ముంబై తీరానికి చేరిన సింధురత్న | INS Sindhuratna docked in Mumbai | Sakshi
Sakshi News home page

ముంబై తీరానికి చేరిన సింధురత్న

Published Thu, Feb 27 2014 1:06 PM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM

INS Sindhuratna docked in Mumbai

ముంబయి : ప్రమాదానికి గురైన జలాంతర్గామి ఐఎన్‌ఎస్ సింధురత్న.. ముంబై తీరానికి చేరుకుంది. ఈ జలాంతర్గామిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించడంతో పాటు ఏడుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న నేవీ ఉన్నతాధికారులు జలాంతర్గామిని చేరుకుని గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

మరోవైపు... గత కొన్ని నెలల్లో నేవీలో జరిగిన ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు రక్షణశాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. ప్రమాదాలు, డీకే జోషీ రాజీనామా బాధాకరమైనవని ఆంటోనీ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement