తిరువనంతపురం: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో పోటీచేయనున్న అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన 'అనిల్ కె ఆంటోనీ' కూడా ప్రజలవద్దకు చేరుకుంటున్నారు.
కాంగ్రెస్ దిగ్గజ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీలో చేరడం తనను తీవ్రంగా బాధించిందని ఏకే ఆంటోని గతంలోనే పేర్కొన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘ కాలం రక్షణ మంత్రిగా ఉన్న ఎకె ఆంటోనీ వల్ల అనిల్ కే ఆంటోనీ గొప్ప ఇమేజ్ లభించింది. ఇమేజ్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మకం లేదని పలువురు భావిస్తున్నారు.
అభివృద్ధి కోసం ఎదురుచూసే యువతను తనవైపు తిప్పుకోవడంతో పాటు, ప్రత్యర్థుల ప్రతికూల అంశాలను ఉపయోగించుకుని గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, అనిల్‌ను తక్కువ అంచనా వేయకూడదని పతనంతిట్టలో కొందరు భావిస్తున్నారు.
కేరళలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. అంతేకాకుండా 2019లో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదం కారణంగా బీజేపీ ఓట్ల శాతం అంతకు ముందుకంటే రెండు రెట్లు పెరిగింది.
ఏకే ఆంటోనీ పలుకుబడిని ఉపయోగించుకుని సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్ నియామకానికి అనిల్ మధ్యవర్తి నుంచి లంచం తీసుకున్నాడనే ఆరోపణలు ఊపందుకున్న సమయంలో.. తన తండ్రి లాంటి చాలా మంది కాంగ్రెస్ నేతలు కాలం చెల్లిపోయి కుక్కల్లా ఉన్నారని అనిల్ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు సంచనలం రేపాయి.
పతనంతిట్టలో క్రైస్తవుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో క్రైస్తవులలో గణనీయమైన ప్రభావం ఉన్న జోస్ కే మణి నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఇప్పుడు సీపీఎం సంకీర్ణ భాగస్వామిగా ఉన్నందున సీపీఎం కూడా ఈసారి క్రైస్తవ ఓటు బ్యాంకుల్లోకి రావాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment