రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక అమలు కమిటీ సారథిగా ఆంటోనీ
Published Wed, Sep 4 2013 3:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక వాగ్దానాల అమలును పర్యవే క్షించే కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. దీనికి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ అధ్యక్షునిగా ఉంటారు. దిగ్విజయ్‌సింగ్, ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణసామితో పాటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు ఇందులో సభ్యులుగా నియమితులైనట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Advertisement
Advertisement