సర్వే సత్యనారాయణ(పాత చిత్రం)
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వే నేడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు. డోంట్ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు.
అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్ చేయాలని.. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. తను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment