
విశాఖను రాజధాని చేయడమే మేలు
కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్
పాలకొండ, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖ నగరాన్ని రాజధాని చేయడం సీమాంధ్ర ప్రజలకు లాభదాయకమని కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని రాష్ట్రానికి మధ్యనే ఉండాల్సిన అవసరం లేదని, అన్ని సౌకర్యాలు ఉన్న చోట రాజధాని ఏర్పాటు ఎంతో లాభదాయకమన్నారు. రాజధాని ఏర్పాటుకు కావాల్సినంత భూమి విశాఖలో అందుబాటులో ఉందన్నారు.