సాక్షి,హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతానని, బీఆర్ఎస్ ఎదురు దాడిని ఎప్పటికప్పుడు తిప్పి కొడతానని తెలంగాణ నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం క్యాడర్‌ను సిద్ధం చేస్తానని చెప్పారు.
పీసీసీ అధ్యకక్షునిగా నియామకమైన తర్వాత శనివారం(సెప్టెంబర్7) సాక్షిటీవీతో మహేష్‌కుమార్‌గౌడ్ ప్రత్యేకంగా మాట్లాడారు.‘పార్టీని ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం నా ముందు ఉన్న పెద్ద టాస్క్. ఆర్గనైజేషన్‌లో క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే పదవులు ఇస్తారని నన్ను చూస్తే తెలుస్తుంది.
పార్టీలో చాలా పోటీ ఉన్నాబీసీకి పీసీసీ ఇవ్వాలని హైకమాండ్ డిసైడ్ అయింది. నాకు పదవి ఇచ్చింది. త్వరలోనే పార్టీ పదవుల భర్తీ ఉంటుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ బాధ్యతలు చేపడుతా.
Comments
Please login to add a commentAdd a comment