AICC Disciplinary Committee
-
తెలంగాణ నుంచి 47 మందికి అవకాశం
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఈనెల 24 నుంచి 26 వరకు జరగనున్న ఏఐసీసీ 85వ ప్లీనరీలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి 47 మంది నాయకులకు అవకాశం కల్పించారు. ఇందు లో 33 మంది ఎన్నికైన సభ్యులు కాగా, మిగతా 14 మంది కోఆప్టేడ్ సభ్యులు. ఏఐసీసీకి ఎన్నిౖకైన సభ్యు లుగా తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, సీతక్క, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ముఖ్య నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఏఐసీసీ 85వ ప్లీనరీలో దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, బలరాం నాయక్, మధు యాష్కీగౌడ్, మహేశ్వర్‌రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్ యాదవ్, కొండా సురేఖ, మల్లు రవి, గీతారెడ్డి, కోదండరెడ్డి, ప్రేమ్‌సాగర్‌రా వు, అజారుద్దీన్, మహేశ్‌కుమార్ గౌడ్, సంజీవరెడ్డి, శివసేన రెడ్డి, బల్మూరు వెంకట్ ఉన్నారు. కాగా, ఆర్.దామోదర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, రమేశ్ ముదిరాజ్, హర్కర వేణుగోపాల్, కుసుమ కుమార్, నిరంజన్, టి.కుమార్‌రావు, బెల్లయ్యనాయక్, బూ స అనులేఖ, సునీతా రావు, కోట నీలిమలకు ఏఐసీసీ కో ఆపె్టడ్ సభ్యులుగా అవకాశం కలి్పంచారు. ప్లీనరీలో ఈ ఏడాది జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికలకు దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీ ఎలా సిద్ధం కావాలన్న అంశంపై చర్చించనున్నారు. 24వ తేదీన జైరామ్ రమేశ్ నేతృత్వంలోని ముసాయిదా కమిటీ తయారుచేసిన తీర్మానాలను చర్చించి ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు: సర్వే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వే సత్యనారాయణ గురువారం ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వేను సస్పెండ్ చేస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై సర్వే నేడు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యాను. కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్ చేయడమేంటని అడిగారు. డోంట్ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు. అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్ చేయాలని.. కొత్త నాయకత్వానికి ఆ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. తను సోనియా కుటుంబానికి నమ్మిన బంటునని తెలిపారు. నన్నే సస్పెండ్ చేస్తారా.. మీ భరతం పడతా: సర్వే -
'ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తా'
చెన్నై: పీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు జవాబిచ్చేందుకు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిరాకరించారు. తనను వివరణ అడిగే అధికారం ఏఐసీసీ క్రమశిక్షణ సంఘానికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. తాను ఏఐసీసీ సభ్యుడినని, తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఏఐసీసీకి మాత్రమే ఉందన్నారు. ఏఐసీసీ అడిగితేనే సమాధానమిస్తానని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ను, పార్టీ వ్యవహారాలను విమర్శించినందుకు ఆయనకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఈనెల 23న సంజాయిషీ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసుకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని ఇళంగోవన్ స్పష్టం చేశారు.