AK Antony
-
అనిల్ ఆంటోని గెలుపు సాధ్యమేనా.. బీజేపీ వ్యూహం అదేనా?
తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన 'అనిల్ కె ఆంటోనీ' కూడా ప్రజలవద్దకు చేరుకుంటున్నారు. కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని గతంలోనే పేర్కొన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం రక్షణ మంత్రిగా ఉన్న ఎకె ఆంటోనీ వల్ల అనిల్ కే ఆంటోనీ గొప్ప ఇమేజ్ లభించింది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మకం లేదని పలువురు భావిస్తున్నారు. అభివృద్ధి కోసం ఎదురుచూసే యువతను తనవైపు తిప్పుకోవడంతో పాటు, ప్రత్యర్థుల ప్రతికూల అంశాలను ఉపయోగించుకుని గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, అనిల్‌ను తక్కువ అంచనా వేయకూడదని పతనంతిట్టలో కొందరు భావిస్తున్నారు. కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. అంతేకాకుండా 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కారణంగా బీజేపీ ఓట్ల శాతం అంతకు ముందుకంటే రెండు రెట్లు పెరిగింది. ఏకే ఆంటోనీ పలుకుబడిని ఉపయోగించుకుని సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ నియామకానికి అనిల్ మధ్యవర్తి నుంచి లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఊపందుకున్న సమయంలో.. తన తండ్రి లాంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు కాలం చెల్లిపోయి కుక్కల్లా ఉన్నారని అనిల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు సంచనలం రేపాయి. పతనంతిట్టలో క్రైస్తవుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో క్రైస్తవులలో గణనీయమైన ప్రభావం ఉన్న జోస్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఇప్పుడు సీపీఎం సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందున సీపీఎం కూడా ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకుల్లోకి రావాలని భావిస్తోంది. -
‘మా అబ్బాయి ఓడిపోవాలి’.. కేంద్ర మాజీ మంత్రి
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోక్‌సభ ఎన్నికలో ఓటమిపాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీ తరఫున పతనంతిట్ట పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘నా కుమారుడు అనిల్ ఆంటోని అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ పతనంతిట్ట సెగ్మెంట్లో ఓడిపోతుంది. అక్కడ నా కుమారుడు అనిల్ ఆంటోని ఓడిపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా కేరళ సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ గెలుస్తారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీ చేరటం చాలా పెద్ద తప్పు. ..కాంగ్రెస్ పార్టీనే నా మతం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ... ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పోరాడుతోంది. సీఎం పినరయి విజయన్ చేసే ఆరోపణలను కేరళ ప్రజలు అంత సీరియస్ తీసుకోరు. ఆ మాటలను కేరళ ప్రజలు అస్సలు నమ్మరు’ అని ఏకే ఆంటోని అన్నారు. బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని..ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏకే ఆంటోని జోష్యం చెప్పారు. ఇక.. 2023లో అనిల్ ఆంటోని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. -
సాక్షి కార్టూన్ 08-04-2023
సాక్షి కార్టూన్ 08-04-2023 -
బీజేపీలో చేరిన కాంగ్రెస్ దిగ్గజ నేత కుమారుడు.. తండ్రి హర్ట్..!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరారు. తండ్రి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన కమలం గూటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని హోదాలకు రాజీనామా చేసి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఈ చేరిక కార్యక్రమం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, వీ మురళీధరన్, కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్.. అనిల్ ఆంటల్‌ని పార్టీలోకి ఆహ్వానించారు. పుష్పగుచ్చం ఇచ్చి, పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. అనిల్ ఆంటోని కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్‌ను నిర్వహించేవారు. అయితే కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ విడుదల చేసిన అనంతరం.. బీజేపీకి మద్దతుగా ఆయన ట్వీట్ చేయడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఈ డాక్యుమెంటరీని అతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్‌ను వీడటం గమనార్హం. బీజేపీలో చేరిన అనంతరం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు అనిల్ ఆంటోని. దేశంలోని కాంగ్రెస్ నాయకులంతా కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కలిసి పనిచేసిన నాయకులపైనా తీవ్ర విమర్శలు చేశారు. తండ్రి రియాక్షన్.. మరోవైపు కుమారుడు బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని ఆవేదన వ్యక్తం చేశారు. అతను పూర్తిగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నారు. కొడుకులా తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. లౌకికవాదమే భారతదేశ ఐక్యత అని, కానీ 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని మండిపడ్డారు. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చదవండి: నాది కాంగ్రెస్ రక్తం.. కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ -
కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ రాజీనామా
కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అనిల్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్ ఆంటోనీ పోస్టు చేయగా.. తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ అతనికి కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తడి ఎదురైంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. మోదీపై డాక్యుమెంటరీపై విమర్శించిన మరుసటి రోజే అనిల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి చేశారు. అది కూడా వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి వచ్చింది. కానీ దానికి నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారే ఫేస్బుక్లో నాపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. దీనినే హిపోక్రసీ అంటారు. జీవితం సాగుతూనే ఉంటుంది’ అంటూ ట్విటర్లో రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు. ‘నిన్నటి నుంచి సంఘటనలను పరిశీలిస్తే కాంగ్రెస్‌లోని నా అన్ని పదవులను వదిలేయడానికి సరైన సమయమని నమ్ముతున్నాను. కేపీసీసీ డిజిటల్ మీడియా కన్వీనర్, ఏఐసీసీ సోషల్ మీడియా- డిజిటల్ కమ్యూనికేషన్ సెల్ జాతీయ కో ఆర్డినేటర్ పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇక్కడ ఉన్న కొద్ది కాలంలో నాకు సహరించిన కేరళ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంపీ శంశిథరూర్‌కు ధన్యవాదాలు.’ అని తెలిపారు. ఇక ఇప్పటికే మోదీపై ‘ఇండియా ద మోదీ క్వశ్చన్’ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యూట్యూబ్, ట్విట్టర్ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను వెల్లడించడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చదవండి: కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం I have resigned from my roles in @incindia @INCKerala.Intolerant calls to retract a tweet,by those fighting for free speech.I refused. @facebook wall of hate/abuses by ones supporting a trek to promote love! Hypocrisy thy name is! Life goes on. Redacted resignation letter below. pic.twitter.com/0i8QpNIoXW — Anil K Antony (@anilkantony) January 25, 2023 -
BBC Documentary On Modi: కాంగ్రెస్ నాయకుడి కొడుకు ఫైర్
ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదంలో మోదీకి ఊహించని వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. అందులో భాగంగా మోదీకి ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొడుకు నుంచి ఆశ్చర్యపరిచే రీతిలో సపోర్టు లభించింది. ఈ మేరకు కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని ఆ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్ అభిప్రాయాలను ఉంచడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మన స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మన సంస్థలపై పెత్తనం చెలాయించి, సార్వభౌమాధికారిన్ని అణగదొక్కేలా చేసేందుకు అనుమతించకూడదన్నారు. మన గ్రంథాలు ఉపనిషత్తులు, భగవద్గీత చదివితే గనుక సత్యం ఎప్పటికైనా.. బయటకు వస్తుందన్న విషయం తెలుస్తుందన్నారు. పతిక్రలను అణిచివేసి, సంస్థలు నియంత్రించి, ఆఖరికి ఈడీ, సబీఐలు ఉపయోగించకోవచ్చు, కానీ నిజం ఎప్పటికీ నిజమే అని చెప్పారు. అది ప్రకాశవంతంగా ఉంటుందని, దానికి బయటకు వచ్చేసే దుష్ట అలవాటు ఉందని అన్నారు. ప్రజలను ఎన్ని అణివేతలకు గురిచేసి భయబ్రాంతులకు గురిచేసినా.. నిజాన్ని బయటకు రాకుండా ఆపలేమని నొక్కి చెప్పారు. ఇటీవల భారత జోడో యాత్రలో రాహుల్ ఆ డాక్యుమెంటరీని నిరోధించే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నించిన రోజునే అనుహ్యంగా సీనియర్ నాయకుడు కుమారుడు అనిల్ ఆంటోని నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. తన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి విరుద్ధంగా యూటర్న్ తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా, ఇప్పటికే కేంద్రం ఆ వివాదాస్పద డాక్యుమెంటరీ లింక్‌లకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, ట్విట్టర్ పోస్ట్‌లను తొలగించాలని ఆదేశించింది. అలాగే విదేశీ మంత్రిత్వ శాఖ సైతం నిష్పక్షపాతం లేని వలసవాద మససతత్వానికి నిదర్శనం అంటూ బీబీసీని తిట్టిపోసింది. (చదవండి: ఫ్రూఫ్ అవసరం లేదు! దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ) -
మోదీని ఓడించాలంటే.. అలా చేయాల్సిందే: ఏకే ఆంటోనీ
తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ మనసులోని మాటను బయటపెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, నరేంద్ర మోదీని ఓడించాలంటే వ్యూహాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ విజయం కోసం మైనారిటీలను మాత్రమే నమ్ముకుంటే కష్టమని కుండబద్దలు కొట్టారు. కేరళలోని తిరువనంతపురంలో ఈ వారం ప్రారంభంలో జరిగిన కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే కాంగ్రెస్ ప్రయత్నం.. మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు మైనారిటీ, మెజారిటీ రెండు వర్గాల మద్దతు అవసరమని ఆంటోనీ అన్నారు. హిందువులతో పాటు అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్న సంగతి విదితమే. రాజకీయ ప్రయోజనాల కోసమే సాఫ్ట్ హిందుత్వ ధోరణిని కాంగ్రెస్ అవలంభిస్తోందని కమలనాథులు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందుత్వపై బీజేపీకి మాత్రమే సర్వహక్కులు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. భారతీయులుగా చూడడం లేదు: మాలవియా ఆంటోనీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవియా ట్విటర్లో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ‘కాంగ్రెస్‌కు, భారతీయులు భారతీయులుగా కనబడటం లేదు. మెజారిటీ, మైనారిటీ, హిందూ, ముస్లింలుగా దేశ పౌరులు విభజించబడ్డారు. మోదీని ఓడించేందుకు మైనారిటీల మద్దతు సరిపోదు కాబట్టి హిందువులను కలుపుకుపోవాలని యూపీఏ హయాంలో మంత్రిగా పనిచేసిన ఏకే ఆంటోనీ పిలుపునిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎందుకు ఆలయాల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంద’ని మాలవియా ట్వీట్ చేశారు. (క్లిక్ చేయండి: బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదివికి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పార్టీ చాలా కష్టాలనే చవిచూస్తోంది. రాజస్తాన్‌లో ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల తిరుగాబాటుతో కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదీగాక అధ్యక్ష ఎన్నికల్లో ఆశోక్ గెహ్లాట్ పోటీ చేస్తారా? లేదా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ కష్టకాలం నుంచే గట్టేక్కించమంటూ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏకే ఆంటోనికి ఆదేశాలు జారీ చేశారు. 81 ఏళ్ల ఏకే ఆంటోని మాజీ రక్షణ మంత్రి, ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టిన.. పార్టీ అగ్రనాయకులలో ఒకరు. ఆయనకు రాజకీయంగా మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. అందువల్ల ఇతర పార్టీ నేతలు కూడా ఆయన్ను ఎంతో గౌరవప్రదంగా చూస్తుంటారు. అందువల్ల ఈ కష్టకాలంలో సోనియా గాంధీ చిరకాల ఆప్తమిత్రుడు అయిన ఏకే ఆంటోనిని గుర్తు చేసుకున్నారు. తక్షణమే కలవాల్సిందిగా ఆయనకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏకే ఆంటోని ఈ సాయంత్రానికే కేరళ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రికే సోనియగాంధీతో ఆయన భేటీకానున్నట్ల పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రసుతం రాజస్తాన్‌లో సచిన్ పైలెట్‌ని ముఖ్యమంత్రి చేస్తే రాజీనామా చేస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. ఈ మేరకు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్‌లు రాజస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం గురించి సోనియా గాంధీకి లిఖితపూర్వకంగా నివేదికను సమర్పించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా సోనియా గాంధీ ఆశోక్ గెహ్లాట్ మద్దతుదారులపై క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. (చదవండి: ఇదేం ట్విస్ట్.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా గెహ్లాట్! కానీ..) -
రాయని డైరీ: ఎ.కె.ఆంటోనీ (కాంగ్రెస్)
డెబ్బై ఏళ్ల వయసు గల నా మిత్రుడు గులామ్ నబీ ఆజాద్‌ని నా డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నాకై నేనుగా వెళ్లి పరామర్శించడమా లేక అతడికై అతడే నాకోసం వచ్చే వరకు ఆగడమా అని తర్కించవలసిన అవసరం మా మధ్య లేనప్పటికీ, ఎనభై ఏడేళ్ల మన్మోహన్సింVŠ జీ మనోభావాలనైతే మాత్రం గట్టిగా శిరసావహించాలనే నేను తీర్మానించుకున్నాను. సోనియాజీ సలహా మండలిలో కొత్తగా కీలక సభ్యుడిని అవడం కూడా ఆజాద్‌తో నేను దూరాన్ని ఏర్పరచుకోవలసిన పరిణామమే. ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ సోనియాజీ నిర్ణయం తీసుకున్నాక, అతడెంత స్నేహితుడైనా వెళ్లి అతడిని పలకరించడం అంటే పార్టీ నిర్ణయాధికారాన్ని ధిక్కరించడమే. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఉండరు. పార్టీ మాత్రమే ఉంటుంది. ఆ సంగతిని ఆజాద్‌కి కాస్త ముందుగా ఎవరైనా వెళ్లి అర్థం చేయించవలసి ఉంటుందని ఈ ఏజ్ గ్రూప్‌లో ఎవరికైనా ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది! కాంగ్రెస్‌కు గట్టి ప్రెసిడెంట్ ఒకరు ఉండాల్సిందేనని ఆజాద్ ఇరవై రెండు మందితో కలిసి లేఖ రాసినప్పుడే నా ప్రియ మిత్రుడికి నూకలు చెల్లాయని నేను అర్థం చేసుకోగలిగాను. భూమి మీద నూకలు చెల్లితే కాలం తీరిపోయినట్లు. కాంగ్రెస్‌లో నూకలు చెల్లితే లేఖలు రాసి పోయినట్లు. కాంగ్రెస్ ఎంత పెద్ద ఓటమినైనా క్షమిస్తుంది. పార్టీ మీటింగులో మౌనంగా కూర్చొని వెళ్లకపోతే మాత్రం శిక్ష విధించి తీరుతుంది. ఆజాద్ మౌనంగా కూర్చోవాలని అనుకోకపోగా, మౌనంగా కూర్చోకూడదన్న ఆలోచన ఎంత వయసుకీ వచ్చే అవకాశం లేని వాళ్ల చేత కూడా ఆలోచింపజేసి లేఖలో సంతకం పెట్టించి ఉంటాడని సోనియాజీకి, మన్మోహన్‌జీకి , ఆఖరికి రాహుల్కీ ఒక బలమైన అనుమానం. లేఖ రాసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో స్క్రీన్ మీద ఆజాద్‌ని మన్మోహన్జీ ఎంత కోపంగా చూస్తూ కూర్చున్నారో నేనసలు చూడనట్లే స్క్రీన్ మీద వేరే మూలకు తలతిప్పి కూర్చున్నాను. ‘‘మీరే కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కొనసాగాలి సోనియాజీ’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును మేడమ్.. మీరే కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉండాలి. లేదంటే రాహుల్ బాబు ఉండాలి’’ అని నేను అన్నాను. నా మిత్రుడు ఆజాద్ కూడా అటువంటి మనోరంజకమైన మాటే ఒకటి హృదయపూర్వకంగా అంటాడని ఆశగా ఎదురుచూశాను. అనలేదు! అప్పుడే అనిపించింది అతడికి ఊహ తెలియడం మొదలైందని. పార్టీ ఊహలకు అతడొక వాస్తవంలా ఉంటే పోయేది. వాస్తవాలకు విరుద్ధమైన ఒక ఊహగా వికసించాడు. ఆజాద్ ఎంతగా నలిగి ఉంటాడో నేను ఊహించగలను. శిక్ష విధించడంలో కూడా కాంగ్రెస్ తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఇరవై రెండు మంది చేత సంతకాలు పెట్టించి, తనూ ఒక సంతకం చేసినందుకు ఇరవై రెండు మందితో కొత్తగా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయడం చూస్తుంటే మిగిలిన ఆ ఒక్కటీ నీదేనని ఆజాద్‌కు చెప్పడానికే అన్నట్లు ఉంది. సీడబ్ల్యూసీలో అతడూ ఉంటాడు. ఉంటాడు కానీ.. ఉండటానికి ఉన్నట్లో, ఉన్నా లేనట్లో ఉంటాడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా లేకపోయాక కశ్మీర్‌ను తీసుకొచ్చి బీజేపీ ఇండియాలో ఎంత కలిపితే మాత్రం ఆజాద్ ఇక ఎంతమాత్రం ఈ దేశ పౌరుడు కాదు. అది బాధిస్తుండవచ్చు ఆజాద్‌ని. పుట్టిన కశ్మీర్ కన్నా కాంగ్రెస్‌నే అతడు ఎక్కువగా ప్రేమించాడు. కశ్మీరో, ఇండియానో కాదు.. కాంగ్రెస్ పార్టీ అతడి దేశం. ఆజాద్‌ని కలవాలని మనసు ఆరాపడుతోంది. కాంగ్రెస్‌కు కొన్ని విలువలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి అతడిని కలవడం అంటే అతడెంతో విలువ, గౌరవం, ప్రాణం ఇచ్చే పార్టీని తక్కువ చేయడమే. - మాధవ్ శింగరాజు -
నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు: సర్వే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వే నేడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు. డోంట్ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్ చేయాలని.. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. తను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని తెలిపారు. నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే -
‘రక్షణ ఒప్పందాల్లో వారు జోక్యం చేసుకోరు’
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీలు రక్షణ ఒప్పందాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ పేర్కొన్నారు. బీజేపీ అసత్యాలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రక్షణ ఒప్పందాల్లో కుంభకోణాలపై బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో ఆంటోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. అగస్టా కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మైఖేల్ ఈడీ విచారణలో పరోక్షంగా సోనియా గాంధీ పేరును ప్రస్తావించారని వార్తలు రావడంతో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ఇక అగస్టాపై యూపీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆంటోనీ గుర్తు చేశారు. బీజేపీ, ప్రభుత్వ సంస్థలు కలిసి కాంగ్రెస్‌పై ఆరోపణలు చేసేందుకు కట్టుకథలు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కాగా అగస్టా వెస్ట్‌ల్యాండ్ ప్రమోటర్లను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం పనిచేస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించగా, అగస్టా ఒప్పందంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్‌ను కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకొస్తోందని బీజేపీ మండిపడింది. అగస్టా కేసుపై విచారణ అంటే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని బీజేపీ ప్రశ్నించింది. -
ఆంటోనీతో భేటీ అయిన ఖమ్మం కాంగ్రెస్ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: సీట్ల కేటాయింపు విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు రేణుకా చౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్ బుధ వారం ఢిల్లీలో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీని కలిశారు. జిల్లాలో మెజారిటీ సీట్లను పొత్తులో భాగంగా టీడీపీ, సీపీఐలకే కేటాయిం చారని, ఇతర నియోజకవర్గాల్లో ఎంతో కాలంగా కాంగ్రెస్‌కు సేవచేస్తున్న వారిని విస్మరించారని తెలిపారు. దీనిపై కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని, సీట్ల కేటాయింపులో అధిష్టానంతో తేల్చుకోవాలని కోరుతున్నారన్నారు. సమస్యను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరిస్తానని, అప్పటివరకు వేచిచూడమని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ పార్లమెం టు నియోజకవర్గం పరిధిలో బీసీలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో నిరాహార దీక్షకు దిగారు. షాద్‌నగర్ నుంచి కడియంపల్లి శ్రీనివాస్, మక్తల్ నుంచి వాకటి శ్రీహరి, దేవర కద్ర నుంచి ప్రదీప్‌గౌడ్‌లు దీక్షలో పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కోర్ కమిటీ అధిపతిగా ఆంటోనీ
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలకు చైర్మన్లు, కన్వీనర్లను శనివారం ప్రకటించారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కోర్ కమిటీకి, మరో సీనియర్ నాయకుడు పి.చిదంబరం మేనిఫెస్టో కమిటీకి, ఆనంద్ శర్మ ప్రచార కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌కు కోర్ కమిటీ కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ ఎంపీ, పార్టీ పరిశోధనా విభాగం అధిపతి రాజీవ్ గౌడ మేనిఫెస్టో కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. పవన్ ఖేరా ప్రచార కమిటీకి కన్వీనర్‌గా నియమితులయ్యారు. రాహుల్ గాంధీ ఈ కమిటీల అధిపతులతో సమావేశమై రాబోయే ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష జరిపారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. -
రాఫెల్ డీల్‌లో ఆ క్లాజు లేదు..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ ఒప్పందంలో ధరల వెల్లడికి సంబంధించి భారత్-ఫ్రాన్స్ మధ్య 2008లో జరిగిన డీల్‌లో ఎలాంటి క్లాజ్ లేదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఒప్పందంపై మోదీ సర్కార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రక్షణ శాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ ఆరోపించారు. ప్రతి విమానం ధరలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాన్ని కాగ్, పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించే క్రమంలో ప్రభుత్వం రాఫెల్ జెట్ ధరల వివరాల్లో గోప్యత పాటించలేదని స్పష్టం చేశారు. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి ధరల వెల్లడిపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దేశాన్ని తప్పుదారిపట్టించినందుకు వారు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. రాఫెల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధరను వెల్లడించడంపై ఫ్రాన్స్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని ఫ్రెంచ్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో స్పష్టం చేశారని చెప్పారు. ప్రధాని, రక్షణ మంత్రి పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించేలా వ్యవహరించడం సభా హక్కుల ఉల్లంఘనేనని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా ఆరోపించారు. -
'ఆమె నిందితురాలని నేను చెప్పలేదు'
న్యూఢిల్లీ: అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో 101 శాతం రాజకీయ జోక్యం ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని ఆరోపించారు. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే సాహసం చేయలేకపోయారని, ఆయనకు గట్స్ లేవని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిందితురాలని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. ఆమె పేరును తానేప్పుడు ఈ చర్చలోకి లాగలేదన్నారు. ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పలేదన్నారు. అగస్టావెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో ఎవరు ఉన్నారనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. సీబీఐ దర్యాప్తులో తమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతి గురించి మాత్రమే అడిగామని పరీకర్ చెప్పారు. -
‘అగస్టా’లో కీలక మలుపు
మధ్యవర్తి మిచెల్ కారు డ్రైవర్ విచారణలో వివరాల వెల్లడి న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల స్కాం విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) కీలక ఆధారాలు సంపాదించింది. ఒప్పంద మధ్యవర్తి క్రిస్టియన్ మిచెల్ కారు డ్రైవర్ నారాయణబహదూర్ను విచారించిన ఈడీకి కేసుకు సంబంధించిన కీలక వివరాలు దొరికాయి. మిచెల్‌కు భారతీయ అధికారులు, రాజకీయ నేతలతో ఉన్న సంబంధాల వివరాలు ఈడీ సంపాదించింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి డ్రైవర్ నారాయణ బహదూర్‌కు డబ్బులు వచ్చేవని తెలిసింది. లావాదేవీలను విశ్లేషించటం ద్వారా మిచెల్‌కు ఏయే దేశాల్లో వ్యాపారాలున్నాయో స్పష్టత వస్తుందని ఈడీ భావిస్తోంది. ఢిల్లీలోని హోటల్నుంచి మిచెల్‌ను పికప్ చేసుకునే బహదూర్.. ఢిల్లీలోని భారత, విదేశీ సంస్థలు, వ్యక్తుల దగ్గరకు తీసుకెళ్లేవారు. దీంతో మిచెల్ ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలిశారనే విషయాలు బయటపడనున్నాయి. సహకారానికి ప్రతిఫలం ఈ స్కాంలో ప్రభుత్వానికి సహకరించిన అధికారులకు రిటైర్మెంట్ తర్వాత మంచి స్థానాలు(గవర్నర్లుగా, అంబాసిడర్లుగా) లభించాయని రక్షణ మంత్రి పరీకర్ చెప్పారు. నమ్మకంగా ఉన్నందుకే వీరందరికీ అప్పటి ప్రభుత్వం రాజ్యాంగ పదవులు ఇచ్చిందన్నారు. అయితే.. వాజ్‌పేయి హయాంలో 2003లోనే అగస్టా ఒప్పందం కుదిరిందని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. కేసు విషయాన్ని కేవీ థామస్ నేతృత్వంలోని ప్రజాపద్దుల కమిటీ విచారించనుంది. -
ఓటమికి రాహుల్ బాధ్యుడు కాదు: ఆంటోనీ
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పరాజయానికి రాహుల్‌గాంధీ బాధ్యుడు కాదంటూ తమ పార్టీ ఉపాధ్యక్షుడికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎ.కె. ఆంటోనీ బాసటగా నిలిచారు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్టీ మళ్లీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జెండావందనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఓటమి కారణాల పరిశోధనపై తన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదికను ఆంటోనీ...గురువారం సోనియాకు సమర్పించారు. ఈ కమిటీ రాహుల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తిందని వచ్చిన వార్తలను ఆంటోనీ ఖండించారు. పార్టీని బలహీనం చేయడానికి ఎవరో దుర్మార్గులు కావాలని పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఘోర పరాజయానికి కారణాలు వేరే ఉన్నాయని చెప్పిన ఆయన.. ఆ కారణాలు ఏంటో బహిర్గత పరచలేదు. అయితే ప్రస్తుత నాయకత్వంలోనే కష్టకాలాన్ని అధిగమించి, పార్టీని పటిష్టపరిచి, పునర్వైభవం అందిపుచ్చుకుంటామని ఆంటోనీ ధీమా వ్యక్తం చేశారు. ప్రియాంకా గాంధీ ప్రధాన పాత్రపై మాట్లాడుతూ, ఆ విషయంలో ఇప్పటికే ప్రియాంక స్పష్టతనిచ్చారని, దానిపై తానింక చెప్పేది ఏమీ లేదన్నారు. పార్టీ సంస్థాగత మార్పులపై తుది నిర్ణయం సోనియాదేనని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. కమిటీలో మరో సభ్యుడు ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 500 మంది నేతల అభిప్రాయాలు తీసుకున్నామని, వారిలో ఏ ఒక్కరు కూడా సోనియా, రాహుల్ నేతృత్వంపై ప్రశ్నలు లేవనెత్తలేదని తెలిపారు. ఆంటోనీ నేతృత్వంలోని ఆ కమిటీలో ముకుల్ వాస్నిక్, ఆర్సీ కుంతియా, అవినాశ్ పాండే సభ్యులన్న విషయం తెలిసిందే. ఓటమిలో మీడియాకు పాత్ర ఉంది తమ పార్టీ పరాజయంలో మీడియాకు కూడా పాత్ర ఉందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ అన్నారు. ఆంటోనీ కమిటీ సమర్పించిన నివేదికలో.. మీడియా బీజేపీకి వత్తాసుపలికి, కాంగ్రెస్‌కు తక్కువగా కవరేజి ఇచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం. మీడియాపై నిందలెలా వేస్తారని ఆజాద్‌ను ప్రశ్నించగా తమ ఓటమిలో మీడియా కూడా భాగస్వామి అన్నారు. గతంలో తాను మంత్రిగా ఉన్నపుడు గంటసేపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక్క నిమిషం కూడా చానళ్లు ప్రసారం చేయలేదన్నారు. -
దారుణ పరాజయానికి కారణాలివిగో!
న్యూఢిల్లీ: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి కారణాలు, విశ్లేషణతో రూపొందించిన నివేదికను పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కమిటీ గురువారం పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ ఘోర ఓటమి కారణాలను గుర్తించాల్సిందిగా కోరుతూ ఆంటోనీ, ముకుల్ వాస్నిక్, ఆర్సీ ఖుంతియా, అవినాశ్ పాండేలతో ఒక కమిటీని సోనియాగాంధీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర్రాలవారీగా విశ్లేషణలతో కూడిన భారీ నివేదికతో పాటు, ప్రముఖ కారణాలను ప్రస్తావిస్తూ ఒక సంక్షిప్త నివేదికను కూడా వారు పార్టీ అధ్యక్షురాలికి అందించారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కమిటీ, ఆ రాష్ట్రాల్లోని నేతలతో జరిపిన చర్చల వివరాలను కూడా నివేదికలో పొందుపర్చింది. మీడియా కథనాల్లో వచ్చినట్లు.. నివేదికలో రాహుల్ గాంధీ నాయకత్వంపై విమర్శలు లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓటమికి పార్టీ నాయకత్వాన్ని తప్పుబట్టడం కాకుండా.. బీజేపీ మీడియాను ప్రభావితం చేసిన విషయాన్ని, మీడియా పోషించిన పాత్రను, కాంగ్రెస్ పార్టీ ప్రచార లోపాలను, పార్టీలోని సంస్థాగత బలహీనతలను అందులో పేర్కొన్నారు. నరేంద్రమోడీ స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోవడాన్ని నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించారు. -
ఆంటోనీ...ఆత్మావలోకనం!
మన దేశంలో లౌకికవాదం భావన వివాదాస్పదమైనంతగా మరేదీ కాలేదు. దాని అసలు అర్ధం, అంతరార్ధం ఏమిటో అయోమయపడేంతగా ఇది ముదిరిపోయింది. రాజ్యం, మతం వేర్వేరుగా ఉండటమే లౌకికవాదమని మిగిలినచోట్ల అనుకున్నా... అన్ని మతాలనూ సమానంగా గౌరవించడమే లౌకికవాదమన్న అభిప్రాయం మన దేశంలో స్థిరపడిపోయింది. ఈ గడ్డపై సెక్యులరిజానికి తానే సిసలైన వారసురాలినని కాంగ్రెస్ నమ్ముతుంది. తన తపనంతా దానికోసమేనని అందరినీ నమ్మమంటుంది. మైనారిటీ వర్గాల భద్రతకు భరోసా తమవల్ల మాత్రమే సాధ్యమని ఆ క్రమంలో చెబుతుంది. చివరకు అలాంటి భద్రత కల్పించడమే లౌకికవాదం అనుకునేంతగా దాన్ని ఊదరగొడుతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ‘లౌకికవాదాన్ని కాపాడుకుందాం రండ’ని జాతీయస్థాయిలో పిలుపునిచ్చింది. కానీ ఏ పార్టీనుంచీ స్పందన లేదు సరిగదా...ప్రజలు సైతం దాన్ని తోసిపుచ్చారు. బీజేపీవైపే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ ఆచరిస్తున్న లౌకికవాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలకూ సమన్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ విధానమైనా ప్రజలు మాత్రం దాన్ని విశ్వసించలేకపోయారని చెప్పారు. మైనారిటీలతో పార్టీకి ఉన్నదనుకుంటున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆంటోనీ స్థానం కీలకమైనది. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వెళ్లిపోయాక పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్ని ముఖ్యమైన అంశాల్లోనూ ఆయన సలహాలు తీసుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో పార్టీకి ఎదురైన ఓటమికి కారణాలేమిటని ఆరా తీసే బాధ్యతను తాజాగా ఆయనకు అప్పగించారు. కనుక ఆంటోనీ వ్యాఖ్యలకు ఎనలేని ప్రాముఖ్యమున్నది. అయితే, ఆంటోనీ వ్యాఖ్యలను కేరళ రాజకీయాల నేపథ్యంలో కూడా అర్ధంచేసుకోవాలి. అక్కడ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వంలో కేరళ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్(ఐయూఎంఎల్) ముఖ్యమైనవి. కేరళ కాంగ్రెస్‌కు క్రైస్తవుల మద్దతు ఉంటే ఐయూఎంఎల్ కు ముస్లింలు అండగా ఉంటారు. ఈ రెండు పార్టీలూ తెస్తున్న ఒత్తిళ్ల కారణంగానే యూడీఎఫ్ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతున్నదని, దానివల్ల పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని ఆంటోనీ ఆందోళన. అయితే, అలా వ్యాఖ్యానించడంలో ఆంటోనీ ఉద్దేశాలు ఏమైనా మొత్తంగా కాంగ్రెస్ అనుసరిస్తున్న లౌకికవాద విధానాలు ఆ వ్యాఖ్యలతో మరోసారి చర్చలోకి వచ్చాయి. దేశంలోని మిగిలిన వర్గాల ప్రజలు ఎన్నికలప్పుడు ఎలాంటి వైవిధ్యతతో ఓటేస్తారో, ఏ ఏ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారో, ఏ సమస్యలు ముఖ్యమైనవనుకుంటారో ముస్లింలు కూడా అలాగే అనుకుంటారు. ఆ పద్ధతిలోనే ఓటేస్తారు. అది దాదాపు అన్ని ఎన్నికల్లోనూ రుజువవుతున్న సత్యం. కాంగ్రెస్ అందరి మనసుల్లోనూ నాటిన ‘ముస్లిం ఓటరు’ వేరు. అతడు/ఆమె తమ స్థితిగతుల మెరుగుదలకు...తాము సాధించాల్సిన లక్ష్యాలకూ, తాము కైవసం చేసుకోవాల్సిన అవకాశాలకూ ప్రాధాన్యమివ్వరు. ఎంతసేపూ భద్రత గురించే ఆలోచిస్తారు. ఇలాంటి భావనను కల్పించడంలో కాంగ్రెస్‌కు ఒక సౌలభ్యం ఉన్నది. వారిని అభద్రతా భావనలో ఉంచుతూ, తమ పార్టీతోనే వారి భద్రత ముడిపడి ఉన్నదన్న అభిప్రాయం కలగజేస్తే చాలు... ఇతరత్రా అంశాలను వారు పట్టించుకోరని ఆ పార్టీ అనుకుంటుంది. ముస్లింల అభ్యున్నతే నిజంగా తన ధ్యేయమైతే వారు సామాజికంగా, ఆర్ధికంగా ఎదగడానికి ఆసరా కల్పించడంలో తన పాలనా కాలంలో యూపీఏ సర్కారు ఎందుకు విఫలమైంది? 2004లో అధికారంలోకొచ్చిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ జీవో జారీచేశారు. ఆ జీవోపై న్యాయస్థానాలు స్టే ఇచ్చినప్పుడు చివరివరకూ పోరాడారు. పర్యవసానంగా కొన్ని మినహాయింపులతో ఆ రిజర్వేషన్లు కొనసాగించవచ్చునని 2010లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమ పార్టీ ముఖ్యమంత్రి ముస్లింల కోసం ఇంతగా తపన పడటాన్ని గమనించినా కాంగ్రెస్ పార్టీ దాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయడానికి ఏనాడూ కృషి చేయలేదు. ముస్లింల స్థితిగతులపై జస్టిస్ రాజీందర్ సచార్ నేతృత్వంలో జాతీయ కమిటీని ఏర్పరిచినా అది ఇచ్చిన సిఫార్సులను పట్టించుకోలేదు. చాలా రాష్ట్రాల్లో ముస్లింలు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆ కమిటీ తేల్చిచెప్పింది. వారికి చదువుల్లోనూ, కొలువుల్లోనూ కోటా అమలు చేయాలని సూచించింది. ఆ సిఫార్సులను అమలు చేయడానికైనా యూపీఏకు చేతులు రాలేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొచ్చిన తర్వాత మాత్రమే కాస్త కదలిక వచ్చింది. మరోపక్క ఆ పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రవంటి చోట్ల ముస్లిం యువకులకు పోలీసుల వేధింపులు, కేసులు తప్పలేదు. సెక్యులరిజం పేరు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతున్న ప్రచారంతో మైనారిటీలకు ఏదో ఉపకారం జరిగిపోతున్నదని, వారు బాగుపడిపోతున్నారని మిగిలిన వర్గాల్లో అభిప్రాయం ఏర్పడింది. సహజంగానే అది మైనారిటీలకు మేలు చేసే పరిణామం కాదు. తన చేతలు, మాటలు ఆచరణలో ఎలాంటి ఫలితాలనిస్తున్నాయో ఇప్పటికైనా గ్రహించుకుని తాను వల్లెవేస్తున్న లౌకికవాదాన్ని కాంగ్రెస్ పునర్నిర్వచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆంటోనీ చెప్పిన మాటలు కేరళ స్థితిగతుల నేపథ్యంలోనివే కావొచ్చుగానీ... జాతీయస్థాయిలో ఆత్మావలోకనానికి వాటిని అవకాశంగా తీసుకోవాలి. దాని ఆధారంగా సరికొత్త దృక్ఫథాన్ని ఏర్పరుచుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు...మొత్తంగా దేశానికి మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా మైనారిటీలకు! -
ముంబై తీరానికి చేరిన సింధురత్న
ముంబయి : ప్రమాదానికి గురైన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న.. ముంబై తీరానికి చేరుకుంది. ఈ జలాంతర్గామిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించడంతో పాటు ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న నేవీ ఉన్నతాధికారులు జలాంతర్గామిని చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు... గత కొన్ని నెలల్లో నేవీలో జరిగిన ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ప్రమాదాలు, డీకే జోషీ రాజీనామా బాధాకరమైనవని ఆంటోనీ వ్యాఖ్యానించారు. -
యూపీఏకి సైనిక కుట్ర భయం!
డెబ్బయ్ దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్‌మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ‘భారత సైన్యమంటే పౌర ప్రభుత్వ ఆదేశాలను శిరసావహించే బాధ్యతాయుతమైన దళం. ఎట్టి పరిస్థితులలోనూ తిరుగుబాటుకు ప్రయత్నించదు....’ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ రెండురోజుల క్రితం చేసిన ప్రకటన ఇది. రక్షణమంత్రి చేసిన ఈ ప్రకటన హఠాత్పరిణామం మాత్రం కాదు. యూపీఏ ప్రభుత్వం, సైనిక దళాల నాటి ప్రధానాధికారి వీకే సింగ్ వాస్తవాలను దాచి పెట్టారంటూ బీజేపీ, ఆమ్ఆద్మీ పార్టీ చేస్తున్న విమర్శలతో ఇది అర్థమవుతుంది. కానీ రెండేళ్ల నాటి ఈ అత్యంత వివాదాస్పద ఘటనను ‘ముగిసిన అధ్యాయంగా’ అభివర్ణించి రక్షణమంత్రి ఇప్పుడు కూడా దేశ ప్రజల దృష్టిని మళ్లించాలని అనుకోవడమే వింత. అప్పుడు ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఈ కథనాన్ని రక్షణమంత్రి, నాటి సైనిక దళాల ప్రధానాధికారి కూడా తోసిపుచ్చినా, ఇప్పుడు అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయి. దీనితో మొదట వచ్చే ప్రశ్న- పౌర ప్రభుత్వానికీ, సైన్యానికీ మధ్య అపనమ్మకం పెరుగుతున్నదా? స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశంలో పౌర ప్రభుత్వం నిలకడగా కొనసాగడం భారతీయ సమాజం పరిణతికి నిదర్శనం. మన ఇరుగు పొరుగు దేశాలు ఇందుకు నోచుకోలేక పోవడం, దానితో ఎదురైన దుష్పరిణామాలు ప్రపంచానికి ఎరుకే. అయినా, మన దేశంలో కొన్నిసార్లు పౌర ప్రభుత్వాధినేతలు సైన్యాన్ని శంకించారని చెప్పడానికి దాఖలాలు లేకపోలేదు. ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలోనూ అలాంటిదేదో జరగబోతున్నదన్న అనుమానాలు కలిగాయి. నాటి రక్షణ మంత్రి కృష్ణమీనన్కూ, ఆర్మీ చీఫ్ కేఎస్ తిమ్మయ్యకూ మధ్య విభేదాలు ఇందుకు కారణం. పైగా భారత్‌లో సైనిక తిరుగుబాటుకు సీఐఏ తన వంతు ప్రయత్నం చేస్తున్నదని 1960 దశకంలో చైనా కూడా అనుమానించింది. తరువాత, 70 దశకంలో నాటి ప్రధాని ఇందిర సైనిక తిరుగుబాటు గురించి నేరుగా ఫీల్డ్‌మార్షల్ జనరల్ మానెక్షానే నిలదీయడం విశేషం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో అలాంటి ఘటన పునరావృతమైంది. ప్రజాస్వామ్య పునాదులు కదిలిపోతున్నాయని అంతా భావిస్తున్నపుడు, ఇష్టంగానో అనిష్టంగానో ఇలాంటి ప్రత్యామ్నాయం గురించిన దృశ్యాలు సమాజం ముందు కదులుతాయి. 2012 జనవరి మధ్యలో దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో రెండు సైనిక యూనిట్ల కదలికలు యూపీఏ ప్రభుత్వంలో ‘అత్యున్నత’ స్థాయిలోని వారిని కలవరానికి గురి చేశాయి. ఈ కదలికల గురించే ఆ సంవత్సరం ఏప్రిల్‌లో ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక పరిశోధనాత్మక కథనం ప్రచురించగా రక్షణమంత్రి ఆంటోనీ, ‘ఇది శుద్ధ అబద్ధం’ అని కొట్టిపారేశారు. నాటి ఆర్మీ చీఫ్ వీకే సింగ్, ఇది అనారోగ్యకర బుర్రల్లో నుంచి వచ్చిన వార్తాకథనమని వ్యాఖ్యానించారు. కానీ, ఇటీవలే పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఏకే చౌధురి ఈ ఫిబ్రవరి 21న చేసిన ప్రకటన అసలు సంగతి బయట పెట్టింది. రెండేళ్లుగా ఆంటోనీ, వీకే సింగ్ అబద్ధం చెబుతున్న సంగతి వెల్లడయింది. చౌధురి చెప్పిన వివరాల ప్రకారం, జనవరి పదహారో తేదీన నాటి రక్షణ వ్యవహారాల కార్యదర్శి శశికాంత్ శర్మ తనను (చౌధురిని) పిలిచి ఆ దళాలను వెంటనే వెనక్కి వెళ్లమని ఆదేశించవలసిందిగా కోరారని ఆయన చెప్పారు. రాత్రి పదకొండుగంటల వేళ ఈ చర్చ జరిగింది. తాను ఇప్పుడే ప్రభుత్వ అత్యున్నత అధికార పీఠంపై ఉన్న వారి దగ్గర నుంచి వచ్చానని, వారు దళాల కదలికతో కలవరపడుతున్నారని శశికాంత్ తనకు చెప్పారని చౌధురి పేర్కొన్నారు. చౌధురి 2012లో సైనిక కార్యకలాపాల డెరైక్టర్ జనరల్‌గా (డీజీఎంఓ) పనిచేశారు. దళాల కదలిక, తన జనన సంవత్సర సర్టిఫికెట్ గురించి వీకే సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒకే రోజు జరగడంతో ఈ అనుమానాలు కలిగాయని చౌధురి అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం మీద రక్షణ కార్యదర్శి నివేదిక కోరడం, తాను ఇవ్వడం కూడా జరిగిందని చౌధురి వెల్లడించారు. చౌధురి ప్రకటన చేసిన మరునాడే వైమానిక దళాల రిటైర్డ్ చీఫ్ ఎన్ఏకే బ్రౌనే వెల్లడించిన అంశాలు కూడా 2012 నాటి ఘటన నిజమని స్పష్టం చేస్తున్నాయి. రెండు సైనిక యూనిట్లు కదలిక సమయంలోనే ఆగ్రా నుంచి పారా కమాండోస్ కూడా ఢిల్లీ దిశగా కదలిన సంగతిని బ్రౌనే వెల్లడించారు. నిజానికి పారా కమాండోలు 2012 ఫిబ్రవరిలో ఢిల్లీకి తర్ఫీదు కోసం వెళ్లవలసి ఉంది. ఈ దళం ఏ మిత్రదేశమైనా సంకటంలో పడినపుడు అత్యవసరంగా వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. సి-130 విమానాలతో ఈ కమాండోలకు ఇవ్వదలిచిన శిక్షణకు ఇంకా నెల సమయం ఉండగా ముందే ఎందుకు ఢిల్లీ వైపు కదిలాయన్నదే ఇప్పుడు అందరూ వేస్తున్న ప్రశ్న. కాబట్టే, దేశ భద్రత, సాయుధ దళాల విశ్వసనీయత, ప్రభుత్వ మర్యాద వంటి అంశాలు ముడిపడి ఉన్న ఈ వివాదం గురించిన వాస్తవాలను తక్షణం వెల్లడించాలని రాజకీయ పక్షాలు కోరడం సబబే. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
5 నుంచి 21 వరకు పార్లమెంటు సమావేశాలు: కమల్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగానే ఇవి జరగనున్నట్టు పేర్కొన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాలపై గురువారం జరిగిన కేబినెట్ కమిటీ భేటీ అనంతరం కమల్‌నాథ్ పాత్రికేయులతో మాట్లాడారు. అధికార వర్గాల కథనం మేరకు, 17న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి సాధారణ, రైల్వే బడ్జెట్లను ఆమోదించుకునే అవకాశం ఉంది. దీంతోపాటు విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్, న్యాయవ్యవస్థ జవాబుదారీ, అవినీతి నిరోధక(సవరణ), పౌర సేవలు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ తదితర బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వీటిలో అవినీతి నిరోధక(సవరణ) బిల్లును కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో దీనికి అనుమతి లభించి తీరుతుందనేది విశ్లేషకుల భావన. -
పొత్తులు చూసేది ఆంటోనీ కమిటీనే: దిగ్విజయ్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారాన్ని రక్షణ మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ఏకే ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ చూసుకుంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టం చేశారు. పార్టీలతో పొత్తు వ్యవహారం పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమన్నారు. బుధవారం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికలకు సహకరిస్తారని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. ‘ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలపై దృష్టి పెట్టాం. శాసనసభ్యుల వ్యతిరేకతను పరిశీలిస్తున్నాం’ అని క్లుప్తంగా బదులిచ్చారు. -
‘ముంబై’ దోషులకు శిక్ష పడాల్సిందే
అప్పటిదాకా భారత్ సంతృప్తి చెందదు: ఆంటోనీ 26/11కు ఐదేళ్లు న్యూఢిల్లీ/రాంచీ: ముంబై దాడుల దోషులకు గరిష్ట శిక్ష పడేంత వరకు భారత్ సంతృప్తి చెందదని రక్షణమంత్రి ఏకే ఆంటోనీ పాకిస్థాన్‌కు స్పష్టంచేశారు. దాడులకు పాల్పడ్డవారి వివరాలు, ఆ కుట్ర మూలాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్‌కు గతంలోనే ఇచ్చినట్లు చెప్పారు. ముంబైలో పాక్ ముష్కరుల దాడులకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. పొరుగు దేశం నుంచి ఏమి ఆశిస్తున్నారని పాత్రికేయులు ప్రశ్నించగా.. ‘‘దోషులను చట్టం ముందు నిలబెట్టాలని వారికి (పాక్‌కు) అనేకమార్లు చెప్పాం. దాడికి కారకులైనవారిని తీవ్రంగా శిక్షించనంత వరకు భారత్ సంతృప్తి చెందదు’’ అని చెప్పారు. 2008, నవంబర్ 26న పాక్ నుంచి సముద్రతీరం గుండా వచ్చిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో నరమేధం సృష్టించి 160 మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ముందు తీర గస్తీ బలహీనంగా ఉండేదని, కానీ ఇప్పుడు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఆంటోనీ చెప్పారు. దారి తప్పినవారిని క్షమిస్తాం: షిండే దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నవారిని క్షమించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని హోంమంత్రి షిండే అన్నారు. మావోయిస్టులను ఉద్దేశించి ఆయన రాంచీలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హింస దేనికీ పరిష్కారం కాదు. మనలో కొందరు యువకులు దారి తప్పి హింసామార్గాన్ని ఎంచుకున్నారు. వారు మనలో ఒకరే. హింసను వీడి జనస్రవంతిలోకి వస్తామంటే వారిని క్షమించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. -
బరువైన బహుమానం
పాత పద్ధతిలో ఆలోచించడం మన వ్యవస్థని వ్యసనంలా పట్టుకుందా? ఐఎన్ఎస్ విక్రమాదిత్య నౌకాదళంలో భాగం కావడం చరిత్రాత్మకమని రక్షణ మంత్రి ఏకే ఆంటోని పరవశంతో చెప్పారు. అప్పుడే ఒక పాకిస్థానీ పత్రిక తన సంపాదకీయంలో, ‘ఈ నౌకను రక్షణ దళంలో చేర్చుకోవడం చూస్తే పురాతన పద్ధతులలో ఆలోచించడం అక్కడి వ్యవస్థకి వ్యవసనంలా మారిందనిపిస్తోంది’ అని రాసింది. పేదరికంతో మగ్గిపోతున్న భారత్ ఇంత పెద్ద నౌకను తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకో? అంటూ అనవసరమైన విసుర్లు కూడా ఆ పత్రిక వదరింది. ఒకటి నిజం- ఇందులో మొదటి అంశం గురించి ఆ పాక్ పత్రిక బాహాటంగా చెప్పిన అభిప్రాయమే, చాలామంది భారతీయుల మనోగతం అంటే సత్యదూరం కాదు. రక్షణ వ్యవహారాలలో జాగరూకత ఆహ్వానించదగినదే. కానీ అణా కోడిపిల్లకి పావలా ఖరీదైన పందిపిల్లని దిష్టి తీసిన చందంగా ఉంటే ఏ ప్రభుత్వమైనా స్వీయరక్షణలో పడక తప్పదు. నవంబర్ 16న నౌకాదళంలో భాగమైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య విషయంలో రక్షణ రంగం ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నది. ఈ యుద్ధ విమాన వాహక నౌక హిందూ మహాసముద్రంలో బలాబలాల సమతుల్యతలో మార్పులు తెచ్చేదేనని అభిప్రాయపడుతూనే భారత నౌకాదళ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్, ఆ నౌకను సొంతం చేసుకోవడానికి 250 శాతం అదనంగా ఖర్చు చేసిన సంగతిని కూడా ఉదహరించవలసి వచ్చింది. ఇదంతా పదమూడేళ్ల గాథ. ఐఎన్ఎస్ విక్రమాదిత్య సోవి యెట్ రష్యా కాలం నాటిది. అసలు పేరు అడ్మిరల్ గోర్ష్కొవ్ (అంతకుముందు పేరు బకు). యుఎస్ఎస్ఆర్ పత నం తరువాత 2000 సంవత్సరంలో భారత్-రష్యాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు మనకు ‘బహుమానం’గా ఇచ్చేశారు. భారత నౌకాదళంలో భాగమయ్యే ముందే ఆధునీకరించాలని 2004లో నిర్ణయించారు. యుద్ధ విమానాలు దిగేందుకు ఏర్పాట్లు చేయడం అందులో ఒకటి. 974 మిలి యన్ డాలర్ల ఖర్చుతో ముస్తాబు చేసి రష్యా 2008 సంవత్సరానికి భారత్‌కు అప్పగించాలి. కానీ రష్యా ‘అనుకోని వ్యయాల’ పేరుతో భారత్‌కు చాలా చేతి చమురు వదిలిం చిందని ‘కాగ్’ విమర్శ. 250 శాతం ఖర్చు అలా పెరిగిందే. అన్నీ పూర్తి చేసుకుని త్వరలోనే పశ్చిమ తీరంలోని కార్వార్ (కర్ణాటక) నౌకాశ్రయానికి చేరుతుంది. 44,500 టన్నుల బరువైన ఈ నౌక మీద 88 మిగ్ 29కె యుద్ధ విమానాలు నిలబడవచ్చు. విక్రమాదిత్య రాక చరిత్రాత్మకమని ఆంటోనీ వ్యాఖ్యానించగానే చాలామందికి మన రక్షణ వ్యవహారాల చరిత్ర లో మరో కోణం స్ఫురించింది. ముంబై నౌకా కేంద్రంలో ఉండగా ఐఎన్ఎస్ సింధురక్షక్ అనే జలాంతర్గామిలో జరిగిన పేలుళ్లు గుర్తుకు వచ్చాయి. 113 మిలియన్ డాలర్లు వెచ్చించి డిసెంబర్ 27, 1997లో భారత నౌకాదళంలోకి తీసుకువచ్చిన సింధురక్షక్ ఓ వైఫల్యం. ఇది రష్యా ఇచ్చిన కిలో-క్లాస్ 877 ఇకేఎం జాలాంతర్గామి. 2010లో ప్రమాదానికి గురైతే మళ్లీ రష్యా పంపారు. 80 మిలియన్ల డాలర్ల ఖర్చుతో మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం జూన్ ప్రాంతంలో తిరిగి వచ్చింది. సింధురక్షక్ ప్రమాదం రష్యా ప్రమాణాలనూ, మరమ్మతు సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకం చేసిందని నేవీ మాజీ చీఫ్ అరుణ్ ప్రకాశ్ పేర్కొనడం విశేషం. రష్యా నుంచి దిగుమతి చేసుకునే పరికరాలు సదా ఉత్తమమైనవి కావు, అవి విఫలం కావడానికి అవకాశాలూ ఎక్కువేనని ఆయన అభిప్రాయం. కిలో-క్లాస్ రష్యా అమ్మిన తొమ్మిదో జలాంతర్గామి మరి! రష్యాతో ఉన్న రక్షణ బాంధవ్యాన్ని సమీక్షించుకుంటే భారత్‌తో ఆ దేశం ఆడిన ప్రమాదకరమైన ఆట బయటపడుతుందని వాదిం చేవారూ ఉన్నారు. రష్యావే, మిగ్-21 యుద్ధ విమానాల వల్ల ఎందరు పైలట్లను కోల్పోయామో చాలా మంది గుర్తు చేస్తున్నారు. 900 మిగ్ -21 విమానాలకుగాను, సగానికిపైగా కూలిపోయాయి. అయితే భారతదేశం ఇంతవరకు తేలికపాటి యుద్ధవిమానాల తయారీ చేపట్టకపోవడంవల్ల మన వైమానిక దళం ఇప్పటికీ ఈ ‘రెక్కల శవపేటిక’లనే ఉపయోగిస్తూండటం మరో విషాదం. కూడంకుళం అణు విద్యుత్కేంద్రం కోసం తీసుకున్న రష్యా సాంకేతిక పరిజ్ఞానం మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇంతకీ విక్రమాదిత్యకు తనని తను రక్షించుకునే వ్యవస్థ ఏర్పడడానికి మరో నాలుగేళ్లు కావాలి. బాయిలర్ వ్యవస్థ పేలడంతో 1994లో ఇదే ఏడాది పాటు మూలప డింది. ఇన్ని లోపాలున్న రక్షణ దిగుమతులు అవసరమా? రష్యాది సాయమా? అక్కడ చెల్లని వాటిని అంటగట్టే తత్వ మా? రష్యాను మెప్పించడమే ప్రధానం అనుకుంటే, రక్షణ సంగతేమిటి? పాక్ పత్రిక వేసిన ప్రశ్న నిజానికి మన నేతలు వేసుకోవలసినది కాదా? కల్హణ