రాలకు సూచించామని బదులిచ్చారు. జాతీయ పర్యవేక్షణ కమిటీ ఈ పథకాన్ని సమీక్షిస్తున్నట్టు పల్లంరాజు చెప్పారు.