సిబ్బంది ప్రాణాలు పోవడం బాధాకరం: ఆంటోనీ | AK Antony to visit mumbai after INS sindhurakshak tragedy | Sakshi
Sakshi News home page

సిబ్బంది ప్రాణాలు పోవడం బాధాకరం: ఆంటోనీ

Published Wed, Aug 14 2013 1:18 PM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

సిబ్బంది ప్రాణాలు పోవడం బాధాకరం: ఆంటోనీ

సిబ్బంది ప్రాణాలు పోవడం బాధాకరం: ఆంటోనీ

దేశమాత సేవలో నౌకా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ముంబైలో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదం గురించిన వివరాలను ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు బుధవారం తెలిపారు.

సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఆంటోనీ ముంబై వెళ్లనున్నారు. కాగా, భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ డీకే జోషి కూడా ముంబై వెళ్లనున్నారు. ఆయన కూడా ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు, వాస్తవాలు తెలుసుకుంటారు. ప్రమాదం జరగడానికి గల కారణాలేంటో తెలుసుకోడానికి నౌకాదళం ఇప్పటికే ఓ దర్యాప్తు కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలో ముగ్గురు అధికారులతో సహా 18 మంది మరణించినట్లు భావిస్తున్నారు.

ముంబైలోని నావల్ డాక్యార్డులో బుధవారం తెల్లవారుజామున పేలుడు, అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement