‘మోదీకి దాసోహమైంది మీరు కాదా?’ | TPCC Mahesh Kumar Takes On BRS KTR | Sakshi
Sakshi News home page

‘మోదీకి దాసోహమైంది మీరు కాదా?’

Published Sat, Apr 19 2025 3:38 PM | Last Updated on Sat, Apr 19 2025 3:52 PM

TPCC Mahesh Kumar Takes On BRS KTR

హైదరాబాద్: దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్నది మీరంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నదని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకున్న మీరు.. అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం పెట్టుకున్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన మీరు.. మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోదీకి దాసోహమయ్యారు.

మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న బీజేపీ రాష్ట్రానికి  న్యాయంగా రావాల్సిన వాటాలను,  నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసింది. సొంత ప్రయోజనాలకే పెద్ద పీట వేసిన మీరు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశ పెట్టిన బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా కేటీఆర్, 

పదేళ్లలో మోదీ తీసుకున్న అనాలోచన నిర్ణయాలన్నింటికీ మద్దతిచ్చిన మీరు ఇప్పుడు కాంగ్రెస్‌ను ప్రశ్నించడం హాస్యాస్పదం. కవితని లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీ కి ఊడిగం చేసిది నిజం కాదా?, బీజేపీకి కట్టు బానిసలా కేటీఆర్ పని చేస్తున్నారు.సంఖ్యా బలం లేని బీజేపీ మీ పార్టీ అండ చూసుకొని పోటీ చేస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలో బీజేపీని గెలిపించేందుకే  కేటీఆర్ తాపత్రయపడుతున్నారు’ అని విమర్శించారు మహేష్ గౌడ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement