Kishore Chandra Deo
-
వారు నకిలీ గిరిజనులే..
సాలూరు: నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్.పి. భంజ్‌దేవ్‌తో పాటు అర కు పార్లమెంటరీ అభ్యర్థి కిషోర్‌చంద్రదేవ్ గిరిజనులు కాదంటూ గిరిజన ఉద్యోగుల సంఘం న్యాయసలహాదారుడు రేగుమహేశ్వరరావు విడుదల చేసిన కరపత్రాలు హల్చల్ చేస్తున్నా యి. భంజ్‌దేవ్ తాత, తండ్రి ఒరియా క్ష త్రియగా ప్రభుత్వడాక్యుమెంట్లలో క్లియర్‌గా ఉందని, 1900 సంవత్సరం నుంచి 1979వరకు క్షత్రియగానే చూపుతున్నాయని పేర్కొన్నారు. అయితే 1979లో భంజ్‌దేవ్ కొండదొరగా కులధ్రువీకరణ పత్రంపొందారని, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కరపత్రాల్లో పొందుపరిచారు. గిరిజనులకు కేటాయించిన నియోజకవర్గంలో అసలైన గిరిజనుడికే ఓటేయాలని కోరారు. అలాగే కిషోర్ చంద్రదేవ్ తాత క్షత్రియగా తెలిపే 1901 నాటి రికార్డుల నుంచి కిషోర్‌చంద్రదేవ్ 1 957 నాటి స్కూల్ రికార్డుల్లో కూడా క్ష త్రియగా నే ఉందని, వీరు చెప్పుకుంటున్న కొండరాజు కులం ఎస్టీ జాబితాలోనే లేదని వివరించారు. -
కాంగ్రెస్ టీడీపీల మధ్య సీక్రెట్ బట్టబయలు..
సాక్షి, విజయనగరం : కాంగ్రెస్-టీడీపీల మధ్య రహస్య ఒప్పందం బట్టబయలైంది. మాజీ కేంద్ర మంత్రి, ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వైరిశర్ల కిషోర్ చంద్రదేవ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం. విజయనగరం జిల్లా కురుపాం కోటలో కార్యకర్తల సమావేశంలో ఆయన ...చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ మధ్య జరిగిన తెర వెనక ఒప్పందాన్ని బయటపెట్టారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని చంద్రబాబు, రాహుల్ మధ్య అవగాహన కుదిరిందన్న ఆయన... అందులో భాగంగానే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ కలిపి పోటీ చేయవని కిషోర్ చంద్రదేవ్ తేల్చి చెప్పారు. అయితే కేంద్రంలో తమ రెండు పార్టీలు పనిచేస్తాయని పేర్కొన్నారు. అందుకే తాను టీడీపీలో గెలిచి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పని అయినా.. మీకు చేసి పెడతా అని కార్యకర్తలకు... హామీ ఇచ్చారు. కాగా విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పేరున్న వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సుమారు 40ఏళ్లుగా ఆ పార్టీలో ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేబినెట్లో ఆయన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితానికి దుష్టశక్తులు పని చేస్తున్నాయన్న కిషోర్ చంద్రదేవ్... అలాంటివాళ్ల మధ్య ఇమడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటే మాత్రం మంత్రి పదవి చేపట్టి అన్ని పనులు చేసిపెడతా అంటూ ఆయన బహిరంగంగా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో పనికి రాని కాంగ్రెస్ పార్టీ.... కేంద్రంలో మాత్రం కిషోర్ చంద్రదేవ్‌కు ఎలా పనికి వస్తుందబ్బా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. హస్తాన్ని వీడి పసుపు కండువా కప్పుకున్న కిషోర్ చంద్రదేవ్ తాజా వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే కాంగ్రెస్ నాటకం నడుస్తుందనేది స్పష్టంగా తెలిసిపోతోంది. -
అశోక్ గజపతిరాజు మళ్లీ డుమ్మా!
-
అశోక్ గజపతిరాజు మళ్లీ డుమ్మా!
అమరావతి: వారం రోజుల క్రితం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంతో పాటు భోగాపురం ఎయిర్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమాలకు దూరమైన ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు మరోసారి పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన కిశోర్ చంద్రదేవ్ ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి సైతం అశోక్ గజపతిరాజు హాజరు కాలేదు. దాంతో వరుసగా టీడీపీ కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపట్ల గజపతిరాజు అసంతృప్తిగా ఉన్నారు. దానిలో భాగంగానే టీడీపీ కార్యక్రమాలకు అశోక్ గజపతిరాజు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్‌గజపతి రాజు రాకపోవడానికి కారణం ఇదేనని సమాచారం. కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమన్న వాదన కూడా ఉంది. ఇందుకు అశోక్ గజపతిరాజు గైర్హాజరీ కావడం మరింత బలాన్ని చేకూర్చింది. కిశోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరిక గురించి తనతో చంద్రబాబు చర్చించకపోవడం అశోక్‌గజపతికి కోపం తెప్పించిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కిశోర్ పార్టీలో చేరిక కార్యక్రమానికి ఆయన గైర్హాజరైనట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ పార్టీకి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ రాజీనామా
-
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి షాక్
సాక్షి, విజయనగరం : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో మిత్రులతో చర్చించిన అనంతరం ఏ పార్టీలో చేరేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. రాజీనామా పత్రాన్ని శనివారమే పార్టీ అధిష్టానానికి పంపానని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని అన్నారు. కాంగ్రెస్ రూపొందించిన ఏపీ విభజన చట్టంలో లోపాలున్నాయని విమర్శించారు. పార్టీలో తనలాంటి సీనియర్లకు గౌరవం లేదని వాపోయారు. ఏళ్ల నుంచి పనిచేస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వ పాలనతో దేశం ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు. బీజేపీతో కలిసి ఉండే పార్టీలోకి వెళ్లనని చెప్పారు. -
టీడీపీ అధికారంలోకి వస్తుందనుకోలేదు
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం సోనియా ఆలోచన వల్లే వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మల్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇప్పుడు బీజేపీ దానిని కాపీకొట్టి స్వచ్ఛ భారత్ పేరుపెట్టి ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కేంద్రం , తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేదన్నారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని ఎవరు ఊహించలేదని, కాంగ్రెస్ పార్టీలో 7 సార్లు, 8 సార్లు గెలిచిన నాయకులూ కూడా ఓడిపోయారని అన్నారు. -
జెయింట్ కిల్లర్... కొత్తపల్లి గీత!!
వైరిచర్ల కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్... ఐదుసార్లు లోక్‌సభకు ఎంపికై, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లాంటి అత్యున్నత నిర్ణాయక మండలిలో సభ్యత్వం ఉండి, కేంద్ర మంత్రిగా అపార అనుభవం సాధించిన నేత. జీవితంలో ఒక్కసారి కూడా ఓటమి అన్నది ఎరుగని ధీరుడు. అలాంటి ఉద్దండుడితో ఢీకొన్నప్పుడు కొత్తపల్లి గీతను అంతా కొండ.. పొట్టేలుతో పోల్చారు. కానీ, అంతటి గొప్ప రాజకీయ చరిత్ర ఉన్న కిశోర్ చంద్రదేవ్‌ను ఓడించి.. విశాఖ జిల్లా అరకు నుంచి లోక్‌సభలోకి ప్రవేశించడానికి సిద్ధమయ్యారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కొత్తపల్లి గీత. కురుపాం రాజా వైరిచర్ల దుర్గాప్రసాద దేవ్, రాజమాత శోభలతాదేవిల కుమారుడైన కిశోర్ చంద్రదేవ్ అంటే కాంగ్రెస్ అధిష్ఠానంలో కూడా మంచి పేరుంది. అలాంటి పెద్ద నాయకుడిని లోక్‌సభ ఎన్నికలలో ఓడించడం అంటే చిన్న విషయం కానే కాదు. కానీ, ఆ ఘనతను సాధించి చూపించి జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.. కొత్తపల్లి గీత. గిరిజనులలో అట్టడుగు వర్గమైన వాల్మీక తెగకు చెందిన ఆమె కుటుంబం.. రాష్ట్రంలోనే మొట్టమొదటగా గ్రూప్-1 పట్టా పొందింది. గీత తండ్రి కొత్తపల్లి జాకోబ్ తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలానికి చెందినవారు. ఆయన బాటలోనే.. గీత కూడా గ్రూప్-1 సాధించారు. 2010 వరకు ప్రభుత్వ సర్వీసులలో ఉన్న ఆమె, స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి, సేవారంగంలోకి ప్రవేశించారు. గీతాస్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటుచేసి, దాని ద్వారా నాలుగు జిల్లాల్లో ఉన్న గిరిజనుల అభ్యున్నతికి కృషి చేశారు. ఆమె సేవాభావాన్ని గుర్తించడంతో పాటు.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ప్రజల అవసరాలు, సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కిశోర్ చంద్రదేవ్‌కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే అరకు వాసులు గీతను తమ ఎంపీగా ఎన్నుకున్నారు. ఆమెకు మొత్తం 2,17,637 ఓట్లు వచ్చాయి. కిశోర్ చంద్రదేవ్‌కు కేవలం 20,507 ఓట్లు మాత్రమే రావడంతో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. రెండోస్థానంలో టీడీపీ అభ్యర్థిని గుమ్మడి సంధ్యారాణి నిలిచారు. ఆమెకు 2,00,094 ఓట్లు వచ్చాయి. దాంతో గీతకు 17,543 ఓట్ల మెజారిటీ వచ్చినట్లయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తన మనసును కలచివేసిందని, ప్రజాసేవ పుణ్యం వల్లే ఆయన మరణానంతరం కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని గీత అన్నారు. అందుకే తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. నాలుగు జిల్లాల్లో 40 సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న అరకు నియోజకవర్గ అభివృద్ధికి కొత్త భాష్యం చెబుతానని, అన్నివేళలా అందుబాటులో ఉండి ప్రజాశ్రేయస్సుకు పాటు పడతానని హామీ ఇచ్చారు. -
కిషోర్ చంద్రదేవ్ వాహనంపై దాడి కేసులో ఒకరి అరెస్ట్
విశాఖ: కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్ వాహనంపై దాడి చేసిన ఘటనలో ఓ నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు బయల్దేరిన కిశోర్ చంద్రదేశ్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గంగాధర్ వర్గీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెబల్ అభ్యర్ధి గంగాధర్స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. కిశోర్ చంద్రదేవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గంగాధర్ రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. కిశోర్ చంద్రదేవ్ నామినేషన్ వేయడాన్ని అడ్డుకునేందుకు గంగాధర్ వర్గీయులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. -
కిశోర్ చంద్రదేవ్ నామినేషన్లో ఉద్రిక్తత
-
కిశోర్ చంద్రదేవ్ నామినేషన్లో ఉద్రిక్తత
అరకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్ నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్ దాఖలు చేసేందుకు బయల్దేరిన కిశోర్ చంద్రదేశ్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గంగాధర్ వర్గీయులు దాడి చేశారు. దాంతో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు అక్కడ 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. కిశోర్ చంద్రదేవ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ గంగాధర్ రెబెల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. -
'సీమాంధ్ర రాజధానిగా విశాఖే బెస్ట్'
విశాఖ : సీమాంధ్రకు విశాఖ రాజధానిని చేయాలని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ మరోసారి డిమాండ్ చేశారు. కొత్త రాజధానికి విశాఖ అనుకూలమైన ప్రాంతమని ఆయన బుధవారమిక్కడ వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు స్వయంప్రతిపత్తి పదేళ్లు ఇవ్వాలని కిషోర్ చంద్రదేవ్ సూచించారు. విశాఖ ఏజెన్సీ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం విశాఖపట్టణమేనని, సీమాంధ్ర ప్రాంతానికి విశాఖపట్టణమే రాజధానికి సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచడం కన్నా విశాఖను రాజధానిని చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కిషోర్ చంద్రదేవ్ గతంలో కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకి లేఖ కూడా రాశారు. కిశోర్ చంద్రదేవ్ విశాఖ జిల్లా అరకు నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
ఏటా రూ. 30 కోట్ల ఐఏపీ నిధులు
రాజవొమ్మంగి, న్యూస్‌లైన్ : ఏజెన్సీ అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్/ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఐఏపీ) క్రింద తూర్పుగోదావరి జిల్లాకు రెండేళ్లుగా ఏడాదికి రూ. 30 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నట్టు కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలిపారు. రహదారుల అభివృద్ధి, తాగునీరు, భవనాల నిర్మాణానికి మరో ఏడాది కూడా మరో రూ. 30 కోట్ల నిధులు విడుదలయ్యే అవకాశం వుందన్నారు. కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్ బుధవారం రాజవొమ్మంగి మండలంలో పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జడ్డంగి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ లో సర్పంచ్ కొంగర మురళీ కృష్ణ అధ్యక్షతన ఇందిరాక్రాంతి పథం, ఉపాధిహామీ పథకాలపై సమీక్షాసమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ఐఏపీ నిధుల కేటాయింపులో అరకు పార్లమెంటు నియోజకవర్గానికి పూర్తి న్యాయం జరిగేలా కృషిచేశానన్నారు. జడ్డంగి నుంచి దోనెలపాలెం తదితర 10 గ్రామాలకు వెళ్లే రహదారిపై గల మడేరు వాగుపై రూ. 2.5 కోట్ల ఐఏపీ నిధులతో నిర్మించనున్న వంతెనకు, 36 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ. 3.4 కోట్ల తో ఏర్పాటుకానున్న ఆవాస రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. అక్కడే మండలప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో సర్వశిక్షా అభియాన్ నిధులు రూ. 5.3 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు. రాజవొమ్మంగి ఆశ్రమోన్నతపాఠశాల ఆవరణలో రూ. 95 లక్షల నాబార్డు నిధులతో నిర్మించనున్న అదనపు వసతి గృహానికి భూమి పూజచేశారు. సూరంపాలెంలో రూ. 15 లక్షలతో రూపుదిద్దుకొన్న రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం వైపు వెళ్లారు. ఎమ్మెల్యే కోసూరి కాశీవిశ్వనాథ్, రాజవొమ్మంగి సర్పంచ్ చీడిపల్లి సుభద్రమ్మ, కలెక్టర్ నీతూ ప్రసాద్, ఐటీడీఏ పీఓ గంధం చంద్రుడు, ఆర్డీఓ శివశంకర ప్రసాద్, స్థానిక ఎంపీడీఓ సత్యనారాయణ, తహశీల్దార్ రవీంద్రకుమార్, డీఈఈలు వేంకటేశ్వరరావు, జగన్నాథరావు, ఏఎస్పీ విజయరావు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖను రాజధాని చేయడమే మేలు
కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పాలకొండ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరాన్ని రాజధాని చేయడం సీమాంధ్ర ప్రజలకు లాభదాయకమని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని రాష్ట్రానికి మధ్యనే ఉండాల్సిన అవసరం లేదని, అన్ని సౌకర్యాలు ఉన్న చోట రాజధాని ఏర్పాటు ఎంతో లాభదాయకమన్నారు. రాజధాని ఏర్పాటుకు కావాల్సినంత భూమి విశాఖలో అందుబాటులో ఉందన్నారు. -
తెలంగాణ బిల్లు ఆర్థికపరమైన బిల్లే....
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ అన్నారు. విభజన బిల్లు ద్వారా వివిధ ప్రాంతాలకు, కొత్త రాజధానికి నిధులు కూడా కేటాయించాల్సి ఉంటుందని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అందుకనే తెలంగాణ బిల్లు... ఆర్థికపరమైన బిల్లేనని కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ బిల్లును లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ బిల్లు ఆర్థిక బిల్లు కాదని కేంద్ర మంత్రి చిదంబరం గట్టిగా వాదిస్తున్నారు. ప్రస్తుతం పెడుతున్న బిల్లులో ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు లేవని ఆయన చెప్పుకొస్తున్నారు. దీనిపై సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశం అవుతోంది. ఆర్థిక బిల్లు అవుతుందా, లేదా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం న్యాయ సలహాను కోరింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాజ్యసభ ముందుకు రావాల్సిన బిల్లు వెనక్కి వెళ్లింది. రేపు కూడా బిల్లు పార్లమెంటుకు వచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఎల్లుండి గురువారం తొలుత లోకసభలో బిల్లును ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఎంత గగనం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ :‘నేను మీ వాడినే.. మీ సమస్యలన్నింటినీ నా సమస్యలే అనుకుంటా.. నా శక్తియుక్తులన్నీ వాటి పరిష్కారానికే ధారపోస్తా’.. ప్రతి ఎన్నికలకు ముందూ ప్రజల సమక్షానికే వెళ్లి రాజకీయ నాయకులు పలికే చిలక పలుకులివి. ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓట్లతో చట్టసభల్లో ప్రతినిధులుగా ఎన్నికైన వారికి, మంత్రి పదవులు దక్కిన వారికి ఆనక ప్రజలను, ప్రజల సమస్యలను పట్టించుకునేందుకు.. ఏళ్లు గడిచినా తీరికే చిక్కదు. తమ కుర్చీ ప్రజలు మెచ్చి ఇచ్చిందేనని, వారి రుణం తీర్చుకోవడమంటే వారిచ్చిన అధికారాన్నీ, పదవినీ వారి సమస్యల పరిష్కారానికి వెచ్చించడమేనని గుర్తు చేసినా గుర్తు రానంత మతిమరపురాయుళ్లయి పోతారు. అయితే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని గుర్తుకు వచ్చేసరికి మాత్రం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలంటూ సుడిగాలి పర్యటనలు చేసేస్తారు. అరకు ఎంపీ, కేంద్ర గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అచ్చుగుద్దినట్టు ఆ బాపతు నాయకుడేనని తూర్పు మన్యంలోని గిరిజనులు ఎత్తిచూపుతున్నారు. ఎప్పుడో రెండేళ్ల క్రితం ఒక్కసారి తళుక్కున మెరిసిన ఆయన మళ్లీ ఇంతకాలానికి ఆదివారం మన్యంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హల్చల్ చేయడం గిరిజనులను విస్తుపోయేలా చేసింది. 2009 సార్వత్రిక ఎన్నికల తరువాత తమ ప్రాంతానికి (అరకు పార్లమెంటు పరిధిలోని రంపచోడవరం నియోజకవర్గం) ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను రెండోసారి మాత్రమే చూడాల్సి రావడం తమ ప్రారబ్దమని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణానైన్నా విడుదలవుతుందనే సంకేతాలే కేంద్రమంత్రికి గిరిజనులు తిరిగి గుర్తుకు వచ్చేలా చేసినట్టు కనిపిస్తోందని గిరిజన సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 2009 ఎన్నికల తరువాత 2011 సెప్టెంబరు 24న రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం మండలాల్లో ప్రారంభోత్సవాలు చే సిన కిశోర్‌చంద్రదేవ్ తర్వాత ఈ ప్రాంతాన్ని తొంగి చూడలేదంటున్నారు. ఆయనను మళ్లీ చూసేలోగా రెండు క్యాలెండర్లు మారాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పర్యటన ఎన్నికల గిమ్మిక్కే.. కాగా మంత్రి ఇప్పుడు కూడా గతంలో మాదిరే రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, అడ్డతీగల మండలాల్లో సుమారు రూ.23.40 కోట్లతో 30 పనులకు ఒకే రోజులో శ్రీకారం చుట్టేశారు. పీఎంజీఎస్‌వై పథకంలో గంగవరం మండలం పాతరామవరం-భజనపల్లి రహదారి నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నా ప్రారంభోత్సవం చేశారు. పీఆర్ నిధులతో గంగవరం-లక్కొండ మధ్య రోడ్డు నిర్మాణం కూడా ఇంకా పూర్తికాలేదు. ఇంకా 40 శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. అయినా హడావిడిగా ప్రారంభోత్సవం చేసేశారు. అలాగే మారేడుమిల్లిలోని కస్తూరిబా గాంధీ పాఠశాల నిర్మాణం ఎన్నడో పూర్తి అయిపోయింది. బడి మధ్యలోనే మానేసిన పిల్లలను గత డిసెంబరు నెలలోనే ఆ పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. అటువంటి పాఠశాలను మంత్రి కొత్తగా ప్రారంభించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు కాక మరేమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రెండేళ్ల తరువాత వచ్చిన కేంద్రమంత్రి మరోసారి మన్యంకు వచ్చే అవకాశం ఉంటుందో, లేదో అనే ముందుచూపుతోనే ఇవన్నీ చేసినట్టు ఉందంటున్నారు. రెండేళ్ల క్రితం మంత్రి మన్యం పర్యటనకు వచ్చినప్పుడు రంపచోడవరం సమీపంలో పెదగెద్దాడ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆ వంతెన పనులు ప్రారంభం కానేకాలేదు. పాత వాటికి దిక్కూమొక్కూలేదు, కొత్తవాటికి శ్రీకారం చుట్టినా అవి ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయన్న ఆదుర్దాతో ముందస్తుగా వచ్చినందుకు సంతోషించాలో, పూర్తవని పనులు హడావిడిగా ప్రారంభించడం ద్వారా తమను మరోసారి వెక్కిరిస్తున్నారని విచారించాలో తెలియడం లేదని గిరిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. -
భద్రాచలం ముమ్మాటికీ సీమాంధ్రదే
హైదరాబాద్ : భద్రాచలం డివిజన్ ముమ్మాటికీ సీమాంధ్రకు చెందినదేనని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ అందుకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. తెలంగాణ బిల్లు వెనక్కి పంపడం సరైన విధానం కాదని కిశోర్ చంద్రదేవ్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీకి వచ్చింది ముసాయిదా మాత్రమేనని... దీనిపై సుదీర్ఘ చర్చ జరిపి మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొండ కుమ్మరులను ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు ప్రభుత్వం తక్షణం ప్రతిపాదనలు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఇక అమీతుమీ
సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. వారి వైరం అమీతుమీ తేల్చుకునే పరిస్థితికి దారి తీస్తోంది. ఈ మేరకు ఒకరినొకరు దెబ్బకొట్టుకునే ప్రయత్నంలో నిమగ్నమైనట్టు స్పష్టమవుతోంది. పార్టీ శ్రేణులు కూడా ఇదేరకంగా అభిప్రాయపడుతున్నాయి. అధిష్టానం వద్ద తనను బదనాం చేసిన వైరిచర్లకు జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఉందని చూపించేం దుకు బొత్స వర్గం పావులు కదపగా, పెద్దల సభకు ప్రయత్నిస్తున్న బొత్సకు హస్తినలో తనకున్న పలుకుబడితో చెక్ పెట్టే యోచనలో వైరిచర్ల ఉన్నట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి బొత్సను కేంద్రమంత్రి వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ టార్గెట్ చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా బొత్సను ఎండగడుతూ వస్తున్నారు. ఒక్క ఆరోపణలు, విమర్శలతోనే కాకుండా బొత్స వ్యవహార శైలీ, దందాపై అధిష్టానానికి లేఖ రాసిమరీ వివరించారు. పవర్ ప్లాంట్‌కు వత్తాసుపలుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని, మద్యం సిండికేట్ దందా నడుపుతున్నారని, భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని అధిష్టానాకి లేఖలు పంపారు. అలాగే హస్తినలో తనకు సన్నిహితులైన వారి వద్ద బొత్స వైఖరిని దుయ్యబడుతూ వస్తున్నారు. దీన్ని బొత్స సహించలేకపోతున్న విషయం తెలిసిందే. కాకపోతే అధిష్టానంతో నేరుగా సంబంధాలు నెరిపే వైరిచర్లపై ప్రత్యారోపణలు చేయడం తప్ప బొత్స ఏమీ చేయలేకపోయారు. చెప్పాలంటే వైరిచర్ల ఎటాక్ తగ్గట్టుగా బొత్స సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో మైండ్‌గేమ్‌కు బొత్స తెర లేపినట్టు తెలుస్తోంది. ఆక్రమంలోనే వైరిచర్ల వర్గీయులను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారన్న వాదనలొచ్చాయి. పార్వతీపురం డివిజన్లో ఆదిపత్యం కోసం అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారని కొంత కాలంగా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విధంగా సమయం కోసం వేచి చూసిన బొత్స వ్యూహాత్మకంగానే తన వర్గాన్ని ఉసిగొల్పి సోమవారం విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగి న అరకు ఎంపీ అభ్యర్థి ప్రజాభిప్రాయసేకరణలో వ్యతిరేకంగా మాట్లాడించినట్టు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. తనను బదనాం చేస్తున్న వైరిచర్లకు జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఉందని, సీటు ఇస్తే పార్టీకి నష్టమని చెప్పే ప్రయత్నం చేయించారు. అధిష్టానం వద్ద వైరిచర్ల ప్రాధాన్యం తగ్గించడానికి వేసిన ఎత్తుగడగా రాజకీయ వర్గాలు భావిస్తున్నా యి. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనించిన వైరీ వర్గీయులు పూసగుచ్చినట్టుగా వైరిచర్ల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో తనకు వ్యతిరేకంగా గళం విప్పడం వెనక బొత్స హస్తం ఉందని హస్తినలో తన వేగుల ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పనిలో కిషోర్ నిమగ్నమైనట్టు తెలిసింది. అంతేకాకుండా తనను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్న బొ త్సకు రాజకీయంగా చెక్ పెట్టే యోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా పెద్దల సభ కోసం బొత్స చేసే ప్రయత్నాలకు, భవిష్యత్‌లో హస్తిన లాబీయింగ్‌తో రాజకీయాలు శాసించాలన్న యత్నాలకు గండికొట్టే విధంగా వైరిచర్ల పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందన్నదానిపై ఉత్కంఠ మొదలైంది. -
కేబినెట్ భేటీకి పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు
న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశానికి కేంద్ర మంత్రులు పల్లంరాజు, కిశోర్ చంద్రదేవ్ గైర్హాజరు అయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావు, జైపాల్ రెడ్డి హాజరు అయ్యారు. సీమాంధ్ర విద్యుత్ సంక్షోభంపై కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. అయితే భేటీ అనంతరం కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా పల్లంరాజు తన రాజీనామాను ప్రధానమంత్రికి ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాజధానిగా విశాఖ! ఆంటోనీ కమిటీకి చంద్రదేవ్ లేఖ
విభజన తప్పనిసరైతే ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కోరు తూ కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వి.కిశోర్ చంద్ర దే వ్ బుధవారం ఆంటోనీ కమిటీకి లేఖ రాశారు. సీమాంధ్ర అభివృద్ధికి భారీ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘‘హైకోర్టును కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలి. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్నీ విశాఖకు తరలించాలి. నగరంలో ఐటీ పార్కు, ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐఐటీ తదితర ఉన్నతవిద్యాసంస్థలు, గ్రేటర్ సిటీగా చేసి మెట్రో రైలు తదితరాలు తేవాలి’’ అంటూ లేఖలో మంత్రి డిమాండ్ చేశా రు. మరోవైపు సీమాంధ్రకు చెందిన కేంద్ర మం త్రులు, ఎంపీలు కూడా అధిష్టానం విభజన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తమ ప్రాంత సత్వర, సమగ్రాభివృద్ధికి భారీ ప్యాకేజీని డిమాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. -
ఎమ్మెల్యేల వలసలతో కాంగ్రెస్‌కు నష్టమే:బొత్స
-
ఎమ్మెల్యేల వలసలతో కాంగ్రెస్‌కు నష్టమే:బొత్స
హైదరాబాద్: వలస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స.. వలస ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆత్మస్థైర్యం లేకే సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలోకి వెళుతున్నారని ఆయన విమర్శించారు. ఇంకా కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఎం కిరణ్ కుమార్‌రెడ్డిని కోరినట్లు బొత్స తెలిపారు. శాంతి భద్రతలు, నిబంధనలకు లోబడి ఎవరైనా ఎక్కడైనా సమావేశాలు పెట్టుకోవచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అలాంటి సమావేశాలకు ప్రభుత్వం తప్పకుండా అనుమతిస్తుందన్నారు. మనసులో ఏదో పెట్టుకునే కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ విమర్శలు చేస్తున్నారన్నారు. -
'బొత్సకు ముఖ్యమంత్రి కావాలని తహతహ'
న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ శనివారం ఆంటోనీ కమిటీకి బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని.... హైదరాబాద్‌లో వచ్చే ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు పంచాలని కిషోర్ చంద్రదేవ్ విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా కిషోర్ చంద్రదేవ్... తన లేఖలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ధ్వజమెత్తారు. సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని బొత్స సత్యనారాయణ తహతహలాడుతున్నారని విమర్శించారు. సీఎం కిరణ్ మిగిలిన పదవీ కాలాన్ని అనుభవించాలనుకుంటున్నారని కిషోర్ చంద్రదేవ్ విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి గులాం నబీ ఆజాదే కారణమని వ్యాఖ్యలు చేశారు. ఆయన కేవలం తెలంగాణ నేతలు, పీసీసీ అధ్యక్షుడితో మాత్రమే మాట్లాడారని మండిపడ్డారు.