
కేబినెట్ భేటీకి పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశానికి కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు అయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావు, జైపాల్ రెడ్డి హాజరు అయ్యారు. సీమాంధ్ర విద్యుత్ సంక్షోభంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే భేటీ అనంతరం కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా పల్లంరాజు తన రాజీనామాను ప్రధానమంత్రికి ఇచ్చిన విషయం తెలిసిందే.