రాజధానిగా విశాఖ! ఆంటోనీ కమిటీకి చంద్రదేవ్ లేఖ | Kishore chandra deo writes letter to AK Antony Committee on State Capital as Visakhapatnam | Sakshi
Sakshi News home page

రాజధానిగా విశాఖ! ఆంటోనీ కమిటీకి చంద్రదేవ్ లేఖ

Published Thu, Sep 5 2013 3:42 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రాజధానిగా విశాఖ! ఆంటోనీ కమిటీకి చంద్రదేవ్ లేఖ - Sakshi

రాజధానిగా విశాఖ! ఆంటోనీ కమిటీకి చంద్రదేవ్ లేఖ

విభజన తప్పనిసరైతే ఆంధ్రప్రదేశ్‌కు విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని కోరు తూ కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వి.కిశోర్ చంద్ర దే వ్  బుధవారం ఆంటోనీ కమిటీకి లేఖ రాశారు. సీమాంధ్ర అభివృద్ధికి భారీ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ‘‘హైకోర్టును కూడా విశాఖలోనే ఏర్పాటు చేయాలి. ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయాన్నీ విశాఖకు తరలించాలి. నగరంలో ఐటీ పార్కు, ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐఐటీ తదితర ఉన్నతవిద్యాసంస్థలు, గ్రేటర్ సిటీగా చేసి మెట్రో రైలు తదితరాలు తేవాలి’’ అంటూ లేఖలో మంత్రి డిమాండ్ చేశా రు. మరోవైపు సీమాంధ్రకు చెందిన కేంద్ర మం త్రులు, ఎంపీలు కూడా అధిష్టానం విభజన నిర్ణయాన్ని మార్చుకోకపోతే తమ ప్రాంత సత్వర, సమగ్రాభివృద్ధికి భారీ ప్యాకేజీని డిమాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement