'హైదరాబాద్లో భయంగా సీమాంధ్రులు'
హైదరాబాద్ : హైదరాబాద్లో సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం భయాందోళనతో ఉన్నారని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం ద్వారానే వారికి సరైన రక్షణ కల్పించగలమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను యూటీ చేయాలని తాము గట్టిగా కోరుతున్నామని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణం కాగానే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా తొలగించవచ్చని పల్లంరాజు పేర్కొన్నారు.