
టీడీపీ అధికారంలోకి వస్తుందనుకోలేదు
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం సోనియా ఆలోచన వల్లే వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మల్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఇప్పుడు బీజేపీ దానిని కాపీకొట్టి స్వచ్ఛ భారత్ పేరుపెట్టి ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు.
కేంద్రం , తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు. కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఉన్నా అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం జరిగేదన్నారు. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలో టీడీపీ అధికారంలోకి వస్తుంది అని ఎవరు ఊహించలేదని, కాంగ్రెస్ పార్టీలో 7 సార్లు, 8 సార్లు గెలిచిన నాయకులూ కూడా ఓడిపోయారని అన్నారు.