
200 హెక్టార్లలో ఆధునిక హంగులతో థీమ్ పార్క్ నిర్మాణం
ప్రపంచస్థాయిలో భారీగా నిర్మించేందుకు ప్రభుత్వ నిర్ణయం
ఎమ్మెమ్మార్డీయేతో సంయుక్తంగా ప్రణాళిక రూపకల్పన
సాక్షి, ముంబై: ముంబై, నవీ ముంబై నగరాల్లోని చిన్నారులకు త్వరలోనే ఒక గొప్ప వినోద అనుభవం లభించనుంది. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డోనాల్డ్ డక్, గూఫీ వంటి ప్రసిద్ధ కార్టూన్ పాత్రలను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు, థ్రిల్లింగ్ రైడ్‌లను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు కొత్త థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) గ్రోత్ హబ్’ప్రాజెక్టులో భాగంగా నవీ ముంబైలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక భారీ థీమ్ పార్క్ నిర్మాణం కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రణాళికలు రూపొందించింది.
ఎంఎంఆర్‌లో పర్యాటక వృద్ధి కోసం...
పరిశ్రమ, పర్యాటకం, విద్య, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, ఆరోగ్యం, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఎంఎంఆర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెమ్మార్డీయే గ్రోత్ హబ్ ప్రాజెక్టుకింద పలు ప్రణాళికలను రూపొందించింది.ఇందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అలీబాగ్ అభివృద్ధి, ముంబైలోని చారిత్రక కోటల పరిరక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నవీ ముంబైలో డిస్నీల్యాండ్ తరహాలో భారీ థీమ్ పార్క్‌ను నిరి్మంచాలని ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురు
మొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో...
ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, థానేలతో పాటు ఎంఎంఆర్ పరిధిలో అనేక రిసార్టులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రిసార్టులు, యానిమేషన్ స్టూడియోలు, రైడ్ జోన్లు, వాటర్ పార్క్, ఇతర ఆధు నిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్కు రాష్ట్ర పర్యాటక రంగంలో పెద్ద మైలురాయి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. (BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు)
Comments
Please login to add a commentAdd a comment